Chilean
-
చిలీ మాజీ అధ్యక్షుడి మృతి
-
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా....
-
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా.......
చిలీలో మానవ హక్కులకు కాలరాసి ప్రజలను హింసిస్తున్న భద్రతా దళాలకు వ్యతిరేకంగా ప్రముఖ చిలీ–మెక్సికన్ గాయనీ మాన్ లఫ్తార్టే గురువారం నాడు లాస్ వెగాస్‌లో జరిగిన 20వ లాటిన్ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన జరిపారు. నిరసనగా గుర్తుగా నల్లటి ప్యాంట్, నల్లటి కోటు ధరించిన ఆమె రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వేదికపైకి ఎక్కి కోటును కిందకు జారవిడిచి తన వక్షోజాలను బయట పెట్టారు. తన చిలీ ప్రజలను హింసించి, రేప్ చేసి, చంపుతున్నారన్న మెడ మీదు నుంచి వక్షోజాల కింది వరకు రాసుకున్నారు. ఆ తర్వాత చిలీ ప్రజల పోరాటానికి మద్దతుగా ఆమె చిలీ కవి రాసిన కవిత్వాన్ని వినిపించారు. ఆ తర్వాత పోరాటానికి మద్దతుగా పాటను కూడా పాడి వినిపించారు. మాన్ లఫ్తార్టే తన పాటలకు వచ్చిన రెండో ‘గ్రామీ అవార్డు ట్రోపీ’ని అందుకోవడానికి అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత ఆమె తెల్లటి గౌను ధరించి నవ్వుతూ ట్రోపీతో ప్రేక్షకుల ముందు కనిపించి ఆకట్టుకున్నారు. మంచి పింఛన్లు ఇవ్వాలంటూ మంచి ఆరోగ్య భద్రతను కల్పించాలంటూ, విద్యావకాశాలను పెంచాలంటూ లక్షలాది మంది చిలీ ప్రజలు వీధుల్లోకి వచ్చి గత కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. వారి ఆందోళనలను అణచి వేసేందుకు చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పియనెరా, అక్టోబర్ 19వ తేదీన దేశంలో అత్యయిక (ఎమర్జెన్సీ) పరిస్థితిని విధించారు. నాటి నుంచి చిలీ భద్రతా దళాలు ప్రజలను నిర్బంధించి హింసిస్తున్నాయి. కొంత మంది మహిళలను రేప్‌లు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు పేల్చిన పెల్లెట్స్ వల్ల నెల రోజుల్లో దాదాపు 200 మంది అంథులయ్యారు. -
ఆ వింత అస్తిపంజరం ఏలియన్‌దేనా?
-
ఆ వింత అస్తిపంజరం ఏలియన్‌దేనా?
న్యూయార్క్ : చిలీ ఏడారిలో దొరికిన ఓ అస్తిపంజరం ఆర్కియాలజిస్టులను, శాస్త్రవేత్తలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బహుశా అది ఏలియన్ అస్తిపంజరం అయి ఉంటుందని కొందరు చెబుతుండగా ఇంకొందరు మాత్రం అది మనిషిదేనని, అది కూడా కొన్ని దశాబ్దాల కిందటిది మాత్రమే అని చెబుతున్నారు. అసలు ఆ అస్తిపంజరం ఏమిటో? అది ఎక్కడ దొరికిందో? ఇప్పుడు ఏం చేయబోతున్నారో పరిశీలిస్తే.. చిలీ ఏడారిలో విడిచివేయబడిన ఓ గ్రామంలోని పాడుబడిన చర్చి వద్ద అటకామా (అటా) అనే అస్తిపంజరం ఓ వ్యక్తికి 2003లో దొరికింది. దానిని ప్రస్తుతం ఓ వ్యక్తి ఆర్కియాలజికల్ వస్తువులు దొరికే బ్లాక్ మార్కెట్లో కొన్నాడు. ఆ అస్తిపంజరం చెక్కుచెదరకుండా ఉంది. అయితే, దాని పుర్రె మాత్రం ఏలియన్ మాదిరిగా ఉండగా దానికి ఆశ్చర్యకరంగా పక్కటెముకలు 10 ఉన్నాయి. సహజంగా మనుషులకు 12 ఉంటాయి. అలాగే, చూడ్డానికి 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారిదిలాగా కనిపిస్తున్నా పరిమాణం, ఎత్తు మాత్రం షాకయ్యేలా ఉంది. ఆ అస్తిపంజరాన్ని నిలబెడితే ఆరు అంగుళాలు మాత్రమే ఉంది. దీని లక్షణాలు అన్ని కూడా ఏలియన్ల గురించి శోధించేవారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీనిని ప్రత్యేకంగా పరిశీలించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ జెనిటిస్ట్ గ్యారీ నోలాన్ ఓ నివేదిక వెల్లడించారు. దాని ప్రకారం కొన్ని మార్పులతో ఎవరు ఎప్పుడైనా జన్మించవచ్చని తెలిపారు. అలాగే, ఈమె కూడా ఏలియన్‌లాంటి తలతో, పాములాంటి కళ్లతో జన్మించి ఉంటాడని తెలిపారు. అస్తిపంజరాన్ని పరిశీలించినప్పుడు దాని డీఎన్ఏ మనిషే అని చెబుతోందని, అది కూడా కొన్ని దశాబ్దకాలంనాటిదే అయుంటుందని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ వివరాలను జినోమ్ రిసెర్చ్ అనే జర్నల్‌లో పేర్కొన్నారు. మిగితా వ్యక్తుల జన్యువులతో పోలిస్తే అటాలోనికి కొంత భిన్నంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అస్తి పంజరం ఒక అమ్మాయిదని, దక్షిణ అమెరికాలో ఆమె మూలవాసులు ఉండొచ్చని, ఆమె ఒక చిలియన్ అయి ఉండొచ్చని చెప్పారు. -
జూ లో తాను చావబోయి సింహాలను..
శాన్టియాగో(చిలీ): ఆత్మహత్య చేసుకోవాలని బోనులో దూకిన వ్యక్తి రెండు సింహాల మృతికి కారణమయ్యాడు. సింహాల బోనులోకి దూకి ఆత్మహత్యకు చేసుకోవాలనుకున్న ఓ 20 ఏళ్ల యువకున్ని కాపాడే ప్రయత్నంలో చిలీలోని జూ అధికారులు తప్పనిసరి పరిస్థతుల్లో రెండు సింహాలను కాల్చి చంపారు. వివరాలు.. చిలీలోని జూలో ఆఫ్రికా సింహాలను ఉంచిన బోణులోకి ఓ వ్యక్తి దూకి బట్టలు విప్పాడు. అనంతరం అతను బోనులో దిగిన కొద్దికే సింహాలు అతనిపై దాడి చేసి పడేశాయి. సమాచారం అందుకున్న జూ అధికారులు వెంటనే భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు జూ ప్రధాన అధికారులు తెలిపారు. అతను బోనులో పడగానే ఓ ఆడ సింహం, మగ సింహం అతనిపై దాడి చేసి పడేశాయి. మత్తు మందు కలిగిన బాణాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని చంపాల్సి వచ్చిందని తెలిపారు. తీవ్రగాయాలైన అతన్ని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన అతన్ని ప్రాంకో లూయిస్‌గా గుర్తించారు. జూ అధికారులు ప్రాంకో జేబులో సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. మరోవైపు జూ అధికారులు చాలా ఆలస్యంగా స్పందించారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అతను బోణులో ప్రవేశించిన తర్వాత కొద్దిసేపటి వరకు సింహాలు అతనిపై దాడి చేయలేదని వారు తెలిపారు.