old woman died
-
అత్యంత వృద్ధ మహిళ అస్తమయం
అమెరికాలో అత్యంత వృద్ధ మహిళ ఎలిజబెత్ ఫ్రాన్సిస్ తన 115 ఏళ్ల వయసులో మరణించారు. ‘క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ హ్యూస్టన్’గా పిలుచుకునే ఫ్రాన్సిస్ అమెరికాలో అత్యంత వృద్ధురాలిగా, ప్రపంచంలో మూడో వృద్ధురాలిగా రికార్డుకెక్కారు. అమెరికాలో అత్యంత ఎక్కువ కాలం బతికిన 21వ వ్యక్తి కాగా.. ప్రపంచంలో 54వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఫ్రాన్సిస్ కుటుంబమే దీర్ఘాయుష్సు ఉన్న కుటుంబం. ఆమె సోదరి బెర్తా జాన్సన్ కూడా అత్యధికకాలం జీవించారు. 2011లో మరణించేనాటికి ఆమెకు 106 ఏళ్లు. అప్పటివరకూ అక్కా చెల్లెల్లిద్దరూ కలిసే బతికారు. ఇంత కాలం బతకడం ఎలా సాధ్యమైందంటే ‘సంతోషంగా జీవించాలని ప్రతిరోజూ అనుకున్నాను. అంతా దేవుడి దయ.. నన్ను తీసుకెళ్లడానికి అతని దగ్గర ఏ కారణం లేదు’ అని చెప్పేవారు. 112 ఏళ్ల వయసులోనూ తన మనవరాళ్లు, మనవలతో కలిసి అన్ని కుటుంబ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఫ్రాన్సిస్ ఆయుష్షు రహస్యం మాత్రం.. ‘ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండటమే’ అని చెబుతారు ఆమె దగ్గరివారు. లూసియానాలోని సెంట్ మేరీ పారి‹Ùలో 1909లో జని్మంచిన ఫ్రాన్సిస్.. తన జీవిత కాలంలో ప్రపంచంలో ఎన్నో మార్పులకు సాక్షిగా ఉన్నారు. 20 మంది అమెరికా అధ్యక్షులను, రెండు ప్రపంచ యుద్ధాలను, పౌర హక్కుల ఉద్యమాలను దగ్గరగా చూశారు. 1920లో తల్లి మరణించడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఐదుగురు తోబుట్టువుల్లో ఒకరైన ఫ్రాన్సిస్.. టెక్సాస్‌లోని గాల్వెస్టన్లో ఉన్న అత్త దగ్గర పెరిగారు. 1928లో ఆమెకు పాప జని్మంచింది. ఒంటరి మహిళగానే కూతురిని పెంచారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వానరాల దాడిలో వృద్ధురాలి మృతి
రామారెడ్డి (ఎల్లారెడ్డి) : ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేయడంతో ఒక వృద్ధురాలు మృతి చెందింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చాతరబోయిన నర్సవ్వ (70) ఇంట్లో అన్నం గిన్నెలను శుభ్రం చేస్తుండగా.. సుమారు 20 వరకు కోతులు దాడి చేశాయి. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల మహిళలు భయంతో కోతులను తరిమే ప్రయత్నం చేయక ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. నర్సవ్వ ఛాతీ, వీపు, నడుముపై కోతులు తీవ్రంగా కరిచాయి. పెళ్లికని కామారెడ్డికి ఆమె కూతురు సుగుణ 20 నిమిషాల తర్వాత వచ్చి.. తల్లిని కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ నర్సవ్వ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కూతుళ్లుండగా, ఇద్దరి వివాహం జరిగింది. ప్రస్తుతం చిన్న కూతురితో కలిసి ఉంటోంది. నర్సవ్య అంత్యక్రియలను చిన్న కుమార్తె పూర్తి చేసింది. -
వృద్ధురాలికి అంత్యక్రియలు... మానవత్వం చాటుకున్న తహసీల్దార్
సాక్షి, గడివేముల: కుటుంబ సభ్యులంతా కరోనా బారినపడి కోవిడ్ కేర్ సెంటరులో ఉండగా.. ఇంటి వద్ద అనాథలా మృతిచెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు చేయడానికి స్థానికులెవరూ ముందుకు రాలేదు. కానీ స్వయాన మండల తహసీల్దార్ కన్నబిడ్డలా ముందుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సంఘటన గడివేముల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొరటమద్ది గ్రామానికి చెందిన వడ్డు లక్ష్మిదేవమ్మ(85) కుమారుడు, కోడలు, మనవడు, మనవడి భార్య మూడు రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరిని వైద్యసిబ్బంది చికిత్స నిమిత్తం నంద్యాలలోని కోవిడ్ కేర్ సెంటరుకు తరలించారు. అప్పటి నుంచి లక్ష్మిదేవమ్మ ఒక్కరే ఇంట్లో ఉండేవారు. కుటుంబ సభ్యుల పరిస్థితిని తలచుకుని ఆందోళన చెందుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. కుటుంబ సభ్యులు కోవిడ్ కేర్ సెంటరులో ఉండిపోవడం, కరోనా భయంతో స్థానికులెవరూ ఆమె అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాని విషయం తహసీల్దార్ నాగమణి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె మంగళవారం సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ఒక కూతురిలాగా లక్ష్మిదేవమ్మ మృతదేహాన్ని సిబ్బందితో కలిసి మోసుకుంటూ వెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అంత్యక్రియలలో తహసీల్దార్‌కు గ్రామ సర్పంచ్ నాగేశ్వర్‌రెడ్డి తదితరులు సహకరించారు. చదవండి: ‘మాయలేడి’ మామూలుది కాదు.. లక్షల కాజేసి.. భర్త అనుమానం.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య -
టీ తాగడానికి వెళ్లి మృత్యు ఒడిలోకి..
ఆరిలోవ (విశాఖ తూర్పు): ఆరిలోవలో టీ తాగడానికి వెళ్లి ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. చేతికందిని టీ తాగకుండానే మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ రెండో వార్డు పార్వతినగర్‌లో కుమారుడితో కలిసి ఉంటున్న డోల రాములమ్మ(70) ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో అంబేడ్కర్‌నగర్‌లో ప్రధాన రహదారి పక్కన ఓ టీ స్కాల్ వద్దకు టీ తాగడానికి వెళ్లింది. రోజూ ఉదయం, సాయంత్రం ఆమె టీ తాగడానికి అక్కడికే వెళ్తుండేది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆమె అక్కడ టీ కోసం షాపు ముందు నిలబడింది. షాపు యజమాని టీ చేతికి అందించే సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పైనుంచి శ్లాబ్ సన్‌షేడ్ కూలిపోయింది. అదే సమయంలో కిందన టీ కోసం నిలబడి ఉన్న రాములమ్మపై సన్‌షేడ్ పెచ్చులు ఊడిపోయాయి. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఆమె కుడికాలు పాదం వద్దకు విరిగిపోయింది. ఒక్కసారిగా పెచ్చులు పడటంతో తలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే రాములమ్మ ప్రాణాలు విడిచింది. ఆ శబ్ధం విన్న స్థానికులు అక్కడకు చేరుకొని 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడకు చేరుకొని ఆమెను పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించి వెళ్లిపోయారు. ఆరిలోవ ఎస్ఐ ప్రశాంత్‌కుమార్ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. రాములమ్మ జీవీఎంసీలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేసేది. ఆమెకు కుమారుడు, కోడలు ఉన్నారు. ఉదయం ప్రమాదం జరిగి ఉంటే భారీ నష్టమే అంబేడ్కర్‌నగర్ ప్రధాన రహదారి పక్కన కొన్నాళ్ల క్రితం నిర్మించిన ఓ ఇంటిలో రెండు షాపులు రహదారి పక్కన ఉన్నాయి. వాటిలో ఓ టీ దుకాణం, మరో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఉదయం పూట ఈ రెండు షాపుల వద్ద టీ, టిఫిన్, కిరాణా సామాన్లు కోసం వచ్చిన వారితో రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే ఎక్కువ మంది ప్రామాదానికి గురై ఉండేవారని, సాయత్రం 4.30 గంటల సమయం కావడంతో పెద్దగా ఆ షాపుల వద్దకు వచ్చే వినియోగదారులు లేరని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో టీ కోసం వచ్చిన రాములమ్మ మాత్రమే ఉండటంతో ఆమె బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఇంటి శ్లాబ్ శిథిలమై చిన్నచిన్న పెచ్చులు ఊడిపోతున్నాయని... ఇప్పుడు మొత్తం కూలిపోయిందని అంటున్నారు. -
సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ పరలోకానికి
సాక్షి, విశాఖపట్నం : సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ ఓ వృద్ధురాలు తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనం నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది. పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకొంది. వివరాలు... చోడవరం దరి భోగాపురానికి చెందిన ఆడారి కన్నంనాయుడు భార్య పిల్లలతో కలసి లంకెలపాలెంలో నివసిస్తున్నాడు. కూలిపనులు చేసుకుంటూ ఆ కుటుంబం బతుకుతోంది. కన్నంనాయుడు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మరణించిన భర్త కన్నంనాయుడి ఆత్మశాంతి కోసం బుధవారం మూలన కొత్త బట్టలు పెట్టడానికి భార్య మంగతల్లి (65), కుమారులు నాగార్జున, బంగారు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు ముత్యాలమ్మపాలెం సముద్రంలో మైలస్నానం చేయడానికంటూ శనివారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలపై తల్లీకొడుకులు వచ్చి స్నానాలు ఆచరించి తిరుగు ప్రయాణమయ్యారు. వెంకటపతిపాలెం దాటిన తరువాత కొట్టుమసేను మిల్లు వద్ద వాహనం వెనుక కూర్చున్న మంగతల్లి జారి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తల వెనుకవైపు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కళ్లముందే తల్లి మృతి చెందడంతో కుమారులు కన్నీరుమున్నీరు అయ్యారు. మంగతల్లికి ఒక కుమార్తె కూడా ఉంది. కాగా..ప్రమాదంపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ముసలమ్మ మరణం.. ఎవరిదీ పాపం?
పొందూరు: కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి వృద్ధురాలు కన్నుమూసింది. ముందస్తు సమాచారం లేకుండా జేసీబీతో పనులు చేపట్టడంతో ఓ ఇల్లు నేలకూలింది. అభం శుభం తెలీని అవ్వ శిథిలాల కింద ముక్కలైంది. స్థానిక తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉప ఖజానా శాఖ ఆఫీసు నిర్మాణానికి జేసీబీతో పనులు చేస్తుండగా గురువారం ఈ సంఘటన జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఉపఖజానాశాఖ కార్యాలయం నిర్మాణానికి గత ఏడాది అక్టోబర్ 9న ప్రభుత్వ విప్ కూన రవికుమార్ శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ స్వయాన ఆయనకు అన్నయ్య.. విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అధినేత కూన వెంకట సత్యనారాయణ. కొద్ది రోజుల క్రితమే కార్యాలయం ప్రహరీ గోడకు, సమీప ఇళ్లకు ఆనుకొని పొడవైన పెద్ద గోతులను తవ్వారు. అప్పటి నుంచి సమీప ఇళ్లలోని వారు బాత్రూమ్లకు, మరుగుదొడ్లకు వెళ్లేందుకు భయపడుతూనే ఉన్నారు. గురువారం బాత్రూమ్లకు, మరుగుదొడ్లుకు ఆనుకొని ఉన్న ప్రహరీ గోడను తవ్వుతుండగా జరిగినప్రమాదంలో వృద్ధురాలు కమ్మచ్చి వనజాక్షి (73) అక్కడికక్కడే మృతి చెందింది. ప్రహరీగోడ ముద్దంశెట్టి వెంకటలక్ష్మి, కమ్మచ్చి వనజాక్షి, ఖాళీగా ఉన్న మరో ఇంటికి ఆనుకొని ఉంది. జేసీబీతో పనులు చేసే ముందుకు ఇంటి యజమానులకు నోటీసులు ఇవ్వడం గాని, సమాచారం గానీ లేదు. జేసీబీతో ఉదయం నుంచే పనులు చేస్తుంటే ప్రాంగణంలో ఎక్కడో దగ్గర చేస్తున్నారని ఇంటివాళ్లు అనుకొన్నారు. ముద్దంశెట్టి వెంకటలక్ష్మి స్నానం చేసుకొని అప్పుడే ఇంట్లోకి వెళ్లారు. కొన్ని క్షణాల్లో ఒక్కసారిగా బాత్రూమ్లు, మరుగుదొడ్లు కుప్పకూలిపోయాయి. ఆ సమయంలో కమ్మచ్చి వనజాక్షి (73) స్నానం చేస్తున్నారు. బాత్రూమ్తో పాటు గోతిలో పడిపోయారు. ఆమెపై గోడ కూలిపోయింది. శిథిలాల కిందదనే ఉండిపోయి నలిగి మృతి చెందారు. కేసు నమోదు మృతురాలు కమ్మచ్చి వనజాక్షి కుమారుడు గిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రైనింగ్ ఎస్ఐ హైమావతి కేసు నమోదు చేసారు. మరుగుకు వెళ్తున్న సమయంలో గోడకూలిæ తన తల్లి వనజాక్షి మృతి చెందిందని కొడుకు గిరీష్ ఫిర్యాదు చేసారు. ట్రైనింగ్ ఎస్ఐ హైమావతి కేసును దర్యాప్తు చేస్తున్నారు. విషాదంలో వనజాక్షి కుటుంబం పదేళ్ల క్రితం బతుకు తెరువుకు వనజాక్షి కుటుంబం బెంగళూరు నుంచి పొందూరుకు వచ్చారు. ఈమెకు ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు ఉన్నారు. పెద్దమ్మాయి శకుంతల, పెద్ద అబ్బాయి వీరేంద్రలు బెంగళూరులో ఉంటున్నారు. చిన్న కుమారుడు గిరీష్‌తో వనజాక్షి పొందూరులో ఉంటున్నారు. బెంగుళూర్ అయ్యంగార్ స్వీట్ బేకరీని ఏర్పాటు చేసుకొన్నారు. కొడుక్కు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఊహించని సంఘటన జరిగి తల్లి మృతి చెందడంతో కొడుకు గిరీష్, కోడలు, పిల్లలు, కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు. కన్నీరు మున్నీ రుగా విలపిస్తున్నారు. మహారాజా మార్కెట్లోని కొంద రు వ్యాపారులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుం బానికి అండగా నిలిచారు. కాంట్రాక్టర్ నష్టపరిహారం అందించాలని కోరారు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
హే గాంధీ..!
