పింఛన్ రావడం లేదని వృద్ధురాలి మృతి | Pension was not coming killed an old woman | Sakshi
Sakshi News home page

పింఛన్ రావడం లేదని వృద్ధురాలి మృతి

Published Fri, Feb 6 2015 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

నిలిచిపోయిన పింఛనును పునరుద్ధరించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెంది ఓ వృద్ధురాలు కన్నుమూసింది.

రాజమండ్రి: నిలిచిపోయిన పింఛనును పునరుద్ధరించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెంది ఓ వృద్ధురాలు కన్నుమూసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన ముత్యాల సూర్యకాంతం(80) రూ.200 పింఛన్ అందుకునేది.

సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన 'ఎన్టీఆర్ భరోసా'తో అక్టోబరు నుంచి రూ. వెయ్యి వస్తుందని ఆమె ఆశపడింది. ఆమె ఆధార్, రేషన్‌కార్డుల్లో వయస్సు సరిపోయినా వేలిముద్రలు సరిపోవడం లేదని పింఛన్‌ను నిలిపివేశారు. దీంతో బెంగపెట్టుకుని మంచానపడి బుధవారం అర్ధరాత్రి కన్నుమూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement