ధూమపానం, మద్యపానానికి దూరం
అమెరికాలో అత్యంత వృద్ధ మహిళ ఎలిజబెత్ ఫ్రాన్సిస్ తన 115 ఏళ్ల వయసులో మరణించారు. ‘క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ హ్యూస్టన్’గా పిలుచుకునే ఫ్రాన్సిస్ అమెరికాలో అత్యంత వృద్ధురాలిగా, ప్రపంచంలో మూడో వృద్ధురాలిగా రికార్డుకెక్కారు. అమెరికాలో అత్యంత ఎక్కువ కాలం బతికిన 21వ వ్యక్తి కాగా.. ప్రపంచంలో 54వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఫ్రాన్సిస్ కుటుంబమే దీర్ఘాయుష్సు ఉన్న కుటుంబం. ఆమె సోదరి బెర్తా జాన్సన్ కూడా అత్యధికకాలం జీవించారు.
2011లో మరణించేనాటికి ఆమెకు 106 ఏళ్లు. అప్పటివరకూ అక్కా చెల్లెల్లిద్దరూ కలిసే బతికారు. ఇంత కాలం బతకడం ఎలా సాధ్యమైందంటే ‘సంతోషంగా జీవించాలని ప్రతిరోజూ అనుకున్నాను. అంతా దేవుడి దయ.. నన్ను తీసుకెళ్లడానికి అతని దగ్గర ఏ కారణం లేదు’ అని చెప్పేవారు. 112 ఏళ్ల వయసులోనూ తన మనవరాళ్లు, మనవలతో కలిసి అన్ని కుటుంబ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఫ్రాన్సిస్ ఆయుష్షు రహస్యం మాత్రం.. ‘ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండటమే’ అని చెబుతారు ఆమె దగ్గరివారు.
లూసియానాలోని సెంట్ మేరీ పారి‹Ùలో 1909లో జని్మంచిన ఫ్రాన్సిస్.. తన జీవిత కాలంలో ప్రపంచంలో ఎన్నో మార్పులకు సాక్షిగా ఉన్నారు. 20 మంది అమెరికా అధ్యక్షులను, రెండు ప్రపంచ యుద్ధాలను, పౌర హక్కుల ఉద్యమాలను దగ్గరగా చూశారు. 1920లో తల్లి మరణించడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఐదుగురు తోబుట్టువుల్లో ఒకరైన ఫ్రాన్సిస్.. టెక్సాస్‌లోని గాల్వెస్టన్‌లో ఉన్న అత్త దగ్గర పెరిగారు. 1928లో ఆమెకు పాప జని్మంచింది. ఒంటరి మహిళగానే కూతురిని పెంచారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment