సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసింది. గతం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరిట ఇవాళ రెండో నెల జరిగిన ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడింది.
కూటమి పాలనలో ఏపీలో పెన్షనర్ల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది. గడిచిన రెండు నెలల కాలంలో 67,812 పెన్షనర్లు తగ్గిపోయారు. అలాగే గత నెల కంటే ఈనెల(ఈరోజు జరిగిన పంపిణీ) భారీగా పెన్షన్లు తగిపోయాయి.
కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నెలకొచ్చేసరికి 64 లక్షల 39 వేల 41 మందికి తగ్గిపోయింది. ఏటీఆర్ కలిపితే ఆ సంఖ్య 64,82,052గా ఉంది. జులై కంటే ఆగష్టులో 79, 455 పెన్షన్లు తగ్గించి ప్రభుత్వం.
జగన్ హయాంలో ఫించన్‌దారుల్లో కోతలు విధించిన దాఖలాలు లేవు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం రెండు నెలల కాలంలోనే పెన్షనర్లను భారీగా తగ్గించింది. దీనిపై సిబ్బందిని నిలదీస్తే.. నిబంధనల పేరుతోనే ఇలా పెన్షన్లను తగ్గిస్తున్నారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కోత మరింత భారీగా ఉండొచ్చని చంద్రబాబు సర్కార్ సూత్రప్రాయంగా సంకేతాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment