Bird Flu
-
Bird Flu Effect: తగ్గిన చికెన్ బిర్యానీ సేల్స్
సాక్షి, హైదరాబాద్ : బిర్యానీ.. ఈ పేరు వినగానే మాంసాహార ప్రియులకు పండగే. లొట్టలు వేసుకుంటూ లాగించాల్సిందే. చికెన్ బిర్యానీ అంటే మరింత మక్కువ. కానీ.. ప్రస్తుతం నగరంలో చికెన్ బిర్యానీల విక్రయాలు తగ్గిపోయాయి. ఫిష్, మటన్ బిర్యానీల వైపు మొగ్గు కనిపిస్తోంది. చికెన్ బిర్యానీ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీని అంతటికీ కారణం బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్. ఈ వైరస్ కారణంగా కోళ్లు చనిపోతుండటంతో చికెన్ బిర్యానీల విక్రయాలు ఒక్కసారిగా పడిపోయాయి. చికెన్‌తో చేసే వంటకాలకూ డిమాండ్ తగ్గిపోవడంతో హోటళ్ల పరిశ్రమ లబోదిబోమంటోంది. ఈ పరిణామాలు చివరికి గిగ్‌వర్కర్లపైనా పడింది. టేక్ అవే.. ఇతర ఆన్లైన్ ఆర్డర్లు కూడా తగ్గిపోవడంతో స్విగ్గీ, జొమాటో తదితర ఆహార పదార్థాల సరఫరాల రంగంపైనా ప్రభావం చూపుతోంది. ఐకానిక్ చికెన్ బిర్యానీ పరిస్థితి ఇలావుంటే.. కోడిగుడ్ల అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి. బర్డ్‌ఫ్లూ ప్రభావం మన రాష్ట్రంలో లేదని పౌల్ట్రీరంగం, ప్రభుత్వం నిత్యం చెబుతున్నా.. పక్క రాష్ట్రంలో దీని ఆనవాళ్లు భారీగా ఉండడంతో చికెన్, గుడ్డు తినే అంశంపై జనాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మాంసం, సీ ఫుడ్స్‌కే ప్రాధాన్యం.. గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు 15 నుంచి 20 లక్షల చికెన్ బిర్యానీలు అమ్ముడవుతుండగా.. తాజాగా ఇవి సగానికి తగ్గిపోయినట్లు ప్రముఖ హోటల్ షాదాబ్ యజమాని స్పష్టం చేశారు. దీని స్థానంలో శాకాహార వంటకాలు లేదా మాంసం, సీ ఫుడ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బర్డ్‌ఫ్లూ మూలంగా చికెన్ బిర్యానీ ఆర్డర్లు భారీగా తగ్గాయని షాదాబ్ హోటల్ యజమాని ఆదిల్ సోహెల్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో చికె¯Œ ఆర్డర్‌ను కూడా తగ్గించినట్లు ఆయన చెప్పారు. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫిష్, మటన్‌ను ఎక్కువ వండి వడ్డిస్తున్నట్లు తెలిపారు. వీటికి డిమాండ్ పెరగడంతో వీటి సరఫరాదారులు ధరలు కూడా పెంచినట్లు ఆయన వివరించారు. ‘ఇంతకు ముందు మేం రోజుకు 70– 80 హండీల బిర్యానీ సిద్ధం చేసేవాళ్లం. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ బిర్యానీ విక్రయాలు తగ్గాయి. 30 హండీలు కూడా సేల్ కావటం లేదు. గతంలో మేం 15 హండీల మటన్ మాత్రమే విక్రయించేవాళ్లం. ప్రస్తుతం మటన్ బిర్యానీకి గిరాకీ పెరిగింది. గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువగా దాదాపు 45 హండీల మటన్ బిర్యానీ విక్రయిస్తున్నాం’ అని అఫ్జల్‌గంజ్‌లోని న్యూ గ్రాండ్ çహోటల్ యజమాని మహ్మద్ హుస్సేన్ యావరీ తెలిపారు. కాగా.. సాధారణ రోజుల్లోనే గ్రేటర్ పరిధిలో 3 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు ఉండగా.. ఆదివారం 10– 12 లక్షల కిలోలు అమ్మేవారు. ప్రస్తుతం లక్ష కిలోల చికెన్ విక్రయాలు కూడా జరగడం లేదు. తగ్గిన ఆన్లైన్ ఆర్డర్లు.. స్విగ్గీ ఆర్డర్లలో 90 శాతం చికెన్ బిర్యానీ ఉంటుంది. నాలుగు రోజులుగా స్విగ్గీ, జొమాటో నుంచి చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసే వారి సంఖ్య 70 శాతం మేరకు పడిపోయినట్లు సమాచారం. -
బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులోనే ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదరనాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిన తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, కృష్ణాజిల్లా బాదంపూడి, కర్నూలు జిల్లా ఎన్.ఆర్.పేట, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నామని, ఫలితంగా ఇతర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఈ వ్యాధి నిర్ధారణ కాలేదన్నారు. ఆ ఐదు ప్రాంతాల్లో మినహా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కోళ్లు, గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. -
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. అమెరికాలో కొండెక్కిన కోడిగుడ్డు
వాషింగ్టన్:బర్డ్‌ఫ్లూ ఇక్కడే కాదు అగ్రదేశం అమెరికానూ భయపెడుతోంది. ఒకవైపు బర్డ్‌ఫ్లూ వల్ల మన దేశంలో చికెన్,గుడ్లు తినాలంటే భయపడుతుండడంతో చికెన్,గుడ్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. అమెరికాలో బర్డ్‌ఫ్లూ దెబ్బకు కోడిగుడ్ల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. అమెరికాలో గుడ్లను ప్రోటీన్లు అందించే ఆహారంగా భావిస్తారు. దీంతో అక్కడ గుడ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది.ఇదే సమయంలో బర్డ్‌ఫ్లూ కారణంగా గుడ్లు పెట్టే కోళ్లు చనిపోతుండడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంతో గుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఎఫెక్ట్ గుడ్ల ధరలపై పడింది. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డజను గుడ్ల ధర ఏకంగా పది డాలర్లు(రూ.867)కు చేరిందంటే పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు.గత ఏడాది జనవరి నుంచి అమెరికాలో గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.అప్పటి నుంచి ఇప్పటివరకు డజను గుడ్ల ధర ఏకంగా 65 శాతం పెరిగింది. గుడ్ల ఉత్పత్తి పడిపోవడంతో కొన్ని సూపర్ మార్కెట్లలో కస్టమర్లకు అమ్మే గుడ్లపై పరిమితులు విధించారు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా లేదా బర్డ్‌ఫ్లూ కోళ్లలో శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని వ్యాప్తి నివారించడానికి లక్షల్లో కోళ్లను అధికారులు చంపుతున్నారు. బర్డ్‌ఫ్లూ ప్రభావం ఫామ్‌లలో పెరిగే కోళ్ల మీద కంటే దేశీయంగా పెరిగే నాటుకోళ్లపై అధికంగా ఉంటుందని తేలింది. -
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ సేల్స్ ఢమాల్
జగిత్యాల: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చికెన్ అమ్మకాలు భారీగా తగ్గాయి. చికెన్ సెంటర్లు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తోందని, చికెన్ తినొద్దని ఇటీవల ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు, కొన్ని జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో ఉమ్మడి జిల్లాలో భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కువగా ఉడికించిన చికెన్ తింటే వైరస్ ఉండదని అధికారులు చెబుతున్నా వైరస్ వ్యాపిస్తోందని సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ కావడంతో ప్రజలెవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు చికెన్ అమ్మకాలు పడిపోయినా రేటు మాత్రం తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రతి చికెన్ సెంటర్లో సగానికిపై విక్రయాలు తగ్గిపోయాయి.అసలే పెళ్లిళ్ల సీజన్ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం మంచి రోజులు కావడంతో రెండునెలలపాటు శుభకార్యాలు అధికంగా ఉన్నాయి. శుభకార్యాల్లో చికెన్ తప్పనిసరి. ఈ క్రమంలో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో వివాహాల్లో చికెన్ వడ్డించాలా..? వద్ద సంశయంలో ప్రజలు ఉన్నారు. చాలా మంది చికెన్ తినాలంటే జంకుతుండటంతో మటన్, ఫిష్, ఎగ్స్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. చికెన్‌కు కొంత తక్కువ ధర ఉండటంతో చాలామంది దీనివైపే దృష్టి సారిస్తుంటారు. ప్రభుత్వ హాస్టళ్లు, వైద్య కళాశాల హాస్టళ్లలో చికెన్ నిలిపివేస్తున్నారు. మటన్, చేపలకు రేటు ఎక్కువగా ఉండటంతో అది కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది.తగ్గని రేటుచికెన్ విక్రయాలు పడిపోయినా ధరలు మాత్రం తగ్గడం లేదు. చికెన్ రేటు కిలోకు రూ.200 కిలో పలుకుతోంది. మరికొందరు కిలోకు రూ.180 నుంచి రూ.160వరకు విక్రయిస్తున్నారు. మరిన్ని రోజులు బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండటంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ కాకుండా గుడ్ల విక్రయాలు కూడా సగానికి పడిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడ బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్దక శాఖ అధికారులు పేర్కొంటున్నా ప్రజల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు పశువైద్యాధికారులు పౌల్ట్రీలపై దృష్టి పెట్టామని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. కానీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు పోవడం లేదు. దుకాణాల అద్దె, వర్కర్స్కు జీతాలు, విద్యుత్ బిల్స్, కోళ్ల క్రయవిక్రయాల్లో పెట్టిన పెట్టుబడి రాక ఇబ్బందులకు గురవుతున్నారు. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీల వద్ద కోళ్లను కొనుగోలు చేయకుండా ఉన్న కోళ్లను విక్రయించేలా చికెన్ సెంటర్ల నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కంపెనీల వద్ద నుంచి కోళ్లను కొనుగోలు చేసినా సేల్స్ లేకపోవడంతో అధిక నష్టం వచ్చే అవకాశం ఉండటంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు భయాందోళన చెందుతున్నారు. -
ఉదయం 11కే మటన్ మాయం!
సాక్షి, హైదరాబాద్: ఆదివారం ఉదయం... 11.30 గంటల సమయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన అరవింద్ మటన్ తీసుకురావడం కోసం బయల్దేరాడు.. తాను రెగ్యులర్‌గా వెళ్లే షాపు దగ్గరికి వెళ్లే సరికి మూసేసి ఉంది. దగ్గర్లోని మరో దుకాణానికి వెళితే బారెడంత క్యూ కనిపించింది. లేటవుతుందేమోనని మరో చోటికి వెళ్తే... మటన్ అయిపోయిందని చెప్పారు.దీనితో వెనక్కి వచ్చి క్యూలో నిలబడి అయినా తీసుకెళదామనుకుంటే... తన వంతు కూడా రాకముందే మటన్ అయిపోయిందంటూ దుకాణం కట్టేయడం మొదలుపెట్టారు.. అరవింద్ ఒక్కడికే కాదు, ఉప్పల్ ఒక్క ప్రాంతంలోనే కాదు.. ఆదివారం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది. చెంగిచర్ల, జియాగూడ వంటి మటన్ మండీల్లోనూ మధ్యాహా్ననికే స్టాక్ ఖాళీ అయిపోయింది. మరోవైపు బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్‌లతో కోళ్లు మృతిచెందుతున్నాయన్న వార్తలతో చికెన్ దుకాణాలు వెలవెలబోయాయి. ధర విపరీతంగా పెరిగినా.. ఇటీవలి కాలంలో మటన్ ధరలు కిలో రూ.800 నుంచి రూ.900 వరకు చేరాయి. అలాంటిది డిమాండ్ పెరిగిపోవడంతో.. ఆదివారం చాలా చోట్ల కిలో రూ.1,000 నుంచి రూ.1,100 వరకు ధరతో విక్రయించారు. అయినా సరే మటన్ షాపుల వద్ద జనం కిటకిటలాడారు. కిలో తీసుకునే చోట అరకిలో, అరకిలో తీసుకునే చోట పావుకిలోనో, 400 గ్రాములో కొనుక్కుని వెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో.. సాధారణంగా మహారాష్ట్ర, రాజస్తాన్‌తోపాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు మేకలు, గొర్రెలు దిగుమతి అవుతాయి. అయితే బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్ల ప్రభావం నేపథ్యంలో ఈ దిగుమతులు తగ్గిపోయాయి. వైరస్లు ఇతర ప్రాంతాలకు విస్తరించవద్దన్న ఉద్దేశంతో మేకలు, గొర్రెల రవాణాను నియంత్రిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి అరకొరగా గొర్రెలు, మేకలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో.. ధరలు పెరిగాయని మీరాలం మండిలోని మక్బూల్, జియాగూడ మండిలో మేకల వ్యాపారి రమేశ్ తెలిపారు.చికెన్‌కు తగ్గిన డిమాండ్బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్‌లతో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయన్న వార్తలతో చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. సాధారణంగా ప్రతి ఆదివారం కిటకిటలాడే చికెన్ సెంటర్లు... ఈ ఆదివారం వెలవెలబోయాయి. వైరస్ భయం కారణంగా ఎందుకైనా మంచిదంటూ.. చికెన్‌కు బదులు మటన్ తీసుకెళ్తున్నామని వినియోగదారులు చెబుతున్నారు. నిజానికి చికెన్‌ను 70 నుంచి 100 డిగ్రీల ఉష్ణో గ్రత వద్ద బాగా ఉడికించి తింటే ఎటువంటి హానీ ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
చికెన్‌ను వదిలేసి మటన్ వైపు జనం మొగ్గు
సాక్షి, అమరావతి: సహజంగా ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు అందుబాటు ధరలో ఉండే చికెన్ (Chicken) కోసం షాపుల ముందు క్యూ కడతారు. కాస్త ఆలస్యమైనా వేచి చూస్తుంటారు. కానీ ఈ ఆదివారం ‘ముక్క’ లెక్క మారింది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వదిలేసిన జనం మటన్ (Mutton), చేపల వైపు మొగ్గు చూపారు. దుకాణాల ఎదుట పెద్ద ఎత్తున బారులు తీరారు. రాత్రి అవుతున్నా అదే కోలాహలం నెలకొంది. ఇదే అదనుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు. కొద్ది వారాలుగా బర్డ్‌ఫ్లూ (Bird Flu) విస్తరిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కూటమి సర్కారు.. మటన్, చేపల ధరల నియంత్రణను సైతం గాలికి వదిలేసింది. రెడ్జోన్లుగా ప్రకటించడంతో..కోళ్లకు సోకిన బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రభావం మాంసం విక్రయాలపై భారీగా పడింది. తూర్పు, పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనూ బర్డ్ ఫ్లూ బయటపడటంతో అక్కడ కోళ్లను, కోడి గుడ్లను తినవద్దని హెచ్చరించిన అధికారులు ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చికెన్ అంటేనే ఉలిక్కి పడుతున్నారు. దీంతో 15 రోజుల క్రితం రూ.220 పలికిన కిలో చికెన్ రూ.180కి పడిపోయింది. ఆదివారం కిలో చికెన్ రూ.150 నుంచి రూ.100కి అమ్మినా కొనేవారు కరువయ్యారు.ప్రత్యామ్నాయంగా మటన్, చేపల కోసం మాంసం ప్రియులు ఎగబడుతున్నారు. మటన్, చేపల విక్రయాలు రెట్టింపు అయ్యాయి. ఆదివారం తెల్లవారగానే మాంసం ప్రియులు చేపలు, మటన్ మార్కెట్లకు పరుగులు దీశారు. అప్పటికే అక్కడ రద్దీగా ఉండటాన్ని చూసి ఉసూరుమన్నారు. మాంసం అమ్మకాలు ఉదయమే ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈ ఆదివారం రాత్రి 9 గంటలైనా పొట్టేళ్లను కోశామని వ్యాపారులు ‘సాక్షి’కి వెల్లడించారు. కోళ్ల విక్రయాలు మాత్రం భారీగా పడిపోయాయి. ఇష్టానుసారం ధరలు..కోళ్లను తినకూడదనే హెచ్చరికలతో చేపలు, మటన్ ధరలు అమాంతం ఎగబాకాయి. సాధారణంగా కిలో మటన్ రూ.800 – రూ.900 వరకు ఉండగా డిమాండ్ కారణంగా రూ.1,000 నుంచి రూ.1,100 వరకు పెరిగింది. కొందరు వ్యాపారులు మాత్రం రెట్టింపు అమ్మకాలు జరుగుతుండటంతో కేజీ మటన్ రూ.900కి ఇస్తున్నారు. కిలో చేపలు రాగండి రకం రూ.160 నుంచి రూ.180కి పెరిగాయి. బొచ్చెలు రూ.180 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. కొరమీను కేజీ రూ.650 నుంచి రూ.1,000 వరకూ పలుకుతోంది. రొయ్యలు, పీతలకు సైతం డిమాండ్ ఏర్పడింది. రొయ్యలు కిలో రూ.500 నుంచి రూ.700 వరకూ, పీతలు కేజీ రూ.400 నుంచి రూ.600 వరకూ విక్రయిస్తున్నారు. రకాన్ని బట్టి ధరల్లో తేడాలుంటాయి. అనకాపల్లిలో కేజీ మటన్ సాధారణంగా రూ.800–900 ఉండగా ఈ ఆదివారం రూ.1,000 వరకు పలికింది. కూరగాయల రేట్లు సైతం..హోటల్‌కి వెళితే చికెన్ బిర్యానీ, చికెన్ స్టార్టర్స్‌ను ఇష్టపడే వారంతా ఇప్పుడు మటన్‌తో పాటు చేపలు, పీతలు, రొయ్యల వంటకాలను అడుగుతున్నారు. వీధుల్లో బండ్ల మీద చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్స్, కబాబ్స్, ఫ్రైడ్ చికెన్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, షవర్మా లాంటి చికెన్ వంటకాల వ్యాపారాలన్నీ పడిపోయాయి. కర్రీ పాయింట్లు, మెస్‌లలో సైతం చికెన్ వంటకాల విక్రయాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ సంక్షేమ, ప్రైవేటు విద్యాసంస్థల హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లల్లో మెనూలో మార్పులు చేశారు. మాంసం పెట్టాల్సిన రోజు కూడా కాయగూరలతో వండినవే పెడుతున్నారు.దీంతో కూరగాయల ధరలు సైతం పెరుగుతున్నాయి. రెండు వారాలుగా బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతుండటంతో చికెన్‌కు దూరమైన వినియోగదారులు మటన్, చేపల వైపు మొగ్గు చూపుతారని తెలిసినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, ధరలను నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. బర్డ్ ఫ్లూను రాష్ట్రవ్యాప్తం చేసి కళ్లు మూసుకుని కూర్చుందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆదివారం వస్తే కనీసం 60 నుంచి 100 కోళ్ల విక్రయాలు జరిగేవి. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్మలేకపోతున్నాం. దీంతో ఈ వారం అసలు కోళ్లు తేవడమే మానేశాం. అయితే మటన్ బాగా కొంటున్నారు. సాధారణంగా ప్రతి వారం 10 నుంచి 15 పొట్టేళ్ల మాంసాన్ని అమ్మేవాళ్లం. ఇప్పుడు అది రెట్టింపు అయ్యింది. రాత్రి అయినా ఇంకా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. – సురేష్, మాంసం వ్యాపారి, బల్లెంవారి వీధి, విజయవాడచికెన్ తిందామంటే బర్డ్‌ఫ్లూ వచ్చిందని వద్దంటున్నారు. పోనీ చేపలుగానీ మటన్గానీ కొందామంటే వాటి రేట్లు అమాంతం పెంచేశారు. దుకాణాల వద్ద జనం భారీగా ఉంటున్నారు. చాలాసేపు వేచి ఉంటేగానీ మటన్ దొరకలేదు. ఒక్కో దుకాణంలో ఒక్కో విధంగా వసూలు చేస్తున్నారు. – సూర్యారావు, వందడుగుల రోడ్డు, విజయవాడ. -
ఉపాధికి 'బర్డ్ ఫ్లూ' దెబ్బ
-
ఉపాధికి ‘బర్డ్ ఫ్లూ’ దెబ్బ!
సాక్షి, అమరావతి: ‘బర్డ్‌ఫ్లూ’ వ్యాధి పౌల్ట్రీ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోంది. వేలాది కార్మికుల కుటుంబాలు జీవనోపాధిలేక రోడ్డున పడ్డాయి. ఈ వ్యాధి ప్రభావంతో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడడంతో పెద్ద సంఖ్యలో పౌల్ట్రీ ఫారాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఐదు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం.. రాష్ట్రంలో 1,200కు పైగా పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి. ఇందులో వెయ్యికి పైగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనే ఉన్నాయి. వీటిల్లో 5.60 కోట్ల కోళ్లున్నాయి. ప్రతిరోజూ 4.75 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి ఫామ్‌లోనూ 10–25 మంది ఉపాధి పొందుతుంటారు. వీరంతా ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే. వీరు ఫామ్స్ వద్దే ఉంటూ వాటి నిర్వహణను చూసుకుంటుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, ఏలూరు జిల్లా బాదంపూడి, ఎన్జీఆర్ జిల్లా గంపలగూడెంతో పాటు కర్నూలు జిల్లా ఎన్ఆర్ పేటలలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి లక్షలాది కోళ్లు, బాతులు మృత్యువాతపడ్డాయి. ఈ ఐదు గ్రామాల్లోని కోళ్ల ఫారాల పరిధిలో కిలోమీటరు ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా.. 10 కి.మీ. వరకు అలెర్ట్ జోన్‌గా ప్రకటించారు. రెడ్‌జోన్ పరిధిలో సుమారు 30కి పైగా ఫామ్స్ మూసివేసి వాటిలో ఉండే సుమారు ఆరున్నర లక్షలకు పైగా కోళ్లను చంపి పాతిపెట్టేశారు. లక్షల సంఖ్యలో కోడిగుడ్లను కూడా ధ్వంసం చేశారు. పది కిలోమీటర్ల పరిధిలో కూడా పదుల సంఖ్యలో కోళ్ల ఫారాలను మూసివేశారు. అలాగే, సరై్వలెన్స్ జోన్ పెట్టి 24 గంటలూ వాటిల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తున్నారు. వివక్షకు గురవుతున్న కార్మికులు.. ఇక బర్డ్ ఫ్లూ ప్రభావం రెడ్, అలెర్ట్ జోన్ పరిధిలోని సుమారు 10–15 వేల మంది కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెడ్ జోన్లో ఉన్న పౌల్ట్రీ ఫామ్స్‌లో పనిచేసే కార్మికుల రక్తనమూనాలు సేకరిస్తుండడంతో చుట్టుపక్కల ప్రజలు వారిని దూరంపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. వీరిలో ఏ ఒక్కరికీ వైరస్ లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించినప్పటికీ వివక్షకు గురవుతున్నారు. అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారిని ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో.. చేసేదిలేక కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లిపోతుండగా, పొరుగు జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు తిరుగుముఖం పడుతున్నారు.ప్రోత్సాహమివ్వని ఏపీ సర్కారు..ఇదిలా ఉంటే.. బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూసిన జిల్లాల్లో రెడ్, అలెర్ట్ జోన్ పరిధిలోని పౌల్ట్రీ ఫారాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కార్మికుల్లేక వెలవెలబోతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో.. మేత ధరలు అమాంతం పెరిగిపోవడంతో అవి 75 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయి. మరోపక్క.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఏపీ నుంచి వచ్చే గుడ్డుకు ధరలేకుండా చేస్తున్నారు. యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కోళ్ల ఫారాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుండగా ఏపీలో మాత్రం ప్రభుత్వం తీరు పౌల్ట్రీ పరిశ్రమకు శాపంగా తయారైంది. దీంతో రాష్ట్రంలో ఈ రంగం మరింత కుదేలవుతుంది. -
సర్కారు పాపం.. ‘పౌల్ట్రీ’కి శాపం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పౌల్ట్రీ రంగం గుడ్లు తేలేస్తోంది. జనవరి మొదటి వారంలోనే పెద్ద సంఖ్యలో నాటు కోళ్లు, పందెం కోళ్ల మరణాలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఏపీ సరిహద్దులోని ఖమ్మం జిల్లాతో పాటు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనవరి మూడో వారంలో ఒకేసారి లక్షల సంఖ్యలో కోళ్ల మరణాలు సంభవించాయి. ఇందుకు కారణాలను అన్వేషించకుండా, ఈ మరణాలన్నీ చలికాలం వల్లే సంభవిస్తున్నాయని, ఉష్ణోగ్రతలు పెరిగితే ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వం కొట్టిపారేసింది. అదే సమయంలో కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయంటూ ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగానే ఆగమేఘాల మీద ఆయా పౌల్ట్రీ ఫారాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షకు భోపాల్ పంపారు. ఈ నెల 10న వచ్చిన రిపోర్టులో ఈ మరణాలకు కారణం బర్డ్ ఫ్లూ అని తేలడంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేసి జీవభద్రతా చర్యలు చేపట్టింది. ముందుగానే స్పందించి ఉంటే తామిలా నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉండే వారం కాదని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైబీరియన్ పక్షులపై నెపం! దాదాపు 40 లక్షల కోళ్లు మృత్యువాత పడినట్టుగా పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. అయితే ఐదున్నర లక్షల కోళ్లు మాత్రమే చనిపోయాయని అధికార యంత్రాంగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ భయోందోళన వల్ల రోజువారీ చికెన్, గుడ్ల వినియోగం పడిపోయింది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల పంపిణీని సైతం నిలిపివేశారు. చాలా వరకు చికెన్ షాపులు మూతపడ్డాయి. హోటళ్లలో, ఇళ్లలో చికెన్ వంటకాలపై వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. వెరసి ఫౌల్ట్రీ రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సైబీరియన్ పక్షులపై నెపం మోపుతుండటం గమనార్హం. విదేశాల నుంచి ఈ పక్షులు వలస వచ్చినందునే బర్డ్ ఫ్లూ ప్రబలిందని ప్రభుత్వం కుంటి సాకులు చెబుతుండటాన్ని ఆ రంగం నిపుణులు తప్పు పడుతున్నారు. అలాగైతే ఈ పక్షులు ప్రతి సంవత్సరం వలస రావడం మామూలేనని, ఈ లెక్కన ప్రతి ఏటా బర్డ్ ఫ్లూ వచ్చిందా.. అని నిలదీస్తున్నారు.శాస్త్రీయ అధ్యయనం లేకుండా సైబీరియన్ పక్షులను సాకుగా చూపి ప్రభుత్వం తప్పుకుంటుండటం సరికాదంటున్నారు. పౌల్ట్రీ మార్కెట్ పడిపోకుండా ఎలాంటి చర్యలకు ఉపక్రమించక పోవడం చర్చనీయాంశమైంది. చికెన్, గుడ్లు బాగా ఉడికించి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు విద్యా సంస్థలకు ప్రభుత్వమే గుడ్ల సరఫరా బంద్ చేయించడం గమనార్హం. పర్యవేక్షణకు కాల్సెంటర్బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకదారుల కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్టు పశుసంవర్థకశాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 0866–2472543, 9491168699 ఫోన్ నంబర్లతో ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు. ఎగుమతులపై తీవ్ర ప్రభావం‘బర్డ్ ఫ్లూ’ పూర్తిగా తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ మరో వైపు వేగంగా జిల్లాలు దాటి విస్తరిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల అమ్మకాలు, ఎగుమతులు అనూహ్యంగా పడిపోయాయి. దాదాపు 50–60 శాతం మేర అమ్మకాలు పడిపోవడంతో ధరలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాలకు కోడి గుడ్ల ఎగుమతులపై బర్డ్ ఫ్లూ తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో 1200కు పైగా కోళ్ల ఫారాలు ఉండగా, వాటిలో 5.60 కోట్లకు పైగా కోళ్లున్నాయి. వెయ్యికి పైగా ఫారాలు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ప్రస్తుతం రోజుకు 4.75 కోట్ల గుడ్లకు మించి ఉత్పత్తి జరగడం లేదు. రాష్ట్ర పరిధిలో 2.50 కోట్ల నుంచి 3 కోట్ల గుడ్లు వినియోగమవుతున్నాయి. మిగిలిన గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, అసోం, మణిపూర్ తదితర రాష్ట్రాలతో పాటు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. గతేడాది కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 2 లక్షల కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఆ సమయంలోనే క్రానిక్ రెస్పటరీ డిసీజ్, ఇన్ఫెక్షన్ బ్రాంకటైస్, కొక్కెర తెగుళ్లు విజృంభించాయి. దీనికి తోడు ఈ ఏడాది సకాలంలో కోళ్లకు వ్యాక్సినేషన్ వెయ్యలేదనే విమర్శలు కూడా విన్పించాయి. -
బర్డ్‌ఫ్లూ భయం : సగానికి దిగజారిన గుడ్డు వినియోగం!
గుడ్లవల్లేరు: కోడిగుడ్డు వాడకాలు సగానికి పడిపోయాయి. జిల్లాలో నిత్యం కోడిగుడ్ల వినియోగం 20 లక్షల పైమాటే ఉండేది. కానీ బర్డ్‌ఫ్లూతో 10 లక్షలకు వాడకాలు పడిపోయాయి. గతంలో రిటైల్‌లో గుడ్డు ధర రూ.7 ఉండేది. అదే కోడిగుడ్డు ధర రూ.4.30కు పడిపోయింది. బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్‌తో పాటు కోడిగుడ్లను తినకూడదన్న ప్రచారం బాగా కొనసాగుతుంది. దీంతో గుడ్డుకు ఉండే మాత్రం డిమాండ్ తగ్గిపోయింది. జిల్లాలో నిత్యం ఈ కోడిగుడ్ల వినియోగం 20లక్షల పైమాటే ఎప్పుడూ ఉంటుంది. గతంలో ఒక్కో కోడి గుడ్డు ధర రూ.5 నుంచి రూ.6 ఉండేది. అది కాస్తా....రూ.7కు పెరిగిపోయింది. ఇప్పుడైతే బర్డ్‌ఫ్లూతో రూ.4.50కు దిగజారింది. 30 గుడ్లు ఉండే ఒక్కో ట్రే గుడ్లను ప్రాంతాలను బట్టి రూ.135 నుంచి రూ.15 0వరకు మార్కెట్లో వ్యాపారులు అమ్ముతున్నారు.బర్డ్‌ఫ్లూ భయంతో.... బర్డ్‌ఫ్లూతో జిల్లాలో కోడిగుడ్ల వాడకం 10 లక్షలకు పడిపోయింది. తిరువూరు, గంపలగూడెంలో బర్డ్‌ఫ్లూ కలకలంతో మరింత ఆందోళన అధికమైంది. గతంలో జిల్లాలో గుడ్ల వాడకం 20 లక్షల పైమాటే ఉండేది. జిల్లాలోని ప్రజలతో పాటు హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్ల వినియోగం కూడా బర్డ్‌ఫ్లూతో తగ్గిపోయింది. అలాగే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో వాడకం కూడా నానాటికీ దిగజారిపోతుంది. వీటిలో గుడ్ల వాడకం గతంలో ప్రతి స్నాక్స్ కోటింగ్‌కు వినియోగించటంతో పాటు ఫ్రైడ్‌రైస్ తయారు చేసే ఆ చెఫ్‌కు ఎగ్స్ లేకుండా వంట అనేది ముందుకు వెళ్లేదే కాదు. కానీ ఇపుడు చికెన్‌తో పాటు గుడ్డు లేకుండా ఉన్న స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్నే కస్టమర్స్ ఎక్కువగా అడుగుతున్నారని ఆ రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. గుడ్డుకు ఇలాగే డిమాండ్ తగ్గితే ఇపుడు ఒక్కో గుడ్డు రూ.4.50 ఉండటంతో ఆగిపోకుండా మరింతగా దిగజారిపోయే అవకాశం ఉందని వ్యాపారులు సతమతమవుతున్నారు.గుడ్డు హ్యాపీగా తినవచ్చు బర్డ్‌ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో తప్ప గుడ్డును నిత్యం ఎలా ఆరోగ్యానికి వినియోగిస్తారో...అలాగే తినవచ్చు. కానీ ఆరగ్యోం కోసం పచ్చి గుడ్లను తాగేవాళ్లు కొన్నాళ్లు ఆ అలవాటుకు అడ్డుకట్ట వేయాలి. బర్డ్ఫ్యూ ప్రభావం తగ్గేంత వరకు కొన్ని జాగ్రత్తలతో గుడ్లను తింటే ఆరోగ్యానికి మంచిది. సగం ఉడికించిన (హాఫ్ బాయిల్డ్) గానీ, సరిగా ఉడకని ఆమ్లెట్ గానీ తినకూడదు. చలికాలంలో గుడ్లను తినటంతో శరీరానికి ఎక్కువగా వెచ్చదనం వస్తోంది. – డాక్టర్ ఎ.లక్ష్మీనారాయణ,వెటర్నరీ ఏడీ గుడ్లవల్లేరు -
ఆందోళన అక్కర్లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోళ్లకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్5ఎన్1–బర్డ్ ఫ్లూ) వేగంగా సోకుతోంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త గురువారం కలకలం రేపింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు మనుషులకు బర్డ్ ఫ్లూ నమోదైన ఘటనలు చోటు చేసుకోలేదని వైద్య శాఖ స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం అత్యంత అరుదుగా ఉంటుందని స్పష్టం చేశారు. వ్యాధి బారినపడిన పక్షులకు దగ్గరగా ఉండే వ్యక్తులకు అరుదుగా ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుందని, మనుషుల నుంచి మనుషులకు సోకిన సందర్భాలు లేవన్నారు. ఇక మనుషుల్లో బర్డ్ ఫ్లూ ఔట్ బ్రేక్స్ ఇప్పటి వరకూ సంభవించలేదని తెలిపారు. మనుషులకు వ్యాధి సోకినట్లైతే జ్వరం, దగ్గు, గొంతు మంట, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయన్నారు. ఈ వ్యాధి నుంచి రక్షణ కోసం పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలని, వ్యాధి బారినపడిన కోళ్లు, జంతువులకు దూరంగా ఉండాలని వైద్య శాఖ సూచిస్తోంది. ఈ తరహా కేసులు వ్యక్తుల్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో వెలుగు చూడలేదు. గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా రెండు హెచ్5ఎన్1, రెండు హెచ్9ఎన్2 కేసులు వెలుగు చూశాయి. 2019లో మహారాష్ట్రలో ఒకటి, 2021 జూలైలో హర్యానాలో ఒకటి, గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి. 2003 నుంచి 2023 వరకు పశ్చిమ పసిఫిక్‌లో 248 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాదిలో 60 కేసులు నమోదైనట్లు వెల్లడైంది. కర్నూలు జిల్లాలో 15 బాతులు మృతి చెందగా..వాటికి బర్డ్ ఫ్లూ లేదని అధికారులు నిర్థారించారు. తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా జిల్లాల్లోని కోళ్ల ఫారాల్లో పని చేసే సిబ్బందిని వైద్య శాఖ స్క్రీనింగ్ చేస్తోంది. బుధవారం నాటికి 584 మందిని స్క్రీనింగ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 18 మంది నుంచి నమూనాలు సేకరించి కాకినాడ రంగరాయ కళాశాలలో పరీక్షించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు విజయవాడ, కర్నూలు, విశాఖ బోధనాస్పత్రుల్లో 10 పడకల ఐసోలేషన్ వార్డులను అందుబాటులో ఉంచారు. మార్గదర్శకాలు పాటించాలిరాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. గురువారం ఆయన రాష్ట్ర సచివాలయం నుంచి పశు సంవర్థక, వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్లను సక్రమంగా పూడ్చి పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్లు, పశు సంవర్థక శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్టాండర్డ్ ప్రొటోకాల్ మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని పాటించాలన్నారు. వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించి, అక్కడికి రాకపోకలను, దాణా రవాణాను నియంత్రించాలని స్పష్టం చేశారు. ఒకటి నుంచి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ముందు జాగ్రత్తలు చేపట్టాలని, పశు సంవర్థక శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రసార మాధ్యమాల్లో ఏవైనా తప్పుడు వార్తలు వస్తే ఆందోళన చెందొద్దని, అలాంటి వార్తలు ప్రసారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బర్డ్ ప్లూ సోకిన ఏలూరు జిల్లా బాదంపూడి, పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు, కానూరు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లోని 5 ఫౌల్ట్రీల్లో చేపట్టిన చర్యలపై ఆయన ఆరా తీశారు. ఢిల్లీ నుండి కేంద్ర పశు సంవర్ధక శాఖ కమిషనర్ డా.అమిత్ మిత్రా మాట్లాడుతూ సరే కోళ్ల ఫారాలను తప్పనిసరిగా రిజిష్టర్ చేయించాలని చెప్పారు. కాగా, ఏలూరు జిల్లా బాదంపూడిలో బర్డ్‌ఫ్లూ వల్ల ఎవరూ మరణించలేదని కలెక్టర్ ప్రకటించారు. రాష్ట్రానికి కేంద్ర బృందాలుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ తీవ్రతపై అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు వచ్చాయని మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర పశు సంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీ కూడా శుక్రవారం రాష్ట్రానికి వస్తారని చెప్పారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. -
Red Alert: బర్డ్ ఫ్లూ దెబ్బకి లక్షలాది కోళ్లు బలి
-
ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ.. ఓ వ్యక్తికి పాజిటివ్!
సాక్షి, ఏలూరు: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్‌కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో, అతడికి టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో వైద్యశాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ మాలిని మాట్లాడుతూ.. జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడ తొలి కేసు నమోదైంది. దీంతో, కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.మరోవైపు.. ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫార్మ్ కోళ్లను, నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల్లో తెలిపారు. ఏలూరు జిల్లా పశు సంవర్ధన కార్యాలయంలో 24x7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ 9966779943 ఇచ్చారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు.ఇదిలా ఉండగా.. తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో కానూరు అగ్రహారంలో చికెన్ షాపులను మూసివేశారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ గుడ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక, భారీగా తగ్గిన చికెన్, కోడిగుడ్ల వినియోగం తగ్గిపోయింది. దీంతో, పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
బర్డ్ ఫ్లూతో ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ పూర్తిగా తగ్గుముఖం పట్టిందని, ఈ వ్యాధి పట్ల ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికార వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ఆ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం...» రాష్ట్రంలో 2.32 కోట్ల నాటు కోళ్లు, 8.47 కోట్ల లేయర్, బ్రాయిలర్ కోళ్లున్నాయి. » ఇటీవల ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.20 లక్షల కోళ్లు, పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరులో 2.50 లక్షల కోళ్లు, తూర్పుగోదావరి జిల్లా కానూరులో 65వేల కోళ్లు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో 7వేల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది.» వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమై శాంపిల్స్‌ను భోపాల్‌కు పంపించి పరీక్షించగా, బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయ్యింది. » వెనువెంటనే జీవభద్రతా చర్యలు తీసుకుని, ఆయా పౌల్ట్రీల్లో చనిపోతున్న కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది.» వ్యాధి ప్రభావం ఉన్న జిల్లాల్లో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. » రాష్ట్ర సరిహద్దుల్లో కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లు జరిగాయి. » వైరస్ గుర్తించిన గ్రామాల చుట్టుపక్కల 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్విలెన్స్ జోన్‌గా ప్రకటించి కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలను అధికార యంత్రాంగం కట్టడి చేసింది. » కోళ్ల ఫారాలు అధికంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో చెరువులు, సరస్సులు, వలస పక్షులు వచ్చే ప్రాంతాల్లో వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు. భయం అక్కర్లేదు: మంత్రి కాగా, రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఈ వైరస్ 70 డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత వద్ద వరకు మాత్రమే బతుకుతుందన్నారు. కానీ మనం వంద డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద చికెన్ ఉడికిస్తామన్నారు. అందువలన ఈ వైరస్ బ్రతికే అవకాశమే ఉండదన్నారు. కోడి మాంసాన్ని కానీ, కోడిగుడ్లను కానీ బాగా ఉడికించి తినొచ్చని, ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ టీ.దామోదర్‌నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ ఫారాలున్న జిల్లాల పరిధిలో మండలానికి రెండు చొప్పున 721 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. -
రెండు తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ భయం
-
Bird Flu: కరీంనగర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం..
-
తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదు.. చికెన్ తినొచ్చు: పశు సంవర్ధక శాఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బర్డ్ ఫ్లూ(Bird Flu) కేసులు నమోదు కాలేదని తెలిపారు తెలంగాణ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి. ఇతర కారణాలతో కోళ్లు మృతిచెందినట్టు ఆయన వెల్లడించారు. చికెన్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు.తెలంగాణ పశు సంవర్థకశాఖ డైరెక్టర్ గోపి తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. వరంగల్, ఖమ్మం జిల్లాలో కోళ్ల మృతిపై రక్త నమూనాలను ల్యాబ్స్‌కు పంపించాం. ఇతర కారణాలతో కోళ్లు మృతి చెందినట్లు తేలింది. బర్డ్ ఫ్లూపై పౌల్ట్రీ రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. కోళ్ల ఫారాల చుట్టూ బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలి. కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువ.ఈ నేపథ్యంలో చికెన్ తినడం వలన ఎలాంటి ఇబ్బంది లేదు. చికెన్, కోళ్లను ఉడికించి తినటం వలన వైరస్ బతికే ఛాన్స్ లేదు. కోళ్ల ఫారాలలో వైరస్ సోకిన కోళ్లకు దగ్గరగా పనిచేసే వారికి స్వల్పంగా దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం’ అని చెప్పుకొచ్చారు. -
Bird Flu Scare: అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను తాకవద్దని నిర్వాహకులకు సూచిస్తూనే.. సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల దిగుమతులపై నిఘా పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ భయంతో ఇప్పటికే చికెన్ అమ్మకాలు భారీ పడిపోయాయి. ఇదే సమయంలో చికెన్ రేట్లు కూడా తగ్గిపోయాయి. మరోవైపు.. ఏపీ నుంచి కోళ్లతో వస్తున్న వాహనాలను అధికారులు వెనక్కి తిప్పి పంపుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో పశుసంవర్ధకశాఖ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా.. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎనిమిది, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మరో 21 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల కోళ్లు, గుడ్ల వాహనాలను అడ్డుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్‌లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్‌లో 040-23314876 నంబర్ కాల్ చేయాలని సూచించారు. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే ఈ హెల్ప్ లైన్లకు సమాచారం ఇవ్వాలని జిల్లాల పశువైద్యాధికారులకు తెలిపారు. ఇక, బర్డ్ ప్లూ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్న నేపథ్యంలో భారీ నష్టాలు వచ్చాయని ఆవేదన చెందుతున్నారు. చెక్‌పోస్టులు ఇలా.. ఏపీ నుంచి తెలంగాణలోకి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్ వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఏపీ వైపు నుంచి కోళ్లతో వస్తున్న డీసీఎంను వెనక్కి పంపినట్టు కోదాడ మండల పశువైద్యాధికారి మధు తెలిపారు. ఖమ్మం జిల్లా సరిహద్దుగా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ–ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తూ కోళ్లు దిగుమతి కాకుండా అడ్డుకుంటున్నారు. ఏపీ సరిహద్దుల్లో ఉన్న కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు, పోలీసు, రెవెన్యూ, ఫారెస్ట్ తదితర శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నామని ఖమ్మం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి.వెంకటనారాయణ, వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర, కందకుర్తిచెక్ పోస్టుల వద్ద పశుసంవర్థక, పోలీసు శాఖలు కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నిజామాబాద్‌లోకి కోళ్లతో పాటు ఏ జీవాలను కూడా రవాణా చేయకుండా నిరోధిస్తున్నారు. -
ముక్క ముట్టాలంటే భయం!
తిరుపతి తుడా: ముక్క ముట్టాలంటే జిల్లా వాసులు భయపడిపోతున్నారు. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలో సంభవించిన కోళ్ల మరణాలకు కారణం బర్డ్ ఫ్లూగా(Bird flu) నిర్ధారణ కావడంతో ఒకింత కలవరపాటుకు గురవుతున్నారు. ముక్క ముట్టెందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో చికెన్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. పడిపోయిన చికెన్ విక్రయాలు జిల్లాలో లేయర్ 45 లక్షలు, బ్రాయిలర్ 53.25 లక్షలు, లింగాపురం 1.10 లక్షల కోళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 60 శాతం మేర జిల్లాకు సరఫరా అవుతున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి చికెన్ విక్రయాలు 50 శాతానికి పైగా పడిపోయాయి. తిరుపతి లీలామహల్ కూడలిలోని ఓ చికెన్ దుకాణంలో రోజుకు 200 కిలోల చికెన్ విక్రయించేవారు. అయితే రెండు రోజులుగా 100 కిలోలు కూడా అమ్ముడుపోవడం లేదని దుకాణదారుడు వాపోయా డు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కోడి రూ.50 లెక్కన, మరికొన్ని ప్రాంతాల్లో కిలో రూ.140కే విక్రయిస్తున్నారు. అమ్మకాలు తగ్గాయి గడిచిన మూడు రోజులుగా చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం రోజున మరింతగా విక్రయాలు తగ్గడం వాస్తవమే. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. రెండు రోజులుగా చికెన్ దుకాణాలు వేలవేలబోతున్నాయి. ఈ వైరస్ ఎఫెక్ట్ మనకు లేకపోయినా భయంతో ఎవరూ ముందుకు రావడం లేదు. – కృష్ణమూర్తి, గోవర్ధన్ చికెన్ సెంటర్ నిర్వాహకులు, తిరుపతి ఎలాంటి భయాందోళన వద్దు బర్డ్ ఫ్లూ వైరస్ మన ప్రాంతంలో ఎక్కడా లేదు. ఈ వైరస్ పట్ల ప్రస్తుతం ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పనిలేదు. పశు సంవర్థక శాఖ ఇప్పటికే దీనిపై పలు ఆదేశాలు జారీచేసింది. వలస పక్షుల కారణంగా ఈ వైరస్ వ్యాప్తికి కారణమైందని నిర్ధారించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో దీని ప్రభావం ఉంది. రాష్ట్రంలో మరెక్కడా బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు. ఈ వైరస్ గురించి ఆలోచన చేయడం అనవసరం. చికెన్ బాగా ఉడకబెట్టి తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – డాక్టర్ నాగేంద్ర రెడ్డి , వెటర్నరీ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ -
సరిహద్దుల్లో చెక్‌పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో బర్డ్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తెలంగాణలో ఈ వ్యాధి ఇంకా నిర్ధారణ కానప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇతర రాష్ట్రాలతో మనకు ఉన్న సరిహద్దుల్లో మంగళవారం పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల వాహనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ నోటిఫై చేశారు. మన రాష్ట్రంలో ఇంకా వ్యాధి నిర్ధారణ కాలేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి భోపాల్‌లోని హైసెక్యూరిటీ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్ ఫలితాలు ఒకట్రెండు రోజుల్లో వస్తాయని అంటున్నారు. ఒకవేళ ఈ ఫలితాల్లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్ వస్తే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి పంపిన శాంపిల్స్‌పైనే అనుమానాలున్నాయనే చర్చ పశుసంవర్థక శాఖ వర్గాల్లో జరుగుతోంది. బాగా ఉడికించి తినాలి...మన రాష్ట్రంలోని కోళ్లలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యే అవకాశాలు తక్కువ గానే ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఫలితం పాజిటివ్ వస్తే ఏం చేయాలన్న దానిపై కూడా పశుసంవర్థక శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఏ ప్రాంతంలోని కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యిందో ఆ ప్రదేశంలోని ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న కోళ్లన్నింటినీ చంపక తప్పదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. చంపిన కోళ్లను గుంతలు తీసి పూడ్చిపెట్టాలని, ఆ గుంతలపై మంట పెట్టడమే కాకుండా అవసరమైతే సున్నం వేయాల్సి వస్తుందని అంటున్నారు. వ్యాధి సోకిన ఫామ్‌లను పూర్తిస్థాయిలో శుభ్రం చేయడంతోపాటు ఆ ఫామ్‌లలో ఉపయోగిచే వస్తువులనూ మార్చాలంటున్నారు. మొత్తం మీద శాంపిల్స్ ఫలితాలు పాజిటివ్ వస్తే పశుగణనలో బిజీగా ఉన్న తమకు కొత్త తలనొప్పి ప్రారంభమైనట్టేనని వారంటున్నారు. ఇప్పుడు కూడా కోళ్లను తినడంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని, కోళ్లు, కోడిగుడ్లు తినేటప్పుడు బాగా ఉడికించి తినాలని వారు సూచిస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణలోకి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్ వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఏపీ వైపు నుంచి కోళ్లతో వస్తున్న డీసీఎంను వెనక్కి పంపినట్టు కోదాడ మండల పశువైద్యాధికారి మధు తెలిపారు. ఖమ్మం జిల్లా సరిహద్దుగా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ–ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తూ కోళ్లు దిగుమతి కాకుండా అడ్డుకుంటున్నారు. ఏపీ సరిహద్దుల్లో ఉన్న కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు, పోలీసు, రెవెన్యూ, ఫారెస్ట్ తదితర శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నామని ఖమ్మం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి.వెంకటనారాయణ, వెల్లడించారు.నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర, కందకుర్తిచెక్ పోస్టుల వద్ద పశుసంవర్థక, పోలీసు శాఖలు కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నిజామాబాద్‌లోకి కోళ్లతో పాటు ఏ జీవాలను కూడా రవాణా చేయకుండా నిరోధిస్తున్నారు. -
హై అలర్ట్.. చికెన్ తినడం తగ్గించాలి.. ఆ జిల్లాలో రెడ్‌జోన్
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్‌గా ల్యాబ్‌లో నిర్ధారణ అయ్యింది. కానూరు పది కిలోమీటర్ల పరిధిలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒక కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వై లెన్స్ జోన్ ఏర్పాటు చేశారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు.కానూరు కేంద్రంగా 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని అధికారులు సూచించారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్(95429 08025) ఏర్పాటు చేశారు.రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించాయి. తొలుత నాటుకోళ్లు.. ఆ తర్వాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్.. చివరకు కోళ్లఫారాలనే చుట్టేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 30 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్క నిడదవోలు నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్రమత్తమైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ.. నివారణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్‌ను సేకరించి విజయవాడలోని రాష్ట్ర స్థాయి పశువ్యాధి నిర్ధారణ శాలతో పాటు భోపాల్‌లోని హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు పంపింది.తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కోళ్ల ఫారాల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో ఎవియాన్ ఇన్‌ఫ్లూయింజ్(హెచ్5ఎన్1)గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు సోమవారం భోపాల్ ల్యాబ్ నుంచి రిపోర్టు రాగానే సమాచారాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య సంస్థతో పాటు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్‌కు అందించారు.వైరస్ నిర్ధారణ అయిన ఉభయగోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల పశుసంవర్ధక శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల్లో లేయర్, బ్రాయిలర్ కోళ్ల ఫారాల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలానికి రెండు చొప్పున ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి బర్డ్‌ఫ్లూను ఎదుర్కోడానికి సమాయత్తం చేశారు. -
ఏపీలో బర్డ్ ఫ్లూ
సాక్షి, అమరావతి/పెరవలి: ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో సంభవించిన కోళ్ల మరణాలకు కారణం బర్డ్ ఫ్లూ(bird flu) అని నిర్ధారణ అయింది. రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించాయి. తొలుత నాటుకోళ్లు.. ఆ తర్వాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్.. చివరకు కోళ్లఫారాలనే చుట్టేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 30 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్క నిడదవోలు నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి.ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్రమత్తమైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ.. నివారణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్‌ను సేకరించి విజయవాడలోని రాష్ట్ర స్థాయి పశువ్యాధి నిర్ధారణ శాలతో పాటు భోపాల్‌లోని హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు పంపింది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కోళ్ల ఫారాల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో ఎవియాన్ ఇన్‌ఫ్లూయింజ్(హెచ్5ఎన్1)గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు సోమవారం భోపాల్ ల్యాబ్ నుంచి రిపోర్టు రాగానే సమాచారాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య సంస్థతో పాటు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్‌కు అందించారు.వైరస్ నిర్ధారణ అయిన ఉభయగోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల పశుసంవర్ధక శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల్లో లేయర్, బ్రాయిలర్ కోళ్ల ఫారాల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలానికి రెండు చొప్పున ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి బర్డ్‌ఫ్లూను ఎదుర్కోడానికి సమాయత్తం చేశారు. ఆందోళన చెందాల్సిన పనిలేదు..ఉభయగోదావరి జిల్లాల్లో రెండు గ్రామాల్లో బర్డ్› ఫ్లూ నిర్ధారణ అయిన మాట వాస్తవమే. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమస్య పూర్తిగా అదుపులోనే ఉంది. 90 శాతం సమస్య పరిష్కారమైంది. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా ఈ వైరస్ వ్యాపించినట్టుగా నిర్ధారణ కాలేదు. ఉడికించిన గుడ్లు, మాంసాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు. – డాక్టర్ టి.దామోదర్‌నాయుడు, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖరెడ్జోన్స్, సరై్వలెన్స్ జోన్ల ప్రకటన వైరస్ గుర్తించిన గ్రామాలకు కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని రెడ్‌జోన్, పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని సరై్వలెన్స్ జోన్‌గా ప్రకటించారు. 144, 133 సెక్షన్లను అమలు చేస్తున్నారు. సర్వైలెన్స్ జోన్ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాల్లోని కోళ్లు, పశువులు, ఇతర జీవాలతో పాటు మనుషుల రక్త నమూనాలను సేకరించాలని నిర్ణయించారు. ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారికోసం యాంటీ వైరస్ మందులను సిద్ధం చేశారు. కిలోమీటర్ పరిధిలోని పౌల్ట్రీ ఫామ్‌లలోని కోళ్లు, కోడిగుడ్లను కాల్చి పూడ్చి పెట్టాలని ఆదేశాలిచ్చారు. వైరస్ గుర్తించిన గ్రామాలున్న మండలాల్లో చికెన్ షాపులను మూసివేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. మరోవైపు బర్డ్‌ఫ్లూని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోళ్ల రైతులతో ఆయా జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, మొన్నటి వరకు కిలో రూ.250 నుంచి రూ.280 వరకు పలికిన కోడి మాంసం ధర గడిచిన వారం రోజులుగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో రూ.150కు మించి పలకడం లేదు. ఫామ్ గేట్ వద్ద రూ.6.25 పలికిన కోడిగుడ్డు ప్రస్తుతం రూ.4.25కు పడిపోయింది. -
గుడ్ల దొంగలొచ్చారు
పాత తెలుగు సినిమాల్లో కామెడీ దొంగలుంటారు. వాళ్ల పని ఊళ్లో కోళ్లు పట్టడమే. ఎత్తుకొచ్చిన, కొట్టుకొచ్చిన కోళ్లను చక్కగా వండుకు తినే వాళ్లు కొందరైతే వాటిని ఎంతకో కొంతకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వాళ్లు ఇంకొదరు. అలాంటి దొంగలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో పడ్డారు. అయితే వాళ్లు దొంగకోళ్లు పట్టేవాళ్లు కాదు. కోడిగుడ్లు కొట్టేసేవాళ్లు. పెరుగుతున్న కోడి గుడ్డు ధరను సొమ్ము చేసుకునేందుకు కొందరు ఈ ‘గుడ్ల గుటకాయస్వాహ’పథకానికి వ్యూహ రచన చేశారు. అనుకున్నదే తడవుగా ఒకే దెబ్బకు 1,00,000కుపైగా గుడ్లను కొట్టేశారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రీన్‌క్యాసెల్ నగరంలో పీట్ అండ్ గ్యారీస్ ఆర్గానిక్స్ ఎల్ఎల్సీ సంస్థకు చెందిన లారీ నుంచి దొంగలు ఈ గుడ్లను దొంగతనం చేశారు. వీటి విలువ దాదాపు రూ.35 లక్షలు. కొండెక్కుతున్న గుడ్డు ధర ఎవరైనా కోళ్లను దొంగతనం చేస్తారు. వీళ్లేంటి కోడిగుడ్ల వెంట పడ్డారని అనుమానం రావొచ్చు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి బర్డ్‌ఫ్లూ. రెండోది పెరుగుతున్న గుడ్ల ధర. అమెరికాలో గత రెండేళ్లుగా పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ ప్రభావం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. గత దశాబ్దకాలంలో ఇంతటి విస్తృత స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపించడం ఇదే తొలిసారి. గతనెల లూసియానాలో మనుషులకు సైతం ప్రాణాంతకరమైన స్థాయి వేరియంట్ బర్డ్‌ఫ్లూను కనుగొన్నారు. దీంతో పౌల్ట్రీ యజమానులు ప్రతి నెలా లక్షలాది కోళ్లను చంపేస్తున్నారు. ఈ దొంగలు నిజంగానే కోళ్లను కొట్టేసి అమ్మినా జనం ‘బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లు’అని భావించి ఎవరూ కొనక పోవచ్చు. బర్డ్‌ఫ్లూ భయంతో జనం చికెన్‌లాంటి పక్షి మాంసం వాడకం తగ్గించి చాలా మటుకు గుడ్లను తింటున్నారని తెలుస్తోంది. ఇందుకు పెరుగుతున్న కోడి గుడ్ల ధరలే ప్రబల తార్కాణం. మొత్తంగా చూస్తే కోడి గుడ్డు ధర రెట్టింపు అయినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తే దొంగలను గుడ్ల చోరీకి ఉసిగొల్పింది. దుకాణాల్లో పంపిణీ కోసం లారీలో సిద్ధంగా ఉంచిన గుడ్లను శనివారం రాత్రి ఆగంతకులు ఎత్తుకెళ్లిపోయారని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదుచేసి గుడ్ల దొంగల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు. అయితే దొంగలు ఈపాటికి గుడ్లను ఇష్టమొచ్చిన అధిక రేటుకు అమ్ముకుని మరో గుడ్ల షాపుపై రెక్కీ నిర్వహిస్తూ ఉంటారని కొందరు నెటిజన్లు సరదా వ్యాఖ్యల పోస్ట్‌లు పెట్టారు. గుడ్ల కొరత ఏర్పడటంతో గుడ్లతో చేసే వంటకాల ధరలూ రెస్టారెంట్లు, హోటళ్లలో పెరుగుతున్నాయి. అమెరికాలో 25 రాష్ట్రాల్లో దాదాపు 2,000 చోట్ల వ్యాపారం చేస్తున్న ప్రఖ్యాత వేఫుల్ హౌస్ రెస్టారెంట్ తమ గుడ్ల వంటకాల ధరను కాస్తంత పెంచింది. ‘‘మార్కెట్లో గుడ్లు దొరకట్లేవు. ఎక్కువ ఖరీదు పెట్టి కొంటున్నాం. అందుకే ఎక్కువ ధరకు అమ్ముతున్నాం’’అని రెస్టారెంట్ తాపీగా చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైరస్‌తో కుప్పకూలి.. రెండ్రోజుల్లో 4,500 కోళ్లు మృతి
రుద్రూర్/నిజామాబాద్: పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు కుప్పలుకుప్పలుగా మృతి చెందుతున్నాయి. దీంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. పొతంగల్ మండలం చేతన్‌నగర్ శివారులోని కోళ్ల ఫామ్‌లో గత రెండు రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. జల్లాపల్లికి చెందిన రవి చేతన్‌నగర్ శివారులో కోళ్ల ఫామ్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తుండగా, సోమ, మంగళ వారాల్లో సుమారు 4,500 కోళ్లు మృతి చెందాయి. రూ.7లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బర్డ్ ఫ్లూతోనే కోళ్లు మృతి చెందుతున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామానికి చెందిన కొట్టాల గోవర్ధన్‌కు చెందిన పౌల్ట్రీఫామ్‌లో మంగళవారం 25 కోళ్లు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అధికారులు పౌల్ట్రీఫామ్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కోళ్ల నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. -
బర్డ్‌ఫ్లూ కలకలం.. 11 వేల కోడిపిల్లలు, నాలుగువేల కోళ్లను చంపి..
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో బర్డ్ ఫ్లూ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం 11 వేల కోడిపిల్లలను, 4,356 కోళ్లను చంపి, పాతిపెట్టింది. ప్రభుత్వ కోళ్ల ఫారంలో చనిపోయిన కోళ్ల నమూనా పరీక్షల్లో వైరస్ హెచ్5 ఎన్1 నిర్ధారించిన తర్వాత అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోతున్న దరిమిలా అధికారులకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందనే అనుమానం వచ్చింది. దీంతో వెంటనే కోళ్ల నమూనాను పరీక్షల కోసం భోపాల్‌లోని నేషనల్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ఇన్స్టిట్యూట్కు పంపారు. అక్కడ ఆ నమూనాలలో హెచ్5 ఎన్1 నిర్ధారణ అయ్యింది.దీనిపై రాయ్‌గఢ్ కలెక్టర్ కార్తికేయ గోయల్ మీడియాతో మాట్లాడుతూ భోపాల్‌లోని నేషనల్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల రాయ్‌గఢ్‌లోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ నుండి పంపిన కోళ్ల నమూనాలలో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిదన్నారు. అందుకే కోళ్ల ఫారమ్‌లోని మిగిలిన కోళ్లను, కోడిపిల్లలను చంపి పాతిపెట్టారన్నారు. రాయ్‌గఢ్ కలెక్టర్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ కోళ్ల ఫారం ఆవరణలో పూర్తి భద్రతా చర్యల నడుమ జేసీబీసహాయంతో ఒక గొయ్యి తవ్వి, చనిపోయిన కోళ్లు , కోడిపిల్లలను పూడ్చిపెట్టామని తెలిపారు. అలాగే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కోడి గుడ్లను కూడా నాశనం చేశారు. ఇది కూడా చదవండి: రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు -
బర్డ్ ఫ్లూతో పులులు, చిరుత మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని గోరేవాడ రెస్క్యూ సెంటర్లో మరణించిన మూడు పులులు, ఒక చిరుత మృతికి బర్డ్‌ఫ్లూ కారణమని తేలింది. డిసెంబర్ చివరణ మృతి చెందిన వన్య మృగాలు ఏవియన్ ఫ్లూ హెచ్5ఎన్1 బారిన పడ్డాయని అధికారులు ధ్రువీకరించారు. దీంతో మహారాష్ట్ర అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనుషుల మీద దాడి నేపథ్యంలో డిసెంబర్లో వీటిని చంద్రాపూర్ నుంచి గొరేవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న ఒక పులి, 23న రెండు పులులు మృతి చెందాయి. నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్)కు పంపించారు. ల్యాబ్ ఫలితాల్లో బర్డ్‌ఫ్లూతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెచ్5ఎన్1 వైరస్ మూలాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులను వేటాడటం లేదా ముడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మృతుల నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 25 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. -
బర్డ్ ఫ్లూ కలకలం: వియత్నాంలో 47 పులుల మృతి
బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా దక్షిణ వియత్నాంలోని ఓ జూలో 47 పులులు, మూడు సింహాలు, ఓ పాంథర్ మరణించినట్లు స్థానిక మీడియా బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) మీడియా కథనం ప్రకారం.. లాంగ్ యాన్ ప్రావిన్స్‌లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్ , హో చి మిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వూన్ జోయ్ జూలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది.నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్ పరీక్ష ఫలితాల ప్రకారం ఈ జంతువులకు H5N1 రకం A బర్డ్ ఫ్లూ వైరస్ సోకటంతో మృతి చెందినట్లు తెలిపింది. అయితే పులుల మరణాలుపై జూ అధికారుల స్పందించకపోటం గమనార్హం. అదేవిధంగా జంతువులతో సన్నిహితంగా ఉన్న జూ సిబ్బంది ఎవరిలో కూడా శ్వాసకోశ లక్షణాలను బయటపడలేదని తెలుస్తోంది.⚠️Bird flu kills 47 tigers, 3 lions and a panther in Vietnam zoos, state media reports.47 tigers, 3 lions and a panther have died in zoos in south Vietnam due to the H5N1 bird flu virus, state media said Wednesday.@ejustin46@mrmickme2@DavidJoffe64https://t.co/P99Dn71HMF— COVID101 (@COVID19info101) October 2, 2024 ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం (ENV) ప్రకారం.. 2023 చివరి నాటికి వియత్నాంలో మొత్తం 385 పులులు జూలో ఉన్నాయి. ఇందులో 310 ప్రైవేట్ అధీనంలోని జూలలో ఉండగా.. మిగిలినవి ప్రభుత్వ అధీనంలోని జూల సంరక్షణలో ఉన్నాయి. 2022 నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వేగంగా వ్యాప్తి చెందటం వల్ల పలు క్షీరదాల మరణాలు పెగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఈ H5N1 వైరస్ ఇన్ఫెక్షన్లు మానవుల్లో కూడా తేలికపాటి నుంచి తీవ్రమైన స్థాయి వరకు ఉండవచ్చని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారవచ్చని ప్రపంచ ఆగర్యో సంస్థ పేర్కొంది. మరోవైపు.. గతంలో 2004లో సైతం డజన్ల కొద్దీ పులులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయని వియాత్నం స్థానిక మీడియా తెలిపింది.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్ -
ప్రపంచంలో బర్డ్ ఫ్లూతో తొలి మృతి నమోదు
కరోనాకు మించిన ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్న హెచ్5 ఎన్1(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) పలు దేశాలకు విస్తరిస్తోంది. పశువులు, పాల ద్వారా మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకుతోంది. అమెరికాలోని పలు నగరాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో హెచ్5ఎన్1 వైరస్ కేసుల పెరుగుదలపై భారతదేశం కూడా అప్రమత్తమైంది. హెచ్5ఎన్1 వైరస్‌ను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు.తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలోనే మొదటి మరణం నమోదయ్యిందని తెలిపింది. మెక్సికోలో 59 ఏళ్ల వ్యక్తి బర్డ్ ఫ్లూ కారణంగా మరణించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే ఆ వ్యక్తికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ ఏజెన్సీ వెల్లడించలేదు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు తదితర లక్షణాలతో బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు. అతను అప్పటికే దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడుతున్నాడు.మే 23న ఈ కేసు గురించి తమకు మొదట తెలిసిందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది కరోనావైరస్ కంటే వంద రెట్లు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అని వైద్య నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అందించిన నివేదికలో ప్రస్తుతానికి ఒకరి నుండి మరొకరికి హెచ్5ఎన్1 వైరస్ సోకిన సందర్భాలు కనిపించలేదు. అయినప్పటికీ ఈ వైరస్ విషయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.ఈ వైరస్ సంక్రమించినప్పుడు దాని లక్షణాలు తేలికపాటి నుండి తీవ్ర స్థాయి వరకూ ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో బర్డ్ ఫ్లూపై భారత ప్రభుత్వం ఒక సలహాను జారీ చేసింది. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
బర్డ్‌ఫ్లూ భయం లేదు.. అలా చేసిన పాలు సేఫ్!
జంతువుల్లో ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ వైరస్ అమెరికాలో మనిషికి సోకడం భయాందోళన కలిగిస్తోంది. వైరస్ ఆనవాళ్లు మనుషులు తాగే ఆవు పాలలో కనిపించడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు కీలక విషయం చెప్పారు.యూఎస్ స్టోర్లలో విక్రయిస్తున్న పాలు బర్డ్ ఫ్లూ నుండి సురక్షితమైనవని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఎందుకంటే ఈ పాలను పాశ్చరైజేషన్ చేస్తారని, పాశ్చరైజేషన్ వ్యాధిని ప్రభావవంతంగా చంపుతుందని పేర్కొన్నారు.అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుయంజా (HPAI) వ్యాప్తి దేశవ్యాప్తంగా పాడి పశువుల మందల ద్వారా వ్యాపించింది. తేలికపాటి లక్షణాలతో ఒక వ్యక్తికి సోకింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని పాల విక్రయ సంస్థల నుంచి నమూనాలను ఎఫ్‌డీఏ పరీక్షించింది. ఇందులో ప్రతి ఐదు శాంపిల్స్‌లో ఒక దాంట్లో వైరస్ ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్‌డీఏ పేర్కొంది.అయితే పాశ్చరైజేషన్ ప్రక్రియ కారణంగా వైరస్ పాల ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం లేదని ఎఫ్‌డీఏ ప్రకటించింది. దీనిపై మరిన్ని పరీక్షలు అవసరమని పేర్కొంది. హెచ్‌పీఏఐని నిష్క్రియం చేయడంలో పాశ్చరైజేషన్ ప్రభావవంతంగా ఉంటుందిని ప్రాథమిక ఫలితాల్లో గుర్తించినట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఇంతకుముందు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు పచ్చి పాలలో కనుగొనడంతో ఆరోగ్య అధికారులు పచ్చి పాలను తాగొద్దని సూచించారు. -
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ.. ఆరోగ్యశాఖ అప్రమత్తం!
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. రాంచీలోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హోత్వార్‌లోని ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లో కేసులు నిర్ధారణ అయిన దరిమిలా పలు కోళ్లతో సహా నాలుగు వేల వివిధ రకాల పక్షులను అంతమొందించారు. వందలాది గుడ్లను ధ్వంసం చేశారు. ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లూ) కనిపించిన ప్రాంతం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో చికెన్, కోళ్లు, గుడ్లు అమ్మకాలను నిషేధించారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లను శాస్త్రీయ పద్ధతుల ద్వారా తొలగించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోళ్లు, ఇతర పక్షులు, గుడ్లు కొనుగోళ్లు, అమ్మకాలపై పూర్తి నిషేధం ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా వైద్యశాఖ అధికారులు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతంలోని ఇంటింటికీ తిరుగుతూ అక్కడివారిని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కూడా చనిపోయిన పక్షులు కనిపిస్తే తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. -
యూఎస్‌లో బర్డ్ ఫ్లూ కలకలం.. గుడ్లు, పాలు తీసుకోవచ్చా..!
ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ అధిక సాంద్రతలో గుర్తించడం తీవ్ర ఆందోళన రేపింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పచ్చి పాలలో మాత్రమే ఈ వైరస్ ఉందనీ, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్ నాశనమవుతోందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇటీవల ఈ నెల ప్రారంభంలోనే అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆరు రాష్ట్రాల్లో కనీసం 13 మందలను ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పచ్చి పాలు, గుడ్లు, చికెన్ తినడం ఎంతవరకు సురిక్షతం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అంటే..! ఈ బర్డ్ ఫ్లూ వైరస్‌ని ఏవియన్ఇన్ఫ్లెఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ఒకరకమైన జూనోటిక్ ఇన్ఫ్లు ఎంజా. అడవి పఓలు, పౌల్ట్రీ, ఇతర జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది వైరస్ ఉక రకాల ఏ(హెచ్5ఎన్1), ఏ(హెచ్9ఎన్2) వల్ల వస్తుంది. ఈ హెచ్5ఎన్1 వైరస్ సోకిన ప్రతి వందమంది రోగులలో దాదాపు 52 మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడూ.. పాలు తాగడం, గుడ్లు, మాసం తినడం ఎంతవరకు సురక్షితం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి.అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం..బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను మంచి ఉడకించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. గుడ్లు.. గుడ్లు మంచిగా ఉడికించి తిన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. గుడ్డులోపలి పచ్చసొన, తెలుపు రెండు గట్టిగా ఉండే వరకు పూర్తిగా ఉడికించి తినమని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని నివారించొచ్చు. అలాగే గుడ్లను మంచి విశ్వనీయమైన చోటే కొనుగోలు చేస్తున్నారా లేదా అని నిర్థారించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు నిపుణులు. పాలు.. ఇక పాల వద్దకు వస్తే పాశ్చరైజ్డ్ మిల్క్ తాగడం క్షేమమని నిపుణులు అంటున్నారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో, పాలు చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యాధికారక క్రిములను చంపడానికి సరిపోతుంది. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలించడంలో ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చికెన్ ఈ వైరస్ కోళ్లతో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికెన్‌ను సరిగా వండుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం. పౌల్ట్రీని 165°F (74°C) ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్‌తో సహా ఇతర వైరస్లు నశించడం జరుగుతుంది. అలా చికెన్ కొనుగోలు చేసే చోటు పరిశుభ్రత ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే చివరిగా బర్డ్ ఫ్లూ సోకినట్లయితే ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. జ్వరం: అధిక ఉష్ణోగ్రత తరచుగా మొదటి సంకేతం, సాధారణంగా 38°C (100.4°F) కంటే ఎక్కువగా ఉంటుంది. దగ్గు: ప్రారంభంలో, పొడి దగ్గు కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. గొంతు నొప్పి: గొంతు ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి, మింగడం కష్టతరం చేస్తుంది. కండరాల నొప్పులు: శరీర నొప్పులు తలనొప్పి: ఇది తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. శ్వాసకోశ లక్షణాలు: ప్రారంభ దశల్లో తేలికపాటి శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యాధి తీవ్రమైతే కనిపించే లక్షణాలు.. న్యుమోనియా: ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన శ్వాస లేదా శ్వాసలోపం ద్వారా సూచించబడుతుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS): శ్వాసకోశ వైఫల్యం అతిసారం: సాధారణ ఇన్ఫ్లుఎంజాలా కాకుండా, H5N1 జీర్ణశయాంతర లక్షణాలను కలిగిస్తుంది. వాంతులు: ఇది ఇతర జీర్ణశయాంతర లక్షణాలతో కలిపి సంభవించవచ్చు. ముక్కు,చిగుళ్ళ నుంచి రక్తస్రావం: ఇది సాధారణంగా తీవ్రమైన సందర్భాల్లో జరుగుతుంది. నాడీ సంబంధిత మార్పులు: అరుదుగా, ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) సంభవించవచ్చు. ఒక్కోసారిమూర్ఛలు లేదా మానసిక స్థితిlr ప్రభావితం చెయ్యొచ్చు. (చదవండి: మానసిక ఆరోగ్యంపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు! అందుకే థెరపీ..!) -
కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ భయం.. వేగంగా విస్తరిస్తున్న వ్యాధి
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా అని పిలిచే ఈ వ్యాధి అక్కడి పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియా కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్డౌన్ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో అవి ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం పక్షులకేనా మనుషులకు, వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారికి గతంలో ఈ వ్యాధి సోకిన సందర్భాలున్నాయి. మనుషుల్లో హెచ్7ఎన్9,హెచ్5ఎన్1 వైరస్ రకాలు బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణం అవుతాయి. సాధారణంగా పక్షుల లాలాజలం, వ్యర్థాల ద్వారా బర్డ్ ఫ్లూ వైరస్ బయటికి విడుదలవుతుంది. ఈ వైరస్ గాలిలో ఉన్నపుడు ఆ గాలిని మనుషులు పీల్చుకోవడం లేదా వైరస్ ఉన్న ప్రదేశాన్ని తాకి అవే చేతులతో కళ్లు, ముక్కు, నోరు తాకినపుడు వైరస్ మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తుంది. బర్డ్ ఫ్లూ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకుండా కేవలం స్వల్ప అనారోగ్యం మాత్రమే ఉంటుంది. మరికొన్ని కేసుల్లో కళ్లు ఎరుపెక్కడం, జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, తల నొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి వ్యాధి తీవ్రంగా ఉంటే మరణం సంభవించే అవకాశం ఉంటుంది. బర్డ్ ఫ్లూ సోకిన వారు లక్షణాలను గమనించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ లేదా హాస్పిటల్ ఐసోలేషన్‌లో ఉండాలి. శరీరంలో వైరస్ పూర్తిగా లేకుండా పోయిందని నిర్ధారించుకునేంత వరకు చికిత్స తీసుకుంటునే ఉండాలి. ఇదీచదవండి.. క్రూయిజ్ క్షిపణులు పేల్చిన నార్త్ కొరియా -
విజృంభిస్తున్న H5N1 బర్డ్‌ఫ్లూ.. సోకితే 100 మందిలో 50 మంది ఖతం..!
ఏవియన్ ఫ్లూ కొత్తరకం వైరస్ H5N1(బర్డ్ ఫ్లూ) ఐరోపాలోని అడవి జంతువులు, పక్షుల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముంగిస, పందులు, ఎలుగుబంట్లు వంటి క్షీరదాలను ఇది తవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో హెచ్5ఎన్1 తదుపరి ముప్పు మానవులకేనా? ఇది మరో మహమ్మారిగా రూపాంతరం చెందే ప్రమాదం ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ వైరస్ ఐరోపా చరిత్రలోనే అతిపెద్ద ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని శాస్త్రవేత్తలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. పక్షలకు వ్యాపించే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో చాలా రకాలున్నాయి. వాటిలో ఒకటి H5N1. 1997లోనే దీన్ని తొలిసారి గుర్తించారు. గత 20 ఏళ్లలో 850 మంది మనుషులు ఈ ఫ్లూ బారినపడ్డారు. కేసుల సంఖ్య తక్కువే ఉంది కదా? అనుకోవద్దు. ఎందుకంటే హెచ్5ఎన్1 సోకిన వారిలో 50 శాతం మంది మృత్యువాత పడ్డారు. అంటే ఈ ఇన్‌ఫ్లూయెంజా 1,000 మందికి సోకితే 500 మంది ప్రాణాలు కోల్పోతారు. అందుకే ఇది భవిష్యత్తులో మరో మహమ్మారిగా అవతరించే ముప్పు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే 2020లో ఏవియన్ ఫ్లూ-ఏ(H5N1) అనే ఈ వైరస్ కొత్త వంశం ఉద్భవించింది. అప్పటి నుంచి ఇది అడవి పక్షుల ద్వారా మాత్రమే కాకుండా పందులు, ఎలుగుబంట్లు వంటి నిర్దిష్ట జాతుల క్షీరదాలకు వ్యాపిస్తోంది. ఈ కొత్త రకం వైరస్ 10 కంటే తక్కువ మంది మనుషులకే సోకినట్లు గణాంకాల్లో ఉంది. వీరిలో ఒక్కరు మాత్రమే చనిపోయారు. 2021 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల్లో 6,615 జంతువులు ఈ ఫ్లూ బారినపడ్డాయి. అక్టోబర్ 2022 నుంచి ఇప్పటివరకు ఈ 2,701 కేసులు వెలుగుచూశాయి. మరో మహమ్మారిగా అవతరిస్తుందా? ఈ బర్డ్‌ఫ్లూ మరణాల రేటు 50 శాతం ఉండటం ప్రజారోగ్య అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. 2009 హెచ్1ఎన్1 నుంచి ఇప్పటివరకు వెలుగుచూసిన వైరస్లలో మరణాల రేటు దీనికే ఎక్కువ ఉండటం గమనార్హం. ఒకవేళ హెచ్5ఎన్1 మానవులకు కూడా వేగంగా వ్యాపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఆ అవకాశం లేదని చెప్పి కాస్త ఊరటనిచ్చారు. ఇటీవల హెచ్5ఎన్1 వైరస్ బారినపడిన వారందరూ అడవి పక్షులతో అత్యంత సన్నిహితంగా మెలిగారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి రిచర్డ్ పిబాడీ తెలిపారు. వీరిలో పౌల్ట్రీ ఫాంలతో పనిచేసేవారు, పక్షులు, జంతువులను చంపేవారు ఉన్నట్లు పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన పక్షులు, జంతువులకు దూరంగా ఉంటే హైచ్5ఎన్1 వైరస్ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ పక్షులు, క్షీరదాలతో పాటు ఇతర జంతువులకు ఈ ఫ్లూ వ్యాపించడం మొదలైందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: వేడి అలలు... జీవజాలానికి ఉరితాళ్లు! పరిస్థితి ఇలాగే కొనసాగితే.. -
కడక్‌నాథ్ కోళ్లకు బర్డ్‌ఫ్లూ.. చికెన్ విక్రయాలపై నిషేధం!
జార్ఖండ్: బర్డ్‌ఫ్లూ కారణంగా 4,000 కోళ్లు, బాతులను చంపివేయాలని జార్ఖండ్ బొకారో జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇక్కడ ప్రభుత్వం నిర్వహించే పౌల్ట్రీ ఫాంలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తిచెందినందువల్ల దాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రోటీన్లు అధికంగా ఉండే కడక్‌నాథ్ కోళ్లలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఈ రకానికి చెందిన 800 కోళ్లు బర్డ్‌ప్లూ కారణంగా మరణించాయని, మరో 103 కోళ్లను తామే చంపేశామని పేర్కొన్నారు. దీంతో ఈ ఫాంకు ఒక కిలోమీటర్ రేడియస్‌లో ఉన్న కోళ్లు, బాతులు సహా మొత్తం 3,856 పక్షులను చంపనున్నట్లు పశు ఆరోగ్య, ఉత్పత్తి డైరెక్టర్ డా.బిపిన్ బిహారీ మహ్తా పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న ఈ ఫాంలో కోళ్లు చనిపోవడం మొదలైందని, నమూనాలు ల్యాబ్‌కు పంపింతే బర్డ్‌ఫ్లూగా నిర్ధరణ అయిందని వివరించారు. అయితే కోళ్ల యజమానులకు కొంత పరిహారం ఇచ్చేందుకు ప్రక్రియ మొదలైందని, ఎవరెవరికి ఇచ్చే విషయాన్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉందన్నారు. బర్డ్‌ఫ్లూను గుర్తించి పౌల్ట్రీ ఫాంకు 10 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న కోళ్ల ఫాంలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే బొకారా జిల్లాలో చికెన్ విక్రయాలపై నిషేధం విధించారు. మనుషులు ఎవరైనా ఈ వైరస్ బారినపడితే వారికి చికిత్స అందించేందుకు సదర్ హాస్పిటల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చదవండి: బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలిక మృతి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక -
మన గుడ్డు వైపు.. విదేశాల చూపు
సాక్షి, అమరావతి: భారత దేశ కోడి గుడ్లకు.. మరీ ముఖ్యంగా ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల గుడ్లకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. పలు దేశాలు కోడి గుడ్ల కోసం దక్షిణాది రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా కోడి గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో మలేసియా, తైవాన్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. మన రాష్ట్రంలో రోజుకు 5.5 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం దేశీయ గుడ్ల ఎగుమతుల్లో రాష్ట్రం వాటా సుమారు 20 శాతం ఉంది. ప్రస్తుత డిమాండ్‌తో ఇది మరింత పెరగనుంది. స్థానిక డిమాండ్‌కు తోడు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో గుడ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఫాం గేటు వద్ద గుడ్డు ధర రూ.4.20 నుంచి రూ.5.60కి పెరిగింది. రిటైల్ మార్కెట్లో చాలా చోట్ల ధర రూ.7కు చేరింది. మలేసియా వంటి దేశాల్లో గుడ్డు ధర రూ.8.50 దాటడంతో ఎగుమతులపై రాష్ట్ర పౌల్ట్రీ రైతులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటివరకు సౌదీ అరేబియా వంటి దేశాలకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రం.. ఇప్పుడు మలేషియా, తైవాన్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాల మార్కెట్లలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ధరలు పెరగడానికి కారణమిదే బర్డ్‌ఫ్లూ, ఏవియన్ ఫ్లూ వంటి వైరస్లు వ్యాప్తి చెందడంతో అమెరికా, జపాన్ వంటి దేశాల్లో కోళ్ల ఉత్పత్తిని నిలిపివేశారు. ఒక్క అమెరికాలోనే వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 8 కోట్ల కోళ్లను చంపేశారు. జపాన్‌లో మరో కోటికిపైగా కోళ్లను చంపేశారు. దీంతో అంతర్జాతీయంగా కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని శ్రీనివాస హేచరీస్ ఎండీ సురేష్ చిట్టూరి ‘సాక్షి’కి తెలిపారు. ఇదే సమయంలో కోళ్ల దాణా వ్యయం భారీగా పెరగడంతో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కోళ్ల పెంపకనానికి విరామం ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో ఉత్పత్తిని కొంత మేర తగ్గించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 45 లక్షల వరకు కోళ్ల ఉత్పత్తి తగ్గగా, ఆంధ్రా, తెలంగాణల్లో కలిసి 20 లక్షలకు పైగా ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకుండాపోయింది. ఒక్క మహారాష్ట్రలోనే రోజుకు కోటికి పైగా గుడ్లకు కొరత ఉందని అధికారులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇవన్నీ రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు కలిసొచ్చే అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలోనూ భారీగా పెరుగుతున్న గుడ్డు వినియోగం దేశంలో తలసరి కోడి గుడ్డు వినియోగం పెరుగుతుండటం కూడా గుడ్ల ధరలు పెరగడానికి మరో కారణమని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దేశంలో గడిచిన 15 ఏళ్లలో కోడి గుడ్ల తలసరి వినియోగం మూడురెట్లు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2005లో దేశీయ తలసరి కోడిగుడ్డు వినియోగం 34 ఉండగా అది 2021కి 90 గుడ్లకు పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత కోడి గుడ్ల వినియోగం భారీగా పెరిగిందని సురేష్ తెలిపారు. కోవిడ్‌కు ముందు తలసరి గుడ్డు వినియోగం 70గా ఉంటే అది 90కి చేరినట్లు తెలిపారు. కానీ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశీయ తలసరి కోడిగుడ్ల వినియోగం 180కి చేరినప్పుడే పిల్లలు బలవర్థకంగా ఉంటారని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో గుడ్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచి, దేశీయంగా, విదేశాలకు ఎగుమతుల్లోనూ రాష్ట్ర రైతులు దూసుకుపోయే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
12 వేల బాతులను చంపేశారు!
అలప్పుజ: కేరళ వాసులను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. అలప్పుజ జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తకళి గ్రామపంచాయతీలోని 10వ వార్డులో మొత్తం 12,000 బాతులను చంపేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి బర్డ్ ఫ్లూ నిర్ధారణ పరీక్షల కోసం భోపాల్‌కు పంపించారు. మరోవైపు అలపుజ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. బర్డ్ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు ముమ్మరం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. తకళి గ్రామ పంచాయతీలోని వార్డు నంబర్ 10లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా వైద్యాధికారులు ప్రకటించారు. ఇక్కడ వాహనాలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో బాతులు, కోళ్లు, పిట్టలు, పెంపుడు పక్షుల గుడ్లు, మాంసం అమ్మకాలు, పేడ వాడకంపై జిల్లా యంత్రాంగం నిషేధించింది. చంపకుళం, నేడుముడి, ముత్తార్, వీయపురం, కరువట్ట, త్రిక్కున్నపుళ, తకళి, పురక్కాడ్, అంబలపుజ సౌత్, అంబలపుజ నార్త్, ఎడత్వ పంచాయతీలు, హరిప్పాడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. (Omicron Variant: తీవ్రతపై త్వరలో స్పష్టత!) తకళి పంచాయతీ 10వ వార్డులో కిలోమీటరు పరిధిలో పక్షులను చంపే ప్రక్రియను పూర్తి చేసి సురక్షితంగా పాతిపెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సహకారం అందించాలని, ఆ ప్రాంతంలో నిఘా పెట్టాలని స్థానిక పోలీసులను కోరారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారిత ప్రాంతాల్లో పశుసంక్షేమ శాఖ.. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా ప్రజలకు నివారణ మందులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదికలు అందజేయాలని పశుసంవర్థక శాఖను కలెక్టర్ ఆదేశించారు. (చదవండి: ఒమిక్రాన్ టెన్షన్.. 2 రోజుల పాటు కర్ఫ్యూ) -
కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం..బాతులు, కోళ్లను చంపేయండి!
తిరువనంతపురం: ఓవైపు కరోనా కేసులు.. మరోవైపు బర్డ్ ఫ్లూ విజృంభణ.. వైరస్ల బెడదతో కేరళ అతలాకుతలం అవుతోంది. కేరళలో బర్డ్ ఫ్లూ నిర్థారణ కావడం ఇది రెండోసారి. అలప్పుజ జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. బాతులు, కోళ్లను చంపాలని నిర్ణయించాయి. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించాయి. తకాళి పంచాయితీ పరిధితో పాటు హరిప్పడ్ మునన్సిపాలిటీలోనూ ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్ని కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించిన అధికారులు.. వాహనాలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సరిహద్దు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలో ఉన్న బాతులు, కోళ్లు, ఇతర పక్షులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వలస పక్షులకు వైరస్ సోకిందో లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. చదవండి: ఒమిక్రాన్ అలజడి: భారత్‌లో మరో రెండు కేసులు.. -
Bird Flu Strain H10N3: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ
బీజింగ్: ప్రపంచంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ వైరస్‌లో కొత్త స్ట్రెయిన్ మనుషులకి సోకడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి. చైనాలో ఈ వైరస్ తొలిసారిగా ఒక వ్యక్తికి సోకిందని అక్కడి ప్రభుత్వం నిర్ధారించింది. తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లో 41 ఏళ్ల వ్యక్తికి మే 28న బర్డ్ ఫ్లూ వైరస్‌లోని ‘హెచ్10ఎన్3 రకం’ సోకినట్టుగా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. అయితే అతనికి వైరస్ ఎలా సోకింది? ఎక్కడ్నుంచి వచ్చింది వంటివేవీ ఆరోగ్య శాఖ వెల్లడించలేదు. హెచ్10ఎన్3 వైరస్ మనుషులకి సోకడం ప్రపంచంలో ఇదే తొలిసారిని మాత్రం పేర్కొంది. మరోవైపు ఈ వైరస్‌తో వచ్చే ప్రమాదం ఏమీ లేదంటూ తక్కువగా చేసి చూపించే ప్రయత్నాలు డ్రాగన్ దేశం మొదలుపెట్టింది. పక్షుల నుంచి మనుషులకి ఈ వైరస్ చాలా అరుదుగా సోకుతుందని వెల్లడించిన ఆరోగ్య శాఖ వైరస్‌తో పెద్దగా ప్రమాదం ఏమీ లేదని పేర్కొంది. బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రేపో మాపో డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయంటూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీజీటీఎన్ టీవీ వెల్లడించింది. ఇప్పటివరకు కోళ్లకు, ఇతర పక్షులకు ప్రాణాంతకంగా మారిన హెచ్5ఎన్8 రకం మనుషులకి సోకే ప్రమాదం చాలా తక్కువ. కోళ్ల ఫామ్స్‌లో పని చేసే వారికి మాత్రమే ఈ వైరస్ ముప్పు ఉండేది. ఇప్పుడు హెచ్10ఎన్3 రకం వైరస్ సోకడం ఆందోళన రేపుతోంది. జ్వరం వంటి సాధారణ ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ వచ్చిన ఆ వ్యక్తికి పరీక్షల్లో బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. -
కలకలం: తొలిసారిగా మానవుడికి సోకిన బర్డ్ ఫ్లూ
బీజింగ్: పక్షులకు వ్యాపించే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుందని ఇన్నాళ్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. చైనాలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ ఓ వ్యక్తికి సోకింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) మంగళవారం ప్రకటించింది. హెచ్10ఎన్3 స్ట్రెయిన్ వ్యాపించిందని వెల్లడించింది. వెంటనే వైద్యారోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే మానవుడికి బర్డ్ ఫ్లూ వ్యాపించిన వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది. తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల పురుషుడికి బర్డ్ ఫ్లూ సోకిందని జాతీయ ఆరోగ్య కమిషన్ వివరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా బర్డ్ ఫ్లూ కేసు తమ దేశంలోనే మానవుడికి సోకిందని కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొంది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) వారం కింద రక్త పరీక్షలు చేయగా అతడికి బర్డ్ ఫ్లూ సోకిందని ఫలితాల్లో నిర్ధారణ అయ్యింది. అతడికి బర్డ్ ఫ్లూ సోకడంతో వెంటనే అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు అతడికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అతడి ఎవరెవరిని కలిశారో వారిని గుర్తించి వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే బర్డ్ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని జాతీయ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది. చదవండి: జూన్‌లోనే తగ్గుముఖం పడుద్ది -
కోళ్ల నుంచి మనుషులకు కొత్త వైరస్!
మాస్కో: కరోనా వైరస్‌తో ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు బ్రిటన్ను కరోనా స్ట్రెయిన్ గజగజలాడిస్తోంది. తాజాగా రష్యాలో బయటపడిన ఓ కొత్త రకం వైరస్ ఆందోళన కలిగిస్తోంది. రష్యాలోని ఓ పౌల్ట్రీ కోళ్లలో కొత్త రకం H5N8 స్ట్రెయిన్ వైరస్ బయటపడింది. పౌల్ట్రీలో పనిచేసే ఏడుగురిలో ఈ కొత్త వైరస్‌ను గుర్తించారు. కోళ్ల నుంచి మనుషులకు వైరస్ సోకిన తొలి కేసుగా ఈ ఘటన నిలిచిందని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారి అన్నాపొపొవా వెల్లడించారు. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించామని తెలిపారు. కోళ్లను ప్రత్యక్షంగా తాకడం ద్వారా, అపరిశుభ్ర వాతావరణంలో ఉండటం వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని అన్నారు. ఇది పక్షులకు కూడా సోకే ప్రమాదం ఉందని, వలస పక్షుల కారణంగా వేగంగా వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే H5N8 వైరస్ మనుషుల్లో అంత ప్రభావం చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్ఆర్ఎస్) పరిశోధకుడు ఫ్రాంకోయిస్ రెనాడన్ మాట్లాడుతూ.. ఈ కొత్త స్ట్రెయిన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే దీనిపై తాము ప్రయోగాలు మొదలుపెట్టామని తెలిపారు. కరోనా ప్రపంచానికి వేగంగా స్పందించడం నేర్పిందని, కొత్త వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మరోవైపు రష్యాకు చెందిన వెక్టర్ స్టేట్ వైరాలజీ అండ్ బయో టెక్నాలజీ సెంటర్ కరోనా వైరస్‌కు టీకా అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్‌కు తాము వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వెక్టర్ చీఫ్ రినాట్ మక్యుటోప్ తెలిపారు. చదవండి: ముసలి వేషంతో కరోనా టీకా, కానీ.. -
కరీంనగర్: కలకలం రేపిన నాటుకోళ్ల మృతి
సాక్షి, హుస్నాబాద్: కరీంనగర్ జిల్లాలో నాటు కోళ్ల మృతి కలకలం రేపుతోంది. అంతుచిక్కని వ్యాధితో వెయ్యికి పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన రైతు తిరుపతి 1500 నాటు కోళ్ళు పెంచుతున్నారు. నిన్నటి నుంచి 24 గంటల వ్యవధిలో భారీ సంఖ్యలో కోళ్ళు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో.. బర్డ్ ప్లూ కారణంగానే ఇలా జరిగిందనే భయంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా కోళ్ల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.(చదవండి: వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం) సమాచారం అందుకున్న వెటర్నరీ వైద్యులు మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. కాగా అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడడంతో రైతు తిరుపతికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. దాదాపు నాలుగు లక్షల మేర నష్టపోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు. ఇక వికారాబాద్ జిల్లాలో సైతం వింత జబ్బుతో... వందలాది కోళ్లు చనిపోతున్న సంగతి తెలిసిందే. కోళ్లతోపాటు కాకులు కూడా మృతి చెందుతుండటంతో బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. -
క్రికెటర్ శిఖర్ ధావన్‌పై చార్జ్‌షీట్
వారణాసి: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్‌పై చార్జ్‌షీట్‌పై గురువారం వారణాసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలైంది. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ధావన్ పక్షులకు ఆహారం వేయడం ఏంటంటూ సిద్దార్థ్ శ్రీవాత్సవ అనే లాయర్ అతనిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. లాయర్ చార్జ్‌షీట్‌తో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ త్రితియా దివాకర్ కుమార్ గురువారం ధావన్‌పై కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఫిబ్రవరి 6న జరపనున్నట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. అసలు విషయంలోకి వెళితే... శిఖర్ ధావన్ గతవారం వారణాసి పర్యటనుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో సరదాగా ఓ బోటులో తిరుగుతూ అక్కడి పక్షులకు ఆహారం వేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పక్షులకు మేత తినిపించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ధావన్ పేర్కొన్నాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో వారణాసి కలెక్టర్ స్పందించారు. ధావన్ విహరించిన బోటు యజమానిపై చర్యలకు ఆదేశించారు. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న తరుణంలో పక్షులకు మేత వేయడం నిశిద్ధం.అయితే బోటులో పక్షులకు ఆహారం వేసేందుకు పర్యాటకులను ఎలా అనుమతిస్తారని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. వీటిపై పర్యాటకులకు అవగాహన ఉండకపోవచ్చు.. బోటు యజమానులు విషయం చెప్పకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. -
చికెన్.. ఏడాదికి 3.6 లక్షల టన్నులు
సాక్షి, హైదరాబాద్: చికెన్.. రాష్ట్ర ప్రజలు ఇష్టంగా ఆరగించే ఈ మాంసాహారంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. తక్కువ ధరకే దొరికే బలవర్ధకమైన మాంసాహారం కోడికూర అని, ఈ విషయంలో ఆందోళన చెందొద్దని సూచిస్తున్నారు. ఇటీవల పశుసంవర్థక శాఖ తయారుచేసిన నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో ఏటా 3.6 లక్షల టన్నులకు పైగా చికెన్ వినియోగమవుతోంది. మొత్తం మాంసం మార్కెట్లో ఇది 44 శాతం కాగా, ఒక కిలో చికెన్‌లో 250 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సింహభాగం చికెన్‌దే రాష్ట్రంలో మాంసాహార ప్రియులు ఎక్కువగా ఆరగించేది చికెనే అని లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల పశుసంవర్ధక శాఖ రూపొందించిన ఓ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని మొత్తం మాంసాహార మార్కెట్లో 44 శాతం చికెన్‌దేనని తేలింది. ఏటా రాష్ట్ర ప్రజలు 3,63,850 టన్నుల కోడికూర లాగించేస్తున్నారని చెబుతోంది. ఇక నాటుకోళ్ల రూపంలో రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెంచుకుని ఆరగించే మాంసం ఈ లెక్కలోకి రాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇతర మాంసాహారాల్లో గొర్రె మాంసం 32 శాతం, మేక మాంసం 8 శాతం, నల్లజాతి పశువుల మాంసం 14 శాతం తింటున్నారని తేలింది. ముఖ్యంగా చికెన్‌లో 25 శాతం ప్రోటీన్లు ఉంటాయని, తక్కువ ధరకు దొరికే బలవర్ధకమైన మాంసాహారం ఇదేనని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మటన్‌లో 20 శాతం మాత్రమే ప్రోటీన్లు ఉంటాయని చెబుతున్నారు. ఈసారి బర్డ్‌ఫ్లూ లేనట్టే ఇటీవల దేశంలోని దాదాపు 10 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకింది. మన రాష్ట్రంలోనూ గత రెండేళ్ల కింద ఈ వ్యాధి సోకడంతో లక్షల సంఖ్యలో కోళ్లను పూడ్చిపెట్టాల్సి వచ్చింది. (చదవండి: సిటీ టేస్ట్.. చికెన్ ఫస్ట్..) ఈ ఏడాది కూడా దేశంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కన్పించడంతో మన రాష్ట్ర చికెన్ మార్కెట్‌పై కూడా ఈ ప్రభావం పడింది. అయితే పశుసంవర్ధక శాఖ మాత్రం బర్డ్‌ఫ్లూ మన రాష్ట్రంలో లేదని స్పష్టం చేస్తోంది. ఇటీవల కొన్ని జిల్లాల్లో చాలా కోళ్లు, నెమళ్లు మరణించడానికి బర్డ్‌ఫ్లూ కారణం కాదని, ఇతర కారణాలతో చనిపోయాయని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 3 వేల కోళ్ల ఫారంలు ఉండగా, వాటిలోని 75 శాతం ఫారంల నుంచి పశుసంవర్ధక శాఖ అధికారులు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కన్పించకపోవడంతో చికెన్ వినియోగంపై రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను ఆ శాఖ అధికారులు నివృత్తి చేసే పనిలో పడ్డారు. అనవసరపు భయాలొద్దు.. చికెన్ తినే విషయంలో ప్రజలు లేనిపోని అపోహలకు గురికావద్దు. రోజుకు ఒక గుడ్డు తింటే డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. కోడిమాంసం కూడా చాలా బలవర్ధకమైనది. తక్కువ ధరకు దొరికే బలవర్ధక మాంసాహారం ఇదే. బర్డ్‌ఫ్లూ మన రాష్ట్రంలో రాలేదు. పశుసంవర్ధక శాఖ అప్రమత్తంగా ఉంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. – రాంచందర్, పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్ -
కోళ్లు మరణిస్తే సమాచారం ఇవ్వాలి
సాక్షి, అమరావతి/కాశీబుగ్గ: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోళ్ల మరణాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. కోళ్లలో మరణాలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బర్డ్ ఫ్లూ వ్యాధి పక్షి నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా తక్కువని పేర్కొన్నారు. పుకార్లను నమ్మొద్దని, కోడి గుడ్లు, కోడి మాంసంను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని తెలిపారు. -
‘ఫ్లూ’ ఏదైనా.. జాగ్రత్తే అసలు మందు
సాక్షి, హైదరాబాద్: బర్డ్ ఫ్లూ... కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో ఎదురైన మరో ఉపద్రవం. ఈ ఫ్లూ పక్షులపైనే కాదు.. మనుషులపైనా ప్రభావం చూపనుందని కేంద్ర ప్రభుత్వం పసిగట్టింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఛాయలను గుర్తించింది. కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఈ నెల 11న ఫ్లూ ఉన్నట్లు ఖరారు చేసిన కేంద్రం... దీన్ని ఏవియన్ ఇన్ఫ్లూయెంజాగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లే బర్డ్ ఫ్లూపై పోరాటంలో కీలక భూమిక పోషించాలని స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ... సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదమేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. చదవండి: కోవాగ్జిన్ వద్దు.. కోవిషీల్డ్ కావాలి పూర్తిగా ఉడికించిన ఆహారం మేలు హాఫ్ బాయిల్డ్(సగం ఉడికించిన) గుడ్లను అస్సలు తినొద్దు. సగం ఉడికించిన చికెన్ జోలికీ పొవద్దు. 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కనీసం అరగంట పాటు ఉడికించిన పదార్థాలనే తినాలి. బర్డ్‌ఫ్లూ సోకిన పక్షులకు కాస్త దూరంగా ఉండటంతో పాటు అవి సంచరించిన చోట ఉండే ఆహార పదార్థాలు, పచ్చి కాయగూరలు, పండ్లను తీసుకోకపోవడమే మేలు. ఆహార పదార్థాల వాడకంపై మరింత అవగాహన పెంచుకోవాలి. దీనికి సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపర్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. (చదవండి: దేశమంతటా టీకా పండుగ) జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు... బర్డ్ ఫ్లూపై పోరాటం చేసే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రోజువారీ పురోగతిని సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా పశుసంవర్థక, అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూ సంస్కరణల విభాగం, హోం, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరణించిన పక్షులను ముట్టుకోకుండా ఉండటంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంది. అకారణంగా పక్షులు మరణించినట్లు గుర్తిస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ నంబర్ 040–246511196కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. జ్వరం, గొంతు నొప్పి బర్డ్‌ఫ్లూ సోకిన పక్షితోనే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఫ్లూ సోకిన పక్షిని తాకడం.. ముఖ్యంగా పక్షి కళ్లు, ముక్కును పట్టుకోవడంతో ఈ వైరస్ మరొకరికి సోకుతుంది. ఫ్లూ సోకిన పక్షి ఎగురుతున్నప్పుడు రెక్కల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని శాçస్త్రవేత్తలు చెబుతున్నారు. పక్షుల్లో రకరకాల లక్షణాలు అంతర్గతంగా కనిపిస్తుండగా... ఈ వైరస్ మనుషులకు సోకితే ముందుగా జ్వరం, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, కండరాలు, ఎముకల నొప్పితో మొదలై క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, గర్భిణులు, బాలింతలు, రెండేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ఈ వైరస్ సొకితే దుష్ప్రభావాలు ఎక్కువ. వీరంతా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పొందుపర్చింది. -
బర్డ్ ఫ్లూ కలకలం: 1,500 కోళ్లు మృతి
సాక్షి, డిచ్పల్లి (నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని దుర్గాభవాని పౌల్ట్రీ ఫామ్‌లో 24 గంటల్లోపే 1,500 కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. పౌల్ట్రీ ఫామ్ యజమాని తెలిపిన ప్రకారం.. రెండు షెడ్లలో సుమారు 8,000 కోళ్లు పెంచుతున్నారు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా సుమారు వేయి కోళ్లు మృతి చెందాయి. బుధవారం ఉదయాన్నే గమనించిన ఫామ్ సిబ్బంది యజమానికి విషయం తెలిపారు. చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. మధ్యాహ్నం వరకు షెడ్లలో మరో 500 పైగా కోళ్లు కూర్చున్న చోటే కూలబడి చనిపోయాయి. చదవండి: బర్డ్ ఫ్లూ: చికెన్ అమ్మకాలపై నిషేధం మండల పశువైద్యాధికారి డాక్టర్ గోపికృష్ణకు తెలుపడంతో ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ భరత్, ఏడీ (ల్యాబ్) కిరణ్ దేశ్‌పాండే సాయంత్రం పౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించారు. ఫామ్ యజమానితో మాట్లాడా రు. చివరి వ్యాక్సినేషన్ ఎప్పుడు చేశారు, దాణా ఎవరూ సరఫరా చేస్తారు లాం టి వివరాలు తెలుసుకున్నారు. బతికి ఉన్న కోళ్ల రక్త నమూనాలను, చనిపోయిన కోడిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. కాగా, ఒక్కరోజే సుమారు 1,500 కోళ్లు మృతి చెందడంతో యానంపల్లి తండవాసులతో పాటు మండలవాసులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు కేసులు నమోదు కాలేదు ఇక్కడ చనిపోయిన కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవు. ఆర్మూర్, వర్నిలోని పౌల్ట్రీ ఫామ్‌లు సందర్శించాం. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. పరీక్ష ఫలితాలు రాగానే కోళ్లు ఎలా చనిపోయాయనేది తెలుస్తుంది. జిల్లాలోని పౌల్ట్రీ ఫామ్ యజమానులు జాగ్రత్తలు పాటించాలి. –డాక్టర్ భరత్ -
బర్డ్ ఫ్లూ: చికెన్ అమ్మకాలపై నిషేధం
న్యూఢిల్లీ: దక్షిణ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లలో చికెన్ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. అదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన అన్ని రకాల ఆహార ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. దేశ రాజధానిలో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పౌల్ట్రీ షాపులు, మాంసం దుకాణాలు, ప్రాసెసింగ్ యూనిట్లు అమ్మకాలు జరుపకూడదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఎన్డీఎంసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఇక ఎస్డీఎంసీ సైతం.. ‘‘బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ హోల్‌సేల్ మార్కెట్లు మూసివేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాం. చికెన్, కోడిగుడ్లతో కూడిన వంటకాలు వడ్డించకూడదని రెస్టారెంట్ల యజమానులకు స్పష్టం చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించిన వారి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం’’ అని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కాగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయిలో ఉడికిన మాంసం, గుడ్లు తినవచ్చని ఆరోగ్య శాఖ నేడు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. (చదవండి: బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?) ఈ క్రమంలో తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇక ఢిల్లీలో ఎనిమిది బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూసినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. మయూర్ విహార్ ఫేజ్ 3, సంజయ్ లేక్, ద్వారక నుంచి సేకరించిన నమూనాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు ప్రకటించింది.(చదవండి: 9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ పంజా) -
పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షల్లేవు
సాక్షి, అమరావతి: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో రాష్ట్రంలో పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలపై ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తినడం వలన బర్డ్ ఫ్లూ రాదని అందువలన ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా నిరభ్యంతరంగా తినవచ్చునన్నారు. మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో ఒక్క పక్షి కూడా మరణించిన దాఖలాలు లేవన్నారు. వలస పక్షులు, నీటి పక్షులద్వారా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో వలస పక్షులు, నీటి పక్షులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలను మ్యాపింగ్ చేస్తున్నట్టు చెప్పారు. పశువైద్యులు తమ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాలను సందర్శించి అక్కడ ఉన్న కోళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలని సూచించారు. ఉత్సాహపూరిత వాతావరణంలో కనుమ పండుగను జరుపుకోవాలని మంత్రి అప్పలరాజు మంగళవారం ఓ ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. -
ప్రకాశంలో బర్డ్ ఫ్లూ కలకలం
సాక్షి, చినగంజాం(ప్రకాశం): బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలుతోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో సోమవారం చెట్ల కింద పక్షులు చనిపోయి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఒకే చెట్టు కింద ఎనిమిది పక్షుల కళేబరాలు ఉండటంతో జనం ఆందోళనకు గురయ్యారు. చినగంజాం మండలంలోని పెదగంజాం పల్లెపాలెం సముద్ర తీరం వెంబడి వేప చెట్టు కింద 5 కాకులు, 3 గోరింకలు చనిపోయి ఉండటాన్ని సోమవారం స్థానికులు గమనించారు. గ్రామంలోకి సమాచారం చేరవేయడంతో బర్డ్ ఫ్లూ వల్లే అలా జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు సత్వరం స్పందించారు. పెదగంజాం గ్రామ కార్యదర్శి భారతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పక్షుల కళేబరాలను అక్కడి నుంచి తొలగించి వెంటనే పూడ్చి వేయించారు. విషయం తెలుసుకున్న పలు మీడియా చానళ్లు బర్డ్ ఫ్లూ అంటూ.. ప్రచారం చేశాయి. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులు, పశు వైద్యాధికారులతో ‘సాక్షి’ మాట్లాడి వివరణ తీసుకుంది. తీరం వెంబడి చెట్ల వద్ద పక్షులు నిత్యం నివాసం ఉంటుంటాయని, ఆ సమీప ప్రాంతాలలో వేరుశనగ సాగవుతున్న నేపథ్యంలో రైతులు పంటకు సత్తువ కోసం గుళికల మందు వాడుతుంటారని, అది కలిసిన నీటిని తాగి పక్షులు చెట్టు మీద సేదతీరిన సందర్భల్లోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకొనే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అపోహలు, ఆందోళన వద్దు: డాక్టర్ బసవశంకర్, ప్రాంతీయ పశువైద్య సహాయ సంచాలకులు పల్లెపాలెంలో పక్షులు చనిపోయిన విషయం మా దృష్టికి వచ్చింది. మేం వెళ్లేలోగా అధికారులు వాటిని పూడ్చి పెట్టారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో నుంచి సమాచారం సేకరించాం. గుంటూరు, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో పక్షుల కళేబరాలు పరీక్షించే ల్యాబ్ రేటరీలున్నాయి. బర్డ్ ఫ్లూకు సంబంధించి దేశంలో భోపాల్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్‌లో మాత్రమే నిర్దారణ చేస్తారు. పరీక్షిస్తేనే ఏవిషయం తెలుస్తుంది. భవిష్యత్‌లో ఇలా పక్షులు చనిపోతే సత్వరం తమకు సమాచారం ఇవ్వాలని సూచించాం. బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన అవసరం లేదు. మన దేశంలో 150 నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చికెన్‌ను ఉడికిస్తారు చికెన్ తినడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం లేదు. -
బర్డ్ ఫ్లూ: చికెన్ తిందామా.. వద్దా?!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాలేదు. మరో వైపు యూకే కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి ప్రారంభమయ్యింది. ఇప్పటికే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుండగా.. తాజాగా బర్డ్ ఫ్లూ నేనున్నానంటూ భయపెడుతుంది. ఇప్పటికే కేంద్రం 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బర్డ్ ఫ్లూ అనేది జూనోటిక్ వైరస్. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. దాంతో ప్రస్తుతం జనాలు చికెన్, గుడ్డు తినాలంటే భయపడుతున్నారు.. సందేహిస్తున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న ఈ కాలంలో చికెన్, గుడ్లు తినడం సేఫేనా అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇది చదవాల్సిందే.. ఇక బర్డ్ ఫ్లూ వ్యాప్తి ప్రారంభం కాగానే ఇలాంటి వార్తలు తెగ ప్రచారం అవుతాయని తెలిసే కేంద్ర పంశు సంవర్ధక మంత్రి గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. చికెన్, గుడ్లను తినాలంటే.. ముందుగా వాటిని బాగా ఉడికించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రత వద్ద.. ఎక్కువ సమయం ఉడకడం వల్ల వైరస్ ప్రమాదం తొలుగుతుందన్నారు. ఇక ఇది హీట్ సెన్సెటివ్ వైరస్ కావడం వల్ల గుడ్లను ఉడికించేటప్పడు.. పచ్చసొన, తెల్ల సొన గట్టి పడేవరకు.. మాంసం ఉడికించేటప్పుడు దాని మధ్యలో గులాబి రంగు కనపడనంత వరకు ఉడికించాలని.. అప్పుడే తినాలని తెలిపారు. (చదవండి: అది బర్డ్‌ఫ్లూ కాదు.. ) కలుషితమైన మాంసం ద్వారా బర్డ్ ఫ్లూ మానవులకు సంక్రమిస్తుందనే భయాన్ని ప్రభుత్వం తొలగించింది, "భారతదేశంలో, ఈ వ్యాధి ప్రధానంగా వలస పక్షుల ద్వారా వ్యాపిస్తుంది" అని పేర్కొంది, అయితే " బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల ద్వారా వైరస్ మనుషులకు సంక్రమించే ప్రమాదాన్ని తోసిపుచ్చలేము" అన్నారు. ప్రస్తుతం అధికారులు చనిపోయిన పక్షులను సేకరించి, లాలాజలం, రక్తం, బిందువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా.. లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నమూనాలను సేకరించే సమయంలో వారంతా తప్పక పీపీఈ కిట్లు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక మాంసం అమ్మకదారులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం అధికంగా ఉందని.. వారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. (చదవండి: 120 నాటుకోళ్లు మృతి..బర్డ్ ఫ్లూ అనుమానం) గత కొన్నేళ్లుగా బర్డ్ ఫ్లూ మానవులకు సంక్రమించిన దాఖలాలు లేవు. అయితే 1997 లో హాంకాంగ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్5ఎన్1.. 80 మందికి సోకగా.. ఒకరు చనిపోయారు. ఇక వైరస్ మానవుల నుంచి మానవులకి బదిలీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. పక్షుల మధ్య కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తిని తనిఖీ చేయడానికి, ప్రభావిత రాష్ట్రాలు పౌల్ట్రీ మార్కెట్లను తాత్కాలికంగా మూసివేసాయి.. వైరస్ సోకిన పక్షులను చంపడం ప్రారంభించాయి. పక్షుల దిగుమతిని నిషేధించాయి. జంతుప్రదర్శనశాలలు, అభయారణ్యాల చుట్టూ "బయో-బబుల్స్"ని ఏర్పాటు చేశాయి. వ్యవసాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కలుసుకుని దేశంలో జంతువుల వ్యాక్సిన్ల లభ్యతను పరిశీలించింది. -
బర్డ్‌ఫ్లూ: పక్షులనుంచి మనుషులకు వస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ : గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్ పక్షులనుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు సోకే అవాకాశం చాలా అరుదని ప్రముఖ ఢిల్లీ వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉడికీ ఉడకని చికెన్ తినటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ సోకిన పక్షుల లాలాజలం, వ్యర్ధాల ద్వారా మనషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. కలుషిత ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. గాల్లో ఉన్న వైరస్‌ను పీల్చటం ద్వారా, వైరస్‌తో కలుషితమైన ప్రదేశాలను తాకి ఆ వెంటనే ముక్కు, కళ్లను ముట్టుకోవటం ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ( అది బర్డ్‌ఫ్లూ కాదు..) జ్వరం, దగ్గు, గొంతునొప్పి, కారే ముక్కు, ఒంటి నొప్పులు, తల నొప్పి, కళ్లు ఎర్రగా అవ్వటం వంటివి వైరస్ లక్షణాలుగా పేర్కొంది. ఇది మామూలు జలుబు లాంటిదేనని, కానీ, కొంతమందికి ఎక్కువ ప్రమాదకారిగా మారుతుందని తెలిపింది. గర్భిణులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, 65 సంవత్సరాల వయసు పైబడ్డవారికి ఎక్కువ నష్టం కలుగుతుందని వెల్లడించింది. ఈ వైరస్‌పై డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ యాట్ పోర్టిస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జేసీ సూరి మాట్లాడుతూ.. ‘‘ కోళ్ల ఫారాలలో పనిచేసేవారు పీపీఈ కిట్లు ధరించాలి. గ్లోజులు కూడా ధరించాలి. ఎప్పటికప్పుడు కలుషిత ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేసుకోవాలి’’ అని తెలిపారు. -
అది బర్డ్‌ఫ్లూ కాదు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కోళ్లు చనిపోయిన ఘటనలపై పశు సంవర్థక శాఖ స్పందించింది. కోళ్లు చనిపోయింది బర్డ్‌ఫ్లూ వల్ల కాదని స్పష్టం చేసింది. వారం రోజుల కిందట పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలంలో 35 కోళ్లు చనిపోయాయని, అయితే పోస్టుమార్టంలో అవి రానికేట్ వ్యాధి వల్ల చనిపోయినట్టు తేలిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్ రాంచందర్ శుక్రవారం ‘సాక్షి’కి వెల్లడించారు. అవి కూడా ఒకే రోజు చనిపోలేదని, వారం రోజుల పాటు రోజుకు 5–10 చొప్పున చనిపోయినట్లు తేలిందని చెప్పారు. దీంతోపాటు వరంగల్ అర్బన్ జిల్లాలోని ఓ కోళ్లఫారంలో వ్యక్తిగత కారణాలతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని కోళ్లను చంపేశారని, పోస్టుమార్టంలో కూడా వాటిని చంపినట్లు తేలిందని ఆయన చెప్పారు. అసలు రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. (చదవండి: వేటగాళ్ల పాపమా?.. బర్డ్‌ఫ్లూ శాపమా?) అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య బృందాలు విస్తృతంగా పర్యటిస్తున్నాయని, శాంపిళ్లు సేకరించి పరీక్షలు జరుపుతున్నాయని స్పష్టం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా బుదేరా గ్రామంలో కొన్ని కోళ్లు చనిపోయిన సంఘటనపై విచారణ చేయగా విష ప్రయోగం వల్ల అవి చనిపోయాయని, ఈ మేరకు పోలీసు కేసు కూడా నమోదయినట్లు తమకు నివేదిక అందిందని ఆయన వివరించారు. ఇక మెదక్‌జిల్లా మునుపల్లి గ్రామంలో ఏడు నెమళ్లు చనిపోగా, అధికారులు పోస్టుమార్టం చేయించారని.. వాటి కడుపులో ఎక్కువ మొత్తంలో వడ్లు కనిపించాయని, పురుగు మందు మోతాదు ఎక్కువగా ఉన్న వడ్ల కారణంగానే నెమళ్లు చనిపోయినట్లు తేలిందని రాంచందర్ వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ప్రవేశించలేదని, ఆందోళన చెందవద్దని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అనవసరపు ప్రచారాల గురించి భయపడొద్దని, పశుసంవర్థక శాఖ అప్రమత్తంగా ఉందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
120 నాటుకోళ్లు మృతి..బర్డ్ ఫ్లూ అనుమానం
భీమదేవరపల్లి: వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన గద్ద సారయ్యకు చెందిన 120 నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. సారయ్య కొన్ని నెలలుగా నాటు కోళ్లు పెంచి విక్రయిస్తూ జీననోపాధి పొందుతున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే అవి మృతి చెందడంతో దాదాపు రూ.లక్ష మేరకు నష్టపోయినట్లు తెలిపారు. చనిపోయిన కోళ్లను మండల పశువైద్యాధికారి మాలతి పరిశీలించారు. నమూనాలను పరీక్ష నిమిత్తం వరంగల్ ప్రాంతీయ పశు వైద్యశాలకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కాగా, పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ సోకుతుందనే ప్రచారం నేపథ్యంలో ఒకేసారి భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడం కలకలం రేపుతోంది. -
ప్రత్యేక బృందాలు.. పటిష్ట చర్యలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ వైరస్‌పై రాష్ట్రం అప్రమత్తమైంది. ఇప్పటికే రాజస్తాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లో ఈ వ్యాధి కారణంగా వేలాది పక్షులు మృత్యువాత పడడం, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి సమీపంలోనూ ఇలాంటి సంఘటనే జరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ వైరస్ నిరోధానికి రాష్ట్ర యంత్రాంగం పటిష్ట చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పశుసంవర్థక శాఖ దాదాపు 1,300 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కోళ్లు, ఇతర పక్షుల నుంచి 276 శాంపిల్స్ సేకరించింది. పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు కనిపించనప్పటికీ రాష్ట్రంలోకి ఈ వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనికోసం తగిన వ్యాక్సినేషన్ (కెమికల్) ఏర్పాట్లూ చేస్తోంది. ఒకవేళ రాష్ట్రంలోకి వైరస్ ప్రవేశిస్తే ఏం చేయాలనే దానిపైనా కార్యాచరణ రూపొందించినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, 2016లో బర్డ్ ఫ్లూ సోకిన కారణంగా రాష్ట్రంలో లక్షకు పైగా కోళ్లను ఖననం చేశారు. పౌల్ట్రీ ఫాంలకు 3–5 కిలోమీటర్ల దూరంలోని కోళ్లనూ పూడ్చిపెట్టారు. మనకు అవకాశం తక్కువే.. రాష్ట్రంలోకి బర్డ్ ఫ్లూ ప్రవేశించే అవకాశాలు తక్కువేనని పశుసంవర్థక శాఖ అంచనా వేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కాకులు, బాతుల్లో మాత్రమే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నందున మన రాష్ట్రంలోని కోళ్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని భావిస్తోంది. అలాగే కోడి మాంసం ఉడకబెట్టిన తర్వాతే తింటారు కనుక మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు లేవని, రాష్ట్రం నుంచి గుడ్లు, కోళ్లు ఎగుమతి చేయడమే కానీ, దిగుబడి చేసుకునే పరిస్థితి లేనందున ఈ వ్యాధి వచ్చే అవకాశం తక్కువంటోంది. భయపడొద్దు: మంత్రి తలసాని రాష్ట్రంలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. వైరస్ నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ఉన్నతస్థాయి అధికారులతో మాసబ్‌ట్యాంక్ లోని తన కార్యాలయంలో బుధవారం ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, ఆ శాఖ అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి, మన రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితి గురించి మంత్రికి అధికారులు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యల కారణంగా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదన్నారు. 1,300 బృందాలు నిరంతరం వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. అన్ని స్థాయిల్లోని అధికారులనూ అప్రమత్తం చేశామని వివరించారు. కోళ్ల పరిశ్రమ విషయంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని, అనవసరపు అపోహలకు తావివ్వొద్దని కోరారు. -
బర్డ్ ప్లూ: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ) వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్ తివారీ లేఖ రాశారు. కేంద్రం ఆదేశాల మేరకు పీసీసీఏఫ్ ఆర్ శోభ.. చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులను అప్రమత్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో చాలా పక్షులు చనిపోతున్నాయి. ఇందులో వలస పక్షులు కూడా ఉన్నాయి. వాటి నమూనాలను ఐసీఏఆర్- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీసెస్, భోపాల్‌లో పరీక్షిస్తే హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్రం తెలిపింది. చదవండి: (బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?) తాజా పరిస్థితుల్లో ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. పక్షులను పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని పెంచడంతో పాటు వాటిపై నిఘా ఉంచాలి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే అరికట్టేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలని కోరింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పక్షులు కూడా ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. దీంతో తెలంగాణ అటవీ శాఖ కూడా అప్రమత్తం అయ్యింది. జూ పార్క్‌లతో పాటు, అటవీ ప్రాంతంలో ఏవైనా అసహజ మరణాలు ఉంటే నమోదు చేయాలని, తగిన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని ఆదేశించారు. ఈ సీజన్ లో వలస పక్షుల సంచారం ఉంటుందని వాటిని కూడా పర్యవేక్షించాలని తెలిపారు. ఎవరికైనా సంబంధించిన సమాచారం ఉంటే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 18004255364కు ఫోన్ చేయాలని కోరారు. చదవండి: (దేశంలో కొత్త విపత్తు) -
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ లేదు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా.అమరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. కేరళ, రాజస్ధాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ ఉందని, ఇప్పటివరకు ఏపీలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు నిరభ్యంతరంగా చికెన్ తినొచ్చని చెప్పారు. అన్ని జిల్లాల్లో పశు సంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించామని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ పరిశ్రమ కూడా అప్రమత్తంగానే ఉందన్నారు. (చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్త కరోనా) బుధవారం నాడు ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ "ఏపీలో ఏటా సుమారు లక్షకు పైగా పక్షులు వలస వస్తుంటాయి. కొల్లేరు, పులికాట్, నేలపట్టు, కోరంగి ప్రాంతాలకి పక్షులు ఎక్కువ వలస వస్తుంటాయి. వలస పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ, వైద్య ఆరోగ్య శాఖలతో కలిసి పర్యవేక్షణ చేస్తున్నాం. బర్డ్ ఫ్లూ లక్షణాలతో పక్షులు, కోళ్లు చనిపోతే మా దృష్టికి తీసుకురావాలని అటవీ శాఖని కోరాం. ఏవైనా కేసులు వస్తే భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. పరిస్ధితులను బట్టి జిల్లా స్ధాయిలో కలెక్టర్ల అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం" అని అమరేంద్ర కుమార్ తెలిపారు. (చదవండి: బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?) బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ హైదరాబాద్: ఇప్పటికే కరోనాతో హడలెత్తిపోనున్న జనాలకు బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వెటర్నరీ, పశు సంవర్ధక శాఖలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ రాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. వలస పక్షుల రాకపై ఆరా తీసి అప్రమత్తం కావాలని సూచించారు. ప్రతిరోజు ఫౌడ్రీ ఫారాల్లో చనిపోయే కోళ్ల శాంపిల్స్‌ను వీబీటీఐకి పంపి పరీక్షించాలని ఆదేశించారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ..బర్ద్ ఫ్లూ విషయంలో ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. 1300 మందితో ఉన్న టీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫామ్‌లలో తిరుగుతూ సూచనలు తీసుకుంటున్నారని చెప్పారు. వలస పక్షుల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉండొచ్చే తప్ప ఫ్లూ ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అధికారులంతా అలర్ట్‌గా ఉన్నారని తెలిపారు. -
మైసూరులో బర్డ్ ఫ్లూ
మైసూరు: కర్ణాటకలో బర్డ్ ఫ్లూ వెలుగుచూసింది. మంగళవారం మైసూరు పరిసరాల్లో పలు కోళ్ల ఫారాలపై మున్సిపల్, వైద్యారోగ్య అధికారులు దాడులు నిర్వహించి, సుమారు 3–4 వేల కోళ్లను సజీవంగా పాతిపెట్టారు. ఇటీవల మైసూరు చెరువు వద్ద పక్షులు ఆకస్మికంగా మృత్యువాత పడ్డాయి. దీనికి బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైంది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేలాది కోళ్లను పాతిపెట్టారు. కోళ్ల ఫారాల యజమానులు లబోదిబోమన్నా పట్టించుకోలేదు. నగరం చుట్టుపక్కల చికెన్‌ను, కోళ్లను అమ్మరాదని, హోటళ్లలో చికెన్ వంటకాలను విక్రయించరాదని మైకుల్లో ప్రచారం చేశారు. -
పెంపుడు జంతువులతో జర జాగ్రత్త..!
సాక్షి, ఖమ్మం: పిచ్చికుక్క కాటుకు రేబిస్ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాను జూలై 6న కనుగొన్నారు. ఆ రోజును ప్రపంచ వ్యాప్తంగా ‘జూనోసిస్ డే’ను జరుపుకుంటారు. పశువులు, జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు సంక్రమించే వ్యాధులను జోనోటిక్’ వ్యాధులు అంటారు. ఈ వ్యా«ధులు ప్రమాదకరమైనవి. మరణాలు కూడా సంభవిస్తాయి. 1885 జూలై 6న లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్) నివారణకు రేబిస్ టీకాలను కుక్క కాటుకు గురైన జోసెఫ్ మీస్టర్ అనే బాలుడిపై ప్రయోగించి విజయం సాధించారు. అప్పటి నుంచి పెంపుడు జంతువులకు రాబిస్ వ్యాధి సోకకుండా యాంటీరాబిస్ టీకాను ఇస్తారు. జోనోటిక్ వ్యాధి కారణంగా మరో 200 వ్యాధులు సంక్రమిస్తాయి. మానవుడు పాలు, మాంసం, కోసం పెంపుడు జంతువులను, కోళ్లను పెంచుతుంటారు. మానసిక ఉల్లాసం కోసం కుక్కలను పెంచుతున్నారు. పెంపుడు జంతువులు, కోళ్ల పెంపకం వలన కూడా మానవుడు అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. ప్రపంచంలో ప్రతి ఏటా దాదాపు 20 వేల మందికి పైగా రేబిస్ వ్యాధి వలన మరణిస్తున్నారు. 3 మిలియన్ల మంది పిచ్చికుక్కల కాటున పడి రేబిస్ వ్యాధి టీకాలు చేయించుకుంటున్నారు. 1995లో ప్రపంచంలో రేబిస్ వ్యాధి కారణంగా దాదాపు 70 వేల మంది మరణించారు. వీరిలో 35 వేల మంది భారతీయలు ఉన్నారు. పొలం పనులు చేసే రైతులు, తోళ్ల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వ్యాధులు సోకి చనిపోయిన జంతువుల మాంసాన్ని తినేవాళ్లు, పెంపుడు కుక్కలతో సన్నిహితంగా మెలిగే వారు జోనోటిక్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. జోనోటిక్ వ్యాధుల రకాలు, వాటి నివారణపై ఖమ్మం పశువ్యాధి నిర్దారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు డాక్టర్ అరుణ వివరించారు. జోనోటిక్ వ్యాధి 7 రకాలు ► బ్యాక్టీరియా: ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ లెప్టోస్పైరోసిస్, క్షయ ► వైరస్: రేబిస్, బర్డ్‌ఫ్లూ, మెదడు వాపు, సార్స్, మేడ్‌కౌడిసీజ్ ► ప్రొటోజోవా: టాక్సోప్లాస్మోడియా, లీష్మెనీయాసిస్ ► రెకెట్చియా: టిక్, టైఫస్, క్యూఫీవర్ ► హెల్నింథ్స్: ఎకైనోకోకోసిస్, టీనియాసిస్ ► ఎక్టోపారసైట్స్: స్కేజిస్ పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్): పిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందే అతి భయంకరమైన వ్యాధి రేబిస్. పిచ్చికుక్కల లాలాజలంలో వ్యాధికారకం ‘రేబిస్’ వైరస్ ఉంటుంది. మనుషుల శరీరంపై ఉన్న పుండును నాకినా లాలాజలం ద్వారా వ్యాధి సోకుతుంది. కుక్క కరిచిన వారం నుంచి 10 రోజుల లోపుగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ♦ మనుషుల్లో ఈ వ్యాధిని హైడ్రోఫోబియా అంటారు. ♦ ఈ వ్యాధి సోకిన మనిషి గుటక వేయలేడు. ♦ దాహం వేస్తున్నా నీళ్లు తాగలేరు. నివారణ: కుక్క కరిచిన వెంటనే ఆ భాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. డాక్టర్‌ను సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి. పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. బర్డ్‌ప్లూ వ్యాధి బర్డ్‌ఫ్లూ లేదా ఇన్‌ప్లూయాంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్ వలన కలిగే వ్యాధి. ఈ వైరస్‌లో 144 ఉపరకాలున్నాయి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవాళికి సంభవిస్తుంది. 1997లో ఖండాతర వ్యాధిగా రూపొంది చాలా దేశాల్లో కోట్లాది కోళ్లు మరణించాయి. ఈ వ్యాధి సోకిన కోళ్లు, పక్షులు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్ల కలకలతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. మెదడు వాపు ఇది వైరస్ వలన కలిగే వ్యాధి. వ్యాధి కారక వైరస్ క్రిములు పందుల నుంచి దోమకాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఇళ్ల దగ్గర పందుల సంచారం లేకుండా చూసుకోవాలి. దోమల నివారణ చర్యలు చేపట్టి ఈ వ్యాధిని అరికట్టుకోవాలి. ఆంత్రాక్స్ దోమ వ్యాధి ఈ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. జంతువులు, మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది. బ్రూసెల్లోసిస్ ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్ బూసెల్లా మెలిటెన్సిస్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ వ్యాధి అన్ని జాతుల పశువులకు, మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వచ్చి ఈసుకుపోతాయి. మగ పశువుల్లో తాత్కాలికంగా లేదా శాశ్వితంగా వ్యందత్వం ఏర్పడుతుంది. జోనోటిక్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ⇒∙జోనోటిక్ వ్యాధులన్నీ పశువులకు సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ⇒ వీధి కుక్కలకు యాంటీరేబిస్ టీకాలు వేయించి లైసెన్సులు ఇవ్వాలి. ⇒ పెంపుడు జంతువులతో, కోళ్లతో సన్నిహింతగా మెలిగే వాళ్లు జోనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. -
బర్డ్ ఫ్లూ భయం
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం మాంస ప్రియులను భయపెడుతోంది. యలహంక పరిధిలోని దాసరహళ్లిలో బర్డ్ ఫ్లూను అధికారులు గుర్తించిన నేపథ్యంలో నగరంలో చికెన్ అమ్మకాలు అమాంతం పడిపోయాయి. మూడు రోజుల ముందుతో పోలిస్తే శుక్రవారం నాటికి నగర వ్యాప్తంగా చికెన్, గుడ్ల అమ్మకాలు దాదాపు 25 శాతం పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. కాగా, బర్డ్ ఫ్లూ కనిపించిన దాసరహళ్లి ప్రాంతంలో మరో 15 రోజుల పాటు మాంసం దుకాణాలను మూసివేయనున్నారు. నగరంలోని దాసరహళ్లి ప్రాంతంలో మంగళవారం రోజున అధికారులు బర్డ్ ఫ్లూను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూను గుర్తించిన ఫారమ్‌లో ఉన్న 900కు పైగా కోళ్లను అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చంపేశారు. ఇక ఇదే సందర్భంలో ఈ వ్యాధి మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. 25 శాతం తగ్గిన అమ్మకాలు... బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో నగరంలో ఈ మూడు రోజుల్లోనే చికెన్, గుడ్ల అమ్మకాలు దాదాపు 25 శాతం పడిపోయాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై కర్ణాటక పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ బ్రీడర్స్ అసోషియేషన్ (కేపీఎఫ్‌బీఏ) ప్రతినిధి డాక్టర్ బి.జి.పుట్టణ్ణ మాట్లాడుతూ... ‘బెంగళూరులో సాధారణంగా ప్రతి రోజూ 4 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే బుధవారంతో పోలిస్తే శుక్రవారం నాటికి అమ్మకాలు 25 శాతం మేరకు పడిపోయాయి. ముఖ్యంగా నగరంలోని ప్రముఖ మార్కెట్లలో ఒకటైన రసల్ మార్కెట్లో చికెన్, గుడ్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. కొనుగోలు దారులు తమ ఆరోగ్య రక్షణపై ఆందోళనతో చికెన్ కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయినా ప్రస్తుతం బర్డ్ ఫ్లూకు గురైంది నాటుకోళ్లు మాత్రమే, బాయిలర్ కోళ్లలో ఈ లక్షణాలు కనిపించలేదు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు. 15 రోజుల పాటు దుకాణాల మూసివేత... కాగా, బర్డ్ ఫ్లూను గుర్తించిన దాసరహళ్లి ప్రాంతానికి 15 కిలోమీటర్ల పరిధిలో మాంసం దుకాణాలను అధికారులు పూర్తిగా మూసేశారు. ఈ విషయంపై రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజ్‌కుమార్ ఖత్రి మాట్లాడుతూ...‘బర్డ్ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గాను అమృతహళ్లి, థనిసంద్ర, కాడుగోనహళ్లి ప్రాంతాల్లోని ప్రాధమిక వైద్య శిబిరాల్లోని సిబ్బందితో పాటు అంగన్వాడీ, ఆశాకార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఈ విషయంపై అవగాహన కల్పించనున్నారు. దాసరహళ్లి ప్రాంతంలో కోళ్లను చంపే ప్రక్రియను కేంద్రం నుండి వచ్చిన వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ప్రజలు బర్డ్ ఫ్లూకు సంబంధించిన ఏదైనా సమస్యలపై సహాయం కోసం సహాయవాణి కేంద్రాలకు 1800–425–0012 లేదా 080–23417100 నంబర్లలో సంప్రదించవచ్చు’ అని తెలిపారు. కాగా, మాంసప్రియులు ఈ విషయం పైఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ‘చికెన్, గుడ్లను 70 డిగ్రీల సెల్సియస్‌కు పైన ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఎదురవ్వదు. ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత వద్ద బర్డ్ ఫ్లూను కలిగించే వైరస్ పూర్తిగా చనిపోతుంది. సరిగ్గా ఉండికించకుండా చికెన్‌ను తిన్న సందర్భాల్లోనే వైరస్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి’ అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆనిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బైరేగౌడ వెల్లడించారు. -
కోళ్లను వధించడానికి సైనికులు!
టోక్యో: జపాన్ కోళ్ల పరిశ్రమను బర్డ్ ఫ్లూ అతలాకుతలం చేస్తోంది. వ్యాధి సోకిన కోళ్లను వధించడం కోసం వందలాది సైనికుల సహాయాన్ని ఆ దేశం తీసుకుంటుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మొదటగా గత నవంబర్‌లో అమోరీ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వైరస్‌ను గుర్తించిన అనంతరం భారీ సంఖ్యలో కోళ్లను జపాన్ వధించింది. తాజాగా దేశ ఈశాన్య ప్రాంతంలోని మియాగిలో 2,20,000 కోళ్లను, టోక్యో సమీపంలో 68,000 కోళ్లను వధించేందకు సైనికుల సహాయం తీసుకుంటున్నట్లు ఫామ్ మినిస్ట్రీ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. దీంతో నవంబర్ నుంచి ఇప్పటివరకు ఆ దేశం వధించిన కోళ్ల సంఖ్య 167 లక్షలకు చేరుకోనుంది. 370 మంది సైనిక బృందాన్ని కోళ్లను వధించడానికి పంపినట్లు జపాన్ డిఫెన్స్ మినిస్ట్రీ ధృవీకరించింది. -
తోడు లేని జీవితం
తోడు లేకపోతే... లైఫ్ అంటేనే మొహం మొత్తుతుంది. ఈ కారణంగానే ఢిల్లీ జూలో కొన్ని జంతువులు లైఫ్లెస్గా గడుపుతున్నాయి. అక్కడిప్పుడు రెండు ఆడ ఖడ్గమృగాలు, ఒక ఆడ హైనా, ఒక మగ ఆఫ్రికన్ ఎలిఫెంట్, ఒక మగ చిరుత, ఇంకో మగ నల్లచిరుత... తోడు లేక డల్‌గా ఉంటున్నాయి. ఏడాది క్రితం బర్డ్‌ఫ్లూ జాడలు కనిపించడంతో జూ లోకి కొత్త జంతువుల్ని, పక్షుల్ని తీసుకురావడం ఆపేశారు. అంతకు ముందే వీటి జతలు కొన్ని అనారోగ్యంతో మరణించాయి. అప్పట్నుంచి ఇవి ఒంటరిగా ఈసురోమని కాలం గడుపుతున్నాయి. సందర్శకుల్ని ఏమాత్రం ఎక్సైట్ చేయడం లేదు కూడా. పరిస్థితి ఇలాగే ఉంటే జూ ఫేస్‌వాల్యూ పడిపోతుందని నేషనల్ జూలాజికల్ పార్క్ అధికారులు తక్షణం అనుసరించాల్సి వ్యూహం గురించి ఆలోచిస్తున్నారు. -
బర్డ్‌ఫ్లూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండండి
పశువైద్యులను ఆదేశించిన పశుశాఖ ఏడీలు అనంతపురం అగ్రికల్చర్ : ప్రమాదకరమైన బర్డ్‌ఫ్లూ వ్యాధిపై పశువైద్యులు నిఘా పెంచాలని పశు సంవర్ధకశాఖ 'అనంత' డివిజన్ ఏడీ డాక్టర్ టి.శ్రీనాథాచార్, సాయినగర్ పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర అన్నారు. గురువారం స్థానిక డివిజన్ ఏడీ కార్యాలయంలో 14 మండలాల పశు వైద్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏడీలు మాట్లాడుతూ కర్ణాటకలోని బెల్గాం తదితర ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించినందున, ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో లక్షణాలు ఎక్కడా కనిపించకున్నా ప్రాణాంతకమైన వ్యాధిని అరికట్టే క్రమంలో కోళ్ల ఫారాలను పరిశీలించి, అనుమానంగా ఉన్న వాటి నుంచి నమూనాలు తీసి పంపాలని ఆదేశించారు. కోళ్లకు వ్యాపించిన తర్వాత ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉన్నందున హెచ్–1–ఎన్–1 వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. కోళ్లు, వణ్యప్రాణులు, వలస పక్షులపై నిఘా పెంచాలన్నారు. ఈ వ్యాధి పరిశీలనకు వచ్చే నెల జాతీయ స్థాయి బృందం పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 3న వెటర్నరీ దినోత్సవం సందర్భంగా ఆస్పత్రుల పరిధిలో గర్భకోశవ్యాధి ఉన్న 100 పశువులు, రైతుల వివరాలు అందజేయాలన్నారు.కరువు సహాయక చర్యల్లో భాగంగా దాణా, టీఎంఆర్ బ్లాక్స్, సైలేజ్ బేల్స్ ఇస్తున్నట్లు తెలిపారు. మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులను గుర్తించి గడ్డిని సైలేజ్ బేల్స్ తయారీకి ఇచ్చేలా ఒప్పించాలని సూచించారు. -
ప్రాణాంతక బర్డ్ ఫ్లూ కలకలం
టోక్యో: ప్రాణాంతకమైన బర్డ్ ఫ్లూ వ్యాధి జపాన్ ను వణికిస్తోంది. అత్యంత వ్యాధికారకమైన హెచ్ 5 ఎన్6 వైరస్ పౌల్ట్రీ, ఇతర అడవి జాతి పక్షులు, జపాన్ లోని బహుళ ప్రదేశాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో గుర్తించడం ఆందోళనకు దారి తీసింది. అతి ప్రమాదకరమైన హెచ్5ఎన్6 వైరస్ ను నిర్ధారించినట్టు నివేదికలు వెల్లడించాయి. దీంతో లక్షలాది కోళ్లన ఏరిపారేస్తున్నారు. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తిపై జపాన్ ప్రభుత్వం స్పందించింది. తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది. పసిఫిక్ ఐలాండ్ లో మంగళవారం 3, 10.000 కోళ్లను నిర్మూలించినట్టు జిన్హువా న్యూస్ వెల్లడించింది. గతంలో సుమారు 40 కోళ్లు చనిపోవడంతో జరిగిన పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఉనికిని నిర్ధారించింది. అత్యధికనష్టం కలిగించే అంటురోగ కారక క్రిమిని గుర్తించినట్టు తేల్చింది. దీంతో నియోగాటా, అయోమోరి ప్రదేశాలకు సమీపంలోని 10 కి.మీ దూరంలో గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాను స్థానిక ప్రభుత్వం సంస్థ నిషేధించింది. ఈ విషయంలో సంబంధిత అధికారులు సహకరించాల్సిందిగా ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలు, సంస్థలకు జపాన్ ప్రధాని షింజో అబే ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇటీవల బర్డ్ ఫ్లూ వ్యాప్తికి సంబంధించి గరిష్టంగా బర్ద్ ఫ్లూ వైరస్ నమునా-3 హెచ్చరికలను జారీ చేసిన సంగతితెలిసిందే. -
బర్డ్‌ఫ్లూపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: దేశంలోని కొన్నిప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ(ఏహెచ్5ఎన్8 వైరస్) కలకలం రేపుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలకు సూచనలు జారీచేసింది. ఢిల్లీ, గ్వాలియర్(మధ్యప్రదేశ్), కేరళలోని కొన్ని పక్షులకు ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఏహెచ్5ఎన్8 వైరస్ మనుషులకు అంటుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయినప్పటికీ కేంద్రం ముందుజాగ్రత్తగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచనలు జారీచేసిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా చెప్పారు. చనిపోయిన, గాయాలైన పక్షుల విషయంలో సంబంధిత వ్యక్తులు రక్షణాత్మక చర్యలు తీసుకోవాలన్నారు. -
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు: తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకలేదని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. పశుసంవర్థక శాఖ పరిధిలో ఉన్న వివిధ సొసైటీల ప్రతినిధులతో శుక్రవారం ఆయన సచివాలయంలో సమీక్షించారు. వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వెటర్నరీ పోస్టుల భర్తీని శాఖాపరంగా నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. నెలకో జిల్లా పర్యటిస్తానని, ఈ నెల 18న నల్లగొండ జిల్లాలో పర్యటించి వివిధ సొసైటీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తానని పేర్కొన్నారు. కులానికి 10 సంఘాలు కాకుండా ఎన్నికలు నిర్వహించుకుని ఒక జిల్లాలో ఒకటే వృత్తి సంఘం నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా గొర్రెలు, మేకల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. రూ.48.35 కోట్లతో మత్స్య శాఖ పరిధిలోని 4,695 చెరువుల్లో నీటి విస్తీర్ణం ఆధారంగా చేపల విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పారు. రూ.16.48 కోట్లతో 100 యూనిట్లలో కేజ్ కల్చర్ పద్దతిన చేపల పెంపకం చేపడతామన్నారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా తదితరులు పాల్గొన్నారు. -
లక్షన్నర కోళ్లను చంపేశారు
చికెన్ కొనుగోలును నిలిపివేసిన మైసూరు జూ అధికారులు కొన్ని జాగ్రత్తలతో బర్డ్‌ఫ్లూ దూరం : నిపుణులు బెంగళూరు : రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ నివారణా చర్యలు యుద్ధ ప్రతిపాదికన సాగుతున్నాయి. అందులో భాగంగా బర్డ్‌ఫ్లూ సోకిన పక్షులను నిపుణులు బృందం వైజ్ఞానికంగా సంహరిస్తోంది. రాష్ట్రంలోని బీదర్ జిల్లా హొమ్నాబాద్ తాలూకా మార్కెర గ్రామంలో బర్డ్‌ఫ్లూతో 20 వేల కోళ్లు చనిపోగా అక్కడే వివిధ కోళ్ల ఫారంలలో ఉన్న మరో 1.50 లక్షల కోళ్లను చంపడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశుసంవర్థకశాఖ అధికారులు 50 బృందాలను ఏర్పాటు చేసి బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లను మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చంపేశారు. ఇందు కోసం నాలుగు వేల సంచులను సిద్ధం చేసుకుని 200 గుంతలను తవ్వారు. ఒక్కొక్క సంచిలో నలభై నుంచి యాభై కోళ్లను వేసి అటుపై గుంతల్లో వేసి మట్టితో కప్పేశారు. ఈ పనిలో నిమగ్నమైన వారికి మాస్క్‌లు, ప్రత్యేక దుస్తులను అందజేశారు. కాగా, పక్షలను వైజ్ఞానికంగా చంపే కార్యక్రమం సోమవారమే జరగాల్సి ఉండగా వర్షం వ ల్ల ఈ పనిని మంగళవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా బర్డ్‌ఫ్లూ విషయమై ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్రంలోని వివిధ జూ సిబ్బంది అక్కడి జంతువులకు కోళ్లను ఆహారంగా వేయడాన్ని నిలిపివేశాయి. అంతేకాకుండా పక్షులు ఉన్న ఎన్‌క్లోజర్స్‌ను పూర్తిగా శుభ్రం చేసి వాటి శ్యాంపిల్స్‌ను కూడా పరీక్ష కోసం లాబొరేటరీలకు పంపించారు. ఈ విషయమై మైసూరు జూ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.వెంకటేషన్ మాట్లాడుతూ...‘మా జూలో బర్డ్‌ఫ్లూ సోకిన దాఖలాలు ఏవీ కనబడలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చికెన్ కొనుగోలును నిలిపివేశాం.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పక్షుల ద్వారా మనుషులకు కూడా బర్డ్‌ఫ్లూ (ఏవీఎన్ ఇన్ఫ్లూఎంజా-ఎచ్5ఎన్1) వ్యాధి సోకే అవకాశం ఉంది. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో ప్రజలకు ఎవరికీ కూడా బర్డ్‌ఫ్లూ సోసిన దాఖలాలు లేవు. కాగా, బర్డ్‌ఫ్లూ సోకిన వారికి ప్రస్తుతం ఓసల్టామీవీర్ (టామీఫ్లూ) మందును అందజేస్తున్నారు. దీంతో పాటు జనామీవీర్ను కూడా కొన్నిచోట్ల బర్డ్‌ఫ్లూ వ్యాధి చికిత్సలో అందజేయవచ్చు. పక్షుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఇవి.. అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడం పక్షుల్లో విసర్జక పదార్థాలు సాధారణం కంటే నీళ్లగా ఉండడం పక్షుల కాళ్లు, ముక్కు ఊదా రంగులోకి మారి పోవడం పక్షుల గుడ్డు పెంకులు పెలుసుగా మారిపోవడం పక్షులు ఆహారాన్ని తీసుకోవపోవడం కనురెప్పలు, తల, కాళ్ల గోళ్లు ఉబ్బిపోవడం ముక్కుల నుంచి నీరు కారడం మనుషుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఇవి... శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం స్వల్ప పరిమాణంలో శరీర ఉష్ణోగ్రత పెరగడం చాలా కొంతమందిలో శరీరంపై దద్దుర్లు కూడా వస్తాయి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... బర్డ్‌ఫ్లూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కోడి మాంసంతో పాటు గుడ్డును పూర్తిగా ఉండికించిన తర్వాతనే తినాలి హాఫ్ బాయిల్డ్, స్మోక్డ్ చికెన్లను తినకపోవడం మంచిది కోళ్లను ముట్టుకున్న తర్వాత చేతిని సోపుతో శుభ్రపరుచుకోవాలి కోళ్ల వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో తాకకూడదు -
కోడి.. కొనలేం..!
చికెన్ ధరలకు రెక్కలు ♦ స్కిన్లెస్ కేజీ రూ.222.. బోన్‌లెస్ రూ.400 ♦ బర్డ్‌ఫ్లూ కారణంగా భారీగా తగ్గిన కోళ్ల ఉత్పత్తి సాక్షి, హైదరాబాద్: వారంలో రెండు రోజులైనా చికెన్‌ముక్క లేకుంటే అన్నం ముద్ద గొంతుదిగదు చాలామందికి. వీరందరికీ ఎంతో ఇష్టంగా చికెన్ తినాలని ఉన్నా.. కష్టంగానైనా కొనలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులుగా చికెన్ ధరలు కొండెక్కడమే దీనికి కారణం. బర్డ్‌ఫ్లూ భయంతో ఇటీవల కాస్త దిగివచ్చిన చికెన్ ధర మళ్లీ ఆకాశానికి ఎగబాకింది. ఆదివారం నగర మార్కెట్లో చికెన్ స్కిన్లెస్ కిలో రూ.222కు, స్కిన్‌తో రూ.188కి, బోన్‌లెస్ అయితే రూ.400కు విక్రయించారు. ఏప్రిల్/మే నెలల్లో బర్డ్‌ఫ్లూ కారణంగా పౌల్ట్రీ యజమానులు స్వచ్ఛందంగా కోళ్లను చంపేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్త బ్యాచ్‌లు వే సేందుకు తటపటాయించడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు చికెన్ ధరలపై పడింది. దీనికితోడు పెళ్లిళ్లు, ఫంక్షన్లు రావడంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా చికెన్ వ్యాపారులు ధర పెంచేశారు. నిజానికి ఫారం రైతు కిలో కోడిని రూ.111లకే అమ్ముతున్నా.. రిటైల్ మార్కెట్లో చికెన్ రెట్టింపు ధర పలుకుతోంది. వారానికి ఒక్కసారైనా కోడి కూర రుచి చూద్దామనుకునే మాంసప్రియులకు పెరిగిన ధర నిరాశ కల్గిస్తోంది. మరోవైపు బడా చికెన్ సెంటర్లు రేట్లు పెంచేయడం వల్ల తమకు గిరాకీ తగ్గిందంటూ చిల్లర వ్యాపారులు వాపోతున్నారు. గత వారం 5 క్వింటాళ్ల(300 కోళ్లకుపైగా) చికెన్ విక్రయించిన తాను ఈ ఆదివారం 2 క్వింటాళ్లే (100 కోళ్లనే) అమ్ముడుపోయిందని ఉప్పల్‌లోని జ్యోతి చికెన్ సెంటర్ నిర్వాహకుడు కొండల్రావు ‘సాక్షి’కి తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్టు కోళ్ల ఉత్పత్తి లేదని, సరఫరా తగ్గడంతో డిమాండ్ పెరిగి వ్యాపారులు ఇష్టారీతిన ధర పెంచేస్తున్నారని, కొత్త బ్యాచ్ కోళ్లు వచ్చే వరకూ చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. చేపలకు భలే గిరాకీ...! ప్రతి ఏటా మృగ శిరకార్తె రోజు చేపలు తినడం చాలామందికి ఆనవాయితీ. సోమవారం మృగశిరకార్తె ఉండడంతో ఆదివారం చేపల దుకాణాలు కళకళలాడాయి. బేగం బజార్‌లోని చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. హోల్‌సేల్ మార్కెట్లోనూ, రోడ్లపై విక్రయించేవారు రేట్లు పెంచి అమ్మారు. గతంలో కిలో రూ.300 ఉన్న కొర్రమీను(కొర్రమట్ట) చేపలు ఆదివారం రూ.400-450కు విక్రయించారు. నాంపల్లి మార్కెట్, ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, కోఠి, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో కొర్రమీను చేపలను కిలో రూ.400 నుంచి 600 వరకూ అమ్మడం గమనార్హం. -
డబ్ల్యూటీవోలో భారత్‌కు చుక్కెదురు
జెనీవా/వాషింగ్టన్: అమెరికా నుంచి కోడిమాంసం, గుడ్లు, పందుల దిగుమతులను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై డబ్ల్యూటీవోలో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన కేసును ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద భారత్ ఓడిపోయింది. భారత్ నిర్ణయం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం లేదని డబ్ల్యూటీవో అప్పీలేట్ తేల్చి చెప్పింది. తమ తీర్పును అమలు చేసేందుకు భారత్‌కు 12 నుంచి 18 నెలల సమయం ఇచ్చిన అప్పీలేట్ ఆ తరువాత అమెరికా భారత్‌కు ఆయా ఉత్పత్తులను ఎగుమతి చేయొచ్చని స్పష్టం చేసింది. బర్డ్ ఫ్లూకు సంబంధించి భారత్ నిబంధనలు సరిగా లేవని పేర్కొంది. అమెరికా దిగుమతుల నిషేధం సరికాదంటూ గత సంవత్సరం డబ్ల్యూటీవో కమిటీ ఇచ్చిన తీర్పు సరైనదేనని అప్పీలేట్ పేర్కొంది. -
కొండెక్కిన కోడి!
స్కిన్లెస్ కిలో రూ.178 సాక్షి, హైదరాబాద్: చికెన్ ధర మండిపోతోంది. ఎండాకాలం వేడి చేస్తుందన్న ఉద్దేశంతో చికెన్ వినియోగించేందుకు మాంసాహారులు వెనుకడుగేస్తుంటారు. ఫలితంగా వేసవిలో చికెన్ ధరలు పడిపోవడం ఏటా సర్వసాధారణం. అయితే... నగరంలో ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్లో చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవలి వరకు రూ.122లకు లభించిన బ్రాయిలర్ చికెన్ 20 రోజుల వ్యవధిలోనే కిలో ఒక్కింటికి రూ.30 వరకు ధర పెరిగింది. ఆదివారం రిటైల్ మార్కెట్లో లైవ్ కోడి కేజీ రూ.106, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.152, స్కిన్‌లెన్ రూ.178, బోన్‌లెస్ రూ.340 ధరకు వ్యాపారులు విక్రయించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా గత నెలలో పౌల్ట్రీ యజమానులు పెద్దసంఖ్యలో కోళ్లను చంపేశారు. ఆతర్వాత కొత్త బ్యాచ్‌లు వేయకుండా ఆపేశారు. ఫలితంగా కోళ్ల ఉత్పత్తి నిలిచిపోయి నగరంలో కొరత ఏర్పడింది. ప్రస్తుతం నగరంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు జోరందుకోవడంతో చికెన్‌కు గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలు పెంచేశారు. గత నెలలో కొత్త బ్యాచ్‌లు వేయకపోవడం, ఉన్నవి కూడా ఎండదెబ్బకు చనిపోవడంతో బర్డ్స్ ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడింది. ఆ ప్రభావమే ఇప్పుడు ధరల పెరుగుదలకు దారితీసిందని వ్యాపారులు చెబుతున్నారు. సోమవారం నుంచి చికెన్ ధరలు రూ.8-12 వరకు పెరగనున్నాయని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. గుడ్ల ధరలు కూడా అస్థిరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో 100 కోడి గుడ్ల ధర రూ.310 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.400 చొప్పున అమ్ముతున్నారు. నిజానికి ఒక్కో గుడ్డు ధర రూ.3.10 పైసలుండగా రిటైల్ వ్యాపారులు మాత్రం రూ.4 వసూలు చేస్తున్నారు. వేసవిలో చికెన్ ఇష్టపడనివారు మటన్ వైపు మొగ్గుచూపుతుండటంతో మార్కెట్లో మటన్ ధరలు కూడా పెరిగాయి. గతవారం వరకు కేజీ మటన్ రూ.450-500లున్న ధర ప్రస్తుతం రూ.480-550కి చేరింది. -
కోళ్ల పరిశ్రమ రుణాల రీషెడ్యూల్!
బ్యాంకర్లతో సర్కారు సమాలోచనలు బర్డ్‌ఫ్లూతో చితికిపోయిన పౌల్ట్రీ రైతులు రూ.2,000 కోట్ల రుణభారం.. రీషెడ్యూలుకు విజ్ఞప్తి హైదరాబాద్: బర్డ్‌ఫ్లూతో కుదేలైన కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాధ్యాసాధ్యాలపై బ్యాంకర్లతో సంప్రదింపులు ప్రారంభించింది. తెలంగాణలో ఉన్న కోళ్ల పరిశ్రమలపై దాదాపు రూ. 2,000 కోట్ల బ్యాంకు రుణాలున్నాయి. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో వీటిని తిరిగి చెల్లించ డం గుదిబండగా మారిందని పౌల్ట్రీ రైతులు తల్లడిల్లుతున్నారు. నష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమాలోచనలు జరిపారు. పౌల్ట్రీ రంగ ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు, గుడ్లు, చికెన్ ధర పడిపోయిందని.. ఒక్కసారిగా అమ్మకాలు పడిపోవటంతో అపార నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడేళ్లుగా కోళ్ల పరిశ్రమ నష్టాల బాటలోనే ఉంది. రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది రైతులు పౌల్ట్రీని నమ్ముకున్నారు. వీరిలో ఎనభై శాతం మంది రైతులు వరుస నష్టాలతో చితికిపోయారు. ఇటీవలి బర్డ్ ఫ్లూ దెబ్బకు చిన్న రైతులు మరింత విలవిలలాడిపోయారు.. కొత్త రుణాలు అందించి కుదేలైన పరిశ్రమకు చేయూతను అందించాలి’అని పౌల్ట్రీ ప్రతినిధులు బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తీసుకున్న బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి లేనందున.. పాత రుణాలను రీషెడ్యూలు చేయటంతో పాటు కొత్త రుణాలు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఆర్థిక మంత్రి సాధ్యాసాధ్యాలపై బ్యాంకర్లతో చర్చించారు. 2008లో పశ్చి మ బెంగాల్లో బర్డ్ ఫ్లూ సోకినప్పుడు అక్కడి పౌల్ట్రీ రుణాలను రీషెడ్యూలు చేసేందుకు ఆర్బీఐ అనుమతించింది. ఒక ఏడాది పాటు మారటోరియం విధించటంతో పాటు తదుపరి మూడేళ్లు రుణాలను చెల్లించేం దుకు వెసులుబాటు కల్పించిం ది. కొత్త రుణాల మంజూరీకి అనుమతించింది. రాష్ట్రంలోనూ కోళ్ల పరిశ్రమ విపత్కర పరిస్థితుల్లో ఉన్నందున అదే తీరుగా రుణ భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. -
నగర శివారులో మళ్లీ బర్డ్‌ఫ్లూ జాడలు..?
రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్ మండలంలోని కోళ్ల ఫారాల్లోని కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతుండటంతో బర్డ్‌ఫ్లూ అనే అనుమానాలు రైతుల్లో కలుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ధైర్యంగా ఉన్న కోళ్ల ఫారాల రైతుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో ఉన్న ఓ ఫారంలో పది రోజులుగా కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. నెల క్రితం తొర్రూరు గ్రామంలో బర్డ్‌ఫ్లూ సోకిన సమయంలో వైద్యులు వచ్చి పరిశీలించి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. గత మూడు రోజుల నుంచి మొత్తం 80 వేల కోళ్లలో 10 వేల వరకు మృత్యువాత పడ్డాయి. మండల పశు వైద్యాధికారి ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ.. సదరు రైతు ఫిర్యాదుతో ఫారంలోని కోళ్ల శాంపుల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపామని చెప్పారు. పరీక్షల రిపోర్ట్ వచ్చాకే బర్డ్‌ఫ్లూ సోకిందీ లేనిదీ నిర్ధారించగలమని తెలిపారు. (తుర్కయంజాల్) -
బర్డ్‌ఫ్లూపై భయమొద్దు
-
బర్డ్‌ఫ్లూతో భయాందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: బర్డ్‌ఫ్లూతో భయాందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. చికెన్, గుడ్లు నిర భ్యంతరంగా తినొచ్చని కోళ్ల పరిశ్రమ ప్రతినిధులు చెప్పారు. మంగళవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కోళ్ల సమాఖ్య అధ్యక్షుడు ఇ.ప్రదీప్‌కుమార్ రావు, కోళ్ల బ్రీడర్స్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి, జాతీయ గుడ్ల పర్యవేక్షణ కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.జి.ఆనంద్, హైదరాబాద్ లేయర్ రైతుల సంఘం అధ్యక్షుడు కె.మోహన్‌రెడ్డి, అఖిల భారత కోళ్ల అభివృద్ధి సేవల జీఎం బాలసుబ్రమణ్యం మాట్లాడారు. బర్డ్‌ఫ్లూ వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికే కాస్తోకూస్తో సోకే ప్రమాదం ఉందని... అయితే చికెన్ తిన్నవారికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్ రంజిత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ వైరస్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్దే చనిపోతుందన్నారు. మన దేశంలో గుడ్లు, చికెన్ వంటకాలను 100 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికిస్తామని... అందువల్ల బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్న చికెన్ తిన్నా ఏమాత్రం ప్రమాదం ఉండదని భరోసా ఇచ్చారు. త్వరలో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా 4 వేల కేజీల చికెన్, 8 వేల గుడ్లు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బర్డ్‌ఫ్లూ మనిషికి సోకిన కేసులు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా నమోదు కాలేదన్నారు. దేశంలోనే తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ మొదటిస్థానంలో ఉందన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు అనేకసార్లు బర్డ్‌ఫ్లూ ప్రకటించారని... అయితే రాష్ట్రంలో ఇప్పుడు మూడు రోజుల్లోనే పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంతి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకున్నారన్నారు. హయత్‌నగర్ మండలం తొర్రూరు కోళ్ల ఫారాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకిన మూడు రోజుల్లోనే మళ్లీ సాధారణ స్థితికి వచ్చిందని, దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. సాధారణంగా కోళ్లు చనిపోతే బర్డ్‌ఫ్లూ అనుకొవద్దు సాధారణంగా వేసవిలో వేడికి కోళ్లు చనిపోతుంటాయని, వాటిని కూడా బర్డ్‌ఫ్లూతో చనిపోయినట్లు ప్రచారం చేయడం శోచనీయమని ప్రదీప్‌కుమార్ రావు చెప్పారు. నిజామాబాద్‌లో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు శాంపిళ్లు సేకరించి బెంగళూరులో పరీక్షించాక తర్వాత భోపాల్ ల్యాబ్‌కు పంపుతారని, అక్కడ నిర్ధారణ జరుగుతుందన్నారు. బర్డ్‌ఫ్లూ ప్రచారం వల్ల హైదరాబాద్‌లో 20 శాతం వరకు పౌల్ట్రీ అమ్మకాలు పడిపోయిన విషయం వాస్తవమేనని, జిల్లాల్లో మాత్రం ఎటువంటి ప్రభావం పడలేదన్నారు. కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి పరిశీలించి ప్రభుత్వ చర్యలకు సంతృప్తి వ్యక్తంచేసిందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయని కె.జి.ఆనంద్ తెలిపారు. చికెన్, గుడ్ల వంటకాలు... వండే ఉష్ణోగ్రతలు చికెన్ ఫ్రై - 150 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఆపైన ఉడికించిన గుడ్డు - 100 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఆమ్లెట్ - 150 డిగ్రీల సెంటీగ్రేడ్లు బేకింగ్ - 130 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఆపైన తందూరీ - 240 డిగ్రీలు ఆపైన సెంటీగ్రేడ్లు కూర - 140 డిగ్రీలు ఆపైన సెంటీగ్రేడ్లు -
భయం లేదు... లాగించేదాం
కంటోన్మెంట్/శాలిబండ : ‘బర్డ్ ఫ్లూ భయం లేదు.. ఎప్పటిలాగే చికెన్ వంటకాల్ని లాగించేయండి’ అంటూ చికెన్ ప్రియులకు పిలుపునిస్తున్నారు..‘వెన్‌కాబ్’ జనరల్ మేనేజర్ బాలసుబ్రమణ్యం. అంతేకాదు తమ సంస్థ ఆధ్వర్యంలో చికెన్ వంటకాల్ని వండి మరీ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ మేరకు కంటోన్మెంట్‌లోని సిక్రోడ్లో ‘గోల్డెన్ చికెన్ మార్కెట్’ ఆవరణలో మంగళవారం సాయంత్రం చికెన్ వంటకాల ఉచిత పంపిణీ చేపట్టారు. చికెన్ పకోడీ, చికెన్ 65, లాలీపాప్, డ్రమ్‌స్టిక్స్... ఇలా ఐదారు రకాల చికెన్ వంటకాల్ని ప్రజలకు ఉచితంగా అందజేశారు. నిర్భయంగా చికెన్ వంటకాల్ని తినాల్సిందిగా ప్రజలకు సూచించారు. ప్రజల్లో అవగాహన కోసమే... బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ విక్రయాలు అమాంతం పడిపోయాయని, ప్రస్తుతం ‘ఫ్లూ’ ప్రమాదం లేకున్నా చికెన్ అమ్మకాలు పెరగడం లేదన్నారు. ప్రజల్లో అపోహలు తొలగించి గతంలో మాదిరిగానే చికెన్‌ను ఆదరించేలా చేయడం కోసమే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ స్థానిక నాయకులు శ్రీనివాస్, గోల్డెన్ చికెన్ మార్కెట్ ఎండీ అన్వర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా బహదూర్‌పురా ఫతేదర్వాజా వద్ద స్నేహ ఫ్రెష్ చికెన్ కంపెనీ చైర్మన్ రాంరెడ్డి ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహించారు. శాలిబండ డివిజన్ మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్, ఈ కార్యక్రమంలో పాతబస్తీలోని ఫౌల్ట్రీ యజమానులు, చౌక్ చికెన్ మార్కెట్ యూనియన్ అధ్యక్షులు బషీర్, చికెన్ దుకాణాల యజమానులు పాల్గొన్నారు. -
బర్డ్‌ఫ్లూతో భయాందోళన వద్దు
చికెన్, గుడ్లు నిరభ్యంతరంగా తినొచ్చు ప్రపంచంలో ఏ ఒక్కరికీ బర్డ్‌ఫ్లూ సోకిన దాఖలాలు లేవు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దే వైరస్ చనిపోతుంది టీఆర్ఎస్ ప్లీనరీకి 4 వేల కేజీల చికెన్, 8 వేల గుడ్లు ఆర్డర్ కోళ్ల పరిశ్రమ వ్యాపారులు, సంఘాల నేతల వెల్లడి సాక్షి, హైదరాబాద్: బర్డ్‌ఫ్లూతో భయాందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. చికెన్, గుడ్లు నిర భ్యంతరంగా తినొచ్చని కోళ్ల పరిశ్రమ ప్రతినిధులు చెప్పారు. మంగళవారమిక్కడ జరిగిన సమావేశంలో తెలంగాణ కోళ్ల సమాఖ్య అధ్యక్షుడు ఇ.ప్రదీప్‌కుమార్ రావు, కోళ్ల బ్రీడర్స్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి, జాతీయ గుడ్ల పర్యవేక్షణ కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.జి.ఆనంద్, హైదరాబాద్ లేయర్ రైతుల సంఘం అధ్యక్షుడు కె.మోహన్‌రెడ్డి, అఖిల భారత కోళ్ల అభివృద్ధి సేవల జీఎం బాలసుబ్రమణ్యం మాట్లాడారు. బర్డ్‌ఫ్లూ వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికే కాస్తోకూస్తో సోకే ప్రమాదం ఉందని... అయితే చికెన్ తిన్నవారికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్ రంజిత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ వైరస్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్దే చనిపోతుందన్నారు. మన దేశంలో గుడ్లు, చికెన్ వంటకాలను 100 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికిస్తామని... అందువల్ల బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్న చికెన్ తిన్నా ఏమాత్రం ప్రమాదం ఉండదని భరోసా ఇచ్చారు. త్వరలో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా 4 వేల కేజీల చికెన్, 8 వేల గుడ్లు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బర్డ్‌ఫ్లూ మనిషికి సోకిన కేసులు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా నమోదు కాలేదన్నారు. దేశంలోనే తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ మొదటిస్థానంలో ఉందన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు అనేకసార్లు బర్డ్‌ఫ్లూ ప్రకటించారని... అయితే రాష్ట్రంలో ఇప్పుడు మూడు రోజుల్లోనే పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంతి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకున్నారన్నారు. హయత్‌నగర్ మండలం తొర్రూరు కోళ్ల ఫారా ల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకిన మూడు రోజుల్లోనే మళ్లీ సాధారణ స్థితికి వచ్చిందని, దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. సాధారణంగా కోళ్లు చనిపోతే బర్డ్‌ఫ్లూ అనుకోవద్దు సాధారణంగా వేసవిలో వేడికి కోళ్లు చనిపోతుంటాయని, వాటిని బర్డ్‌ఫ్లూ అని ప్రచారం చేయడం శోచనీయమని ప్రదీప్‌కుమార్ రావు చెప్పారు. నిజామాబాద్‌లో బర్డ్‌ఫ్లూ లేదన్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు శాంపిళ్లు సేకరించి బెంగళూరు, భోపాల్ ల్యాబ్‌లకు పంపిన తర్వాత నిర్ధారణ జరుగుతుందన్నారు. ఈ ప్రచారం వల్ల హైదరాబాద్‌లో 20 శాతం వరకు పౌల్ట్రీ అమ్మకాలు పడిపోయాయని, జిల్లాల్లో మాత్రం ఎలాంటి ప్రభావం లేదన్నారు. కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి పరిశీలించి ప్రభుత్వ చర్యలకు సంతృప్తి వ్యక్తంచేసిందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయని కె.జి.ఆనంద్ తెలిపారు. -
బర్డ్‌ఫ్లూతో భయాందోళన వద్దు
చికెన్, గుడ్లు నిరభ్యంతరంగా తినొచ్చు కోళ్ల పరిశ్రమ వ్యాపారులు, సంఘాల నేతలు హైదరాబాద్: బర్డ్‌ఫ్లూతో భయాందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. చికెన్, గుడ్లు నిరభ్యంతరంగా తినొచ్చని తెలంగాణ రాష్ట్ర కోళ్ల సమాఖ్య అధ్యక్షులు ఇ.ప్రదీప్‌కుమార్ రావు అన్నారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. బర్డ్‌ఫ్లూ వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికే కాస్తోకూస్తో సోకే ప్రమాదం ఉందని.. అయితే చికెన్ తిన్నవారికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఈ వైరస్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్దే చనిపోతుందన్నారు. మన దేశంలో గుడ్లు, చికెన్ వంటకాలను 100 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికిస్తామని.. అందువల్ల బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్న చికెన్ తిన్నప్పటికీ ఏమాత్రం ప్రమాదం ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతీ నెల 4 కోట్ల కేజీల చికెన్, 3 కోట్ల గుడ్ల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. దేశంలోనే తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ మొదటిస్థానంలో ఉందన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు అనేకసార్లు బర్డ్‌ఫ్లూ ప్రకటించారని... అయితే రాష్ట్రంలో ఇప్పుడు మూడు రోజుల్లోనే పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారన్నారు. దీనివల్ల ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ముఖ్యమంతి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్లు చొరవ తీసుకున్నారన్నారు. తొర్రూరులోనూ ఇప్పుడు బర్డ్‌ఫ్లూ లేదన్నారు. ఈ నెల 17వ తేదీ నాటికే అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. 10 కిలోమీటర్ల పరిధి ప్రాంతాన్ని పూర్తిగా పారిశుద్ధ్య, బర్డ్‌ఫ్లూ లేని ప్రాంతంగా ప్రకటించారన్నారు. పశుసంవర్థకశాఖ అధికారులు శాంపిళ్లు సేకరించి బెంగళూరు పంపించి అక్కడ పరీక్షించాక తర్వాత భోపాల్ ల్యాబ్‌కు పంపించాక నిర్ధారణ జరుగుతుందన్నారు. అప్పుడే బర్డ్ఫ్లూనా కాదా ? అన్న నిర్ధారణ జరుగుతుందన్నారు. కాబట్టి అనవసర ప్రచారాలు నమ్మవద్దని వినియోగదారులను కోరారు. లక్షలాది కుటుంబాలు కోళ్ల పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయన్నారు. అయితే బర్డ్‌ఫ్లూ ప్రచారం వల్ల హైదరాబాద్‌లో 20 శాతం వరకు పౌల్ట్రీ అమ్మకాలు పడిపోయిన విషయం వాస్తవమేనని.. కానీ జిల్లాల్లో మాత్రం ఎటువంటి ప్రభావం పడలేదన్నారు. కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి అన్ని పరిశీలించి మన అధికారుల చర్యలకు సంతృప్తి వ్యక్తంచేసిందన్నారు. కె.జి.ఆనంద్ మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు. -
బర్డ్‌ఫ్లూపై అధికారుల స్పందన బాగుంది
కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి రాణా హైదరాబాద్: బర్డ్‌ఫ్లూపై అధికారుల స్పందన బావుందని, వైరస్ వ్యాపించకుండా తక్కువ సమయంలో కోళ్లను సంహరించిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సభ్యులు అభినందనీయులని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి రజ్వీర్సింగ్రాణా అన్నారు. శనివారం హయత్‌నగర్ మండలంలోని తొర్రూరులో బర్డ్‌ఫ్లూ వెలుగుచూసిన ఫౌల్ట్రీ ఫారాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫౌల్ట్రీ ఫారాల్లో శాంపిల్స్ 15 రోజులకు ఒకసారి పరిశీలిస్తామని 90 రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆ తర్వాత ఫ్లూ కనిపించకుంటే వైరస్ లేని జోన్‌గా ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్జేడీ వరప్రసాద్‌రెడ్డి, నోడల్ అధికారి దుర్గయ్య పాల్గొన్నారు. కాగా కేంద్ర వైద్య బృందం శనివారం గాంధీ ఆస్పత్రిని సందర్శించింది. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ రామనాథం నేతృత్వం లో ఢిల్లీ రాంమనోహర్ లోహియా ఆస్పత్రి ప్రతినిధి పవన్‌కుమార్, గాంధీ ఇన్చార్జి సూపరింటెండెంట్ మసూద్, నోడల్ అధికారి నర్సిం హులతో సమావేశమై ఆస్పత్రిలో సదుపాయాలపై ఆరా తీశారు. -
పౌల్ట్రీకి ఫ్లూ దెబ్బ
గంగాధర : బర్డ్‌ఫ్లూ భయంతో బాయిలర్ కోళ్ల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. కిలో రూ.70 ఉన్న కోడి ధర నాలుగు రోజుల్లోనే రూ.56కు పడిపోయింది. ఫలితంగా రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. రైతులకు కోళ్ల పెంపకం ఓ జూదంలా మారింది. ఈ బ్యాచ్ కాకపోతే మరో బ్యాచ్కైనా కలిసిరాకపోతుందా? అని కోళ్లు పెంచుతూ నష్టపోతున్నారు. కోళ్ల రైతులను బర్డ్‌ఫ్లూ భయం నిండా ముంచుతోంది. జిల్లాలో 500 మంది రైతులకు 35 లక్షల సామర్థ్యం గల బాయిలర్ కోళ్ల ఫారాలున్నాయి. గంగాధర మండలంలో జిల్లాలోనే అత్యధికంగా ఐదు లక్షల బాయిలర్ కోళ్లు అమ్మకానికి ఉన్నాయి. బర్డ్‌ఫ్లూ భయంతో ధరలు పడిపోగా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోనున్నారు. జిల్లాలో గంగాధర, రామడుగు, తిమ్మాపూర్, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, గోదావరిఖని, హుజూరాబాద్, సిరిసిల్ల, కొడిమ్యాల తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కోళ్ల ఫారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫారంలో 45 నుంచి 50 రోజులపాటు కోడి పెంపకానికి అయ్యే ఖర్చు రూ.150 ఉంటుంది. 45 రోజులు పెరిగిన కోడి రెండు నుంచి రెండున్నర కిలోల బరువు తూగుతుంది. అయినా ఒక కోడి అమ్మితే రైతులకందేది రూ.110 నుంచి రూ.120 మాత్రమే ఉంటోంది. కిలో కోడి ధర రూ.56 నుంచి రూ.58 పలుకుతోంది. ఈ ధరతో కోడి అమ్ముకుంటే ఒక్కో కోడిపై రూ.30 నుంచి రూ.40, వెయ్యి కోళ్లకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు మునగాల్సిందే. వీటికి తోడు కనీసం పది శాతం కోళ్లు పెంపకం సమయంలో చనిపోతుంటాయి. ఈ నష్టం కూడా భరించాల్సిందే. వ్యాధులు ప్రబలకుంటేనే లాభాలు కోళ్లకు ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటేనే కోడికి రూ.40 నష్టపోతున్న రైతులు... వ్యాధులు సోకితే మరింత నష్టపోవాల్సిందే. కోళ్లకు ఎక్కువగా బర్డ్‌ఫ్లూ, ఇకోలాయి, ఆర్డీ, ఫీయార్డీ వంటి వ్యాధులు సోకుతుంటాయి. వీటితో కోళ్లు లెక్కనేనన్ని మరణిస్తాయని రైతులు పేర్కొంటున్నారు. వెన్‌కాబ్ ప్రతిరోజు ప్రాంతాల వారీగా ప్రకటించే మద్దతు ధరతో ట్రేడర్లు కొనుగోలు చేస్తారు. జిల్లాలోని వెన్‌కాబ్ మద్దతు ధర కిలో రూ.70 అయితే కొనుగోలు చేస్తున్నది రూ.56 నుంచి రూ.58 మాత్రమే. ఇతర ప్రాంతాల్లో వెన్‌కాబ్ వారు ప్రకటించిన మద్దతు ధర పరిశీలిస్తే పూణేలో కిలో రూ.54, చిత్తూర్ 78, నెల్లూర్ 85, బెంగ్లూర్లో 75, హైదరాబాద్‌లో 70, విజయవాడ 65, గుంటూరులో 72 రూపాయలు పలుకుతోంది. -
బర్డ్‌ఫ్లూ దెబ్బకు పౌల్ట్రీ విలవిల
సాక్షి, హైదరాబాద్: బర్డ్‌ఫ్లూ పంజాకు కోళ్ల పరిశ్రమ విలవిలలాడుతోంది. వ్యాధి సోకిన కోళ్లను చంపి భూమిలో పాతిపెడుతున్నారు. గుడ్లను ధ్వంసం చేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ దెబ్బకు రంగారెడ్డి హయత్‌నగరం మండలం తొర్రూరు పరిసర గ్రామాలు వణికిపోతున్నాయి. మరోవైపు అధికారులు అప్రమత్తమై వైరస్ విస్తరించకుండా నివారణ చర్యలు ముమ్మరం చేశారు. శుక్రవారం నాటికి గుర్తించిన ఐదు ఫారాల్లోని 1.60 లక్షల కోళ్లను చంపి పాతిపెట్టారు. 2.30 లక్షల గుడ్లను ధ్వంసం చేశారు. 200 మెట్రిక్ టన్నుల దాణానూ నాశనం చేసి భూమిలో పాతిపెట్టారు. తొర్రూరుకు 10 కిలోమీటర్ల పరిధిలోని 18 గ్రామాల్లో గల 32 కోళ్ల ఫారాల్లో 35 ప్రత్యేక బృందాలు అణవణువునా బర్డ్‌ఫ్లూ ఛాయలపై గాలించాయి. ఎక్కడా బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ వచ్చిన ఐదు కోళ్ల ఫారాలను పూర్తిస్థాయిలో శుభ్రపరిచి వాటిని సీజ్ చేయనున్నారు. బర్డ్‌ఫ్లూ ప్రభావిత 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్ దుకాణాలన్నింటినీ మూసేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పశుసంవర్థశాఖ ప్రత్యేక కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. కోళ్లకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. రోగ నియంత్రణ సంస్థ ఏర్పాటు బర్డ్‌ఫ్లూను పర్యవేక్షించేందుకు రాష్ట్రానికి వచ్చిన జాతీయ అంటువ్యాధుల సంస్థ(ఎన్ఐసీడీ) జాయింట్ డెరైక్టర్లు డాక్టర్ ఎస్.కె.జైన్, డాక్టర్ కర్మాకర్, ప్రత్యేక నిపుణుడు డాక్టర్ ప్రణయ్‌వర్మ, కేంద్ర ఛాతి వైద్య నిపుణుడు డాక్టర్ పవన్‌కుమార్ శుక్రవారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ వంటి వైరస్లు సోకుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో జాతీయ కేంద్ర రోగ నియంత్రణ సంస్థ(ఎన్సీడీసీ) శాఖను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించగా సానుకూలంగా స్పందించారు. ఆ సంస్థ కోసం మూడు ఎకరాల స్థలం కేటాయించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. భూమిని గుర్తించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్‌ను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 26 రాష్ట్రాల్లో ఎన్సీడీసీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించగా మొదటగా తెలంగాణకు అవకాశం రావడం గమనార్హం. వ్యాధి నిర్ధార ణకు సంబంధించి ఇప్పటివరకు ఫూణేలోని ప్రయోగశాలపై ఆధారపడాల్సి వచ్చేది. అనంతరం కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌నూ కలిసింది. ఆ తర్వాత ఐపీఎం కేంద్రానికి వెళ్లి బర్డ్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేయడానికి ఉన్న వసతులపై ఆరా తీసినట్లు రాష్ట్ర అంటువ్యాధుల నివారణ సంస్థ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. ఈ బృందం శనివారం గాంధీ ఆసుపత్రిని సందర్శిస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్ బర్డ్‌ఫ్లూ పూర్తి హయత్‌నగర్ మండలం తొర్రూరులో ఈ నెల 13వ తేదీన వెలుగుచూసిన బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాపించకుండా సమర్ధవంతంగా ఆపరేషన్ బర్డ్‌ఫ్లూ కార్యక్రమాన్ని పూర్తి చేశామని పశు సంవర్ధక శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. తొర్రూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బర్డ్‌ఫ్లూ వెలుగుచూసిన మరుసటి రోజు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి వైరస్ సోకిన కోళ్ళను చంపేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రెండు రోజుల్లో లక్షా 59 వేల 953 కోళ్ళను చంపగా, 2 లక్షల 28వేల 428 గుడ్లను పాతిపెట్టినట్లు తెలిపారు. పెంపుడు కోళ్ళలో వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వైవల్ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కోళ్ళ ఫారాల నుంచి కోళ్ళను, గుడ్లను ఇతర ప్రాంతాలకు తరలించకుండా పోలీసులు నిరంతరం నిఘా పెంచారని చెప్పారు. ఇకపై చికెన్, గుడ్లను నిర్భయంగా తినవచ్చన్నారు. -
బర్డ్‌ఫ్లూపై ఇంత నిర్లక్ష్యమా?
పశుసంవర్ధక శాఖ అధికారులపై కేంద్ర బృందం ఫైర్ 20 రోజుల నుంచి ఏం చేస్తున్నారని మండిపాటు.. 16 మొబైల్ హెల్త్ టీంలు, బర్డ్‌ఫ్లూ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష, నేడు మంత్రితో భేటీ హైదరాబాద్: బర్డ్‌ఫ్లూపై రాష్ట్ర యంత్రాంగం నిర్లక్ష్యం వహించడంపై సెంట్రల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం(కేంద్ర బృందం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 నుంచి కోళ్లు మరణిస్తుంటే ఏం చేస్తున్నారంటూ మండిపడింది. బుధవారమే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర అధికారులు గురువారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరు పరిసర ప్రాంతాలను, బర్డ్‌ఫ్లూ వచ్చిన కోళ్ల ఫారాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత జరిగిన సమీక్షలో పశుసంవర్థక శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు గ్రహించిన వెంటనే సంబంధిత ప్రాంతంలోని కోళ్లను చంపడానికి నాలుగు రోజుల సమయం తీసుకోవడంపై విస్మయం వ్యక్తంచేశారు. యుద్ధప్రాతిపదికన ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్ల ఫారాలను తక్షణమే పూర్తిస్థాయిలో శుభ్రపరచకపోతే ప్రస్తుత వాతావరణంలో వెరస్ గాలిలో కలిసిపోయే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహించడంలోనూ, ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని కేంద్ర బృందం అభిప్రాయపడినట్లు సమాచారం. తక్షణ చర్యలు చేపట్టిన బృందం: జాతీయ అంటువ్యాధుల సంస్థ(ఎన్ఐసీడీ) జాయింట్ డెరైక్టర్లు డాక్టర్ ఎస్.కె.జైన్, డాక్టర్ కర్మాకర్, ప్రత్యేక నిపుణుడు డాక్టర్ ప్రణయ్‌వర్మ, ఛాతీ వైద్య నిపుణుడు డాక్టర్ పవన్‌కుమార్‌తో కూడిన కేంద్ర బృందం తొర్రూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించి యుద్ధప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టారు. తక్షణమే తొర్రూరులో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 16 మొబైల్ హెల్త్ టీంలను ఏర్పాటు చేశారు. సమీపంలోని వనస్థలిపురం ఆసుపత్రిలో ప్రత్యేక బర్డ్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేశారు. కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న 18 మంది సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వైద్యారోగ్య శాఖ అధికారులతోనూ కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. శుక్రవారం ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో సమావేశంకానుంది. అలాగే గాంధీ ఆసుపత్రిని, ఐపీఎం ల్యాబ్‌ను సందర్శించనుంది. మరోవైపు ఇప్పటివరకు 1.20 లక్షల కోళ్లను చంపేసినట్లు, 84 వేల గుడ్లను ధ్వంసం చేసినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. కోళ్లను, గుడ్లను ఎక్కడికీ తరలించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కాగా, తమకు జరిగిన నష్టంపై ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోళ్ల ఫారాల యజమానులు కోరుతున్నారు.