skelton
-
నాలుగేళ్ల క్రితం మిస్సింగ్ కేసు...నిందితుడి ఇంట అస్తిపంజరం...
నాలుగేళ్ల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదైన ఒక వ్యక్తి అస్థిపంజరం నిందితుడి ఇంట బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నారా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...అదే గ్రామానికి చెందిన మహ్మద్ హసన్ 2018లో కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు పోలీసులు. అతన్ని ఎవరైనా హత్య చేశారా అనేది తేలక అలా ఆ మిస్సింగ్ కేసు ఆధారాలు లేనిపెండింగ్ కేసుగా ఉండిపోయింది. ఐతే సదరు నిందితుడు కొద్దిరోజుల క్రితం కొంతమంది వ్యక్తుల వద్ద మహ్మద్ హసన్‌ని తానే చంపి తన ఇంట్లో పాతిపెట్టినట్లు చెప్పాడు. దీన్ని ఆయా వ్యక్తులు రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సదరు నిందితుడి ఇంటి వద్ద తనిఖీ చేపట్టారు. నిందితుడి ఇంట్లో జరిపిన తవ్వకాల్లో హసన్ అస్తిపంజరం బయటపడింది. ఈ మేరకు మన్సూర్పూర్ పోలీస్టేషన్ ఆఫీసర్ బిజేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ...వీడియో నెట్టింట రికార్డు కావడంతో హసన్ కుటుంబ సభ్యులు తమకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఆ తర్వాత తాము అతని ఇంటి వద్ద తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ఆ ఆస్తిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపినట్లు తెలిపారు. అతను ఆ వైరల్ వీడియోలో నేరం చేసినట్లు అంగీకరించడాని పేర్కొన్నారు. (చదవండి: కూతురిని చంపి ఆత్మహత్యగా నాటకం...పట్టించిన మొబైల్ ఫోన్) -
టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క
టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క.. దానికో సెపరేటు ఇంట్రడక్షన్ మస్టు. ఇప్పటివరకూ వచ్చిన ఏ డైనోసార్ సినిమా చూసినా దాని తర్వాతే మరెవరైనా.. అలాంటి టీ రెక్స్‌ను సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు దక్కింది. అంటే.. డైరెక్ట్‌గా రాక్షసబల్లి అని కాదు.. దాని అస్థిపంజరం అన్నమాట. తొలిసారిగా ఆసియాలో ఇదిగో ఈ 43 అడుగుల పొడవు, 16 అడుగుల ఎత్తు ఉన్న టీ రెక్స్‌ను వేలం వేయనున్నారు. 6.8 కోట్ల ఏళ్ల క్రితం జీవించిన ఈ టీ రెక్స్ అస్థిపంజరం ఉత్తర అమెరికాలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటివరకూ ప్రపంచంలో మరో రెండు టీ రెక్స్లను మాత్రమే వేలం వేశారట. చెప్పడం మరిచాం.. దీని పేరు షెన్ అట. ఏం చూసి ఆ పేరు పెట్టారని మాత్రం అడగకండి.. మాక్కూడా తెలియదు. మీరు గానీ.. దీన్ని కొనుక్కుంటే మీకు నచ్చినట్లుగా అప్పారావ్, సుబ్బారావ్ అని మార్చేసుకోవచ్చు. నవంబర్ 30న హాంకాంగ్‌లో దీన్ని వేలం వేస్తున్నారు. కొనాలన్న ఆసక్తి ఉంటే మాత్రం ఓ రూ.200 కోట్లు రెడీ చేసుకోండి. ఎందుకంటే.. ఈ అస్థిపంజరం ఆ మాత్రం ధర పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. విషయం అర్థమైందిగా..ఈ అస్థిపంజరం కొనాలంటే.. మన ఆస్తులు అమ్మితే సరిపోదు.. ఇరుగుపొరుగు, బంధుమిత్రుల ఆస్తులు కూడా అమ్ముకొని.. రంగంలోకి దిగాలన్నమాట. మరి రెడీనా..? చదవండి: అబార్షన్ రూల్స్.. ఏ దేశంలో ఎలా? -
Beast Snake: భయానకం.. యాభై అడుగుల భారీ పాము!
