ఏలియన్ అస్తిపంజరంగా అనుమానించిన మానవ అస్తిపంజరం
న్యూయార్క్ : చిలీ ఏడారిలో దొరికిన ఓ అస్తిపంజరం ఆర్కియాలజిస్టులను, శాస్త్రవేత్తలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బహుశా అది ఏలియన్ అస్తిపంజరం అయి ఉంటుందని కొందరు చెబుతుండగా ఇంకొందరు మాత్రం అది మనిషిదేనని, అది కూడా కొన్ని దశాబ్దాల కిందటిది మాత్రమే అని చెబుతున్నారు. అసలు ఆ అస్తిపంజరం ఏమిటో? అది ఎక్కడ దొరికిందో? ఇప్పుడు ఏం చేయబోతున్నారో పరిశీలిస్తే.. చిలీ ఏడారిలో విడిచివేయబడిన ఓ గ్రామంలోని పాడుబడిన చర్చి వద్ద అటకామా (అటా) అనే అస్తిపంజరం ఓ వ్యక్తికి 2003లో దొరికింది. దానిని ప్రస్తుతం ఓ వ్యక్తి ఆర్కియాలజికల్ వస్తువులు దొరికే బ్లాక్ మార్కెట్‌లో కొన్నాడు. ఆ అస్తిపంజరం చెక్కుచెదరకుండా ఉంది. అయితే, దాని పుర్రె మాత్రం ఏలియన్ మాదిరిగా ఉండగా దానికి ఆశ్చర్యకరంగా పక్కటెముకలు 10 ఉన్నాయి.
సహజంగా మనుషులకు 12 ఉంటాయి. అలాగే, చూడ్డానికి 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారిదిలాగా కనిపిస్తున్నా పరిమాణం, ఎత్తు మాత్రం షాకయ్యేలా ఉంది. ఆ అస్తిపంజరాన్ని నిలబెడితే ఆరు అంగుళాలు మాత్రమే ఉంది. దీని లక్షణాలు అన్ని కూడా ఏలియన్ల గురించి శోధించేవారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీనిని ప్రత్యేకంగా పరిశీలించిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ జెనిటిస్ట్ గ్యారీ నోలాన్ ఓ నివేదిక వెల్లడించారు. దాని ప్రకారం కొన్ని మార్పులతో ఎవరు ఎప్పుడైనా జన్మించవచ్చని తెలిపారు. అలాగే, ఈమె కూడా ఏలియన్‌లాంటి తలతో, పాములాంటి కళ్లతో జన్మించి ఉంటాడని తెలిపారు. అస్తిపంజరాన్ని పరిశీలించినప్పుడు దాని డీఎన్‌ఏ మనిషే అని చెబుతోందని, అది కూడా కొన్ని దశాబ్దకాలంనాటిదే అయుంటుందని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ వివరాలను జినోమ్ రిసెర్చ్ అనే జర్నల్‌లో పేర్కొన్నారు. మిగితా వ్యక్తుల జన్యువులతో పోలిస్తే అటాలోనికి కొంత భిన్నంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అస్తి పంజరం ఒక అమ్మాయిదని, దక్షిణ అమెరికాలో ఆమె మూలవాసులు ఉండొచ్చని, ఆమె ఒక చిలియన్ అయి ఉండొచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment