![4 Tigers And 3 Lions Infected From Corona Virus In America Zoo - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/23/tiger.jpg.webp?itok=hFkGZUA-)
ప్రతీకాత్మక చిత్రం
న్యూయార్క్ : నగరంలోని బ్రాంక్స్ జూలో నాలుగు పులులకు, మూడు సింహాలకు కరోనా వైరస్ సోకింది. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో జూ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జూ టైగర్ మౌంటైన్‌లో ఉంటున్న మూడు పులులకు, మరో మూడు ఆఫ్రికన్ సింహాలకు పొడి దగ్గుతో కూడిన లక్షణాలు కనిపించాయని, ఓ పులికి మాత్రం లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. అయితే వాటికి ఎటువంటి ఎనస్థీషియా ఇవ్వలేదని, మల పరీక్ష ద్వారా కరోనాను పరీక్షించామని తెలిపారు. ( ఒకే నెలలో 2.6 కోట్ల ఉద్యోగాలు మాయం )
మల పరీక్ష ద్వారా తమ అనుమానం నిజమైందని, జూలో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది జంతువులు కరోనా బారినపడ్డాయని పేర్కొన్నారు. వైరస్ సోకినప్పటికి ఆ జంతువులు మామూలుగానే ఉంటున్నాయని, తింటున్నాయని, దగ్గు కూడా తగ్గిందని తెలిపారు. కాగా, గత నెలలో ఇదే జూలోని నదియా అనే నాలుగు సంవత్సరాల ఆడ పులి కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. నదియా కరోనా సోకిన తొలి పులి కావటం గమనార్హం. ( కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్ )
Comments
Please login to add a commentAdd a comment