అనకొండ, కొండ చిలువలు.. పాముల్లో ఒకరకంగా భారీవి, భయంకరమైనవి అని చెప్పుకుంటాం. కానీ, దక్షిణ, దక్షిణి తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే రెట్రిక్యూలేటెడ్ పైథాన్ ఇప్పటిదాకా ప్రపంచంలో అధికారిక అతిపెద్ద పాము. ఆరున్నర మీటర్ల పొడవు పెరిగే ఈ పైథాన్.. 75 కేజీల దాకా బరువు ఉంటుంది. అయితే ఇంతకు మించిన భారీతనం ఉన్న పాము గురించి ఎప్పుడైనా విన్నారా?.. టైటానోబోవా.. ఈ భూమ్మీద ఇప్పటిదాకా అత్యంత పెద్ద పాముగా పేరుగాంచింది. 1,200 కేజీలకు పైగా బరువు, 48 అడుగులకు పైగా పొడవు ఉండే ఈ పాములు.. డైనోసార్ల కంటే ముందు కాలంలో ఈ భూమ్మీద జీవించేవని, సుమారు 60 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం వర్షారణ్యాల్లో వీటి ఉనికి ఎక్కువగా ఉండేదని అమెరికాకు చెందిన స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు చెప్తున్నారు. అంతేకాదు కొలంబియా కెర్రెజోన్ కోల్ మైన్ గర్భంలో ఇందుకు సంబంధించిన శిలాజాలను సైతం సేకరించినట్లు వాళ్లు వెల్లడించారు. సుమారు 50 అడుగులకు పైగా పొడవుండే టైటానోబోవా Titanoboa.. ఒక స్కూల్‌బస్సు కంటే సైజులో పెద్దదిగా ఉంటుంది. అంతేకాదు ఒకవేళ ఆహారపు గొలుసులో గనుక దీనిని చేరిస్తే.. ఇదే టాప్‌లో ఉంటుంది కూడా. పరిశోధకులు ఈ మెగాస్నేక్కు బీస్ట్‌గా అభివర్ణిస్తుంటారు. అంతేకాదు ఆ కాలంలో బతికిన.. భారీ మోసళ్లను, తాబేళ్లను ఇవి చుట్టేసి పచ్చడిగా చేసి మరీ తినేసేదట. 2012లో టైటానోబోవా మీద ‘టైటానోబోవా: మాంస్టర్ స్నేక్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు. దానిని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ప్రదర్శించారు కూడా. మరి ఈ మెగా స్నేక్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారా? తాజాగా సోషల్ మీడియాలో.. ఒక భారీ పాము అస్థిపంజరం వైరల్ అయ్యింది. ఫ్రాన్స్ తీరంలో గూగుల్ మ్యాప్ ద్వారా ఇది అసలైన పాము అస్థిపంజరమే అని, అదీ టైటానోబోవాదే అని చర్చించుకున్నారు కూడా. అయితే.. అది ఒక భారీ ఆర్ట్ వర్క్ అని తర్వాతే తేలింది. Le Serpent d'océan est une immense sculpture (130m) de l'artiste Huang Yong Ping, principalement composée d'aluminium. A découvrir à Saint-Brevin-les-Pins en France.#PaysDeLaLoire #SaintNazaireRenversante #ErenJaeger 👇Full YouTube video #widerfocushttps://t.co/U61apdbEk4 pic.twitter.com/0nHGPmhhvR — Wider Focus (@WiderFocus) February 28, 2022 -
రెండేళ్లుగా కుళ్లిన వాసన.. తలుపు బద్ధలు కొట్టి చూస్తే షాక్
ఏమైందో ఏమోగానీ.. పాపం ఆ ఒంటరి పెద్దావిడ అస్థిపంజరంగా కనిపించి చుట్టుపక్కల వాళ్లకు షాక్ ఇచ్చింది. పైగా రెండున్నరేళ్లుగా ఆమె ఉండే పోర్షన్ నుంచి కంపు వాసన వస్తున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. వాసనకు ఆ తలుపు బద్ధలు కొట్టే ప్రయత్నం చేయలేదు ఎవరు!. ఎందుకంటే.. లండన్‌లోని పెచ్‌కమ్‌లోని సెయింట్ మేరీస్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్థుల భవనంలో సదరు మహిళ ఒంటరి(60 ఏళ్ల పైనే వయసు ఉంటుంది)గా ఉంటోంది. అయితే రెండేళ్లుగా ఆమె ఉంటున్న పోర్షన్ తలుపు మూతపడే ఉంది. పైగా ఆమె ఇంటి డోర్‌కి అడ్డంగా ఓ సైకిల్ పెట్టి ఉంది. దీంతో ఆమె ఇంట్లో లేదని అంతా అనుకున్నారు. అదే టైంలో దాదాపు రెండేళ్లుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తూనే ఉంది. ఈ విషయాన్ని హౌజింగ్ అసోషియేషన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ముక్కు మూసుకుని అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు. అయితే ఆ వాసన భరించడం వల్లకానీ ఓ యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫిబ్రవరి 18వ తేదీన బలవంతంగా పోలీసులు డోర్లు బద్ధలు కొట్టి చూశారు. కుర్చీలో ఆ పెద్దావిడ అస్థిపంజరం కూర్చున్న పొజిషన్లో కనిపించడంతో అంతా షాక్ తిన్నారు. కుప్పలుగా లెటర్లు.. ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ఉంటుంది? అనే వివరాలు ఎవరికీ తెలియదు. కానీ, పొరుగింట్లో ఉండే ఓ యువతి మాత్రం తాను లేని టైంలో పార్శిల్స్‌ను రిసీవ్ చేసుకోమని ఆ పెద్దావిడ సాయం తీసుకునేదట!. అక్టోబర్ 2019లో చివరిసారి ఆమెను చూశానని ఆ యువతి చెప్తోంది. అప్పటి నుంచి ఆమె బయట ఎవరికీ కనిపించలేదట. కరోనా కావడంతో లండన్‌లోని చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో ఆమె కూడా తన సొంతూరికి వెళ్లిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ, కొన్నాళ్లకు ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో ఇంటి డోర్‌కు గుడ్డలు అడ్డుపెట్టారట చుట్టుపక్కల వాళ్లు. అయితే ఆమె ఇంటి బయట కుప్పలుగా లెటర్లు, ఇంటి అద్దె బాకీ ఉన్నట్లు నోటీసులు పేరుకుపోయి ఉన్నాయి. చివరికి గ్యాస్ చెకింగ్‌కు వచ్చిన వాళ్లు సైతం డోర్‌కు నోటీసులు అంటించడంతో ఆమె జాడ గురించి చుట్టుపక్కల వాళ్లలో అనుమానాలు మొదలయ్యాయి. హౌజింగ్ అసోషియేషన్ ఎంతకీ విషయం పట్టించుకోకపోవడంతో.. ఓ యువతి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరం స్థితిలో ఆ పెద్దావిడ కనిపించింది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఎవరు? ఏం జరిగి ఉంటుందనే విషయాలపై దృష్టి పెట్టారు. ఈ ఘటన లండన్‌లో హాట్ టాపిక్‌గా మారింది ఇప్పుడు. ఇదిలా ఉండగా.. ఇటలీలోనూ ఈ మధ్య ఇలాంటి ఘటనే ఒకటి జరగడం విశేషం. చదవండి: కామంతో స్నేహితుడి భార్యపై కన్నేశాడు! ఆపై పక్కా స్కెచ్ వేసినా.. -
4 నెలల క్రితం అదృశ్యం.. పేడ దిబ్బలో అస్థిపంజరం
శ్రీకాళహస్తి రూరల్: నాలుగు నెలల కిందట అదృశ్యమైన ఓ మహిళ అస్థిపంజరంగా కనిపించిన సంఘటన మండలంలోని విశాలాక్షినగర్‌లో ఆది వారం వెలుగు చూసింది. శ్రీకాళహస్తి రూరల్ సీఐ కృష్ణమోహన్ కథనం మేరకు.. విశాలాక్షినగర్‌లో అమ్ములు అనే మహిళ నివాసముంటుంది. ఆమె కుమార్తె ఉష ఖమ్మం పట్టణానికి చెందిన నాగ రాజు అలియాస్ నిరంజన్ను ప్రేమించడంతో తొమ్మిదేళ్ల కిందట వారికి వివాహం జరిపించింది. రూ.5 లక్షలు అప్పు చేసి, ఇంటిని నిర్మించుకుని అందరూ కలసి అదే ఇంట్లో ఉంటున్నారు. ఉష శ్రీసిటీలోని ఓ మొబైల్ కంపెనీలో పనిచేస్తుండగా నాగరాజు ఖాళీగా ఉంటున్నాడు. ఖాళీగా ఉంటే అప్పు ఎలా తీర్చాలంటూ అమ్ములు తరచూ అల్లుడిని మందలించేది. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ నుంచి అమ్ములు కనిపించకుండా పోయింది. దీంతో ఉష గత జనవరి 9న శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నాగరాజు తమ ఊర్లో పని ఉందంటూ ఖమ్మం వెళ్లి, తిరిగిరాలేదు. ఇంటి ప క్కనే ఉన్న దిబ్బలో చెత్త తమ ఇంటి ఆవరణలోకి వస్తోందని, దాన్ని తొలగించాలని పక్క ఇంటి వారు అడుగుతుండడంతో ఉష ఆదివారం కూలీలతో పేడ దిబ్బను తొలగించింది. దిబ్బలో పుర్రె, ఎముకలు బయటపడడంతో వెంటనే ఆమె ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ వెంకటేష్, తహసీల్దార్ ఉదయ్‌సంతోష్ సిబ్బందితో కలసి ఘటనా స్థలా నికి చేరుకున్నారు. అస్థిపంజరాన్ని వెలుపలకి తీశారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆర్సీఎం రెడ్డి, విజయలక్ష్మి శవపంచనామా నిర్వహించారు. దిబ్బలో అమ్ములు చీర, నాగరాజు లుంగీ లభ్యం కావడంతో అల్లుడు నాగరాజుపైన అనుమానం వ్యక్తమవుతున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు. చదవండి: ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ -
అస్థిపంజరం ఆధారంగా..‘ఆమె’ కోసం గాలింపు
భువనేశ్వర్: కొన్నాళ్ల క్రితం నగర శివారులోని జాలాం పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద ఆగిఉన్న వాహనంలో ఓ మనిషి అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆ అస్థిపంజరం ఎవరిదై ఉంటుందనే కోణంలో పోలీసులు ఓ ఊహాచిత్రం గీయించి, రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లకు శుక్రవారం దాని కాపీలను పంపారు. బెంగళూర్‌కి చెందిన కొంతమంది నిపుణులు ఈ అస్థిపంజరం ఆనవాళ్లతో ఈ ఊహాచిత్రం గీయగా ఆ అస్థిపంజరం ఓ మహిళదిగా తేలింది. అయితే స్థానిక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) వైద్యుల సమాచారం మేరకు అస్థిపంజరం మహిళదని, 45 ఏళ్ల వయసున్న ఆమె ఎత్తు 164 సెంటీమీటర్లు ఉంటుందని తెలిసింది. అలాగే మృతురాలు క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా నిర్ధారించారు. గంజాయి అక్రమ రవాణాకి సంబంధించి, 2019 నవంబరులో ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అందులోని అస్థిపంజరాన్ని గుర్తించినట్లు నగర డీసీపీ ఉమాశంకర దాస్ తెలిపారు. ఇదిలా ఉండగా, అప్పట్లో వాహనంలోని అస్థిపంజరాన్ని గుర్తించడంలో అలక్ష్యం వహించిన ఔట్‌పోస్ట్ ఇన్చార్జి సత్యబ్రత గ్రహచార్య సస్పెన్షన్‌కు గురైన విషయం విదితమే. చదవండి: షాకింగ్.. అంకుల్ అస్థిపంజరాన్నే గిటార్‌గా చేసి.. -
మంచం కింద తల్లి అస్తిపంజరంతో..
ముంబై : మానసిక పరిస్థితి సరిగా లేని ఓ మహిళ తన తల్లి అస్తిపంజరాన్ని మంచం కింద దాచుకుని జీవిస్తున్న ఘటన ఆదివారం మహారాష్ట్రలోని ముంబైలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై సమీపంలోని చూయిమ్ గ్రామానికి చెందిన మహిళకు మతిస్థిమితం సరిగా లేదు. ఇంటి ముందు ఉన్న రోడ్డుపై చెత్త, ఇతర వ్యర్థాలు పడేసేది. ఆమె తీరుతో విసిగిపోయిన చుట్టుప్రక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంట్లో మంచం మీద కూర్చుని ఉన్న ఆమెను చూసి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో మంచం కింద మనిషి శరీరం బెడ్‌షీట్‌లో కప్పబడినట్లుగా వారికి కనిపించింది. (దారుణం.. ఉద్యోగం కోసం తండ్రినే చంపాడు) వెంటనే బెడ్‌షీట్‌ను లాగగా ఎముకల గూడు బయటపడింది. ఆ అస్తిపంజరం సదరు మతిస్థితిమితం లేని మహిళ తల్లి ఇవాన్ ఫెర్నాండజ్‌కు చెందినదిగా విచారణలో తేలింది. అస్తిపంజరాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. అయితే ఇవాన్ ఫెర్నాండజ్ ఎలా మరణించింది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. -
వీడని అస్థిపంజరం మిస్టరీ
సాక్షి, బెల్లంపల్లి: పట్టణంలోని కాంటా చౌరస్తా ప్రాంతం సింగరేణి పాత సివిల్ విభాగానికి చెందిన శిథిలమైన భవనంలో కనిపించిన అస్థిపంజరం మిస్టరీ ఇంకా వీడలేదు. మూడు రోజుల క్రితం వెలుగుచూసిన ఈ అస్థిపంజరం ఎవరిదన్నది తెలియరావడం లేదు. గుర్తు పట్టడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉండడంతో సస్పెన్షన్ వీడడం లేదు. ఈ ఘటనను పోలీసు వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎవరా మహిళా, ఏ ప్రాం తానికి చెందినది, ఇక్కడకు ఎందుకు వచ్చినట్లు, ఒంటరిగా వచ్చిందా లేదా ఎవరితోనైనా వచ్చిందా, చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది, ఆత్మహత్య చేసుకుందా, కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆనవాళ్లు.. ఘటనా స్థలిలో లభ్యమైన మృతురాలి మోకాలు, కాలి వేలికి ధరించిన మట్టెలు, ఎముకలు, ఇతర పదార్థాలు, ఆ ప్రాంతంలో దొరికిన మరికొన్ని వస్తువులను పోలీసులు సేకరించి ఫోరెన్సిక్ ల్యా బ్‌కు పంపారు. మరోవైపు క్లూస్ టీమ్ ద్వారా వీలైనంత వరకు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. డాగ్ స్క్వాడ్ ఆగిన ప్రాంత పరిసరా లను కూడా నిశితంగా పరిశీలన చేస్తున్నారు. ము ఖ్యం గా పాత సివిల్ విభాగం భవనాల వైపు ఇన్నాళ్లుగా ఎవరెవరూ వచ్చారు, ఆ వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎందుకోసం ఆ ప్రాం తానికి రాకపోకలు సాగించారు, ఆప్రాంతాన్నే ఎందుకోసం ఎంచుకుని ఉంటారు, ఎన్నిరోజు లుగా తచ్చాడారు ఆ ప్రాంతంలో, ఎంతమంది సంచరించారు, ఏ సమయంలో వచ్చివెళ్లిపోయే వారో తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. రోడ్డుకు కూతవేటు దూరంలో.. శిథిలమైన భవనం మధ్య ఉన్న చెట్ల పొదల్లో అస్థిపంజరం బయటపడడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ ప్రాంతం బజారు ఏరి యా ప్రధాన రహదారిని ఆనుకుని కేవలం 20 మీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గంలో రేయిం బవళ్లు జనసంచారం ఉంటుంది. ఓ వైపు మసీ దు, ముందు ప్రధాన రహదారి, వెనక వైపు పద్మశాలి భవనం, మరోవైపు బాబుక్యాంపు బస్తీకి వెళ్లే అంతర్గత రహదారి ఉంది. మృతురాలు ఆ శిథిలమైన భవనంలోకి ఎందుకు వెళ్లి ఉంటుందో అంతుచిక్కడం లేదు. చెట్ల పొదల్లో చనిపోయి అస్థిపంజరంగా మారే వరకు ఎవరూ గుర్తించలేక పోయారు. రోడ్డు పక్కన మెకానిక్ వర్క్స్ నిర్వహిస్తున్న సయ్యద్ అనే వ్యక్తి మూత్ర విసర్జనకు వెళ్లి దుర్వాసన రావడంతో అటువైపు వెళ్లడంతో అస్థిపంజరం వెలుగు చూడడం సంచలనమైంది. గుర్తింపే అత్యంత కీలకం.. మిస్టరీగా మారిన మహిళ అస్థిపంజరం ఘట నను చేధించడం పోలీసులకు సవాల్‌గా మారిం ది. ఇటీవలి కాలంలో అదృశ్యమైన మహిళలు ఎంత మందో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏడేళ్ల్ల క్రితం బెల్లంపల్లి టేకుల బస్తీలో జనావాసాలను ఆనుకుని గోనే సంచిలో గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపో యి బయట పడింది. ఇప్పటికీ ఆ మృతదేహం మిస్టరీగానే మారింది. అదే తరహాలో తాజాగా మహిళ అస్థిపంజరం వెలుగుచూడడం చర్చనీయాంశమైంది. -
బిహార్ షెల్టర్ హోం కేసు: కీలక మలుపు
పాట్నా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ ముజఫర్‌పూర్ వసతిగృహంలో బాలికలపై హత్యాచారాలకు పాల్పడిన కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు నిమిత్తం కేంద్రం సీబీఐని నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ విచారణలో భాగంగా సికందర్పూర్ ప్రాంతంలోని శ్మశానంలో ఓ అస్థిపంజరం బయటపడింది. దీన్ని వసతి గృహానికి చెందిన బాలిక అస్థిపంజరంగా భావిస్తున్నారు సీబీఐ అధికారులు. దాంతో ఈ అస్థిపంజరానికి ఫోరెన్సిక్ పరీక్షలు, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్ డ్రైవర్ తెలిపిన వివరాలతో ఈ అస్థిపంజరాన్ని గుర్తించినట్లుగా వెల్లడించారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తరువాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ముజఫర్‌పూర్ వసతి గృహంలో దాదాపు 40 మందికి పైగా బాలికలపై అఘాయిత్యాలు జరిగిన వార్త బయటపడడంతో దేశవ్యాప్తంగా సంచలంగా మారిన సంగతి తెలిసిందే. బ్రజేష్ ఠాకూర్ అనే వ్యక్తి నడుపుతున్న ఎన్జీవో ఆధ్వర్యంలోని వసతి గృహంలో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కొందరు బాలికలను చంపి వసతి గృహంలోనే పూడ్చారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్థానిక పోలీసులు బాలికలు చూపిన చోట వసతిగృహంలో తవ్వకాలు జరిపారు.. కానీ అక్కడ ఏమీ లభ్యం కాలేదని అధికారులు వెల్లడించారు. -
కరీనాకేమయ్యింది...
న్యూ ఢిల్లీ : కరీనా కపూర్‌కు ఏమైంది, అసలు ఆమె ఆహారం తీసుకుంటుందా లేదా? ఎందుకిలా అస్థిపంజరంలా మారిపోయింది...మళ్లీ ఏదైనా సర్జరీ చేయించుకుందా, లేదా మళ్లీ సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తుందా...అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విషయమేంటంటే కరీనా కపూర్ అప్పుడప్పుడు ర్యాంప్ వాక్ చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమె ర్యాంప్ వాక్‌చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 2016 డిసెంబర్లో తైమూర్ పుట్టిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ర్యాంప్ వాక్ చేశారు. తన అభిమాన డిజైనర్ మనిష్ మల్హోత్రా కోసం తన బెస్ట్ ఫ్రెండ్ అమృత అరోరాతో కలిసి సింగపూర్‌లో నిర్వహించిన ఒక ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను అమృత అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.ఈ ఫోటోల్లో కరీనా మరీ పీలగా.. చిక్కిపోయినట్లు ఉన్నారు. ఈ ఫోటోలు చూసి నిరుత్సాహపడిన అభిమానులు కరీనాకు ఏమైంది అస్థిపంజరంలా తయారయ్యింది, మళ్లీ సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తుందా, ఏదైనా సర్జరీ చేయించుకుందా అంటూ రకరకాల కామెంట్లు చేశారు. కొందరు కరీనా తన వయసు కంటే పెద్దదిగా కన్పిస్తుందని అమృత అరోరానే అందంగా ఉందని కామెంట్ చేశారు. తల్లి అయ్యాక కరీన తన బరువును తగ్గించుకోవడానికి చాలా శ్రమపడ్డారు. అందుకు సంబంధించి ఆమె జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం కరీనా శశాంక్ ఘోష్ ‘వీర్ ది వెడ్డింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో కరీనాతో పాటు సోనమ్ కపూర్, స్వర భాస్కర్ లు కీలక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు -
ఆ వింత అస్తిపంజరం ఏలియన్‌దేనా?
-
ఆ వింత అస్తిపంజరం ఏలియన్‌దేనా?
న్యూయార్క్ : చిలీ ఏడారిలో దొరికిన ఓ అస్తిపంజరం ఆర్కియాలజిస్టులను, శాస్త్రవేత్తలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బహుశా అది ఏలియన్ అస్తిపంజరం అయి ఉంటుందని కొందరు చెబుతుండగా ఇంకొందరు మాత్రం అది మనిషిదేనని, అది కూడా కొన్ని దశాబ్దాల కిందటిది మాత్రమే అని చెబుతున్నారు. అసలు ఆ అస్తిపంజరం ఏమిటో? అది ఎక్కడ దొరికిందో? ఇప్పుడు ఏం చేయబోతున్నారో పరిశీలిస్తే.. చిలీ ఏడారిలో విడిచివేయబడిన ఓ గ్రామంలోని పాడుబడిన చర్చి వద్ద అటకామా (అటా) అనే అస్తిపంజరం ఓ వ్యక్తికి 2003లో దొరికింది. దానిని ప్రస్తుతం ఓ వ్యక్తి ఆర్కియాలజికల్ వస్తువులు దొరికే బ్లాక్ మార్కెట్లో కొన్నాడు. ఆ అస్తిపంజరం చెక్కుచెదరకుండా ఉంది. అయితే, దాని పుర్రె మాత్రం ఏలియన్ మాదిరిగా ఉండగా దానికి ఆశ్చర్యకరంగా పక్కటెముకలు 10 ఉన్నాయి. సహజంగా మనుషులకు 12 ఉంటాయి. అలాగే, చూడ్డానికి 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారిదిలాగా కనిపిస్తున్నా పరిమాణం, ఎత్తు మాత్రం షాకయ్యేలా ఉంది. ఆ అస్తిపంజరాన్ని నిలబెడితే ఆరు అంగుళాలు మాత్రమే ఉంది. దీని లక్షణాలు అన్ని కూడా ఏలియన్ల గురించి శోధించేవారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీనిని ప్రత్యేకంగా పరిశీలించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ జెనిటిస్ట్ గ్యారీ నోలాన్ ఓ నివేదిక వెల్లడించారు. దాని ప్రకారం కొన్ని మార్పులతో ఎవరు ఎప్పుడైనా జన్మించవచ్చని తెలిపారు. అలాగే, ఈమె కూడా ఏలియన్‌లాంటి తలతో, పాములాంటి కళ్లతో జన్మించి ఉంటాడని తెలిపారు. అస్తిపంజరాన్ని పరిశీలించినప్పుడు దాని డీఎన్ఏ మనిషే అని చెబుతోందని, అది కూడా కొన్ని దశాబ్దకాలంనాటిదే అయుంటుందని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ వివరాలను జినోమ్ రిసెర్చ్ అనే జర్నల్‌లో పేర్కొన్నారు. మిగితా వ్యక్తుల జన్యువులతో పోలిస్తే అటాలోనికి కొంత భిన్నంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అస్తి పంజరం ఒక అమ్మాయిదని, దక్షిణ అమెరికాలో ఆమె మూలవాసులు ఉండొచ్చని, ఆమె ఒక చిలియన్ అయి ఉండొచ్చని చెప్పారు. -
పుర్రెల గోడలు, అస్థిపంజరాల హారాలు
చెక్ రిపబ్లిక్ : పాత వస్తువులతో కళాఖండాలు తయారుచేయడం మామూలే. వేస్ట్ మెటీరియల్ తో అద్భుత ఆవిష్కరణలు చేయడం కూడా మనకు తెలిసిందే. కానీ ఎముకలతో షాండ్లియర్స్ రూపుదిద్దుకుంటే.. వేలాది అస్థిపంజరాల హారాలు ద్వారాలకు అలంకారాలుగా వేలాడితే.. పుర్రెల కుప్పలుగా పోసి గోడలు కడితే... మొత్తంగా కట్టడమంతా మానవ అస్థిపంజరాలు, ఎముకలతో నిర్మిస్తే.. అమ్మో! అక్కడికి వెళ్లాలంటే భయంతో బిక్క చచ్చిపోతాం.. కానీ చాలామంది పర్యాటకులు మాత్రం అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. అక్కడి అద్భుతాలకు ముగ్ధులవుతున్నారు. ఇంతకీ ఎక్కడ ఉందా వింత కట్టడం అనుకుంటున్నారా.. చెక్ రిపబ్లిక్ రాజధాని పరాగ్వేకు సమీపంలో ఉన్న సెడ్లాక్ లో ఉంది. దాదాపు 40 వేల అస్థిపంజరాలతో డిజైన్ చేసిన ఈ భవనం ఓ చర్చి. అందుకే దీన్ని ముద్దుగా బోన్ చర్చి, టెర్రిఫిక్ చర్చి అని పిలుస్తారు. 15వ శతాబ్ధంలో చర్చి నిర్మాణం కోసం తవ్వినపుడు ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి. 1870 వరకు ఆ అస్థిపంజరాలను ఎవరూ ముట్టుకోలేదు. ఆ తర్వాత స్థానిక శిల్పి ఒకరు వీటితో ఓ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ కళాకారుడి ఆవిష్కరణలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. పుర్రెల దండలు, వెన్నుపూసలతో చేసిన షాండ్లియర్స్ , క్యాండిల్స్ స్టాండ్, కప్పులు, వృత్తాకారాలు, శిలువలు... ఇలా ఒకటా రెండా ఆ చర్చికి ప్రధాన ఆకర్షణలు చాలానే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక కథనం ప్రచారంలో ఉంది. 1278వ సంవత్సరంలో సెడ్లాక్‌కు చెందిన ఓ వ్యక్తి జెరుసలాం నుంచి మట్టిని తెచ్చి ఆ ఊళ్లోను, శ్మశానవాటికలోనూ, చుట్టుపక్కల ఉన్న మత ప్రచారకుల మీద చల్లాడంటారు. దీంతో ఈ ప్రాంతం పవిత్ర స్థలంగా మారిపోయిందన్న విశ్వాసంతో స్థానికులు అక్కడే శవాలను పాతిపెట్టడం మొదలుపెట్టారు. ఆ సాంప్రదాయం 14వ శతాబ్ధం వరకు కొనసాగింది. అప్పట్లో యూరోప్ అంతా ప్రబలిన ప్లేగు వ్యాధి వల్ల 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని ఇక్కడే పూడ్చిపెట్టారు. మతిభ్రమించిన కొంతమంది మత పెద్దలు ఇలా మానవ అస్థిపంజరాలను ఇలా తయారు చేశారనే మరో కథనం స్థానిక గ్రామాల్లో ప్రాచుర్యంలో ఉంది. అలాగే మతయుద్ధాలు చెలరేగిన సెడ్లాక్ ప్రాంతంలో మరో 10వేల మంది చనిపోయారు. ఇలా మొత్తం 40వేల మానవ అస్థిపంజరాలతో స్థానిక కళాకారుడు ఈ పవిత్రమైన చర్చికి రూపకల్పన చేసినట్టుగా సమాచారం. అన్నట్టు దీనికి సంబంధించిన వీడియో ఒకటి కూడా ఇంటర్నెట్ లో ఉంది.