హైదరాబాద్: కుషాయిగూడలో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. క్రేన్ ఢీకొనడంతో వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందింది. సాయినగర్‌కు చెందిన కమలమ్మ(65) రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.