నాగ్‌పూర్ రెస్కూ సెంటర్‌లో ఘటన
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని గోరేవాడ రెస్క్యూ సెంటర్‌లో మరణించిన మూడు పులులు, ఒక చిరుత మృతికి బర్డ్‌ఫ్లూ కారణమని తేలింది. డిసెంబర్ చివరణ మృతి చెందిన వన్య మృగాలు ఏవియన్ ఫ్లూ హెచ్5ఎన్1 బారిన పడ్డాయని అధికారులు ధ్రువీకరించారు. దీంతో మహారాష్ట్ర అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనుషుల మీద దాడి నేపథ్యంలో డిసెంబర్‌లో వీటిని చంద్రాపూర్ నుంచి గొరేవాడకు తరలించారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న ఒక పులి, 23న రెండు పులులు మృతి చెందాయి. నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్)కు పంపించారు. ల్యాబ్ ఫలితాల్లో బర్డ్‌ఫ్లూతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెచ్5ఎన్1 వైరస్ మూలాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులను వేటాడటం లేదా ముడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మృతుల నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 25 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment