జూ లో తాను చావబోయి సింహాలను.. | Man strips naked and jumps into a Chilean zoo's enclosure in a bid to feed himself to a big cat | Sakshi
Sakshi News home page

జూ లో తాను చావబోయి సింహాలను..

Published Sun, May 22 2016 11:35 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

జూ లో తాను చావబోయి సింహాలను..

జూ లో తాను చావబోయి సింహాలను..

శాన్టియాగో(చిలీ): ఆత్మహత్య చేసుకోవాలని బోనులో దూకిన వ్యక్తి రెండు సింహాల మృతికి కారణమయ్యాడు. సింహాల బోనులోకి దూకి ఆత్మహత్యకు చేసుకోవాలనుకున్న ఓ 20 ఏళ్ల యువకున్ని కాపాడే ప్రయత్నంలో చిలీలోని జూ అధికారులు తప్పనిసరి పరిస్థతుల్లో రెండు సింహాలను కాల్చి చంపారు. వివరాలు.. చిలీలోని జూలో ఆఫ్రికా సింహాలను ఉంచిన బోణులోకి ఓ వ్యక్తి దూకి బట్టలు విప్పాడు. అనంతరం అతను బోనులో దిగిన కొద్దికే సింహాలు అతనిపై దాడి చేసి పడేశాయి. సమాచారం అందుకున్న జూ అధికారులు వెంటనే భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు జూ ప్రధాన అధికారులు తెలిపారు. అతను బోనులో పడగానే ఓ ఆడ సింహం, మగ సింహం అతనిపై దాడి చేసి పడేశాయి. మత్తు మందు కలిగిన బాణాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని చంపాల్సి వచ్చిందని తెలిపారు. తీవ్రగాయాలైన అతన్ని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన అతన్ని ప్రాంకో లూయిస్గా గుర్తించారు. జూ అధికారులు ప్రాంకో  జేబులో సూసైడ్ నోట్ను కనుగొన్నారు.

మరోవైపు జూ అధికారులు చాలా ఆలస్యంగా స్పందించారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అతను బోణులో ప్రవేశించిన తర్వాత కొద్దిసేపటి వరకు సింహాలు అతనిపై దాడి చేయలేదని వారు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement