
డెన్మార్, యూరప్ దేశాలను వేడుకుంటున్న అమెరికా
వాషింగ్టన్: అమెరికాలో కోడిగుడ్ల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. నానాటికీ పెరిగిపోతున్నాయే తప్ప ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. బర్ల్‌ఫ్లూ వల్ల కోళ్లు చాలావరకు చనిపోయాయి. దాంతో గుడ్ల కొరత తలెత్తింది. అమెరికా మార్కెట్‌లో గుడ్ల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుడ్ల ధరలను నేలకు దించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
విదేశాల నుంచి దిగుమతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తమకు తగినన్ని కోడిగుడ్లు సరఫరా చేయాలని డెన్మార్క్‌తోపాటు ఇతర యూరప్ దేశాలకు తాజాగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమెరికా వ్యవసాయ విభాగం ఆయా దేశాలకు లేఖలు రాసింది. ట్రంప్ ప్రభుత్వం ఒకవైపు యూరప్ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ, మరోవైపు గుడ్లు సరఫరా చేయాలని కోరుతుండడం గమనార్హం.
యూరప్‌లో కూడా తగినంత గుడ్ల ఉత్పత్తి లేదని, అమెరికాకు ఇప్పట్లో భారీగా గుడ్లు ఎగుమతి చేయడం కష్టమేనని డెన్మార్క్ ఎగ్ అసోసియేషన్ వెల్లడించింది. ఇదిలా ఉంటే, డెన్మార్క్‌పై డొనాల్డ్ ట్రంప్ గుడ్లురుముతున్నారు. గ్రీన్‌లాండ్‌ను తమకు అప్పగించకపోతే డెన్మార్క్‌పై ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే హెచ్చరించారు.
అమెరికాలో గత ఏడాది డిసెంబర్ నుంచి గుడ్ల ధరలు క్రమంగా ఎగబాకుతున్నాయి. ఈ నెల 5వ తేదీన డజన్ గుడ్ల ధర 8.64 డాలర్లకు (రూ.751) చేరుకుంది. అంటే ఒక్కో గుడ్డు ధర 62 రూపాయలు. ఈ నెల 5 నుంచి గుడ్ల ధరలు తగ్గుతున్నట్లు అమెరికా వ్యవసాయ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం డజన్ గుడ్ల ధర 4.90(రూ.425) డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment