వృద్ధురాలిని పీక్కుతిన్న వీధికుక్కలు
తిరువనంతపురం: వృద్ధురాలిని వీధి కుక్కలు పీక్కుతిన్న దారుణ ఘటన కేరళలో కలకలం రేపింది. సచివాలయానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లువిల్లా గ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. శీలుమ్మ(65) అనే మహిళపై శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో దాదాపు 50 వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి పీక్కుతిన్నాయి. ఆమెకు వెతుక్కుంటూ వచ్చిన కొడుకు కుక్కలను తరిమికొట్టాడు.
తీవ్రగాయాపాలైన ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయింది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే శీలుమ్మ ప్రాణాలు కోల్పోయిందని ఆమె బంధువులు, స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. శీలుమ్మ మృతి చెందిన గంట తర్వాత డైసీ(50) మరో మహిళపై కుక్కులు దాడి చేశాయి.