
సీసీటీవీ ఫుటేజీలో చిరుత
మొన్న మహారాష్ట్రలో అవని.. నిన్న ఉత్తరప్రదేశ్‌లో ఆడ పులి జనాలను ..
అహ్మద్‌బాద్ : మొన్న మహారాష్ట్రలో అవని.. నిన్న ఉత్తరప్రదేశ్‌లో ఆడ పులి జనాలను పొట్టన బెట్టుకున్నాయని ప్రాణాలు కోల్పోగా.. నేడు ఓ చిరుత ఏకంగా గుజరాత్ సచివాలయంలోకి వచ్చి ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. అర్థ రాత్రి 1.30కు గాంధీనగర్‌లోని సచివాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఈ చిరుతను బంధించేందుకు అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. సచివాలయ గేట్లన్ని మూసివేసి.. ఎవరినీ అనుమతివ్వడం లేదు. ఇప్పటికే అవని మృతి, ఉత్తరప్రదేశ్ ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పులుల సంరక్షణ తీవ్ర చర్చనీయాంశమైంది. (చదవండి: పులిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు)
పులులను హతమార్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ అటవీ అధికారులకు సచివాలయంలోకి ప్రవేశించిన చిరుతను సజీవంగా పట్టుకోవడం ఓ సవాల్‌గా మారింది. సచివాలయంలో తిరుగుతున్న పులి సీసీ ఫుటేజీ వీడియో.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే సచివాలయంలోకి ఆకస్మాత్తుగా చిరుత ప్రవేశించడంతో ఉద్యోగులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. (చదవండి:‘అవని’ని కాల్చి చంపేశారు)
WATCH: Leopard entered Secretariat premises in Gujarat's Gandhinagar, early morning today. Forest department officials are currently conducting a search operation to locate the feline (Source: CCTV footage) pic.twitter.com/eQYwATbk2b
— ANI (@ANI) 5 November 2018