టోక్యో: ప్రాణాంతకమైన బర్డ్ ఫ్లూ వ్యాధి జపాన్ ను వణికిస్తోంది. అత్యంత వ్యాధికారకమైన హెచ్ 5 ఎన్6 వైరస్ పౌల్ట్రీ, ఇతర అడవి జాతి పక్షులు, జపాన్ లోని బహుళ ప్రదేశాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో గుర్తించడం ఆందోళనకు దారి తీసింది. అతి ప్రమాదకరమైన హెచ్5ఎన్6 వైరస్ ను నిర్ధారించినట్టు నివేదికలు వెల్లడించాయి. దీంతో లక్షలాది కోళ్లన ఏరిపారేస్తున్నారు. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తిపై జపాన్ ప్రభుత్వం స్పందించింది. తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది.
పసిఫిక్ ఐలాండ్ లో మంగళవారం 3, 10.000 కోళ్లను నిర్మూలించినట్టు జిన్హువా న్యూస్ వెల్లడించింది. గతంలో సుమారు 40 కోళ్లు చనిపోవడంతో జరిగిన పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఉనికిని నిర్ధారించింది. అత్యధికనష్టం కలిగించే అంటురోగ కారక క్రిమిని గుర్తించినట్టు తేల్చింది. దీంతో నియోగాటా, అయోమోరి ప్రదేశాలకు సమీపంలోని 10 కి.మీ దూరంలో గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాను స్థానిక ప్రభుత్వం సంస్థ నిషేధించింది. ఈ విషయంలో సంబంధిత అధికారులు సహకరించాల్సిందిగా ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలు, సంస్థలకు జపాన్ ప్రధాని షింజో అబే ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇటీవల బర్డ్ ఫ్లూ వ్యాప్తికి సంబంధించి గరిష్టంగా బర్ద్ ఫ్లూ వైరస్ నమునా-3 హెచ్చరికలను జారీ చేసిన సంగతితెలిసిందే.
ప్రాణాంతక బర్డ్ ఫ్లూ కలకలం
Published Tue, Nov 29 2016 2:04 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
Advertisement
Advertisement