వైఎస్సార్‌సీపీ టార్గెట్‌గా పెన్షన్ల తొలగింపు | YSRCP MLCs Questioning Over Pensions In AP AT Assembly | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి పెన్షన్లు తొలగిస్తున్నారు’

Published Thu, Mar 13 2025 10:40 AM | Last Updated on Thu, Mar 13 2025 1:10 PM

YSRCP MLCs Questioning Over Pensions In AP AT Assembly

అసెంబ్లీ సమావేశాలు.. అప్‌డేట్స్‌.. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల కామెంట్స్‌..

  • వైఎస్సార్‌సీపీ రమేష్ యాదవ్ కామెంట్స్‌..
  • పెన్షన్ల గురించి ప్రశ్నోత్తరాలలో చర్చించాం..
  • జూన్ 2024 నాటికి 65 లక్షల 18 పైచిలుకు పెన్షన్లు ఇచ్చారు..
  • 63,57,907 నేడు ఇస్తున్నాం అని చెప్పారు..
  • 14967 పింఛన్లు తొలగించామని మంత్రులు చెప్పారు..
  • దాదాపు లక్ష 60వేల పెన్షన్లు తొలగొస్తే.. కేవలం 14వేలే తొలగించారని, మిగిలిన వాళ్ళు చనిపోయారని చెప్పారు.
  • 9 నెలల కాలంలో లక్ష 60వేల మంది చనిపోయారా?
  • దీనిపై సమాధానం లేదు..
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి పెన్షన్లను తొలగించారు.
  • 2019 నాటికి 53లక్షల పెన్షన్లు ఉంటే వైఎస్‌ జగన్ వాటిని 65 లక్షలకి పెంచారు.
  • జగన్ హయాంలో ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చాడు..
  • గతంలో MRO కార్యాలయం వద్దకి వెళ్లి తెచ్చుకొనే పరిస్థితి ఉండేది..
  • అవ్వ తాతలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది..
  • కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా కొత్తగా ఇవ్వలేదు..
  • ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు వైఎస్సార్‌సీపీ వాళ్ళకు పని చేయొద్దని చెప్పడం సరైనది కాదు..
  • కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులకు వైఎస్‌ జగన్‌ పెన్షన్‌ ఇచ్చారు.


ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్‌..

  • ఆడబిడ్డ నిధి పరిశీలనలో ఉంది అని మంత్రి చెప్పారు.. ఇది దాట వేట ధోరణి..
  • ఎప్పటి నుండి అమలు చేస్తారు, ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేసారా? సబ్ కమిటీ వేశారా?
  • అంటే సమయం కావాలని చెప్పడం మహిళలను వంచించడమే..
  • చేయూత పేరు ఎత్తే అర్హత కూటమి నేతలకు లేదు..
  • సున్నా వడ్డీ రుణాలు కూడా కూటమి ఎగ్గొటింది.
  • 2019 వరకు కూటమి ఎగొట్టిన బకాయిలు జగన్ మహిళల ఖాతాల్లో  వేశారు..
  • ఆడబిడ్డ నిధి గురించి మ్యానిఫెస్టోలోనే కాదు.. మహానాడులో కూడా చెప్పాడు..
  • సంవత్సరానికి 18వేలు ఇస్తామని మాట ఇచ్చి.. నిట్ట నిలువునా మోసం చేశారు..
  • బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు..
  • అసత్యాలతో కాలం గడుపుతున్నారు..
  • ఆడబిడ్డ నిధికి 32400 కోట్లు సంవత్సరానికి అవసరం..
  • చేయూత ద్వారా జగన్ మహిళలకు సహాయం చేశారు.
  • ఆడబిడ్డ నిధి ఎప్పటి నుండి ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి..
  • సమయం కావాలని అనడం అంటే మహిళల్ని మోసం చేయడమే..

ఎ‍మ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కామెంట్స్‌..

  • లక్ష 60వేల పెన్షన్లు అకారణంగా తొలగించారు..
  • కుల వృత్తిపై ఆధారపడిన వారికి కూడా పెన్షన్లను తొలగించారు..
  • డప్పు కళాకారులు, చేతివృతుల వారికి సర్టిఫికెట్స్ కావాలని 13 రకాల నియమ నిబంధనలు పెట్టి పెన్షన్లను తొలగించారు.
  • గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లను పెంచుతామని చెప్పారు.. పెంచాలి..
  • తీసేసిన పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
  • ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కామెంట్స్‌..
  • ఆరోగ్యశ్రీకి బకాయిలు వెయ్యి కోట్లు ఉన్నాయని మంత్రి చెప్పారు..
  • మొత్తం బకాయిలు 4వేల కోట్లు పైనే ఉన్నాయి..
  • ఏప్రిల్‌ ఒకటి నుండి మళ్ళీ సమ్మెకు వెళ్తున్నాయి..
  • 80 శాతం ఆసుపత్రులు చిన్న ఆసుపత్రులే..
  • చిన్న ఆసుపత్రులపై పెద్ద మొత్తంలో ఫైన్స్ వేసి ఇబ్బందులు పెడుతున్నారు..
  • 9 నెలల నుండి ఆసుపత్రుల్లో బకాయిలు ఉన్నాయి..
  • మంత్రి చెప్పిన విధంగా పరిస్థితులు లేవు..

 

మంత్రిపై మండలి చైర్మన్‌ ఫైర్‌..

  • జగనన్న కాలనీల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ ఆరోపణలు
  • అనవసర ఆరోపణలు చేయడంపై వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం
  • శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కామెంట్స్‌..
  • అక్రమాలు జరిగితే ఎంక్వైరీ వేయండి
  • ప్రభుత్వం మీదే కదా..
  • వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం సరికాదు.
     

మంత్రి కొలుసు పార్ధసారధిపై మండలి ఛైర్మన్ ఫైర్

  • మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కామెంట్స్‌..
  • ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీమవరం లే అవుట్‌లో కాంట్రాక్టర్ డబ్బులు వసూలు చేస్తున్నాడని నాకు ఫిర్యాదులొచ్చాయి
  • నేనే స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా
  • శాసనమండలి చైర్మన్ హోదాలో నేనిచ్చిన ఫిర్యాదుకే దిక్కులేదు
  • ఆ జిల్లా కలెక్టర్ కనీసం ఇంతవరకూ స్పందించలేదు
  • నేను ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు కానీ ఇప్పుడు విచారణ చేస్తామని చెప్పడం సరికాదు

శాసనమండలి..

  • మహిళలకు ఆడబిడ్డ నిధిపై ప్రభుత్వం మోసం
  • మండలి సాక్షిగా బట్టబయలైన ప్రభుత్వం నిర్వాకం
  • ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారో చెప్పని మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  • పరిశీలనలో ఉందంటూ సమాధానం దాటేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  • మంత్రి సమాధానంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండిపాటు
  • వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, సాయికల్పలత
  • ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారు
  • ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆడబిడ్డ నిధి అమలు చేస్తామన్నారు
  • మా అంచనా కోటి 60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు
  • ఎప్పట్నుంచి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తారో సమాధానం చెప్పాలి
  • గత బడ్జెట్, ఈ బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించలేదు

👉ఏపీలో కూటమి ప్రభుత్వంలో రకరకాల కారణాలతో పెన్షన్లను తొలగించడం దారుణమన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు. పేదలకు ఇచ్చే పెన్షన్లను భూతద్దం పెట్టి వెతికి తొలగించడమేంటని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు ఓటు వేయలేదనే కారణంతోనే పెన్షన్లు తగ్గిస్తున్నారని చెప్పుకొచ్చారు.

👉ఏపీ శాసనమండలి సమావేశం ప్రారంభమైంది. ఈరోజు సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పెన్షన్ల తొలగింపుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.

👉మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కామెంట్స్‌.. 

  • 2024 జూన్ నాటికి 65 లక్షల 18,496 సామాజిక పెన్షన్లు ఉన్నాయి.

  • ప్రస్తుతం 63 లక్షల 59వేల 907 సామాజిక పెన్షన్‌ లబ్దిదారులు ఉన్నారు

  • 14,965 పెన్షన్లు తొలగించాం.


👉వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్‌..

  • రెండు లక్షల పెన్షన్లు తొలగించారు

  • రకరకాల కారణాలు చెప్పి దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం అన్యాయం

  • పేదలకు ఇచ్చే పెన్షన్లను భూతద్దం పెట్టి వెతికి తొలగించడం దారుణం

  • వివిధ రూపాల్లో లక్షలు.. కోట్లు దోచేస్తున్న వాళ్లను వదిలేసి పేదలపై పడటం బాధాకరం

 

👉వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్‌..

  • రెండు లక్షల పెన్షన్లు తొలగించి రికార్డుల్లో 14,965 మాత్రమే తొలగించామని చెబుతున్నారు

  • ఓటు వేయలేదనే కారణంతోనే పెన్షన్లు తగ్గిస్తున్నారు

 

👉వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్‌..

  • ఏ ప్రాతిపదికన పెన్షన్ల తొలగిస్తున్నారో చెప్పాలి

  • గతంలో ఆరు అంశాలపై పెన్షన్లను వెరిఫై చేసేవారు

  • ప్రస్తుత ప్రభుత్వం 13 అంశాలను పరిగణలోకి తీసుకుని వెరిఫై చేస్తున్నారు

  • పెన్షన్ల తొలగింపులో దివ్యాంగులకు 15 రోజుల్లో సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటున్నారు  

  • సదరన్ వెరిఫికేషన్ స్లాట్ దొరకడానికే నెల రోజుల సమయం పడుతుంది

  • ఏ ప్రాతిపదికన డప్పు కళాకారుల పెన్షన్లు తొలగించారో చెప్పాలి

  • చిరునామా మారితే పెన్షన్ తొలగించేస్తున్నారు

  • పెన్షన్లు తొలగింపులో మానవీయకోణంలో ఆలోచన చేయాలి


👉వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్‌

  • ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారు
  • ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆడబిడ్డ నిధి అమలు చేస్తామన్నారు
  • మా అంచనా కోటి 60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు
  • ఎప్పటి నుంచి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తారో సమాధానం చెప్పాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement