tigers
-
నల్లమల.. వణ్యప్రాణుల ఖిల్లా
-
శ్రీశైలం టు శేషాచలం
రాజంపేట: నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో పులుల కారిడార్ విస్తరిస్తోంది. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు పులుల సంచారం ఉన్నట్లు అటవీశాఖ గుర్తించిన సంగతి విధితమే. గతంలో పులులు తిరిగే ప్రాంతం గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో మాత్రమే ఉండేది. ఆ మూడు జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో పులులు సంచరించేవి. కొన్నేళ్లుగా ఇవి తిరిగే కారిడార్ నల్లమల్ల నుంచి వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో శేషాచలం అడవుల వరకు విస్తరించి ఉంది. తరుచూ నిర్వహిస్తున్న పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ఎస్టీఆర్)వారి ఆధ్వర్యంలో పులులు గణన చేపడుతున్నారు. పులులు గణన రెండు బ్లాకులో జరుగుతోంది. నాలుగేళ్లకొకసారి చేసే గణన బ్లాక్–3లోకి వస్తుండగా , ప్రతి ఏడాది జరిపే గణన బ్లాక్–4 కిందికి వస్తుంది. ఇటీవల బ్లాక్–4లోని వార్షిక గణనలో టైగర్ కారిడార్ ప్రాంతంలో గత యేడాదిలో ఫిబ్రవరి 20 నుంచి అటవీశాఖాధికారులు గణన ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎక్కడెక్కడా.. టైగర్ కారిడార్ నంద్యాల, గిద్దలూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి డివిజన్లలో నిర్వహించారు. నంద్యాల డివిజన్లోని చలమరుద్రవరం (రేంజ్), గిద్దలూరులో గుండ్లకమ్మ, వైఎస్సార్ జిల్లాలో ప్రొద్దుటూరు, వనిపెంట, పోరుమామిళ్ల, బద్వేలు, సిద్దవటం, ఒంటిమిట్ట, ముద్దనూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలు, రాయచోటి , బాలపల్లె తిరుపతి జిల్లాలో భాకరాపేట, తిరుపతి రేంజిలోని అటవీ ప్రాంతాల్లోని సాంకేతిక డిజిటల్ కెమెరాలు అమర్చిసర్వే చేశారు. ప్రతి రెండు చదరుపు అడుగులకు రెండు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా రేంజిలలో గత యేడాది 188 లోకేషన్లకు మొత్తం 376 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 127 కెమెరాలు అమర్చారు. 40రోజుల పాటు జరిగిన గణనలో 20 రోజులకొక సారి కెమెరాలు తీసి వాటిలోని చిత్రాలను సేకరించారు. అదే ప్రదేశాలలో మళ్లీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నట్లు అటవీవర్గాల సమాచారం. కెమెరాల్లోని డేటాను ఆయా అటవీశాఖాధికారులు శ్రీశ్రైలంలోని టైగర్ బయోల్యాబ్‌కు పంపనున్నారు. వాటిలోని చిత్రాలను బయోల్యాబ్ ప్రతినిధులు క్షుణ్ణంగా విశ్లేషించనున్నారు. గత ఏడాది పోరుమామిళ్ల, వనిపెంట అడవుల్లో ఆరు పలులు కెమెరాలకు చిక్కినట్లుగా అటవీ అధికారుల నుంచి అందని ప్రాథమిక సమాచారం. పెరుగుతున్న పులులు సంఖ్య2021లో ఆరుపులులు ఉండగా, 2022లో వాటి సంఖ్య తొమ్మిదికి చేరినట్లు అటవీ వర్గాల సమాచారం. 2019లో బద్వేలు, సిద్ధవటం అటవీ ప్రాంతాల్లో కూడా పులులు ఉండేవని అప్పటి సమాచారం. ఈ సారి గణనలో అవి కెమెరాలకు చిక్కలేదు. అయితే పెనుశిల అభయారణ్యం, శేషాచలం అటవీ ప్రాంతాల వైపు వెళ్లినట్లు అటవీవర్గాలు భావిస్తున్నాయి. చిరుతలు మాత్రం కెమెరాకు చిక్కుతున్నాయి. పెనుశిల అభయారణ్యానికి సోమశిల వెనుకజలాలు అడ్డుగా ఉండటం వల్ల రాలేకున్నాయి. అభయారణ్యాలుశేషాచలం (బయోస్పియర్) లంకామల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం పెనుశిల లక్ష్మీనరసింహా అభయారణ్యం8ప్రాథమికంగా 8 నుంచి 10 పులులు సంచారంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని టైగర్ కారిడార్ చేపట్టిన పులుల గణనలో ప్రాథమికంగా 8 నుంచి 10 లోపు పులులను అధికారులు గతంలో గుర్తించారు. వాటి సంఖ్య ఈ ఏడాది పెరిగి ఉంటుందని అటవీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అడవుల్లో అమర్చిన విదేశీ సాంకేతిక డిజిటల్ కెమెరాల ద్వారా వాటి సంఖ్యను కొనుగొన్నారు. శ్రీశైలంలోని టైగర్ బయోట్యాబ్లో శాస్త్రవేత్తలు కెమెరాల్లో లభ్యమైన చిత్రాలపై విశ్లేషణ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.అడవిలో చెట్లకు కెమెరాలు అమర్చాం శేషాచలం అటవీ ప్రాంతంలో చెట్ల కెమెరాలు అమర్చాము. పులి, చిరుత కెమెరాలో పడితే వివరాలు వెల్లడిస్తాము. సర్వే జ రుగుతోంది. టైగర్ కారిడార్ పరిధిలో పులల గణన జరుగుతుంది. –జగన్నాథ్‌సింగ్, జిల్లా అటవీశాఖాధికారి, రాజంపేట -
బర్డ్ ఫ్లూతో పులులు, చిరుత మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని గోరేవాడ రెస్క్యూ సెంటర్లో మరణించిన మూడు పులులు, ఒక చిరుత మృతికి బర్డ్‌ఫ్లూ కారణమని తేలింది. డిసెంబర్ చివరణ మృతి చెందిన వన్య మృగాలు ఏవియన్ ఫ్లూ హెచ్5ఎన్1 బారిన పడ్డాయని అధికారులు ధ్రువీకరించారు. దీంతో మహారాష్ట్ర అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనుషుల మీద దాడి నేపథ్యంలో డిసెంబర్లో వీటిని చంద్రాపూర్ నుంచి గొరేవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న ఒక పులి, 23న రెండు పులులు మృతి చెందాయి. నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్)కు పంపించారు. ల్యాబ్ ఫలితాల్లో బర్డ్‌ఫ్లూతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెచ్5ఎన్1 వైరస్ మూలాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులను వేటాడటం లేదా ముడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మృతుల నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 25 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. -
తగ్గిన పులుల మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పులుల మరణాలు గణనీయంగా తగ్గాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వెల్లడించింది. పులుల సంరక్షణ చర్యలు పటిష్టం చేయడం, వణ్యప్రాణి చట్టాల కఠిన అమలు, అభయారణ్యాలలో వేటగాళ్ల కట్టడి చర్యల ఫలితంగా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. గత ఏడాదిలో మొత్తం మరణాల సంఖ్య 182గా ఉండగా, ఈ ఏడాది కేవలం 122 మరణాలే సంభవించినట్లు తెలిపింది. ఈ ఏడాది సంభవించిన మరణాల్లో అధికంగా మధ్యప్రదేశ్‌లో 44, తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో 21 పులుల మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఈ ఏడాది జనవరిలో కవ్వాల్ రిజర్వ్ ప్రాంతంలో రెండు పులులు మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. దేశ వ్యాప్తంగా 2012 నుంచి 2024 డిసెంబర్ 25 వరకు దేశ వ్యాప్తంగా మొత్తంగా 1,366 పులులు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 2020లో 106, 2021లో 127, 2022లో 122, 2023లో 182 పులులు మరణించాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 355, మహారాష్ట్రంలో 261, కర్ణాటకలో 179 పులులు మరణించగా, ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 11 మరణాలు సంభవించాయి. వణ్యప్రాణి సంరక్షణ ప్రాంతాల పరిధిలో జరిగిన మరణాలు 50శాతం వరకు ఉండగా, వెలుపల జరిగిన మరణాలు 42 శాతంగా ఉండగా, మరో 8 శాతం వేటగాళ్ల నుంచి స్వా«దీనం చేసుకున్న సందర్భాలున్నాయి. ఆహారం, నీటి కోసం తమ భూభాగాలను విడిచిపెట్టి బయటికి రావడం, ఆహారం కోసం పులుల మధ్య ఘర్షణలు జరగడం, ఇతర జంతువులతోనే వేటకై పోటీ ఉండటంతో మరణాలు జరుగుతునట్లు నివేదిక తెలిపింది. అయితే గత ఏడాది ప్రాజెక్ట్ టైగర్‌లో బాగంగా గ్రీన్ కవర్ పెంచడం, బఫర్ జోన్లలో నిర్మాణాల కట్టడి, అటవీ భూముల బదలాయింపుల నిలుపుదల, వేటగాళ్లపై నిరంతర నిఘా, రాత్రి వేళల్లో సఫారీల నిలుపుదల, టైగర్ రిజర్వ్‌లో నిర్మాణ కార్యకలాపాల కట్టడి వంటి చర్యలతో పులుల మరణాలు తగ్గాయని అంచనా వేసింది. -
తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన పులులు
తెలంగాణలో పెద్ద పులుల గాండ్రింపులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని రెండు పులుల అభయారణ్యాలైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లలోనే కాకుండా కొత్త ప్రదేశాల్లోనూ పులులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల 30, 40 ఏళ్ల తర్వాత వాటి కదలికలు రికార్డవుతున్నాయి. టైగర్ రిజర్వ్‌లలో పులుల సంఖ్య పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఉండటంతోపాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాల్లోంచి రాష్ట్రంలోకి పులుల వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే.. తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగిన సంఖ్యలో జంతువులు, నీటివనరులు, గడ్డి భూములు ఉన్నాయి. దీంతో పులులు ఇక్కడకు తరలి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను 13కుపైగా జిల్లాల్లో పులుల కదలికలను అధికారులు ఇటీవల గుర్తించారు. –సాక్షి, హైదరాబాద్100 పులుల ఆవాసానికి అనుకూలం...ఒక పులి (Tiger) స్వేచ్ఛగా తిరుగుతూ తన జీవనాన్ని సాగించేందుకు 50 చ.కి.మీ. అడవి అవసరమవుతుంది. దీన్నిబట్టి తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లతో కలుపుకుంటే దాదాపు 5 వేల చ.కి.మీ. అటవీ ప్రాంతం అందుబాటులో ఉంది. ఇది సుమారు 100 పులులు జీవించేందుకు, స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అమ్రాబాద్ (Amrabad Tiger Reserve) టైగర్ రిజర్వ్‌లో ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా 33 పులులు ఉన్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక కవ్వాల్‌లో కోర్ ఏరియాలో కొంతకాలంగా ఒక్క పులి కూడా స్థిరనివాసం ఏర్పరచుకోలేదు. అయితే మహారాష్ట్ర–తెలంగాణ (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా) టైగర్ కారిడార్, సరిహద్దు ప్రాంతాల్లో ఐదారు పెద్ద పులులు సంచరిస్తున్నట్లు తాజా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే (Adilabad district) మనుషులపై పులుల దాడులు, ఒకరి మృతి, మరొకరు తీవ్రంగా గాయపడటం, పలుచోట్ల పశువుల సంహారం వంటివి చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు 10–15 ఏళ్ల కిందట ‘టైగర్ టెరిటరీ’గా ఉన్న అడవులు కొన్నిచోట్ల ఆక్రమణలతో పొలాలు, పత్తి చేన్లుగా మారిపోయాయి.మళ్లీ పులులు అక్కడకు చేరుకొనేటప్పటికి పత్తిచేన్లు మూడున్నర, నాలుగు అడుగుల మేర ఏపుగా పెరగడం, కిందకు వంగి పత్తి ఏరే కూలీలను వెనక నుంచి చూసి పులులు ఎరగా పొరబడి దాడులకు పాల్పడుతున్నాయని ఓ అటవీ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. మహారాష్ట్రలో (Maharashtra) సంతానానికి జన్మనిచ్చాక పెద్ద పులులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న క్రమంలో సరైన ఆవాసం దొరకకపోవడంతోపాటు ఆహారాన్వేషణలో దాడులు జరుగుతున్నాయని చెప్పారు. పులులు ఒకే మార్గంలో కాకుండా 3, 4 దిశల నుంచి వస్తుండటం వల్ల వాటి కదలికలను అంచనా వేయడం కష్టంగా మారుతోందన్నారు.కొత్త ప్రాంతాల్లో ఆనవాళ్లు... కొన్నేళ్లుగా పెద్ద పులులు కనిపించని భూపాలపల్లి, ఏటూరునాగారం, కిన్నెరసాని, పాకాల, మంచిర్యాల, ఇచ్చోడ, బోథ్, పెద్దపల్లి వంటి చోట్ల ఇటీవల కాలంలో పులుల కదలికలు నమోదయ్యాయి. రాష్ట్ర పర్యావరణానికి సంబంధించి దీన్ని ముఖ్యమైన పరిణామంగా పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 54 పులుల అభయారణ్యాలు ఉండగా వాటిలో 2 వేల చ.కి.మీ. పైబడి అటవీ వైశాల్యమున్న కొన్నింటిలో ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) 3,728 చ.కి.మీ.లలో., తెలంగాణలోని అమ్రాబాద్ 2,611 చ.కి.మీ.లలో, కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2,016 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.కొత్త ప్రాంతాల్లో ఆనవాళ్లు... కొన్నేళ్లుగా పెద్ద పులులు కనిపించని భూపాలపల్లి, ఏటూరునాగారం, కిన్నెరసాని, పాకాల, మంచిర్యాల, ఇచ్చోడ, బోథ్, పెద్దపల్లి వంటి చోట్ల ఇటీవల కాలంలో పులుల కదలికలు నమోదయ్యాయి. రాష్ట్ర పర్యావరణానికి సంబంధించి దీన్ని ముఖ్యమైన పరిణామంగా పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 54 పులుల అభయారణ్యాలు ఉండగా వాటిలో 2 వేల చ.కి.మీ. పైబడి అటవీ వైశాల్యమున్న కొన్నింటిలో ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) 3,728 చ.కి.మీ.లలో., తెలంగాణలోని అమ్రాబాద్ 2,611 చ.కి.మీ.లలో, కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2,016 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యం పులితోనే ముడిపడి ఉందిపులికి హాని జరగకుండా సంరక్షించుకుంటే దాని ద్వారా ఇతర జంతువులకూ రక్షణ లభిస్తుంది. టైగర్‌ను ఫ్లాగ్íÙప్ ఫర్ ఎకోసిస్టమ్‌గా, అంబ్రెల్లా స్పీషిస్గా పరిగణిస్తాం. గొడుగు ఎలా అయితే తన నీడలో లేదా కింద ఉన్న వాటిని తడవకుండా రక్షిస్తుందో పులి కూడా అంతే. పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యం కూడా పులితోనే ముడిపడి ఉంది. అడవులు, ముఖ్యంగా పులుల అభయాణ్యాల నుంచే వర్షపునీరు కిందకు ప్రవహించి నదుల్లోకి చేరుతోంది. వాననీటితోపాటు బురద, ఇసుక వంటివి నదుల్లోకి సిల్ట్ రూపంలో చేరకుండా అడవులు అడ్డుకుంటాయి. పండ్లు, ఫలాలతోపాటు అడవుల్లోని ఔషధ మొక్కల ద్వారా మనకు మందులు లభిస్తున్నాయి. – ఫరీదా తంపాల్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్–నేచర్ స్టేట్ డైరెక్టర్ (హైదరాబాద్ సెంటర్)పులులను పరిరక్షించుకోవాల్సిన అవసరముందితెలుగు రాష్ట్రాల్లోని 3 టైగర్ రిజర్వ్‌లు నదుల ఒడ్డునే ఉండటంతోపాటు ఈ అడవుల్లోంచే అత్యధిక వాటా నీరు నదుల్లోకి చేరుతోంది. అందువల్ల తెలంగాణ, ఏపీ భవిష్యత్ పర్యావరణపరంగా సురక్షితంగా ఉండాలంటే ఈ అభయారణ్యాల్లోని పులులను పరిరక్షించుకోవాల్సిన అవసరముంది. పులుల ఆవాసాల ద్వారా పర్యావరణపరంగా అందుబాటులోకి వచ్చే సేవలను (ఎకోలాజికల్ సర్వీసెస్ ద్వారా) డబ్బు విలువ పరంగా లెక్కిస్తే ఒక్కో పులి రూ. 250 కోట్ల విలువ చేస్తుంది. కోవిడ్ సంక్షోభం మనందరికీ ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణులను గౌరవించాలని, కాపాడుకోవాలని నొక్కి చెబుతోంది. – ఇమ్రాన్ సిద్దిఖీ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ డైరెక్టర్ -
కాకతీయ జూపార్క్‌కు కరీనా ,శంకర్ ఆగయా..!
న్యూశాయంపేట : వరంగల్ నగరంలోని కాకతీయ జూపార్క్‌కు ఆడపులి కరీనా (15), మగ పులి శంకర్ (10) వచ్చేశాయి. పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న పెద్దపులుల దర్శన భాగ్యం త్వరలో కలగనుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా రెండు పెద్ద పులులతోపాటు అడవిదున్నల ఎన్క్లోజర్లు, రెండు జింకల ఎన్క్లోజర్లను ప్రారంభించనున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు.ఐదేళ్ల కిందటే రావాల్సి ఉండే..కాకతీయ జూపార్క్‌లో పెద్ద పులులు, అడవిదున్నల కోసం ఐదేళ్ల క్రితమే ఎన్‌క్లోజర్ పనులు ప్రారంభించారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోవడం.. బడ్జెట్ లేదనే నెపంతో పనులను మధ్యలోనే వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అటవీశాఖ మంత్రి కావడంతో జూపార్క్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్క్లోజర్ల పనులు పూర్తి చేసి రెండు పెద్ద పులులు, ఇతర జంతువులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.హగ్ డీర్.. బార్కిన్ డీర్ వైజాగ్ నుంచి రాక..కాకతీయ జూపార్క్‌కు రెండు జింక (హగ్ డీర్, బార్కిన్ డీర్)లను ఆంధ్రప్రదేశ్‌నుంచి తీసుకొచ్చినట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. రెండు అడవిదున్నలు త్వరలో రానున్నట్లు చెప్పారు. సెంట్రల్ జూపార్క్ అథారిటీ అనుమతితో ఈ జంతువులను జూపార్క్‌కు తీసుకొస్తున్నట్లు వివరించారు. వాటి కోసం ప్రత్యేకమైన ఎన్క్లోజర్ల ఏర్పాటు చేశామన్నారు.సిద్ధసముద్రంలో పూడిక తీస్తే మేలు..జూపార్క్.. సిద్ధ సముద్రం చెరువు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండల మధ్య 47.64 ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో వివిధ జంతువుల ఎన్క్లోజర్లకు పోను సిద్దసముద్రం చెరువు కొంతమేర ఉంటుంది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చెరువులో పూడిక తీసి బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని పార్క్‌ను సందిర్శించిన సందర్భంగా తెలిపారు. ఆ తరువాత పట్టించుకోలేదు. కొండా సురేఖ అటవీశాఖ మంత్రి కావడం, జూపార్క్‌కు ప్రతేక నిధులు కేటాయించి సిద్ధసముద్రంలో పూడిక తీసి బోటింగ్ సదుపాయం కల్పించాలని పర్యాటకులు, నగరవాసులు కోరుతున్నారు.ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలి..కాకతీయ జూపార్క్‌కు రెండు పెద్ద పులులు వచ్చాయి. రెండు జింకలు వైజాగ్ నుంచి ఇటీవల తీసుకొచ్చాం. రెండు అడవిదున్నలు త్వరలో రానున్నాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేదాక సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఆ తరువాత సందర్శకులకు అనుమతిస్తాం.– భీమానాయక్, అటవీ ముఖ్య సంరక్షణాధికారి, భద్రాద్రి సర్కిల్ -
బర్డ్ ఫ్లూ కలకలం: వియత్నాంలో 47 పులుల మృతి
బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా దక్షిణ వియత్నాంలోని ఓ జూలో 47 పులులు, మూడు సింహాలు, ఓ పాంథర్ మరణించినట్లు స్థానిక మీడియా బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) మీడియా కథనం ప్రకారం.. లాంగ్ యాన్ ప్రావిన్స్‌లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్ , హో చి మిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వూన్ జోయ్ జూలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది.నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్ పరీక్ష ఫలితాల ప్రకారం ఈ జంతువులకు H5N1 రకం A బర్డ్ ఫ్లూ వైరస్ సోకటంతో మృతి చెందినట్లు తెలిపింది. అయితే పులుల మరణాలుపై జూ అధికారుల స్పందించకపోటం గమనార్హం. అదేవిధంగా జంతువులతో సన్నిహితంగా ఉన్న జూ సిబ్బంది ఎవరిలో కూడా శ్వాసకోశ లక్షణాలను బయటపడలేదని తెలుస్తోంది.⚠️Bird flu kills 47 tigers, 3 lions and a panther in Vietnam zoos, state media reports.47 tigers, 3 lions and a panther have died in zoos in south Vietnam due to the H5N1 bird flu virus, state media said Wednesday.@ejustin46@mrmickme2@DavidJoffe64https://t.co/P99Dn71HMF— COVID101 (@COVID19info101) October 2, 2024 ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం (ENV) ప్రకారం.. 2023 చివరి నాటికి వియత్నాంలో మొత్తం 385 పులులు జూలో ఉన్నాయి. ఇందులో 310 ప్రైవేట్ అధీనంలోని జూలలో ఉండగా.. మిగిలినవి ప్రభుత్వ అధీనంలోని జూల సంరక్షణలో ఉన్నాయి. 2022 నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వేగంగా వ్యాప్తి చెందటం వల్ల పలు క్షీరదాల మరణాలు పెగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఈ H5N1 వైరస్ ఇన్ఫెక్షన్లు మానవుల్లో కూడా తేలికపాటి నుంచి తీవ్రమైన స్థాయి వరకు ఉండవచ్చని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారవచ్చని ప్రపంచ ఆగర్యో సంస్థ పేర్కొంది. మరోవైపు.. గతంలో 2004లో సైతం డజన్ల కొద్దీ పులులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయని వియాత్నం స్థానిక మీడియా తెలిపింది.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్ -
నల్లమల టైగర్ జోన్ లో ఓరోజు.. ఆమ్రాబాద్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
లావాటి చిరుతపులి..! బరువు తగ్గించడానికి నానా ప్రయత్నాలు!! చివరికీ..
చిరుతపులులు సాధారణంగా సన్నగా ఉంటాయి. పెద్దపులులు, సింహాలతో పోల్చుకుంటే, వీటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అవి శరవేగంగా దూకి వేటాడగలవు. చిరుతపులుల సహజమైన తీరుకు భిన్నంగా చైనాలోని ఒక జూలో ఉన్న పదహారేళ్ల చిరుతపులి బాగా లావెక్కిపోయి, ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.ఈ చిరుత ఫొటోలు చూసి, ఇది చిరుతలా కనిపించడం లేదని, సముద్ర జంతువు సీల్లా ఉందని కొందరు వ్యాఖ్యలు చేశారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ పాంఝిహువా పార్క్ జూలో ఉన్న ఈ లావాటి చిరుత మిగిలిన చిరుతల్లా చురుగ్గా కాకుండా, మందకొడిగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈ ఏడాది మార్చిలో వైరల్‌గా మారాయి.ఇది డిస్నీ కామిక్ సిరీస్‌లోని లావాటి పోలీసు పాత్ర ‘క్లాహాసర్’ను తలపిస్తోందంటూ కొందరు వెటకారం చేశారు. జంతుప్రేమికులు మాత్రం అడ్డగోలుగా లావెక్కిన ఈ చిరుత ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చారు. సాధారణంగా చిరుతపులుల బరువు దాదాపు పాతిక నుంచి ముప్పయి కిలోల వరకు ఉంటుంది. ఈ చిరుత మాత్రం రెట్టింపు బరువు పెరిగింది.దీని గురించి ఆన్లైన్లో అలజడి మొదలవడంతో చైనా జూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, దీని బరువు తగ్గించడానికి నానా ప్రయత్నాలు ప్రారంభించారు. మేత తగ్గించడం, వ్యాయామాలు చేయించడానికి ప్రయత్నించడం సహా రెండు నెలలకుపైగా ఎన్ని తంటాలు పడినా ఈ చిరుత ఏమాత్రం బరువు తగ్గకపోవడంతో అధికారులు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు.ఇవి చదవండి: కీకారణ్యంలో.. మాయన్ నగర శిథిలాలు! అక్కడేం జరిగిందంటే? -
‘‘పులులను పట్టండి... ఓట్లు అడగండి’’!
స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొన్నిచోట్ల ఎన్నికలను బహిష్కరించారనే వార్తలను మనం వినేవుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ పరిధిలో గల పండరి గ్రామస్తులు ఇప్పుడు విచిత్రమైన డిమాండ్ వినిపిస్తున్నారు. అది నెరవేరాకే ఓటు వేస్తామని తెగేసి చెబుతున్నారు. లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. పండరి గ్రామస్తులు కొన్నాళ్లుగా పులుల దాడులతో భీతిల్లిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాము ఓటువేయమని చెబుతున్నారు. పండరి గ్రామం టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉంటుంది. దీంతో గ్రామంలో తరచూ పులుల దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఎంతకాలమైనా ఈ సమస్య పరిష్కారం కావడం లేదని, అందుకే తాము రాబోయే లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించనున్నామని పేర్కొంటూ గ్రామస్తులు పలుచోట్ల పోస్టర్లు అంటిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య పులుల భీభత్సమని, వాటి కారణంగా ఇక్కడి రైతులు పొలాలకు కాపలా కాసేందుకు వెళ్లలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. పాఠశాల విద్యార్థులు కూడా పులుల భయంతో స్కూలుకు వెళ్లడం లేదని దీంతో ఇక్కడి పిల్లల భవిష్యత్తు అయోమయంగా తయారయ్యిందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలోకి పులుల రాకను అరికట్టేవరకూ తాము ఓటు వేసేందుకు వెళ్లేదిలేదని గ్రామస్తులు చెబుతున్నారు. -
కుమురం భీం: టైగర్ డెత్ కేసులో నలుగురు అరెస్ట్
-
ఫోరెన్సిక్ నివేదికలో సంచలన విషయాలు
-
రెండు పులుల మధ్య కొట్లాట
కాగజ్‌నగర్ రూరల్: రెండు పులులు పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో ఓ ఆడ పులి మృతి చెందింది. కుము రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. చీఫ్ ఫారెస్టు కన్జ ర్వేట ర్ శాంతారాం ఆది వారం మీడియాకు ఈ వివరాలు వెల్ల డించారు. నాలుగు రోజుల క్రితం రెండు పులులు పరస్పరం దాడికి దిగాయని, ఓ పశువుల కాపరి తమకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టామని తెలిపారు. ఈ ఘటనలో సుమారు రెండు సంవత్సరాల వయసున్న ఆడ పులి మృతి చెందిందన్నారు. 200 మీటర్ల విస్తీర్ణంలో పులుల మధ్య కొట్లాట జరిగినట్లు ఆనవాళ్లను గుర్తించామని వివరించారు. మృతి చెందిన పులికి సంబంధించిన శాంపిళ్లను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపిస్తున్నామని చెప్పారు. రిపోర్టు రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. విషప్రయోగం వల్ల పులి మృతి చెందిందనే ఆరోపణలు సరికావన్నారు. సాధారణంగా ఒక పులి ఆవాసం ఉండే ప్రాంతంలోకి మరో పులి వచ్చినప్పుడు ఘర్షణ జరుగుతుందని తెలిపారు. ఈ తరహా ఘర్షణతోనే పులి మృతిచెందిందని శాంతారాం వెల్లడించారు. -
కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు!
సాధారణంగా రైతులు చేతికొచ్చిన పంటను వీలైనంత త్వరగా కోసి, కొత్త పంటకు నేలను సిద్ధం చేస్తారు. అయితే దీనికి విరుద్దంగా ఆ ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న చెరకు, వరి పంటలను కోసేందుకు రైతులు వెనుకాడుతున్నారు. అది ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా.. అక్కడి రైతులు చేతికందిన చెరకును కోయాలంటే గజగజా వణికిపోతున్నారు. దీని వెనుక కారణం తెలిస్తే ఎవరైనా కూడా భయపడాల్సిందే. యూపీలోని పిలిభిత్ జిల్లా రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తులకు కీలకమైన ప్రాంతంగా గుర్తింపుపొందింది. జిల్లాలోని రైతులు ప్రధానంగా వరి, చెరకు పండిస్తుంటారు. అయితే జిల్లాలో ప్రతి ఏటా పంట కోతకు వచ్చినప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని వెనుక ప్రకృతి వైపరీత్యమేదో కారణమనుకుంటే పప్పులో కాలేసినట్లే. దీనికి వన్యప్రాణులు ప్రధాన కారణమని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పిలిభిత్ జిల్లాలోని టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉన్న అనేక ప్రాంతాలకు పులులు వస్తుంటాయి. ఇవి చెరకు, వరి పొలాలలో దాక్కుంటాయి. అటువంటి పరిస్థితిలో పంటల కోత సమయంలో కూలీలు వన్యప్రాణుల బారిన పడుతున్నారు. తాజాగా మాథొటాండా పరిధిలోని పిపరియా సంతోష్ గ్రామ రైతులు.. మిల్లు నుంచి స్లిప్ తీసుకున్నా చెరుకు పంటను కోసేందుకు వెనుకాడుతున్నారు. పలువురు రైతులు రెట్టింపు వేతనాలు ఇస్తామంటున్నా కూలీలు ఈ పొలాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. అక్టోబర్ 19 నుండి ఈ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పంట కోస్తున్న సమయంలో కూలీలపై పులులు దాడి చేస్తున్నాయి. ఇటువంటి భయానక పరిస్థితుల్లో కోతకు సిద్ధంగా ఉన్న చెరకు, వరి పంటలు అలానే ఉండిపోతున్నాయి. కాగా పిలిభిత్ సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. వారి అనుమతి లభించాక రెస్క్యూ ఆపరేషన్ చేపడతామన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో లక్షల్లో తులసి మాలల విక్రయాలు! -
అనుమానాస్పద స్థితిలో రెండు పులుల మృతి
అన్నానగర్: అనుమానాస్పద స్థితిలో రెండు పులులు మృతిచెందినట్టు ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం అవలాంజీ డ్యామ్ మిగులు నీటి కాలువ సమీపంలో ఆదివారం రెండు పులులు చనిపోయాయని ఎమరాల్డ్ రేంజర్లు నివేదించారు. వెంటనే నీలగిరి జిల్లా అటవీశాఖ అధికారి సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. విచారణ సమాచారం ప్రకారం, రెండూ ఆడ పులుల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవు. రెండు రోజులకు ముందు చనిపోయి ఉండవచ్చు అని తెలుస్తుంది. దేవరాజ్ నేతృత్వంలో 20 మంది ఉద్యోగులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. సమూహ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాలను విచారణ చేస్తున్నారు. ఈ రెండు పులులు విషం తాగి చనిపోయాయేమోనని క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం తర్వాతే అసలు కారణం వెల్లడవుతుంది. ఈ విధంగా అందులో పేర్కొన్నారు. -
ఐదేళ్లలో 661 పులుల మృత్యువాత
సాక్షి, అమరావతి: అడవిలో పులుల సగటు జీవిత కాలం సాధారణంగా 10 నుంచి 12 ఏళ్లలోపు ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, రోడ్డు, రైలు ప్రమాదాల కారణంగా ఎక్కువగా పులులు మరణిస్తున్నాయని పేర్కొంది. గత ఐదేళ్లుగా చూస్తే ఎక్కువగా పెద్ద పులుల మరణాలున్నాయని, వీటిలో ఎక్కువ శిశుమరణాలున్నట్లు గుర్తించామని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో మొత్తం 661 పులులు మృతి చెందాయని, వీటిలో సహజ, ఇతర కారణాలతోనే 516 పులులు మృతి చెందినట్టు తెలిపింది. మరో 126 పులులను వేటాడడం ద్వారా హతమార్చారని తెలిపింది. వేటకాకుండా.. అసహజంగా 19 పులులు మరణించాయంది. పులులను వేటాడుతున్న వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకుంటున్నాయని, అరెస్ట్‌లు చేస్తున్నాయని తెలిపింది. ప్రాజెక్టు టైగర్, టైగర్ రేంజ్ రాష్ట్రాలు పులుల సంరక్షణపై అవగాహన పెంచుతున్నాయని పేర్కొంది. ఇందుకోసం రాష్ట్రాలకు నిధులిస్తున్నామని, వన్యప్రాణుల ఆవాసాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య
తిరుపతి మంగళం/ మార్కాపురం: ఏపీలో పెద్దపులుల సంరక్షణ, సంఖ్య పెరగడంలో అటవీశాఖ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర అటవీ, విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గ్లోబల్ టైగర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏపీలోని నల్లమల అడవుల్లో గత సంవత్సరం జరిగిన గణనలో 74 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య 80కి చేరినట్టు తేలిందన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు కింద పులుల సంరక్షణ పనులను అటవీశాఖ సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు. పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని, అంతరించిపోతున్నాయన్నది ద్రుష్పచారమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు ప్రత్యేకంగా కారిడార్ అభివృద్ధి చేసి, టైగర్ రిజర్వు పరిధిని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తద్వారా అటవీ రక్షణ, పులుల సంరక్షణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం పులుల సంరక్షణపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జూ ప్రవేశంలో ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణపై స్టాళ్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణపై ఫొటో గ్యాలరీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, ఏపీ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే, సీసీఎఫ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నల్లమలలో 80 పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం 80 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా పులుల సంఖ్యను విడుదల చేశారు. ఎన్ఎస్టీఆర్– తిరుపతి కారిడార్ (నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం) వరకూ ఇవి ఉన్నట్లు తెలిపారు. -
మన పులులు 21
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 పెద్ద పులులు ఉన్నట్టు ’స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022’నివేదిక వెల్లడించింది. ఈ మేరకు శనివారం కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అధికారిక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పులులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోనే ఉన్నాయని, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో ఒక్క పులి కూడా శాశ్వత ఆవాసం ఏర్పరచుకోలేదని పేర్కొంది. కాగా ఈ నివేదిక చూస్తుంటే కేవలం రెండు టైగర్ రిజర్వ్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పులుల సంఖ్యనే గుర్తించినట్టు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ నివేదికలో రెండున్నరేళ్ల వయసుకు పైబడిన పులుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోందన్నారు. మొత్తంగా సవివరమైన వివరాలతో విడుదల చేసే ‘అబ్స్ట్రాక్ట్ నివేదిక’లో స్పష్టత వస్తుందనీ అది వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చునని పేర్కొంటున్నారు. తాజా నివేదికపై అధికారుల్లో చర్చ 2018లో ఉన్న 26 పులుల సంఖ్య (కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో 19, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 7) నుంచి ఇప్పుడు గణనీయంగా పులుల సంఖ్య పెరిగి ఉంటుందని అధికారులు భావిస్తూ వచ్చారు. అయితే నివేదిక అందుకు భిన్నంగా రావడంపై రాష్ట్ర అటవీశాఖ అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని రెండు పులుల అభయారణ్యాల్లోనే కాకుండా టైగర్ కారిడార్లు, బఫర్ జోన్లు ఇతర ప్రాంతాలు కలిపితే 28 దాకా పెద్ద పులులు, దాదాపు పది దాకా పులి పిల్లలు ఉండొచ్చునని అటవీ అధికారులు చెబుతున్నారు. కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం వంటి కొత్త ప్రాంతాల్లో పులి పాదముద్రలు రికార్డ్ అయ్యాయని, టైగర్ కారిడార్ ఏరియాలోని సిర్పూర్ కాగజ్‌నగర్, ఇతర ప్రాంతాల్లోనూ వీటి జాడలున్నాయని తెలిపారు. అక్కడ పులుల సంఖ్యలో వృద్ధికి సంబంధించి తాము క్షేత్రస్థాయిలో కెమెరా ట్రాపులు, ఫొటోలు, ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ అంచనాకు వచి్చనట్టుగా ఒక సీనియర్ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. ప్రాజెక్ట్ టైగర్ ద్వారా సత్ఫలితాలు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ ములుగులో ఘనంగా రాష్ట్ర స్థాయి పులుల దినోత్సవం ములుగు (గజ్వేల్): దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెంపుదల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్)ఆర్.ఎం. డోబ్రియాల్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం (ఎఫ్సీఆర్ఐ)లో ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో పులుల సంఖ్య 3,167కు పెరిందని తెలిపారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంరక్షణ చర్యలతో ఇక్కడ కూడా పులుల సంఖ్య పెరిగిందన్నారు. పులులను మనం కాపాడితే అడవిని, తద్వారా మానవాళిని కాపాడుతాయన్నారు. రానున్న రోజులలో పులుల ఆవాసాలను మరింతగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ములుగు ఎఫ్సీఆర్ఐ డీన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. -
పులుల పోరాటం.. ఏనుగుల ఘర్షణ
సాక్షి, అమరావతి: పర్యావరణ ప్రతికూలతల కారణంగా మానవులు, అటవీ జంతువుల మధ్య పెరుగుతున్న ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా అడవులు నరికివేస్తుండటంతో జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ క్రమంలో తమ స్థావరాలను కోల్పోతున్న జంతువులు మానవ పరిసరాల్లోకి చొరబడి దాడులకు తెగబడుతున్నాయి. దేశంలో ఏటా పులులు, ఏనుగుల దాడుల్లో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాగా, వణ్యప్రాణుల అక్రమ రవాణాలోనూ ఈ రెండు జంతువులే అత్యధికంగా వేటగాళ్ల బారిపడటం గమనార్హం. స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్–డౌన్ టు ఎర్త్ 2023 నివేదిక ప్రకారం.. 2020–21తో పోలిస్తే 2021–22లో మనుషులపై ఏనుగుల దాడులు 16 శాతం, పులుల దాడులు 2019తో పోలిస్తే 2022 నాటికి 83 శాతం పెరగడం దారి తప్పిన పరిస్థితికి అద్దం పడుతోంది. ఐదు హాట్ స్పాట్లలో.. ప్రస్తుతం భారత్‌లో 3,167 పులులు ఉన్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా గడచిన 22 ఏళ్లలో పులులను అక్రమంగా వేటాడిన కేసుల్లో 34 శాతం భారతదేశం నుంచే ఉండటం గమనార్హం. నాలుగేళ్లలో (2018–21) ఇటువంటి ఘటనలు 21% పెరిగాయి. ప్రపంచంలో మొత్తం పులులను వేటాడి వాటి శరీర అవయవాల అక్రమ రవాణా తదితర కేసుల్లో 53% చైనా, ఇండోనేíÙయా, భారత్‌లోనే ఉంటున్నాయి. ప్రపంచ దేశాల్లో 1000 కంటే ఎక్కువ ప్రదేశాల్లో పులులను వేటాడే ఘటనలు నమోదయ్యాయి. భారత్‌లో 85 శాతం అక్రమ వ్యాపార వేటలు ఉత్తరప్రదేశ్‌లోని దుద్వార్ నేషనల్ పార్కు, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ నేషనల్ పార్కు, మధ్యప్రదేశ్‌లోని కన్హా టైగర్ రిజర్వు, కర్ణాటకలోని నాగర్హోల్ టైగర్ రిజర్వు, మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వు వంటి కేవలం ఐదు హాట్స్పాట్లుగా మారడం కలవరపెడుతోంది. ఇక్కడే అత్యధికంగా దాడులు అత్యధికంగా జార్ఖండ్, ఒడిశా, అస్సాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఏనుగుల దాడుల్లో ఎక్కువ మంది మృతి చెందుతున్నారు. మహారాష్ట్రలో ఎక్కువ మంది పులుల దాడుల్లో చనిపోతున్నారు. మహారాష్ట్రలో 2019లో 26 మంది, 2020లో 25, 2021లో 32, 2022లో రికార్డు స్థాయిలో 84 మంది పులుల దాడుల్లో మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎక్కువ మంది మృతులు ఉంటున్నారు. నాలుగేళ్లలో తెలంగాణలో ఇద్దరు, తమిళనాడులో నలుగుర్ని పులులు పొట్టన పెట్టుకున్నాయి. వేటగాళ్ల ఉచ్చులో పడి.. ఆహార అన్వేషణ, ఆవాసాలు దెబ్బతినడంతో దారి తప్పడం, అడవుల్లో జన సంచారం పెరగడం వంటి కారణాలతో ఏనుగులు, పులులు మనుషులపై దాడి చేస్తుంటే.. వన్యప్రాణుల్ని చంపి వ్యాపారం చేసే వ్యక్తులతో వీటి ప్రాణాలకు పెనుముప్పు వాటిల్లుతోంది. ఏనుగు దంతాలు, పులి చర్మం, గోళ్లకు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటంతో స్మగ్లర్లు ఏనుగులు, పులుల్ని వేటాడుతున్నారు. దేశంలో పులుల మరణాలు 2021తో పోలిస్తే 2022లో 21 శాతం పెరిగాయి. ఇందులో 80 శాతం మరణాలకు గల కారణాలు ఇప్పటికీ అటవీ శాఖ అధికారులకు అంతు చిక్కలేదు. ఇదిలా ఉంటే 2018–19 నుంచి 2021–22 మధ్య 389 ఏనుగులు మృతి చెందాయి. వీటిల్లో 71 శాతం మరణాలు విద్యుదాఘాతంతో సంభవించడం గమనార్హం. ప్రధానంగా ఏనుగు కారిడార్లు ఎక్కువ ఆక్రమణలకు గురవుతున్నాయి. -
పెద్దపులికి రూట్ క్లియర్
తిరుమల: నల్లమల అడవుల నుంచి శేషాచల కొండల్లోకి పెద్దపులులు రానున్నాయి. ఆ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అహోబిలం నుంచి తిరుపతి వరకు 4,759 కిలోమీటర్ల మేర విస్తరించి శేషాచల కొండలు అపురూపమైన వృక్ష సంపదకే కాదు, వన్య మృగాలకూ నెలవు. ప్రపంచంలో మరెక్క డా కనిపించని ఎర్రచందనం చెట్లు ఒక్క శేషాచలం అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులకు అడ్డాగా శేషాచలం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతమైనా.. పెద్ద పులులు నివసించేందుకు అనువైన ప్రదేశమైనా.. ఇప్పటివరకు ఆ సందడి లేదు. కాగా శేషాచలం అటవీ ప్రాంతంలోకి పెద్ద పులులు వచ్చేలా అటవీశాఖ కారిడార్ ఏర్పాటు చేయనుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కు వగా ఉంటుంది. ఇవి అప్పుడప్పుడు తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గాల్లో భక్తులకు కనిపిస్తూ ఉంటాయి. వారిపై దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. 2008లో శ్రీవారి మెట్టు నడకమార్గంలో బాలికపై చిరుత దాడి చేయగా.. రెండేళ్ల కిందట రెండో ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. 2008లో మాత్రం బాలికపై దాడికి పాల్పడిన చిరుతను పట్టుకుని తిరిగి వైఎస్సార్ జిల్లా చిట్వేల్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వదిలిపెట్టారు. అనంతరం వారం కిందట బాలుడిని తీసుకెళ్లి 500 మీటర్ల దూరంలో చిరుత వదిలిపెట్టి వెళ్లింది. టీటీడీ ఈ ఘటనపై వెంటనే స్పందించింది. 24 గంటల వ్యవధిలోనే చిరుతను బంధించి భాకరాపేట అటవీ ప్రాంతంలో వదిలిపెట్టింది. నల్లమలలో ఎక్కువైన పెద్ద పులులు ప్రస్తుతం నల్లమల అడవుల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో పెద్ద పులులున్నాయి. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులుల సంచారం పెరుగుతూ ఉండటంతో వాటిని శేషాచల కొండల వైపు మళ్లించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. నల్లమల నుంచి బద్వేలు మీదుగా సిద్దవటం నుంచి తిరుమలకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తిరుమల నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్న అటవీశాఖ అధికారులు.. శేషాచల కొండలు పెద్ద పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని గుర్తించి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని మూడు వేల హెక్టార్లు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాన్ని రిజర్వుడ్æ ఫారెస్టుగా పేర్కొంటారు. ఇక్కడ మనుషుల కన్నా జంతువులకే ఎక్కు వ ప్రాధాన్యం ఉంటుంది. మనుషులపై దాడిచేసే అలవాటు లేని చిరుతలే అప్పుడప్పుడు అటవీ ప్రాంతాన్ని దాటి వచ్చి తిరుమల నడకదా రులు, ఘాట్ రోడ్లపైకి వచ్చి భక్తులపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత దాడుల వల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండే అవకాశం లేకపోవడంతో భక్తులు సురక్షితంగా వాటి నుంచి బయటపడుతున్నారు. కానీ పెద్ద పులుల వ్యవహారం అలా ఉండదు. మరి చిరుతల తరహాలో పెద్ద పులులు అటవీ ప్రాంతాన్ని దాటి వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. బద్వేల్ మీదుగా శేషాచలానికి కారిడార్ పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా బద్వేల్ మీదుగా శేషాచల కొండలకు కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం శేషాచల కొండల్లో పెద్దపులి సంచారం లేదు. తిరుమల నడకమార్గంలో ఇబ్బందుల్లేకుండా చర్యలు. – మధుసూదన్ రెడ్డి, పీసీసీఎఫ్ -
వంద పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో ప్రాచుర్యం పొందిన వంద పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ మధుసూదనరెడ్డి తెలిపారు. జిల్లాలోని అరకు, మారేడుమిల్లి, రంపచోడవరం, గుడిసె, చింతపల్లి తదితర ప్రాంతాలను ఆయన బుధవారం సందర్శించారు. స్థానిక అటవీక్షేత్ర కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. పర్యాటకులు బస చేసేందుకు సౌకర్యవంతమైన కాటేజీలు, ట్రెక్కింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆదివాసీల సేవలు ఉపయోగించుకుని వారికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పర్యాటక ప్రదేశాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పెద్ద పులుల స్థావరంగా నల్లమల: శ్రీశైలం ప్రాజెక్టు పరిసరాల్లో నల్లమల అడవులు పెద్ద పులుల స్థావరంగా మారిందని చెప్పారు. గతంలో ఇక్కడ 45 పులులు మాత్రమే ఉండగా, ఇప్పుడు వీటి సంఖ్య 75కు పెరిగిందన్నారు. పాపికొండల ఏరియాలో గతంలో రెండు పులులు ఉండగా, ప్రస్తుతం మరో రెండు పులులు చేరాయన్నారు. మారేడుమిల్లి, రంపచోడవరం తదితర అటవీ ప్రాంతాల్లో చిరుతల సంచారం బాగా పెరిగిందని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. స్క్వాడ్ డీఎఫ్‌వో త్రిమూర్తులరెడ్డి, స్థానిక ఫారెస్ట్ రేంజర్ అబ్బాయిదొర పాల్గొన్నారు. -
అడవి ఒడిలోకి.. పులి పిల్లలు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో రెండునెలల క్రితం తల్లి నుంచి వేరుపడి దొరికిన పులి పిల్లల్ని తిరిగి అడవిలో వదిలేందుకు రాష్ట్ర అటవీ శాఖ భారీ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూపార్క్‌లో ఆ నాలుగు పులి పిల్లల్ని ఉంచి సంరక్షిస్తున్నారు. ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుతం వాటికి ఆహారం అందించడంతోపాటు శిక్షణ ఇస్తున్నారు. వాటిని ఏడాదిన్నరలోపు తిరిగి అడవిలోకి పంపాల్సి వుంది. దీనికిముందు వాటిని అడవిలో సహజంగా జీవించే పులుల్లా తయారుచేసేందుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. ఇలా అడవి నుంచి బయటకు వచ్చిన పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపిన అనుభవం ఉన్న మధ్యప్రదేశ్‌లోని కన్హా, బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వులను తిరుపతి జూ క్యూరేటర్ సెల్వం, ఎన్ఎస్టీఆర్ (నాగార్జున్‌సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు) ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ మరికొందరు అధికారుల బృందం పరిశీలించి వచ్చింది. కన్హా రిజర్వులో 36 హెక్టార్లు, బాంధవ్‌గఢ్ రిజర్వులో 26 హెక్టార్లలో ఇన్‌సిటు ఎన్క్లోజర్లు ఏర్పాటుచేసి తప్పిపోయి దొరికిన పులి పిల్లలకు శిక్షణ ఇచ్చారు. ఆత్మకూరు ప్రాంతంలోని నల్లమల అడవిలోనే ఇలాంటి ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎన్‌క్లోజర్ ఎలా వేశారు, ఎలా నిర్వహించారు, ఎంత ఖర్చయింది, అలాంటి ఎన్క్లోజర్ను ఇక్కడ ఏర్పాటుచేయడానికి ఏం చేయాలనే దానిపై ఈ బృందం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది. దాన్నిబట్టి త్వరలో ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేయనున్నారు. 50 జంతువుల్ని వేటాడి తింటేనే పూర్తిగా అడవిలోకి.. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో వంద హెక్టార్లలో నాలుగు పులి పిల్లల కోసం ఇన్‌సిటు ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేయనున్నారు. నీటి వసతి బాగా ఉండి, వేటాడేందుకు అనువైన జంతువులున్న చోటును అన్వేషిస్తున్నారు. ఆ చోటును గుర్తించిన తర్వాత అక్కడ ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేసి 2, 3 నెలల్లో వాటిని అందులోకి వదిలిపెట్టాలని భావిస్తున్నారు. ఎన్క్లోజర్ను మూడు భాగాలుగా ఏర్పాటుచేయాలని చూస్తున్నారు. మొదట నర్సరీ ఎన్‌క్లోజర్‌లో ఉంచి చిన్న జంతువుల్ని వేటాడే అవకాశం కల్పించాలని, ఆ తర్వాత దశల్లో చిన్న, పెద్ద ఎన్క్లోజర్లలో కొద్దిగా పెద్ద జంతువుల్ని వేటాడేలా చేయాలనేది ప్రణాళిక. అదే సమయంలో అడవిలో ఎలుగుబంట్లు, ఇతర జంతువుల బారిన అవి పడకుండా కూడా జాగ్రత్త తీసుకోవాల్సి వుంటుంది. పులి పిల్లలు ఏడాదిన్నరలో ఈ ఎన్క్లోజర్లలో కనీసం 50 జంతువుల్ని చంపి తింటే వాటికి వేట వచ్చినట్లు నిర్ధారించుకుని అడవిలోకి వదిలేస్తారు. జంతువుల్ని చంపలేకపోతే వాటిని తిరిగి జూకి తరలిస్తారు. సాధారణంగా ఈ వేటను తల్లి పులులు పిల్లలకి నేర్పుతాయి. కానీ, ఆ పనిని ఇప్పుడు అటవీ శాఖ చేస్తోంది. ఈ పనిని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వులో విజయవంతంగా చేయడంతో అక్కడికెళ్లి అధ్యయనం చేశారు. అక్కడిలాగే నల్లమలలో ఇన్‌సిటు ఎన్క్లోజర్లు తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో అందుకోసం ఓ దాతను ఒప్పించారు. ఈ ఖర్చును భరించేందుకు ఆ దాత ముందుకు రావడంతో త్వరలో ఎస్వీ జూపార్క్‌లో పెరుగుతున్న పులి పిల్లలు నల్లమలలో ఇన్‌సిటు ఎన్‌క్లోజర్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. జూపార్క్‌లోని నాలుగు ఆడ పులి పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి. మూడు కేజీల బరువు ఉన్నప్పుడు దొరికిన వాటి బరువు ఇప్పుడు 14–15 కేజీలకు పెరిగినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. త్వరలో ఇన్‌సిటు ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో పులి పిల్లలు వేటాడితే అడవిలో వదులుతాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతోపాటు మనం ఇంతకుముందు ఎప్పుడూ చేయని పని. అందుకే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. – మధుసూదన్‌రెడ్డి, పీసీసీఎఫ్, ఏపీ అటవీ శాఖ -
బాబోయ్.. పులి!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న మండలాల్లో పులులు సంచరిస్తున్నాయని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దుర్గి మండలం గజాపురం అటవీ ప్రాంతంలో వారం కిందట ఓ ఆవును అడవి జంతువులు వేటాడి చంపాయి. ఆవుపై దాడి చేసిన విధానం, ఆ ప్రదేశంలో ఉన్న పాద ముద్రల ఆధారంగా రెండు పులులు దాడి చేసినట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పల్నాడు జిల్లా అడవులకు ఆనుకుని ఉన్న నల్లమల టైగర్ జోన్ నుంచి ఆ రెండు పులులు దారి తప్పి వచ్చాయని వారు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజల్లో గుబులు మొదలైంది. ఏ సమయంలో పులులు దాడులు చేస్తాయోనని ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం అయితే ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆహారం దొరక్క వచ్చాయా!? శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల మధ్య ఉన్న నల్లమల అభయారణ్యంలో పులుల సంతతి గత రెండు మూడేళ్లుగా బాగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 73 దాకా ఉందని అటవీశాఖ అధికారిక లెక్కల ప్రకారం చెబుతున్నా.. అనధికారికంగా మరో పది పులులు ఉండొచ్చని భావిస్తున్నారు. టైగర్ జోన్లో ఆహారం లభించక వేట కోసమో, నీటి లభ్యత తగ్గడం వల్లనో పులులు పల్నాడు జిల్లా వైపు వచ్చి ఉంటాయంటున్నారు. ఈ పులులు దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండల పరిధిలోని నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉందని, ఆ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, దారి తప్పి వచ్చిన రెండు పులులను తిరిగి అభయారణ్యంలోకి సురక్షితంగా పంపేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ, వేట నిరోధక దళాలు, వనమిత్రల సాయంతో పులుల జాడ తెలుసుకుని, వాటి మార్గాలను టైగర్ జోన్ వైపు మళ్లించే యత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా అభయారణ్యంలో నుంచి నీటి కోసం పులులు వచ్చే అవకాశం ఉండటంతో మంచి నీటి కుంటలు ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పొలాల చుట్టూ వేసే విద్యుత్ కంచెల బారిన పడి మరణించకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో రాత్రి పూట విద్యుత్‌ను నిలుపుదల చేయాలని విద్యుత్ శాఖను కోరారు. అప్రమత్తంగా ఉండండి..దుర్గి మండల పరిసరాల్లో రెండు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించాం. ప్రస్తుతం పులులకు ఎటువంటి ఆపద రాకుండా సురక్షితంగా తిరిగి అభయారణ్యంలోకి పంపడం, ప్రజలను అప్రమత్తం చేసి వాటికి దూరంగా ఉంచడం మా కర్తవ్యం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు అటవీ సమీప ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే గుంపులుగానే వెళ్లాలి. – రామచంద్రరావు, పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి. రెండు పులులను చూశా.. నాలుగు రోజుల కిందట అర్ధరాత్రి పూట పొలానికి వచ్చిన సమయంలో రెండు పులులను చూశాను. ఒకటి పెద్దది, రెండోది చిన్నది. పొలంలోని గుంతల్లో నీటిని తాగి వెళ్లాయి. ఇటీవల మా పొలం సమీపంలోనే ఆవును చంపి లాక్కెళ్లాయి. రాత్రి పూట పొలానికి రావాలంటే భయంగా ఉంది. – గోవింద, పులిని చూసిన ప్రత్యక్ష సాక్షి, గజాపురం, దుర్గి మండలం. -
కొత్త టైగర్ రిజర్వ్ .. చాన్సున్నా చర్యల్లేవ్?
రాష్ట్రంలో కొత్త టైగర్ రిజర్వ్‌ల ఏర్పాటుకు అన్ని సానుకూల పరిస్థితులున్నా అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్కటీ కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పడలేదు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు ఉండగా, కొత్తగా కనీసం రెండు పులుల అభయారణ్యాల ఏర్పాటుకు అవకాశం ఉంది. కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు కాగజ్‌నగర్, కిన్నెరసాని, ఏటూరునాగారంలలో సానుకూల వాతావరణం ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులొచ్చే అవకాశమున్నా రాష్ట్ర ప్రభుత్వపరంగా ముఖ్యంగా అటవీశాఖ నుంచి గట్టి ప్రయత్నాలు సాగడం లేదనే విమర్శలున్నాయి. – సాక్షి, హైదరాబాద్ తగ్గిన పులుల ఆక్యుపెన్సీ తాజాగా విడుదలైన టైగర్ స్టేటస్ రిపోర్ట్–2022లోనూ రాష్ట్రంలో ‘పులుల ఆక్యుపెన్సీ’ తగ్గిందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి వివిధ ప్రయోజనాలు చేకూరే అవకాశమున్నా గట్టి ప్రయత్నాలు జరగడం లేదనే ఆరోపణలున్నాయి. 2014 తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా 8, 9 పులుల అభయారణ్యాలు ఏర్పడినా, రాష్ట్రానికి ఒక్కటి కూడా రాకపోవడానికి ఈ దిశలో కనీసం ప్రతిపాదనలు కూడా కేంద్రానికి చేరలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వీటి ఏర్పాటుకు అటవీశాఖ ప్రతిపాదనలు పంపితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కవ్వాల్‌లో కనిపించని స్థిరనివాస పులులు! ఉమ్మడి ఏపీలో 2012లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) ఏర్పడింది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో భాగంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర విభజన అనంతరం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌గా (ఏటీఆర్) ప్రకటించారు.ప్రస్తుతం అమ్రాబాద్‌లో పులులు పుష్కలంగా ఉన్నాయని, 2018తో పోలి్చతే వాటి సంఖ్య గణనీయంగా పెరిగిందనే అంచనాలున్నాయి. కవ్వాల్‌లోని చెన్నూరు డివిజన్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న పులులే కనిపించకపోవడం ఆందోళన రేపుతోంది. ఎన్ని ఆడపులులు సంతానోత్పత్తి చేస్తున్నాయనే అంశం ప్రాతిపదికన ఆ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య వృద్ధికి అవకాశముంది, ప్రస్తుతం ఏటీఆర్‌లో కనీసం ఏడు ‘బ్రీడింగ్ ఫిమేల్ టైగర్స్’ ఉండటంతోపాటు కనీసం నాలుగు ఆడపులులు పిల్లలు పెట్టి వాటిని సంరక్షిస్తున్నాయని ఈ ప్రాంతంతో పరిచయమున్న నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏటీఆర్‌లో 30 దాకా పులులు (నాలుగైదు పులి పిల్లలు కలుపుకొని) ఉండగా, కేటీఆర్‌లో అసలు పులులే కనిపించని పరిస్థితులు ఏర్పడినందున కొత్త టైగర్ రిజర్వ్‌ల ఏర్పాటు అవశ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగజ్‌నగర్‌లో కనిపిస్తున్నాయ్... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకునే ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో తెలంగాణలోకి వాటి వలసలు పెరిగాయి. ప్రస్తుతం కొంతకాలంగా పులులు లేని ప్రాంతంగా కవ్వాల్ నిలుస్తోంది. దీని బయట టైగర్ కారిడార్‌లో ముఖ్యంగా కాగజ్‌నగర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మూడో టైగర్ రిజర్వ్‌ను కాగజ్‌నగర్ ఏరియాలో ఏర్పాటు చేసి ఉంటే పులుల సంరక్షణకు పెద్దమొత్తంలో కేంద్ర నిధులు రావడంతోపాటు ఉద్యోగుల కేటాయింపు, స్థానికులకు ఉపాధి పెరిగే అవకాశం ఉండేదంటున్నారు. టైగర్ సఫారీ వంటి వాటికీ పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తారని, దీనివల్ల ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని చెబుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా, అంధారీ ప్రాంతానికి పక్కనే ఈ ప్రాంతం ఉండటంతోపాటు.. అక్కడి నుంచే పులులు ఇక్కడకు వస్తున్నందున మరో టైగర్ రిజర్వ్ ఏర్పాటుచేస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. వైల్డ్‌లైఫ్ శాంక్చురీగా ఉన్న కిన్నెరసాని, ఏటూరు నాగారంలోనూ పులుల సంచారం ఉన్నందున వాటిని కూడా టైగర్ రిజర్వ్‌గా ప్రకటించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడింటిలో కనీసం రెండుచోట్ల టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో టైగర్ రిజర్వ్‌ను ఏర్పాటు చేసినా అడవులు, పర్యావరణానికి మేలు చేకూరుతుందని అంటున్నారు. రాష్ట్రంలో పులుల అభయారణ్యానికి సానుకూలంగా ఉన్న ప్రాంతాలు 1. కాగజ్‌నగర్ 2. కిన్నెరసాని 3. ఏటూరు నాగారం -
టైగర్ రిజర్వును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ (ఫొటోలు)
-
దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..? లెక్క చెప్పిన ప్రధాని మోదీ..
ఒకప్పుడు సరదా కోసం పులుల్ని వేటాడేవారు. ఆ తర్వాత కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు పులుల్ని బలి తీసుకున్నాయి. ప్రకృతి సమతుల్యతకి పులులెంత విలువైనవో ఆ తర్వాత మనకి తెలిసి వచి్చంది. 50 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన టైగర్ ప్రాజెక్టు వల్ల పులుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ప్రపంచంలోనే పులుల సంరక్షణ అంశంలో భారత్ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచదేశాలకు మార్గదర్శకంగా మారాయి. నాలుగేళ్లకొకసారి అభయారణ్యాలలో పులుల్ని లెక్కించే ప్రక్రియ ఆసక్తికరంగా మారి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. మన దేశంలో పులుల సంరక్షణ కోసం 50 ఏళ్ల క్రితమే టైగర్ ప్రాజెక్టు మొదలైంది. పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యతకి పులులు ఎంత ముఖ్యమో గ్రహించిన అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. అప్పట్లో దేశీయంగా అంతరించడానికి సిద్ధంగా ఉన్న జాబితాలో పులులు చేరిపోయాయి. ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ దేశాల్లో పులుల సంఖ్య లక్ష ఉంటే, మన దేశంలో 40 వేలు ఉండేవి. అలాంటిది 1970 నాటికి పులుల సంఖ్య దాదాపుగా 1,800కు పడిపోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. అభివృద్ధి పేరిట అడవులకి, వన్యప్రాణులకి ఎంత నష్టం జరుగుతోందో గ్రహించి టైగర్ ప్రాజెక్టుని ప్రారంభించింది. తొలిదశలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తొమ్మిది టైగర్ రిజర్వ్‌లు ఉండేవి. ప్రస్తుతం 75 వేల చదరపు కిలోమీటర్లు (దేశ భౌగోళిక విస్తీర్ణంలో 2.4%) విస్తీర్ణంలో 53కి పైగా టైగర్ రిజర్వులున్నాయి. ప్రపంచంలో మొత్తం పులుల్లో మన దేశంలో 70% ఉన్నాయంటే ఈ టైగర్ ప్రాజెక్టు ఎంతటి విజయాన్ని సాధించిందో తెలుస్తోంది. పులులను ఎలా లెక్కిస్తారంటే! దేశంలో పులుల సంరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వాటి గణన చేపట్టినప్పుడు అదో పెద్ద సవాల్‌గా నిలిచింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో తొలినాళ్లలో అటవీ సిబ్బంది అడవుల్లో నడుచుకుంటూ వెళ్లి వన్యప్రాణులు కనిపిస్తే వాటి గుర్తులతో సహా ఎన్ని కనిపించాయో వివరాలను రాసుకొని లెక్కించేవారు. ఆ తర్వాత పగ్ మార్క్ విధానం అమల్లోకి వచ్చింది. పులుల పాద ముద్రలనే వాటిని లెక్కించడానికి వాడేవారు. మనుషుల వేలిముద్రలన్నీ ఎలా ఒక్కలా ఉండవో పులుల పాద ముద్రలు కూడా ఒకేలా ఉండవు. అలా పాదముద్రల్ని బట్టి ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించేవారు. బటర్ పేపర్‌పై స్కెచ్‌పెన్‌తో పాద ముద్ర ఆకారాన్ని గీస్తారు. గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చేస్తారు. నేలపై ఉన్న ముద్రల మీద చాక్‌పౌడర్ చల్లి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని కలిపేవారు. ఆ మిశ్రమం గడ్డ కట్టి పులి పాదం అచ్చు లభించేది. ఆ పాద ముద్ర ఆధారంగా ఎన్ని పులులు తిరిగాయి, వాటి వయసు వంటివి తెలుసుకునేవారు. ఒక దశలో వన్యప్రాణుల గోళ్లు, మలం సేకరించి దాని ఆధారంగా కూడా గణన జరిగేది. కొన్నేళ్లు గడిచాక మరో కొత్త విధానాన్ని మొదలు పెట్టారు. పులులు చేతికి చిక్కినప్పుడు వాటిపై ప్రత్యేకమైన ముద్ర వేసేవారు. మళ్లీ వాటిని అడవుల్లో వదిలేసి ఆ తర్వాత లెక్కించే సమయంలో ముద్ర ఉందో లేదో చూసేవారు. ముద్ర లేని పులులు కనిపిస్తే కొత్తగా జాబితాలో వచ్చి చేరేవి. గత కొన్నేళ్ల నుంచి అత్యాధునిక కెమెరాలు వినియోగించి పులుల సంఖ్యని గణిస్తున్నారు. ఎక్కువగా పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అధికారులు చెప్పారు. అడవుల్లో ఇరువైపులా ఉన్న చెట్లకు కెమెరాలు ఫిక్స్ చేయడం వల్ల పులులతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే వన్యప్రాణుల గురించి కూడా తెలుస్తుంది. ఇక పులుల ఎత్తు, వాటి నడక, వాటి శరీరంపై ఉండే చారల ఆధారంగా సంఖ్యను తెలుసుకుంటారు. గిన్నిస్ రికార్డుల్లోకి పులుల గణన మన దేశంలో పులుల గణన రికార్డులు తిరగరాసింది. కెమెరాల సాయంతో భారీగా వన్యప్రాణుల గణన చేపట్టిన తొలి దేశంగా భారత్ గిన్నిస్ రికార్డులకెక్కింది. 2018–2019 పులుల గణన ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైనది. 141 ప్రదేశాల్లో 26,838 చోట్ల మోషన్ సెన్సర్లున్న కెమెరాలు అమర్చారు. ఈ ప్రక్రియలో 44 వేల మంది అధికారులు, జీవ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 20 రాష్ట్రాల్లో రహస్య కెమెరాలు, ఇతర పద్ధతుల్లో పులులతో పాటు ఇతర వన్యప్రాణుల్ని లెక్కించడం రికార్డు సృష్టించింది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మోదీ ప్రాజెక్టు టైగర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పర్యటించారు. పశి్చమ కనుమల్లో ఉన్న ఈ అభయారణ్యంలో ఓపెన్ జీపులో దాదాపుగా 20 కి.మీ. దూరం ప్రయాణించి ప్రకృతి అందాలను తిలకించారు. కాకీప్యాంట్, షర్టు, నెత్తిన టోపి ధరించిన ప్రధాని మోదీ బందిపూర్ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉదయం గడిపాను. భారత దేశ ప్రకృతి రమణీయతను, వన్యప్రాణుల్లో వైవిధ్యాన్ని ఆస్వాదించాను’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. బైనాక్యులర్స్ ద్వారా వన్యప్రాణుల్ని చూస్తూ, కెమెరాలో వాటిని బంధిస్తూ గడిపారు. గజరాజులతో ఆప్యాయంగా తర్వాత బందీపూర్ రిజర్వ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో మదుమలైలోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని మోదీ సందర్శించారు. ఏనుగులతో సరదాగా గడిపారు. ఇటీవల ఆస్కార్ అవార్డు పొందిన ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన మావటి దంపతులు బొమ్మన్, బెళ్లిలను సన్మానించారు. వారితో కలిసి ఏనుగులకు చెరుకులు తినిపించారు. వారిని ఢిల్లీకి ఆహా్వనించారు. బుక్లెట్ విడుదల.. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ కలసికట్టుగా ముందుకు వెళ్లడానికి భారత్ ప్రాధాన్యమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పులుల సంరక్షణ కోసం ఉద్దేశించిన టైగర్ ప్రాజెక్టుకు 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం మైసూరులోని కర్ణాటక స్టేట్ ఓపెన్ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియెన్స్’’ (ఐబీసీఏ) ప్రాజెక్టును ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్లలో పులుల సంరక్షణకు చేపట్టబోయే చర్యలతో ‘‘అమృత్ కాల్ కా టైగర్ విజన్’’ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రపంచదేశాలు చేపట్టాల్సిన అతి ముఖ్యమైన అంశమని చెప్పారు. దేశంలో పులుల తాజా గణాంకాలను ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. 2022 నాటికి దేశంలో పెద్ద పులుల సంఖ్య 3,167కు పెరగడం హర్షణీయమన్నారు. ‘‘పులుల సంరక్షణ ద్వారా భారత్ ప్రకృతి సమతుల్యత సాధించింది. ఇది ప్రపంచానికే గర్వకారణం. ఒకప్పుడు దేశంలో అంతరించిన జాబితాలో చేరిన చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చాం. వాటి సంతతిని విజయవంతంగా పెంచుతున్నాం’’ అని చెప్పారు. పులులు, సింహాలు, చిరుతపులులు, మంచు చిరుతలు, ప్యూమా, జాగ్వార్, చీతా వంటి వన్యప్రాణుల్ని సంరక్షించడానికే ఐబీసీఏ ప్రాజెక్టుకు తెర తీసినట్టు చెప్పారు. Some more glimpses from the Bandipur Tiger Reserve. pic.twitter.com/uL7Aujsx9t — Narendra Modi (@narendramodi) April 9, 2023 చదవండి: కాంగ్రెస్‌కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్ పైలట్ -
గజ గజా.. పులి పంజా
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా పులుల దాడుల్లో 163 మంది మృతి చెందారు. 2021లో 57 మంది మరణించగా 2022లో 105 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర అటవీ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 116 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఏనుగుల దాడుల్లో మూడేళ్లలో 1,581 మంది చనిపోయారు. అత్యధికంగా ఒడిశాలో 322 మంది, జార్ఖండ్‌లో 291 మంది, పశ్చిమ బెంగాల్లో 240 మంది గజరాజుల క్రోధాగ్నికి బలయ్యారు. 2018 గణాంకాల ప్రకారం దేశంలో పులులు సంఖ్య 2,967 కాగా 2017 అంచనాల ప్రకారం ఏనుగుల సంఖ్య 29,964 అని కేంద్ర అటవీ శాఖ తెలిపింది. ఏనుగుల సంచారాన్ని పర్యవేక్షించడంతోపాటు నీటి వనరుల సంరక్షణ, చెట్లు నాటడం, స్థానిక ప్రజలను హెచ్చరించడం లాంటి చర్యలను అటవీశాఖ చేపడుతోంది. ఏనుగుల ఆవాసాలను ‘ఎలిఫెంట్ రిజర్వ్’ ప్రాంతంగా ప్రకటించి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏనుగుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. -
అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరం
సాక్షి, హైదరాబాద్: అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరమని, గ్రీన్ ఇండియా చాలెంజ్ తరపున పులుల రక్షణకు మద్దతు తెలుపుతున్నట్లు అడవులు, పర్యావరణంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్రం 1973లో ప్రాజెక్టు టైగర్‌ను ప్రవేశ పెట్టింది. శనివారం (ఏప్రిల్ 1) ఈ సేవ్ టైగర్ ఉద్యమానికి యాభై ఏళ్లు నిండాయి. దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ టైగర్ కింద తీసుకున్న చర్యల వల్ల పులుల సంఖ్య పెరిగిందని సంతోష్ పేర్కొ న్నారు. 1973లో 1,827గా నమోదైన పులుల సంఖ్య 2022 నాటికి 2,967కు చేరగా.. టైగర్ రిజర్వుల సంఖ్య తొమ్మిది నుంచి 53కు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రాధాన్యాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సేవ్ టైగర్ ఉద్యమం గోల్డెన్ జూబ్లీ సందర్భంగా తెలంగాణకు చెందిన అమ్రాబాద్ టైగర్ రిజర్వు విడుదల చేసిన టైగర్ బుక్, టీషర్ట్, కాఫీ మగ్ సావనీర్లను సంతోష్ ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ద్వారా అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాన్ని బాగా నిర్వహిస్తోందని, పులుల సంఖ్య పెరుగుతోందన్నారు. పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగాన ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్, రాఘవ, శ్రీకాంత్ పాల్గొన్నారు. (చదవండి: ఇక తిరుపతికి ఎనిమిదిన్నర గంటల్లోనే.. వేగంగా వెళ్లేందుకే ఆ మార్గం ఎంపిక.. ) -
పులి.. ఈ పేరు వింటేనే అందరికీ హడల్...
పులి.. ఈ పేరు వింటేనే అందరికీ హడల్. ఇది వన్యమృగం.. అయినా సౌమ్యం వీటి సొంతం. అయితే నల్లమల పులి జీవనం వైవిధ్యం. పులులు సంఘజీవులు కావు. ఒంటరిగా బతికేందుకు ఇష్టపడతాయి. ఇతర జంతువులతో కలవడం చాలా అరుదు. ఇవి ఆహారం కోసం వన్యప్రాణులను వేటాడడం.. పిల్లల్ని కనడం.. వాటికి జీవన మెళకువలు నేర్పడం.. ఆ తర్వాత అరణ్యంలో బతికేందుకు వదిలేయడం అంతా విభిన్నంగా ఉంటుంది. సువిశాల విస్తీర్ణంలో నెలకొన్న ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్ట్)లో ఉంటే పులులతో పాటు ఇతర టైగర్ ఫారెస్ట్‌ల్లో ఉండే వాటికంటే చాలా సౌమ్యంగా ఉంటాయి. బఫర్ ఏరియాలను దాటి జనారణ్యంలోకి తరుచూ వచ్చినా మనుషులపై దాడులు చేసిన ఘటనలు అరుదు. ఇక్కడ ఉండే పులులు సాధువుగా ఉంటాయని అంటున్నారు వన్యప్రాణుల పరిశోధకులు. జీవ వైవిధ్యానికి నెలవుగా ఉండే నల్లమల అభయారణ్యం 3,700 చదరపు కిలో మీటర్ల మేర ఎన్ఎస్టీఆర్ విస్తరించి ఉంది. దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఇది. దీని చుట్టూ వందలాది గిరిజన గూడేలు ఉన్నాయి. ఇక్కడ నివశించే పులి నల్లమల రాజుగా పేరొందింది. అంతరించిపోతున్న వీటి సంరక్షణకు, వీటి సంతతిని పెంచేందుకు అటవీశాఖ అధికారులు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారికంగా 75 పులులు ఉన్నాయని గుర్తించినా అనధికారికంగా 100కు పైగా ఉన్నాయని అంచనా. ఈ ఏడాది కూడా పులుల గణన ప్రారంభమైంది. ఏప్రిల్ నెల చివరి వరకూ వివిధ దశల్లో వీటిని లెక్కింపు చేస్తారు. మృగమే కానీ.. సాధారణంగా అటవీ ప్రాంతానికి సమీప గిరిజన గూడేలకు మధ్య బఫర్ ఏరియా ఉంటుంది. వన్యప్రాణులు, మృగాలు జనావాసాల వైపు రాకుండా ఉండేలా ఒక అంచనా వేస్తూ బఫర్ ఏరియాలను నిర్ణయించారు. అయితే మనుగడ కోసం గిరిజన ప్రాంతాల్లోని వారు బఫర్ ఏరియాలను దాటి ముందుకు వచ్చేశారు. దీంతో తరుచూ వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. నల్లమల రాజుగా పేరొందిన పులులు ఇతర టైగర్ ఫారెస్టుల్లో ఉన్న పులులు కంటే చాలా సాధుగుణం కలిగి ఉంటాయి. తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న తడోబా టైగర్ ఫారెస్టులోని పులులు నిత్యం మనుషులపై దాడులు చేస్తుంటాయి. నెలకు ఒకరిద్దరిని పొట్టన పెట్టుకుంటుంటాయి. ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎన్‌ఎస్‌టీఆర్‌లో మాత్రం పులులు తరుచూ జనారణ్యంలోకి వచ్చినా మనుషులపై దాడులు చేయడం చాలా అరుదు. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే 0.001 శాతం మాత్రమే దాడి చేసి ఉంటాయని వన్యప్రాణి నిపుణులు అంటున్నారు. ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఒక పులి సంచరించేందుకు 30 నుంచి 40 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం ఉంటుంది. ఇతర వన్యప్రాణులను వేటాడుతూ.. లేదా నీళ్ల కోసం బఫర్ ఏరియాలను దాటి గూడేల వైపు ఇవి వస్తుంటాయి. గత నెలలో గిద్దలూరు అటవీ డివిజన్ పరిధి మాగుటూరు, లక్ష్మీపురం, వెలగలపాయ, శంకరాపురం, కాకర్ల తదితర గ్రామాల పరిధిలోనూ, మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలోని యర్రగొండపాళెం మండలం కొలుకుల గ్రామం పరిధిలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. వీటి దాడిలో ఎద్దులు సైతం మృతి చెందాయి. పులుల సంచారాన్ని గుర్తించేందుకు అధికారులు ట్రాప్ కెమెరాలు అమర్చారు. పెద్దపులి దాడి చేసిన ఎద్దు మృతదేహం వద్దకు వచ్చి కళేబరాన్ని తింటుండటం కెమెరాలో నిక్షిప్తమైంది. ఒక పులి తన పిల్లలతో వచ్చినట్టు కూడా గుర్తించినట్టు సమాచారం. పులుల సంతతి పెరిగేందుకు.. ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల సంతతి పెరిగేందుకు ఆగస్టు, సెపె్టంబర్ రెండు నెలల పాటు పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. ఆ సమయంలో పులులు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కలుగుతుంది. మగ పులి, ఆడపులి కలిసేందుకు అది అనుకూలమైన సమయంగా అధికారులు గుర్తించారు. పులులకు సూపర్ సెన్స్ ఉంటుంది. ఆడపులి రాకను మగపులి 30 కిలో మీటర్ల దూరం నుంచే గుర్తిస్తుంది. ఆడపులి ఒక చెట్టును బరకడం, మూత్ర విసర్జన చేస్తుంది. ఆ సమయంలో విడుదలైన రసాయనాల వాసనను మగపులి గుర్తిస్తుంది. ఆడ పులితో మేటింగ్ తర్వాత వారం రోజులు ఉండి మగ పులి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గర్భం దాల్చిన ఆడపులి 103 రోజుల తర్వాత పిల్లలకు జన్మనిస్తుంది. వాటిని ఇతర వన్యమృగాల బారిన పడకుండా అత్యంత రహస్య ప్రదేశంలో ఉంచి ఆహారానికి వెళుతుంది. అవి కళ్లు తెరిచే వరకు అత్యంత జాగ్రత్తగా ఉంటాయి. ఒక నెల తర్వాత వేటాడడం నేర్పుతోంది. ఇలా 18 నెలల పాటు వాటికి అన్ని రకాల మెళకువలు నేర్పి వదిలేస్తోంది. అలా తల్లి నుంచి వేరైన పులులు సొంతంగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. పిల్లలు తనతో ఉన్నంత వరకు మగపులిని మేటింగ్‌కు ఆహ్వానించదు. అవి పిల్లలతో ఆహారం నిమిత్తం పొరపాటున జనారణ్యంలోకి వచ్చిన సమయంలో పులి కూనలను మనుషులు తాకితే ఇక వాటిని తల్లి పులి దగ్గరకు రానివ్వదు. ఇటీవల నంద్యాల జిల్లాలో పిల్లలతో కలిసి జనారణ్యంలోకి పులి వచ్చింది. నాలుగు కూనలు ఆరు బయట ఉండడంతో వాటిని స్థానికులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు వివరాలు అందించారు. ఈ సమయంలో వాటిని మనుషులు ముట్టుకోవడంతో వాటి కోసం తల్లి పులి రాలేదని తెలుస్తోంది. పులుల సంరక్షణకు.. నల్లమల అభయారణ్యంలో నాలుగు డివిజన్లు, 16 నుంచి 20 రేంజ్‌లు ఉన్నాయి. అటవీ సమీపంలో ఉండే చెంచులకు అభయారణ్యంలోని జంతువుల గురించి పూర్తిగా తెలుసు. పెద్ద పులి ఎక్కడ ఉంది.. అది ఏం చేస్తుందనేది దూరం నుంచే పసిగడతారు. మనకంటే వారికే ఎక్కువగా తెలుసు. కొన్ని సందర్భాల్లో అటవీశాఖ సిబ్బందినే గైడ్ చేస్తారు. అందుకే వారిని ప్రొటెక్షన్ వాచర్లుగా, స్ట్రైక్ ఫోర్సులుగా నియమించారు. మొత్తం 600 మందికి ఉద్యోగాలు ఇచ్చి రక్షణగా నియమించారు. వేసవిలో వన్యప్రాణులకు నీటిఎద్దడి లేకుండా అవసరమైన చోట్ల సాసర్పిట్లు ఏర్పాటు చేసి వాటిని ఎప్పటికప్పుడు నీటితో నింపుతున్నారు. పులుల గణన ప్రారంభం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పులుల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఉండే పులులు శేషాచలం అడవులకు వెళ్లి వస్తున్నాయని అధికారులు గుర్తించారు. వివిధ దశల్లో 80 రోజుల పాటు డేటాను సేకరిస్తారు. ఫిబ్రవరి 20 నుంచి 20 రోజుల పాటు నంద్యాల, పోరుమామిళ్ల, లంకలమల, శేషాచలం కారిడార్‌లో వివరాలు సేకరించారు. మార్చి 11 తర్వాత మిగతా ఏరియాలో కెమెరాలను బిగించి మరో 20 రోజుల పాటు మార్చి 31 వరకు డేటాను సేకరిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 20 వరకు ఆత్మకూరు, మార్కాపురం డివిజన్లో ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకూ డేటాలను సేకరిస్తారు. వీటి ఆధారంగా పులుల సంఖ్యను లెక్కిస్తారు. పక్కాగా గణన పులుల గణన పక్కాగా సేకరిస్తున్నాం. ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రొటెక్షన్ వాచర్లను నియమించాం. వేసవిలో వాటికి నీటి అవసరాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 120 సాసర్ పిట్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఉంచాం. – మహ్మద్ హయత్, ఎఫ్ఆర్ఓ, బయోడైవర్శిటీ కేంద్రం, శ్రీశైలం -
పులులకు ‘ఎండదెబ్బ’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న పులుల మరణాలు కలవర పరుస్తున్నాయి. ఈ ఏడాది రెండు నెలల్లోనే 34 పులులు మరణించాయి. ముఖ్యంగా ఎండాకాలం వాటి పాలిట మృత్యువుగా మారుతోంది. గత పదేళ్ల గణాకాలు కూడా అదే చెబుతున్నాయి. మార్చి నుంచి మే చివరి వరకు పులుల మరణాల సంఖ్య భారీగా ఉంటోంది. దాంతో ఈ వేసవిలో పులుల సంరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. 2012–2022 మధ్య పదేళ్లలో దేశవ్యాప్తంగా 1,062 పులులు మరణించినట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 270, మహారాష్ట్రలో 184, కర్ణాటకలో 150 పులులు మరణించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో తొమ్మిది పులులు మృత్యువాత పడ్డాయి. 2020లో 106, 2021లో 127, 2022లో 121 పులులు మరణించాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లోనే 34 ప్రాణాలు కోల్పోవడం విషాదం. వీటిలో మధ్యప్రదేశ్‌లో 9, మహారాష్ట్రలో 8 మరణాలు సంభవించాయి. గడిచిన పదేళ్ల రికార్డులు చూస్తే మార్చిలో 123, ఏప్రిల్‌లో 112, మేలో 113 మరణాలు నమోదయ్యాయి. అంటే పదేళ్లలో వేసవిలో ఏకంగా 348 పులులు చనిపోయాయి! తస్మాత్ జాగ్రత్త ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటొచ్చన్న అంచనాల నేపథ్యంలో పులుల సంరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాత్రిళ్లు అభయారణ్యాల్లో సఫారీలను ఆపేయండి. అక్రమ నిర్మాణాలపై నిఘా పెంచండి’’ అని పేర్కొంది. వేసవిలో పులుల మరణాలకు ఇవీ కారణాలు... ► ఎండాకాలంలో నీరు, ఆహారం కోసం తమ ఆవాసాలను దాటి దూరంగా రావడం ► అభయారణ్యాలనుంచి బయటకు వచ్చేయడం ► ఆహారం కోసం పులుల మధ్య పోరాటాలు ► అడవుల్లో పచ్చదనం తగ్గడం, బఫర్ జోన్లు లేకపోవడం ► అటవీ భూముల నరికివేత, సమీప ప్రజల్లో అడవి జంతువులపై అసహనం, భయంతో కొట్టి చంపడం -
రోడ్డుపై నాలుగు పులులు
తాంసి: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ శివారులో పంట చేలకు వెళ్లే రహదారిపై నాలుగు పులులు సంచరిస్తూ కనిపించాయి. గ్రామం సమీపంలో పిప్పల్‌కోటి రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కోసం భీంపూర్ మండలంలోని మార్కగూడ, రాంపూర్ గ్రామాల నుంచి మట్టిని టిప్పర్లలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి డ్రైవర్ సాజిద్ టిప్పర్‌లో మట్టిని తీసుకొచ్చే క్రమంలో గ్రామానికి సమీపంలో ఉన్న మట్టి రోడ్డుపై నాలుగు పులులు కనిపించాయి. వెంటనే వాహనం నిలిపివేసి వాటిని వీడియో తీశాడు. ఈ సందర్భంగా అలికిడి కావడంతో అవి పంట చేల వైపు వెళ్లాయి. పులుల సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాబ్‌సింగ్, సెక్షన్ అధికారి అహ్మద్‌ఖాన్ పులులు సంచరించిన ప్రదేశాలను పరిశీలించి వాటి పాదముద్రల ఆనవాళ్లను గుర్తించారు. రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పిల్లలతో సంచరించిన పులి మళ్లీ వచ్చినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పులుల సంచారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
కొమురంభీమ్ జిల్లాలో ఎనిమిది పులుల సంచారం
-
అమ్మో పులి...! భయంతో వణికిపోతున్న ఆ ప్రాంత ప్రజలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో మళ్లీ చిరుత పులుల అజలడి పెరిగింది. ఆహారం, నీటి కోసం వాటి ఆవాస ప్రాంతాల నుంచి మరో చోటికి సంచరిస్తున్నాయి. అడవులు, గుట్టలను వదిలి జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. గడిచిన కొన్ని రోజుల్లో జిల్లాలోని పలు రేంజ్‌ల పరిధిలో చిరుతలు జనం కంట పడ్డాయి. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పశువులు, మేకలు మేపడానికి వెళ్లే కాపరులకు సైతం భయం పట్టుకుంది. రెండు రోజుల క్రితం నవీపేట్ మండలం అబ్బాపూర్ గుట్టల్లో చిరుత కదలికలు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పాదముద్రలను చూసి చిరుతగా నిర్ధారించారు. ఇదే రేంజ్ పరిధిలోని మోకన్‌పల్లి శివారులో ఐదారు నెలల క్రితం కూడా చిరుతపులి కుక్కను వేటాడింది. అదే విధంగా కొన్ని రోజుల కిందట నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం అటవీ ప్రాంతంలో సైతం చిరుత కలకలం రేపింది. రోడ్డు దాటుతుండగా వాహనదారులు చూసి వణికిపోయారు. జిల్లాలో అటవీ శాఖ పరిధిలో నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్, వర్ని, ఆర్మూర్, కమ్మర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ కలిపి మొత్తం ఏడు రేంజ్‌లు ఉన్నాయి. జిల్లా అటవీ విస్తీర్ణం 2,14,659 ఎకరాల్లో(20.86శాతం)ఉండగా, అత్యధికంగా ఒక్క మోపాల్ మండలంలోనే 29,101 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. దీని తర్వాత ఇందల్వాయి, కమ్మర్పల్లి, సిరికొండ, నిజామాబాద్ నార్త్ రేంజ్‌ల పరిధిలో అడవులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల్లోనే చిరుత పులులు ఎక్కువగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 చిరుతలు ఉన్నట్లు ఫారెస్టు శాఖ గుర్తించినప్పటికీ, వీటిసంఖ్య ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం పెరిగి మేకలు, గొర్రెల మందలపై దాడులు చేస్తున్న క్రమంలో నిజామాబాద్ అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. కామారెడ్డి అడవుల నుంచి మన జిల్లాలోని వర్ని రేంజ్ పరిధిలోకి చిరుతలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుట్టలు గుల్ల చేయడంతో.. జిల్లాలో సంచారం పెరడానికి గల కారణాలు ఆహారం, నీరే కాకుండా అవి ఏర్పర్చుకున్న ఆవాస ప్రాంతాల్లోని అడవులను ధ్వంసం చేయడం కూడా కారణం అవుతున్నాయి. మొరం తవ్వకాలు, వ్యవసాయం కోసం నేలను చదును చేసే పనులు చేపట్టి గుట్టలు, అడవులను కొల్లగొడుతున్నారు. తద్వారా శబ్దాలకు చిరుతలు, ఇతర వన్య ప్రాణులు సైతం జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చిరుతలు మనుషులు, గొర్రెలు, మేకలపై దాడులు చేస్తున్నాయి. అడవుల్లో ఆహారం, నీరు దొరక్కపోవడంతో కూడా గ్రామాల శివారు ప్రాంతాల్లో వచ్చి కుక్కలు, మేకలను వేటాడుతున్నాయి. గుట్టలు, అడవులకు నిప్పు పెట్టడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. అయితే, అటవీ అధికారులు ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా చిరుతలు అక్కడక్కడా కంటపడుతూనే ఉన్నాయి. ఎక్కడైనా చిరుత పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే అడవులు, గుట్టల వెంట తిరిగే పశువులు, మేకల కాపారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలి జిల్లాలో పలు రేంజ్‌ల పరిధిలో చిరుత పులుల సంచారం పెరిగింది. ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడానికి రోడ్లను దాటుతున్నాయి. కామారెడ్డి జిల్లా పక్కనే ఉండడంతో అక్కడి ఫారెస్టు నుంచి కూడా జిల్లా అడవుల్లోకి వస్తున్నాయి. ప్రజలకు చిరుతలు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలి. చిరుతల కదలికలు ఉన్నచోట ఫారెస్టు అధికారులను, సిబ్బందిని ఇప్పటికే అలర్ట్ చేశాం. – వికాస్ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి -
ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోన్న చిరుత పులులు
-
మళ్లీ అలజడి.. ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కదలికలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కదలికలు మళ్లీ అలజడి రేపుతున్నాయి. ఇటీవల ఐదారు పులుల సంచారం పెరగడంతో సరిహద్దు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆసిఫాబాద్ అటవీ ప్రాంతంలోని ఓ పత్తిచేనులో పులి ఒకరిని చంపి కిలోమీటర్ దాకా ఈడ్చుకెళ్లిన ఉదంతంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అదీగాక తరచుగా జనావాసాలకు దగ్గరగా పులి కదులుతూ లేదా రోడ్డు దాటుతూ కనిపిస్తుండటంతో ఇక్కడి వారిలో భయం మరింత పెరిగింది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్‌ల నుంచి ఆదిలాబాద్ అడవి పరిధిలోకి ఒక పెద్దపులి, ఏడాదిన్నర వయసున్న మూడు పులిపిల్లలు, వాంఖిడి నుంచి ఆసిఫాబాద్ అటవీ ప్రాంతంలోకి మ రో మగ పులి కొత్తగా ప్రవేశించాయి. కొత్త పులులతోనే సమస్య వాంఖిడి నుంచి వచి్చన పులి కాగజ్‌నగర్ అడవిలో స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు యతి్నంచింది. అయితే ఇప్పటికే అక్కడ స్థిరపడిన మరో మగపులి దానిని తరిమేసిందని అటవీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ పులి కాగజ్‌నగర్ అడవి నుంచి బయటకు వచ్చాక ఆసిఫాబాద్‌లో ఒకరిపై దాడి చేసింది. ఆ తర్వాత అది ఈద్గామ్ గ్రామం నుంచి ప్రస్తుతం బెజ్జూర్ మండలంలోని మారేపల్లి, కాటేపల్లి గ్రామాలకు సమీపంలో సంచరిస్తుండటం సమస్యగా మారింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న పులులతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. మహారాష్ట్ర నుంచి పులుల రాకపోకలు పెరగడంతో ఈ సమస్య తీవ్రమైంది. ఏటా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా సరిహద్దుల నుంచి తెలంగాణలోకి పులులు రాకపోకలు సాగిస్తుండటం మామూలేనని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఒకేసారి రెండు, మూడు ప్రాంతాల్లో ఐదారు పులులు సంచరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువైందని అంటున్నారు. అయితే, ప్రజలు భయపడకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెప్పారు. గ్రామస్తులను అప్రమత్తం చేశాం ఆసిఫాబాద్ చుట్టుపక్కల తిరుగాడుతున్న పులిని ట్రాక్చేసేందుకు బెజ్జూరు నుంచి రెండు, కార్జోలి నుంచి రెండు బృందాలను పెట్టాం. ఈ పులి జనావాసాలు, పొలాలకు దగ్గరగా వస్తున్నపుడు ప్రజలను అలర్ట్ చేస్తున్నాం. ఆ పులి కూడా పూర్తిగా అడవిలోకి వెళ్లేందుకే ప్రయతి్నస్తోంది. రెవెన్యూ ప్రాంతాల్లో పులి బోన్లు పెట్టడంతోపాటు ప్రత్యేక వెటర్నరీ బృందాన్ని కూడా సిద్ధం చేశాం. ఒకట్రెండు రోజుల్లో అది బోనులో చిక్కడమో లేదా దానిని మత్తుమందిచ్చి అడవిలోకి పంపడమో జరుగుతుంది. ఇప్పటికైతే ఎలాంటి సమస్య లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత బయట తిరగొద్దని, ఉదయం 10 గంటల తర్వాతనే పొలాల్లోకి వెళ్లాలని ప్రజలకు చెప్పాం. మారెడు, మార్కిడి, కాటేపల్లి గ్రామస్తులను అప్రమత్తం చేశాం. –దినేష్, ఆసిఫాబాద్ డీఎఫ్‌వో 40 కెమెరా ట్రాప్‌లు పెట్టాం కొత్తగా వచి్చన పులులు తిప్పేశ్వర్ నుంచి వచి్చనట్లు గుర్తించాం. సరిహద్దుల నుంచి ఆదిలాబాద్‌లోకి ప్రవేశించిన ఈ పులుల ట్రాకింగ్‌కు రెండు బేస్‌క్యాంప్‌లు, ట్రాకర్స్ ఏర్పాటుచేశాం. 40 కెమెరా ట్రాప్లను పెట్టి పర్యవేక్షిస్తున్నాం. ఎన్జీవోల సాయం కూడా తీసుకుంటున్నాం. ఈ పులులు తిప్పేశ్వర్ వైపు మళ్లీ మనవైపు అటూ ఇటూ తిరుగాడుతున్నాయి. టాస్క్‌ఫోర్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా రాత్రిళ్లూ పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పొలాలకు గుంపులుగా వెళ్లాలని సూచించాం. ఉదయం పూట పొదలు, తుప్పల్లోకి బహిర్భూమికి వెళ్లొద్దని చెప్పాం. సాయంత్రం 4 గంటలకే పొలాల నుంచి తిరిగి వచ్చేయాలని చెబుతున్నాం. –రాజశేఖర్, ఆదిలాబాద్ డీఎఫ్‌వో చదవండి: తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు -
తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు
సాక్షి ప్రతినిధి మంచిర్యాల: పెద్దపులులు తోడు కోసం ఆరాటపడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి అడుగు పెడుతున్నాయి. అక్కడ తిండి, గూడు, తోడు దొరక్క ఇటువైపు వస్తున్నాయి. శీతాకాలంలో మరింత ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఏటా నవంబర్‌లో ఆదిలాబాద్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తున్నాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే మాసంలో ఏ2 అనే మగపులి మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో సంచరించింది. కవ్వాల్ నుంచి కాగజ్‌నగర్ వరకు తిరిగింది. రెండుచోట్లా ఆవాసం, తోడు కోసం ఆధిపత్య పోరు జరిపింది. చివరకు ఓపెన్ కాస్టులు, పత్తి చేలలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరిపై దాడి చేసి చంపేసింది. తాజాగా మూడున్నర ఏళ్లున్న మరో మగపులి ఈ నెల 15న ఒకరిపై దాడి చేసింది. ఈ పులి ఆవాసం, తోడు కోసం సంచరిస్తోంది. తన ప్రయాణంలో ఎక్కడా స్థిరపడకుండా రోజుకు కనీసం పది కిలోమీటర్లకు పైగా తిరుగుతోంది. నిలకడ లేని పులులు దాడులు చేసే అవకాశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ నుంచి జనవరి వరకు.. పులులు ఏడాది పొడవునా జత కట్టగలవు. అయితే చలి గుప్పే మాసాలైన నవంబర్ నుంచి జనవరి వరకు ఎక్కువగా ఇష్టపడతాయి. మగవి ఆడపులులను వెతుక్కుంటాయి. ఆడ పులి 10 నుంచి 30కి.మీ. పరిధిలోనే ఉండిపోతే మగపులి 100 నుంచి 150కి.మీ. తిరగగలదు. ఒక్కో మగపులి రెండు, మూడు ఆడపులులతో సహవాసం చేయగలదు. అయితే కొత్తగా వచ్చే మగపులులకు అప్పటికే అక్కడున్న పులుల మధ్య తోడు కోసం ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు వాటిని ఆ ప్రాంతం నుంచి తరిమేస్తే మరో ప్రాంతానికి వెళ్తుంటాయి. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర, తెలంగాణలో మొత్తం 3వేల కి.మీ. తిరిగి ’వాకర్’ అనే మగపులి రికార్డు సృష్టించింది. పులి మెడకు అక్కడి అధికారులు రేడియో కాలర్ అమర్చడంతో తోడు కోసమే తిరిగినట్లు గుర్తించారు. అప్పట్లో మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో జే1 మగపులికి కవ్వాల్ కోర్ ప్రాంతంలో ఆవాసం, రక్షణకు ఇబ్బంది లేదు. అడవి దాటి ఉమ్మడి ఆదిలాబాద్ అడవులు అనేక పులులకు అవాసం ఇవ్వగలవు. అయితే పులులకు ఎలాంటి అలజడి లేని అన్ని రకాల అనుకూలమైన ఆవాసాలు ఉంటేనే కొన్నాళ్లు ఉంటాయి. కాగజ్‌నగర్ డివిజన్లో ‘సూపర్ మామ్’గా పిలిచే పాల్గుణ రెండు దశల్లో 9 పిల్లల్ని, మళ్లీ వాటి పిల్లలు(కే1 నుంచి కే9) కూడా జన్మనిచ్చాయి. ఇవేకాకుండా ‘ఎస్’ సిరీస్ పులులు ఇక్కడే జత కట్టాయి. ఇవి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాయి. రెండు నెలల క్రితం మహారాష్ట్ర నుంచి ‘పీ1’ అనే మగపులి కాగజ్‌నగర్ డివిజన్లోని ‘కే8’తో జతకట్టింది. ఇది ఏడాదిన్నర క్రితమే తన మూడు పిల్లల నుంచి విడిపోయింది. ఇక ‘ఎస్6’ రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అటవీ శాఖ అధికారులు కొత్త పులి ఉందని సమాచారం రాగానే కెమెరాలు అమర్చి వాటి కదలికలు పర్యవేక్షిస్తుంటారు. పశువుల వేట, ప్రవర్తన, ఆ పులికి తోడు ఉందా లేదా తెలుసుకుంటూ రిజర్వు ఫారెస్టులో స్థిరపడేలా చేయాలి. అయితే కవ్వాల్ కోర్ ప్రాంతంలో పులుల జీవనం సాగితే అటు అటవీ అధికారులకు, ఇటు స్థానికులకు సమస్యలు ఉండకపోయేవి. కానీ కోర్ ఆవల బఫర్ జోన్లో ఇంకా చెప్పాలంటే పులుల కారిడార్‌గా పిలిచే ప్రాంతాల్లో సంచరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కారిడార్‌లో పత్తి చేలు ఉన్నాయి. చదవండి: హస్తంలో అన్ని వేళ్లు ఒకేలా ఉంటాయా.. కాంగ్రెస్‌లో కూడా అంతే సుమీ.. -
జంతువులు అడవికే పరిమితం!
సాక్షి, అమరావతి: ఏనుగులు, పులులు వంటి జంతువులు జనావాసాలు, పొలాల వద్దకు వచ్చి బీభత్సం సృష్టించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. జంతువులను అడవికే పరిమితం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మనుషులు, జంతువులకు మధ్య సంఘర్షణను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఒడిశా, తమిళనాడు అటవీ శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలని కూడా నిర్ణయించింది. ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన అటవీ శాఖాధికారుల సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఎనిమిదేళ్లలో 38 మంది మృత్యువాత ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇటీవల రెండు పులులు దారి తప్పి తూర్పుగోదావరి, అనకాపల్లి ప్రాంతాల్లోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి, పొలాల్లోకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎలుగుబంట్లు, అడవి పందులు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జంతువులు, మనుషులకు మధ్య సంఘర్షణలో 2014 నుంచి ఇప్పటివరకు 38 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలపై 15,198 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో మృతి చెందిన, గాయపడిన కుటుంబాలు, పంట, ఇతర నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లకుపైగా పరిహారం చెల్లించింది. పటిష్ట భద్రత ఏర్పాట్లు.. అవగాహన కార్యక్రమాలు.. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఏనుగులు ఎక్కువగా ఆవాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకు ఏనుగులు వచ్చే మార్గాల్లో కందకాలు తవ్వడం (ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్‌లు), ఆర్సీసీ పిల్లర్లతో స్ట్రీమ్ బారికేడ్లు, రోడ్లపైకి వచ్చే మార్గాల్లో గేట్లు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో 24గంటలు తిరుగుతూ వాటిని గ్రామాల్లోకి రాకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను, ఎలిఫెంట్ ట్రాకర్లను నియమించనున్నారు. అదేవిధంగా ఏనుగులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు మిరపకాయ పొగ వేయడం, ఆముదం స్ప్రే చేయడం, తేనెటీగల సౌండ్ చేయడం ద్వారా వాటిని తిరిగి అడవి వైపు మళ్లించే అంశాలపై స్థానికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏనుగులు బయటకు రాకుండా అడవుల్లోనే వాటి కోసం నీటి గుంటలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్రలో ఎలిఫెంట్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల అధికారులతో సమన్వయం పెంచుకుని ఏనుగుల కదలికలపై సమాచారాన్ని వేగంగా మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. పులులను ట్రాప్ చేసేలా... తమ ఆవాసాల్లోకి వేరే పులులు రావడంతో అక్కడక్కడా పులులు దారి తప్పి అడవి నుంచి బయటకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలా బయటకొచ్చిన పులులు ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చి ఆవులు, మేకలు వంటి జంతువులను చంపుతున్నాయి. ఇలాంటి ఘటనల నివారణ కోసం వాటిని ట్రాప్ చేసే కేజ్‌లు సమకూర్చుకోవడంతోపాటు కెమెరాల ట్రాప్లను పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. పొలాల్లోకి వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి. అవి అడవి దాటి రాకుండా చర్యలు చేపడుతున్నారు. -
లారీ డ్రైవర్ కు కనిపించిన పులుల గుంపు..
-
పెన్ గంగ కాలువ వద్ద పులుల సంచారం.. టెన్షన్లో గ్రామస్తులు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగ కాలువలో పెద్ద పులులు సంచరించడం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జైనత్ మండలంలోని గూడ గ్రామ శివారులో ఉన్న పెన్‌గంగ కాలువలో మంగళవారం ఉదయం రెండు పెద్ద పులులు కనిపించాయి. కాలువ మధ్యలో పెద్ద పులులు నడుచుకుంటూ వెళ్లడం స్థానికులు గమనించారు. ఈ సందర్భంగా కొందరు యువకులు పులులు తిరుగుతుండటాన్ని తమ సెల్ఫోన్లతో వీడియో తీశారు. అయితే, ఈ పులులు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ సంక్చూరీ నుంచి వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. పులుల సంచారంపై ప్రాజెక్టు ఇంజనీర్లు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి సంచారం నేపథ్యంలో చుట్టపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు వారిని అప్రమత్తం చేశారు. కాగా, ఇటీవలి కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం పెరిగింది. పలుచోట్ల పశువులపై దాడి చేసిన ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి. -
Telangana: మళ్లీ గర్జిస్తున్న రాయల్ బెంగాల్ టైగర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పులుల అభయారణ్యాలు, టైగర్ కారిడార్లలో పెద్దపులులు సందడి చేస్తున్నాయి. కెమెరా ట్రాప్‌లు, అటవీ సిబ్బంది, అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలకు ‘సైటింగ్స్’ద్వారా వీటి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు స్పష్టమౌతోంది. దేశవ్యాప్తంగా పులుల పెరుగుదలకు సంబంధించి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) ప్రతీ నాలుగేళ్లకోసారి (2006 నుంచి) టైగర్ సెన్సస్ నిర్వహించి, సంఖ్యను ప్రకటిస్తోంది. అయితే వేటగాళ్లు, స్మగ్లర్ల నుంచి వాటిని కాపాడేందుకు ఈ ప్రాంతంలో ఇన్ని పులులున్నాయని, వాటి ఆనుపానులు ఇవని కచ్చితమైన సమాచారాన్ని నివేదికల్లో పేర్కొనరు. వాటిని ఇతరులు ట్రాక్ చేయకుండా వీటికి సాంకేతిక పేర్లు మాత్రమే పెట్టి జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ఏడాది ఆఖరులో సెన్సస్.. 2018లో నిర్వహించిన ‘టైగర్ సెన్సస్’లో తెలంగాణలో 26 పులులున్నట్టు వెల్లడైంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్)లో 14, కవ్వాల్ టైగర్ రిజర్వ్(కేటీఆర్)లో 12 ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఏడాది ఆఖరుకల్లా విడుదలయ్యే 2022 సెన్సస్‌లో ఈ రెండు రిజర్వ్‌లతో పాటు టైగర్ కారిడార్లలో వాటి సంఖ్య 30 లేదా 32 దాకా పెరిగి ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2014లో 68 పులులున్నాయి. అందులో తెలంగాణలో 20 (ఏటీఆర్‌లో 17, కేటీఆర్‌లో 3) ఉన్నట్టు అంచనా వేశారు. ప్రస్తుతం అమ్రాబాద్‌లో 23 లేదా 24 పులులు, కవ్వాల్ రిజర్వ్‌తోపాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, ఇతర టైగర్ కారిడార్ ఏరియాలలో కలిపి 7 లేదా 8 పులులు ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ఏటీఆర్‌లో పులులపై స్పష్టత.. ఏటీఆర్ పరిధిలో కెమెరా ట్రాప్‌లు, అడవుల్లో సైటింగ్లు, టైగర్ సఫారీల్లో కనిపిస్తుండటంతో పులుల వృద్ధిపై స్పష్టమైన అంచనా వేయడానికి వీలవుతోంది. ఇక్కడ 21 పులులున్నట్టు అధికారులు గుర్తించారు. దొరికిన ఆనవాళ్ల ఆధారంగా 23 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కేటీఆర్.. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో, అక్కడి నుంచి పులుల రాకపోకలు ఎక్కువ. అందువల్ల పులులు స్థిరంగా కనిపించడం, కెమెరా ట్రాప్‌లకు చిక్కడం తక్కువే. దీంతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్న పులుల సంఖ్యపై స్పష్టత రావడం లేదు. మహారాష్ట్ర నుంచి సాగే ఈ సుదీర్ఘ టైగర్ కారిడార్‌లో కదలికను బట్టి 7 లేదా 8 పులులు స్థిరనివాసం ఏర్పరుచుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద అభయారణ్యాలు.. దేశవ్యాప్తంగా 54 పులుల అభయారణ్యాలున్నాయి. 2వేల చ.కి.మీ. పైబడి అటవీ వైశాల్యమున్న అభయారణ్యాలు ఐదు ఉండగా, ఏపీ, తెలంగాణల్లోనే 3 ఉన్నాయి. ఏపీలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) 3,728 చ.కి.మీలలో విస్తరించింది. తెలంగాణలోని ఏటీఆర్ 2,611 చ.కి.మీ.లుగా విస్తరించగా, కేటీఆర్ విస్తీర్ణం 2,016 చ.కి.మీ.లో ఉంది. రాష్ట్రంలో నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లున్నాయి. -
ఎవరీ వేటగాడు! 24 క్రూరమృగాలను వేటాడిన చరిత్ర
సాక్షి, హైదరాబాద్: బీహార్‌లో వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్) ఫారెస్ట్‌లో మ్యానీటర్‌గా మారి, 10 మందిని పొట్టన పెట్టుకున్న రాయల్ బెంగాల్ టైగర్ శనివారం హతమైంది. ఈ ఆపరేషన్‌లో బీహార్‌కు చెందిన పోలీసు కమాండోలతో పాటు నగరంలోని రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన నవాబ్ షఫత్ అలీ ఖాన్ సైతం కీలక పాత్ర పోషించారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు అటవీ శాఖ సలహాదారుడిగా ఉన్న ఆయన ఇప్పటి వరకు 24 మ్యానీటర్లు, మదపుటేనుగుల్ని మట్టుపెట్టారు. కొన్ని మ్యానీటర్లకు సంబంధించిన ఆపరేషన్స్‌లో షఫత్ కుమారుడు అస్ఘర్ అలీ ఖాన్ సైతం కీలకంగా వ్యవహరించారు. నవాబ్ షఫత్ అలీ ఖాన్ చిన్నప్పటి నుంచి తుపాకులు, గుర్రాల మధ్య పెరిగారు. ఆయన తాత బహదూర్ బ్రిటిష్–ఇండియాకు ఫారెస్ట్ అడ్వయిజర్‌గా వ్యవహరించారు. బ్రిటీష్ హయాంలో ఏనుగులతో ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో బహదూర్ 50 ఏనుగులు, 10 మానీటర్లను మట్టుపెట్టారు. 1976లో 19 ఏళ్ల వయస్సున్న అలీ ఖాన్ తొలి ‘తూటా’ పేల్చారు. కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని హెచ్డీ కోటలో 19 మందిని పొట్టనపెట్టుకున్న ఏనుగును హతమార్చారు. అలా మొదలైన ‘వేట’ ఇప్పటికీ కొనసాగుతోంది. షఫత్ అలీ ఖాన్ బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలకు అటవీ విభాగం అడ్వయిజర్‌గా పని వ్యవహరించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకు కొనసాగుతున్నారు. ఆయా రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులకు శిక్షణ ఇచ్చి వస్తుంటారు. మ్యాన్–మానిమల్ కన్ఫ్లిక్ట్, తుపాకీ వినియోగాల్లో తరీ్ఫదు ఇవ్వడంతో ఈయనకు ప్రత్యేకత ఉంది. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి, మ్యానీటర్లు–మదపుటేనుగుల్ని మట్టుపెట్టే అలీ ఖాన్ పలుమార్లు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఈ వేటగాడిలో జంతు ప్రేమికుడు దాగి ఉన్నాడు. అంతరించిపోతున్న పులుల సంతతిపై ‘ప్రాజెక్ట్ టు సేవ్ ది టైగర్’ పేరుతో అధ్యయనం చేస్తున్నారు. ‘ఆడపులి కేవలం 111 రోజులకే కాన్పు చేస్తుంది. ఒక కాన్పులో కనీసం 3 నుంచి 4 పిల్లలు పుడతాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా 1970ల్లో 20 వేలున్న పులుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. అందుకే దీనిపై అధ్యయనం చేస్తున్నా’ అన్నారాయన. పులులు అంతరించిపోకుండా కొన్ని పరిష్కారాలనూ చూపుతూ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు షఫత్ అలీ ఖాన్ చేసిన ‘వేట’ల సంఖ్య 24కు చేరింది. వీటిలో 17 మ్యానీటర్లే కావడం గమనార్హం. 1976 నుంచి ‘వేటాడుతున్న’ ఈయన గతంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న ఏడు ఏనుగు లు, ఐదు పులులు, 14 చిరుతల్ని హతమార్చారు. (చదవండి: కాశీ యాత్రకు ‘రైలు’ కష్టాలు!) -
నల్లమలలో పెరిగిన పులులు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 21
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోర్ ఏరియా విస్తీర్ణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో ఇప్పటివరకు 21 పులులు కెమెరాకు చిక్కాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎనీ్టసీఏ) నాలుగేళ్లకు ఒకసారి పులుల గణన చేపడుతుంది. 2018లో విడుదల చేసిన నివేదికలో అమ్రాబాద్ రిజర్వ్‌లో 12 పులులు ఉండగా, గతేడాది నాటికి వాటి సంఖ్య 16కి పెరిగింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో 21 పులులు చిక్కాయి. పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పెరుగుతున్న ఆడ పులులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మొత్తం విస్తీర్ణం 2,611.39 చ.కి.మీ. కాగా, ఇందులో కోర్ ఏరియా 2,166.37 చ.కి.మీ. కోర్ ఏరియాపరంగా ఏటీఆర్ దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇక్కడ సుమారు 200 వరకు పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పులులు రెండున్నర ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అమ్రాబాద్ రిజర్వ్‌లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడ పులుల సంఖ్య పెరిగిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఆడపులులు ఏడు ఉండగా, మరో ఆరు పులి పిల్లలు ఉన్నాయి. ప్రజల మద్దతుతో... ఎనీ్టసీఏ మార్గదర్శకాల ప్రకారం పులుల సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. పులుల వేటను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంతోపాటు స్థానిక ప్రజల్లో పులుల ఆవశ్యకతపై క్షేత్రస్థాయిలో అవగాహన కలి్పస్తోంది. తద్వారా పులుల సంరక్షణ కోసం స్థానిక ప్రజల మద్దతు పొందుతోంది. పులులకు ఆహారమయ్యే వన్యప్రాణుల సంతతి పెంచేందుకు ప్రత్యేకంగా 300 ఎకరాల్లో గడ్డిని పెంచుతున్నారు. నల్లమలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరప్రాంతాల్లో పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆడ పులులు, పిల్లల సంరక్షణ కోసం కృష్ణానది దాటి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కృష్ణాతీరంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే వారితో పులులకు ముప్పు పొంచి ఉండటంతో అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాయింట్ రివర్ పెట్రోలింగ్ ద్వారా సుమారు 30 కి.మీ. పరిధిలో పులులు ఇరురాష్ట్రాల సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించేందుకు అవకాశం కలి్పస్తున్నారు. పులుల ఆవాసాలకు ఇబ్బంది లేకుండా.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జాయింట్ రివర్ పెట్రోలింగ్ చేపట్టాం. దీనిని ఇంకా విస్తరిస్తాం. పులుల ఆవాసాలకు ఇబ్బంది కలగకుండా స్థానికులకు అవగాహన కలి్పస్తున్నాం. ప్రజలు సైతం ఎంతగానో సహకరిస్తున్నారు. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
ఆడపులుల అడ్డా.. నల్లమల
సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లో మగ పులులకంటే ఆడ పులులే ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో 2022 సంవత్సరం పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. మొత్తం 73 పులులు ఉన్నట్లు కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించారు. అందులో 49 ఆడ పులులే. 21 మాత్రమే మగ పులులు ఉన్నాయి. మూడు పులులు ఆడవో, మగవో గుర్తించలేకపోయారు. 2014లో రాష్ట్ర విభజన సమయానికి నల్లమలలో 37 పులులే ఉన్నాయి. అటవీ శాఖ సంరక్షణ చర్యలు పటిష్టంగా ఉండడంతో వాటి సంఖ్య అనూహ్యంగా 73కి పెరిగింది. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం, దోర్నాల ప్రాంతంలో (బ్లాక్–1) 18 పులులుంటే అందులో 6 మాత్రమే మగవి. 11 ఆడ పులులు. ఒక పులి లింగ నిర్ధారణ కాలేదు. బైర్లూటి, వెలిగోడు, నంద్యాల, గుండ్లబ్రహ్మేశ్వరం, బండి ఆత్మకూరు, చలమ, గుండ్లకమ్మ, తురిమెళ్ల ప్రాంతంలో (బ్లాక్–2) 26 పులులుంటే 8 మాత్రమే మగవి. 17 ఆడ పులులు. ఒక పులి ఆడదో, మగదో గుర్తించలేదు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని జీవీ పల్లి, వై పాలెం, వీపీ సౌత్ ప్రాంతాల్లో (బ్లాక్–3) 20 పులులుంటే ఆడ పులుల సంఖ్య 15. మగ పులులు 5 మాత్రమే. ఇక్కడ ఒక మగ పులికి మూడు ఆడ పులులున్నాయి. కొత్తగా విస్తరించిన ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల పరిధిలోని రుద్రవరం, చలమల, గిద్దలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, కడప, రాయచోటి, బద్వేల్, ఓనిపెంట,పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో (కొత్త కారిడార్) మొత్తం 9 పులులు ఉంటే రెండు మాత్రమే మగవి. 6 పులులు మగవి. ఇక్కడ ఒక మగ పులికి మూడు ఆడ పులులున్నాయి. ఒకదాని లింగ నిర్ధారణ చేయడం కుదరలేదు. ప్రతి పులి ప్రత్యేకతను గుర్తిస్తారు నాగార్జున్‌సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వులోని ఆత్మకూరు, మార్కాపురం, నంద్యాల, గిద్దలూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, కడప అటవీ డివిజన్లలో 905 ప్రదేశాల్లో 1800కిపైగా అధునాతన మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కిలోమీటర్లకు రెండు కెమెరాలు పెట్టారు. పులులు వెళ్లే ప్రధాన దారుల్లో రెండు వైపులా రెండు జతల కెమెరాలు అమర్చారు. ఇవి వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన లక్షలకుపైగా ఫొటోలను ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేíÙంచి పులుల సంఖ్య, ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. పులి చర్మంపై ఉండే చారలు మన చేతి రేఖల్లానే ప్రత్యేకంగా ఉంటాయి. రెండు వైపులా చారలను గుర్తించి వాటి ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన పులులను లెక్కిస్తారు. ఆడ, మగ పులుల్ని ఇలా గుర్తిస్తారు... పులుల్ని వాటి అడుగు జాడల (పగ్ మార్క్) ఆధారంగా గుర్తిస్తారు. ఆ అడుగుల్ని బట్టే అవి ఆడవో, మగవో నిర్ధారిస్తారు. మగ పులి అడుగు చతురస్రాకారంలో ఉంటుంది. ఆడ పులి అడుగు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. మగ పులి కాలి మడమ పెద్దగా, ఆడ పులి మడమ చిన్నగా ఉంటుంది. పటిష్టంగా పులుల పరిరక్షణ పర్యావరణ వ్యవస్థలో పులుల పరిరక్షణ అత్యంత కీలకం. వాటి పరిరక్షణలో రాష్ట్ర అటవీ శాఖ ముందుంది. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంఖ్య 73కి పెరగడమే ఇందుకు నిదర్శం. నాలుగేళ్లలో పులుల సంఖ్య 60 శాతం పెరగడం మంచి పరిణామం. – వై మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి సంరక్షణ చర్యల వల్లే.. 2008లో నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో పులులు ఉన్నాయా అనే అనుమానం ఉండేది. అప్పుడు కెమేరా ట్రాప్‌లు పెడితే 2, 3 మాత్రమే ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి వాటి సంరక్షణకు పెద్దఎత్తున చర్యలు చేపట్టడం మొదలైంది. పులుల వేటను దాదాపు నివారించి వాటి ఆవాసాలను పరిరక్షించేందుకు కింది స్థాయిలో అటవీ శాఖ సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. దాని ఫలితంగానే వాటి సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. – విఘ్నేష్ అప్పావు, డిప్యూటీ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్, మార్కాపురం -
ఆశ్చర్యం..‘ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు’
ఎందుకు.. ఆశ్చర్యం అని చెప్పుకునేలోపు.. మనమో చిన్న కథ చెప్పుకుందాం.. అనగనగా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరికి చెరో నలుగురు పిల్లలు. ఓరోజు అక్క భర్తకు ఎందుకో కోపమొచ్చింది.. అక్కను చంపేశాడు.. అలాగే ఓ బిడ్డనూ చంపేశాడు. అక్క పిల్లలు అనాథలయ్యారు.. చెల్లెలే ధైర్యంగా నిలబడింది.. వారిని చేరదీసింది. వారి కన్నీళ్లను తుడిచింది. ఎలా మెలగాలో చెప్పింది.. ఎలా బతకాలో నేర్పింది. బతుకుదెరువు చూపింది. ప్రయోజకుల్ని చేసింది.. ఏంటీ.. పాతకాలపు సెంటిమెంటు స్టోరీ అనేగా మీ డౌటు..ఈ స్టోరీ మనుషులది కాదు.. ఈ పులులది అని చెబితే.. ఆశ్చర్యమే కదా..ఎందుకంటే.. ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు అని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా అన్నారు. అవి ఆహారాన్ని ఆరగిస్తున్న చిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆయన.. ఈ ఫొటో వెనకున్న కథను నెటిజన్లకు తెలిపారు. Tigress takes care of 3 cubs of her dead sister along with 4 of her own. It is also reported that she gives precedence during hunting to the cubs of her sister. Rare. (Source:Forest Department) pic.twitter.com/V5wK28Qlgy — Susanta Nanda IFS (@susantananda3) August 22, 2022 -
నల్లమలలో 73 పెద్ద పులులు
మార్కాపురం: దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టులో 73 పెద్దపులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2020లో 63 ఉండగా రెండేళ్లలో పెద్దపులుల సంఖ్య మరో పది పెరిగింది. ఇక్కడ 2018లో 47 పులులే ఉన్నాయి. పులుల గణన ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా వీటిసంఖ్య 75 ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అదనంగా చేరిన రెండు పులులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పాపికొండల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. నాలుగేళ్లలో పులుల పెరుగుదల 60 శాతం ఉండటం గొప్ప విషయమని అటవీ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ ఫారెస్టు నుంచి కూడా పులుల సంచారం జరుగుతోంది. పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు నాలుగేళ్లలో పులుల సంఖ్య 47 నుంచి 73 వరకు పెరగటానికి నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అటవీ ప్రాంతంలోకి స్మగ్లర్లు, వేటగాళ్లు రాకుండా 13 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గతంలో నాలుగు చెక్‌పోస్టులు మాత్రమే ఉండేవి. దీంతోపాటు ఎక్కడికక్కడ గడ్డిని పెంచటంతో పొదలు ఏర్పడి దుప్పులు, జింకలు పెరిగాయి. దీంతో పులులకు ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. దీంతో పులుల సంఖ్య పెరిగిందని మార్కాపురం వైల్డ్ లైఫ్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ చెప్పారు. అటవీ సమీప గ్రామాలు, కొన్ని చెంచుగూడేలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నల్లమల అటవీప్రాంతంలో 300 చిరుతలు, 300 ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని, వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దోర్నాల మండలంలోని బొమ్మలాపురం ప్రాంతంలో టీ64 పెద్దపులి పిల్లలతో కలిసి తిరుగుతోందని చెప్పారు. అటవీ ప్రాంతంలోకి వెళ్తే దాడులు చేసే ప్రమాదం ఉన్నందున ఆరునెలల పాటు ఎవరూ లోతట్టు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని కోరారు. -
International Tiger Day: పులుల భారత్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పర్యావరణ పిరమిడ్‌లో పెద్దపులిని అగ్రసూచిగా భారత్ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 4 వేల వరకు ఉండగా అందులో డెబ్భై శాతానికి మించి మన దేశంలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 53 పులుల అభయారణ్యాలు ఉన్నాయి. 2006లో దేశంలో 1,411 పులులు ఉండగా 2018 నాటికి వాటి సంఖ్య 2,967కు చేరింది. కేవలం పన్నెండేళ్లలో ఇంత వృద్ధి ఓ రికార్డుగా పర్యావరణవేత్తలు అభివర్ణిస్తున్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ స్థాయిలో పెరుగుదల లేదని చెబుతున్నారు. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) జోన్లోనే 63 పులులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణలో పులి పాత్ర కీలకం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గిపోతుండటంతో వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పులుల సంరక్షణపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఎన్ఎస్టీఆర్ దేశంలోనే పెద్దది రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) జోన్ దేశంలోకెల్లా పెద్దది. ఏపీలోని పూర్వపు గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతం పులుల ఆవాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంతం కృష్ణాతో పాటు దాని ఉప నదులు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల బ్యాక్ వాటర్, ఇతర వనరులతో నీటికి కొదవలేకపోవడం, ఎత్తయిన కొండలు, భారీ లోయలతో భౌగోళికంగా అనువుగా ఉండటం పులుల సంచారానికి, వాటి ఎదుగుదలకు ఉపయుక్తంగా ఉంటుంది. నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వరకూ విస్తరించిన ఈ టైగర్ కారిడార్‌లో పులుల సంచారం పెరిగినట్లు అటవీ శాఖ గుర్తించింది. కొన్నేళ్లుగా నల్లమల నుంచి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల వరకూ పులుల సంచారం మొదలైనట్లు గుర్తించారు. శేషాచలం బ్లాకులో మూడేళ్ల క్రితం కొత్తగా 6 పులులు కనిపించగా గతేడాది 3 కనిపించాయి. టైగర్ రిజర్వు ప్రాంతంలో 597 అధునాతన మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కి.మీ కు రెండు కెమెరాలు పెట్టారు. అడవిలో పులులు వెళ్లే ప్రధాన దారుల్లో కెమెరాలు పెట్టారు. ఈ కెమెరాలు వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన లక్షల ఫొటోలను ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించి, పులుల సంఖ్య ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. పులి చర్మంపై ఉండే చారల ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన వాటిని లెక్కిస్తారు. జాతీయ స్థాయిలో ప్రతి నాలుగేళ్లకోసారి, రాష్ట్రాల్లో ప్రతి ఏడాది పులుల గణన జరుగుతుంది. తాజా వివరాలను శుక్రవారం తిరుపతి ఎస్వీ జూ పార్క్‌లో విడుదల చేయనున్నారు. పర్యావరణ వ్యవస్థలో పులులు కీలకం పర్యావరణ వ్యవస్థ శ్రేయస్సుకి పులులు ఎంతో కీలకం. వాటి సంరక్షణ, రక్షణ ద్వారా మనిషి మనుగడకు కీలకమైన పర్యావరణాన్ని కాపాడినట్లే. అనేక జీవరాశుల మనుగడకు పులి అవకాశం కల్పిస్తుంది. పులులను పరిరక్షించడానికి అధిక ప్రాధానత్య ఇస్తున్నాం. – మధుసూదన్‌రెడ్డి, అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వేటను పూర్తిగా నిషేధించాలి పులి అత్యంత సున్నితమైన జంతువు. పులి సౌకర్యంగా జీవించడానికి తగిన పర్యావరణాన్ని ఏర్పరచడం కష్టం. పులికి ఆహారమైన జంతువుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సి ఉన్నందున అడవికి నిప్పు పెట్టడం, జంతువులను వేటాడటం పూర్తిగా నిషేదించాలి. – ఎల్.నాగిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ శాస్త్ర విభాగం, అనంతపురం -
Tiger Mating Season: ఏకాంతమైతేనే 'సై'ఆట
ఆత్మకూరు రూరల్: జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు శ్రీశైలం అటవీ రేంజ్ పరిధిలోని ఇష్టకామేశ్వరి పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలను తాత్కాలికంగా అటవీ శాఖ నిలిపేసింది. ఇష్టకామేశ్వరి క్షేత్రం ఒక్కటే కాదు.. అన్ని పర్యావరణ పర్యాటక కేంద్రాలనూ ఈ మూడు నెలలు మూసివేశారు. ఇది పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం(బ్రీడింగ్ పీరియడ్) అయినందున వాటికి ఏకాంతం కల్పించడమే ఈ ఆంక్షలకు కారణమని అటవీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్దపులి ఎంతో సిగ్గరి మనస్థత్వం కలిగినది. ఎంతో ఠీవీగా రాజసంతో నడిచే పెద్దపులి తన సంగమ సమయంలో మాత్రం పూర్తిగా ఏకాంతాన్ని కోరుకుంటుంది. అడవిలో ఏ చిన్న అలజడి రేగినా పులులు సంగమంలో పాల్గొనవు. అయితే తరుచూ అడవుల్లో మానవ సంచారం కారణంగా పెద్ద పులుల్లో సంగమించడం తగ్గిపోయి గర్భధారణ అవకాశాలు పడిపోతున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) 2015లో పులుల అభయారణ్యాలున్న రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు రుతుపవనాల సమయమైన జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు అభయారణ్యాల్లో మానవ సంచారాన్ని అదుపు చేసే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ నిషేధాజ్ఞలను ఎన్ఎస్టీఆర్(నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్), జీబీఎం(గుండ్ల బ్రహ్మేశ్వరం) అభయారణ్యాల పరిధిలో అటవీ శాఖ అమలు చేస్తోంది. దీంతో అభయారణ్యాల పరిధిలోని అన్ని ఎకో టూరిజం రిసార్ట్లు, జంగల్ సఫారీలు, పుణ్యక్షేత్రాలను మూసివేశారు. అవసరం అనుకుంటే ఈ నిషేధాజ్ఞలను మరో రెండు నెలలు కూడా పొడిగించే అవకాశాలున్నాయి. తల్లి తలపైకెక్కిన పులి కూనలు ఆ సమయంలో మనుషుల పైనా దాడి చేసే అవకాశం పులులు సంతానోత్పత్తి సమయాల్లో చాలా ఆవేశపూరితంగా ఉంటాయి. సంగమం సమయంలో ఆవేశంతో మనుషులపై దాడులకు పాల్పడతాయి. అందుకే పులుల సంతానోత్పత్తి కాలంలో నల్లమలలోని అన్ని పర్యాటక, పుణ్యక్షేత్రాలను తాత్కాలికంగా మూసివేయించాం. – అలెన్ చోంగ్ టెరాన్, డీఎఫ్‌వో, ఆత్మకూరు డివిజన్, నంద్యాల జిల్లా -
పెద్ద పులి ఎక్కడ?
ఇందిరా గాంధీ జూ పార్కులో పెద్ద పులులు కనిపించడం లేదు. అలా అని జూ నుంచి తప్పించుకుని జనారణ్యంలో తిరుగుతున్నాయేమోనని భయపడకండి. ఆ పులులు జూ లోపలే ఉన్నాయి. అయితే సందర్శకులకు మాత్రం కనిపించకుండా నైట్క్రాల్స్కే పరిమితమయ్యాయి. జూ పార్కు అనగానే ఏనుగులు, పులులు గుర్తుకొస్తాయి. అవి కనిపిస్తేనే జూకి వెళ్లి జంతువులను చూశామన్న సంతృప్తి సందర్శకులకు కలుగుతుంది. ఇక్కడ చింపాంజీలు, చిరుతల ఎన్క్లోజర్లు దాటిన తర్వాత పెద్ద పులుల ఎన్‌క్లోజర్ ఉంది. ఇందులో రెండు పులులున్నాయి. అవి సందర్శకులను ఎంతగానో అలరిస్తుండేవి. అయితే ఏడాది నుంచి ఇక్కడ పెద్ద పులులు వాటి ఎన్‌క్లోజర్‌లో కనిపించడం లేదు. ఎన్‌క్లోజర్ వెనుక భాగంలో గోడ కూలిపోయింది. దీంతో పులులను ఎన్‌క్లోజర్‌లో విడిచిపెడితే బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు.. నైట్క్రాల్స్లో ఉంచి ఆ గోడ పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. నాలుగు, ఐదు నెలల్లో గోడ నిర్మాణం పూర్తి చేసి ఎన్‌క్లోజర్ సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే ఏడాది గడుస్తున్నా ఈ గోడ పనులు పూర్తి కాలేదు. సరికదా మరో ఆరు నెలలు గడిచినా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని ఇక్కడ సిబ్బంది అంటున్నారు. గోడ పూర్తయితే గానీ పెద్ద పులులు సందర్శకులకు కనిపించవు. నిర్మాణ పనుల్లో జాప్యంపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌క్లోజర్‌కు సమీపంలో తెల్ల పులులు చూస్తూ.. ఒకింత సంతృప్తి చెందుతున్నారు. వెంటనే గోడ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. – ఆరిలోవ(విశాఖ తూర్పు) -
పెద్దపులుల మధ్య ఏమాత్రం జంకులేకుండా దర్జాగా..
వైరల్: ఇంటర్నెట్లో ఒక్కొసారి కొన్ని వీడియోలు.. అనూహ్యాంగా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలకు ఉనికి(సోర్స్, ప్లేస్), సమయం తెలియకపోయినా నెటిజన్స్ ఆదరణ మాత్రం చురగొంటుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. గోల్డెన్ రెట్రైవర్ బ్రీడ్‌కు చెందిన ఓ శునకం.. పెద్దపులుల మధ్య దర్జాగా తిరుగాడుతోంది. అంతేకాదు.. వాటిని వీడియో తీసేవాళ్లను చూస్తూ ‘భౌ’ మంటూ తెగ బిల్డప్ కొట్టింది. పక్కనే ఉన్న పులులు ఏవీ కూడా దానికి హాని తలపెట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకో తెలుసా?.. ఆ పులులు, కూనలుగా ఉన్న సమయంలో తల్లికి దూరం అయ్యాయి. అప్పటి నుంచి ఆ కుక్క వాటికి పాలిచ్చి పెంచింది. అన్నేసి పులి కూనలను సాకడం చిన్న విషయమూ కాదు. అందుకే తమతో పాటు పెరిగిన ఆ కుక్కను అమ్మగానే భావిస్తున్నాయి ఆ పులులు. టిక్‌టాక్ ద్వారా బాగా వైరల్ అయిన ఆ వీడియోను.. టైగర్ బిగ్ఫ్యాన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. View this post on Instagram A post shared by Tiger (@tiger__bigfan) -
ఉచ్చులు కావు.. ఉరితాళ్లు
ఆత్మకూరురూరల్: నల్లమల అటవీ పరిధిలో జరిగిన పైమూడు ఘటనలు పులులు ఉచ్చులకు బలవుతున్నట్లు తేటతెల్లమవుతోంది. అడవిలో పెద్దపులి, చిరుత పులి మరణించినప్పుడు వృద్ధాప్యంతో, ప్రమాదవశాత్తూ, రెండు పులుల పోరాటంలో గాయపడి మృత్యువాత పడినట్లు అటవీ అధికారులు తరచూ చెబుతూ ఆ అంకాన్ని ముగిస్తుంటారు. అయితే పులుల అసహజ మరణాల వెనుక వేటగాళ్ల ఉచ్చులు ఉన్నట్లు అటవీ సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వన్యప్రాణుల మాంసానికి డిమాండ్ ఉండడంతో ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లె, రుద్రవరం, మహానంది మండలాల్లోని అటవీ సమీప గ్రామాల్లో కొందరు వన్యప్రాణులను వేటాడం వృత్తిగా మార్చుకున్నారు. తనిఖీల్లో తరచూ వన్యప్రాణి మాంసం లభిస్తున్న కేసుల సంఖ్యనే ఇందుకు బలం చేకూర్చుతోంది. శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) మన నల్లమలలో ఏర్పడి పులుల సంరక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. సుమారు 110 పెద్దపులులకు (తెలంగాణా– ఆంధ్రప్రదేశ్) నెలవై శ్రీశైలం – శేషాచలం పులుల కారిడార్‌కు ఎన్ఎస్టీఆర్ పురుడు పోసింది. కాగా ఇటీవలి కొన్ని పరిణామాలను చూస్తే అటవీ శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగేళ్లలో ఆరు పులులు అసాధారణ స్థితిలో మరణించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా పెద్ద పులి ఉద్ధృతంగా ప్రవహించే కృష్ణానదిని అవలీలగా దాటేస్తుంది. అలాంటిది తెలుగు గంగలో పడి మృతి చెందినట్లు అటవీ అధికారులు ప్రకటించడం అనుమానాలకు దారి తీస్తుంది. వేటగాళ్లను కట్టడి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జింకల కోసం ఉచ్చులు.. పులులకు చిక్కులు.. నల్లమల అటవీ సమీప గ్రామాల్లో కొందరు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించడమే ఒక వ్యాపారంగా మలుచుకుని జీవిస్తుంటారు. ముఖ్యంగా కొత్తపల్లె, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, రుద్రవరం మండలంలో కొందరు నేరచరిత్ర ఉన్న వ్యక్తులు నిరంతరం ఇదే పనిలో ఉంటున్నారు. అతికొద్ది మంది తుపాకులతో వేట సాగిస్తే చాలా మంది ఉచ్చులతో వేటాడుతున్నారు. వీరు వేస్తున్న ఉచ్చులే పులుల ఉనికికే ప్రమాదంగా మారాయి. ఉచ్చులతో వేటకు వేసవికాలం అనుకూలం. సహజనీటి వనరులు తరిగిపోయి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఉండే నీటి దొరువుల వద్ద వేటగాళ్లు పొదల్లో ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. నీటి కోసం వచ్చే జింకలు ఈ ఉచ్చుల్లో చిక్కుకుని మరణిస్తుంటాయి. అలాగే జింకలు తమకు అవసరమైన సోడియం లవణ లభ్యత కోసం అడవుల్లో ఉండే జేడె (ఉప్పు నేలలు)లను ఆశ్రయిస్తాయి. వెన్నెల రాత్రులలో జేడెల వద్దకు భూమి పొరలను నాకేందుకు గుంపులు గుంపులుగా చేరుకుంటాయి. ఆ ప్రాంతాల్లో కూడా వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేస్తారు. ఇలా జింకల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులలో పెద్దపులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు చిక్కుకుని బలవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రుద్రవరం అటవీ ప్రాంతంలోని గండ్లేరు రిజర్యాయరులో పులి కళేబరం బయటపడింది. తెలుగుంగ కాల్వలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు మొదట అధికారులు ధ్రువీకరించారు. అనుమానాల నేపథ్యంలో ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా పచ్చర్ల సమీపంలో ఉచ్చులో పడి మృతి చెందినట్లు తేలింది. ఈ ఘటనలో కింది స్థాయి అటవీ సిబ్బందిపై వేటు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. 2018 మార్చి 28న శ్రీశైలం రేంజ్‌లోని పెచ్చెర్వు సమీపంలో నరమామిడి చెరువు వద్ద పెద్దపులి మరణించింది. గుర్తించిన అటవీ సిబ్బంది అర్ధరాత్రి అక్కడే పోస్టుమార్టం చేసి కళేబరాన్ని దహనం చేశారు. రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో మృత్యువాత పడినట్లు ప్రకటించారు. అయితే అధికారుల హడావుడిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పెద్ద పులి ఉచ్చుకు బలైనా అధికారులు దాచి కళేబరాన్ని దహనం చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. 2016లో జీబీఎం, నాగలూటి రేంజ్‌లలో కనిపించిన (ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో) టీ 21, టీ 32, టీ40 (పులి శరీరంపై ఉన్న చారల ఆధారంగా వాటికి ఓ సంఖ్య కేటాయిస్తారు) జాడ ఇంత వరకు లేదు. దాదాపు ఐదేళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఐనముక్కలలో ఓ ఇంట్లో మూడు పులి చర్మాలు లభించాయి. వాటిని సున్నిపెంటకు చెందిన ఓ వ్యక్తి దాచినట్లు తేలగా.. ఈ కేసులో ఆత్మకూరు మండలం సిద్ధేశ్వరానికి చెందిన వేటగాడిని అరెస్ట్ చేశారు. అటవీ చట్టాలు కఠినంగా అమలు చేయాలి వన్యప్రాణి వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. పులి మనుగడకు ముప్పుగా మారిన ఉచ్చుల వేట పూర్తిగా నిర్మూలించాలి. తరచూ పట్టుబడే వన్యప్రాణి వేటగాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేసి శిక్షించాలి. – యన్నం హనుమంతరెడ్డి, న్యాయవాది, వన్యప్రాణి ప్రేమికులు పర్యవేక్షణ కరువై.. ∙ రెగ్యులర్ అటవీ ఉద్యోగులు పగలు బేస్ క్యాంపులకు వెళుతున్నప్పటికీ రాత్రిళ్లు ఉండటం లేదన్న విమర్శలున్నాయి. నిరంతరం ఉచ్చుల నివారణ కోసం పెట్రోలింగ్ చేయాల్సిన చోట తూతూమంత్రంగా సాగుతోంది. ∙ టైగర్ హబ్‌గా భావించే బైర్లూటి, నాగలూటి, వెలుగోడు అటవీ క్షేత్రాధికారులు ఎనిమిదేళ్లుగా ఇక్కడే కొనసాగుతున్నారు. దీంతో పర్యవేక్షణాధికారులకు కిందిస్థాయి సిబ్బందికి సమన్వయం లేకపోవడంతో పులి సంరక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ∙ బ్రిటీష్ కాలం నాటి సరిహద్దులతో ఎంతో పెద్దదైన విస్తీర్ణంతో ఉన్న అటవీ క్షేత్రాలు (రేంజ్‌లు) ఇంతవరకు పునర్విభజనకు నోచుకోక పోవడంతో సిబ్బంది కొరత ఏర్పడి పులుల సంరక్షణకు పెద్ద అవరోధంగా మారింది. రుద్రకోడు రేంజ్ ప్రతిపాదన కొన్నేళ్లుగా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. నిరంతరం నిఘా ఉచ్చుల బారి నుంచి పులు లు, ఇతర జంతువులను రక్షించేందుకు ప్రతిరోజు ప్ర త్యేక డ్రైవ్ చేపడుతున్నాం. అనుమానిత ప్రదేశాల్లో అటవీ సిబ్బంది నిశితంగా పరిశీలించి వేటగాళ్లు ఉంచిన ఉచ్చులను తొలగిస్తున్నారు. అటవీ సమీప ప్రాంతాల్లో తిరిగే అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాం. – దత్తాత్రేయ, ఎఫ్ఆర్వో, వెలుగోడు రేంజ్ -
20 పులులను చంపిన చిట్టిరాజు.. అసలు ఆ కథేమిటంటే..?
ప్రత్తిపాడు రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రత్తిపాడు మండలంలోని పులి సంచారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అటువంటి ఈ ప్రాంతంలో స్వతంత్రానికి పూర్వం పులులు విస్తారంగా సంచరించేవన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పటి తరం వారికి మాత్రం పులుల సంచారం, స్థానిక వేటగాళ్ల ధైర్య సాహసాల గురించి బాగా తెలుసు. తమ సైనికులకు రక్షణ కల్పించాలంటూ అప్పటి వేటగాళ్లను బ్రిటిష్ ప్రభుత్వం అర్థించింది. ప్రత్తిపాడు పరిసరాలు, నాగులకొండ ప్రాంతాల్లో పులులు, చిరుత పులులు విస్తారంగా సంచరించేవట. అనుకోని అతిథిలా ప్రత్తిపాడు ప్రాంతానికి వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ తూర్పుకనుమల్లో కనిపించడం ఇదే ప్రథమం. అయితే ఈ ప్రాంతంలో పులులు లేవా, ఉంటే ఏమయ్యాయి అన్నదానిపై సమాచారం సేకరిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 20 పులులను సంహరించిన చిట్టిరాజు జగ్గంపేట మండలం రాయవరానికి చెందిన చిట్టిరాజు ప్రపంచంలోనే ప్రముఖ వేటగాడు జిమ్ కార్బెట్ సమకాలికుడు. 1918 – 1926 మధ్య నరమాంస భక్షకిగా హడలెత్తించిన రుద్ర ప్రయోగ చిరుతపులిని చంపడానికి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ దేశ వ్యాప్తంగా ఉన్న వేటగాళ్ల కోసం గాలించింది. అందులో జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన చిట్టిరాజు ఒకరు. సరిగ్గా అదే సమయంలో ప్రత్తిపాడు అటవీ ప్రాంతంలో గుర్రాల మీద వెళ్లే బ్రిటిష్ సైనికులను పులులు చంపి తినేస్తుండటంతో బ్రిటిష్ అధికారులు కొట్టాం సంస్థానం, తుని రాజా వారికి పులులను సంహరించే బాధ్యతలను అప్పగించారు. రామచంద్రరాజు వేటాడిన బెంగాల్ టైగర్ ఆ పనిని తుని రాజా వారు చిట్టిరాజుకి అప్పగించారు. మనం చేయాల్సిన పనిని పులులు చేస్తున్నాయి. అటువంటి పులులను తాను సంహరించలేనని దేశభక్తి భావంతో ఆయన నిరాకరించారట. అయితే బ్రిటిష్ సైనికులతో పాటు స్థానిక ప్రజలు పులి దాడిలో మృతి చెందటంతో రాజాజ్ఞ ప్రకారం పులులను సంహరించే బాధ్యతను స్వీకరించారు. పులిని సంహరించిన తర్వాత ఏ తెల్లదొర తనతో కరచాలనం చేయరాదని షరతుతో పులిని వేటాడినట్టు తెలిసింది. ఆయన జీవిత కాలంలో మనుషులకు హాని కలిగించే 20 పులులను సంహరించినట్లు భోగట్టా. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు రుద్రయాగ చిరుత పులి సంహారానికి రమ్మని చిట్టిరాజుకు కూడా వర్తమానం పంపారట. జిమ్ కార్బెట్ అప్పటికే అక్కడ పులి వేటలోకి దిగిపోయారు. ఐదు వందల చదరపు మైళ్లు తిరిగి, రెండున్నర నెలలు పాటు మాటు వేశారు. అధికారిక లెక్కల ప్రకారం రుద్రప్రయోగ పులి 125 మందిని చంపిందని చెబుతున్నా అనధికారికంగా రెండు వేలకు పైనే చనిపోయి ఉంటారు. రాజుబాబు వేటాడిన చిరుత ఆంధ్ర జిమ్ కార్బెట్.. రాజబాబు చిట్టిరాజు తర్వాత రామచంద్రపురానికి చెందిన శ్రీరాజా కాకర్లపూడి రామచంద్రరాజు బహుదూర్ (రాజబాబు)ను ప్రధానంగా చెబుతారు. ఈయన రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో కొందరికి వేటాడ్డానికి అనుమతులు ఉండేవి. ఆంధ్ర జిమ్ కార్బెట్గా చెప్పుకునే రామచంద్రపురం రాజబాబు వేటాడిన వాటిలో 5 బెంగాల్ టైగర్లు ఉండగా 20 వరకూ చిరుత పులులు ఉన్నాయట. ఇప్పటికీ రామచంద్రపురంలో రాజబాబు వధించిన పులుల కళేబరాలు గోడలకు అలంకరించి ఉన్నాయి. చిరుత నోటిలో చేయి పెట్టిన కృష్ణమూర్తిరాజు జగ్గంపేట మండలం మల్లిసాలకి చెందిన వత్సవాయి కృష్ణమూర్తిరాజు పదికి పైగా చిరుత పులులను వేటాడినట్టు చెబుతారు. ఈయన చిట్టిబాబురాజు మనువడు. చిరుతపులి వేటలో కృష్ణమూర్తిరాజు ధైర్యసాహసాలు, శక్తి యుక్తులను ప్రదర్శించి చిరుత నోటిలోనే తన చేతిని నెట్టి త్రుటిలో ప్రాణాలను కాపాడుకున్నారట. అయితే అప్పటికే పులికి కృష్ణమూర్తిరాజు తూటా దెబ్బ తగిలి ఉంది. దెబ్బ తిన్న పులి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం చిన్నవిషయం కాదు. చిరుత నోటిలో పెట్టిన చేతిని చిరుత చప్పరించేసిందట. అనంతరం వేటలో ఉండగా పరుల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. పులికి ఎదురెళ్లిన సూరిబాబురాజు ఇంకొకరు రాజోలు మండలం చింతపల్లికి చెందిన అల్లూరి సూరిబాబురాజు దేశం నలుమూలలా తెలిసిన వేటగాడు. ఈయన చిరుత పులులతో పాటు, బెంగాల్ టైగర్స్‌ను కూడా వేటాడారు. మారేడుమిల్లి అడవిలో రోడ్డు మీద ఎదురుపడ్డ పులికి ఎదురెళ్లిన వేటగాడు సూరిబాబుని పాతతరం వారు చెబుతుంటారు. సూరిబాబు ఇటీవల కాకినాడలో మృతి చెందారు. -
పులుల కోసం ఓ వంతెన
సాక్షి, హైదరాబాద్: తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడినుంచే తెలంగాణలోని అడవుల్లోకీ పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్. ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్‌పూర్–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కాబోతోంది. 4 వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ వాటి ప్రాణానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 150 మీటర్ల పొడవుతో ఎకో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. అంటే వన్యప్రాణులు రాకపోకలు సాగించే సమయంలో జాతీయ రహదారిని దాటేందుకు సహజ సిద్ధ వాతావరణం కల్పిస్తూ నిర్మించే వంతెన అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల పరిరక్షణలో మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ తరహా నిర్మాణం తెలంగాణలోనే మొదటిది కానుండటం విశేషం. దీనికి మరో 2 కి.మీ. దూరంలో 200 మీటర్ల పొడవుతో అండర్పాస్నూ నిర్మిస్తున్నారు. మొదటి వంతెన వద్ద వాహనాలు దిగువ నుంచి సాగితే, జంతువు లు పైనుంచి రోడ్డును దాటుతాయి. రెండో నిర్మాణం వద్ద.. వాహనాలు ఫ్లైఓవర్ మీదుగా.. జంతువులు దిగువ నుంచి దాటుతాయి. మూడు రాష్ట్రాలను కలిపే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు సాగే ఈ కారిడార్‌లో తెలంగాణలోని మంచిర్యాల నుంచి విజయవాడ వరకు పూర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెవేగా రోడ్డును నిర్మించబోతున్నారు. దీనికి కేంద్రం నుంచి ఆమోదం వచ్చినందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనివల్ల నాగ్‌పూర్–విజయవాడ మధ్య దూరం 180 కి.మీ. మేర తగ్గనుంది. తెలంగాణ నుంచి విజయవాడకు ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఈ రోడ్డు బిజీగా మారి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తోంది. ప్రతిపాదిత కొత్త రోడ్డు మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేని వాహనాలు అటుగా మళ్లి.. ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారిపై భారాన్ని తగ్గిస్తాయి. వైల్డ్‌లైఫ్ బోర్డు సిఫారసుతో.. ఇందులో మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్–మంచిర్యాల వరకు 2 వరుసల పాత రోడ్డు ఉంది. దాన్నే 4 వరుసలకు విస్తరిస్తారు. మంచిర్యాల నుంచి పూర్తి కొత్త రోడ్డును నిర్మిస్తారు. ఆసిఫాబాద్ మీదుగా విస్తరించే 4 వరుసల రహదారితో వన్యప్రాణులకు ఇబ్బందిగా మారడంతో అటవీశాఖతోపాటు ప్రత్యేకంగా వైల్డ్‌లైఫ్ బోర్డు నుంచి క్లియరెన్సు తీసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ దరఖాస్తు చేసుకోగా, గతేడాది వైల్డ్‌లైఫ్ కమిటీ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని సర్వే చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప అనుమతులు సాధ్యం కాదని తేల్చారు. అనంతరం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త బిలాల్ హబీబ్ నేతృత్వంలోని బృందం పర్యటించి మహారాష్ట్ర–ఆసిఫాబాద్ సరిహద్దు వద్ద 150 మీటర్ల మేర ఎకో బ్రిడ్జిని, ఆ తర్వాత 200 మీటర్ల మేర అండర్‌పాస్ కట్టాలని సిఫారసు చేసినట్టు అధికారులు చెప్పారు. నాయిస్ బారియర్స్ ఏర్పాటు ఎక్స్‌ప్రెస్ వే కావడంతో వాహనాలు 150 కి.మీ. వేగంతో దూసుకుపోతాయి. అప్పుడు విపరీతమైన శబ్దం వస్తుంది. అది వన్యప్రాణులను బెదరగొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకోసం ప్రతిపాదిత బ్రిడ్జి, అండర్‌పాస్ వద్ద వాహనాల శబ్దాన్ని వెలుపలికి బాగా తగ్గించి వినిపించేలా నాయిస్ బారియర్స్ ఏర్పాటు చేయాలని కూడా వైల్డ్ లైఫ్ బోర్డు ఆదేశించింది. దాంతోపాటు ఎకో బ్రిడ్జి మీదుగా జంతువులు దాటే ప్రాంతంలో ఎక్కడా అది ఓ కట్టడం అన్న భావన రాకుండా చూస్తారు. సాధారణ నేల, దానిపై చెట్లు ఉండేలా డిజైన్ చేస్తారు. అది మామూలు భూమే అనుకుని జంతువులు రోడ్డును సురక్షితంగా దాటుతాయి. -
పాపికొండల్లో పెద్ద పులులు
బుట్టాయగూడెం: ఉభయగోదావరి జిల్లాల్లో విస్తరించిన పాపికొండల అభయారణ్యంలో పెద్ద పులి జాడలు కనిపించాయి. చిరుతల సందడిని గుర్తించారు. సుమారు 90 రోజులపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో వైల్డ్‌లైఫ్ అధికారులు పులుల గణన నిర్వహించారు. ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉన్నాయనే సమాచారాన్ని రాబట్టారు. ఈ అభయారణ్యం పరిధిలో పెద్దపులి జాడలు కనిపించడం ఈసారి సాధించిన విజయం. ఈ సారి గణనలో అత్యంత విషపూరితమైన 30 అడుగుల గిరినాగు కూడా కంటపడింది. ఈ అభయారణ్యంలో కొండగొర్రెలు, పాంథర్, కొండచిలువలు, దుప్పులు, సాంబాలు, నక్కలు, ముళ్ల పందులు, ముంగిసలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవికుక్కలు, కుందేళ్లు, లేళ్లు, కనుజులు, అడవిపందులు తిరుగుతున్నట్లు గుర్తించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1012.858 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న అటవీప్రాంతాన్ని 2008లో కేంద్ర ప్రభుత్వం పాపికొండల అభయారణ్యంగా ప్రకటించింది. అప్పటి నుంచి అటవీప్రాంతంలోని జంతు సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే రెండుసార్లు పాపికొండల అభయారణ్యంలో పులుల గణన కార్యక్రమాన్ని వైల్డ్‌లైఫ్ అధికారులు నిర్వహించారు. మొదట్లో నిర్వహించిన సర్వేలో పులులు ఉన్నప్పటికీ కెమెరాకు చిక్కలేదు. ఈ సారి నిర్వహించిన సర్వేలో పులులు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. రెండు దశల్లో సర్వే పాపికొండల అభయారణ్యంలో పులుల గణనకు సంబంధించిన సర్వేను వైల్డ్‌లైఫ్ అధికారులు రెండు దశల్లో నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల్లో 90 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 232 పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల్ని గుర్తించారు. మొదటి దశలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న అటవీప్రాంతంలోని 71 చోట్ల 142 కెమెరాలను ఏర్పాటు చేసి 45 రోజుల పాటు సర్వే నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 45 ప్రాంతాల్లో 90 కెమెరాలు ఏర్పాటు చేసి 45 రోజుల పాటు సర్వే నిర్వహించారు. ట్రాప్ కెమెరాలో పులుల జాడ 2018లో నిర్వహించిన పులుల గణన సర్వేలో ఈ ప్రాంతంలో పులులు ఉన్నా ట్రాప్ కెమెరాకు చిక్కలేదు. ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో పులుల జాడ స్పష్టంగా కెమెరాకు చిక్కాయి. పూర్తి స్థాయిలో పులుల గణన వివరాలు జులై 29న వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో జరిగిన గణన వివరాల నివేదికను జాతీయ పులుల సంరక్షణ విభాగం(ఎన్టీసీఏ) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ వివరాలను ప్రపంచ పులుల దినోత్సవం రోజైన జులై 29న పూర్తి స్థాయిలో ప్రకటిస్తారని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. 230 పక్షుల రకాల్ని గుర్తించాం పాపికొండల అభయారణ్యంలో పులుల గణన పూర్తయ్యింది. సుమారు 90 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో పులులు, చిరుతలతో పాటు 230 రకాల పక్షులు, 14 రకాల జాతుల ఉభయచర జీవులు ఉన్నట్లు ట్రాప్ కెమెరాలు గుర్తించాయి. ఇక్కడ నిర్వహించిన సర్వే నివేదికను జాతీయ పులుల సంరక్షణ విభాగానికి పంపిస్తాం. – సి.సెల్వమ్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ 116 ప్రాంతాల్లో సర్వే పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ సర్వేలో ఏనుగు, సింహం తప్ప అన్ని రకాల జంతువులు, పక్షులు, ఉభయచర జీవులను గుర్తించాం. జంతువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ అధికారి. పాపికొండలు -
పాపం పులి.. వేటకు వెళ్తూ వరుస మరణాలు!
పులి పంజా విసిరితే ఎలాంటి వన్యప్రాణి అయినా దానికి ఆహారం కావాల్సిందే. అయితే, ఆహారం కోసం వేటాడుతూ అరణ్యం దాటి బయటకొస్తున్న పులులు ప్రమాదాల బారినపడి మృత్యు వాతపడుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ తరచూ పులులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఒక వైపు పులుల సంతతి పెంచేందుకు చర్యలు తీసుకుంటుంటే.. మరో వైపు వేటాడే నేపథ్యంలో అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో పులుల సంరక్షణపై అటవీశాఖ అధికారులు మరింత దృష్టి సారించారు. రెండేళ్లలో మృతిచెందిన పులుల వివరాలు... ► 2020 జనవరి 20వ తేదీ కర్నూలు–గుంటూరు రహదారిపై నల్లమలలోని ఆర్.చెలమ బావి వద్ద కోతులను వేటాడే క్రమంలో ఓ చిరుతకూన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ► 2020 ఏప్రిల్ నెలలో యర్రగొండపాలెం సమీపంలోని గాలికొండలో అటవీ ప్రాంతంలో వృద్ధాప్యంతో తీవ్రమైన ఎండవేడిమిని తట్టుకోలేక పెద్ద పులి మృతి చెందింది. ► 2021 నవంబర్ 12న గిద్దలూరు–నంద్యాల మధ్య చలమ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదవశాత్తూ రైలు కింద పడి పెద్ద పులి మృతి చెందింది. ► తాజాగా కోతిని వేటాడే క్రమంలో మరో చిరుత బావిలో పడి మృతిచెందిన సంఘటన ఈనెల 6న వెలుగుచూసింది. మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతంలో వరుసగా పులులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వాటి సంరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. గడిచిన రెండేళ్లలో రెండు చిరుతలు, రెండు పెద్ద పులులు మృతి చెందాయి. ప్రధానంగా వేటాడే క్రమంలో ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నాయి. నల్లమల అభయారణ్యాన్ని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ టైగర్ రిజర్వు ఫారెస్ట్ (రాజీవ్ అభయారణ్యం)గా ప్రకటించింది. దోర్నాల–శ్రీశైలం, శ్రీశైలం–తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ పరిధిలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు పులుల సంచారం ఉన్నందున అటవీశాఖ గేట్లను ఏర్పాటు చేసి రహదారులపై రాకపోకలను నిలిపివేస్తోంది. వేటగాళ్ల నుంచి పులులను కాపాడేందుకు నల్లమలలో 24 బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మొత్తం 120 మంది టైగర్ ట్రాకర్లు పనిచేస్తున్నారు. ఒక్కో బేస్ క్యాంప్‌లో ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరు కాకుండా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది అడవిలో తిరుగుతుంటారు. పులుల మృతికి కారణాలు... జంతువులను వేటాడుతూ అడవిలో నుంచి రోడ్లపైకి, రైల్వేట్రాక్‌లపైకి వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తూ వాహనాలు ఢీకొని పులులు మృతిచెందుతున్నాయి. వేసవిలో మంచినీటి కోసం జనారణ్యంలోకి వెళ్లే క్రమంలోనూ రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. అదే సమయంలో పొలాల్లో అడవి పందుల కోసం వేసిన ఉచ్చులు, విద్యుత్ సరఫరాతో కూడిన కంచెల్లో చిక్కుకుని కూడా పులులు మృతిచెందే ప్రమాదం ఉంది. వేటాడే క్రమంలో అడవిలోని బావుల్లో పడి నీటిలో నుంచి బయటపడలేక కూడా తాజాగా చిరుత మృతిచెందింది. గతంతో పోలిస్తే నల్లమలలో పెరిగిన పులుల సంఖ్య... మన రాష్ట్రంలోని ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాల్లో 3,568 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో 65 పెద్ద పులులు, 75కిపైగా చిరుతలు ఉన్నాయి. వాటిలో మార్కాపురం డివిజన్ అటవీ ప్రాంతం దాదాపు 900 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఇటీవల పులుల గణనను ప్రారంభించారు. వాటి కాలి గుర్తులు, ట్రాక్ చేసిన సీసీ కెమేరాల ద్వారా దాదాపు 65 పులులు ఉన్నట్లు గుర్తించారు. అందులో దాదాపు 5 పులులు తెలంగాణ అడవిలో కూడా సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. మార్కాపురం డీఎఫ్‌వో పరిధిలో శ్రీశైలం, నంద్యాల, గుంటూరు జిల్లా మాచర్ల, విజయపురిసౌత్ ప్రాంతాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి పులుల సంఖ్యను అధికారికంగా లెక్కిస్తారు. దానిలో భాగంగా నాలుగేళ్ల క్రితం నల్లమలలో 40 నుంచి 48 పెద్ద పులులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 65కి చేరింది. ఇక చిరుత పులులు 75కిపైగా ఉన్నాయి. వాటితో పాటు అరుదైన అలుగు, వేల సంఖ్యలో జింకలు, దుప్పులు, నెమళ్లు, రేచుకుక్కలు, ముళ్ల పంది, ఈలుగ, ఎలుగుబంట్లు ఉన్నాయి. పులుల రక్షణకు ప్రత్యేక చర్యలు నల్లమలలో పులుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పులులతో పాటు ఇతర జంతువులకు తాగునీటి సమస్య లేకుండా చాలా ప్రాంతాల్లో సాసర్ పిట్లు ఏర్పాటుచేసి నీటి వసతి కల్పించాం. పులులు సంచరించే ప్రాంతాల్లో కెమేరాలు బిగించాం. బేస్‌క్యాంప్ సిబ్బంది 24 గంటల పాటు పులుల సంరక్షణపై దృష్టి పెడతారు. అడవుల్లోకి ఎవరొచ్చినా మాకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. నిబంధనలు అతిక్రమించి జంతువులపై దాడులకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం. నల్లమలలో మరో బేస్ క్యాంప్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గిద్దలూరు–నంద్యాల మధ్య ఉన్న రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రైళ్ల వేగం తగ్గించాలని ప్రతిపాదనలు పంపారు. దీంతో పాటు అండర్ పాస్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని ఉన్నాతాధికారులకు తెలిపారు. అటవీ ప్రాంతంలో నీటి కొరత లేకుండా చేశాం. కృష్ణా రివర్ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉన్నందున గట్టి భద్రతా చర్యలు తీసుకున్నాం. – విఘోష్ అప్పావ్, డీఎఫ్‌వో, మార్కాపురం -
పులులకు గడ్డు ఏడాదే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాదిలో గణనీయ సంఖ్యలో పులులు మృత్యువాత పడ్డాయి. జాతీయ పులుల పరిరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ ఒక్క ఏడాదిలోనే 126 పులులు వివిధ కారణాలతో చనిపోయాయి. గత ఏడాదిలో 106 పులులు చనిపోయినట్లు లెక్కలు చెబుతుండగా, ఈ ఏడాది మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎన్టీసీఏ వెల్లడించింది. 2016లో 121 పులులు మృత్యువాత పడటమే ఇప్పటివరకు గరిష్టంగా ఉండగా, ఈ ఏడాదిలో పులుల మరణాలు ఆ మార్కును దాటేశాయని తెలిపింది. ఈ ఏడాది పులుల మరణాలు అధికంగా మధ్యప్రదేశ్‌లో 44, మహారాష్ట్రలో 26, కర్ణాటకలో 14 ఉన్నాయని పేర్కొన్న ఎన్టీసీఏ తెలంగాణలో 4 పులులు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి మరణించినట్లు వెల్లడించింది. 2012 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా మొత్తంగా 877 పులులు మరణించగా, ఇందులో అధికంగా మధ్యప్రదేశ్‌లోనే 202 మరణాలు ఉన్నాయని తెలిపింది. 2012 నుంచి 2020 వరకు తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 8 పులులు మరణించాయంది. చనిపోయిన పులుల్లో 55.78% టైగర్ రిజర్వ్‌లోనూ, మరో 31.62% రిజర్వ్ సరిహద్దులకు బయట చనిపోయాయని వెల్లడించింది. పులుల మరణాలకు సంబంధించి 88.91% కేసులు పరిష్కారమయ్యాయని నివేదిక తెలిపింది. -
Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..!
ప్రాణహిత, గోదావరి, కిన్నెరసాని నదుల వెంట ప్రయాణాన్ని సాగించిన మగ పులి ఆడతోడు కోసమే ఇటువైపుగా వచ్చినట్లు తెలుస్తోంది. 26 రోజులపాటు సాగిన ప్రయాణంలో తోడు దొరకకపోవడంతో తిరిగి సిర్పూర్‌కు వెళ్తున్నట్లు దాని గమనం చూస్తుంటే స్పష్టమవుతోంది. ఈ పులి సిర్పూర్ ప్రాంతానికి చెందినదని, పేరు ఎస్–8 అని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ మగపులి ఉమ్మడి జిల్లాలో సాగించిన ప్రయాణం.. దాని ప్రత్యేకతలు, ఎందుకు.. ఎలా వచ్చిందన్న దానిపై ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ కథనం.. – పోతరాజు రవిభాస్కర్, భూపాలపల్లి మహారాష్ట్రలోని తాడోబా రిజర్వ్ ఫారెస్ట్‌లో పుట్టిన ఈ మగపులి ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిదేళ్లు ఉంటుంది. రెండేళ్ల వయసులో తల్లినుంచి దూరమై అక్కడినుంచి కుమురం భీం జిల్లాలోని సిర్పూర్ ప్రాంతానికి వచ్చింది. అక్కడి అటవీశాఖ అధికారులు దీనిని గుర్తించి ఎస్–8గా నామకరణం చేశారు. పులులు అభయారణ్యంలో సుమారు 25 నుంచి 30 చదరపు కిలోమీటర్లు తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ తాను ఉన్న విషయాన్ని గుర్తించేలా ఆ ప్రాంతం చుట్టూ మలం, మూత్రం విసర్జిస్తుంది. మూత్రం ఎక్కువ కాలంపాటు రసాయనాల మాదిరిగా వాసన వస్తుంది. దీంతో అటువైపు ఇతర జంతువులు, పులులు రావు. కొన్ని సందర్భాల్లో బలమైన పులి వెళ్లి దాడికి పాల్పడినప్పుడు, అక్కడి పులి తన తోడును వదిలి దూరంగా వచ్చేస్తుంది. ఈ మాదిరిగానే ఎస్–8 పులి వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మేటింగ్ సీజన్ కావడంతో... పులులకు చలికాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మేటింగ్(సంభోగం) సీజన్.. దీంతో సిర్పూర్ నుంచి బయలుదేరిన ఎస్–8 మేటింగ్ చేసేందుకు ఆడపులిని వెతుక్కుంటూ వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల అడవుల్లో తిరిగింది. ఆడతోడు కానరాకపోవడంతో తిరిగి సిర్పూర్‌కు బయలుదేరింది. ఎస్–8గా ఎలా గుర్తించారంటే.. సాధారణంగా పాదముద్రలు(పగ్‌మార్క్స్) ఆధారంగా పులిని గుర్తించి ఆడదా, మగదా అని నిర్ధారిస్తారు. పులుల చర్మంపై చారలు వేర్వేరుగా ఉంటాయి. ఒక పులి చారలను మరో పులి పోలి ఉండదు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా పులిని మొదటిసారి గుర్తించిన చోటే దానికి నామకరణం చేస్తారు. 2020, అక్టోబర్ 11న సిర్పూర్ అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాకు చిక్కిన, ములుగు జిల్లా మంగపేట అడవిలో గత నెలలో సీసీ కెమెరాకు చిక్కిన పులి చారలు ఒకే మాదిరిగా ఉన్నాయి. దీంతో అది సిర్పూర్ నుంచి వచ్చిన ఎస్–8గా అటవీశాఖ అధికారులు ధ్రువీకరించుకున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడా మనుషులపై దాడి చేసిన ఘటన లేకపోవడంతో మ్యాన్ఈటర్ కాదని అటవీశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో కూడా ఒక పులి భూపాలపల్లి మీదుగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగి తోడు దొరకకపోవడంతో మళ్లీ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా మీదుగా సిర్పూర్ అడవులకు తిరిగి వెళ్లింది. అయితే గతంలో ఆ పులి ఎక్కడా కనిపించలేదు. దీంతో దానికి ఎం(ములుగు)–1గా నామకరణం చేశారు. ►గురువారం రాత్రి భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. భూపాలపల్లి జిల్లాలోని అడవుల మీదుగా కాళేశ్వరం గోదావరి వరకు వెళ్లి, నది దాటి తిరిగి సిర్పూర్ వైపునకు వెళ్లనున్నట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ►30న ములుగు అడవుల్లోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన రాత్రి ములుగు మండలం ఇంచర్ల గ్రామ సమీపంలో గల ఎన్‌హెచ్ 163 రహదారి దాటింది. తాజాగా గురువారం వెంకటాపూరం(ఎం) మండలం రామకృష్ణాపూర్ అడవిలో పులి అడుగులను గుర్తించారు. ►29వ తేదీన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటమీదుగా పాకాలకు చేరుకుంది. కొత్తగూడ వెళ్లే దారిలో రోడ్డుదాటుతుండగా ఇద్దరు వాహనదారులు గమనించి భయంతో పరిగెత్తారు. పులి ఆ రోజు మొత్తం ప్రయాణం సాగించింది. ►ఎస్–8 పులి సిర్పూర్ నుంచి అక్టోబర్ చివరి వారంలో బయలుదేరి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోని సిరొంచకు చేరుకుంది. అదే నెల 28వ తేదీన మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా పరిధిలోని పెంటిపాక గ్రామ సమీప అడవిలో పశువుల కాపరి దుర్గం మల్లయ్య(48)పై దాడి చేసి చంపింది. సుమారు వారం రోజులు అదే ప్రాంతంలో ఉంది. ►25వ తేదీన మహబూబాబాద్ జిల్లాకు చేరుకొని గూడూరు మండలం నేలవంచ సమీప అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన రెండు లేగదూడలపై దాడి చేసి చంపింది. అనంతరం మూడు రోజులు అక్కడే ఉంది. ►12వ తేదీన మంగపేట నుంచి నర్సింహాపూర్ మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి చేరుకుంది. అక్కడ పినపాక మండలం అమరారం సమీప అడవిలో పశువుల మందపై దాడి చేసి ఒక ఆవుని చంపింది. ఆజిల్లా అడవుల్లో సుమారు 12 రోజులు గడిపింది. ►8వ తేదీ రాత్రి ములుగు జిల్లాలోకి ప్రవేశించింది. రెండు రోజులపాటు ప్రయాణం చేస్తూ తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి, కామారం మీదుగా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామం చింతలమోరి వద్ద గల రోడ్‌ను క్రాస్ చేసి హీరాపూర్, తొండ్యాల లక్ష్మీపురం మీదుగా మంగపేట మండలంలోకి 11వ తేదీన చేరింది. ►గత నెల 7న గోదావరి నది దాటి కాళేశ్వరం, పలిమెల మీదుగా భూపాలపల్లి మండలంలోని దూదేకులపల్లి శివారు అడవిలో గల మద్దిమడుగుకు 8వ తేదీన చేరుకుంది. -
వావ్ ఏంటి అద్భుతం... పులులు వాకింగ్ చేస్తున్నాయా!
మహారాష్ట్ర: నిజానికి ఏనుగులు, గేదేలు, తదితర జంతువులే గుంపులు గుంపులుగా వస్తాయి. సింహాలు ఎక్కువగా ఒంటరిగానే సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడోక అరణ్యంలో మనుషుల మాదిరిగా వాకింగ్ చేస్తున్నట్లుగా ఒకేసారి ఆరు సింహాలు ఎలా చక్కగా కలిసి నడుస్తున్నాయో చూడండి. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) అసలు విషయంలోకెళ్లితే... ఆరు పులులు కలిసి అటవీ మార్గంలో నడుస్తున్నాయి. అయితే కొన్ని సెకన్ల తరువాత వెనుక నుండి ఒక వాహనం పులుల వద్దకు వస్తుంటుంది. అంతేకాదు ఆ వాహనాన్ని గుర్తించిన ఒక పులి అడవిలోకి పరుగెత్తుతుంది. ఈ మేరకు మహారాష్ట్రలోని ఉమ్రేద్ కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో 6 పులులు కలిసి నడుస్తున్నట్లు ఉన్న అరుదైన వీడియోని బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా "చప్పర్ ఫాడ్ కే" అనే క్యాప్షన్‌ని జోడించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ మేరకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) అధికారి రమేష్ పాండే మాట్లాడుతూ "ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం. ఇటీవల కాలంలో మేము పన్నా పెంచ్, దుధ్వాలో 5 పులుల సమూహాలను చూశాము కానీ ఇప్పుడు 6 పులులు కలిసి నడుస్తున్నాయి. అయితే ఇది నిజమేనా అని ఇప్పటికీ అనిపిస్తుంది" అని అన్నారు. అంతేకాదు నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వ్యవసాయ చట్టాల రద్దుపై యూఎస్ కాంగ్రెస్ స్పందన) Chappar Phad ke .. Umrer - karhandla VC : WA forward pic.twitter.com/qrQUb4Jk5P — Randeep Hooda (@RandeepHooda) November 19, 2021 -
దాక్కో పులి.. లేదంటే ఉచ్చుకు బలి
సాక్షి, మంచిర్యాల: వలస పులులకు వేటగాళ్ల ఉచ్చులు దినదినగండంలా మారాయి. కొంత కాలంగా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా– అందేరీ, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి పులుల అభయారణ్యం నుంచి తెలంగాణలోకి పులులు అడుగుపెడుతున్నాయి. కాగజ్‌నగర్‌లో కొన్ని పులులు స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకుని వాటి సంతతి పెంచుకుంటున్నాయి. అలా ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న పెన్‌గంగా, ఆసిఫాబాద్‌కు, మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత, గోదావరి దాటి ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి, గోదావరి నదుల తీరం దాటి భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలకు పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. గత ఐదేళ్లుగా ఈ వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లోనూ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వలస వస్తున్న పెద్దపులులకు వేటగాళ్ల ఉచ్చులు సవాల్‌గా మారాయి. కొందరు వేటగాళ్లు పులి సంచరించే ప్రాంతాలు తెలుసుకుని డబ్బు ఆశతో వాటిని మట్టుబెట్టే ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూశాయి. జీవ వైవిధ్యంలో ప్రధాన పాత్ర పోషించే జాతీయ జంతువు.. భవిష్యత్ తరాలకు గోడ చిత్రంగా మిగిలిపోతుందా అని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు పరిధిలో కే 4 (కాగజ్‌నగర్) అనే ఆడ పులికి వేటగాళ్లు అమర్చిన ఉచ్చు నడుము వద్ద చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలోనే సంచరిస్తోంది. ఈ పులి జీవించి ఉందో లేదోననే అనుమానాలున్నాయి. ఈ చిత్రంలో కర్రకు బిగించి ఉన్న వైరు (వృత్తంలో) వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ కంచె. ఏదైనా జంతువు ఈ వైరుకు తాకగానే కొద్ది సెకండ్లలోనే ప్రాణాలు కోల్పోతుంది. రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేట గ్రామస్తులు ఈ కంచెపై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే కరెంట్ సరఫరా నిలిపివేశారు. అయితే అటవీ అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనికి సమీపంలోనే నాగంపేట, బొప్పారం ప్రాంతాల్లో జే–1 అనే మగ పులి సంచరిస్తోంది. 2016లో ఇదే మండలంలోని పిన్నారంలో విద్యుత్ కంచెకు తగిలి మూడేళ్ల వయసున్న మగ పులి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల అడవుల్లో ఇదే తీరున ఉచ్చు వేసి పులిని హతమార్చారు. దేశవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటనలు జరగడం వాటి ప్రాణాలకున్న ముప్పును, అటవీ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. కాగజ్‌నగర్ అడవుల్లో పులి కూనల సయ్యాట పులి సంరక్షణకు చర్యలు పులి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కొందరు రైతులు పంటల రక్షణకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తుండడంతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోంది. అలాగే, వేటగాళ్ల నుంచి కూడా జాతీయ జంతువు ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. పలుచోట్ల పోడు భూములు పులి ఆవాసాలకు ప్రతికూలంగా మారాయి. ఉచ్చులు, వేట ఎంత ప్రమాదకరమైనవో అటవీ సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పులి కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉంటున్నాం. శివాని డోగ్రా, జిల్లా అటవీ అధికారి, మంచిర్యాల జిల్లా -
జనావాసాల్లోకి వన్యమృగాలు
-
పులుల అభయారణ్యం చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం చుట్టూ ఉన్న వెలుపల అటవీ ప్రాంతాన్ని కేంద్ర అటవీ శాఖ పర్యావరణ సున్నిత ప్రాంతం (ఎకో సెన్సిటివ్ జోన్)గా గుర్తించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్ని కేంద్ర అటవీ శాఖ ఎట్టకేలకు ఆమోదించింది. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రవి అగర్వాల్ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన 47వ ఎకో సెన్సిటివ్ జోన్ నిపుణుల కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్.ప్రతీప్‌కుమార్ ఇతర అటవీ శాఖాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పులుల అభయారణ్యం చుట్టూ విస్తరించి ఉన్న రిజర్వ్ ఫారెస్ట్, మిగిలిన అటవీ ప్రాంతాన్ని 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపిందని ప్రతీప్‌కుమార్ చెప్పారు. సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 3,727.82 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉందని తెలిపారు. దానిచుట్టూ ఉన్న 2,149.68 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా గుర్తించాలని గతంలో ప్రతిపాదనలు పంపామన్నారు. అభయారణ్యం బయట ఉన్న సరిహద్దు నుంచి వివిధ ప్రదేశాల్లో 0 కిలోమీటర్ల నుంచి 26 కిలోమీటర్ల దూరం వరకు ఎకో సెన్సిటివ్ జోన్‌గా ఉంటుందని తెలిపారు. ఈ జోన్ వల్ల పులులు, ఇతర వన్యప్రాణుల స్వేచ్ఛకు, మనుగడకు మరింత భద్రత ఏర్పడుతుందన్నారు. ఆ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత నెలకొని పచ్చదనం కూడా పెరుగుతుందని చెప్పారు. సేంద్రియ వ్యవసాయానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ జోన్ పరిధిలో వర్షపు నీటిని వివిధ పద్ధతుల్లో నిల్వ చేసుకుని జంతువులకు నీటి సమస్య లేకుండా చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో శ్రీశైలం పులుల అభయారణ్యం సంరక్షణాధికారి వై శ్రీనివాసరెడ్డి, శివప్రసాద్, సునీత పాల్గొన్నారు. -
బెబ్బులి కోట.. పులుల ఆవాస కేంద్రంగా నల్లమల
పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే మానవాళితో పాటు జంతువుల నివాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ప్రభుత్వాలు వీటికి లెక్కలు వేసి, అవసరమైన చోట ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తుంటాయి. మనదేశంలో పర్యావరణ పిరమిడ్‌లో పెద్ద పులిని అగ్ర సూచిగా గుర్తించారు. అలాంటి పులులకు నల్లమల ఫారెస్ట్ సురక్షిత ఆవాస కేంద్రంగా మారింది. వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, కర్నూలు: ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గి పోతుండడంతో వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రపంచంలో బతికి ఉన్న పెద్ద పులుల సంఖ్య 4000 వరకు ఉండగా అందులో ఒక్క భారత దేశంలోనే వాటి సంఖ్య యాభై శాతానికి పైగా అంటే 2,226 గా ఉండడం గమనార్హం. ఇటీవల ప్రకటించిన అరుణాచల్ ప్రదేశ్ లోని కమలంగ్ టైగర్ రిజర్వ్‌తో కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 50 పెద్ద పులుల అభయారణ్యాలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్– శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) దేశంలోనే అతి పెద్దది(3,568 చ.కిమీ). నల్లమలలో ఏర్పాటు చేసిన ఇన్ఫ్రా రెడ్ కెమెరా నల్లమల పులి సంరక్షణకు దుర్గం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవులు పులి సంరక్షణకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాయి. పులి సంతతి వృద్ధికి ఈ ప్రాంతం అత్యంత అనుకూల పర్యావరణాన్ని కలిగి ఉంది. గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యం (జీబీఎం)లో కూడా పులులు క్రమేపి విస్తరిస్తూ కడప జిల్లా వరకు చేరుకుంటున్నాయి. నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యంలో సిబ్బంది పర్యవేక్షణ, మానవవనరులను అత్యంత ప్రతిభావంతంగా వినియోగించుకోవడం ద్వారా పులుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిని గుర్తించిన ఎన్టీసీఏ 2014లో అత్యున్నత ప్రతిభా అవార్డుతో అభినందించింది. సుదీర్ఘ ఆకలి తర్వాతే వేటపులి ఎప్పుడంటే అప్పుడు వేటాడదు. ఎంతో ఆకలి వేస్తేనే వేట మొదలుపెడుతుంది. సంవత్సరానికి ఒక పులి 50 నుంచి 60 జంతువులను తన ఆహారానికి వినియోగించుకుంటుందని అటవీ అధికారులు తెలిపారు నల్లమలలో పులుల ఉనికి పెరుగుతుందిలా.. సంవత్సరం ఎన్ఎస్టీఆర్ జీబీఎం మొత్తం 2016 23 17 40 2017 25 21 46 2018 50 పైగా ఉండొచ్చని అంచనా 100 పైగానే పెద్ద పులులు ఉన్నట్లు అంచనా పులి సామ్రాజ్యం ప్రత్యేకం పులుల తమ కోసం ఓ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాయి. సాధారణంగా ఒక మగ పులి తన ఆహార లభ్యతను బట్టి తన విహార ప్రాంతాన్ని గుర్తిస్తుంది. నల్లమలలో ఒక పులి సాధారణంగా తన ఆధీన ప్రాంతం (టెరిటరీ) 50 చ.కిమీ గా ఉంచుకుంటుంది. అయితే తన భాగస్వామి, ఆహారం కోసం 200 చ.కి.మీ. పరిధి వరకు విహరిస్తుంది. అదే రాజస్థాన్‌లోని రణతంబోర్ పులుల అభయారణ్యంలో అది ఇందులో సగం మాత్రమే ఉంటుంది. పులి తన మూత్రం వెదజల్లడం ద్వారా తన టెరిటరీ సరిహద్దులను నిర్ణయించుకుంటుంది. నల్లమల అడవిలో పులులు లెక్కింపులో ప్రామాణికం స్టాండర్డ్ పగ్ మార్క్ పెద్ద పులుల పాద ముద్రలు సేకరించి వాటి ఆధారంగా పులుల సంఖ్యను అంచనా వేస్తారు. దీనినే స్టాండర్డ్ పగమార్క్ ఎన్యూమరేషన్ పద్ధతి అని అంటారు. ప్రస్తుతం జాతీయ జంతువుల అంచనాకు పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటున్నారు. అడవుల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిల్లో పడే చిత్రాల ఆధారంగా పులుల చారలను విశ్లేషిస్తారు. వాటి చారలు మనుషుల వేలిముద్రలలాగే దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. పులి సంరక్షణ కఠినతరం పులి అత్యంత సున్నితమైన జంతువు. పులి సౌకర్యంగా జీవించడానికి తగిన పర్యావరణాన్ని ఏర్పరచడం ఎంతో క్లిష్టతరంగా ఉంటుంది. నల్లమల అడవులు ఆకురాల్చు అడవులు కావడంతో పులికి ఆహారమైన జంతువులకు సంవత్సరం పొడవునా గడ్డి లభించదు. దీంతో పులికి కావాల్సిన ఆహారపు జంతువుల సంఖ్య అడవిలో తగ్గకుండా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నల్లమలలో పులుల పెరుగుదల కనిపించడం సిబ్బంది పనితనానికి గుర్తుగా చెప్పవచ్చు. – అలాన్ చోంగ్ టెరాన్, డీఎఫ్ఓ, ఆత్మకూరు -
అడవి 'పులి'కిస్తోంది
సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: పెరుగుతున్న పులి గాండ్రిపులతో అడవి పులకిస్తోంది. జీవ వైవిధ్యం పరిమళిస్తోంది. నడకలో రాజసం.. వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వెరసి పెద్ద పులులు ఊపిరి తీసుకుంటూ సంతానాన్ని పెంచుకుంటున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. పశ్చిమ గోదావరి జిల్లా పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ వాటి కదలికలు మెరుగుపడ్డాయి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3,900 పులులు మాత్రమే మిగిలి ఉండగా.. మన దేశంలో 2,967 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని 80 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయి. వాటి సంఖ్య మన రాష్ట్రంలో క్రమంగా పెరుగుతుండటం విశేషం. నల్లమలలో రెట్టింపైన వ్యాఘ్రాలు మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశంలోనే అతి పెద్దది. ప్రస్తుతం ఇక్కడ 63 పులులను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించారు. దీనిని బట్టి వీటి సంఖ్య 80 వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2014లో కేవలం 40 పులులు మాత్రమే ఉండగా.. ఏడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వరకు పులులు విస్తరించాయి. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు భద్రాచలం వరకు విస్తరించి ఉన్న పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ పులుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతంలో నాలుగు పులులు, ఐదు చిరుత పులులను అధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు పెరగడంతో.. కేంద్ర ప్రభుత్వం 1973 నుంచి ‘ప్రాజెక్ట్ టైగర్’ పేరుతో వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టింది. ఫలితంగానే దేశంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న పులులకు మన రాష్ట్రంలోని పాపికొండల అభయారణ్యం ఆవాసంగా మారింది. అభయారణ్యం పరిధిలోని ఉభయ గోదావరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలో 1,012.86 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 1,01,200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని అభయారణ్యంగా 2008లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో జాతీయ పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మరోవైపు వన్యప్రాణుల సంరక్షణపై అటవీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలోని గోగులపూడి, పోలవరం మండలం టేకూరు ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. అభయారణ్యం సంరక్షణ, జంతువుల జాడ కోసం ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవగాహన పెంచుకోవాలి పులుల సంరక్షణ అందరి బాధ్యత. పర్యావరణానికి అవి ఎంతో మేలు చేస్తాయి. వాటిపై అవగాహన పెంచుకుని పరిరక్షణకు నడుం బిగించాలి. మన రాష్ట్రంలో పులుల సంఖ్య బాగా పెరుగుతోంది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వాటికి బాగా అనుకూలంగా ఉంది. అందుకే పులుల ఆవాసాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. – రాహుల్ పాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) పులులను రక్షించాలి పర్యావరణ పిరమిడ్‌లో అగ్రసూచిగా ఉండేది పెద్ద పులి. ఆ తర్వాత చిరుత పులులు వంటి టాప్ కార్నివోర్స్ జీవ వైవిధ్యాన్ని కాపాడే గురుతర బాధ్యతతో ఉంటాయి. వాటి సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం. వన్య ప్రాణులు కనిపిస్తే అటవీ శాఖ దృష్టికి తీసుకు రావాలి. పులులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – సి.సెల్వమ్, వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, రాజమండ్రి ట్రాప్ కెమెరాల్లో పులుల జాడ పాపికొండల అభయారణ్యంలో పులుల సంచారం బాగుంది. మేం గ్రామాల్లో పర్యటించిన సమయంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు పులుల గాండ్రింపులు విన్నట్టు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. గత నెల, ఈ నెలలో చిరుత పులులు, ఇతర జంతువుల జాడ కెమెరాకు చిక్కింది. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, పాపికొండలు వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ అధికారి -
పాపం.. పులిరాజు; భయపెడుతున్న మరణాలు
ముంబై సెంట్రల్: మహారాష్ట్రలో గత 6 నెలల్లో 22 పులులు మృతి చెందాయి. ఈ సంఘటన కొంత ఆందోళన రేకేత్తించేలా చేసింది. కంజర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (ఎల్‌ఎడబ్ల్యూ) అనే సంస్థ అటవీ శాఖకు చెందిన పలు సర్వేలు పరిశోధనల్లో పాలు పంచుకుంటోంది. ఏడాదిన్నర నుంచి దేశంలో కరోనా ప్రకోపం పెరిగి పోవడంతో మొదటి వేవ్ కంటే రెండవ వేవ్‌లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రత్యక్షంగా పులుల మరణాలకు, కరోనా వ్యాప్తికి సంబంధం లేకపోయినప్పటికీ, అటవీ ప్రాంతాలలో, సరిహద్దు గ్రామీణ ప్రాంతాలలో పులుల సంరక్షణలో విధులు నిర్వహించే సిబ్బంది కూడా కరోనా బారిన పడటంతో పులుల రక్షణపై ఆ ప్రభావం పడిందని సీఎల్‌ఎడబ్ల్యూ ప్రతినిధి ఒకరు తెలిపారు. పులుల సంరక్షణ విషయంలో జనజాగృతి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నామని, సంవత్సర కాలం ప్రయత్నించడంతో ఈ గణాంకాలు తెలిశాయన్నారు. పులుల మరణాల వెనక ఉన్న కారణాలను పరిశోధించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇందుకోసం సమయం, సంయమనం రెండూ అవసరమని కంజర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ వ్యవస్థాపక సభ్యుడు సారోశ్ లోధి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 86 పులుల మృతి.. దేశ వ్యాప్తంగా గత ఆరు నెలల్లో 86 పులులు మత్యువాత పడ్డాయి. గత రెండు సంవత్సరాల నుంచి పులుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. పులుల మరణాల్లో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పులుల మరణాల్లో 153 శాతం పెరుగుదల కనిపించింది. గతంలో రెండు సార్లు చేపట్టిన పులుల గణనలో పులుల సంఖ్య పెరుగుతున్నట్లుగా తేలినప్పటికీ, మరోవైపు పులుల మరణాలు ఎక్కువగా సంభవించడం అటవీ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. పులుల మరణాల్లో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్(26) ఉండగా 2వ స్థానంలో మహారాష్ట్ర ఉంది. కర్ణాటక(11) మూడో స్థానంలో నిలిచింది. 30 జూన్ 2021 వరకు దేశలో 86 పులులు మత్యువాత పడ్డట్లుగా అటవీ శాఖ ప్రకటించింది. జూలైలో కూడా మూడు పులులు మరణించాయి. 2020లో 98 పులులు మృత్యువాత పడ్డాయి. ఇందులో 56 పులులు మొదటి 6 నెలలు అంటే జూన్ 2020లోపే మరణించాయి. 2019 సంవత్సరంలో కేవలం 84 పులులు మాత్రమే చనిపోయాయి. 3 సంవత్సరాలుగా పులుల మృత్యురేటు పెరుగుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం మొదటి 3 నెలల్లో దేశవ్యాప్తంగా 39 పులులు, ఆరు నెలల్లో 86 పులులు మరణించాయి. -
కొమురంభీం జిల్లాలో రోడ్లపైకి వస్తున్న పెద్దపులులు
-
పులులు ఈదితే, మొసళ్లు ఒడ్డున సేద తీరుతాయి
అడవంటే పూర్తిగా అడవీ కాదు, నది పాయ అందామంటే అవి మాత్రమే కాదు. సముద్రతీరం అనుకుందామంటే కచ్చితంగా అలా కూడా చెప్పలేం. గంగ, మేఘన, బ్రహ్మపుత్ర వేటికవి తమ దారిన తాము పయనిస్తూ అటవీప్రాంతానికి పచ్చదనాన్ని అద్దుతూ ఉంటాయి. నదులు పాయలు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంటాయి. నీటి పాయల తీరాన ఎల్తైన మడ అడువులు తెచ్చిన ప్రాకృతిక సౌందర్యం మాటల్లో వర్ణించలేనిది. ఆ చెట్ల వల్లనే ఈ అడవికి సుందర్వన్ అనే పేరు వచ్చింది. బెంగాలీ, ఒడిషా భాషల్లో ‘వ’ అనే అక్షరం ఉండదు. ‘వ’ కు బదులుగా ‘బ’ ఉపయోగిస్తారు. అందుకే ఈ సుందరవనం సుందర్బన్ అయింది. నీటిలో పులి నేల మీద మొసలి అడవి అంటే... పులి అడవిలో ధీరగంభీరంగా సంచరిస్తూ ఉంటుందని కరెక్ట్‌గానే ఊహిస్తాం. నీటి మడుగులో అడుగు పెట్టాలంటే మొసలి ఉంటుందేమోనని భయపడతాం కూడా. అయితే... సుందర్బన్లో పులులు నీటిలో ఈదుతూ కనిపిస్తాయి. మొసళ్లు ఒడ్డున సేద దీరుతుంటాయి. ఆ దృశ్యం కంటపడగానే గుండె ఆగిపోయినట్లవుతుంది. రకరకాల పక్షులు... మొత్తం రెండొందల యాభై రకాలకు పైగా జాతులుంటాయని అంచనా. ఈ టైగర్ రిజర్వ్‌లో నాలుగు వందల బెంగాల్ రాయల్ టైగర్‌లుంటాయి. రాత్రి బస చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. అడవిలో ఊళ్లు మొత్తం పదివేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అడవి ఇది. నాలుగువేలకు పైగా చదరపు కిలోమీటర్లు మనదేశంలో ఉంది. దాదాపు ఆరు వేల చదరపు కిలోమీటర్లు బంగ్లాదేశ్‌లో ఉంది. ఇది మనదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. విశాలమైన ఈ అటవీప్రాంతంలో నదులు, నీటి పాయల మధ్య మొత్తం నూట రెండు దీవులున్నాయి. నూటా రెండు దీవులకు గాను యాభై నాలుగు దీవులు జనావాసాలు. అడవి మధ్య ఊర్లన్నమాట. ఈ దీవుల్లో పంటలు పండిస్తారు. అడవి మధ్య ప్రవహించే నదుల్లో జాలరులు చేపలు పడుతుంటారు. రోజూ ఉదయం సాయంత్రం ఇక్కడ బంగాళాఖాతం చేసే అల్లరిని చూడవచ్చు. అలలు ఆరడుగుల నుంచి పదడుగుల ఎత్తుకు లేస్తాయి. ఆ భారీ అలలతో నీటితోపాటు ఇసుక కూడా అడవిలోకి కొట్టుకు వచ్చి మేట వేస్తుంటుంది. పడవలు, లాంచీలలో దీవులన్నింటినీ చుట్టి రావచ్చు. సరిహద్దు దీవి మనదేశానికి సరిహద్దులో ఉన్న దీవి పేరు ‘గోసాబా’ ఇది నీటి మట్టానికి 13 అడుగుల ఎత్తులో ఉంది. ఇది నిజానికి భారత ప్రధాన భూభాగానికి ఆనుకుని ఉండదు. విడిగా ఉంటుంది. నీటి ఎల్లలో మన సరిహద్దుకు లోపల ఉంది. ఇది ఒక పంచాయితీ. ఇందులో నివసించే ప్రజల కోసం స్కూలు, హాస్పిటల్ కూడా ఉన్నాయి. ప్రధాన భూభాగంలోకి రావాల్సిన అవసరం లేకనే హాయిగా జీవించేయవచ్చు. సాహిత్యవనం సుందర్బన్ అటవీప్రదేశం కోల్‌కతాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ‘న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ నేచర్’ కేటగిరీలో లిస్ట్ అయింది. బెంగాలీ రచయితలు సుందర్బన్ అటవీ ప్రదేశం, ఇక్కడి దీవుల్లోని జన జీవనమే కథాంశంగా అనేక రచనలు చేశారు. సుందరబన్‌కు ప్రత్యేక హోదాలు ► 1973 టైగర్ రిజర్వ్ ► 1987 వరల్డ్ హెరిటేజ్ సైట్ ► 1989 నేషనల్ పార్క్ -
అరుదైన దృశ్యం.. ఒకేసారి మూడు పులులు
మైసూరు: సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఒకేసారి మూడు పులులు దర్శనమిచ్చాయి. ఈ ఘటన చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా బిళిగిరి రంగనాథస్వామి అటవీ ప్రాంతంలో జరిగింది. దీంతో పర్యాటకులు ప్రాణభయానికి గురయ్యారు. అడవిలో పులులు ఉన్నా పర్యాటకులకు కనిపించడం అరుదు. (చదవండి: కిలాడీ దంపతులు: బండారం బట్టబయలు..) బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం -
వైరల్: పిచ్చెక్కినట్లు కొట్టుకున్న పులులు
ఢిల్లీ: ఇండియాలోని ఒక జాతీయ పార్కులో రెండు పులులు భీకరంగా ఫైట్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కశ్వాన్ వీడియోనూ ట్విటర్లో షేర్ చేశారు. ఆ వీడియోలో.. రెండు పులులు పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాయి. కొన్ని సెకన్ల వ్యవధిలో ఏం జరిగిందో తెలియదు కానీ పిచ్చెక్కిందా అన్న రేంజ్లో కొట్టుకున్నాయి. ఇంకా కొద్దిసేపు అలాగే ఫైట్ చేసి ఉంటే కచ్చితంగా ఏదో ఒక పులి ప్రాణం పోయి ఉండేది. అయితే అదృష్టం బాగుండి రెండో పులి తలొంచినట్లుగా కిందపడి కాస్త తగ్గడంతో మొదటి పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రెండు పులుల మధ్య జరుగుతున్న భీకరపోరును పక్కనే ఉన్న ఒక టూరిస్టు బృందం స్వయంగా చూసి కాసేపు ఉత్కంఠకు లోనయ్యారు. అవి రెండు కొట్టుకుంటూ తమ మీదకు ఎక్కడ వస్తాయోనని వాళ్లు తెగ భయపడిపోయారు. కానీ అదృష్టం బాగుండి పులి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ టూరిస్టు బృందానికి ప్రమాదం తప్పినట్లయింది.చదవండి: ఛీ ఛీ రుచిగా లేవు.. తిన్నాక నాకు లూజ్ మోషన్స్.. -
కూతురు కూతురే.. పేకాట పేకాటే..
ఇక్కడ రెండు పులులు భీకరంగా కొట్టేసుకుంటున్నాయి గానీ.. నిజానికివి తల్లీకూతుళ్లు.. మొన్న మొన్నటి వరకూ కలిసి ఉన్నవే.. కానీ ఇప్పుడు కూతురు తన జాగాలో అడుగుపెడితే చాలు... వాళ్లమ్మ కస్సుమంటోంది. ఇదిగో ఇలా పైన పడి కొట్టిసింది కూడా.. అడవుల్లోని పులులు తమ ప్రాంతంలోకి వేరే పులులు వస్తే చాలు.. ఇలాగే రియాక్ట్ అవుతాయి. ఎవరి రాజ్యం వాళ్లదన్నమాట.. సాధారణంగా పిల్లలను ఏమీ అనవని.. అయితే.. ఇక్కడ పులుల సంఖ్య పెరిగిందని.. దానివల్ల స్థలం కరువై చివరికి తల్లీకూతుళ్లు కూడా ఇలా చీటికిమాటికీ గొడవపడే స్థాయికి పరిస్థితి చేరిందని అటవీ రేంజర్లు చెబుతున్నారు. ఈ చిత్రాలను రణతంబోర్ జాతీయ పార్కులో పుణెకు చెందిన ఫోటోగ్రాఫర్ చంద్రబాల్ సింగ్ క్లిక్ మనిపించారు. -
అదిగో పెద్దపులి.. చచ్చాంరా దేవుడో!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి పులులు జనారణ్యంలోకి చొరబడటంతో కలకలం రేగింది. కుమురంభీం జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి ఇప్పటికే ఓ యువకుడి ప్రాణాలు తీయగా దాని జాడ ఇంకా కానరాలేదు. శుక్రవారం జిల్లాలోని బెజ్జూర్ మండలం అంబగట్ట గ్రామ సమీపంలోని గట్టుచెరువు అటవీ ప్రాంతంలో శుక్రవారం పెద్దపులి హల్చల్ చేసింది. మేకల కాపరులు కొండయ్య, ఉపేందర్‌కు పులి తారసపడటంతో ప్రాణాలను కాపాడుకోవటానికి చెట్టెక్కారు. పులి సంచరిస్తున్న విషయంపై కర్జెల్లి రేంజ్ అధికారి రాజేందర్ పశువుల కాపరుల వద్ద నుంచి వివరాలను సేకరించారు. అలాగే మంచిర్యాల జిల్లా వేమనపల్లి ముక్కిడిగూడెం అడవుల్లో పులి సంచరిస్తోంది. గురువారం అడవిలోకి వెళ్లిన వేమనపల్లికి చెందిన మేకల కాపరి దేవనబోయిన భానేశ్కు పులి తారసపడింది. దీంతో సదరు యువకుడు ప్రాణభయంతో పరుగులు తీయగా.. మేకలు చెల్లాచెదురై ఇంటి ముఖం పట్టాయి. రెండు రోజుల కిందట ముక్కిడిగూడెం శివారులోని పత్తి చేన్లలోకి పులి వచ్చి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పాతజాజులపేట మీదుగా ప్రాణహిత నది వరకు వచ్చి అంపుడొర్రె నుంచి పులి అడవిలోకి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. (చదవండి: ఐదు రోజులాయే.. పులి బోనులో చిక్కేనా..?) మేకల్ని చంపి దర్జాగా.. అనంతపురం/పామిడి: పామిడి మండలంలోని దిబ్బసానిపల్లిలో శుక్రవారం చిరుత కలకలం రేపింది. ఆ గ్రామానికి చెందిన మనోజ్ మేకలను శివారు ప్రాంతానికి మేత కోసం తోలుకెళ్లాడు. అదే సమయంలో చిరుత ఒక్కసారిగా మేకల మందపై పంజా విసిరింది. ఈ దాడిలో మూడు మేకలు మృతి చెందగా.. కొన్ని గాయపడ్డాయి. అప్రమత్తమైన మనోజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అటవీశాఖ అధికారులు చిరుత నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇక మేకలపై దాడి చేసిన అనంతరం పులి దర్జాగా ఓ బండరాళ్ల గుట్ట ప్రాంతంలో సంచరిస్తున్న దృశ్యాల్ని స్థానిక యువకులు తమ సెల్ ఫోన్లలో చిత్రించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
పదేళ్ల తర్వాత జిల్లాలో పులుల సంచారం!
సాక్షి, ములుగు: పదేళ్ల తర్వాత ములుగు జిల్లాలో పులి అడుగు జాడలు కనిపించాయి. దాదాపు రెండు నెలల క్రితం భూపాలపల్లి, మహాముత్తారం, కాటారం అడవుల్లో పులులు సంచరించాయి. అదే సమయంలో జిల్లాలో పులి సంచరించినట్లు పుకార్లు వినిపించారు. అయితే ఈ పుకార్లను కొట్టిపారేస్తూ గత నెల 12వ తేదీన ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 20 రోజుల సమయంలో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే వారం పది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించగా.. తాజాగా ఈ నెల 6న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి. కాగా ఏటూరునాగారం అభయారణ్యానికి కొత్తగూడ, పాకాల అభయారణ్యాలకు కనెక్టివిటీ ఉండడంతో ఒకే పులి ఆయా అడవుల్లో సంచరిస్తుందా లేదా మరోటి ఉందా అనే అనుమానంలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నట్లుగా రెండు నెలలుగా వార్తలు వినిపిస్తుండడంతో పులుల సంఖ్య అంశం సమస్యగా మారింది. సీసీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి రాష్ట్రంలోని అభయారణ్యాల్లోకి పులులు ప్రవేశించాయానే సమాచారం మేరకు జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత 10 సంవత్సరాల క్రితం జిల్లాలోని ఏటూరునాగారం వైల్డ్‌లైఫ్ అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. గత 25 రోజులుగా కెమెరాలను పరిశీలిస్తున్నా అధికారులకు పులి సంచారం విషయంలో స్పష్టత రావడంలేదని తెలిసింది. రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోకి ఐదు నెలల కాలంలో ఆరు పులులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అధికారులు స్ప ష్టతనివ్వడం లేదు. ప్రతీ 10 రోజుల సమయంలో పులులు ఆయా జిల్లాల అభయారణ్యంలో కన్పించడంతో స్పష్టమైన వివరాలు తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ.. పులి సంచారం విషయంలో ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రజలు తీవ్ర బయాందోళనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో ఏటూరునాగారం ఆభయారాణ్యాన్ని టైగర్ జోన్‌గా మార్పు విషయంలో అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టేందుకు ముందుకు సాగుతుండటంతో ఏజెన్సీ అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అత్యంత అరుదైన పులి పిల్లలు ఇవే!
బీజింగ్ : చైనా, హుఝౌలోని ‘ థైహు లేక్ లాంగేమెంట్ ప్యారడైజ్ జూ’లో అత్యంత అరుదైన పులి పిల్లలు జన్మించాయి. జేయింట్ పాండా కంటే అరుదైన జాతికి చెందిన ఓ గోల్డెన్ టైగర్ ఈ నెల 19న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం 24 గంటల వైద్య పర్యవేక్షణలో వాటిని ఉంచారు. జెనటిక్ మ్యూటేషన్ పద్ధతి ద్వారా బెంగాల్ టైగర్‌కు పుట్టిన జాతి ఈ గోల్డెన్ టైగర్. 2014 సర్వే ప్రకారం చైనాలో కేవలం 62 గోల్డెన్ టైగర్లు మాత్రమే ఉన్నాయని తేలింది. (వెబ్ సిరీస్ పిచ్చి 75 మందిని కాపాడింది) ఈ సంఖ్య అంతరిస్తున్న పాండా జాతి కంటే తక్కువ. బంగారు రంగుతో, ఎర్రని, గోధుమ రంగు చారలతో ఇవి చూడముచ్చటగా ఉంటాయి. అవి పెద్దవయ్యే కొద్ది చారలు రంగు మారి నలుపు రంగులోకి పోతాయి. ప్రస్తుతం ఈ నాలుగు పులి పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
జాతీయ మృగం జాడేది?
సాక్షి, పాల్వంచ: ఉమ్మడి జిల్లాలోని అటవీప్రాంతంలో పులుల జాడ కరువైంది. చిరుతల సంచారం కూడా లేదు. దట్టమైన అటవీప్రాంతం తగ్గిపోతుండటంతో అలికిడిలేని ప్రాంతంలో నివసించే మాంసాహార జంతువులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. ఇతర వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. కిన్నెరసాని అభయారణ్యంలోనే 20 వేల హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లాలో ఏయే రకాల అటవీ జంతువులు, ఎన్నెన్ని ఉన్నాయో తెలుసుకుందాం. భద్రాద్రి జిల్లాలో అటవీ ప్రాంతం 4,27,725 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఖమ్మం జిల్లాలో 62,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. 2017లో జాతీయ పులుల గణన జరిగింది. ఉభయ జిల్లాలో ఒక్క పులి ఆనవాళ్లు కూడా లభించలేదు. కాగా 2015లో మాత్రం కిన్నెరసాని అభయారణ్యంలోని పడిగాపురం బీట్‌లో పులి సంచారాన్ని గుర్తించారు. మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో జంతువుల గణన జరిగింది. భద్రాద్రి జిల్లాలోని 6 డివిజన్లు, 24 రేంజ్‌లు, 492 బీట్లు, ఖమ్మం జిల్లాలోని రెండు డివిజన్లు, 81 బీట్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు. పులులు, చిరుతల జాడ కన్పించలేదు. గతేడాది కూడా హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జీఓ బృందం వన్యప్రాణుల ఆక్యూపెన్సీ సర్వే నిర్వహించారు. అప్పుడు కూడా పులులు, చిరుతల జాడ కన్పించలేదు. అడవి దున్నలు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, కణుజులు, నెమళ్లు, కుందేళ్లు, కొండముచ్చులు తదితర జంతువులు, పక్షులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కిన్నెరసాని రిజర్వాయర్‌లో వందల సంఖ్యలో మోరేజాతి మొసళ్లు ఉన్నాయి. జంతువుల సంరక్షణకు వైల్డ్‌లైఫ్–1972 వంటి చట్టాలు ఉన్నా వేటగాళ్లు మాత్రం భయపడటంలేదు. నిత్యం వేటాడి వధిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో అటవీ జంతువులను వధించిన కేసులు 25 నమోదయ్యాయి. ఆరు డివిజన్ల పరిధిలో 35 జంతువులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డాయి. సామాజిక బాధ్యతగా గుర్తించాలి జిల్లాలో అటవీ జంతువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యత ఒక్క అటవీశాఖది మాత్రమేకాదు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా గుర్తించాలి. –లక్ష్మణ్ రంజిత్ నాయక్, భద్రాద్రి జిల్లా అటవీశాఖాధికారి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం 2017లో అభయారణ్యంలో జాతీయ పులుల గణన జరిగింది. పులులు, చిరుతల జాడ కన్పించలేదు. వన్యప్రాణులకు వేసవిలో కృత్రిమ తాగునీటి సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇతర సంరక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నాం. –కె.దామోదర్‌రెడ్డి, వైల్డ్‌లైఫ్ ఎఫ్డీఓ, పాల్వంచ -
పక్కాగా పులుల లెక్క
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పులుల సంఖ్య పెరగడానికి చేసిన కృషి ఫలిస్తోంది. నాలుగేళ్లలో వాటి సంఖ్య బాగా పెరిగింది. జూలై 29న గ్లోబల్ టైగర్ డే సందర్భాన్ని పురస్కరించుకొని గత ఏడాది చేపట్టిన పులుల గణన ఆధారంగా కేంద్రం మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 50 టైగర్ రిజర్వ్‌లలో ఉత్తరాఖండ్‌లో కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో అత్యధికంగా 231 పులులు, ఆ తర్వాత కర్ణాటకలోని నాగర్‌హోల్‌లో 127, బందీపూర్లో 127 పులులు ఉన్నట్టు వెల్లడించింది. మిజోరంలోని డంపా, బెంగాల్‌లోని బుక్సా, జార్ఖండ్‌లో పాలమూ రిజర్వ్‌లలో ఒక్క పులీ మిగల్లేదు. ఏపీలో 48, తెలంగాణలో 26 2018 పులుల గణన ప్రకారం దేశవ్యాప్తంగా 2,967 పులులు ఉండగా.. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నట్టు తాజా నివేదిక అంచనావేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 68 పులులు ఉండగా.. అప్పటికీ ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో 6 పులులు పెరిగాయి. నాగార్జునసాగర్(ఏపీ) టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 43 పులులు సంచరిస్తుండగా.. ఇందులో టైగర్ రిజర్వ్‌లోపలే 38 ఉన్నట్టు నివేదిక తెలిపింది. తెలంగాణలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 9 ఉండగా.. రిజర్వ్ లోపలి ప్రాంతంలో 7 ఉన్నట్టు నివేదిక తెలిపింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 1 ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న పులుల వయస్సు తక్కువని వివరించింది. 75% పులులు భారత్‌లోనే.. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో పులులు ఉన్నాయి. ఈ దేశాల్లోని మొత్తం పులుల్లో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్ వంటి దేశాల్లో పులులు బాగా కనిపిస్తాయి. 2018లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పులుల గణన గిన్నిస్ రికార్డులకు కూడా ఎక్కింది. కెమెరాల ద్వారా అతి పెద్ద వన్యప్రాణి సర్వేగా దీనిని గుర్తిస్తూ గిన్నిస్‌బుక్ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. పులుల సంరక్షణకు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తాం: జవదేకర్ 1973లో కేవలం తొమ్మిది మాత్రమే టైగర్ రిజర్వ్‌లు ఉన్న మన దేశంలో ఇప్పుడు వాటి సంఖ్య 50కి చేరుకుంది. దేశంలో ఉన్న అన్ని టైగర్ రిజర్వ్‌లూ నాణ్యతాపరంగా బాగున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ పులుల సంరక్షణ కోసం ఇతర దేశాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్ ఈ సంరక్షణ చర్యలకు నేతృత్వం కూడా వహిస్తుందన్నారు. అడవుల కొరత, సమృద్ధిగా వర్షపాతం లేకపోయినప్పటికీ భారత్ పులుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న చర్యలతో ప్రపంచ జీవవైవిధ్యంలో 8% పెరిగిందన్నారు. దేశంలో పులులు పెరిగింది ఇలా... 2006 1,411 2010 1,706 2014 2,226 2018 2,967 -
గిన్నిస్ ఎక్కిన పులుల గణన
సాక్షి, న్యూఢిల్లీ: భారత పులుల గణన–2018 గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సర్వే కోసం ఇండియా దేశవ్యాప్తంగా అడవుల్లో ట్రాప్ కెమెరాలతో పెద్ద పులులను 76 వేల ఫొటోలు తీసింది. వీటితో పాటు అడవి పిల్లులు, చిరుతపులులకు చెందిన 51 వేల ఫొటోలు సంగ్రహించింది. ఫలితంగా 2018 భారత పులుల గణన ప్రపంచంలోనే అతిపెద్దదైన కెమెరా ట్రాపింగ్ వైల్డ్ లైఫ్ సర్వేగా చరిత్ర సృష్టించింది. (కరోనా : చైనాపై మరో బాంబు) ఈ మేరకు గిన్నిస్ బుక్ సంస్ధ, భారత ప్రభుత్వానికి గుర్తింపు సర్టిఫికేట్‌ను అందజేసిందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఆత్మనిర్భార్ భారత్‌కు ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. పులుల గణనలో ఇండియాలోని పులుల సంఖ్య 2,967గా తేలింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 75 శాతానికి సమానం. (మారణహోమానికి పాక్ కుట్ర) పులుల ఫోటోలను తీయడానికి, అటవీ అధికారులు, వన్యప్రాణి సంరక్షణ నిపుణులు 141 స్టడీ సైట్లలో 26,838 ప్రాంతాల్లో కెమెరాలను అమర్చారు. ఆయా ప్రాంతాల్లో తీసిన 3.48 కోట్ల ఫోటోలను పరిశీలించిన తర్వాత పులుల సంఖ్యపై నిర్ధారణకు వచ్చారు. వీటిలో పులుల ఫొటోలు 76,651 కాగా 51,777 ఫొటోలు చిరుతలవి. మిగతా ఫొటోలు దేశంలోని అరుదైన వ్యన్యప్రాణులకు చెందినవి. భారత్ ప్రపంచంలోని అడవి పిల్లులకు అతిపెద్ద, అత్యంత సురక్షితమైన ఆవాసాలలో ఒకటిగా నిలిచింది. 2014లో 2,226గా ఉన్న పులుల సంఖ్య 2018కి 2,967కి చేరింది. కేంద్ర పర్యావరణ శాఖ కింద పనిచేసే వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జాతీయ పులుల సంరక్షణ సంస్థ కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం 2006లో దేశంలో 1,411 పులులు మాత్రమే ఉండగా, వాటి సంఖ్య 2014కు 2,226కు, 2018కి 2,967కు పెరిగింది. పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించారు. -
ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయి?
ఇటీవల సోషల్ మీడియాలో ఓ కొత్త గేమ్ ట్రెండ్ అవుతోంది. ఒక ఫోటోను షేర్ చేసి అందులో ఎన్ని జంతువులు ఉన్నాయో కనుక్కోవాలంటూ సవాల్ విసురుతున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంట్లోనే ఉండటంతో ఇలాంటి గేమ్‌లపై ఆసక్తి కనబరుస్తున్నారు. మొదడుకు కొంచెం పని పెట్టి వాటిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఛాలెంజ్ మళ్లీ నెటిజన్ల ముందు చక్కర్లు కొడుతోంది. ఒక ఫ్రేమ్‌లో కొన్ని పులులకు సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయో కనుక్కోవాలని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. బుధవారం పోస్ట్ చేసిన ఈఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. (కరోనా: కేరళలో నాలుగు నెలల చిన్నారి మృతి ) How Many Tigers You See In This Pic ? pic.twitter.com/GPOvxKYdRc — EF Neer 🇮🇳 (@isharmaneer) April 22, 2020 ‘ఈ చిత్రంలో మీకు ఎన్ని పులులు కనిపిస్తున్నాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోపై అనేక మంది తమ సమాధానాలను తెలుపుతున్నారు. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ ఫోటోపై స్పందించడం విశేషం.ఈ చిత్రంలో 11 పులులు ఉన్నాయని బిగ్‌బీ సమాధానమిచ్చారు. కాగా హీరోయిన్ దియా మిర్జా కూడా పులుల చిత్రంపై స్పందించి, చిత్రంలో 16 పులులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక వీరితో కొంతమంది ఏకీభవించి 16 ఉన్నాయని తెలపగా మిగతా వారు 20 పులుల వరకు ఉన్నాయంటూ చెబుతున్నారు. మరి మీకు ఫోటోలో ఎన్ని పులులు కనిపిస్తున్నాయో కౌంట్ చేయండి. (ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా? ) వైరల్: ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపించిందా! 11 tigers .. https://t.co/s5Sa57G80n — Amitabh Bachchan (@SrBachchan) April 23, 2020 -
4 పులులు, 3 సింహాలకు కరోనా పాజిటివ్
న్యూయార్క్ : నగరంలోని బ్రాంక్స్ జూలో నాలుగు పులులకు, మూడు సింహాలకు కరోనా వైరస్ సోకింది. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో జూ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జూ టైగర్ మౌంటైన్‌లో ఉంటున్న మూడు పులులకు, మరో మూడు ఆఫ్రికన్ సింహాలకు పొడి దగ్గుతో కూడిన లక్షణాలు కనిపించాయని, ఓ పులికి మాత్రం లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. అయితే వాటికి ఎటువంటి ఎనస్థీషియా ఇవ్వలేదని, మల పరీక్ష ద్వారా కరోనాను పరీక్షించామని తెలిపారు. ( ఒకే నెలలో 2.6 కోట్ల ఉద్యోగాలు మాయం ) మల పరీక్ష ద్వారా తమ అనుమానం నిజమైందని, జూలో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది జంతువులు కరోనా బారినపడ్డాయని పేర్కొన్నారు. వైరస్ సోకినప్పటికి ఆ జంతువులు మామూలుగానే ఉంటున్నాయని, తింటున్నాయని, దగ్గు కూడా తగ్గిందని తెలిపారు. కాగా, గత నెలలో ఇదే జూలోని నదియా అనే నాలుగు సంవత్సరాల ఆడ పులి కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. నదియా కరోనా సోకిన తొలి పులి కావటం గమనార్హం. ( కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్ ) -
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వీడియో చూడండి!
భోపాల్ : భూభాగం కోసం రెండు పులులు కయ్యానికి కాలు దువ్వాయి. అడవి మొత్తం ప్రతిధ్వనించేలా గాండ్రిస్తూ కుమ్ములాడు కున్నాయి. ఈ సంఘటన చత్తీస్ఘడ్ - మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్.. భూభాగం కోసం గొడవ పడుతున్న రెండు పులులకు సంబంధించిన వీడియోను బుధవారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. టైగర్ ప్రాజెక్టు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ రెండు పెద్ద పులుల మధ్య భూభాగం కోసం గొడవ. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వీడియో చూడండి. మధ్య భారతదేశ పులుల శక్తివంతమైన గాండ్రింపులు వినొచ్చు. ఈ రోజుతో ‘ప్రాజెక్టు టైగర్’ 47 సంవత్సరాలు పూర్తి చేసుకుంద’’ని పేర్కొన్నారు. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో.. గొడవకు సిద్ధ పడ్డ పులులు మొదట గాండ్రింపులతో ఒకదాన్ని ఒకటి బెదిరించుకున్నాయి. తమ అరుపులతో అడవిని షేక్ చేసేశాయి. కొద్దిసేపటి తర్వాత పంజాలు విసురుకున్నాయి. అయితే గెలుపెవరిదన్న విషయం తేలకుండానే గొడవ ముగిసిపోయింది. కాగా, భూభాగం కోసం జరిగే పోరాటాల్లో కొన్నిసార్లు పులులు మృత్యువాత పడే అవకాశం కూడా ఉందని కశ్వాన్ తెలిపారు. -
రెండు పెద్ద పులుల మధ్య..
-
ఈ ఫొటోలో ఎన్ని పులులు దాగున్నాయి?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అటవీ శాఖ అధికారి సుసాంటా నంద నెటిజన్లకు సవాలు విసిరారు. కమోఫ్లాగ్(నిగూఢమైన) ఆర్టుకు సంబంధించిన ఫొటో షేర్ చేసిన ఆయన.. అందులో ఎన్ని పులులు కనిపిస్తున్నాయో చెప్పాల్సిందిగా కోరారు. ‘‘కమోఫ్లాగింగ్, మిస్‌డైరెక్షన్ బాగా వివరిస్తాయి. ఇక్కడ ఎడమ వైపు ఓ పులిని మీరు చూస్తున్నారు. అదే విధంగా కుడివైపు ఫొటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనిపెట్టగలరా’’ అంటూ రెండు ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే ఇది కేవలం చాలెంజ్ కాదని.. తమను తాము రక్షించుకునేందుకు పులి చర్మపు రంగులు దానికి ఏవిధంగా ఉపయోగపడతాయో చెప్పే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాల గురించి తర్వాత పూర్తిగా వివరిస్తానని.. ఇప్పటికైతే ఈ ఫొటోలో ఉన్న పులులను గుర్తించమని పజిల్ విసిరారు. ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘ఇది చాలా కష్టంగా ఉంది. ఆ గడ్డిలో పులుల జాడ కనుక్కోవడం సవాలుతో కూడుకున్నదే. అయితే ఒకటి మాత్రం చెప్పగలం. అది రణతంబోర్ వద్ద తీసిన ఫొటో అని గుర్తించగలిగాం’’ అంటూ ఎవరికి తోచిన విధంగా వారు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సుసాంటా షేర్ చేసిన ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించి.. ఆ పజిల్‌ను ఛేదించండి. Camouflaging & misdirection explained best. U can see one tiger in the left. Can you find out how many are there in the right picture? pic.twitter.com/zSvvjwAjvX — Susanta Nanda IFS (@susantananda3) March 11, 2020 -
స్పేస్ సరిపోక సరిహద్దు దాటి..
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ శివారు మండలాల్లో పులుల సంచారం భయాందోళనకు గురిచేస్తున్నా యి. తాంసి, భీంపూర్ మండలాల్లో ఇటీవల ఆవు లపై దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాము పులిని చూశామని కొందరు చెబుతున్నా.. వాటికి సరైన ఆధారాలు దొరకలేదు. పులులు సంచరిస్తున్నాయని అటవీ శాఖాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. పులి విషయంలో ఏదైనా మాట్లాడితే అటు పులులకు సురక్షితం కాదని, ప్రజలు భయాందోళనలకు గురవడంతోపాటు వాటిని చంపే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయంతోనే అధికారులు వివరాలు వెల్లడించట్లేదు. ఆదిలాబాద్ నుంచి 18 కి.మీ దూరంలో మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ మీదుగా నాగపూర్ వెళ్లేందుకు 44వ జాతీయ రహదారికి ఇదే ప్రధాన మార్గం. పెన్ గంగ నదీ ప్రాంతమే తెలంగాణ, మహారాష్ట్రలకు సరిహద్దు. మహారాష్ట్ర వైపు యావత్మాల్ జిల్లా పాండర్‌కౌడ తాలూకా సమీపంలో తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యం విస్తీర్ణా నికి మించి పులుల సంఖ్య పెరి గిందని అటవీ అధికారులు అంటున్నారు. దీంతో అక్కడున్న పులులు వేరే ప్రాంతాలకు కదులుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం పెన్‌గంగాలో అంతగా నీటి ప్రవాహం లేదు. తిప్పేశ్వర్ నుంచి కదులుతున్న పులులు.. పెన్‌గంగా దాటుకుని ఆదిలాబాద్ జిల్లా మీదుగా వెళ్తుం డటంతోనే పులుల సంచారంపై కొన్ని మండలాల్లోని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆవాసాలు, పంట పొలాలు, రోడ్లు దాటుకుని వెళ్తున్నప్పుడు ప్రజల కంట పడుతున్నా యి. ప్రశాంత వాతావరణం కల్పించడం ద్వారా పులులు ఈ ప్రాంతం దాటి వెళ్లేలా అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిప్పేశ్వర్‌తో పోలిస్తే విస్తీర్ణంలో పెద్దగా ఉన్న కవ్వాల్ పులులకు అనుకూల ప్రదేశమని అధికారులు చెబుతున్నారు. తిప్పేశ్వర్ టైగర్ రిజర్వు 148 చదరపు కిలోమీటర్లు ఉండగా.. ఒక పులికి 10 నుంచి 15 చ.కి.మీ. విస్తీర్ణంలో ఆవాసం ఏర్పర్చుకుంటుంది. దానికంటూ ఒక ఏరియా ఏర్పర్చుకుంటుంది. ప్రస్తుతం అక్కడ 18కి పైగా పులులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆవాస విస్తీర్ణంలో పులులు ఎదురుపడితే ఘర్షణకు దిగుతాయి. దీంతో ఆ ప్రాంతం నుంచి పులుల కదలికలు మొదలై సురక్షిత ఆవాసం కోసం సంచరిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిరికొండ, నేరడిగొండ, పెంబి, కడెం, ఖానాపూర్, జన్నారం, ఉట్నూర్, లక్సెట్టిపేట, తిర్యాణి ప్రాంతాల్లో దట్టమైన అడవి ఉంది. కవ్వాల్ టైగర్ రిజర్వులో పులులు ఉండేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయని అధికారులు అభి ప్రాయపడుతున్నారు. తిప్పేశ్వర్ తో పోలిస్తే కవ్వాల్ విస్తీర్ణం చాలా పెద్దది. ఇక్కడ 2 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. కవ్వాల్‌లో పులుల సంచారం కనిపిస్తున్నా.. స్థిర నివాసం ఏర్పర్చుకు న్నది లేదు. దీంతో అక్కడి నుంచి వచ్చే పులులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకునేందుకు అనువైన వాతావరణం ఉంది. తిప్పేశ్వర్ నుంచి కవ్వాల్కు అటవీ రహదారిలో 100 కి.మీ. దూరంలో ఉంటుందని చెబుతున్నారు. ఆదిలాబాద్‌లో పులుల కదలికపై జిల్లా అటవీ శాఖాధికారి ప్రభాకర్‌ను వివరణ కోరగా.. పులి రోడ్డు దాటినట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ ప్రాంతాల్లో తమ సిబ్బంది భద్రత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పులిని చూశా.. మాది ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవాల్పూర్. ఆదిలాబాద్‌లో నివాసం. మంగళవారం రాత్రి అవాల్పూర్ మీదుగా ఆదిలాబాద్‌కు కారులో వస్తున్నా. మార్గమధ్యంలో రాత్రి 10.40 సమయంలో జైనథ్ మండలం నిరాల శివారు పెన్‌గంగ కెనాల్ డెయిరీఫాం మధ్యకు రాగానే.. అంతర్ రాష్ట్ర రోడ్డు దాటుతూ పులి కనిపించింది. ఈ విషయం చెప్పి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాను. – కె.అనిల్ -
అలా.. అడవిలో పులి
సాక్షి, తాంసి/కోటపలి్ల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పులి కదలికలు మొదలయ్యాయి. ప్రశాంతంగా ఉన్న పల్లె వాసులు పులి సంచరిస్తుందన్న సమాచారంతో భయాందోళనలకు లోనవుతున్నారు. భీంపూర్ మండలంలోని ఇందూర్‌పల్లి, తాంసి(కె) గ్రామాలతో పాటు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో కూడా పులి కదలికలు మొదలయ్యాయి. పులి సంచరిస్తుందన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తులు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకోవాలని, రాత్రిళ్లు పొలాల వద్ద నిద్రించొద్దని సూచిస్తున్నారు. పశువులను ఎవరూ కూడా పొలాల వద్ద ఉంచకూడదంటున్నారు. వేటగాళ్ల నుంచి పులిని కాపాడేందుకు అటవీ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని గాబరా పడుతున్నారు. ఇటీవల నాగంపేట అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిని వేటాడిన వేటగాన్ని అటవీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం పులి సంచారానికి ఎంత భద్రత ఉందో తెలియజేస్తోంది. భీంపూర్ మండలంలో.. భీంపూర్ మండలంలోని ఇందూర్‌పల్లి, తాంసి(కె) గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి శుక్రవారం పశువులపై దాడి చేసి హతమార్చింది. తాంసి(కె), ఇందూర్‌పల్లి గ్రామాల సమీపంలో అటవీ ప్రాంతంలో అధికారులు పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లను గుర్తించారు. ఆదిలాబాద్ డివిజన్ అటవీ శాఖ అధికారి అప్పయ్య అటవీ సిబ్బందితో కలిసి తాంసి(కె) గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంతో పాటు, పెన్‌గంగ పరివాహక ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. ఆదిలాబాద్ డివిజన్ అటవీశాఖ అధికారి అప్పయ్య మాట్లాడుతూ.. ప్రస్తుతం భీంపూర్ మండలంలోని తాంసి(కె), ఇందూర్‌పల్లి వద్ద పులి సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో కదలికలు కనిపించాయని తెలిపారు. పక్కన ఉన్న మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులులు వలస వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ గులాబ్, బీట్ ఆఫీసర్ కేశవ్, ఎనిమల్ ట్రా కర్స్ సోనేరావు, అనిల్, శంకర్ తదితరులు ఉన్నారు. తాంసి(కె) వద్ద పులిసంచారం కదలికల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న అటవీశాఖ సిబ్బంది కోటపల్లి మండలంలో.. గతేడాది డిసెంబర్లో పంగిడిసోమారం అటవీప్రాంతంలో ఏడు ఆవులపై దాడి చేసి చంపిన పులి మళ్లీ చాలా రోజుల తర్వాత కోటపల్లి మండలంలో సోమవారం ఉదయం సమయంలో రోడ్డు దాటినట్లుగా స్థానికులు చెబుతున్నారు. చెన్నూర్ నుంచి కోటపలి్లకి అటోలో వస్తున్న ఉపాధ్యాయులకు పులి రోడ్డు దాటుతూ కంటపడటంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పులి కళ్ల ముందే రోడ్డు దాటి వెళ్లడంతో ఉపాధ్యాయులకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఈ విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం అందించగా పులి రోడ్డు దాటిన ప్రదేశాన్ని అటవీ అధికారులు సందర్శించారు. కాగా కోటపల్లి అడవిలో సంచరిస్తూ ఉపాధ్యాయుల కంట పడిన పులి కే4 గా భావిస్తున్నారు. కోటపల్లి, చెన్నూర్ బీట్ పరిధిలోని సంకారం అటవీప్రాంతంలో పాటి మడుగు సమీపంలో పులి లేగదూడపై దాడి చేయడంతో బాధితుడు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించాడు. కోటపల్లి, చెన్నూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో ఏ1, సీ1 పులులు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనిపించకపోవడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. కేవలం కే4 మాత్రమే సీసీ కెమెరాల కంట పడుతోంది. కానీ మిగతా పులులు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించడం లేదని ఉన్నతాధికారులకు వివరించినట్లు సమచారం. ప్రజలకు భద్రతగా బేస్ క్యాంపు, స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు భీంపూర్ మండలంలో ఇప్పటికే ఇందూర్‌పల్లి, తాంసి(కె) గ్రామాల వద్ద పులి సంచారం ఉందని ఖరారు కావడంతో పాటు ఆనవాళ్లు కనిపించడంతో మండలంలోని ప్రజలకు భద్రతగా, పులి సంరక్షణ కొరకు అటవీశాఖ అధికారులతో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. తాంసి(కె), అర్లి(టి) గ్రామాల వద్ద ఆదివారం నుంచి అటవీశాఖ అధికారులు బేస్‌క్యాంపులను ఏర్పాటు చేశారు. అటవీశాఖ అధికారులు పులి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో స్ట్రైకింగ్ ఫోర్స్ ద్వారా గమనిస్తూ పులి కదలికలను పరిశీలిస్తున్నారు. తాంసి: పెన్‌గంగాలో నీటి వద్ద అడుగులు పరిశీలిస్తున్న అటవీ అధికారులు -
ఎలుగుబంటి దెబ్బకు తోక ముడిచిన పులులు
జైపూర్ : రాజస్థాన్‌లోని రథంబోర్ నేషనల్ పార్క్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి.. రెండు పులలను వేటాడింది. తన మీద దాడికి వచ్చిన పులిని ఎలుగుబంటి భయపెట్టించి..పరుగులు పెట్టించింది. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. అయితే ఈ వీడియోను నెల రోజుల క్రితమే రథంబోర్ నేషనల్ పార్క్ యూట్యూబ్‌లో షేర్ చేసినప్పటికీ.. తాజాగా దీనిని రాజ్యసభ సభ్యుడు పరిమల్ నాథ్వానీ మంగళవారం ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పార్క్‌లో ఏమరపాటుగా ఉన్న ఓ ఎలుగుబంటిని పులి బెదిరించడానికి ప్రయత్నించింది. అది గమనించిన ఎలుగు ఒక్కసారిగా తన ముందు కాళ్లు ఎత్తి పులిని బెదిరించింది. దీంతో పులి భయపడి వెంటనే పరుగులు పెట్టింది. దాన్ని వెంబడించిన ఎలుగుబంటికి దారిలో మరో పులి ఎదురవడంతో వెనకడుగు వేయకుండా రెండు పులులను భయపెట్టింది. దీంతో రెండు పులులు భయంతో పరుగులు తీశాయి. అనంతరం ఎలుగు సైతం వెనక్కితిరిగి వెళ్లిపోయింది. పరిమల్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే కొన్ని వేల మంది వీక్షించగా.. అనేకమంది లైకులు కొడుతున్నారు...‘వైల్డ్ లైఫ్‌లో ఇలాంటి అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
వైరల్: ఇక నుంచి పులిరాజాకు చలిపెట్టదు
కాస్త చలి పెడితే చాలు.. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే ఒకటికి వందసార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఎప్పుడూ బయటే తిరుగాడే మూగ జంతువులకు చలి పెట్టదా అంటే పెడుతుంది. అవి కూడా మనుషుల్లానే చలి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తాయి. మరి జూలో ఉండే జంతువుల మాటేమిటి? అవి ఎలాంటి చలిలోనైనా వణుకుతూ బాధపడాల్సిందేనా అనిపించక మానదు. కానీ అస్సాంలోని గౌహతి జూ అధికారులకు కూడా సరిగ్గా ఈ ప్రశ్నే తట్టింది. వాటి కోసం ఏదైనా చేయాలని భావించిన అస్సాం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ అధికారులకు చక్కని ఐడియా తట్టింది. బోనులో ఉన్న పులుల, సింహాలు వెచ్చదనాన్ని అనుభూతి చెందేందుకు ఎన్‌క్లోజర్ వెలుపల హీటర్లను ఏర్పాటు చేశారు. అయితే అన్ని జంతువులకు హీటర్ అంత మంచిది కాదు. దీంతో పచ్చిక బయళ్లపై తిరుగాడే జింక, తదితర జంతువుల కోసం ప్యాడీ స్ట్రాలను అక్కడి గడ్డిపై పరిచారు. పాపం.. మూగ జీవాలకు ఎంత కష్టం వచ్చిందని కొందరు నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. జంతువులను బంధించకుండా వదిలేస్తే అయిపోయేది కదా అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
అమ్మో! పులులు పెరిగాయ్!?
ఈ మధ్య రెండు మూడు రోజులుగా పులుల ప్రస్తావన ఎక్కు వైంది. ఎక్కడ విన్నా ఇదే టాపిక్ అయిపోయింది. పేపర్లలో పతాక శీర్షికలెక్కాయి పులులు. దేశంలో పులుల సంఖ్య అధికంగా మూడో వంతు పెరిగిందని, గ్రాఫ్ గీతలతో సహా చూపించారు. ఇదంతా మోదీ హయాంలోనే మోదీ అవిరళ కృషితోనే సాధ్యపడిందన్నట్టు తెగ వార్తలొచ్చాయ్. నాకసలు అనుమానం వచ్చింది. ఏమిటి నిజం పులుల గురించా, బీజేపీ పులుల గురించా అని సందేహం వచ్చింది. ఒక్కోసారి టెన్నిస్ ఆటగాళ్లని ‘టైగర్స్’ అంటుంటారు. ఆ ఉద్యమం నడిచినన్నాళ్లూ శ్రీలంకలో ‘తమిళ పులులు’గా వ్యవహరించేవారు. కిందటి ఎన్నికల్లో పెరిగిన సంఖ్యని దృష్టిలో పెట్టుకుని, పెరిగిన పులుల సంఖ్యగా చెబుతున్నారనుకున్నా. కొన్ని వేలమంది, కొన్ని వేల కెమెరాలు శ్రమించి పులుల సంఖ్యని నిర్ధారించారు. మోదీకి అసలు తను కిందటి జన్మలో బెంగాల్ టైగర్ అయి ఉండవచ్చని గట్టి విశ్వాసం. అందుకే ఆయనకి పులిమీద పిచ్చి ఇష్టమని కొందరంటుంటారు. కనుకనే వాటి అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేశా రని మరికొందరి నమ్మకం. పులి అంటే ధీమా. పులి అంటే పంజా. పులి అంటే చచ్చే భయం. సింహానికి ఠీవి ఎక్కువ. పులికి దూకుడెక్కువ. పులి ఏం తోస్తే అది వెనకా ముందూ చూడకుండా చేస్తుంది. తర్వాత సింగిల్‌గా గుహలో కూచుని బాధపడి, ఎవరికీ వినిపించకుండా చిన్నగా గాండ్రించి, పంజాతో వెన్ను తడుముకుని ముందుకి నడుస్తుంది. సింహం అలా కాదు. మధ్యమధ్య ఠీవిగా వెనక్కి తిరిగి చూసుకుంటుంది. అది తప్పైనా ఒప్పైనా. ఒక్కోసారి అదీ ఏనుగులద్దె తొక్కుతుంది. జూల్లో ఈగలు వాలి దాన్నీ చికాకు పెడతాయి. వాటిని దర్జాగానే సంబాళించుకుని, ‘లయనిజమ్’కి భంగం రాకుండా కాపాడుకుంటుంది. ఒక్కసారి జూలు విదిల్చుకుని ఠీవినొకసారి రీచార్జ్ చేసుకుని వెనక్కి తిరిగిచూసి అడవి దద్దరిల్లేలా గర్జిస్తుంది. దీన్నే సింహావలోకనం అంటారు. సమస్త జీవ రాశి ఆ గర్జనకి ఉలిక్కిపడుతుంది గానీ జూలులో ఆడుకుంటున్న ఈగలు మాత్రం నవ్వుకుంటాయ్. పులి చర్మాన్ని తపోధనులు ఆసనంగా వాడతారు. తల, పులిగోళ్లు యథాతథంగా ఉండి తపస్సుకి ఓ నిండుతనం చేకూరుస్తాయ్. మోదీ కూడా యోగాసనాలు, పెద్ద నిర్ణయాలు పులి చర్మంమీద కూచునే తీసుకుంటారని కొంద రంటారు. పులి చర్మం సృష్టిలో ఒక విచిత్రం. భూమ్మీద ఏ రెండు చర్మాలూ ఒక్కలా ఉండవట. చుక్కలు, ఆ వైఖరి దేనికదే ప్రత్యేకం. విశ్వనాథ సత్యనారాయణకి పులి చాలా అభిమాన జంతువు. ఆకాశంలో ఇంద్రధనుస్సుని పులి తోకతో పోలుస్తారాయన. ‘పులిమ్రుగ్గు’ పేరుతో ఓ మంచి నవల రాశారు. నిజంగా ఇప్పుడు∙మోదీ పుణ్యమా అని పులుల సంఖ్య పెరిగిందంటే విశ్వనాథ ఆనందపడి మోదీని మధ్యాక్కరలతో మెచ్చుకొనేవారు. ప్చ్... ప్రాప్తం లేదు. ఎంతైనా సింహానికున్న రుజువర్తన పులికి లేదంటారు. ఒక్కోసారి పులి నక్కలా ప్రవ ర్తిస్తుందని అడవి జీవితం తెలిసిన వాళ్లంటారు. పులిమీద బోలెడు లిటరేచర్ వచ్చింది. అనేక కథలు వచ్చాయ్. ఒక పులికి నిండుగా వృద్ధాప్యం వచ్చేసింది. పులులకి వృద్ధాశ్రమాలు ఉండవు కదా. చచ్చేదాకా దాని బతుకు అది బతకాల్సిందే. లేళ్ల గుంపుల్ని వేటాడిన పులి అడుగుల నడకే గగనంగా ఉంది. క్షుద్బాధ తీరేదెలా? కుందేళ్లు నోట్లోకి రావుకదా. ఇంతకుముందు రాజుగారిని తిన్నప్పుడు మిగిలిన బంగారు కడియం పులి పంజాకి ధరించి తిరుగుతోంది. చెరువు పక్కన ఓ చెట్టు నీడన కూర్చుంది. వచ్చే పోయే వారిని కేకలతో పలకరించేది. ‘రండి.. రండి! నరమాంసం తిని ఎంతో పాపం మూటగట్టాను. ఇదిగో ఈ వజ్రాలు పొదిగిన బంగారు కంకణం తీసుకుని నన్ను పునీతం చెయ్యండి. ఓయీ విప్రుడా నీవే ఇందుకు తగు’ అనగానే విప్రుడు ఆశపడ్డాడు. విప్రుని తినేసి తిరిగి కంకణాన్ని పంజాకి వేసుకుంది పులి. మోదీ పులుల లెక్క తిరిగి తిరిగి పులిహింస దగ్గర ఆగింది. మొత్తంమీద ఏదో రకంగా దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
తెలంగాణలో పులులు 26
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో 26 పులులు ఉన్నట్లు లెక్క తేలింది. గతంతో పోలిస్తే వీటి సంఖ్య పెరిగినట్లు కేంద్రం ప్రకటించిన నివేదికలో వెల్లడైంది. సోమవారం అంతర్జాతీయ పులు ల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యపై ప్రధాని నరేంద్ర మోదీ నివేదిక విడుదల చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా అధికారికంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. కేంద్ర అటవీ శాఖ పరిధిలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రతి నాలుగేళ్లకోసారి (2006 నుంచి) రాష్ట్రాల్లోని పులుల గణన చేపట్టి అధికారికంగా ప్రకటిస్తోంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, టైగర్ రిజ ర్వ్లు ఇలా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలన్నింటిలో పులుల ను అంచనా వేసేందుకు 2018 జనవరిలో అధ్యయనం నిర్వహించారు. ఆమ్రాబాద్‌లో 14 పులులు 2014లో ఉమ్మడి ఏపీలో పులుల సంఖ్య 68 ఉన్నాయని, వాటిలో తెలంగాణలో 20 (ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 17, కవ్వాల్ పులుల అభయారణ్యంలో 3 ఉన్నాయని అంచనా వేశారు. ప్రస్తుతం ఆమ్రాబాద్‌లో 14, కవ్వాల్‌లో 12 ఉండొ చ్చని ఆయా డివిజన్లలోని అటవీ అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్, నల్లగొండ.. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోకి వచ్చే కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లున్నాయి. ఈ ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ప్రాంతం తూర్పు కనుమల కిందకు వస్తాయి. ఈ రెండు అభయారణ్యాల్లోనూ మెరుగైన నిర్వహణ పద్ధతులను అవలంబిస్తున్నట్టు, గతంతో పోలిస్తే కవ్వాల్ రేటింగ్ ‘ఫెయిర్’నుంచి ‘గుడ్’స్థానానికి (స్కోర్ 60.16%) పెరగగా, ఆమ్రాబాద్ ‘గుడ్’స్థానంలో (స్కోర్71.09%) కొనసాగుతున్నట్లు నివేదికలో స్పష్టమైంది. టైగర్ రిజర్వ్‌ల నిర్వహణలో మొత్తంగా రాష్ట్రం స్కోర్ 71.09% సాధించింది. రెండు రిజర్వ్‌లు కలిపి దాదాపు 5 వేల కి.మీ చదరపు కి.మీ విస్తీర్ణం ఉన్నందున, వంద దాకా పులుల సంరక్షణకు ఇక్కడ అవకాశాలున్నాయని వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ శంకరన్ ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని పులుల సంఖ్య 36కు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్సీటీఏ ప్రకటించిన వివరాలు మనకు బేస్‌లైన్ డేటాగా ఉపయోగపడుతుందని, 26 పులులు ఉన్నట్లు తేలడం అటవీ శాఖకు, రాష్ట్రానికి ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. పులిపిల్లలు ఆరు దాకా ఉన్నందున అవి పెరిగి పెద్దయ్యేందుకు పటిష్టమైన సంరక్షణ, నిర్వహణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. కాగా, ఉమ్మడి ఏపీలో 2006లో 95, 2010లో 72, 2014లో 68 (తెలంగాణలో 20), 2018 తాజా లెక్కల్లో తెలంగాణలో 26 పులులున్నట్లు తేలింది. అటవీ రక్షణ చర్యలతో పులుల వృద్ధి రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ చేపట్టిన అటవీ రక్షణ చర్యలతో పులుల సంఖ్య 26కు పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ, అటవీ సంరక్షణ కోసం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వాటిని కాపాడుకోవడానికి అందరూ మరింత బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. -
దేశంలో పులుల సంఖ్య వెల్లడించిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 2,967 పులులు ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. గత నాలుగేళ్లతో పోలీస్తే.. దేశంలో పులుల సంఖ్య 700 పెరిందన్నారు. ప్రతి ఏటా జులై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పులులను సంరక్షించడం, వాటి సంఖ్యను పెంచడం వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న పులుల సంఖ్య ప్రధాని మోదీ సోమవారం తెలిపారు. ‘‘దేశంలో పులుల సంఖ్య విపరీతంగా పెరిగింది. నాలుగేళ్లలో 700 పులులు పెరిగాయి. మొత్తం 2,967 పులులతో ఇండియా పులులకు అత్యంత ఆవాసయోగ్యమైన దేశం మనది.’అని అన్నారు. పులుల సంఖ్య తెలుసుకునేందుకు, వాటి వివరాలు సేకరించేందుకు అతి పెద్ద కార్యక్రమం చేపట్టి, విజయంవంతంగా పూర్తిచేశామన్న మోదీ... పులుల సంఖ్య పెరగడం ప్రతీ భారతీయుడికీ ఆనందం కలిగించే అంశం అన్నారు. 2022 కల్లా పులుల సంఖ్యను రెట్టింపు చెయ్యాలని 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒప్పందానికి అనుగుణంగా ప్రపంచ దేశాలన్ని చర్యలు చేపట్టాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పులుల సంఖ్యను పెంచేందుకు ఇదివరకే ప్రణాళికలను మొదలుపెట్టింది. -
రాష్ట్రంలో పెద్ద పులులెన్ని?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఎన్ని పెద్ద పులులున్నాయి? గతంతో పోల్చితే పులుల సంఖ్య పెరిగిందా లేక తగ్గిందా? దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని ఉన్నాయి? జాతీయస్థాయిలో చూస్తే గతంలో మాదిరిగానే వాటి సంఖ్యలో వృద్ధి జరిగిందా లేదా అన్న ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పనున్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న సోమవారం ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలు విడుదల చేయనున్నారు. ప్రతి నాలుగేళ్లకూ ఓసారి పులుల గణన చేపడతారు. 2006లో తొలిసారిగా దేశవ్యాప్తంగా టైగర్ సెన్సెస్‌ను విడుదల చేయగా.. మళ్లీ 2010లో, ఆ తర్వాత 2014లో ఈ వివరాలను ప్రకటించారు. 2014లో ఏపీ, తెలంగాణలను కలిపి ఒకటిగానే సమాచారం వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా ఇక్కడ ఎన్ని పులులున్నాయనేది అధికారికంగా వెల్లడి కానుంది. 2014 లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీ లో 68 పులులుండగా వాటిలో 20 పులులు తెలంగాణలో ఉన్నట్టుగా (ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో17, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 3) ఇక్కడి అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం తెలంగాణలో వీటి సంఖ్య 28 నుంచి 30 వరకు పెరిగినట్టు అనధికార లెక్కలను బట్టి తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే 2006లో 1,411 పులులు ఉండగా.. 2010లో 1,706కు, 2014లో 2,226కు వాటి సంఖ్య పెరిగింది. -
అయ్యోపాపం.. ఎంత విషాదం!
దేశంలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుండటం.. వేటగాళ్లు పులులను వేటాడి.. వాటి అవశేషాలను విదేశీ మార్కెట్లో భారీ రేటుకు అమ్ముకుంటుండటంతో పులులు కూడా అంతరించిపోయే జాబితాలో చేరిపోయాయి. అయితే, భారత ప్రభుత్వం, పర్యావరణ ప్రేమికులు చేపట్టిన ప్రత్యేక చర్యలతో ఇటీవల పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పులుల సంఖ్య పెరుగుతున్నా.. మరోవైపు పెద్దసంఖ్యలో అవి మృత్యువాత పడుతుండటం ఆందోళన రేపుతోంది. వేటగాళ్లు పంజా విసురుతుండటం, విషాహారానికి లోనవుతుండటం, ఆహారాన్వేషణలో అడవిని వీడి జనావాసాల్లోకి వస్తుండటం పులులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని చిమూర్ అడవిలో ఒక ఆడ పులి తన ఇద్దరు కూనలతో కలిసి మృత్యువాత పడింది. చంద్రపూర్ ప్రాంతంలో పులి, దాని రెండు పిల్లలు ఆకస్మికంగా మృతి చెంది కనిపించడం కలకలం రేపుతోంది. పులుల మృతికి కారణమేమిటన్నదానిపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషాద ఘటనపై అయ్యోపాపమంటూ జంతుప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
పులినోట పసిబిడ్డ
బాలామృతం... తల్లిపాలు! బిడ్డకు ఆర్నెల్లు వచ్చేవరకు విధిగా తల్లిపాలు ఇవ్వాలి. తర్వాత బిడ్డకు రెండేళ్ల వయసు వచ్చేవరకు కొనసాగించవచ్చు... డాక్టర్లు... ఆరోగ్యకార్యకర్తలు, ఎన్జీవోలు, ప్రభుత్వాలు కూడా ఈ మాటలే చెప్తున్నారు.. చెప్తున్నాయి. ‘‘టైగర్స్’’ అచ్చంగా ఈ అంశంమీద తీసిన సినిమా కాకపోయినా దీనికి సంబంధించింది. బిడ్డకు పాలిస్తున్న తల్లులకు డబ్బాపాలను పరిచయం చేసి... వాటిని వాడితేనే పిల్లలు బొద్దుగా.. ముద్దుగా తయారవుతారని చెప్పి... వందల మంది పసిపిల్లల చావులకు ప్రత్యక్షంగా కారణమైన ఓ మల్టీనేషనల్ బేబీ ఫుడ్ కంపెనీ నిర్వాకం.. పరోక్షంగా పనిచేసిన డాక్టర్ల లాలూచీ... ఈ రెండిటికీ వారధిగా ఉన్న ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ పోరాటం... ఈ సినిమా! 1990ల్లో పాకిస్తాన్లో వాస్తవంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా 2014లో ‘‘టైగర్స్’’ను తెరకెక్కించారు భారతీయ చలనచిత్ర నిర్మాతలు. బోస్నియన్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ‘‘డానిస్ టానోవిచ్’’ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో స్క్రీన్ అయింది.. ప్రశంసలూ అందుకుంది.. కాని మన దేశంలో మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు జీ5లో స్ట్రీమ్ అవుతోంది. సినిమాలోకి... అయాన్ (ఇమ్రాన్ హష్మి)... మెడికల్ రిప్రజెంటేటివ్. పాకిస్తానీ ఫార్మాసూటికల్ కంపెనీల మందులు ప్రమోట్ చేస్తూంటాడు. కానీ స్థానిక డాక్టర్ల దగ్గర్నుంచి సరైన స్పందన ఉండదు. మల్టీనేషనల్ కంపెనీల ప్రొడక్ట్స్ అయితేనే ప్రిస్క్రైబ్ చేస్తామంటూంటారు. మందుల ఆర్డర్లు రాకపోయినా.. ఆ ఊళ్లోని డాక్టర్లు, వాళ్ల ప్రాక్టీస్ పట్లయితే అవగాహన వచ్చేస్తుంది అయాన్‌కి. భార్య.. జైనాబ్ (గీతాంజలి థాప), అమ్మ (సుప్రియా పాఠక్), నాన్న (వినోద్ నాగ్‌పాల్), ఇద్దరు తమ్ముళ్లు అతని కుటుంబం. తండ్రి డాక్యుమెంట్ రైటర్. ఒకసారి ఓ వార్తాపత్రికలో పడిన ప్రకటనను అయాన్‌కు చూపిస్తుంది భార్య. టైప్ రైటింగ్ కూడా వచ్చిన చదువుకున్న వ్యక్తి ఆమె. ఆసక్తిగానే ఆ ప్రకటన చూసి అంతే నిరాశతో ఆ పేపర్‌ను మడతపెట్టేస్తాడు. ‘‘ఏమైందీ?’’ అడుగుతుంది జైనాబ్. ‘‘గ్రాడ్యుయేట్స్ కావాలట’’ చెప్తాడు. ‘‘ట్రై చేసి చూడు.. తప్పకుండా సెలెక్ట్ అవుతావ్’’ నమ్మకమిస్తుంది ఆమె. పాకిస్తాన్లో లాంచ్ చేయబోయే తమ ‘బేబీ ఫుడ్’ కంపెనీకి సమర్థులైన మెడికల్ రిప్స్ కావాలని ఓ మల్టీనేషనల్ కంపెనీ ఇచ్చిన ప్రకటన అది. వాళ్లు అడిగిన అన్ని అర్హతలూ ఉంటాయి అయాన్‌కు ఒక్క గ్రాడ్యుయేషన్ తప్ప. అయినా ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ ఏరియాలో ఆ కంపెనీ మార్కెటింగ్‌కి అధిపతి బిలాల్ (అదిల్ హుస్సేన్). అతను అడిగిన ప్రశ్నకు తప్పు జవాబు చెప్పాడని అయాన్‌ను రిజెక్ట్ చేస్తాడు బిలాల్. ‘‘నేను తప్పు చెప్పలేదు. అయినా మీకు కావల్సింది మీ క్వశ్చన్స్కు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేవాళ్లా? లేక మీ ప్రొడక్ట్స్ సేల్స్ పెంచేవాళ్లా?’’ అని సూటిగా అడిగి బిలాల్‌ను ఇంప్రెస్ చేస్తాడు. ఉద్యోగం దక్కించుకుంటాడు. అయాన్‌కు మెడికల్ డెలిగేట్ అనే హోదా ఇచ్చి.. ఆ ఏరియా సేల్స్ విభాగాన్ని అప్పగిస్తారు. తమ ప్రొడక్ట్‌ను ప్రిస్క్రైబ్ చేసేందుకు డాక్టర్లకు ఫ్రీ సాంపుల్స్తోపాటు ఖరీదైన కానుకలను అందిస్తుంటారు కంపెనీ వాళ్లు. దాంతో ఆ పట్టణంలోనే కాదు.. పాకిస్తాన్‌లోని చాలా ఊళ్లల్లో పీడియాట్రిషన్స్ అంతా తల్లిపాలు మాన్పించేసి ఈ పాలడబ్బాలను సూచిస్తుంటారు. అయాన్ తమ కంపెనీ పాలడబ్బాలను ప్రమోట్ చేయమని సంప్రదించిన డాక్టర్లలో డాక్టర్ ఫయాజ్ (సత్యదీప్ మిశ్రా) ఒకరు. కొన్నాళ్లకే అతను కరాచీ వెళ్లిపోతాడు స్పెషలైజేషన్ కోసం. కథ అడ్డం తిరుగుతుంది... డాక్టర్ ఫయాజ్ కరాచీ నుంచి తిరిగి వచ్చేసరికి ఇక్కడ అయాన్ చాలా ఎదుగుతాడు. ఆ బేబీ ఫుడ్ కంపెనీని ఆ ప్రాంతంలో లాభాల్లో నడిపిస్తుంటాడు తన మార్కెటింగ్ స్కిల్స్‌తో. సంపాదన పెరుగుతుంది. ఊళ్లో తన పరపతీ పెరుగుతుంది. పెద్ద ఇల్లు కొంటాడు. కొడుకు పుడ్తాడు. కుటుంబం సంతోషంగా ఉంటూంటుంది. ‘‘బేబీ ఫుడ్ లాభాల్లో ఉన్నట్టుంది..గుడ్ ’’ అంటాడు డాక్టర్ ఫయాజ్ తనను కలవడానికి ఆసుపత్రికి వచ్చిన అయాన్‌తో. ఆ మాటలో ఏదో వ్యంగ్యం వినిపిస్తుంది అయాన్‌కి. ‘‘సరే.. నేను వెళ్తా’’ అని అయాన్ వెళ్లబోతుంటే.. ‘‘ఫయాజ్.. ఆ పిల్లాడికి సీరియస్‌గా ఉంది’’ అంటూ లేడీ డాక్టర్ వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన ఫయాజ్ ‘‘నాతో రా’’ అంటూ అయాన్నీ లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ.. నాలుగు నెలల పిల్లాడు.. డీ హైడ్రేషన్‌తో చిక్కి శల్యమై.. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ఆ పిల్లాడికి చికిత్సచేసి కన్సల్టేషన్ రూమ్‌లోకి ఫయాజ్ వెళ్తూండగా అడుగుతాడు అయాన్.. ‘‘ఏమైంది ఆ పిల్లాడికి?’’ అని. ‘‘మీరు ప్రమోట్ చేసే డబ్బా పాల వల్ల ఆ బిడ్డ డీ హైడ్రేట్ అయ్యాడు. నిక్షేపంగా తల్లిపాలు తాగుతున్న ఆ బిడ్డకు మీ కంపెనీ పాలడబ్బాను ప్రిస్క్రైబ్ చేసి తల్లిపాలు అందకుండా చేశారు. అయాన్... ఇక్కడున్నప్పుడు నువ్వు చెప్పినట్టే నేనూ ఆ డబ్బాపాలనే ప్రమోట్ చేశా.. కరాచీ వెళ్లాక తెలిసింది నేనెంత పెద్ద తప్పు చేశానో అని. కనీసం తాగడానికి శుభ్రమైన నీళ్లు దొరకని దేశం ఇది. కలుషితమైన నీటిలోనే ఈ పౌడర్ కలిపి పిల్లలకు తాగించడం వల్ల.. వందలమంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు తెలుసా?’’ చెప్తాడు డాక్టర్ ఫయాజ్. ఆ మాట విని హతాశుడవుతాడు అయాన్. బాధ్యత వహించం.. కలత మనసుతోనే ఇంటి దారి పడ్తాడు అయాన్. దార్లో స్లమ్స్‌లో ఉండే తల్లులు.. మురికిగా ఉన్న ప్లాస్టిక్ క్యాన్లలోని నీటితోనే పాలపొడి కలిపి.. ఆ పాలను పిల్లలకు పట్టించడం కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ ఊళ్లో కూడా వందల సంఖ్యలో పసిపిల్లలు అనారోగ్యం పాలవడం.. ఆసుపత్రిలో చేరడం.. ప్రాణాలు పోవడం.. సాధారణమవుతుంది. ఈలోపే అయాన్‌కు కూతురు పుడ్తుంది. చనిపోతున్న పిల్లల్లో తన పిల్లలు కనిపిస్తుంటారు. ఒక నిశ్చయానికి వచ్చిన అయాన్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడమే కాక ఆ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటానికీ దిగుతాడు. కుటుంబమూ అర్థం చేసుకొని అతనికి సపోర్ట్ చేస్తుంది. వెన్నంటే ఉంటాడు డాక్టర్ ఫయాజ్. ఆ కంపెనీ మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు కంప్లయింట్ ఇస్తాడు. అది పెద్ద దుమారమే రేపుతుంది. దాని ప్రభావం కంపెనీ మీదే కాదు.. మెడికల్ ప్రాక్టీషనర్ల మీదా పడుతుంది. అందరూ అయాన్‌కు వ్యతిరేకం అవుతారు. బిలాల్ అయితే బెదిరింపులకు దిగుతాడు. దాడులు చేయిస్తాడు. అయినా అయాన్ వెరువడు. ఎన్జీవో.. డాక్యుమెంటరీ.. ఆ ఊళ్లో పసిపిల్లల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న ఓ ఫారిన్ ఎన్జీవో సంస్థాపకురాలైన మ్యాగీ (మరియం డి అబో)ని కలుస్తాడు అయాన్. అతనికి సహాయంగా నిలబడుతుంది మ్యాగీ. పాకిస్తాన్లో ఆ బేబీ ఫుడ్ కంపెనీ వల్ల జరుగుతున్న నష్టం, చనిపోయిన పిల్లల వివరాలు, తల్లుల బాధలు, అయాన్ చేస్తున్న న్యాయపోరాటం అన్నిటి గురించి విదేశీ పత్రికల్లో రాయిస్తుంది మ్యాగీ. ఓ డాక్యుమెంటరీ కూడా తీయిస్తుంది. ఇది యూరప్‌లో వైరల్ అవుతుంది. జర్మన్ టెలివిజన్ రిపోర్టర్ ఒకరు ఆ మల్టీ నేషనల్ కంపెనీ సిబ్బందినీ ఇంటర్వ్యూ చేస్తారు.. ‘‘పాకిస్తాన్ పిల్లల మరణాలకు బాధ్యత వహిస్తారా’’ అని ఆ ఇంటర్వ్యూలో అడుగుతాడు. ‘‘వహించం’’ అంటూ చాలా కఠినంగా జవాబిస్తాడు సిబ్బందిలో ఒకరు. దానికి కౌంటర్ పార్ట్‌గా అయాన్‌ను ఇంటర్వ్యూ చేయాలని అతణ్ణి జర్మనీకి పిలుస్తారు. అయితే అంతకుముందే బిలాల్ మిలిటరీ ఆఫీసర్ ద్వారా అయాన్ పిలిపించి.. బెదిరించి ఒక ఒప్పందానికి వచ్చేలా బలవంతపెడతాడు. ఇందులో మిలటరీ ఆఫీసర్ జోక్యం చేసుకోవడానికి కారణం ఉంది. అయాన్ ఆ బేబీ ఫుడ్‌ను మిలటరీ ఆసుపత్రికి, మిలటరీ క్యాంటీన్‌కు కూడా సప్లయ్ చేస్తాడు. ఆ వివరాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులోనూ పొందుపరుస్తాడు. దాంతో ఆ మిలటరీ ఆఫీసర్ పేరూ బద్నామ్ అవుతుంది అన్నమాట. దాన్ని బిలాల్ అడ్వంటేజ్‌గా తీసుకొని ఆ మిలటరీ ఆఫీసర్ ద్వారా అయాన్‌ను భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. తగ్గట్టుగానే మిలటరీ ఆఫీసర్ వ్యవహరిస్తాడు. అయాన్.. బిలాల్‌తో బేరం కుదుర్చుకునేలా ఒత్తిడి తెస్తాడు. దాని తాలూకు ఫోన్ సంభాషణనంతా బిలాల్ రికార్డ్ చేస్తాడు. జర్మనీలో అయాన్ టెలివిజన్ కెమెరా ముందు కూర్చున్న టైమ్‌కి ఆ ఫోన్ సంభాషణను టెలివిజన్ చీఫ్‌కు వినిపిస్తారు మల్టీనేషనల్ కంపెనీ సిబ్బంది. మ్యాగీతో సహా అక్కడున్న అందరూ షాక్ అవుతారు. అయాన్ నిజాయితీని శంకిస్తారు. కాని అయాన్ అసలు విషయం చెప్తాడు. తను బేరం కుదుర్చుకున్న మాట నిజమేనని, అయితే ఆరోజు రాత్రే ఆ విషయాన్ని తన తండ్రితో షేర్ చేసుకున్నానని, తండ్రి తిట్టి, వారించాడని, దాంతో ఆ ఒప్పందం జోలికి వెళ్లలేదని, డబ్బు తీసుకోలేదనీ చెప్తాడు.. రుజువు చేస్తాడు కూడా. ఇక్కడితో సినిమా సుఖాంతం అవుతుంది. ఇంత జరిగినా ఆ మల్టీనేషనల్ కంపెనీకి వ్యతిరేకమైన తీర్పేమీ వెలువడదు. కానీ ఆ పోరాటం చేసిన ఆ సేల్స్ రిప్రజెంటేటివ్.. సయ్యద్ ఆమిర్ రజా (అసలు పేరు) మాత్రం ఆ దేశం వదిలి వెళ్లిపోయాడు భార్యా పిల్లలను తీసుకొని. ప్రస్తుతం కెనడాలో టాక్సీడ్రైవర్గా పనిచేస్తున్నాడు అతను. ఈ విషయాన్ని సినిమాలో చూపించరు. – సరస్వతి రమ -
పులి మీద పుట్ర
-
కవ్వాల్ పులుల సంరక్షణ చర్యలేంటి?
సాక్షి, హైదరాబాద్: కవ్వాల్ పులులతో పాటు ఇతర జంతువుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని అటవీ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనుభవమున్న అధికారులు స్వయంగా కోర్టుకు వచ్చి వివరించాలంటూ విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో పులుల సంరక్షణ పథకాన్ని అమలు చేసేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన జాగిర్ దియా సూర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఇటీవల పులుల మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. అటవీ ప్రాంతంలో నివసించే వారు తమ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ఫెన్సింగ్ వల్ల చనిపోయాయా? లేక మరో కారణం వల్ల చనిపోయాయా? అన్నది అంశం తేలాల్సి ఉందంది. అటవీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఎలా జరుగుతోందని హైకోర్టు ఆరా తీసింది. ఈ వ్యాజ్యంలో విద్యుత్ శాఖ అధికారులను కూడా ప్రతివాదులుగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ విషయంలో అటవీ ప్రాంతాల సంరక్షణ కమిటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. సమన్వయంతో పనిచేయకుంటే ఇటువంటి పరిస్థితులే వస్తాయంటూ కోర్టు విచారణ వాయిదావేసింది. -
వన్యప్రాణుల సంరక్షణ కోసం.. రాజస్థాన్‌కు ఉపాసన
సాక్షి, హైదరాబాద్: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన 'సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్' అనే పెంపుడు జంతువుల సంరక్షణ శిబిరం ప్రారంభించడానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సహకారంతో హైదరాబాద్ నుంచి రాజస్థాన్ కు వెళ్లారు. జంతు సంరక్షణ కోసం పాటుపడే ఆమెతో పాటు వన్యప్రాణి ఔత్సాహికులైన 12 మంది పాఠశాల బాలికలు ఈ శిబిరానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. సామాజిక అంశాలపై ఉపాసన చూపుతున్న శ్రద్ద పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శనివారం రాజస్థాన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రంతంబోర్ నేషనల్ పార్క్ కి వారు వెళ్లారు. కాగా వారు మొదటి రోజు ఉదయం సవాయ్ మధోపూర్ నగరంలోని స్టార్ హోటల్ అయిన తాజ్ వివంతా కి చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత వారు చేయబోయే కార్యక్రమానికి వార్మప్ గా ఉండాలని యోగ చేసి మనసును తేలిక పరుచుకున్నారు. హెల్తీ, ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి ని గౌరవిస్తూ తాజ్ వివంతా యాజమాన్యం తమ యొక్క నిపుణులైన చెఫ్ లు చేసే డిజర్ట్స్, వంటలను ఆమె పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు. శ్రావ్యమైన మెలోడీస్ , డాన్స్ మరియు బార్బెక్యూ సెషన్ తో వారి తొలి రోజు ముగియగా, జాతీయ స్థాయిలో పులుల విలుప్తత మరియు అవగాహనను విస్తరించే అంశాలను తెలుసుకునే విధంగా, ఆ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు వీలుగా తర్వాతి రోజుకు వారు ఎదురుచూస్తున్నారు. Bonding with the girls on a mission to #savetigers @ApolloFND @WWFINDIA - spending our Republic Day weekend learning about India’s wildlife ! Jai Hind 🇮🇳 pic.twitter.com/nOjzNTHqcm — Upasana Konidela (@upasanakonidela) January 27, 2019 -
పులుల రక్షణకు ‘టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పులులు, వన్యప్రాణుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్’ను ఏర్పాటు చేయనుంది. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో ఉన్న పులులు, వన్యప్రాణులకు రక్షణ కల్పించేందుకు 112 మంది సిబ్బందితో దీనిని ఏర్పాటు చేయనుంది. రెండు చోట్లా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్థాయి అధికారులు దీనికి నేతృత్వం వహిస్తారు. ఇందులో ముగ్గురు రేంజ్ ఆఫీసర్లు, 81 మంది గార్డులు, 26 మంది ఫారెస్ట్ వాచర్లు ఉంటారు. దీని నిర్వహణకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున భరిస్తాయి. సమీకృత ప్రణాళిక.. అటవీ సంపద రక్షణ కోసం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమీకృత ప్రణాళికను అటవీశాఖ సిద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సంబంధిత శాఖల సమన్వయంతో అడవుల రక్షణ కోసం ఈ ప్రణాళికను అమలుచేయనుంది. అడవుల్లో చెట్ల నరికివేత నియంత్రణ, వేటను పూర్తిగా అరికట్టడం, అటవీ నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ రక్షణ కమిటీలో ఈ మేరకు నిర్ణయించారు. అడవుల్లో జంతువుల వేటకు విద్యుత్ కంచెను వాడితే, కరెంట్ చౌర్యం, అక్రమ వినియోగం కింద కేసులు పెట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది. అటవీ నేరాల్లో విచారణ వేగవంతం చేయడం, నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ప్రభుత్వపరంగా అటవీ శాఖకు న్యాయ సహకారం అందనుంది. ఇందుకోసం జిల్లాకు ఒక లీగల్ అడ్వయిజర్‌ను నియమించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. టాస్క్‌ఫోర్స్ దాడులు, అటవీ భూముల ఆక్రమణల తొలగింపునకు అవసరమైన చోట అటవీశాఖ పోలీసుల సహకారం తీసుకోనుంది. అటవీ సమీప గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి అటవీ రక్షక దళాలను ఏర్పాటు చేయాలని, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు దీనిపై అవగాహన కల్పించేలా అటవీశాఖ చర్యలు చేపట్టనుంది. -
పులులు సంరక్షణ ఇలాగేనా!
మనుషుల ప్రాణాలకే విలువ లేకుండా పోతున్న వర్తమానంలో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బోరాతి గ్రామంలో శుక్రవారం రాత్రి పులిని కాల్చిచంపిన ఉదంతం చుట్టూ అల్లుకుంటున్న వివాదం కొందరికి ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. దీనిపై కేంద్ర శిశు, సంక్షేమ శాఖల మంత్రి మేన కాగాంధీ తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి సుధీర్ ముంగం టివార్ను లక్ష్యంగా చేసుకుని ఆమె వరస ట్వీట్లు హోరెత్తించారు. ‘అవని’ పేరుతో ఉన్న ఆ ఆడ పులిని ‘ఘోరంగా హత్య చేసిన తీరు’పై తాను చట్టపరంగా, రాజకీయపరంగా చర్యలు తీసుకుంటా నన్నారు. పులిని సంహరించిన నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్ హైదరాబాద్‌కు చెందినవారు. తమ తొలి ప్రాధాన్యం సమస్యాత్మకంగా మారిన వన్య మృగాలను మత్తుమందు ప్రయోగించి పట్టుకోవడ మేనని అస్ఘర్ చెబుతుండగా...‘అవని’ని చంపమని మంత్రి నేరుగా ఆదేశాలిచ్చారన్నది మేనక అభి యోగం. పులిని మట్టుబెట్టడంలోని ఉచితానుచితాల సంగతలా ఉంచి ఈ ఉదంతంపై స్పందిం చాల్సిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇంతవరకూ మౌనంగా ఉండి పోయారు. కేంద్ర శిశు, సంక్షేమ శాఖల మంత్రి మేనకాగాంధీ మూగజీవాలు, వన్యప్రాణుల సంర క్షణ రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్నందువల్ల కావొచ్చు... గట్టిగానే స్పందించారు. పైగా మహారాష్ట్రలో ఉన్నది తమ పార్టీ ప్రభుత్వమేనన్న సంగతి కూడా ఆమె మరచినట్టున్నారు. అక్కడ వేరే పార్టీ ప్రభుత్వం ఉంటే ఈపాటికే దీనిపై ఎంతో రచ్చ అయ్యేది. ముంగంటివార్ చాలా జాగ్ర త్తగా జవాబిచ్చారు.‘మేనక హృదయంలో జంతువులపట్ల ఉన్న చాలా ప్రేమ ఉన్నదని అందరికీ తెలుసు. కానీ దాంతోపాటు ఆమెకు మనుషులపట్ల కూడా అంతే ప్రేమ ఉందని నేను భావి స్తున్నాను’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రెండునెలలక్రితం సుప్రీంకోర్టు ముందుకు ‘అవని’ గురించి వ్యాజ్యం వచ్చినప్పుడు దాన్ని మత్తుమందిచ్చి పట్టుకోవాలని, తప్పనిసరి పరి స్థితుల్లో కాల్చి చంపవచ్చునని ధర్మాసనం తెలిపింది. యావత్మాల్ ఉదంతం జరిగిన రెండు రోజులకు ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఉన్న దూధ్వా టైగర్ రిజర్వ్‌లో మరో పులిని గ్రామ స్తులు చంపేశారు. ఒక గ్రామస్తుణ్ణి అది హతమార్చాక వారి ఆగ్రహం కట్టలు తెంచుకుందని అంటు న్నారు. గుజరాత్‌లోని సెక్రటేరియట్‌లోకి ప్రవేశించిన మరో పులిని సోమవారం అటవీ సిబ్బంది మత్తుమందిచ్చి అదుపులోకి తీసుకోగలిగారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో జీవ వైవిధ్యత పరిరక్షణ కీలకమని, అందుకోసం పులుల్ని సంరక్షించడం అవసరమని కేంద్రం గుర్తించాక 18 రాష్ట్రాల్లో 50 టైగర్ రిజర్వ్ల్ని ఏర్పాటు చేశారు. ఇవి మొత్తం 89,164 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. అందుకోసం జనావాసాలను తరలించడానికి ప్రయత్నించినప్పుడు ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదు రైంది. తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్ ప్రాంతాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం అడవుల్లోనూ ఈ టైగర్ రిజర్వ్‌లున్నాయి. వన్యప్రాణులు ఈ రిజర్వ్‌ల పరిధిలోనే ఉంటాయని చెప్పలేం. 30 శాతం పులులు ఆ పరిధి దాటి సంచరిస్తుంటాయని ఒక అంచనా. టైగర్ రిజర్వ్‌లు ఏర్పాటుచేసి నప్పుడు అక్కడుండే పులుల సంఖ్య పెరిగేకొద్దీ వాటన్నిటికీ అవసరమైన స్థాయిలో ఆహారం లభ్య మవుతున్నదా అన్నది తరచు సమీక్షించి లోటుపాట్లు పూడ్చాలి. లేనట్టయితే అందుకోసం సహజం గానే అవి బయటకొస్తాయి. మన దేశంలో పులుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కనుక మున్ముందు పరిస్థితి మరింత వికటిస్తుంది. నాలుగేళ్లకోసారి జరిగే పులుల గణన ప్రక్రియ ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. 2014 గణాంకాల ప్రకారం దేశంలో వాటి సంఖ్య 2,226. ప్రస్తుత లెక్కింపు ప్రక్రియ ఫలితాలను వచ్చే ఏడాది మార్చికల్లా ప్రకటిస్తారు. టైగర్ రిజర్వ్‌ల సమీప ప్రాంతాల్లో ఆదివాసీల బతుకులు అత్యంత దుర్భరం. సాగుచేసుకునేం దుకు వారి సెంటు భూమి కూడా ఉండదు. ఆదివాసీ కుటుంబాల సగటు వార్షిక ఆదాయం రూ. 15,000 కూడా మించదని ఒక అంచనా. జీవిక కోసం వారు తప్పనిసరిగా అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడాలి. ఈ పరిస్థితుల్లో మనిషి–మృగం ఘర్షణ తప్పడం లేదు. పులుల్ని సజీ వంగా బంధించడం ఆషామాషీ కాదు. వాటిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమైనకొద్దీ అవి అనుభవం గడించి మరింత అప్రమత్తంగా మారతాయని, పర్యవసానంగా సమయం గడి చేకొద్దీ వాటిని బంధించడం అసాధ్యమవుతుందని వన్యప్రాణి సంరక్షకులు చెబుతారు. ఇప్పుడు యావత్మాల్ జిల్లాలో మట్టుబెట్టిన పులిని గత రెండేళ్లుగా బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా విజయం సాధించలేకపోయారు. కనుకనే చివరికిలా పరిణమించిందని అంటున్నారు. పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు తదితరాలను వన్యప్రాణులంటున్నామంటేనే అవి అర ణ్యాల్లోని జంతువులని అర్ధమవుతుంది. టైగర్ రిజర్వ్‌ల పేరుచెప్పి జనావాసాలను ఖాళీ చేయిస్తున్న ప్రభుత్వాలు ఆ రిజర్వ్‌ల సమీపంలోనే అభివృద్ధి పేరిట పలు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కన్హా, పెంచ్ రిజర్వ్‌ల కారిడార్‌లో జాతీయ రహదార్లు, రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే మహారాష్ట్రలోని మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాంతం నుంచే రైల్వే లైన్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో కెన్–బెత్వా నదుల్ని అనుసంధా నించే వివాదాస్పద ప్రాజెక్టు పూర్తయితే పన్నా టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతం మునిగిపోతుందని, అక్కడి వన్యప్రాణులకు మంచినీరు కూడా దొరకదని అంచనా. అటవీ సంపద చట్టవిరుద్ధంగా తరలిపోతున్నా పట్టించుకోకపోవడం దీనికి అదనం. కనుకనే ఆ జంతువులు జనావాసాల్లోకొచ్చి మనుషుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. తాజా ఉదంతాల నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు పులులు సంరక్షణ విధానాన్ని సమీక్షించుకుని సవరించు కోవాలి. తమ చర్యల పర్యవసానాలులెలా ఉంటున్నాయో గుర్తించాలి. -
సచివాలయంలో చిరుత హల్చల్!
అహ్మద్‌బాద్ : మొన్న మహారాష్ట్రలో అవని.. నిన్న ఉత్తరప్రదేశ్‌లో ఆడ పులి జనాలను పొట్టన బెట్టుకున్నాయని ప్రాణాలు కోల్పోగా.. నేడు ఓ చిరుత ఏకంగా గుజరాత్ సచివాలయంలోకి వచ్చి ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. అర్థ రాత్రి 1.30కు గాంధీనగర్‌లోని సచివాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఈ చిరుతను బంధించేందుకు అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. సచివాలయ గేట్లన్ని మూసివేసి.. ఎవరినీ అనుమతివ్వడం లేదు. ఇప్పటికే అవని మృతి, ఉత్తరప్రదేశ్ ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పులుల సంరక్షణ తీవ్ర చర్చనీయాంశమైంది. (చదవండి: పులిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు) పులులను హతమార్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ అటవీ అధికారులకు సచివాలయంలోకి ప్రవేశించిన చిరుతను సజీవంగా పట్టుకోవడం ఓ సవాల్‌గా మారింది. సచివాలయంలో తిరుగుతున్న పులి సీసీ ఫుటేజీ వీడియో.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే సచివాలయంలోకి ఆకస్మాత్తుగా చిరుత ప్రవేశించడంతో ఉద్యోగులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. (చదవండి:‘అవని’ని కాల్చి చంపేశారు) WATCH: Leopard entered Secretariat premises in Gujarat's Gandhinagar, early morning today. Forest department officials are currently conducting a search operation to locate the feline (Source: CCTV footage) pic.twitter.com/eQYwATbk2b — ANI (@ANI) 5 November 2018 -
వేటగాడు 3
మహారాష్ట్రలోని యవత్మాల్ ప్రాంతంలో 14 మందిని పొట్టనపెట్టుకున్న మ్యానీటర్ ‘అవని’(ఆడపులి)ని మట్టుపెట్టిన షార్ప్ షూటర్ నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్ హైదరాబాదీనే. తన తాత, తండ్రుల నుంచి ఈ ‘వేట’ను వారసత్వంగా తీసుకున్నారు. గతంలో తండ్రి నవాబ్ షఫత్ అలీ ఖాన్‌కు సాయంగా కొన్ని ఆపరేషన్స్‌లో పాల్గొన్నా... నేరుగా ఆయన చేపట్టిన తొలి ఆపరేషన్ ‘అవని’దే. నగరంలోని రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన షఫత్ దేశంలోని ఐదు రాష్ట్రాలకు సలహాదారుడిగా ఉండి, ఇప్పటి వరకు 27 మ్యానీటర్లు, మదపుటేనుగుల్ని మట్టుపెట్టారు. – సాక్షి, హైదరాబాద్ జంతు ప్రేమికులూ దాగున్నారు... అస్ఘర్ తండ్రి షఫత్ అలీ ఖాన్ చేసిన ‘వేట’ల సంఖ్య 27కు చేరింది. 1976 నుంచి ‘వేటాడుతున్న’ఈయన గతంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న 8 ఏనుగులు, 5 పులులు, 13 చిరుతల్ని హతమార్చారు. బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల కోరిక మేరకు ఆయా రాష్ట్రాల్లో రైతులు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న 1,500 అడవి గేదెలు, 15,200 అడవి పందులు, 1,300 అడవి కుక్కల్ని చంపారు. ఈ వేటగాళ్లల్లో జంతు ప్రేమికులూ దాగి ఉన్నారు. అంతరించిపోతున్న పులుల సంతతిపై ‘ప్రాజెక్ట్ టు సేవ్ ది టైగర్’పేరుతో ఈ తండ్రీకొడుకులు అధ్యయనం చేస్తున్నారు. ‘ఆడ పులి కేవ లం 111 రోజులకే కాన్పు వస్తుంది. ఒక కాన్పులో కనీసం 3 నుంచి 4 పిల్లలు పుడతాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా 1970ల్లో 20 వేలున్న పులుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. అందుకే దీనిపై అధ్యయనం చేస్తున్నాం’అని చెప్తారు వారు. పులులు అంతరించిపోకుండా కొన్ని పరిష్కారాలనూ చూపుతూ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. వారసత్వంగా వస్తున్న ‘వేట’... నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్ చిన్నప్పటి నుంచి తుపాకులు, గుర్రాల మధ్య పెరిగారు. ఆయన తాత బహదూర్ బ్రిటిష్ ఇండియాకు ఫారెస్ట్ అడ్వయిజర్‌గా వ్యవహరించారు. బ్రిటీష్ హయాంలో ఏనుగులతో ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో బహదూర్ 50 ఏనుగులు, 10 మానీటర్లను మట్టుపెట్టారు. అస్ఘర్ తండ్రి షఫత్ అలీ ఖాన్ 1976లో 19 ఏళ్ల వయస్సులోనే తొలి ‘తూటా’పేల్చారు. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న హెచ్డీ కోటలో 19 మందిని పొట్టనపెట్టుకున్న ఏనుగును హతమార్చారు. అలా మొదలైన ఆ కుటుంబం ‘వేట’ఇప్పటికీ కొనసాగుతోంది. షఫత్ అలీ ఖాన్ బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలకు అటవీ విభాగం అడ్వయిజర్‌గా పని చేస్తున్నారు. అక్కడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు శిక్షణ ఇచ్చి వస్తుంటారు. మ్యాన్ మానిమల్ కన్ఫ్లిక్ట్, తుపాకీల్లో తర్ఫీదు ఇవ్వడంతో ఈయనకు ప్రత్యేకత ఉంది. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి, మ్యానీటర్లు, మదపుటేనుగుల్ని మట్టుపెట్టే అలీ ఖాన్ పలుమార్లు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. అనేక ఉదంతాల్లో మృత్యువు క్రూరమృగాల రూపంలో కొన్ని మీటర్ల దూరం వరకు వచ్చి ‘చచ్చింది’. తొలి ప్రాధాన్యం పట్టుకోవడానికే ఇస్తా..: అస్ఘర్ మహారాష్ట్రలో తిప్పేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ నుంచి ఐదేళ్ల వయసున్న అవని అనే ఆడపులి 20 నెలల క్రితం గర్భవతిగా ఉండి ఆహారం కోసం యవత్మాల్ వరకు వెళ్లింది. ఆ ప్రాంతంలో ఉన్న అడవి నుంచి పొలాల్లోకి వెళ్లి ఆహారం కోసం వెతుక్కుంది. ఈ నేపథ్యంలో అక్కడకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో ఇతర జంతువుల కంటే మనుషుల్ని వేటాడటం తేలికని గుర్తించిన పులి మ్యానీటర్‌గా మారి పంజా విసురుతూ వచ్చింది. ఈ పులి 8 నెలల తర్వాత ప్రసవించింది. దీనికి జన్మించిన 2 పులి పిల్లల వయస్సు ప్రస్తుతం ఏడాది. ఈ మూడూ కలసి యవత్మాల్ చుట్టూ ఉన్న 12 కి.మీ. పరిధిలో సంచరిస్తూ... తల్లి మనుషుల్ని వేటాడి చంపేస్తుండగా... మూడూ కలసి మృతదేహాలను తింటున్నాయి. ఇలా ఇప్పటి వరకు ఈ మ్యానీటర్ చేతిలో 14 మంది చనిపోయారు. సెప్టెంబర్ రెండో వారంలో అక్కడకు చేరుకుని వేట మొదలెట్టా. శుక్రవారం అవని హతమైంది. దీని కూనలు ఇంకా అక్కడే సంచరిస్తున్నాయి. వీటిని పట్టుకోవాల్సి ఉంది. నా తొలి ప్రాధాన్యం వాటికి మత్తుమందు ఇచ్చి పట్టుకోవడానికే. ఇలా తల్లి, రెండు పిల్లలు కలసి జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ చంపి తినడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే వీటిని వేటాడే అవకాశం దక్కడమూ అరుదే. -
రా‘బంధువులవుదాం’
సాక్షి, హైదరాబాద్: అంతరించిపోతున్న అరుదైన జాతి రాబందులను సంరక్షించేందుకు బెజ్జూరు రిజర్వ్ అటవీ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని రాష్ట్ర అటవీ శాఖ ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపింది. జెజ్జూరుతో పాటు గూడెం, గిరెల్లి అటవీ బ్లాకులను కలిపి ‘జటాయు’ పేరుతో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని బెజ్జూరు రిజర్వ్ అటవీ ప్రాంతంలో గల పాలరాపుగుట్ట మీద రాబందుల ఉనికిని 2013లో గుర్తించారు. 200 మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న పాలరాపుగుట్టపై 100 మీటర్ల ఎత్తులో రాబందులు ఆవాసం ఏర్పరచుకున్నట్లు గుర్తించారు. రాబందుల పునరుత్పత్తి, ఆవాసాలకు రక్షణ కల్పించేందుకు అదే సంవత్సరం నుంచి రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది. 2013లో 10 రాబందులు మాత్రమే ఇక్కడ ఉండగా, 2016–17 నాటికి 30కి పెరిగాయి. ఏటా సగటున 6 నుంచి 8 రాబందుల పిల్లలు పుడుతున్నాయి. వీటి పరిరక్షణకు బెజ్జూరు రిజర్వ్ అటవీ ప్రాంతం, గిరెల్లి అటవీ బ్లాకులను కలిపి 397.99 చ.కి.మీ. మేర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడం అవసరమని కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రాష్ట్ర అటవీ శాఖ నివేదించింది. పులుల రక్షణకు కూడా.. మహారాష్ట్రలోని తాడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇం ద్రావతి పులుల సంరక్షణ కేంద్రాల నుంచి రాష్ట్రం లోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రానికి పులుల రాకపోకలకు బెజ్జూరు రిజర్వు అటవీ ప్రాంతం కారిడార్‌గా ఉపయోగపడుతోంది. 2016 తర్వాత కెమె రాలకు 7 పులులు చిక్కాయి. ఈ ప్రాంతంలో చిరు తలు, ఎలుగుబంట్లు, చౌసింగా, సాంబార్, నీల్గాయ్ జింకలు, దుప్పులూ నివాసముంటున్నాయి. వాస్తవానికి 2016 డిసెంబర్లో జరిగిన రాష్ట్ర వన్య ప్రాణుల బోర్డు సమావేశంలో కాగజ్‌నగర్ డివిజన్‌ను రాబందుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన తదుపరి బోర్డు సమావేశంలో బెజ్జూరును వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఏర్పా టుచేస్తే అంతరించిపోతున్న పులులు, రాబందులు, ఇతర వన్యప్రాణులకు రక్షణ లభిస్తుందని తీర్మానించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటిస్తే అందులోకి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం అమల్లోకి రానుంది. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు సైతం లభించనున్నాయి. ఆహారం కోసం గడ్చిరోలికి.. రాష్ట్రంలో పాలరాపుగుట్టపైనే రాబందులున్నా యి. దక్షిణ భారత్‌లో రాబందుల అతిపెద్ద నివాస ప్రాంతం ఇదే. భారత్, పాకిస్తాన్, నేపాల్‌లో ఈ జాతి రాబందులు అరుదుగా కనిపిస్తున్నాయి. పాలరాపుగుట్టపై ఉండే రాబందులకు పశువుల కళేబరాలను ఆహారంగా వేసినా తినకుండా గడ్చిరోలికి వెళ్తున్నాయని అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
అపర కాళిలా మారిన ఆడపులి
సరిహద్దుల గొడవలు దేశాలకు, మనుషులకే కాదు.. మృగాలకూ ఉంటాయి. ఇక్కడ వచ్చిన గొడవ కూడా అలాంటిదే. సాధారణంగా పులులు, సింహాల్లో మగవి ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. ఇక్కడ ఓ మగ పులి కూడా అలాగే ప్రయత్నించింది. ఓ ఆడపులి అధీనంలోని ప్రాంతంలోకి ప్రవేశించింది.. అయితే, ఆ ఆడపులి అబల కాదు.. అపర కాళి.. చూశారుగా.. కుంగ్‌ఫూ పాండాలాగ అంతెత్తున ఎలా లేచిందో.. ఫైటింగ్ పోజు ఎలా పెట్టిందో.. కొంతసేపు రెండూ అరివీర భయంకరంగా కొట్టేసుకున్నాయి. చేసేది లేక ఆ మగ పులి వెనక్కి తగ్గింది. ఈ చిత్రాలను కేమ్‌చంద్ జోషి అనే ఫొటోగ్రాఫర్ రాజస్థాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో తీశారు. ఇలాంటి ఫొటోలు తీసే చాన్స్.. జీవితంలో ఒక్కసారే లభిస్తుందని.. తనకా అవకాశం దక్కడం ఆనందంగా ఉందని జోషి చెప్పారు. -
రండి రండి రండి.. దయచేయండి!
సాక్షి, హైదరాబాద్: పక్క రాష్ట్ర అడవుల నుంచి పులులను ఆకర్షించడం కోసం అధికారులు అడవుల్లో గడ్డిని పెంచే పనిలో పడ్డారు. ఆహారం కోసం వేట సాగించేందుకు పులి గడ్డి ప్రాంతాలను ఎక్కువగా వాడుకుంటుందని, దీని కోసం నల్లమల, కవ్వాల్‌లో గడ్డిని పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కవ్వాల్ అభయారణ్యంలోని 2,700 హెక్టార్లు కేటాయించి ప్రణాళికలు రూపొందించారు. శాఖాహార అటవీ జంతువులు ఇష్టంగా తినే 14 రకాల గడ్డి జాతులను గుర్తించి ప్రతి బీట్‌లో కనీసం 2.5 హెక్టార్ల చొప్పున పెంచనున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా జన్నారం ఫారెస్టు డివిజన్లోని 500 హెక్టార్లలో గడ్డిని పెంచుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ దశలవారీగా పనులు చేపట్టనున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోనూ గడ్డిని పెంచే ప్రక్రియను మొదలుపెట్టారు. 55 వాగులు, 21 కుంటలు, 163 నీటి తొట్టెల చుట్టూ గడ్డిని పెంచుతున్నారు. మూడు నెలల్లో ఇది పెరిగి క్షేత్రాలుగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విత్తన సేకరణకు, ఆహారంగా.. వన్యప్రాణులకు ఆహారంగా ఉపయోగపడేలా, విత్తనాలను సేకరించి భద్రపరిచేలా రెండు రకాలుగా గడ్డిని పెంచనున్నారు. విత్తన సేకరణ కోసం కవ్వాల్‌లోని తాళ్లపేట రేంజ్ లింగాపూర్ బీట్‌లో 30 హెక్టార్లు, నల్లమలలో అమ్రాబాద్ బీట్‌లోని బుగ్గ వాగు, తోళ్లవాగు పరిసర ప్రాంతాలను గుర్తించారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో 2,7000 హెక్టార్లలో కవ్వాల్ అభయారణ్యాన్ని అభివృద్ధి చేసి 2012లో టైగర్ సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. మహారాష్ట్రలోని తాడోబా ఫారెస్టు నుంచి పులులు ఇటుగా వస్తాయని అధికారులు భావించారు. అయితే వచ్చిన పులులు తిరిగి వెళ్లిపోతుండటంతో దానిపై దృష్టి సారించారు. నల్లమలలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో ఈ అడవుల్లోకి వచ్చిన పులులను ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీని కోసం ఆహారం సులువుగా లభించేలా, తక్కువ వేటకు వీలుగా, శాఖాహార జంతువులను ఆకర్శించేందుకు గడ్డిని పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. -
కుక్కలను చూసి పులులు అనుకుని..!
రామగుండం : కుక్కలను పులులుగా భావించి.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి.. తీరా వాటి అరుపులు విని అవాక్కయిన ఘటన బుధవారం రామగుండం బీ-థర్మల్ విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రతిరోజూ ఉదయం 3 గంటల ప్రాంతంలో బీ-థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్‌యార్డులో బొగ్గును బంకర్లోకి పంపిస్తారు. కోల్‌యార్డు పూర్తి చీకటిగా ఉండడంతో బొగ్గుకుప్ప వద్ద రెండు జంతువులు ఉన్నట్లు ఆపరేటర్ గుర్తించాడు. వాటిని పులులుగా భావించి.. కోల్‌యార్డు ఉద్యోగులు బీ-థర్మల్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేశాడు. బీ-థర్మల్ భద్రతా సిబ్బంది, ఇంజినీర్లు స్థానిక పోలీసులు, ఫారెస్టు, ఫైర్ సిబ్బంది అందరూ అక్కడకు చేరుకున్నారు. ఉద్యోగులు, కార్మికులు సైతం పరుగున వచ్చారు. అధికారులు ఫ్లడ్లైట్లను అమర్చడంతో బొగ్గు కుప్పలు మెరుస్తూ కనిపించాయి. వాటిపైనున్న రెండు జంతువులు ఎంతకూ కదలలేదు. రాళ్లతో కొట్టడంతో భౌభౌ మంటూ అక్కడినుంచి పరుగుపెట్టాయి. అధికారులు ఒక్కసారిగా అవాక్కయి.. నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. -
కెమెరాకు చిక్కిన చిరుతలు
ఆసిఫాబాద్ : రెండు చిరుత పులులు పశుకళేబరాన్ని తింటూ కెమెరాకు చిక్కాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని సిర్పూర్ రేంజి ప్రాంతంలో ఈ నెల 28న రెండు చిరుతలు పశు కళేబరాన్ని తింటూ అటవీ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కాయి. సాధారణంగా చిరుతలు ఒంటరిగా వేటాడడం, సంచారిస్తుంటాయని ఏదైనా వేటాడిన జంతువును రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి స్వీకరస్తాయని కాగజ్‌నగర్ డివిజన్ అటవీ అధికారి ఎన్.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా ఇలా రెండు చిరుతలు ఎక్కడా ఒక చోట వేటాడడం ఉండదని ఇది అరుదని తెలిపారు. అయితే ఈ రెండు ఒకే తల్లి పిల్లలు లేక జత కట్టిన చిరుతలు అయితేనే ఇలా ఒక చోట ఉంటాయన్నారు. గతేడు డిసెంబర్‌లోనూ మూడు చిరుతలు ఒకె కెమెరాలో కన్పించాయని ఆయన గుర్తుచేశారు. చనిపోయిన పశువు యాజమానికి నష్టపరిహారం అటవీ శాఖ నుంచి చెల్లిస్తామని తెలిపారు. -
రాష్ట్రంలో 17 పులులే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అడవుల్లో పెద్ద పులులు, చిరుతల లెక్కలపై అటవీ శాఖ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. మొత్తం 17 పులులు, 125 చిరుతలు ఉన్నాయని జాతీయ జంతు గణనలో భాగంగా సేకరించిన పాదముద్రల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యధికంగా నల్లమలలోని రాజీవ్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 21 పెద్ద పులులు, 57 చిరుతల అడుగు జాడలను సేకరిం చగా.. అవి 13 పులులు, 45 చిరుతల పాదముద్రలని భావిస్తున్నారు. రెండో స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 4 పులులు, 25 చిరుతల అడుగుజాడలను గుర్తించారు. కచ్చితమైన నిరూపణ కోసం పాదముద్రలను డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్కు, పెంటిక (మలం) నమూనాలను సీసీఎంబీ హైదరాబాద్‌కు పంపించారు. కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోని జన్నారం దట్టమైన ఫారెస్టు పరిధిలో ఒకటంటే ఒక్క పులి అడుగు జాడ కనిపించలేదు. ఎక్కడ..? ఎన్ని..? నల్లమలలోని రాజీవ్ పులుల అభయారణ్యాన్ని 214 బీట్లుగా విభజన చేసి జంతు గణన చెపట్టారు. అడుగు జాడలు, మలం, వెంట్రుకలను సేకరించారు. అచ్చంపేట రేంజ్ పరిధిలోని బాణాల, చౌటపల్లి బీట్లలో 2 పులులు, 12 చిరుతలు, మన్ననూర్ రేంజ్‌లోని 10 ట్రాన్స్పాత్లలో 8 పులులు, 20 చిరుతలు, దోమలపెంట రేంజ్ పరిధిలో బోరెడ్డిపల్లి, కొమ్మనపెంట, వటవర్లపల్లి బీట్లలో 2 పులులు, అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని కొల్లంపెంట, పర్షాబాద్ నార్త్ బీట్లలో 3 పులులు, 9 చిరుతలు, మద్దిమడుగు రేంజ్లో గీసుగండి, బాపన్‌పాడు బీట్లలో 2 పులులు, 6 చిరుతలు, కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని ఎర్రపెంట, ఎర్రగుండం పెంట బీట్లలో 2 పులులు, 9 చిరుతలు, లింగాల రేంజ్లో మర్లపాయ బీట్‌లో 2 పులుల, 5 చిరుతల పాదముద్రలు లభించాయి. అటవీ ముఖద్వార ప్రాంతాలైన బాణాల (బల్మూరు), చౌటపల్లి (అచ్చంపేట) ప్రాంతంలో పులుల అడుగులు కనిపించడంపై ఫారెస్టు అధికారులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. అక్కడ నాలుగేనా! కవ్వాల్ పులుల అభయారణ్యంపై ఫారెస్టు అధికారులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజా జంతు గణన వారికి నిరాశే మిగిల్చింది. ఇక్కడ కనీసం ఏడు నుంచి ఎనిమిది పులులైనా ఉంటాయని అధికారులు ఆశించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. కేవలం 4 పులుల అడుగు జాడలు మాత్రమే లభ్యమయ్యాయి. ఖానాపూర్ డివిజన్లోని కోర్ ఏరియాలో ఒకచోట, చెన్నూరు డివిజన్ నీల్వాయి ప్రాంతంలో మరో పులి అడుగు జాడ మాత్రమే కనిపించింది. ఆసిఫాబాద్ డివిజన్లో మరో రెండు పులుల పాదముద్రలను అధికారులు సేకరించారు. వీటితోపాటు సుమారుగా 20 చిరుతలకు సంబంధించిన 35 పాదముద్రలను సేకరించారు. జన్నారంలో పులి జాడేదీ? కవ్వాల్‌లో ముఖ్యమైన జన్నారం అటవీ ప్రాంతంలో పులి జాడలు అస్సలు కనిపించలేదు. ఇందన్పల్లి, తాళ్లపేట్, జన్నారం అటవీ రేంజ్‌లలో ఆరు చోట్ల చిరుత అడుగు జాడలను అధికారులు గుర్తించారు. కానీ పెద్ద పులి జాడ మాత్రం దొరకలేదు. రూ.కోట్లకు కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసిన అభయారణ్యంలో ఒక్క పులి కూడా లేకపోవటం గమనార్హం. ఇక నల్లగొండ జిల్లాలో 22 నుంచి 25 వరకు చిరుతల ముద్రలు దొరికాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 నుంచి 16 వరకు చిరుత పులుల జాడలు దొరికాయి. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న పాత కరీంనగర్ జిల్లాలో కేవలం ఒకే ఒక చిరుత పాదముద్రలు లభించాయి. హైదరాబాద్ మహానగరం పరిసరాల్లో రెండు చిరుతల అడుగు జాడలు అభించాయి. ఇంకో 4 నెలలు ఆగాలి పులులు, చిరుతల లెక్క అధికారికంగా తేలటానికి కనీసం మరో 4 నెలల సమయం పడుతుందని ఫారెస్టు అధికారులు అంచనా వేస్తున్నారు. జంతు గణనలో సేకరించిన పాదముద్రల నమూనా చిత్రాలను డివిజన్ల వారీగా ప్రత్యేక యాప్ ద్వారా డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపారు. ఈ నమూనాలను వారు విశ్లేషించి పూర్తి వివరాలు ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో ప్రచురించే అవకాశం ఉందని ఫారెస్టు అధికారులు చెప్పారు. జిల్లాల వారీగా ప్రాథమిక అంచనా ఉమ్మడి జిల్లా పులులు చిరుతలు ఆదిలాబాద్ 04 20 మహబూబ్‌నగర్ 13 45 నిజామాబాద్ 00 06 రంగారెడ్డి 00 02 కరీంనగర్ 00 01 మెదక్ 00 15 వరంగల్ 00 05 ఖమ్మం 00 09 నల్లగొండ 00 22 -
పులుల గణన : హైటెక్ సాంకేతికత
సాక్షి, న్యూఢిల్లీ : పులుల గణనకు కొత్త సాంకేతికతను వినియోగించనున్నట్లు టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్సీఏ), వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎల్‌ఐఐ) అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. M-Stripes ఆండ్రాయిడ్ ఫోన్ అప్లికేషన్, డెస్క్‌టాప్ వెర్షన్లను ఉపయోగించి ఈ సారీ పులుల గణనలో పారదర్శకతను తీసుకువస్తున్నట్లు తెలిపారు. పులులపై నిర్వహించిన సర్వేల వివరాలు ఈ మొబైల్ అప్లికేషన్లో ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతూ ఉంటాయని చెప్పారు. జియో ట్యాగింగ్ వ్యవస్థను వినియోగిస్తుండటం వల్ల ఆటోమేటిక్‌గా జంతువుల కొత్త ఫొటోలు కూడా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. 2006లో పులుల ఫొటోలను తీసేందుకు 9,700 కెమెరాలను వినియోగించామని, 2018లో కెమెరాల సంఖ్య 15 వేలకు పెంచామని చెప్పారు. పులులను ఎలా లెక్కిస్తారు..? ఇంతకు ముందు 2006, 2010, 2014లో పులుల గణనను చేపట్టారు. ఫొటోలు, పులుల అడుగులు, మల పరీక్షలతో పులుల సంఖ్యను గణించేవారు. ఫొటోలతో పులుల సంఖ్యను లెక్కించడం అసాధ్యం. ఇందుకు ప్రత్యామ్నాయంగా వాటి చారాల ఆధారంగా గుర్తిస్తున్నారు. మనిషికి వేలి ముద్రలు ఎలా ప్రత్యేకంగా ఉంటాయో.. పులుల చారాలు ఒక్కోదానికి ఒక్కోవిధంగా ఉంటాయి. నాలుగోసారి చేపట్టబోయే పులుల గణనకు కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్ల 22 లక్షలు ఖర్చు చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకం ప్రొటెక్షన్ టైగర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 7 కోట్లు అందుతాయి. దేశవ్యాప్తంగా 2006లో పులుల సంఖ్య 1,411 ఉండగా, 2010లో 1,706 చేరింది. 2014లో పులుల సంఖ్య 2,226కు పెరిగింది. మూడు పర్యాయాల్లో పులులను లెక్కించడానికి ఒకే విధానం ఉపయోగించారు. ఇందులో రెండు దశలు ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు దశల్లో పులులను లెక్కించేవారు. తొలి దశలో దేశవ్యాప్తంగా పులులు ఉన్న 18 రాష్ట్రాల్లోని స్థానిక ఫారెస్ట్ అధికారులు, వేటగాళ్లు, గిరిజనుల అవగాహనను దృష్టిలో పెట్టుకుని లెక్కించేవారు. రెండో దశలో పులులకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొందిన బయాలజిస్ట్లతో చారాలను పరిశీలించి లెక్కించారు. ఈ విధంగా 2014లో 70 శాతం పులుల గణన ఫొటోల ఆధారంగానే జరిగింది. మిగత 30 శాతం పులుల లెక్కింపు అధికారులు అవగాహనతో అంచనా వేశారు. నాలుగో విడత సర్వే కోసం ఆధునాతన సాంకేతికతను వినియోగించనున్నారు. నేషనల్ రిపోసిటరీ ఆఫ్ కెమెరా ట్రాప్ ఫొటోగ్రాఫ్స్ ఆఫ్ టైగర్స్(ఎన్ఆర్సీటీపీటీ)లు టైగర్ల చిత్రాలను తీస్తాయి. వీటిని పరిశీలించి ఫీల్డ్ డైరెక్టర్లు పులుల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయగలుగుతారు. -
నల్లమలలో తగ్గుతున్న పులుల సంఖ్య
ఒంగోలు క్రైం: నల్లమల అభయారణ్యం దట్టమైన వృక్ష సంపదకు ఆలవాలం. తిరుమల శేషాచలం కొండల నుంచి మొదలయ్యే అరణ్యం నల్లమలతో అనుసంధానం అయిఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎర్రచందనం మొదలు కొని ఎన్నో లక్షలాధి ఔషధ మొక్కలు, వృక్ష సంపద నల్లమల అభయారణ్యం సొంతం. వృక్ష సంపదతోపాటు వన్య ప్రాణులకూ కొదువలేదు. ఇక అభయారణ్యానికి రాజసాన్నిచ్చే పెద్ద పులులు, చిరుతలకూ కొదువలేదు. పులులు ఉన్నాయంటేనే అభయారణ్యాల వృద్ధి వాటంతట అదే సొగిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ ఫారెస్ట్ ఒకటిగా ఉండేది. రాష్ట్రం విడిపోయిన తరువాత అభయారణ్యం కాస్తా రెండుగా చీలిపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌కు కొంత అటు తెలంగాణకు కొంత చీలిపోయింది. ఏదేమైనా నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు రెండు రాష్ట్రాల్లో కలుపుకొని ఏకైక పులుల సంరక్షణ కేంద్రం. అభయారణ్యంలో పులుల సంఖ్య ఏటికేడాదికి తరుగుతోంది. అందుకు వాటి సంరక్షణ చర్యల్లో లోపమే ప్రధాన కారణం. దానికి తోడు వేటగాళ్లు, స్మగ్లర్ల నుంచి ముప్పు ఏర్పడింది. వన్యప్రాణులను పులులను వేటాడి వాటి చర్మాలను ఇతరప్రాంతాలకు తరలించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నించారు. నాలుగేళ్ల క్రితం రెండు పులుల చర్మాలు ఒకే చోట లభించాయి. ఆ సంఘటన అటవీ శాఖాధికారులను విస్మయానికి గురిచేసింది. గత ఏడాది శ్రీశైలం రూటులో బొమ్మలాపురం–దేవలూరు ప్రాంతంలో ఒక చిరుత పులిని వేటగాళ్లు మట్టుబెట్టారు. మరో చిరుత రోడ్డు ప్రమాదంలో వాహనం ఢీ కొని మృత్యువాత పడింది. నల్లమలలో వన్యప్రాణుల గణన మొదటి విడత గణన జనవరి 28వ తేదీతో ముగిసింది. నల్లమలలో తరుగుతున్న సంఖ్య.. దేశ వ్యాప్తంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్లు్యఏఐఐ)నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ)లు సంయుక్తంగా వన్య ప్రాణుల గణన చేస్తుటాయి. అందులో ప్రధానమైనది పులుల గణన. పులుల గణన ఎందుకు ప్రాధాన్యతను సంతరించుకుంటుందంటే.. పులులు ఉంటే అరణ్యాలు విస్తరిస్తాయి. జలపాతాలు, నదులు కోతకు గురికాకుండా ఉంటాయి. శాఖాహార వన్యప్రాణుల సంతతి పెరగకుండా చేస్తాయి. అరణ్యాలు తరిగిపోయి, శాఖాహార జంతువుల సంఖ్య పెరిగితే గ్రామాల మీదకు, పంటలను నాశనం చేయటం లాంటి ఎన్నో నష్టాలు లేకుండా చేస్తాయి. పులుల గణాంకాలను బట్టి చూస్తే గత ఎనిమిదేళ్లలో 27 పులుల తగ్గాయి. 2006 సంవత్సరంలో అభయారణ్యంలో 95 పులులు ఉన్నాయి. 2010 గణాంకాల ప్రకారం వాటి సంఖ్య 72కు పడిపోయాయి. 2014లో నిర్వహించిన గణాంకాల ప్రకారం వాటి సంఖ్య 68కి పడిపోయింది. నల్లమల అభయారణ్యంలో పులుల సంఖ్య తగ్గుతుంటే ఇతర అభయారణ్యాల్లో వాటి సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే 2006లో 1,411 ఉంటే 2010లో వాటి సంఖ్య 295 పులులు పెరిగి 1,706కు చేరుకున్నాయి. 2014లో నిర్వహించిన పులుల సర్వేలో ఆశ్చర్యం కలిగించే గణాంకాలు వెలుగుచూశాయి. ఏకంగా నాలుగేళ్లలో 520 పులుల సంతానం పెరిగి అధికారుల సైతం ఆశ్యర్యానికి గురిచేశాయి. అక్కడ చేపడుతున్న పులుల రక్షణ కోసం చేపడుతున్న చర్యలు, ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. చట్టాలు కఠినంగా ఉన్నా ఆగని మరణమృదంగం.. వన్య ప్రాణులు, అటవీ సంరక్షణకు కేంద్రప్రభుత్వం 1972లో ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టింది. 1973 మార్చి 1న దానిని అమలులోకి తెచ్చింది. అప్పటి నుంచి శిక్షలను కఠినతరం చేస్తూ ప్రత్యేక చట్టాలు అనుసంధానిస్తూ వస్తున్నా, వన్యప్రాణుల మరణాలు మాత్రం ఆగడం లేదు. వన్యప్రాణులను వేటాడితే నాన్‌బెయిలబుల్ కేసు నమోదు, అభయారణ్యంలో అనుమతి లేకుండా ప్రవేశిస్తే ఎన్నో రకాలుగా క్రిమినల్ కేసులు ఉంటాయి. పులుల అభయారణ్యంలోని వన్య ప్రాణులను వేటాడితే 2006–యాక్టు ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. దీంతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి అరణ్యంలోకి ప్రవేశించడం, వన్యప్రాణుల ప్రశాంతతకు విఘాతం కలిగించినా సైతం కేసులు నమోదు చేసి శిక్షలు విధిస్తారు. మొదటిసారి అరణ్యంలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్లలోపు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా ఉంటుంది. రెండోసారి అదే ముద్దాయి వన్యప్రాణులకు వేటాడితే ఏడేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. 2002 జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ప్రకారం అరుదైన, సంరక్షక వృక్ష, జంతుజాలాలు సంచరించే ప్రాంతాల్లోకి అనుమతులు లేకుండా వెళ్లినా, వాటికి హాని కలిగించినా శిక్షలు తప్పవు. నాన్‌బెయిలబుల్ వారెంట్‌తోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. అయితే యింతటి కఠిన తరమైన చట్టాలు అమలులో ఉన్నా వన్య ప్రాణులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మూగ జీవాలు వేటగాళ్ల వలలో.. అడవి అంటే ఒకప్పుడు భయం. అడవిలో స్వేచ్చగా, రాజసం ఉట్టిపడేలా తిరిగే పులులు అంటే మరీ భయపడే ఉండేవారు. వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని అంతరించి పోతున్నాయి. కుందేళ్లు, దుప్పులు, కణితులు, జింకలు, కొండగొర్రెలు, అడవి పందులు, వేటగాళ్లకు ఆహారంగా మారుతుండగా పులుల వంటి వన్య ప్రాణులు కొందరు స్వార్ధపరుల ధనదాహానికి బలవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు నల్లమలలో గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. అభయారణ్యంలో పెద్ద పులులు, చిరుతలు ఉండేవి. పులుల చర్మాలకు, గోళ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో స్మగ్లర్ల కన్ను వన్యప్రాణులపై పడింది. ఇందులో భాగంగా గతంలో కొనేళ్ల కిందట బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి కట్ని, బహిలియా జాతివారు పులులను వేటాడేందుకు రంగం ప్రవేశం చేసిన సంఘటనలు జరిగాయి. -
ప్రతి పులికీ ఓ లెక్కుంది!
నల్లమల నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి అప్పుడే తెలతెలవారుతోంది.. దట్టమైన అడవి.. నింగిని తాకుతున్నాయా అన్నట్టుగా ఎల్తైన చెట్లు.. భానుడి లేలేత కిరణాలతో చిగురుటాకులపై మెరిసిపోతున్న మంచు బిందువులు.. ఆకాశంలో రివ్వురివ్వున పక్షులు.. ఎటు చూసినా ప్రకృతి సోయగాలు.. ఆహ్లాదకర వాతావరణం.. ఇంతలో గుండెలు అదిరిపడేట్టుగా.. ‘సార్.. పులి అడుగు జాడ. అడుగు ముందుకు వేయకండి..’ ఎఫ్ఆర్వో శ్రీదేవి హెచ్చరిక! వెంటనే ఆమె తన భుజాన ఉన్న కిట్‌బ్యాగ్‌ను తీశారు. మార్కర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పులి అడుగును సేకరించే పనిలో పడిపోయారు. అది సేకరించిన తర్వాత ఇంకా దట్టమైన అడవిలోకి బృందం ప్రయాణం సాగింది. పులుల గణన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ‘సాక్షి’ మన్ననూర్ ఎఫ్ఆర్వో శ్రీదేవి టీంతో కలసి ఇటీవల నల్లమల అటవీప్రాంతంలో పర్యటించింది. ఈ ప్రయాణ విశేషాలు, పులుల పాదముద్రలను సేకరించే విధానంపై ఆసక్తికర అంశాలు.. పాద ముద్రలు సేకరిస్తారిలా.. మన్ననూర్ వెస్ట్ బీట్‌లోని ట్రయల్ పాత్‌పై బృందం ప్రయాణం సాగింది. ఉదయం 7 గంటలకల్లా అటవీ ప్రాంతంలోని గుండం చేరుకున్నాం. జంతువుల దాహార్తిని తీర్చుతున్న సహజమైన జల స్థావరం ఇది. దీని ఒడ్డునే పులి పాద ముద్రలు కనిపించాయి. స్పష్టంగా కనిపించే పాదాలను సేకరించేందుకు ఒక పద్ధతి, అస్పష్ట పాదముద్రలు సేకరించడానికి మరో పద్ధతి ఉంటుంది. నీటి చెమ్మ ఉండటంతో పులి అడుగు బలంగా పడింది. వెంటనే బృందంలో ఓ సభ్యుడు పరిసరాలను శుభ్రం చేశాడు. మరో సభ్యురాలు పచ్చి వెదురు కొమ్మను విరుచుకొచ్చి చుట్టలా మార్చి పాద ముద్రల చుట్టూ ఉంచింది. తర్వాత వెంట తెచ్చుకున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్‌ను చిన్న బకెట్లో నీళ్లతో కలిపి పాద ముద్రలపై పోశారు. 10 నిమిషాల తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పాదముద్రల అచ్చులతో గట్టిపడింది. దాన్ని తీసి భద్రపరిచారు. ఇలాంటి పాద ముద్రల నమూనాలు రిజర్వ్ ఫారెస్టు పరిధిలో 230 వరకు సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పాదముద్రల చిత్రాలను ఆన్లైన్లో వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపుతామని, అక్కడి నిపుణులు వాటిని విశ్లేషించి అవి ఎన్ని పులుల పాదముద్రలో అంచనా వేస్తారని అమ్రాబాద్ రేంజర్ ప్రభాకర్ తెలిపారు. గుండం వద్ద చిరుత పులుల పాదముద్రలు కూడా చాలానే కన్పించాయి. వామికొండ వైపు వెళ్తుండగా దారి మధ్యలో.. మూషిక జింకలు కనిపించాయి. ఇవి ప్రస్తుతం అంతర్ధాన దశలో ఉన్నాయి. వామికొండ అటవీ ప్రాంతంలో కూడా పులి పాదముద్రలు కన్పించాయి. పులి దారి.. రహదారి! పులులు, చిరుత పులులు ఎలుగుబంటి తదితర జంతువుల పాదముద్రలను గుర్తించేందుకు ముందుగా... అవి ఎక్కువగా నడిచే అవకాశం ఉన్న ప్రాంతం మీదుగా ఒక దారిని రూపొందిస్తారు. ఈ దారినే ‘ట్రయల్ పాత్’అని పిలుస్తారు. ఇది 5 మీటర్ల వెడల్పుతో సుమారు 5 కి.మీ. పొడవు ఉంటుంది. పులిది ఎప్పుడూ రాజ మార్గమే. పొదలు, పుట్టల మాటున దాక్కొని నడవడం దానికి ఇష్టం ఉండదు. చదునుగా విస్తరించిన బాటపైనే నడుస్తుంది. ఈ ట్రయల్ పాత్‌పైనే చాలా అటవీ జంతువుల పాదముద్రలు, వాటి విసర్జితాలు(పెంటికలు) కనిపిస్తాయి. అధికారులు కేవలం పులి, చిరుత పాదముద్రలు, పెంటిక నమూనాలు మాత్రమే సేకరించారు. మిగిలిన జంతువుల గుర్తులను నమోదు చేసుకున్నారు. తెలంగాణ పరిధిలోకి వచ్చే రాజీవ్ రిజర్వ్ టైగర్ ఫారెస్టులో మొత్తం 642 ట్రయల్ పాత్‌లు ఏర్పాటు చేశారు. శాకాహార జంతువులకు ‘ట్రాన్సాక్ట్’ శాకాహార జంతువులను లెక్కించేందుకు మరో పద్ధతి ఉంటుంది. ఇందుకు ఏర్పాటు చేసే మార్గాన్ని ‘ట్రాన్సాక్ట్’అని పిలుస్తారు. 2 కి.మీ. పొడవు, 2 మీటర్ల వెడల్పుతో దీన్ని రూపొందించారు. ప్రతి బీట్‌కు ఒకటి చొప్పున నల్లమలలో మొత్తం 213 ట్రాన్సాక్ట్లు ఏర్పాటు చేశారు. ట్రాన్సాక్ట్కు ప్రతి 400 మీటర్లకు ఒక మార్కు చొప్పున విభజన చేశారు. ప్రతి మార్కు పరిధిలో సాధారణ మొక్కలు, ఔషధ మొక్కలు, చెట్లు, పొదలను లెక్క గట్టారు. -
పులి గాండ్రిస్తోంది!
అచ్చంపేట : నల్లమల అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతంలో జాతీయ జంతువుల మనుగడ కొనసాగుతుంది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు చేపట్టిన గణ నలో 21 పెద్ద పులులు, 57 చిరుతల అ డుగు జాడలను సేకరించారు. ఇప్పటికే మాంసాహార జంతువుల గణన పూర్తి కా గా శనివారం నుంచి రెండురోజులపాటు శాఖాహార జంతువుల గణన చేపడుతారు. క్షేత్రస్థాయిలో సేకరించిన జాడల (పాదముద్రలు)ను సిబ్బంది ఇప్పటికే అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ సీసీ వినోద్‌కుమార్, డీఎఫ్ఓ జోజీలకు వివరిస్తూ నివేదిక అందజేశారు. అమ్రాబాద్ అభయారణ్యంలో 214 బీట్లలో చేపట్టిన గణనలో పులులు, చిరుతల పాదముద్రలు, మలం , వెంట్రుకలు సేకరించిన అటవీశాఖ అధికారులు వీటి సంఖ్యను తేల్చే ందుకు పరీక్షల నిమిత్తం పంపించారు. పరీక్షల అనంతరం వాటి లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు. నిర్ధేశించిన ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది, అటవీ అకాడమీ విద్యార్థులు, ఎన్జీఓలు లైనింగ్‌ల వెంట కాలినడకన తిరుగుతూ పులులు, చిరుత పులుల పాదముద్రలను సేకరించారు. ప్రతి బీట్‌లో ఇద్దరు చొప్పున గణనలో పాల్గొన్నారు. ఎక్కడెక్కడ ఎన్ని.. అచ్చంపేట రేంజ్ పరిధిలోని బాణాల, చౌటపల్లి బీట్లలో 2 పులులు, 12 చిరుతలు, మన్ననూర్లోని 10 బీట్లలో 8 పులులు, 20 చిరుతలు, దోమలపెంట రేంజ్ పరిధిలో బోరెడ్డిపల్లి, కొమ్మనపెంట, వటవర్లపల్లి బీట్లలో 2 పులులు, అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని కొల్లంపెంట, పర్షాబాద్ నార్త్ బీట్లలో 3 పులులు, 9 చిరుతలు, 4 ఎలుగుబంట్లు, మద్దిమడుగు రేంజ్లో గీసుగండి, బాపన్‌పాడు బీట్లలో 2 పులులు, 6 చిరుతలు, కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని ఎర్రపెంట, ఎర్రగుండం పెంట బీట్లలో 2 పులులు, 9 చిరుతలు, లింగాల రేంజ్లో మర్లపాయ బీట్‌లో 2 పులుల, 5 చిరుత ల పాదముద్రలు లభించాయి. గతంలో ఎప్పుడూ కూడా బల్మూర్ మండలం బాణాల, అచ్చంపేట మండలం చౌటపల్లి ప్రాంతంలో పులుల జాడలు కనిపించలేదు. మొదటిసారి ఇక్కడ పులులు, చిరుతల జాడలు లభించడం గమనార్హం. బాణాల, బిల్లకలు సమీపంలో రుసుల చెరువు ఉండటంతో నీళ్లు తాగడానికి వచ్చిన పులి ఈ ప్రాంతం లో సంచరించి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే.. దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్ అయారణ్యం 45వ స్థానంలో ఉండగా.. దక్షణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్త రించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ అభయారణ్యం కాగా 445.02 చదరపు కి.మీ బఫర్‌జోన్‌గా ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ పులు లు, చిరుతలతోపాటు ఇతర జంతువులు, పక్షుల లెక్కలు కూడా ఇందులో పొందుపరిచా రు. 200 రకాల పక్షులు, క్షీరదాలు, వంద రకాల సీతాకోక చిలకలు, 50 రకాల క్రి ములున్నాయి. అటవీశాఖ కూడికలు, తీసివేతల ప్రకారం పులులు, చిరుతల లెక్క లు చెబుతున్నారే తప్ప వాస్తవంగా ఎన్ని ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. ఇంత వరకు పులుల సంఖ్య చెబుతున్నారే తప్ప వాటి పిల్లల సంఖ్య.. సీసీ పుటేజీల్లో కనిపించినట్లు ఎక్కడా చెప్పడం గాని.. చూపడం గాని జరగడం లేదు. -
తెలంగాణలో పులులు 20
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తెలంగాణలో పెద్దపులులు 20కిపైగానే ఉన్నాయి. ఇం దులో ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో ఆరు, అమ్రాబాద్ అడవుల్లో 14 వరకు ఉన్నట్లు భావిస్తున్నారు. లభించిన పులి అడుగులను బట్టి ఈ సంఖ్య కొంత ఎక్కువగానే ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 2014లో జరిగిన వన్యప్రాణుల గణనతో పోలిస్తే పులుల సంఖ్యలో పెద్దగా తేడా లేకపోయినా ఇతర రాష్ట్రాల్లోని అడవులకు రాకపోకలు పెరిగినట్లు తేలింది. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే వన్యప్రాణుల గణన ఈనెల 22 నుంచి దేశవ్యాప్తంగా మొదలైంది. ఇందు లో భాగంగా 22 నుంచి 24 వరకు మాంసాహార, 27 నుంచి 29 వరకు శాఖాహార జంతువుల గణన జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 3,000కుపైగా ఉన్న ఫారెస్ట్ బీట్లలో అటవీ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు గణనలో పాల్గొంటు న్నారు. సేకరించిన అడుగుల ఆధారంగా ఆదిలాబాద్, అమ్రాబాద్ (నల్లమల) అడవుల్లో 20కి పైగానే పులులున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. విసర్జితాలు, పగ్‌మార్క్స్ ఆధారంగా... వన్యప్రాణుల గణనలో పులుల విసర్జితాలు, కాలి అడుగుల గుర్తులను సేకరించారు. వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పులుల జాడలకు సంబంధించి, ఆన్లైన్లో ఫారాలను భర్తీ చేసి పంపు తారు. వాటికి పులి పగ్‌మార్క్స్ ఫొటోలను, విసర్జితాల ఫొటోలను జత చేస్తారు. విసర్జితాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించనున్నారు. సీసీఎంబీ నివేదికలో పులి విసర్జితాలా లేదా అనేది తేలనుంది. ఈ ప్రక్రియ తరువాత రెండో దశలో వైల్డ్‌లైఫ్ ఆఫ్ ఇండియా ద్వారా అడవుల్లో కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ఫొటోలను తీయనున్నారు. పులులు సంచరిస్తున్నట్లు తేలితే ఆయా ప్రాంతాల్లో వాటికి నీరు, ఆహారం కల్పించే ఏర్పాట్లు చేస్తారు. పులల గణనలో భాగంగా అటవీ అధికారులు అడవుల్లో తిరుగుతుండగా ఈనెల 23న కాగజ్‌నగర్ ప్రాం తంలో బస్సు ప్రయాణికులకు పులి రోడ్డు దాటుతూ కనిపించింది. పెంచికల్‌పేట ప్రాంతంలోని అడవుల్లో పులి రోడ్డు దాటుతూ కనిపించిందని చెబుతున్నారు. -
రెండు పులులు మీచుట్టూ ప్రదక్షిణ చేస్తే..
-
రెండు పులులు మీచుట్టూ ప్రదక్షిణ చేస్తే..
సాక్షి, మహారాష్ట్ర : కొన్ని సంఘటనలు చూస్తే చావు అనేది నిజానికి ముందే రాసిపెట్టి ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది. ఒక్కోసారి పెద్ద కారణం లేకుండానే ప్రాణాలు పోవడం మరోసారి ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణాలు నిలవడంవంటి సంఘటనలు ఈ అనుమానాలకు కారణాలుగా ఉంటాయి. సాధారణంగా పులి ఎదురుపడిందంటేనే ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవచ్చు. ఒక వేళ కారులాంటి వాహనాల్లో ఉంటే సురక్షితంగా ఉండొచ్చేమోగానీ, ఖర్మకు నడిచి వెళుతున్న సమయంలో బైక్‌పై వెళ్లే సమయంలో ఎదురైతే ఇక అంతే మరి. కానీ, మహారాష్ట్రలో ఓ ఇద్దరు వ్యక్తులు పులులకు ఎదురై ప్రాణాలతో బయటపడ్డారు. ఎదురవడమంటే అదేదో దూరంగా కాదు.. ఆ పులులు గుడిచుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా వారి చుట్టూ తిరిగాయి కూడా. మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఓ చోట ఆగి ఉండగా అనూహ్యంగా రెండు పెద్ద పులులు వారి దగ్గరకు వచ్చాయి. వాటిని చూడగానే భయంతో వారు బిగుసుకుపోయారు. బహుశా! అవి అప్పటికే ఆహారం పూర్తి చేసుకొని ఉన్నాయనుకుంటా.. ఓ పులి తనకెందుకులే అన్నట్లు బైక్పక్కనే కూర్చొగో మరో పులి మాత్రం వారి బైక్ చుట్టూ తిరుగుతూ వారిని ఎగాదిగా చూసింది. ఆ చూపుకే వారికి గుండెలు జారిపోయాయి. ఇదంతా దూరంగా ఉండి చూస్తున్న కారులోని వ్యక్తులు బైక్‌పై ఉన్న వారిని ఎటు కదలొద్దని, ఏంచేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. దాదాపు నాలుగు నిమిషాలపాటు ఆ పులులు చేసిన పనికి వారికి ముచ్చెమటలుపట్టి ప్రాణాలు గాల్లోనే పోయాయ్ అన్నంతలా మారిపోయారు. అదృష్టం కొద్ది ఆ పులులు కాస్తంత దారివ్వగానే వేగంగా కారులో వాళ్లు వారిని సమీపించి కారులో ఎక్కించుకొని భద్రంగా తీసుకెళ్లారు. బహుశా భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో! -
ఒకటీ.. రెండూ.. మూడూ..
సాక్షి, హైదరాబాద్/ఉట్నూర్ రూరల్ (ఖానాపూర్): రాష్ట్రంలో పులులు, ఇతర అటవీ జంతువుల గణన ప్రారంభమైంది. నల్లమల, కవ్వాల్, బెల్లంపల్లి, తూర్పు కనుమలు తదితర అడవుల్లోని మూడు వేల ఫారెస్టు బీట్లలో అధికారులు సోమవారం ఏక కాలంలో జంతు గణన ప్రారంభించారు. దాదాపు 10 వేల మంది అటవీ, స్వచ్ఛంద సేవా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నెల 29 వరకు లెక్కలను సేకరిస్తారు. రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణ అధికారి పీకే ఝా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అధికారులు గతంలో పాద ముద్రల ఆధారంగా పులి కదలికలను, ఉనికిని గుర్తించేవారు. ఇప్పుడు తొలిసారిగా ‘ఫేజ్4 మానిటరింగ్ విధానం’ ద్వారా పులులను లెక్కిస్తున్నారు. అంటే ఛాయా చిత్రాలు, పాద ముద్రలు, పెంటిక విశ్లేషణ, భౌతిక గమనం అనే నాలుగు అంశాల ఆధారంగా పులిని గుర్తిస్తారు. ఒక పులి చారలు, పాద ముద్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొక పులితో సరిపోలవు. వీటి ఆధారంగానే అటవీ శాఖ అధికారులు పులుల సంఖ్యపై స్పష్టతకు వస్తున్నారు. జంతు గణన వారం పాటు చేస్తారు. ఇందులో మూడు రోజులు వేటాడే జంతువులు(మాంసాహారులు) మూడు రోజులు శాఖాహార జంతువుల లెక్కలు సేకరిస్తారు. జాతీయ కార్యక్రమంలో భాగంగా ఈ జంతుగణన దేశవ్యాప్తంగా ఏకకాలంలో ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని కొలాంగూడ, రాంపూర్ అటవీ బీట్‌లోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) ఫారెస్ట్‌లో అటవీ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్న పులులు, వన్య జంతువుల గణనలో పాల్గొన్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అటవీ శాఖ అధికారులతో కలసి 6 కిలోమీటర్లు కాలినడకన పర్యటించి ఆయన జంతు గణనను పరిశీలించారు. వన్యప్రాణుల సంరక్షణ, వాటి సంఖ్యను పెంచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని మంత్రి అన్నారు. చారలను సరిచూసి... పులుల లెక్కింపులో ఇప్పుడు సీసీ కెమెరాలే కీలకంగా మారాయి. పులి శరీరానికి కుడి, ఎడమ వైపు ఉన్న చారలను కెమెరాలతో చిత్రీకరిస్తారు. చారల్లో ఉంటే తేడాల ఆధారంగా ఒక ఫొటోతో మరో ఫొటో సరిపోల్చుకుంటూ ఒక పులి నుంచి మరో పులిని వేరుగా గుర్తిస్తారు. రెండేళ్ల లోపు పులి కూనలను లెక్కలోకి తీసుకోరు. మరో పద్ధతిలో నీటి ముడుగుల సమీపంలో ఫారెస్టు అధికారులు తడిగా ఉండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫలకాలు పెడతారు. నీళ్ల కోసం వచ్చే పులి ఆ ఫలకాల మీద కాలు పెడితే అచ్చులు పడుతాయి. ఆ అచ్చుల ఆధారంగా కూడా పులులను లెక్కిస్తారు. పెంటిక పరీక్ష... పులులు సంచరించే అవకాశం ఉన్న ఆవాసంలో పెంటికల(పేడ) నమూనాలు సేకరిస్తారు. వాటికి సీసీఎంబీలో డీఎన్ఏ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అన్ని నమూనాల్లో ఒకే రకమైన డీఎన్ఏ ఉంటే పెంటికలు అన్ని ఒకే పులివి అని నిర్ధారిస్తారు. డీఎన్ఏలలో తేడా ఉంటే అక్కడ మరో పులి ఉన్నట్లు గుర్తిస్తారు. డీఎన్ఏ నిర్ధారణ పరీక్షల్లో 100 శాతం విశ్వసనీయత ఉంటుందని అధికారులు చెప్తున్నారు. -
నల్లమల పులికించేనా!
ఆత్మకూరు రూరల్: నాలుగు సంవత్సరాలకో సారి దేశ వ్యాప్తంగా జరిగే పెద్దపులుల అంచనా కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. జాతీయ పులుల సంరక్షణా సాధికార సంస్థ (ఎన్టీసీఏ) పర్యవేక్షణలో మొత్తం దేశంలో 16 రాష్ట్రాలలో ఈ అంచనా సాగుతుంది.పెద్ద పులులు, చిరుత పులుల అంచనాకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఈ ఏడాది ఇతర మాంసాహార జంతువులు, శాఖాహార వన్యప్రాణులు, వృక్ష సంపదపై కూడా సమగ్ర అంచనాకు ఎన్టీసీఏ ఆదేశాలిచ్చింది. జిల్లా పరిధిలోని ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లలో సోమవారం నుంచి జరగబోవు జాతీయ పులుల అంచనా కోసం అటవీ శాఖ తమ సిబ్బందిని అన్నిరకాలుగా సంసిద్ధం చేసింది. ఈ రెండు డివిజన్లతో పాటు నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్య పరిధిలోని మార్కాపురం, నాగార్జునసాగర్ డివిన్లలో కూడా ఈ లెక్కింపు జరగనుంది. కర్నూలు పరిధిలో మొత్తం 9 రేంజ్‌లలో ఈ అంచనా సాగనుంది. ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లో ఉన్న సుమారు 60 బీట్లలో 60 బృందాలను లెక్కింపునకు సిద్ధం చేశారు. కాగా ఎన్టీసీఏ ప్రకటించిన వివరాల మేరకు నాలుగేళ్లకో సారి నిర్వహించే గణనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పులల సంఖ్య తగ్గుతూ కనిపిస్తోంది. అయితే గణన శాస్త్రీయంగా లేకపోవడంతో లెక్క పక్కాగా రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సారి శాస్త్ర సాకేంతిక పద్ధతిని ఉపయోగిస్తుండటంతో నల్లమల ‘పులి’కించవచ్చుననే భావన పలువురిలో నెలకొంది. అందుబాటులోకి శాస్త్రీయత: ♦ పులుల అంచనాలో కూడా శాస్త్రీయ ప్రగతిని ఉపయోగించుకుంటున్నారు. గతంలో కేవలం పులి పాదముద్రల ఆధారంగా మాత్రమే పులుల అంచనా వేసేవారు. ♦ ప్రస్తుతం ఇన్ఫ్రారెడ్ కిరణాలను వెలువరిస్తు వాటికి అడ్డుగా వచ్చే ప్రతి జంతువును ఫొటో తీసే కెమెరా ట్రాప్ పద్ధతిలో కూడా పులుల గణన చేపడుతున్నారు. ఈ చిత్రాలలో కనిపించే పులుల చర్మంపై ఉండే చారల ఆధారంగా ఆయా పులులకు మార్కింగ్ ఇస్తారు (ఒక పులి చారలు ఇంకో పులి చారలతో కలవవు). ♦ పులులు చెట్ల మొదళ్లను రుద్దుకోవడం ద్వారా ఆ చెట్టు బెరడులో ఇరుక్కు పోయే పులి వెంట్రుకలను సేకరించడాన్ని బార్కింగ్ పద్ధతి అంటారు.ç ఇలా సేకరించిన వెంట్రుకలు, పులి విసర్జకాలను సెంటర్ పర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ హైదరాబాద్‌కు పంపి ఆయా పులుల డీఎన్ఏలను విశ్లేషిస్తారు. పులుల అంచనా సాగుతుందిలా.. ♦ ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే పులుల అంచనా ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ♦ నిర్ణీత కొలతలతో అడవిలో పొడవుగా ట్రాన్సెక్ట్ లైన్ల ఏర్పాటుకు గడ్డి పొదలు తొలగించి శుభ్ర పరుస్తారు. ఆయా బీట్లలో ముందస్తుగా ప్రతి బీట్‌లో రెండు ట్రాన్సెక్ట్ లైన్లను ఏర్పాటు చేస్తారు. ♦ అలాగే బీట్‌లో మూడు ట్రైల్ పాత్‌లు (నిర్ణీత కొలతలతొ మెత్తటి ఇసుక పరుపులు) కూడా ఏర్పాటు చేస్తారు. ట్రైల్ పాత్ల మార్గంలో నడిచే పులి అడుగు జాడలను సులభంగా సేకరించేందుకు ఉపకరిస్తుంది. ♦ ఉదయం 5 గంటల నుంచే సిబ్బంది పులుల అంచనాకు బయలు దేరుతారు. ♦ వీరు మొదటి నాలుగు రోజులు ట్రాన్సెక్ట్ లైన్లలో, ట్రయల్ పాత్‌లలోను పులుల అడుగు జాడలు సేకరిస్తారు. ♦ పులి అడుగు జాడలతో పాటు చిరుత, ఎలుగుబంటి, అడవి కుక్క, తోడేళ్లు, హైనాలు, నక్కలు తదితర మాంసాహార జంతువుల పాద ముద్రలు కూడా సేకరిస్తారు. ♦ పులుల నేరుగా కనిపించిన దృశ్యాలను నమోదు చేస్తారు. పులి విసర్జకాలను, చెట్లను గీరిన ఆనవాళ్లను, వెట్రకలను కూడా సేకరిస్తారు. ♦ తర్వాత నాలుగు రోజులలో ఆయా ప్రాంతాల్లో కనిపించే శాఖాహార వన్యప్రాణుల అంచనాను నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ఆయా ట్రాన్సెక్ట్ లైన్ల పరిధిల్లోని వృక్ష సంపదను కూడా గుర్తిస్తారు. కిట్లలో ఏమున్నాయి..? నల్లమలలో పులి గణనకు ఏర్పాటు చేసిన బృందాలకు ప్రత్యేక కిట్లను అందజేశారు. ఈ బృందాలకు ఎఫ్డీపీటీ శర్వణణ్ ఆధ్వర్యంలో ముందస్తు శిక్షణ ఇచ్చారు. పులుల అంచనా బృందంలో ఒక్కొక్కరికి కిట్ బ్యాగ్‌ను ఇచ్చారు. అందులో చార్జింగ్ లైట్, టార్చ్, టేపు, 5 లీటర్ల క్యాన్, వాటర్ బాటిళ్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, 20 మీటర్ల విద్యుత్ వైరు, కెమెరా, రేంజ్ ఫైండర్, జీపీఎస్ పరికరం, కంపాస్ ఉంటుంది. అలాగే ఒక రోజుకు సరిపడ ఆహారం వెంట ఉంచుకుంటారు. -
22 నుంచి పులుల గణన
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి 29 వరకు జరగనున్న పులులు, జంతు గణన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణకు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సర్వేను పక్కాగా చేపట్టాలని క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం సచివాలయంలో సర్వేపై అటవీ అధికారులు, సిబ్బందితో ఆ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గణన సందర్భంగా అటవీ, జంతువుల ఆవాసానికి నష్టం జరగకుండా చూడాలని, అదే సమయంలో సమగ్ర అటవీ సమాచారం నమోదు అయ్యేలా చూడాలని అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి పీకే ఝా సూచించారు. శాకాహార, మాంసాహార జంతువులు, అటవీ ప్రాంతంలో ఉన్న వృక్ష జాతులు, మొక్కల వివరాలతో పాటు, అడవుల్లో మానవ ఆవాసాలు, పెంపుడు జంతువులు, పశు సంపద సంచారాన్ని కూడా నమోదు చేయనున్నారు. సమావేశంలో పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) డాక్టర్ మనోరంజన్ భాంజా, వైల్డ్ లైఫ్ ప్రత్యేకాధికారి శంకరన్, అదనపు అటవీ సంరక్షణాధికారులు పృధ్వీరాజు, లోకేశ్ జైస్వాల్, డోబ్రియల్, సునీల్ కుమార్ గుప్తా, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
కవ్వాల్’ నుంచి 2 గ్రామాల తరలింపు!
సాక్షి, హైదరాబాద్: పులుల సంరక్షణ అభయారణ్యాల నుంచి గ్రామాల తరలింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులోని రెండు గ్రామాలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రెండు గ్రామాలకు కల్పించాల్సిన పునరావాసంపై సచివాలయంలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన పునరావాస అమలు రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం జరిగింది. నిర్మల్ జిల్లా రాంపూర్, మైసంపేటలకు చెందిన రూ. 14.20 కోట్ల విలువైన ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. తొలుత రాంపూర్, మైసంపేట్.. మానవ సంచారంతో పులులు కావ్వాల్లో స్థిరంగా ఉండలేకపోతున్నాయని, అత్యవసరంగా ఆదివాసీ గ్రామాలను తరలించాలని అటవీ అధికారులు సీఎస్‌కు వివరించారు. కవ్వాల్ రిజర్వ్ కోర్ ఏరియాలో మొత్తం 23 గ్రామాలుండగా ప్రస్తుతం నిర్మల్ జిల్లా రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజలు పునరావాసం పొందేందుకు ముందుకు వచ్చిన ట్లు అధికారులు తెలిపారు. పులుల సంరక్షణ జాతీయ అథారిటీ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పించనున్నట్లు చెప్పా రు. ఆ ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం, లేదా అదే డబ్బుతో అటవీ శాఖ పునరావాసం కల్పించే ప్రతిపాదనను తీసుకొచ్చారు. పునరావాసానికి అయ్యే ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం భరిస్తాయని పులుల సంరక్షణ జాతీయ అథారిటీ ఇన్స్పెక్టర్ జనరల్ సోమశేఖర్ వివరించారు. పులుల అభయారణ్యం నుంచి తరలించే గ్రామాల వారికి మెరుగైన పునరావాసం కల్పించాలని అటవీ శాఖను చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ ఆదేశించారు. -
వన్యమృగాల అరణ్య రోదన
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. అంతర్రాష్ట్ర వేటగాళ్లతో పాటు గ్రామాల్లోని స్థానికులు సైతం వన్యప్రాణాల ఉసురు తీస్తున్నారు. కుందేళ్లు మొదలుకొని అడవిపందులు, జింకలు, కొండగొర్రెలతో పాటు పులులు, చిరుతలను కూడా బతుకనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా విచిత్రం ఏంటంటే... చనిపోయిన పులు ల చర్మాలకు సైతం రక్షణ లేని పరిస్థితి పూర్వ ఆదిలాబాద్ అడవుల్లో నెలకొంది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం, అవి నీతి అక్రమాల కారణంగా అడవులు, అటవీ జంతువులు మనుగడ సాగించడమే ప్రశ్నార్థకమవుతోంది. సీసీ కెమెరా ల్లో ఎప్పుడో ఓ పులి కనిపించగానే హడావుడి చేయడం, ఆ పులి పేరుతో కేంద్రం నుంచి వచ్చే నిధులతో సంవత్సరాల పాటు గడపడం అటవీశాఖలో సర్వసాధారణమై పోయిం ది. కవ్వాల్ పులుల అభయారణ్యానికి పులులు రాకుండా పోవడాకి గల కారణాలను విశ్లేషించి, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారు. అదే సమయంలో కవ్వాల్‌తో పాటు ఆదిలాబాద్ పూర్వ జిల్లాలోని చెన్నూర్, కాగజ్‌నగర్ డివిజన్ల పరిధిలో కి వచ్చిన పులులను కాపాడలేక, చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ పాత జిల్లా పరిధిలో ఎన్ని పులులు ఉన్నాయంటే నోరు వెళ్లబెట్టే పరిస్థితి. ఏడాదిలో ఓ పులి మరణం.. మరో పులి పిల్లకు ఉచ్చు 2016 డిసెంబర్ తొలివారంలో కోటపల్లి మండలం పిన్నా రం గ్రామంలో ఫాల్గుణ–2 అనే పులి వేటగాళ్ల ఉచ్చుకు బ లైంది. అడవిపందుల కోసం పొలం చుట్టు రైతు వేసుకున్న విద్యుత్ కంచెకు తగిలి ఆ పులి చనిపోయినట్లు అధికారులు తేల్చినా,దాని వెనుక వేటగాళ్ల ప్రమేయం ఉందనేది వాస్త వం. ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పెద్దగా పురోగతి కూడా లేదు. ఇది మరువక ముందే ఫాల్గుణ–1 అనే ఆడపులికి 2016లో జన్మించిన నాలుగు పిల్లల్లో ఒకటి (కె–4) చెన్నూర్ ప్రాంతానికి వచ్చింది. ఆరు నెలల క్రితం దీనిని వేటాడేందుకు వేటగాడు పెట్టిన ఉచ్చును తప్పించుకొని వచ్చిన కె–4కు ఇనుప తీగ ఒకటి శరీరానికి చుట్టుకుపోయింది. అది మెల్లమెల్లగా వెనుక కాళ్ల దగ్గర తుంటి ప్రాం తానికి వచ్చి ఆగింది. సుమారు రెండు సంవత్సరాల వయ స్సు వచ్చిన ఈ పులి తుంటి చుట్టూ ఇనుప ఉచ్చు అలాగే బిగుసుకుంటోంది. దీన్ని తొలగించాలంటే జాతీయ స్థాయిలో అనుమతి అవసరం. దాంతో ప్రాణాపాయ స్థితిలో పులి నీల్వాయి–చెన్నూర్ అడవుల్లోనే తిరుగుతోంది. తల్లి... మూడు పిల్లల జాడేది..? మహారాష్ట్ర నుంచి 2015లో కాగజ్‌నగర్ ప్రాంతానికి రెండు పులులు (ఫాల్గుణ–1, ఫాల్గుణ–2) రాగా, ఫాల్గుణ–2 కోటపల్లిలో పొలం చుట్టు నాటిన కరెంటు తీగలు తగిలి చనిపోయింది. ఫాల్గుణ–1 మాత్రం నాలుగు పిల్లలకు జన్మనివ్వగా, అందులో నాలుగవ పిల్ల కె–4 చెన్నూర్ ప్రాంతంలో తిరుగుతోంది. అంటే తల్లి ఫాల్గుణ–1, మిగతా మూడు పిల్లలు (కె–1, 2, 3) కాగజ్‌నగర్ రేంజ్‌లోనే ఉండాలి. కానీ వాటికి సంబంధించిన జాడలేవీ ఈ మధ్య కాలంలో కని పించలేదు. పులి పిల్లలు ఆరునెలల వయసు రాగానే తల్లి నుంచి దూరంగా వెళ్లిపోతాయి. ఒక పులి సంచరించే ప్రాం తానికి కనీసం 30 నుంచి 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో మరో పులి ఉండదు. ఈ నేపథ్యంలో ఈ తల్లి, మూడు పిల్లలు ఎక్కడ ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు. కానీ కాగజ్‌నగర్ ప్రాంతంలో ఒక పులి మాత్రం సీసీ కెమెరా పుటేజీల్లో, కాలి గుర్తుల ద్వారా తేలింది. కుమరంభీం జిల్లా అటవీశాఖ అధికారి సైతం కాగజ్‌నగర్‌లో నాలుగు పులులున్నాయని ‘సాక్షి’కి తెలిపారు. కానీ ఈ పులులకు సంబంధించి గత కొంతకాలంగా ఎలాంటి గుర్తులు, ఆధారాలు గానీ కనిపిం చలేదు. పూర్వ ఆదిలాబాద్‌లోని కవ్వాల్‌లో ఒకటి, నీల్వా యి ప్రాంతంలో మరోటి, కాగజ్నగర్లోఒకటి చొప్పు న పులులున్నట్లు ఆధారాలుండగా, అధికారులు చెప్పే మిగతా ఏడు పులులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవు. సాంబార్ జింక బావిలో పడితే గోప్యత ఎందుకు? డిసెంబర్ 20న కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కుందేళ్ల కోసం వెంకటాపూర్ వెళ్లే దారిలో ఉర్లు పెడుతుండగా, అటవీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెపుతున్నారు. అయితే ఈ ఐదుగురు కుందేళ్ల కోసం కాకుండా జింకల కోసమే ఉర్లు పెట్టారని, ఓ జింక అందులో పడి చనిపోతే బెల్లంపల్లి ఎఫ్డీఓ కార్యాలయం ఆవరణలోనే పాతిపె ట్టారని ప్రచారం జరిగింది. దీనిని అటవీశాఖ అధికారులు ఖండించి ఉర్లు పెట్టిన ఐదుగురు వ్యక్తులను సోమవారం రిమాండ్‌కు పంపారు. డిసెంబర్ 20వ తేదీన సంఘటన జరిగితే, సర్పంచ్ భర్త గజానంద్, ఎంపీటీసీ భర్త మంగీలాల్ సంతకాలు తీసుకొని వారిని ఎందుకు వదిలేశారనే దానిపై అధికారుల వద్ద సమాధానం లేదు. ఊరి ప్రజాప్రతినిధులు చెప్పినందుకు వదిలేశామంటున్న అధికారులు విషయం ‘సాక్షి’లో వచ్చిన తరువాత అరెస్టు చూపించడం అనుమానాలకు తావిస్తోంది. దీనిని బట్టి ఎలాంటి వన్యప్రాణి విషయంలోనైనా అటవీశాఖ అధికారులు సానుభూతితోనే వ్యవహరిస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీశాఖ రిమాండ్‌కు పంపించిన ఐదుగురిలో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. పులి చర్మం మాయం కుమురం భీం జిల్లా బెజ్జూర్‌లోని ఫారెస్ట్ క్వార్టర్స్‌లో భద్రపర్చిన పులి చర్మం ఇటీవల మాయమైన సంఘటన అటవీ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2016 నవంబర్ 21న మ హారాష్ట్రకు చెందిన కొందరు పులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు అప్పటి బెజ్జూర్ ఎఫ్ఆర్వో మోహన్‌రావు మండలంలోని ఏటిగూడ గ్రామంలో పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు నిందితుల ను కోర్టులో హాజరుపర్చడంతో పాటు పులి చర్మాన్ని కోర్టు కు స్వాధీనం చేశారు. అయితే పులి చర్మాన్ని సేఫ్ కస్టడీ కింద ఉంచాలని కోర్టు అటవీశాఖ అధికారులకు సూచిం చింది. దీంతో ఆ చర్మాన్ని అప్పటి బెజ్జూర్ సెక్షన్ అధికారి వేణుగోపాల్‌కు అప్పగించగా, ఆయన బీట్ అధికారి రవీం దర్ సంరక్షణకు అప్పగించారు. రవీందర్ తాను నివాసం ఉంటున్న క్వార్టర్లోని ఓ గదిలో పులి చర్మాన్ని భద్రపర్చా రు. ఏడు నెలల క్రితం రవీందర్ సస్పెండ్ కాగా, నెలన్నర క్రితం వేణుగోపాల్ సైతం అవినీతి వ్యవహారంలో సస్పెం డయ్యారు. కొత్తగా సెక్షన్ అధికారిగా నియమితులైన శ్రావణ్‌కుమార్ పాత రికార్డులను పరిశీలిస్తూ పులి చర్మం భద్రపర్చిన విషయాన్ని గుర్తించారు. అయితే తాను పులి చర్మాన్ని చూసిన తర్వాతనే రికార్డులు స్వాధీనం చేసుకుంటానని అన్నారు. దీంతో అధికారులు డిసెంబర్ 18న గది తాళం ప గులగొట్టి చూడగా.. పులి చర్మం మాయమైన విషయం వెలుగులోకొచ్చింది. ఈకేసులో అనుమానంతో వేణుగోపా ల్, రవీందర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. మాయమైన పులి చర్మం రూ.50లక్షల నుంచి రూ.కోటి విలువ చేస్తుం దని అధికారులు పేర్కొంటున్నారు. బెజ్జూర్‌లో పులి చర్మం మాయం కావడంతో గతేడాది కోటపల్లి అడవుల్లో మరణిం చిన పులిచర్మం ఎక్కడ ఉందనేది చర్చనీయాంశమైంది. -
కవ్వాల్కు వెయ్యి జింకలు
సాక్షి, హైదరాబాద్: పులులకు సమృద్ధిగా ఆహారం సమకూర్చటంతోపాటు అటవీ ఆవరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచేందుకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు వీలైనంత త్వరగా వెయ్యి జింకలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కు, రంగారెడ్డి జిల్లా చిలుకూరు సమీపంలోని మృగవని జింకల పార్కుతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని మాగనూరు కృష్ణా తీర ప్రాంతం నుంచి జింకలను తరలించాలని నిర్ణయించారు. ‘కవ్వాల్ పులికి ఫుడ్డు సవ్వాల్’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఫారెస్టు అధికారులు స్పందించారు. అటవీ సంరక్షణ ప్రధానాధికారి పీకే ఝా, వన్యప్రాణి సంరక్షణ ప్రధాన అధికారి మనోరంజన్ భాంజా, ప్రత్యేక అధికారి శంకరన్‌లు సమావేశమయ్యారు. ఈ నెలలోనే పులుల గణన ఉన్న నేపథ్యంలో విధివిధానాలతోపాటు ‘సాక్షి’ కథనంపై చర్చించారు. కవ్వాల్‌లో పులి ఆవాసాల్లో శాకాహార జంతువులు ఉండాల్సిన నిష్పత్తిలో లేవని అంచనాకు వచ్చారు. మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి కవ్వాల్కు వస్తున్న పులులు.. ఆహారం లేకనే తిరిగి వెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు నెహ్రూ జూలాజికల్ పార్కు, రంగారెడ్డి జిల్లా మృగవని జింకల పార్కుల్లో ఎక్కువ సంఖ్యలో జింకలు ఉన్నాయని, వాటితో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా తీరంలో జింకలు పంటచేలపై దాడి చేస్తున్న ఘటనలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఆ జింకలను కవ్వాల్కు తరలించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం పీకే ఝా ‘సాక్షి’తో మాట్లాడారు. జింకల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వాటిని తీసుకెళ్లి కవ్వాల్ టైగర్ షెల్టర్ జోన్లో వదిలేస్తామని చెప్పారు. అటవీ మధ్యలో నివాస గ్రామాల వల్ల కూడా పులులు వేరే ప్రాంతానికి తరలిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ నివాస గ్రామాల తరలింపుపైనా దృష్టి పెట్టామని చెప్పారు. ప్రతి ఆదివాసీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 17 తర్వాత ఆదివాసీ గ్రామాల తరలింపునకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఈ నెల 22 నుంచి పులుల గణన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పులుల సంఖ్యను పక్కాగా తేల్చేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పులుల గణన చేపడతామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,100 బీట్లను గుర్తించామని, ప్రతి బీట్‌కు ఇద్దరు చొప్పున నియమించి పులుల లెక్కలు తీస్తామన్నారు. ఈసారి గణనకు సీసీ కెమెరాల వినియోగంతో పాటు పాద ముద్రలు, పెంటిక నిర్ధారణ పరీక్షలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ గణనలో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘం సభ్యుల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు గణనలో పాల్గొనటానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. పులుల గణనను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2013 జనవరిలో పులుల గణన చేపట్టారు. -
కర్నూలు జిల్లాలో పులుల సంచారం
సాక్షి, కర్నూలు: కర్నూరు జిల్లా వెలుగోడు శివారులో శనివారం కలకలం రేగింది. వెలుగోడు శివారు గ్రామాల్లో పులులు సంచరిస్తున్నాయని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీప అడవుల్లో చిరుత పులులను చూసిన కొందరు గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులుల కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టిన అధికారులు రెండు పులులను పట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మరో పులి కోసం అధికారులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. -
ప్రతి పులికీ ఓ లెక్కుంది!
కారడవుల్లో సీసీ కెమెరాలు.. నీటి మడుగుల వద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్.. సీసీఎంబీలో పెంటిక పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా పులుల లెక్కింపు.. తెలంగాణలో తొలిసారి గణన సాక్షి, హైదరాబాద్ :పులులుండేది నట్టడవిలో.. ఎక్కడ తిరుగుతాయో.. ఎప్పుడు పొదల్లోంచి బయటకొస్తాయో ఎవ్వరికీ తెలియదు! అయినా నల్లమలలో ఇన్ని పులులున్నాయి.. కవ్వాల్ అడవుల్లో అన్ని పులులు ఉన్నాయి.. ముడుమలై జంగల్లో ఇన్ని ఉన్నాయని అటవీ శాఖ అధికారులు ఎలా చెబుతారు? సహజంగా అందరికీ కలిగే ప్రశ్నే ఇది! కానీ పులుల గణన అత్యంత పక్కాగా, పూర్తి శాస్త్రీయంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో ప్రతి నాలుగేళ్లకోసారి వారం రోజులపాటు అన్ని రాష్ట్రాల్లో పులులను లెక్కిస్తారు. చివరిసారిగా 2014 జనవరిలో లెక్కించారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటిసారి తెలంగాణలో కూడా పులులను గణించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు పులులను ఎలా లెక్కిస్తారు? అందుకు ఏ విధానాలను అనుసరిస్తారో ఓసారి చూద్దాం.. ఈసారి ఫేజ్–4 మానిటరింగ్.. దేశవ్యాప్తంగా ఏడురోజులపాటు ఏకకాలంలో పులుల గణన చేపడతారు. ఇందులో మూడు రోజులు వేటాడే జంతువులు (మాంసాహారులు), మరో మూడు రోజులు శాకాహార జంతువుల వివరాలు సేకరిస్తారు. ఇంతకుముందు పాదముద్రల ఆధారంగా పులులను లెక్కించేవారు. ఇప్పుడు నాలుగు దశల్లో గణించేందుకు ‘ఫేజ్–4 మానిటరింగ్’ విధానాన్ని అనుసరించేందుకు అటవీ శాఖ సన్నద్ధమవుతోంది. అంటే ఛాయా చిత్రాలు, పాదముద్రలు, పెంటిక పరీక్ష, భౌతికంగా గమనించటం అనే నాలుగు అంశాల ఆధారంగా పులిని గుర్తిస్తారు. పులుల్లో పాద ముద్రలు, చారలు వేర్వేరుగా ఉంటాయి. ఒక పులిచారలు, పాదముద్రలు ఎట్టి పరిస్థితుల్లో వేరే పులితో సరిపోలవు. సీసీ కెమెరాలే కీలకం.. పులుల లెక్కింపులో సీసీ కెమెరాలే కీలకం. నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిమాణం 2 వేల చదరపు కిలోమీటర్లు. పులుల గణన కోసం 400 చ.కి.మీ. దూరాన్ని ఒక బాక్స్‌గా తీసుకుంటారు. దీన్ని మళ్లీ సబ్ బాక్స్‌గా విభజిస్తారు. ప్రతి సబ్ బాక్స్ 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. ఈ లెక్కన 400 చ.కి.మీ.లకు 100 బాక్స్లవుతాయి. ప్రతి బాక్స్‌కు ఏదో ఒకచోట ఒక జత డిజిటల్ కెమెరాలను అమరుస్తారు. నేలకు ఒకటిన్నర ఫీట్ల నుంచి 2 ఫీట్ల ఎత్తులో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తారు. కదిలే జంతువు వాటి సమీపంలోకి రాగానే అందులోని కెమెరా క్లిక్ మంటుంది. ఇలా ఫొటోలను సేకరించి వాటిలో నమోదైన పులుల చారలను పరిశీలిస్తారు. చారల్లో ఉండే తేడాల ఆధారంగా ఒక ఫోటోను మరో ఫోటోతో సరిపోల్చుతూ పులుల సంఖ్యపై ఓ అంచనాకు వస్తారు. ఒక ప్రాంతంలో సేకరించిన చిత్రాలన్నింటిలో ఒకే తరహా చారలు ఉంటే అక్కడ ఒకే పులి సంచరిస్తుందని, ఒకవేళ చారలు సరిపోలక పోతే రెండో పులి కూడా ఉందని నిర్ధారిస్తారు. ప్రతి పులికీ ఓ నంబర్.. గుర్తించిన ప్రతి పులికి ఒక నంబర్ ఇస్తారు. ఒకరకంగా ఆ నంబరే పులి పేరుగా అనుకోవచ్చు. ఉదాహరణకు నాగర్‌కర్నూలు జిల్లా మన్ననూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో ఒక మగ పులిని గుర్తించి దానికి టీఎంఎన్ఆర్డీ ఎం1 అనే నంబర్ కేటాయించారు. ఇందులో టీ అంటే తెలంగాణ, ఎంఎన్ఆర్ అంటే మన్ననూర్, డీ అంటే డివిజన్, ఎం అంటే మేల్, 1 అంటే ఒకటో పులి అని అర్ధం. ఇక ఈ పులి దేశంలో ఏ అడవికి వెళ్లినా వెంటనే గుర్తిస్తారు. ఇలా ఒక ఆవాసంలో ఎన్ని పులులు కనిపిస్తే అన్ని నంబర్లు కేటాయిస్తారు. పులుల లెక్కలు సేకరించేటప్పుడు రెండేళ్ల లోపు కూనలను పరిగణనలోకి తీసుకోరు. పాదముద్రలు సేకరిస్తారిలా.. పులి సాధారణంగా చదునైన దారి మీదే రాకపోకలు సాగిస్తుంది. బలంగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. దాని పాదం పడిన చోట కచ్చితంగా ముద్రలు పడుతాయి. ఏ రెండు పులుల పాదం ముద్రలు ఒకేలా ఉండవు. నీటి మడుగుల సమీపంలో చదునైన బాటపై అధికారులు పచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పలకాలు పెడతారు. నీళ్ల కోసం వచ్చిన పులి పలకాల మీద కాలు పెడితే అచ్చులు పడుతాయి. వాటి ఆధారంగా పులల సంఖ్యను నిర్ధారిస్తారు. సీసీఎంబీలో పెంటిక పరీక్ష పులులు సంచరించే ప్రాంతంలో పెంటికల(పేడ) నమూనాలు సేకరిస్తారు. అదే రోజు లేదా రెండు, మూడ్రోజుల కిందట విసర్జితమైన పెంటికలను మాత్రమే సేకరిస్తారు. ఇలా వరుసగా మూడు, నాలుగు రోజులపాటు 10 నుంచి 15 పెంటిక శాంపిల్స్‌ను సేకరించి సీసీఎంబీకి పంపుతారు. అక్కడ డీఎన్ఏ పరీక్షలు చేస్తారు. సేకరించిన అన్ని నమూనాల్లో ఒకే రకమైన డీఎన్ఏ ఉంటే పెంటికలు అన్ని ఒకే పులివి అని నిర్ధారిస్తారు. డీఎన్ఏలలో తేడా ఉంటే మరో పులి ఉన్నట్లు గుర్తిస్తారు. లెక్కలకు సిద్ధమవుతున్నాం: శంకరన్, వన్యప్రాణి విభాగం ప్రత్యేక అధికారి పులుల గణనకు సమాయత్తం అవుతున్నాం. గతంలో ప్రధానంగా పాద ముద్రలపై ఆధార పడేవాళ్లం. ఇప్పుడు ఫేజ్–4 మానిటరింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఛాయా చిత్రాలు, పెంటికలు, పాదముద్రలు, భౌతికంగా చూడటం ద్వారా పులుల సంఖ్యను నిర్ధారిస్తాం. ఇలా గుర్తించిన పులికి ఒక నంబర్ ఇచ్చి, కేంద్ర వన్యప్రాణి విభాగానికి పంపిస్తాం. వాళ్లు దేశ వ్యాప్తంగా ఉన్న పులల గణాంకాలతో పుస్తకం ప్రచురిస్తారు. -
మన పులులు క్షేమమే..!
► రాష్ట్రంలో 23 పులులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ► పులుల కోసం బిహార్ నుంచి వేటగాళ్ల ముఠా! ► సమాచారం అందడంతో పులుల లెక్క తేల్చిన అటవీ సిబ్బంది ► నల్లమలలో 14, కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులో 9సీసీ కెమెరాలు, పాద ముద్రల ద్వారా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అడవుల్లో ఉన్న పులులు క్షేమంగా ఉన్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. నల్లమల టైగర్ రిజర్వులో 14, కవ్వాల్ అభయారణ్యంలో 9 పులులు కలిపి మొత్తంగా రాష్ట్రంలో 23 పులులు ఉన్నట్లు లెక్కించారు. నల్లమలలో పెద్ద పులుల వేటగాళ్లు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు.. అటవీ ప్రాంత గిరిజనులను, సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు పులులను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. సీసీ కెమెరాల చిత్రాలు, పులుల పాదముద్రలు, పెంటిక (మలం) పరీక్షల ద్వారా వాటి సంఖ్యను, ఆరోగ్యాన్ని నిర్ధారించారు. సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పులుల గణనను చేపట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యాక పూర్తిస్థాయిలో గణనను చేపట్టలేదు. కానీ వాటి సంఖ్యను నిర్ధారించుకునే ప్రయత్నాలు చేశారు. పులులు తిరిగే ప్రాంతాల్లో ప్రతి నాలుగు చదరపు కిలోమీటర్లకు ఒక జత చొప్పున సీసీ కెమెరాలను అమర్చి వాటి ఉనికిని నిర్ధారించారు. ఇక టైగర్ ట్రాకర్లు (పులుల ఆనవాళ్లను గుర్తించేవారు) కూడా తమకు కేటాయించిన చోట్ల ఆనవాళ్లను గుర్తించి అధికారులకు అందజేశారు. వీటన్నింటి ఆధారంగా నల్లమలలో 14 పులులు, కవ్వాల్ ప్రాజెక్టులో 9 పులులు ఉన్నాయని.. అవి వాటి పిల్లలతో సహా సురక్షితంగా ఉన్నాయని గుర్తించారు. మహారాష్ట్రలో పులుల సంఖ్య పెరగడంతో అక్కడి నుంచి మన రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోకి పులులు వలస వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వేటగాళ్లను వదలబోం.. ‘‘బిహార్ ప్రాంతం నుంచి వేటగాళ్ల ముఠా ఒకటి వచ్చిందనే సమాచారం వచ్చింది. కానీ వాళ్లు అడవుల్లోకి ప్రవేశించినట్టు ఆనవాళ్లు దొరకలేదు. వేటగాళ్లు సాధారణంగా అడవిలోకి గుంపుగా వెళతారు. ఇక్కడి భాష కూడా మాట్లాడలేరు. దాంతో అడవుల్లోని గిరిజనులు, అటవీ సిబ్బంది వెంటనే పసిగడతారు. వారిని వదలబోం.’’ – అటవీ జంతు సంరక్షణ విభాగం ఓఎస్డీ శంకరన్ కృష్ణా నదిని దాటుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సరిహద్దుగా కృష్ణా నది ప్రవహిస్తుంది. ఇక్కడ తెలంగాణ అటవీ ప్రాంతంలోని ఒకటి, రెండు పులులు ఏపీ అటవీ ప్రాంతంలోకి వెళ్లగా... అక్కడి పులులు కొన్ని తెలంగాణ ప్రాంతంలోకి వచ్చాయి. దీంతో పులులు కృష్ణా నదిని దాటుతూ.. అటూ ఇటూ తిరుగుతున్నాయని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురం ఫారెస్టు డివిజన్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ ఫారెస్ట్ డివిజన్‌లోకి ఒక పులి వచ్చిందని.. మన్ననూర్ నుంచి కర్నూలు జిల్లా ఆత్మకూర్ ఫారెస్టు డివిజన్‌లోకి ఒక పులి వెళ్లిందని అధికారులు నిర్ధారించారు. -
జనజీవనంలోకి..
నివాస ప్రాంతాల్లోకి దూసుకొస్తున్న వన్యప్రాణులు అటవీ ప్రాంతాల్లో నీరు, ఆహారం కరువు అపారంగా నష్టపోతున్న ప్రజలు జనావాసాల్లోకి వన్యప్రాణులు చొరబడుతున్నాయి. జిల్లాలోని పలు అటవీ శివారు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో చిరుతలు, నెమళ్లు, పాములు, జింకలు, ఎలుగుబంట్లు.. ఇలా రకరకాల జంతువులు హల్చల్ చేస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో పాటు వన్యప్రాణులకు ఆహారం, నీటి కొరత కూడా ఎక్కువగా ఉంది. దాహంతో అలమటిస్తున్న పలు వన్యప్రాణులు జనారణ్యంలోకి చొరబడుతున్నాయి. కనిపించిన పశుసంపద, కుక్కలపై దాడి చేసి చంపేస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అడవి జంతువుల దాడిలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఇక పాముకాటు మరణాలకు జిల్లాలో కొదవ లేదు. - అనంతపురం సెంట్రల్ జిల్లాలో అడవుల విస్తీర్ణం : 1.96 లక్షల హెక్టార్లు చిరుత పులులు : 128 ఎలుగు బంట్లు : 300 జింకలు, అడవిపందులు : వేలల్లో వన్యప్రాణుల వలన జరుగుతున్న పంట నష్టం : వేల హెక్టార్లలో పంట నష్ట పరిహారం అందజేస్తున్నది : ఎకరాకు రూ.5 నుంచి 6 వేలు మాత్రమే అడవి జంతువుల నుంచి ముప్పు ఉన్న గ్రామాలు : 80 ఆగస్టు 26న వజ్రకరూరు మండలం గూళ్యపాళ్యంలో అర్దరాత్రి రైతు కురబ నాగేంద్రకు చెందిన ఆవుదూడపై చిరుతదాడి చేసి చంపేసింది. ఇంటి ఎదుట దూడను తాడుతో కట్టేసి ఉండగా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత దాడి చేసింది. అలికిడికి రైతు నిద్రలేచి చూసే సరికి దూడ చనిపోయింది. ఆగస్టు 27న అమడగూరు మండలం పేరంవాండ్లపల్లిలో చాకల రంగప్ప అనే వ్యక్తి గ్రామ శివారులోని కొండ వద్ద తన పొలాన్ని చూసేందుకు వెళ్లాడు. పంటలో ఉన్న కొండ చిలువ రంగప్ప పైకి దూసుకొచ్చింది. ప్రాణభయంతో స్థానికులతో కలిసి సదరు కొండ చిలువను చంపేశాడు. జిల్లాలో కొన్ని నెలలుగా వరుసగా వన్యప్రాణుల దాడులు పెరిగిపోయాయి. అడవుల్లో వాటికి సరైన ఆహారం, నీరు లభ్యం కాకపోవడంతోనే జనావాసాల వద్దకు వస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.96 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. గుత్తి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, తనకల్లు ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వర్షాభావం, ఇతర కారణాలతో జిల్లాలో ఏడాదికేడాదికి అడవులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా వన్యప్రాణుల మనుగడ కష్టమైంది. అడవుల్లో వాటికి సరైన ఆహారం, నీరు లభ్యం కావడం లేదు. దీంతో అటవీ శివారు గ్రామాలు, పట్టణాల్లో అవి చొరబడి నష్టాలకు కారణమవుతున్నాయి. చిరుతల హల్చల్ ప్రతి ఏటా జిల్లాలో చిరుతలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో రాయదుర్గం పట్టణంలోనే జనావాసాల్లోకి చిరుతలు చొరబడి భయాందోళనలకు గురి చేశాయి. వజ్రకరూరు మండలం ప్రతి ఏటా చిరుత దాడిలో మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. దీనికి తోడు కొండ చిలువలు, ఇతర విషసర్పాలు కలకలం రేపుతున్నాయి. కొండ శివారు ప్రాంతాల్లోకి మేకలు, గొర్రెలు, పశువులను మేపునకు తీసుకెళ్లేందుకు కాపరులు భయపడుతున్నారు. పంటలకూ అపార నష్టం అడవి జంతువుల దాడితో అటవీ శివారు ప్రాంత గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంట పొలాలు ధ్వంసమైపోతున్నాయి. జింకలు, అడవి పందుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఉరవకొండ, కళ్యాణదుర్గం, యల్లనూరు, పామిడి, గుంతకల్లు ప్రాంతాల్లో జింకల దాడిలో వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లుతోంది. దీనికి తోడు విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే లోపు అడవి పందుల దాడులు కూడా భారీగా ఉంటోంది. వన్యప్రాణుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు పొలాలకు కంచె వేసుకునే అవకాశం కూడా రైతులకు లేదు. అంతేకాక మెట్ట పంటలకు రూ. లక్షలు వెచ్చించి కంచె ఏర్పాటు చేసుకోవడం కరువు జిల్లా రైతులకు తలకు మించిన భారమవుతోంది. అరకొర పరిహారం వన్యప్రాణుల బారిన పడి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అరకొరగానే అందుతోంది. గతేడాది చిరుతల దాడిలో 85 పాడి పశువులు చనిపోతే బాధితులకు రూ.6.48 లక్షలు మాత్రమే పరిహారం కింద చెల్లించారు. అంటే సగటున రూ. 10 వేలు నుంచి రూ. 15 వేలకు మించి పరిహారం దక్కలేదు. వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లితే రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు పరిహారం చెల్లిస్తున్నారు. వన్యప్రాణుల దాడిలో రైతులు భారీగా నష్టపోతున్నా.. అందుకు తగ్గ పరిహారం అందడం లేదు అన్నది అక్షర సత్యం. పొలాలకు కంచె వేసుకునేందుకు అనుమతి ఇస్తే వన్యప్రాణుల బారి నుంచి పంట కాపాడుకునేందుకు వీలవుతుందని రైతులు అంటున్నారు. చీకట్లు నింపిన ఎలుగుబంటి పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో బోయ శ్రీనివాసులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తోటి గొర్రెల కాపరులతో కలిసి వెళ్లిన శ్రీనివాసులుపై ఎలుగుబంటి దాడి చేసింది. భర్త అకాల మృతిని జీర్ణించుకోలేని ఆయన భార్య రాణెమ్మ సైతం కొన్నాళ్లకు మరణించారు. దీంతో వారి కుమారుడు వర్థన్‌బాబు (11) కుమార్తె కుసుమ (8) అనాథలయ్యారు. వీరిని ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదు. ప్రస్తుతం అవ్వాతాతల సంరక్షణలో వారు ఉన్నారు. రామరాజుపల్లి రైతులకు తప్పని జింకల బెడద పామిడి మండలంలోని నీలూరు, తంబళ్లపల్లి, పొగరూరు, గజరాంపల్లి, రామరాజుపల్లి గ్రామాల్లో 2 వేల మంది రైతులు 2,400 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. రామరాజుపల్లి గ్రామపరిధిలోని నల్లరేగడి భూముల్లో 300 మంది రైతులు 2వేల ఎకరాల్లో పత్తిపంట సాగుచేస్తున్నారు. సాగుచేసినప్పటి నుంచి జింకల బెడద తీవ్రంగా ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జింకల నుంచి పంటను కాపాడాలి వేలాది రూపాయల పెట్టుబడితో పత్తి పంట సాగు చేశాం. పంట మొలక దశలో ఉండగానే జింకల గుంపు దాడిచేసి తిసేస్తున్నాయి. దీంతో తిరిగి రెండోసారి విత్తనం వేయాల్సి వస్తోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జింకల బెడదను అరికట్టడంలో అటవీశాఖాధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. - సి.హరినాథ్‌రెడ్డి, రామరాజుపల్లి గ్రామం, పామిడి మండలం కంచె ఏర్పాటు చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపుతాం అటవీ శివారులోని పంట పొలాలకు వన్యప్రాణుల బెడద ఉందనేది వాస్తవమే. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తున్నాం. పంటలకు రక్షణగా కంచె ఏర్పాటు చేసుకోవడానికి రాయితీ అందజేసే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. సాధ్యమైనంత వరకూ అటవీ శివారు ప్రాంతాల్లో నివాసమున్న వారు.. పశుసంపదను మేపునకు తీసుకెళ్లడంలో జాగ్రత్తలు పాటించాలి. గ్రామాల్లో పశువుల పాకలు ఎత్తుగా నిర్మించుకోవాలి. - ఎ.చంద్రశేఖర్, జిల్లా అటవీశాఖ అధికారి జాగరణ చేస్తున్నాం నాకున్న ఐదు ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలు ముందస్తు గుత్త చెల్లించి వేరుశనగ పంట సాగు చేశాను. ఎకరాకు రూ. 15 వేలుకు పైగా పెట్టుబడి పెట్టాను. జింకల సంచారంతో భారీగా నష్టం వాటిల్లుతోంది. పంటను కాపాడుకునేందుకు ప్రతి రోజూ రాత్రి జాగరణ చేయాల్సి వస్తోంది. – ఉచక్కగారి రమేష్, కౌలురైతు వజ్రకరూరు మండలం 40 శాతం పంట నష్ట పోయాను నాకున్న రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. ఎకరాకు రూ. 10వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. జింకల సంచారంతో ఇప్పటికే 40 శాతం పంట నష్టపోయాను. అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. – నెట్టయ్య, రైతు, పొట్టిపాడు, వజ్రకరూరు మండలం తీవ్రంగా నష్టపోతున్నాం. :నాకున్న 4.50 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. విత్తనం వేసినప్పటి నుంచి అడవి జంతువుల బెడద ఎక్కువైంది. ఆడవి పందులు రాత్రి పూట పొలంలోకి ప్రవేశించి భూమిలోని విత్తనాన్ని తినేశాయి. మొలకెత్తిన చెట్లను సైతం అవి పెకలించేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు రెండు ఎకరాల్లో పంట నష్టపోయాను. ప్రతి ఏటా ఇలాగే జరుగుతోంది. - జానూబీ, అచ్చంపల్లి, కంబదూరు మండలం ఎకరాల కొద్ది పంటల ధ్వంసం అడవి పందులు రాత్రిళ్లు పంటలపైబడి నాశనం చేస్తున్నాయి. పందుల సంచారంతో ఎకరాల కొద్ది పంట ధ్వంసమవుతోంది. వారం రోజుల్లో నేను సాగు చేసిన మూడు ఎకరాల్లోని వేరుశనగ పంటలో 40 శాతం పంటను పందులు తోడేశాయి. రాత్రికి ఇద్దరు కాపలాకు వెళ్లినా పందుల బారి నుంచి పంటను కాపాడుకోలేకపోతున్నాం. 20 నుంచి 30కి పైగా పందులు గుంపులుగా వచ్చి నిమిషాల్లో పంటను పెకలించి వేస్తున్నాయి. - సరోజమ్మ, మహిళా రైతు, కెంచంపల్లి, కుందుర్పి మండలం -
40 పులులు.. నలుగురు మనుషులు..
పులి పలకరించింది కదాని.. పక్కన నిలబడి ఫొటో దిగకూడదురోయ్.. ఇది ఓ సినిమాలోని డైలాగ్.. అయితే.. బ్రిటన్‌లోని కెంట్‌లో ఉన్న పోర్ట్ లిమ్ టైగర్ రిజర్వ్‌కు వెళ్తే.. ఇవన్నీ చేయొచ్చు. ఫొటో చూశారుగా.. అదీ సంగతి.. గత నెల్లో ఇక్కడ టైగర్ లాడ్జిని ప్రారంభించారు. ఇందులో ఉంటే.. ఇదిగో ఇలా పులులను మన పక్కనే చూడొచ్చు. ఎందుకంటే.. ఈ లాడ్జిని పులుల ఎన్‌క్లోజర్‌లోనే కట్టారు. వాటికి, మనకు మధ్య ఓ అద్దమే అడ్డు. ఇక్కడ మొత్తం 40 పులులున్నాయి. ఈ లాడ్జిలోని క్యాబిన్లో నలుగురు ఉండొచ్చు. మొత్తమ్మీద అద్భుతమైన అను భూతి మీ సొంతమవుతుందని టైగర్ రిజర్వ్ అధికారులు చెబుతున్నారు. ఒక రోజు ఉండాలంటే ఆఫ్ సీజన్లో రూ.31 వేలు.. సీజన్లో అయితే.. రూ.66 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రిజర్వ్‌లో ఖడ్గమృగాలను ఇదే తరహాలో వీక్షించేందుకు మరో లాడ్జి కూడా ఉంది. -
కుటుంబ పెద్దలను ఆహారంగా పంపుతున్నారు
పిలిభిత్: ఆచారాలు, కర్మలను నమ్మి అనుసరించే జాతి వారిది. అడవి తల్లిపై ఆధారపడి సాగించే జీవితం. తల్లి నుంచి తీసుకున్న దానిలో కొంత తిరిగి ఇచ్చేయమని చెబుతుంది వారి ఆచారం. అడవి తల్లికి ఇవ్వడానికి వారి దగ్గర ఉంది ప్రాణాలే. కుటుంబానికి ఒకరు చొప్పున స్వయంగా అడవిలోకి వెళ్లి పులులకు ఆహారంగా మారుతూ ఆత్మార్పణ చేసుకుంటున్నారు. అవును. భారత్-నేపాల్ సరిహద్దుకు చేరువలో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పిలిభిత్ టైగర్వ్ రిజర్వ్‌కు చేరువలో నివసిస్తున్న గ్రామాలు ప్రజలు ఇలా ప్రాణార్పణ చేసుకుంటున్నారని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2016 ఫిబ్రవరి నుంచి దాదాపు ఏడుగురు పెద్ద వయసు గల వ్యక్తులు పులులకు ఆహారంగా మారిన ఆనవాళ్లు అధికారులకు దొరికాయి. అడవి లోపల చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన వస్తువులు కూడా దొరికాయి. ఈ సంఘటనలపై వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో(డబ్ల్యూసీసీబీ) దర్యాప్తుకు ఆదేశించింది. పులులు మనుషులను చంపడంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన అధికారి వెల్లడించిన వివరాలు అటవీ శాఖ అధికారులను షాక్‌కు గురి చేశాయి. అడవి చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలే స్వచ్చందంగా పులులకు ఆహారంగా మారుతున్నారని ఆయన చెప్పారు. అడవి తల్లి తమను పేదరికం నుంచి గట్టెక్కిస్తుందనే నమ్మకంతోనే కుటుంబ పెద్దలు ఒక్కొక్కరిగా ప్రాణాలు త్యాగం చేస్తున్నారని వెల్లడించారు. -
పులుల లెక్కింపుపై సమీక్ష
ఆత్మకూరు: నల్లమల అటవీ పరిధిలో నాలుగో విడత పులుల లెక్కింపుపై కర్నూలు సీసీఎఫ్ జేఎస్ఎన్ మూర్తి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బైర్లూటీ చెక్‌పోస్టు సమీపంలోని అటవీశాఖకు చెందిన జంగిల్ క్యాంపులో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది రెండుసార్లు పులుల లెక్కింపు జరుగుతుందని, ఇందులో తొలి విడత 45 రోజులు, మరో రోజు 45 రోజుల చొప్పున టైగర్లను గుర్తించడం జరుగుతుందన్నారు. పులుల లెక్కింపు ప్రధానంగా సీసీ కెమెరాల ద్వారా, నీరు నిల్వ ఉన్న కుంటల వద్ద, సెలయేర్లు, చల్లని ప్రదేశాలలో పులుల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుండ్ల బ్రహ్మేశ్వరం అరణ్యపరిధిలో బఫర్ ఏరియాపై నిర్ణయం తీసుకునేందుకు అ«ధికారులతో సమీక్షించారు. బఫర్ ఏరియా ఏర్పాటు చేస్తే కలిగే వివిధ అంశాలపై అధికారులతో ఆయన ప్రధానంగా చర్చించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ ఎస్డీ శర్వణన్, గుంటూరు సీఎఫ్ రామ్మోహన్రావు, ఆత్మకూరు డీఎఫ్ఓ సెల్వం, నంద్యాల డీఎఫ్ఓ శివప్రసాద్, మార్కాపురం డీఎఫ్ఓ జయచంద్ర, గిద్దలూరు డీఎఫ్ఓ ఖాదర్‌బాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రుద్రవరం రేంజ్లో పెద్దపులులు
–నంద్యాల డివిజన్లో 12 పులుల గుర్తింపు –పులుల గుర్తింపుకు రుద్రవరం, చెలిమ రేంజిల్లో సిసి కెమెరాలు ఏర్పాటు రుద్రవరంం: రుద్రవరం అటవీ సబ్‌డివిజన్ పరిధిలో పెద్దపులులు సంచరిస్తున్నాయి. ఇప్పటి వరకు బడిఆత్మకూరు, నంద్యాల, గుండ్ల బ్రమ్మేశ్వరం రేంజ్‌ల పరిధిలోని బైరేని, బండి ఆత్మకూరు, గుండ్ల బ్రమ్మేశ్వరం, గడి గుండం, పున్నాగి కుంట, ఓంకారం, రామన్న పెంట ప్రాంతాల్లోనే అవి ఉండేవి. దీంతో ఆయా ప్రాంతాల పరిధిలోని అడవిలోనికి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసకుంటునా్నరు. అయితే, ఈ మధ్యకాలంలో రుద్రవరం, చెలిమ రేంజ్‌లలో పెద్ద పులులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. దీంతో ఆ రేంజ్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఊహించనట్టుగానే చెలిమ బీటులో పెద్ద పులి కెమెరా కంటపడింది. రుద్రవరం రేంజ్ పరిధిలోని ఊట్ల, గారెల్ల ప్రాంతంలో పెద్ద పులుల అడుగులు గుర్తించినట్లు రేంజర్ రామ్ సింగ్ వెల్లడించారు. మొత్తం ఇక్కడ ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించేందుకు మరిన్ని సీసీ కెమెరాలు కావాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పెద్ద పులుల సంచారంతో వెదురు సేకరణ నిలిపివేత చెలిమ, రుద్రవరం రేంజ్‌ల పరిధిలో పెద్దపులి సంచారంతో నాలుగు కూపుల్లో వెదురు సేకరణను అటవీ అధికారులు నిలిపి వేశారు. చెలిమ రేంజ్లో దొంగ బావి, బసువాపురం కూపులను నిలిపి వేయగా రుద్రవరం రేంజ్ పరిధిలోని ఊట్ల, గారెల్ల ప్రాంతాల్లో పెద్ద పులుల అడుగులు పడటంతో అక్కడ కూడా వెదురు సేకరణను నిలిపి వేశారు. ఈ విషయాన్ని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు గమనించి వాటి మనుగడకు భంగం కలగకుండా సహకరించాలని డీఎఫ్ఓ శివప్రసాదు కోరారు.నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 12 పెద్దపులులను గుర్తించినట్లు తెలిపారు. -
పులితో ఆట...ఆ తర్వాత ఈత...
‘రేయ్.. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో.. చూస్కో. పులితో ఫొటో దిగాలనిపించింది అనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే.. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తది’.. అని ‘యమదొంగ’లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఏదో సినిమా కాబట్టి ఫొటో దిగొచ్చని అన్నారు కానీ, నిజమైన పులితో ఎవరైనా ఆ పని చేయాలనుకుంటారా? ఒకవేళ అవి ఏమీ చేయవని తెలిసినా ఫొటో దిగే సాహసం చేయరు. కానీ, సుష్మితా సేన్ ఇక్కడ. వెరీ బోల్డ్. ఈ అందాల సుందరికి ఎప్పట్నుంచో పులిని దగ్గరగా చూడాలని కోరిక. వీలైతే పులిని ప్రేమగా నిమరాలని, ఫొటో దిగాలని కూడా అనుకున్నారు. తన చిరకాల కోరికను ఇటీవల సుష్మిత తీర్చేసుకున్నారు. దత్త పుత్రికలు పదహారేళ్ల రీనీ, ఆరేళ్ల అలీషాలు ఎక్కడైనా హాలిడే ట్రిప్ వెళదామని కన్నతల్లిలా చూసుకుంటున్న పెంపుడు తల్లి సుష్మితాని అడిగారట. అంతే.. థాయ్‌ల్యాండ్ తీసుకెళ్లారు. అక్కడ పుకెట్ జూకి ఈ తల్లీకూతుళ్లు వెళ్లారు. పులి దగ్గరకు వెళ్లి దాన్ని ప్రేమగా నిమిరి, ఫొటో దిగారు సుష్మిత. రీనీ కూడా ఆ సాహసం చేసింది. అలీషా మాత్రం ముందు భయపడిందట. కానీ, ఆ తర్వాత నాలుగు నెలల పులి పిల్ల దగ్గర కూర్చుని, ప్రేమగా నిమిరింది. పులితో తాము దిగిన ఫొటోలను సుస్మిత సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ‘‘నాకు మూగజీవాలంటే ప్రేమతో పాటు గౌరవం. పెట్ యానిమల్స్‌ని పెంచుకుంటుంటాను. ఇప్పుడు పులిని దగ్గరగా చూడటం, ఫొటోలు దిగడం చాలా హ్యాపీగా అనిపించింది. నా కూతుళ్లు కూడా చాలా ఆనందపడ్డారు’’ అని సుష్మిత పేర్కొన్నారు. -
దేవాలయంలో 40 పులుల మృత దేహాలు
బాంకాక్: పవిత్ర దేవాలయం పులుల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. థాయ్ లాండ్ వన్యప్రాణి సంరక్షణ అధికారులు వివాదాస్పద బౌద్ధ ఆలయంలో 40 మృతి చెందిన పులి పిల్లలను బుధవారం గుర్తించారు. దక్షిణ బ్యాంకాక్ లోని కంచన్ పురిలో గల యానాసంపన్న ఆలయం టైగర్ టెంపుల్ గా ప్రసిద్థి చెందింది. ఇక్కడ ఆలయం పులుల స్మగ్లింగుకు వేదికగా మారిందని గతకొంత కాలంగా ఆరో్పణలు వస్తున్నాయి. దీంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు దేవాలయంలోని కిచెన్‌లోని ప్రీజర్‌లో 40 పులి పిల్లల మృత దేహాలను గుర్తించారు. అక్కడ ఉన్న 85 పులులను స్వాధీనం చేసుకున్నట్టు నేషనల్ పార్క్ డైరెక్టర్ తెలిపారు. గత కొంత కాలంగా థాయ్ లాండ్ వన్యప్రాణుల అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. చైనాలో సాంప్రదాయ వైద్యంలో పులుల భాగాలను ఉపయోస్తారు. -
ఆరు వేల ఏనుగులు, 400 పులులు
దేశంలోనే ప్రథమ స్థానంలో కర్ణాటక మాట్లాడుతున్న మంత్రి రామనాథ రై బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరణ్యాల్లో ప్రస్తుతం ఆరు వేల ఏనుగులు, నాలుగు వందలకు పైగా పులులు ఉన్నాయని, తద్వారా పులులు, ఏనుగుల సంఖ్యలో దేశంలోనే మొదటి స్థానంలో కర్ణాటక నిలిచిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బి.రామనాథ రై వెల్లడించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవలే వన్యజీవుల లెక్కింపు చేపట్టగా 400కు పైగా పులులు, ఆరు వేలకు పైగా ఏనుగులు ఉన్నట్లు తేలిందని అన్నారు. వన్యజీవులు సమృద్ధిగా ఉంటేనే అడవులు, ఆ ప్రాంతాలు పర్యావరణ సమతౌల్యంతో ఉండేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో వన్యప్రాణులు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయని, దీన్ని అడ్డుకునేందుకు గాను అటవీశాఖ అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. అరణ్యాలను కాపాడుకుంటే వన్యజీవులు ఆ అడవులను వదిలి జనావాసాల్లోకి రావాల్సిన పరిస్థితే ఉండదని అభిప్రాయపడ్డారు. వన్యజీవుల సంరక్షణ పట్ల మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలోని అభయారణ్యాల్లో ఉన్న పులులపై నిఘా ఉంచేందుకు గాను సీఎస్ఎస్ కార్ప్ సంస్థ 800 నిఘా కెమెరాలను ప్రభుత్వానికి అందజేసిందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఇక జనావాసాలపై ఏనుగుల దాడుల నిరోధానికి గాను ఇప్పటికే కందకాల నిర్మాణం, రైల్వే పట్టీల ఏర్పాటును అటవీశాఖ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. -
మధ్యప్రదేశ్‌లో పెరిగిన పులుల సంఖ్య
భోపాల్: మధ్యప్రదేశ్‌లో పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 397 పులులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2014 గణాంకాలతో పోల్చితే 89 పెద్ద పులులు పెరిగాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వాస్తవానికి 2011లోనే మధ్యప్రదేశ్ ‘టైగర్ స్టేట్’ హోదాను కోల్పోయింది. తాజా గణాంకాల నేపథ్యంలో ఈసారి జాతీయ స్థాయిలో చేపట్టే పులుల లెక్కింపులో మధ్యప్రదేశ్ తిరిగి టైగర్ స్టేట్ హోదాను కైవసం చేసుకుంటుందని రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
పెద్ద గుమడాపురంలో పెద్దపులుల కలకలం
కొత్తపల్లి (కర్నూలు) : కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమడాపురం గ్రామంలో పులి సంచరిస్తుందనే వార్త కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి కంది చేను వద్ద కావలికి వెళ్తున్న వ్యక్తి పులిని గుర్తించి గ్రామస్థులను అప్రమత్తం చేశాడు. దీంతో 40 మంది గ్రామస్థులు కలిసి దాన్ని తరమడానికి ప్రయత్నించారు. అనంతరం తెల్లవారుజామున అదే గ్రామ సమీపంలోని చెంచు గూడెం వద్ద మూడు పులులు సేద తీరుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు హడలిపోయారు. దీంతో గ్రామంలో ఉండలేమంటూ అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. రంగంలోకి దిగిన అటవీ అధికారులు నిజంగా ఆ ప్రాంతంలో పులుల గుంపు సంచరిస్తుందేమో ఆరా తీసే పనిలో పడ్డారు. -
మనుషుల్లోనూ పులి చారలు!
మెడి క్షనరీ పులుల్లోనే ఒంటినిండా చారలుంటాయని అనుకుంటున్నారా? చాలామంది మనుషుల చర్మం కింద కూడా పులిచారల్లాంటివే ఉంటాయి. ఈ లైన్స్ అన్నీ జీబ్రాల్లాగే ప్రతి మనిషిలోనూ వేర్వేరుగా ఉంటాయట. జర్మన్ డర్మటాలజిస్ట్ అల్ఫ్రెడ్ బ్లాష్కో అనే చర్మవ్యాధి నిపుణుడి పేరిట ఈ చారలను ‘బ్లాష్కోస్ లైన్స్’ (Blaschko's lines) అని అంటారు. కొందరిలో చర్మ వ్యాధి సోకినప్పుడు ఈ చారలు కనిపించేవి. ఇప్పుడు వీటి రహస్యం తెలిసింది. పిండదశలోని ఒకే ఒక కణం నుంచి అనేక కణాలుగా విభజితమయ్యేప్పుడు వాటిలోని కొన్ని కండరాలుగా, మరి కొన్ని ఎముకలుగా ఇంకొన్ని చర్మంగా రూపొందే సమయంలో ఇంగ్లిష్ అక్షరాల్లోని ‘వి’, ‘ఎస్’ లాంటి రకరకాల పాట్రన్స్లో ఇలా పులి చారల్లా ఏర్పడతాయని గుర్తించారు. -
పులుల సంరక్షణకు ప్రత్యేక బలగాలు
- అటవీ శాఖ ప్రతిపాదనలకు ఎన్టీసీఏ ఆమోదం - పోలీసులు, పారా మిలిటరీ తరహాలో శిక్షణ సాక్షి, హైదరాబాద్: పులులను సంరక్షించేందుకు ప్రత్యేక బలగాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అటవీ శాఖ పంపిన ప్రతిపాదనలకు జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ- ప్రాజెక్టు టైగర్) ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 9 అభయారణ్యాలకు గాను, పులుల ఉనికిని గుర్తించిన 2 అభయారణ్యాలను టైగర్ రిజర్వుగా ప్రకటించారు. వీటిలో ఒకటి దేశంలోనే అతి పెద్దదైన అమ్రాబాద్ టైగర్ రిజర్వు (3,568 చదరపు కిలోమీటర్లు)కాగా, మరొకటి కవ్వాల్ టైగర్ రిజర్వు (892.23 చదరపు కిలోమీటర్లు). టైగర్ రిజర్వు విస్తీర్ణాన్ని కోర్, బఫర్ ఏరియాలుగా వర్గీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కోర్ ఏరియాకు ఫీల్డ్ డెరైక్టర్‌ను నియమించి బఫర్ ఏరియాను కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు పరిధిలో చేర్చారు. పులుల సంరక్షణలో కీలకమైన కోర్ ఏరియాలో నూతనంగా నియమించే ప్రత్యేక బలగాలను మోహరిస్తారు. ఒక్కో టైగర్ రిజర్వుకు 120 మంది చొప్పున 240 మంది సిబ్బందిని నియమిస్తారు. ప్రస్తుతం అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బందిలో ఎక్కువ మంది 40-50 ఏళ్ల మధ్య వయసు వారు ఉండడంతో శారీరక దృఢత్వం లేక స్మగ్లర్లు, వన్యప్రాణి వేటగాళ్ల నియంత్రణలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో టైగర్ రిజర్వులో పనిచేసే బలగాల్లో ఆయుధాల వినియోగంలో సుశిక్షితులైన 40 ఏళ్ల లోపు వారినే నియమిస్తారు. -
పులులన్నీ పిల్లిజాతే ?
సాక్షి: అవన్నీ ఒకే కుటుంబం.. పరిణామక్రమంలో రకరకాల జాతులుగా విడిపోయాయి. ఆకారం, దేహ నిర్మాణంలో స్వల్ప మార్పులున్నప్పటికీ బాహ్యస్వరూపం మాత్రం ఒకేరకంగా ఉంటుంది. పరిమాణం ఆధారంగా ఆహార సేకరణ, అలవాట్లలో వ్యత్యాసాలున్నాయి. వీటిలో ఓ జాతిని పరాక్రమానికి ప్రత్యామ్నాయంగా, మరోదాన్ని పిరికితనానికి చిరునామాగా పేర్కొంటాం.. ఆ జాతి మరేదో కాదు పిల్లి జాతే! ఇందులో పులి, చిరుత, చీటా, జాగ్వార్.. ఇలా రకరకాల జాతులు, ఉపజాతులు ఉన్నాయి. వీటిలో కొన్ని వేగానికి మారుపేరుగా నిలిచాయి. కొన్ని వేటాడడంలో దిట్టగా పేరొందాయి. చారలన్నింటిలోన పులిచారలు వేరయా! అన్నట్లుగా జాతి జాతికి వీటి చారల్లో వైవిధ్యం కొట్టొచ్చిన్నట్లుగా కనిపిస్తుంది. వీటి పరిమాణంలో వ్యత్యాసమున్నా.. రూపం, వేటాడే తీరులో దాదాపు అన్నీ ఒకే పంథాను అనుసరిస్తాయి. అందుకే పులులన్నీ పిల్లి జాతే! పులి పిల్లి జాతిలో మొదట చెప్పుకోవాల్సింది పులి. ధైర్యానికి, పరాక్రమానికి మారుపేరు ఇది. శాస్త్రీయనామం పాంథెరా టైగ్రిస్. వేటాడంలో దీనికంటూ ప్రత్యేక శైలి ఉంటుంది. తూర్పు-దక్షిణ ఆసియాలో కనిపిస్తుంది. గరిష్ట బరువు 300 కిలోలు. ఎత్తు 110 సెం.మీ.లు. పసుపు లేదా బంగారం వర్ణంలో ఉండే శరీరం పొడవాటి కత్తుల్లాంటి చారలు దీన్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. వీటి శరీర రంగు, చారలు ఇవి గడ్డిమైదానాల్లో నక్కినా ఇతర జంతువులు గుర్తించకుండా ఉండటానికి దోహదపడతాయి. వేటాడే జీవి, మాంసాహారి. ఇండియాలో కనిపించే రాయల్ బెంగాల్ టైగర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇవి ఇండియా, బంగ్లాదేశ్, చైనా, ఆఫ్గనిస్తాన్, ఇండోనేషియన్ ద్వీపాలలో విస్తరించాయి. వీటిలో పలు ఉపజాతులున్నాయి. అవి సైబీరియన్, ఇండో- చైనీస్, ఇండోనేసియన్, మలయన్, సమత్రన్, బాలీనీస్ తదితర రకాలున్నాయి. చీటా ఇది వేగానికి మారుపేరు. భూమిపై నివసిస్తోన్న అన్ని జీవుల్లో కెల్లా అత్యధిక వేగంతో పరిగెత్తుతుంది. గంటకు 110-120 కిలోమీటర్ల గరిష్టవేగంతో పరిగెత్తగలవు. వేటాడంలో వీటికి సాటి ఎవరూ రారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇది కేవలం 3 సెకండ్లలో 90 కి.మీ.ల వేగాన్ని అందుకోగలదు. ఇది ఆఫ్రికా, ఇరాన్ ప్రాంతాలలో కనిపిస్తుంది. శాస్త్రీయనామం ఆక్సినోసిస్ జుబాటస్. బరువు గరిష్టంగా 72 కిలోలు. ఎత్తు 90 సెం.మీ.లు ఉంటుంది. శరీరం పసుపు లేదా బంగారు వర్ణంలో ఉంటుంది. శరీరంపై గుండ్రని మచ్చలుంటాయి. చిరుతపులి దీని శాస్త్రీయనామం పాంథెరా పార్డస్. వాస్తవానికి చీటా, చిరుత రెండూ వేర్వేరు జాతులు. బంగారు వర్ణంలో శరీరంపై నల్లటి పెద్దమచ్చలు కలిగి ఉంటుంది. ఇవి పిల్లి జాతికే చెందినప్పటికీ ఇవి రెండూ ఒకటి కాదు. ఇది వేగంగా పరిగెత్తుతుంది కానీ చీటా అంత వేగంగా కాదు. దీని గరిష్ట వేగం గంటకు 58 కి.మీ. సబ్-సహారన్ ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. గరిష్ట బరువు 77 కిలోలు. ఎత్తు 78 సెం.మీ.లు జాగ్వార్ దీని శాస్త్రీయనామం ఫాంథోరా అంకా. బరువు గరిష్టంగా 96 కిలోలు. ఎత్తు 76 సెం.మీలు. దీని శరీరం ముదురు పసుపు వర్ణంలో ఉంటుంది. దేహంపై గులాబీ పువ్వు ఆకారంలో ఉన్న మచ్చలుంటాయి. ఇవి దాక్కున్న పరిసరాలకు అనుగుణంగా కలిసిపోగలవు. ఇది నక్కి ఉండి వేటాడుతుంది. చెట్లపై ఉండే చిన్న జంతువుల్ని వేటాడటంలో నైపుణ్యం కలదు. పాంథర్ ఇది ఉత్తర అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా అడవుల్లో కనిపిస్తుంది. దీని శరీరంలో మెలనిన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది పూర్తిగా నల్లగా ఉంటుం ది. చెట్లపై ఉంటూ వేటాడుతుంది. చిరుత, జాగ్వార్ వంటి పులి జాతుల్లో ఏర్పడే మెలానస్టిక్ రంగు వైవిధ్యాలుగా ఇవి ఉద్భవిస్తాయి. అంతే తప్ప ఇవి ప్రత్యేకమైన జాతులు కావు. -
చిక్కిన పులులు
సాక్షి, చెన్నై: వండలూరు జూ నుంచి జారుకున్న పులులు చిక్కాయి. ఆ జూ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆదివారం నుంచి సందర్శకులను జూలోకి అనుమతిస్తున్నారు. చెన్నై వండలూరు జూ నుంచి పులులు జారుకున్న విషయం తెలిసిందే. జూ నుంచి పులులు తప్పించుకున్న సమాచారం ఆ పరిసరాల్లో కలకలం రేపింది. ఇప్పటికే గత కొంత కాలంగా ఓ పులి సంచరిస్తున్న వ్యవహారంతో ఆందోళనలో ఉన్న ఆ పరిసరవాసుల్లో తాజా ఘటన మరింత ఆందోళనలో పడేసింది. జూలోకి సందర్శకుల అనుమతిని రద్దు చేసిన అధికారులు పులుల కోసం గాలింపు తీవ్రతరం చేశారు. పులుల జాడ కోసం సీసీ కెమెరాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడక్కడ మాంసాన్ని ఉంచారు. ఆకలితో వచ్చే ఆ పులులు ఎలాగైనా కెమెరాలకు చిక్కుతాయన్న ఎదురు చూపుల్లో పడ్డారు. ఎట్టకేలకు శనివారం సాయంత్రం నాలుగు పులులు ఆహారం కోసం వచ్చి కెమెరాకు చిక్కాయి. అప్పటికే 30 మందికి పైగా సిబ్బంది అక్కడక్కడ మాటేశారు. వెర్లైస్ ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఆహారం కోసం వచ్చిన నాలుగు పులులకు ఇంజక్షన్ వేసి మత్తులోకి పంపించారు. వాటిని అక్కడికక్కడే ప్రత్యేక బోనుల్లో ఉంచి భద్రతతో కూడిన ప్రదేశానికి తరలించారు. మూడు పులులలను ఓ బోనులో, మరో పులిని ప్రత్యేక బోనులో ఉంచారు. ముచ్చెమటలు : నాలుగు పులులు చిక్కినా నేత్ర అనే రెండేళ్ల పులి పిల్ల జాడ మాత్రం కానరాలేదు. దీని కోసం తీవ్రంగా రాత్రంతా శ్రమించారు. ఆదివారం ఉదయాన్నే ఓ చోట ఉంచిన మాంసం తింటూ నేత్ర కెమెరాకు చిక్కింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది నేత్రను బంధించారు. అన్ని పులులూ చిక్కడంతో జూ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. పులుల్ని బంధించామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. నాలుగు పులులను మాత్రం ప్రత్యేకంగా బోనుల్లో ఉంచామని, చిన్న పులి నేత్రను మాత్ర సందర్శకుల సందర్శనార్థం వాటికి కేటాయించిన ప్రదేశంలో వదిలినట్లు పేర్కొన్నారు. వర్షం కారణంగా పది అడుగుల గోడ 150 మీటర్ల మేరకు దెబ్బ తినడంతో దానికి మరమ్మతులు చేసే పనిలో సిబ్బంది నిమగ్నం అయ్యారు. ఈ పనులు ముగియడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉన్న దృష్ట్యా, అంత వరకు మిగిలిన పులులను బయటకు వదలబోమని జూ వర్గాలు స్పష్టం చేశాయి. ఉదయాని కల్లా అన్ని పులులను బంధించడంతో ఇక సందర్శకులకు అనుమతి ఇచ్చారు. అయితే, సందర్శకుల తాకిడి అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హం. వచ్చిన వాళ్లందరూ పులి పిల్ల నేత్రను చూడటానికి ఎగబడేవారే. -
జూ నుంచి జారుకున్న పులులు!
చెన్నై : ఏళ్ల తరబడి జూ లోపలే కాలం గడపడం ఆ పులులకు బోరు కొట్టినట్లుంది. చెన్నై వండలూరులోని జూ (అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్) నుంచి శనివారం రెండు పులులు చల్లగా జారుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన వండలూరు జూలో అనేక జంతువులతోపాటు 16 పులులు, 5 తెల్ల పులులు ఉన్నాయి. నగరంలో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురవడంతో జూలో పులులు సంచరించే ప్రాంతంలోని ప్రహరీగోడ ఈ ఉదయం 30 అడుగుల మేర కూలిపోయింది. ప్రహరీ కూలిన ప్రాంతంలో ఇనుపవైర్లతో కంచె నిర్మించారు. గోడ కూలగానే రెండు పులులు అక్కడి నుంచి వెలుపలకు వెళ్లిపోయినట్లు అక్కడి కాలిగుర్తులను బట్టి అనుమానిస్తున్నారు. గోడ కూలినట్లు సమాచారం అందుకున్న అధికారులు హడావుడిగా ప్రహరీ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న నాలుగు పులులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరో ప్రాంతానికి తరలించారు. వండలూరు జూ నుంచి రెండు పులులు పారిపోయాయనే ప్రచారంతో ఆయా పరిసరాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అయితే అధికారులు మాత్రం పులులు వెలుపలకు వెళ్లినట్లు ధృవీకరించడం లేదు. జూలో ఉన్న పులులను లెక్కిస్తున్నామని, గోడకూలినా పులులు పారిపోయే అవకాశం లేదని వారు అంటున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు. ** -
పులులు మిమిక్రీ చేస్తాయా?!
జంతు ప్రపంచం ►పుట్టిన తర్వాత ఓ వారం రోజుల వరకూ పులులకు కళ్లు కనిపించవు. ఆ తర్వాతే మెల్లగా అన్నీ కనిపిస్తాయి. చూపు స్పష్టమవడానికి కాస్త సమయం పడుతుంది. పులికి ఎంత బలముంటుందంటే... అది తనకంటే రెండు రెట్లు పెద్దదైన జీవిని కూడా చాలా తేలిగ్గా చంపేయగలదు! ►ఆహారం విషయంలో పులులు చాలా స్వార్థంగా ఉంటాయి. ఒక జంతువును చంపి తిన్న తర్వాత ఇంకా మిగిలితే... దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి, ఆకులతో కప్పి మరీ దాచిపెడతాయి. ఆ తర్వాత మళ్లీ ఆకలేసినప్పుడు వెళ్లి తింటాయి! ►పులి పిల్లలు రెండేళ్ల వరకూ తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే అవి పద్దెనిమిది నెలల వరకూ వేటాడలేవు. అందుకే వేటలో నైపుణ్యం సంపాదించాక గానీ తల్లిని వదిలి వెళ్లవు! ►ఇవి ఒంటరిగా వేటాడటానికి ఇష్టపడతాయి. పైగా రాత్రిపూటే వేటాడతాయి! ►ఎంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడినా, సాటి పులి విషయంలో ఇవి చాలా స్నేహంగా మెలగుతాయి. తాను ఆహారాన్ని తింటున్నప్పుడు అక్కడికి మరో పులి వస్తే, దానికి తమ ఆహారాన్ని పంచుతాయివి! ఎందుకంటే, పులి ఆహారం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం తప్ప ఏ ప్రాణినీ చంపదు. పరిశీలిస్తుందంతే. అందుకే ఎప్పుడైనా పులి ఎదురుపడితే కంగారుపడి దాన్ని రెచ్చగొట్టకుండా... దాని కళ్లలోకే చూస్తూ, మెల్లగా వెనక్కి నడుస్తూ పోవాలని జీవ శాస్త్రవేత్తలు చెబుతుంటారు! ►పులులకు మిమిక్రీ చేయడం తెలుసు. ఒక్కోసారి వేటాడబోయే జంతువుని మోసగించడానికి, ఆ జంతువులాగే శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తాయి! పులుల జ్ఞాపకశక్తి మనుషుల కంటే ముప్ఫైరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అవి దేనినైనా గుర్తు పెట్టుకున్నాయంటే... చనిపోయేవరకూ మర్చిపోవు. -
ఇక్కడా అంతే!
నగరంలోని జూలోనూ భద్రత అంతంతే తక్కువ ఎత్తులోనే పులుల ఎన్క్లోజర్లు పైకి ఎక్కుతున్న సందర్శకులు పట్టించుకోని జూ సిబ్బంది ఢిల్లీ సంఘటనతోనైనా మేలుకోని వైనం బహదూర్‌పురా: సందర్శకులు చేష్టలుడిగి చూస్తుండగా... వారి కళ్ల ముందే ఓ వ్యక్తిని పులి పొట్టన పెట్టుకున్న విషాద సంఘటనకు మంగళవారం ఢిల్లీలోని జూ వేదికైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో జంతు ప్రదర్శన శాలల్లో భద్రతపై సందేహాలు ముసురుకుంటున్నాయి. నిత్యం వందలాది మంది సందర్శకులు వచ్చే నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులోని పులులు, సింహాల ఎన్క్లోజర్ల దగ్గర పరిస్థితి ఢిల్లీకి భిన్నంగా ఏమీ లేదు. వీటి చుట్టూ ప్రస్తుతం ఉన్న ఇనుప కంచెల ఎత్తు తక్కువగా ఉండటంతో సందర్శకులు అప్పుడప్పుడు వాటిపైకి ఎక్కి కౄరమృగాలను తిలకిస్తున్నారు. ఇది ప్రమాదమని తెలిసినప్పటికీ... జంతువులను దగ్గరగా చూడాలనే ఆతృతతో జాగ్రత్తలను పాటించడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో గతంలో ఓ సందర్శకుడు పులి ఎన్‌క్లోజర్ జాలీ నుంచి ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించగా... అతని చేతిని అది పూర్తిగా కోరికేసింది.ఇలాంటి సంఘటనల గురించి తెలిసినప్పటికీ... సందర్శకులు మేలుకోవడం లేదు. ఎన్క్లోజర్ల వద్ద వన్యప్రాణులకు బయటి ఆహారాన్ని అందించటం...రాళ్లు విసరటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాలు, పులుల ఎన్క్లోజర్ల పరిస్థితిని బుధవారం ‘సాక్షి’ పరిశీలించగా... అదే తరహా దృశ్యాలు కనిపించాయి. తెల్ల పులుల ఎన్‌క్లోజర్ వద్ద ఇనుప తీగెలతో చేసిన కంచె సగం వరకే ఉంది. కొందరు సందర్శకులు ఈ కంచె పైకి ఎక్కుతూ... పులులను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. ఢిల్లీలోని సంఘటన ఇక్కడి జూ అధికారులను కదిలించినట్టు లేదు. ఇనుప కంచెల పైకి ఎవరూ ఎక్కకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు. చిన్నారులు ఇనుప కంచెల మీదకు వెళుతున్నా... జూ యానిమల్ కీపర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాయల్ బెంగాల్ ఎల్లో టైగర్ ఎన్‌క్లోజర్ వద్ద మోకాళ్ల ఎత్తు వరకే ఇనుప కంచె ఉంది. అక్కడ చిన్నారులను తల్లిదండ్రులు ఇనుప కంచెపై నిలబెట్టి పులులను చూపిస్తున్నారు. సింహాల ఎన్‌క్లోజర్ వద్ద తక్కువ ఎత్తున్న ఇనుప రాడ్లపైకి చిన్నారులతో పాటు పెద్దలు ఎక్కుతూ మృగరాజులను తిలకిస్తూ కనిపించారు. అలా ఎక్కకూడదంటూ యానిమల్ కీపర్లు, సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించారు. పులులు, సింహాల ఎన్క్లోజర్ల వద్ద కంచె ఎత్తును పెంచితేనే ఢిల్లీలాంటి సంఘటనలను నివారించవచ్చు. పులులు, సింహాలకు బయటి ఆహారాన్ని తినిపించేందుకు చేతులను ఎన్‌క్లోజర్‌కు చాపుతూ ఆహారాన్ని విసరడం వంటివి సందర్శకులు చేస్తున్నారు. దీన్ని కూడా నిరోధించాల్సిన అవసరాన్ని జూ అధికారులు, సిబ్బంది గుర్తించాలి. -
పులుల సంరక్షణకు చర్యలు
కాగజ్‌నగర్ రూరల్(సిర్పూర్(టి)) : కాగజ్‌నగర్ అటవీ శాఖ డివిజన్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్‌వో శివప్రసాద్ తెలిపారు. సోమవారం కాగజ్‌నగర్‌లోని డీఎఫ్‌వో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగజ్‌నగర్ అటవీ శాఖ డివిజన్ పరిధిలో పులుల సంరక్షణకు 40 సీసీ కెమరా లు అమర్చడంతో పాటు 30 మంది బేస్‌క్యాంప్ వాచ ర్లు, పది మంది స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పులుల సంరక్షణకు కృషి చేస్తారని వివరించారు. ముఖ్యంగ పోడు వ్యవసాయం కారణంగా వణ్యప్రాణులు, మృగాలు అంతరించిపోతున్నాయని, పోడు వ్యవసాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దినోత్సవం అలా మొదలైంది 2010లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో జులై 28వ తేదిని అంతర్జాతీయ పులుల దినోత్సవంగ పరిగణించాలని నిర్ణయించారని డీఎఫ్‌వో తెలిపారు. 1913లో ప్రపంచవ్యాప్తంగా లక్ష పులులు ఉన్నట్లు నిర్ధారించగా ఈ వందేళ్ల కాలంలో మూడు వేలకు తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు వేల పులులు ఉండ గా భారతదేశంలోనే 1700 పులులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాల్లో పులుల సంరక్షణపై గ్రామీణులకు అవగాహ కల్పిస్తామని చెప్పారు. -
జూ జీన్స్..
పులులు.. ఎలుగుబంట్లు.. జీన్స్ ప్యాంట్లను చింపేస్తున్నాయేంటి అనుకుంటున్నారా.. అది చింపటం కాదు.. జీన్స్‌ను డిజైన్ చేయడం. దీని పేరే ‘జూ జీన్స్’. అర్థం కాలేదా.. అయితే మనం జపాన్‌లోని హిటాచీ నగరంలోని కమినే జూకు వెళ్లాల్సిందే. ఇక్కడే ఈ జూ జీన్స్‌ను జంతువులు డిజైన్ చేస్తాయి. ఇప్పుడు జపాన్‌లో జూ జీన్స్ ఓ కొత్త ట్రెండ్. ఇంతకీ జూ జీన్స్ అంటే ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా.. సాధారణంగా జీన్స్ అంటే డిజైనర్ల సృష్టి. కానీ ఈ జూ జిన్స్కు జంతువులే డిజైనర్లు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు.. ఈ జీన్స్‌ను డిజైన్ చేస్తాయి. అదెలా అనుకుంటున్నారా సింపుల్.. కొంత డెనీమ్ క్లాత్‌ను తీసుకుని వాటిని జూలో జంతువుల మందు పడేస్తారు. అవి వాటిని తమ పళ్లు, గోర్లతో ఇష్టానుసారం చింపేస్తాయి. అలా చింపిన క్లాత్‌ను తీసుకుని జీన్స్ ఫ్యాంట్లను డిజైన్ చేస్తారన్నమాట. ఇంతకీ ఈ జీన్స్ ఖరీదు ఎంతనుకుంటున్నారు జస్ట్ 1,200 డాలర్లే. అంటే మన కరెన్సీలో రూ.72 వేలు. -
సీమాంధ్రకు 40, తెలంగాణకు 32 పులులు
నల్లమల విభజన నూతన జోన్ ఏర్పాటు మార్కాపురం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతాన్ని కూడా అధికారులు విభజిం చారు. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. నల్లమలలో మొత్తం 72పులులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 30నుంచి 32 వరకు తెలంగాణలో, 40 వరకు సీమాంధ్రలో ఉండవచ్చుంటున్నారు. టైగర్ ప్రాజెక్టు జోన్‌గా ఈ ప్రాంతాన్ని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇందులో భాగంగా మార్కాపురం, ఆత్మకూరు, నాగార్జునసాగర్, అచ్చంపేట డివిజన్లను ఏర్పాటు చేసింది. కాగా, విభజన నేపథ్యంలో అచ్చంపేట, నాగార్జునసాగర్ డివిజన్లను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కాగా, మార్కాపురం, ఆత్మకూరు డివిజన్లతో పాటు నూతనంగా విజయపురిసౌత్ డివిజన్‌ను సీమాంధ్రకు కేటాయిం చారు. ప్రస్తుతం సీమాంధ్రకు 5,568 చ.కి.మీ రిజర్వు ఫారెస్ట్ ను కేటాయించారు. ఇందులో 3,568 చ.కి.మీ.(కోర్ ఏరియా) పులులు, ఎలుగుబంట్లు సంచరించే ప్రాంతంగా గుర్తించారు. 2 వేల చ.కి.మీ.(బఫర్ ఏరియా) గ్రామాలకు, అటవీ ప్రాంతానికి మధ్య ఉన్న ప్రాంతంగా గుర్తించారు. మార్కాపురం డివిజన్ 2,280 చ.కి.మీ పరిధిలో ఉండగా, ఆత్మకూరు డివిజన్ 1500 చ.కి.మీ పరిధిలో, విజయపురిసౌత్ డివిజన్ దాదాపు 300 చ.కి.మీ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. గతంలో 70 కి.మీ ఉన్న బీట్ ప్రాంతాన్ని 20 నుంచి 25 కి.మీలకు తగ్గించి అదనపు బీట్లను ఏర్పాటు చేస్తున్నారు. -
పులులెన్నున్నాయ్...!
నల్లమల అభయారణ్యంలో పులుల లెక్కింపు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగుతున్నాయి. నాలుగేళ్లకోమారు సాగే ఈ గణనను 2006 లో చేపట్టినప్పుడు మొత్తం 39 ఉన్నట్లు లెక్కతేలింది. ఆ తర్వాత 2010లో చేపట్టిన లెక్కల ప్రకారం వీటి సంఖ్య 53 నుంచి 67కు చేరుకున్నాయని అధికారులు గుర్తించారు. తాజాగా ఈ నెల 18నుంచి ప్రారంభమైన ఈ గణన 25వ తేదీ వరకు సాగనుంది. ఈ మారు వీటి సంఖ్య ఎంతకు పెరుగుతుందో చూడాలి. అచ్చంపేట, న్యూస్‌లైన్: ప్రతి నాలుగేళ్లకొకసారి జరిగే పులుల లెక్కింపు ప్రక్రియ నల్లమల అభయారణ్య ప్రాంతంలో ప్రారంభమైంది. పులులు, చిరుతలు, ఇతర జంతువులతో పాటు పక్షుల లెక్కలు కూడా ఇందులో తేలనున్నాయి. ఈ ప్రక్రియ ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరుగుతుంది. అటవీశాఖ కూడికలు, తీసివేతల ప్రకారం పులులు, చిరుతల లెక్కలు చెబుతున్నారే తప్ప వాస్తవంగా ఎన్ని ఉన్నాయనే విషయం ఎవరికీ తెలియదు. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం(ఎన్టీసీఏ)పరిధిలో ఉన్న 44 టైగర్ ప్రాజెక్టుల పరిధిలో 2010లో పులుల గణ న జరిగింది. పులులు సంచరించిన ప్రాం తాల నుంచి పాదముద్రల(ప్లగ్ మార్కుల)ను సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషించిన తరువాత పులుల సంఖ్యలో ఓ అంచనాకు వస్తారు. శ్రీశైలం- నాగార్జునసాగర్ ఆభయారణ్యంలో 53 నుంచి 67 పులులు ఉన్నట్లు గతంలో జరిగిన గణనలో తేల్చారు. అయితే ఈలెక్కలపై కేంద్ర ప్రభుత్వం విశ్వసించడం లేదని ఇక నుంచి కెమెరా ట్రాప్ మానిటరింగ్ టెక్నాలజీ ద్వారానే గణన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అటవీశాఖ ఇందుకు అవసరమైన లైనింగ్ ఏర్పాటు చేసింది. పులుల గణన పాదముద్రల ద్వా రా జరుగుతోంది. ఇవీ అత్యధింగా నీటి వనరులు ఉన్నా ప్రాంతంలో కనిపిస్తాయి. కాగా, లోతట్టు అటవీప్రాంతంలో పులుల గణన జరగడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. నాగార్జునసాగర్ - శ్రీశైలం రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నల్గొండ జిల్లాల పరిధిలో 5928 చ.కి మేర విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో 2006 లెక్కింపు ప్రకారం 39 పులులు ఉన్నాయి. లెక్కించడం ఇలా.. నల్లమల అటవీప్రాంతం విస్తరించి ఉన్న అచ్చంపేట, ఆత్మకూర్, మార్కాపూర్, నాగార్జునసాగర్ పరిధిలో 149 బీట్లలో వెయ్యిమంది అటవీశాఖ అధికారులు, సిబ్బంది పులుల గణనలో పనిచేస్తున్నారు. అచ్చంపేట, అమ్రాబాద్, మన్ననూర్, లింగాల అటవీశాఖ రెంజ్‌ల పరిధిలో 70 బీట్లలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతిబీట్లో ఇద్దరు చొప్పున పనిచేస్తున్నారు. పులుల లెక్కింపు, పరి శీలనలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. వారంరోజుల పాటు జరిగే పులుల గణనలో సెక్షన్ అధికారు లు, బీట్ అధికారులు, టైగర్ ట్రాకర్స్ పాల్గొంటా రు. వీరు బృందాలుగా విడిపోయి గణన చేస్తారు. పులులు, చిరుత పులులు ప్లగ్ మార్కులు(గుర్తు)ను సేకరించి కం ప్యూటర్‌లో నమోదుచేసిన అనంతరం వాటి వివరాలను వెల్లడిస్తారు. పుల్లాయిపల్లి, దేవునిసరిగడ్డ, ఫర్హాబాద్, బాణాల, బిల్లకల్లు, చౌటపల్లి బీట్లతో పాటు ఇతర ప్రాం తాల్లో ప్రస్తుతం గణన జరుగుతోంది. ఇక ఇప్పుడైనా స్పష్టమైన లెక్క తేలుస్తారో లేదో వేచిచూడాలి. -
మృగరాజు.. నవాబ్ షఫత్ అలీఖాన్
హైదరాబాద్: ఈ మృగరాజు పేరు నవాబ్ షఫత్ అలీఖాన్. మన హైదరాబాదీయే. దేశంలోనే పేరెన్నికగన్న లెసైన్డ్స్ వేటగాడు. జనావాసాల్లోకి చొరబడి మనుషుల్ని చంపే పెద్దపులులను మట్టుబెట్టడం ఈయన ప్రత్యేకత. ఇలా దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇప్పటిదాకా తొమ్మిది పులులను హతమార్చాడు. ప్రస్తుతం ఊటీలో ఓ పులి పని పట్టేందుకు వెళ్లాడు. ఇంతలోనే ఉత్తరప్రదేశ్ నుంచి పిలుపు వచ్చింది. మురాదాబాద్, సంభాల్ జిల్లాల్లో సంచరిస్తున్న ఓ పులి నెలరోజుల్లోనే ఆరుగురిని దారుణంగా చంపింది. దీంతో యూపీ సర్కారు ఈయనను సంప్రదించింది. ఊటీ పులి సంగతి చూసి ఉత్తరప్రదేశ్ వెళ్తానని చెబుతున్నాడు అలీఖాన్! -
కర్ణాటక అడవుల్లో ముగ్గురిని చంపేసిన పులులు
దక్షిణ కర్ణాటకలోని బండిపూర్ అడవుల్లో రెండు పులులు ముగ్గురు వ్యక్తులను చంపేశాయి. టి.సురేష్ (27) అనే ఫారెస్ట్ వాచర్ మెడ మీద పంజా గుర్తులతో చనిపోయి కనిపించాడని ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ లోకేష్ మూర్తి తెలిపారు. ఓ గ్రామస్థుడు, మరో గిరిజనుడు కూడా మరో పులి చేతిలో బండిపూర్ రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో మరణించారు. వాళ్లు పెంచుకుంటున్న పశువులను తినేందుకు ఆ పులి శుక్రవారం నాడు వాళ్ల ప్రాంతంలోకి వెళ్లిందని, అప్పుడే చెలువ (40) అనే గ్రామస్థుడు, బస్వరాజు (45) అనే గిరిజనుడు వాటి చేతిలో మరణించారని, వాళ్ల తలల మీద, శరీరాల మీద తీవ్రంగా గాయపడిన గుర్తులున్నాయని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ బెల్లియప్ప చెప్పారు. వాస్తవానికి రెండు అడవుల మధ్య 120 కిలోమీటర్ల మేర ఫారెస్టు గార్డులు ఉచ్చులు ఏర్పాటుచేశారు. అయితే ఇంతవరకు మనుషులను చంపుతున్న పులలు ఏవన్న విషయం మాత్రం తెలియరాలేదు. సురేష్‌ను చంపిన తర్వాత అతడి మృతదేహాన్ని పులి కొద్దిదూరం లాక్కెళ్లి అక్కడ వదిలేసింది. క్యాంపులో అతడు కనిపించకపోయేసరికి ఇతర గార్డులు వెతకగా, మృతదేహం దొరికింది. అడవిలో కట్టెలు తెచ్చుకోడానికి అతడు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. పులుల జనాభా పెరిగినప్పుడు ఏ ప్రాంతంలో ఏవి వేటాడాలన్న విషయమై వాటిమధ్య పోరాటం జరుగుతుందని, సగటున 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 12 పులులు మాత్రమే సంచరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.