గాంధీ ఆస్పత్రి లిఫ్ట్‌లో గాయపడ్డ వృద్ధురాలు మృతి బంధువుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: లెక్కకే పదహారు లిఫ్ట్‌లు... కానీ అందులో పనిచేసేవి మూడే మూడు! నిర్వహణకు అతీగతీ లేదు. కనీసం రిపేరులో ఉన్నవాటి వద్ద హెచ్చరికల బోర్డులు గానీ, గార్డులు గానీ లేరు. ఫలితంగా నిత్యం గాంధీ ఆస్పత్రికి వచ్చే పేద రోగులు తెలియక వీటిల్లో ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడిలాంటి ఘటనలు 25కి పైగానే జరిగినా అధికారుల్లో చలనం లేదు. తాజాగా రిపేరులో ఉన్న లిఫ్ట్ తలుపు తెరిచి సెల్లార్లో పడటంతో గాయపడిన సిద్దిపేట వాసి ఎల్.పోచవ్వ(61) గురువారం మృతిచెందారు. ఈ నెల 4న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడికి సహాయంగా వచ్చిన సందర్భంగా పోచవ్వ ఈ ప్రమాదానికి గురయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పోచవ్వ మరణించిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీనికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 13 లిఫ్ట్‌లు రిపేరులో... 8 అంతస్థులున్న గాంధీ ఆస్పత్రిలోని రెండు బ్లాకుల్లో కలిపి మొత్తం 16 లిఫ్టులున్నాయి. వీటిల్లో 13 పనిచేయడం లేదు. నిత్యం సుమారు మూడు వేల మంది రోగులు వస్తుం టారు. 1,500 మంది చికిత్స పొందుతుం టారు. సగటున 80-100 శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. రోగుల తరలింపులో లిఫ్ట్‌లే కీలకం. పనిచేస్తున్న మూడు లిఫ్టుల్లోనూ ఒకటి సిబ్బందికి కేటాయించారు. మిగిలిన రెండూ వచ్చే రోగులు, వారి సహాయకులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీనికితోడు రిపేరులో ఉన్న లిఫ్ట్‌లను ఎలాంటి హెచ్చరిక సూచీలు, గార్డులూ లేకుండా గాలికొదిలేశారు. దీంతో తరచూ ఎవరో ఒకరు వాటి తలుపులు తెరవడం, ఇరుక్కుపోయి గాయపడటం ఇక్కడ సాధారణంగా మారిపోయింది. ఇంత జరుగుతున్నా అధికారులు కళ్లప్పగించి చూడటమే గానీ... తగిన చర్యలు తీసుకోవడం లేదు. విచారణకు త్రిసభ్య కమిటీ ఆస్పత్రిలో లిఫ్ట్‌లు పనిచేయడం లేదని, మరమ్మతులు చేయించాలని అనేకసార్లు టీఎస్ఎంఐడీసీకి విన్నవించాం. 2014-15 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం ఆస్పత్రికి కేటాయించిన రూ.100 కోట్లలో రూ.10 కోట్లు లిఫ్ట్‌ల మరమ్మతులకే ప్రతిపాదించాం. నేటికీ ఆ పనులు జరగలేదు. పోచవ్వ మృతి ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ వేశాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆ రోజున విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డును ఇప్పటికే సస్పెండ్ చేశాం. - డాక్టర్ జేవీ రెడ్డి, సూపరింటెండెంట్,గాంధీ ఆస్పత్రి -
నెలలో పెళ్లి.. ఎంత పని చేసింది!
చందాగనర్: అమ్మా.. అని పిలుస్తూనే వృద్ధురాలి నగలపై పనిమనిషి కన్నేసింది... అదను కోసం ఎదురు చూసింది.. అన్నం తింటున్న ఆమెపై దాడి చేసి కత్తితో గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతురాలి మెడలోని బంగారు నగలు, చేతి గాజులు తస్కరించింది. పోలీసులు పట్టుకోవడానికి రావడంతో కత్తితో పొట్టలో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. మానవత్వం మంటగలిసిన ఈ దారుణ ఘటన చందానగర్ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ తిరుపతిరావు కథనం ప్రకారం... శేరిలింగంపల్లి లక్ష్మీ విహార్ ఫేజ్ –2లో 95 నెంబర్ గల ఇంట్లో నివాసముండే శ్రీనివాస్, సునీత దంపతులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. శ్రీనివాస్ తల్లి ఉమాదేవి (65) ఇంట్లోనే ఉంటోంది. వీరి పక్కింటి పనిమనిషి వసుంధర లక్ష్మి(21) రోజూ ఉమాదేవిని అమ్మా.. అని పలకరిస్తూ కబుర్లు చెప్పేది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలు కాజేయాలని ఆమె పథకం వేసింది. శుక్రవారం ఉదయం శ్రీనివాస్, సునీత దంపతులు ఆఫీసుకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉమాదేవి మధ్యాహ్నం 1.50కి భోజనం చేస్తోంది. అదే సమయంలో పనిమనిషి తలుపు తట్టింది. ఉమాదేవి వెళ్లి తలుపు తీసి.. మళ్లీ అన్నం తింటోంది. ముందే వేసుకున్న పథకం ప్రకారం ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అన్నం తింటున్న వృద్ధురాలిపై వసుంధర లక్ష్మి దాడి చేసి కత్తితో గొంతుకోసింది. వృద్ధురాలి అరుపులు విని 94 నెంబర్ ఇంట్లో ఉండే రామ్మోహన్ వచ్చి చూడగా ఇంటికి గడియపెట్టి ఉంది. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన వెంటనే పోలీసులకు, ఉమాదేవి కుమారుడు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చాడు. పది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వంటగదిలో వసుంధరలక్ష్మి తచ్చాడుతూ కనిపించింది. పోలీసులు ఇంట్లోకి వస్తే వారిపై చల్లేందుకు కారంపొడి పట్టుకొని కిటికీ వద్ద నిలుచుంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ అనుమతితో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా వృద్ధురాలు ఉమాదేవి రక్తపుమడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె మెడలోని నగలను, గాజులను కాజేసిన పనిమనిషి వసుంధరలక్ష్మి వాటిని దేవుడి గదిలో దాచింది. తన ను పట్టుకోవడానికి వస్తున్న పోలీసులను చూసి కూరగాయలు కోసే కత్తితో పొట్టలో పొడుచుకుంది. పోలీసులు అంబులెన్స్‌లో ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఉమాదేవి మృతి చెందింది. నిందితురాలు చికిత్స పొందుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల్లో పెళ్లి .. లక్ష్మీ విహార్ ఇంటి నెం. 69లో ఉండే కర్నూలు జిల్లాకు చెందిన అనుపమ ఇంట్లో వసుంధరలక్ష్మి నాలుగేళ్లుగా పని చేస్తూ ఇక్కడే ఉంటోంది. నెల రోజుల్లో పెళ్లి చేస్తామని, తమ కూతురిని ఊరుకు పంపాలని అనుపమను వసుంధరలక్ష్మి తల్లి కోరగా.. తనకు పని మనిషి దొరకగానే పంపిస్తామని చెప్పింది. శుక్రవారం ఉదయం 8.30కి అనుపమ ఉద్యోగానికి వెళ్తూ కొత్త పనిమనిషి దొరికిందని, వారం రోజుల్లో నిన్ను మీ ఊరుకు పంపిస్తానని వసుంధర లక్ష్మికి తెలిపింది. అంతలోనే ఈ దారుణానికి ఒడిగట్టింది. -
శిలువమ్మ కుటుంబానికి 5లక్షల పరిహారం
తిరువనంతపురం: వీధి కుక్కల దాడిలో మృతి చెందిన వృద్ధురాలి కుటుంబానికి కేరళ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అయిదు లక్షల పరిహారాన్ని చెల్లించనున్నట్లు ప్రకటన చేసింది. గురువారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పల్లువిల్లా గ్రామానికి చెందిన శిలువమ్మా (65)పై వీధి కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అలాగే అదే ప్రాంతంలో డైసీ(50) మరో మహిళపై కుక్కులు దాడి చేశాయి. గాయపడిన ఆమెకు ప్రభుత్వం రూ.50వేలు పరిహారం ప్రకటించింది. వీధి కుక్కల వీరంగంతో స్పందించిన ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. దీనిపై ప్రభుత్వం హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వీధికుక్కల పునరుత్పత్తి నిరోధానికి ఆపరేషన్లను నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు కొల్లాంలో నిన్న కూడా నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కలు తమ ప్రతాపం చూపాయి. బాలుడి కండ ఊడేలా దాడి చేశాయి. -
వృద్ధురాలిని పీక్కుతిన్న వీధికుక్కలు
తిరువనంతపురం: వృద్ధురాలిని వీధి కుక్కలు పీక్కుతిన్న దారుణ ఘటన కేరళలో కలకలం రేపింది. సచివాలయానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లువిల్లా గ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. శీలుమ్మ(65) అనే మహిళపై శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో దాదాపు 50 వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి పీక్కుతిన్నాయి. ఆమెకు వెతుక్కుంటూ వచ్చిన కొడుకు కుక్కలను తరిమికొట్టాడు. తీవ్రగాయాపాలైన ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయింది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే శీలుమ్మ ప్రాణాలు కోల్పోయిందని ఆమె బంధువులు, స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. శీలుమ్మ మృతి చెందిన గంట తర్వాత డైసీ(50) మరో మహిళపై కుక్కులు దాడి చేశాయి. -
క్రేన్ ఢీకొని వృద్ధురాలు మృతి
హైదరాబాద్: కుషాయిగూడలో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. క్రేన్ ఢీకొనడంతో వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందింది. సాయినగర్‌కు చెందిన కమలమ్మ(65) రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్లోంచి జారి పడి...
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారి పడి మృతిచెందింది. ఈ ఘటన కారేపల్లి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అనసూయ(70) అనే మహిళ రైలులో ప్రయాణిస్తుంది. ఆమె బాత్రూం డోర్ అనుకొని బయటి గేటు ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా జారి బయటకు పడింది. దీంతో అనసూయ అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి
కామేపల్లి(ఖమ్మం): కరెంట్‌షాక్‌తో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని పండితాపురం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి ఇంట్లో కరెంటు తీగలు తగలి షాక్ కొట్టింది. దీంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. -
పింఛన్ రావడం లేదని వృద్ధురాలి మృతి
రాజమండ్రి: నిలిచిపోయిన పింఛనును పునరుద్ధరించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెంది ఓ వృద్ధురాలు కన్నుమూసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన ముత్యాల సూర్యకాంతం(80) రూ.200 పింఛన్ అందుకునేది. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన 'ఎన్టీఆర్ భరోసా'తో అక్టోబరు నుంచి రూ. వెయ్యి వస్తుందని ఆమె ఆశపడింది. ఆమె ఆధార్, రేషన్‌కార్డుల్లో వయస్సు సరిపోయినా వేలిముద్రలు సరిపోవడం లేదని పింఛన్‌ను నిలిపివేశారు. దీంతో బెంగపెట్టుకుని మంచానపడి బుధవారం అర్ధరాత్రి కన్నుమూసింది. -
కారు ఢీకొని వృద్ధురాలి మృతి
వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో 70 ఏళ్ల వృద్ధురాలు మరణించారు. ఆమె మనవరాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర దుర్ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వేగంగా వచ్చిన ఆ కారు వీళ్లు ప్రయాణిస్తున్న స్కూటీతో పాటు మరో నాలుగు వాహనాలను ఢీకొంది. తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భూరాదేవి అనే వృద్ధురాలు తన మనవరాలు మీనాక్షితో కలిసి స్కూటీ మీద వెళ్తుండగా కారు వచ్చి వారిని ఢీకొంది. బాధితులిద్దరినీ గురు తేజ్ బహదూర్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ భూరాదేవి మరణించారని, మీనాక్షి కోలుకుంటున్నారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ కారును వదిలేసి అక్కడినుంచి పారిపోగా, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని నిందితుడిపై కేసు నమోదు చేశారు.