రెండేళ్లుగా కుళ్లిన వాసన.. తలుపు బద్ధలు కొట్టి చూస్తే షాక్‌ | London Old Lady Found As Skelton After Two Years | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా కుళ్లిన కంపు.. తలుపు బద్ధలు కొట్టి చూస్తే షాక్‌.. పాపం ఏమైందో ఏమో?

Published Mon, Feb 21 2022 8:05 PM | Last Updated on Mon, Feb 21 2022 9:35 PM

London Old Lady Found As Skelton After Two Years - Sakshi

ఏమైందో ఏమోగానీ.. పాపం ఆ ఒంటరి పెద్దావిడ అస్థిపంజరంగా కనిపించి చుట్టుపక్కల వాళ్లకు షాక్‌ ఇచ్చింది. పైగా రెండున్నరేళ్లుగా ఆమె ఉండే పోర్షన్‌ నుంచి కంపు వాసన వస్తున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. వాసనకు ఆ తలుపు బద్ధలు కొట్టే ప్రయత్నం చేయలేదు ఎవరు!. ఎందుకంటే.. 

లండన్‌లోని పెచ్‌కమ్‌లోని సెయింట్‌ మేరీస్‌ రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్థుల భవనంలో సదరు మహిళ ఒంటరి(60 ఏళ్ల పైనే వయసు ఉంటుంది)గా ఉంటోంది. అయితే రెండేళ్లుగా ఆమె ఉంటున్న పోర్షన్‌ తలుపు మూతపడే ఉంది. పైగా ఆమె ఇంటి డోర్‌కి అడ్డంగా ఓ సైకిల్‌ పెట్టి ఉంది. దీంతో ఆమె ఇంట్లో లేదని అంతా అనుకున్నారు. అదే టైంలో దాదాపు రెండేళ్లుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తూనే ఉంది. ఈ విషయాన్ని హౌజింగ్‌ అసోషియేషన్‌ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ముక్కు మూసుకుని అడ్జస్ట్‌ అవుతూ వస్తున్నారు. 

అయితే ఆ వాసన భరించడం వల్లకానీ ఓ యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫిబ్రవరి 18వ తేదీన బలవంతంగా పోలీసులు డోర్లు బద్ధలు కొట్టి చూశారు. కుర్చీలో ఆ పెద్దావిడ అస్థిపంజరం కూర్చున్న పొజిషన్‌లో కనిపించడంతో అంతా షాక్‌ తిన్నారు. 

కుప్పలుగా లెటర్లు.. 
ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ఉంటుంది? అనే వివరాలు ఎవరికీ తెలియదు. కానీ, పొరుగింట్లో ఉండే ఓ యువతి మాత్రం తాను లేని టైంలో పార్శిల్స్‌ను రిసీవ్‌ చేసుకోమని ఆ పెద్దావిడ సాయం తీసుకునేదట!. అక్టోబర్‌ 2019లో చివరిసారి ఆమెను చూశానని ఆ యువతి చెప్తోంది. అప్పటి నుంచి ఆమె బయట ఎవరికీ కనిపించలేదట. కరోనా కావడంతో లండన్‌లోని చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో ఆమె కూడా తన సొంతూరికి వెళ్లిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ, కొన్నాళ్లకు ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో ఇంటి డోర్‌కు గుడ్డలు అడ్డుపెట్టారట చుట్టుపక్కల వాళ్లు. 

అయితే ఆమె ఇంటి బయట కుప్పలుగా లెటర్లు, ఇంటి అద్దె బాకీ ఉన్నట్లు నోటీసులు పేరుకుపోయి ఉన్నాయి. చివరికి గ్యాస్‌ చెకింగ్‌కు వచ్చిన వాళ్లు సైతం డోర్‌కు నోటీసులు అంటించడంతో ఆమె జాడ గురించి చుట్టుపక్కల వాళ్లలో అనుమానాలు మొదలయ్యాయి. హౌజింగ్‌ అసోషియేషన్‌ ఎంతకీ విషయం పట్టించుకోకపోవడంతో.. ఓ యువతి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరం స్థితిలో ఆ పెద్దావిడ కనిపించింది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఎవరు? ఏం జరిగి ఉంటుందనే విషయాలపై దృష్టి పెట్టారు. ఈ ఘటన లండన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది ఇప్పుడు. ఇదిలా ఉండగా.. ఇటలీలోనూ ఈ మధ్య ఇలాంటి ఘటనే ఒకటి జరగడం విశేషం.

చదవండి: కామంతో స్నేహితుడి భార్యపై కన్నేశాడు! ఆపై పక్కా స్కెచ్‌ వేసినా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement