Egg price hike
-
కోడిగుడ్డుకు రెక్కలొచ్చాయి!
సాక్షి, హైదరాబాద్: నిజంగానే కొడిగుడ్డుకు రెక్కలొచ్చాయి. ఒక్క గుడ్డు చిల్లర ధర ఏకంగా రూ.7 దాటింది. కార్తీకమాసం ముగిసిన వెంటనే గుడ్డు ధర అమాంతం పెరిగింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ(ఎన్ఈసీసీ) ఒక గుడ్డు ధరను రూ.6.20గా నిర్ణయించింది. 30 గుడ్ల ట్రే ధర రూ.186. వెన్‌కాబ్ వంటి కొన్ని చికెన్ విక్రయ సంస్థలు 12 గుడ్లను రూ.85కు విక్రయిస్తున్నాయి. అంటే ఒక్క గుడ్డు ధర రూ.7.08. హైపర్ మార్కెట్లు, ఆన్లైన్ మార్కెట్లలో ప్రొటీన్ గుడ్లు, నౌరిష్ గుడ్లు, విటమిన్ –డి, విట్రిచ్, హై ప్రొటీన్, బ్రౌన్ ఎగ్స్‌గా ప్యాక్ చేసి విక్రయించే ఒక్కో గుడ్డు ధర రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. హెర్బల్ గుడ్ల పేరిట ఓ కంపెనీ ఆన్లైన్ ప్లాట్‌ఫాంపై 6 గుడ్లను ఏకంగా రూ.112కు విక్రయిస్తోంది. సామాన్యులు ఇళ్ల దగ్గరి దుకాణాల్లో రిటైల్‌గా కొనుగోలు చేసే గుడ్లను మాత్రం రూ.7.. అంతకంటే కొంచెం పెంచి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌తోనే గుడ్డు ధర భారీగా పెరిగిందని తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కోళ్లకు ప్రధాన దానా అయిన మొక్కజొన్న ధర పెరగటం కూడా గుడ్డు ధర పెరగటానికి కారణమని చెబుతున్నారు.తెలంగాణ, ఏపీల్లోనే అధిక ఉత్పత్తిదేశంలో పౌల్ట్రీ పరిశ్రమ దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడులోనే ప్రధానంగా కేంద్రీకృతమైంది. దేశంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతిరోజు 32 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అయితే, ఈ మూడు రాష్ట్రాల్లోనే 15 కోట్ల వరకు ఉత్పత్తి అవుతాయి. రోజూ 5 కోట్లకు పైగా గుడ్ల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. పౌల్ట్రీ పరిశ్రమకు చలికాలం మాత్రమే మంచిరోజులని, డిమాండ్ పెరిగి పౌల్ట్రీ వ్యాపా రులకు లాభాలు వస్తాయని ఈ పరిశ్రమకు చెందిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. చలికాలంలో కోడిగుడ్ల వినియోగం ఎక్కువ గానే ఉంటుందని వెంకటేశ్వర హ్యాచరీస్ జనరల్ మేనేజర్ కె.జి. ఆనంద్ చెప్పారు. -
సామాన్యులకు బిగ్ షాక్.. పెరిగిన కోడిగుడ్డు ధర
-
‘ఎగ్’బాకుతున్న ధర
సాక్షి, భీమవరం/ నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, పప్పులు, నూనెలు ఏవీ కొనేటట్టు లేవు. కూరగాయలు కూడా కిలో 60కి తక్కువ ఏదీ లేదు. కాస్తో కూస్తో కోడి గుడ్డే చవగ్గా ఉందనుకుంటే ఇప్పుడు అదీ కొండెక్కి కూర్చుంటోంది. రిటైల్‌గా ఒక్కో గుడ్డు రూ.7కి తక్కువ లేదు. కొన్ని జిల్లాల్లో రూ.8.00కి ఎగబాకేసింది. ఈ సీజన్లోనూ గుడ్డు ధర ఫాం గేటు వద్దే పరుగులు పెడుతోంది. ప్రస్తుతం రూ.6.20తో పాత ధరను చేరుకొంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. హోల్‌సేల్‌లో ధరే వంద గుడ్లు ధర రూ.700కు చేరింది. రిటైల్ మార్కెట్లోకి వచ్చే సరికి మరో రూపాయి పెరిగి రూ.8కి చేరడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. ఫాం గేటు వద్ద ధర పెరిగితే రిటైల్ ధర కూడా ఇంకా పెరుగుతుందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. ఇంత ధర పెట్టి కొనలేమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు 4.4 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 శాతం గుడ్లు పశి్చమ బెంగాల్, బీహార్, అసోం, ఒడిశా, యూపీ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటే మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉత్పత్తయ్యే గుడ్లలో అధిక శాతం స్థానికంగానే వినియోగమవుతున్నాయి.శీతాకాలం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువై, ఎగుమతులు పెరిగి ఫాం గేటు ధర పెరుగుతోంది. గత డిసెంబరు 27న ఫాం గేట్ వద్ద రూ.6.20తో అత్యధిక ధర నమోదయింది. ఆ తర్వాత తగ్గినా.. మళ్లీ క్రమేపీ పెరిగి గురువారం రూ.6.20కి చేరింది. మరోపక్క రైతులకు కూడా మేత ధరలు, రవాణా ఖర్చులూ పెరిగిపోయాయి. ధరలు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. రైతులకు ఎటువంటి సహాయం చేయడంలేదు. దీని ప్రభావం ధరలపై పడుతోంది. రైతుకేమీ లాభం లేదంటున్న పౌల్ట్రీ వర్గాలు ప్రస్తుతం గుడ్డు ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీ, పెరిగిన మేత ధరలతో రైతుకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కొద్దికాలంగా పౌల్ట్రీలు విస్తరించి, రోజుకు 2.5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో కోస్తా గుడ్లకు డిమాండ్ తగ్గింది. పైగా, ఇక్కడి నుంచి వెళ్లే ఒక్కో గుడ్డుపై రూపాయి వరకు రవాణాకు ఖర్చవుతుండగా అక్కడి గుడ్లపై 25 పైసల లోపే ఉంటోంది. దీంతో అక్కడి మార్కెట్ ధరకు తగ్గించి అమ్మడం వల్ల నష్టపోతున్నామని కోళ్ల రైతులు అంటున్నారు. మరోపక్క కోళ్ల మేతలో ఎక్కువగా వాడే మొక్కజొన్న ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువ సాగవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రవాణా చార్జీల భారం పెరిగిపోతోంది. దీనికితోడు ఇథనాల్, ఆల్కహాల్ పరిశ్రమలు మొక్కజొన్నతో పాటు కోళ్ల మేతలో వాడే పాడైన బియ్యం నూకలను కూడా భారీగా కొనేస్తుండటంతో ఇవి రైతాంగానికి దొరకడంలేదు. గతంలో పంట వచ్చిన సమయంలో కిలో రూ.18 ఉండే మొక్కజొన్న ఇప్పుడు రూ.27 ఉంది. దీంతో నిర్వహణ భారంగా మారిందని రైతులు చెబుతున్నారు. ఏడాది సగటు రైతు ధర రూ.5.75 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని, ఈ ఏడాది రూ.5 లోపే ఉండటంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది సీజన్..చలి ఎక్కువగా ఉండే నవంబరు నుంచి ఫిబ్రవరి నెల వరకు పౌల్ట్రీకి సీజన్‌గా భావిస్తారు. ఏటా ఈ కాలంలో రైతు ధర పెరుగుతూ ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలంలో చేపల లభ్యత తగ్గుతుంది. దీంతో అక్కడ గుడ్ల వినియోగం పెరుగుతుంది. రాష్ట్రంలోనూ చలి కాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. కార్తీక మాసమూ ముగిసింది. పైపెచ్చు క్రిస్మస్, నూతన సంవత్సరం వస్తుండడంతో కేక్‌లకు డిమాండ్ ఉంటుంది. కేకులలో కోడిగుడ్లు తప్పనిసరిగా వాడతారు. సంక్రాంతికి కూడా గుడ్లకు డిమాండ్ ఎక్కువే. అందువల్ల ఇప్పటి నుంచే గుడ్లు ధర పెంచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.ప్రభుత్వం ఆదుకుంటేనే పౌల్ట్రీలకు మనుగడ మేత ధరలు, నిర్వహణ భారం విపరీతంగా పెరిగిపోయి గుడ్డు ధర గిట్టుబాటు అవ్వక కొన్నేళ్లుగా కోళ్ల పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. మొక్కజొన్న, నూకలను ఇథనాయిల్, ఆల్కహాల్ కంపెనీలు ముందుగానే టోకుగా కొనేస్తుండటంతో కోళ్లకు మేత దొరకడం కష్టమవుతోంది. మొక్కజొన్న, ఎఫ్‌సీఐలో పాడైన బియ్యం, నూకలను సబ్సిడీపై అందించి ప్రభుత్వం ఆదుకోవాలి. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి,అర్తమూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లారేట్లు ఎక్కువగా ఉన్నాయి కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. పెరగడమే తప్ప తగ్గడం అనేది లేదు. గుడ్డు తిందామన్నా రేట్లు చూసి మానుకోవాల్సి వస్తోంది. – వినయ్, స్టౌన్‌హౌస్‌పేట, నెల్లూరు జిల్లాఅన్ని రేట్లు పెరిగాయి ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. కనీసం గుడ్డు తిందామన్నా రేట్లు చూస్తే భయమేస్తోంది. కొందరు వ్యాపారులు కావాలనే రేట్లు పెంచుతున్నారనే ఆనుమానాలు కలుగుతున్నాయి.– బ్రహ్మరెడ్డి, డీసీ పల్లి, నెల్లూరు జిల్లా -
భారీగా పెరిగిన కోడి గుడ్డు ధర
-
‘గుడ్లు’తేలేస్తుండ్రు... బెంబేలెత్తిస్తున్న కోడిగుడ్ల ధర
దౌల్తాబాద్: మధ్య తరగతి ప్రజల పౌష్టికాహారమైన కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు నిత్యావసర ధరలు మండిపోతుండగా మరో వైపు చికెన్, మటన్, చేపల ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు సామాన్యులకు అందుబాటులో ఉండే గుడ్డు ధర కూడా అమాంతంగా పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టికాహారం.. ఆరోగ్యంగా ఉండాలంటే బలవర్ధకమైన పౌష్టికాహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. సామాన్యులు ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేస్తారు. ఇమ్యూనిటినీ పెంచుకోవడం కోసం ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం విశేషం. మండలంలో కోడిగుడ్లు ఉత్పత్తి అంతంత మాత్రంగా నే ఉండడంతో ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఐదేళ్ల నుంచి పౌల్ట్రిఫాం రైతులు నష్టాలు చవిచూడడం.. కోడిపల్లల పెంపకాన్ని తగ్గించడంతో గుడ్ల ధరల పెరుగుతున్నాయని పలువురు పేర్కొంటునారు. గత ఏప్రిల్‌లో గడ్డు ధర రూ.4నుంచి రూ.4.50వరకు ఉండగా ప్రస్తుతం రిటైల్‌గా రూ.6.50 వరకు ఉంది. ఓల్‌సేల్ వ్యాపారులు మార్కెట్ ధర ప్రకారం గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ రిటైల్ వ్యాపారులు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. -
తెలంగాణ: కోడి గుడ్డు రేటు రయ్.. రయ్..
హైదరాబాద్: తెలంగాణలో కోడి గుడ్ల ధరలు రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. రూ. 6.50కే అమ్మో అనుకుంటున్న సామాన్యుడికి మళ్లీ పెంపు వార్త ఆందోనళకు గురిచేస్తోంది. తాజాగా గుడ్డు ధర మళ్లీ పెరిగింది. ఇక, పది రోజుల్లో డజను కోడిగుడ్ల ధర ఏకంగా రూ.80కి చేరుకుంది. దీంతో, బయట దుకాణాల్లో లూజ్ ధర మళ్లీ పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏడాది నుంచి డజను గుడ్ల ధర రూ.65 నుంచి రూ. 70 మధ్య ఉంది. అయితే.. ఇప్పుడు ఏకంగా ఎనభైకి చేరడం గమనార్హం. -
Egg Prices: దూసుకెళ్తున్న కోడిగుడ్డు
సాక్షి, చిత్తూరు: కోడిగుడ్డు ధర దూసుకెళుతోంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు గుడ్డు తినాలని వైద్యులు సూచించడంతో రెండేళ్లుగా వినియోగం పెరిగింది. డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడంతో కొంతమేర దిగుమతి తగ్గింది. దీంతో 30 గుడ్ల ట్రే రూ.120నుంచి రూ.180కి పెరిగింది. కోడిగుడ్ల ధర అమాంతం పెరిగిపోయింది. పదిరోజుల వ్యవధిలో గుడ్డుపై రూ.1.50 పెరిగింది. 30 గుడ్ల ట్రే పదిరోజుల క్రితం రూ.120 ఉండగా ప్రస్తుతం హోల్‌సేల్ దుకాణాల్లోనే రూ.160 నుంచి రూ.180వరకు విక్రయిస్తున్నారు. ఇక చిల్లర దుకాణాల్లో అయితే విడిగా రూ.7కు విక్రయిస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో రోజూ దాదాపుగా 3వేల బాక్సుల గుడ్లు అమ్ముడుపోతున్నాయి. చిత్తూరు ప్రాంతంలో గతంలో కంటే ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమలు తక్కువగా ఉండడంతో హైదరాబాద్, మహబూబ్‌నగర్, విజయవాడ ప్రాంతాల నుంచి గుడ్లు రవాణా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చదవండి: (ఐహెచ్ఐపీతో అంటువ్యాధులకు చెక్!) -
కొండెక్కిన కోడిగుడ్డు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కోడిగుడ్డు ధర కొండెక్కింది. మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర ఏకంగా రూ. 6కు ఎగబాకి ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తోంది. కరోనా లాక్డౌన్ ముందు వరకు రూ. 4 నుంచి రూ. 4:50 వరకు పలికిన ధర గత కొన్ని రోజు లుగా రూ. 5 పలుకుతోంది. తాజాగా రూ. 6కు పెరిగింది. 2017 సెప్టెం బర్లో అత్యధికంగా రూ. 5.35 ధర పల కగా ఇప్పుడు దాన్ని మించి ధర నమోదు కావడం గమనార్హం. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక విక్రయాల్లో ముందు వరుసలో ఉన్నది కోడిగుడ్డే. రోగ నిరోధకశక్తిని పెంచు కొనే క్రమంలో రోజుకొక కోడిగుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుండటంతో గుడ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడంతో ఉత్పత్తి తగ్గింది. దీంతో కోడిగుడ్డు ధర పెరిగిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. డిమాండ్ పెరిగి... ఉత్పత్తి తగ్గి... దక్షిణాధి రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లు, లైవ్ బర్డ్స్‌లో సగం ఇతర రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంటాయి. అయితే కరోనా లాక్డౌన్, ఆ తర్వాతి పరిస్థితుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులు కొంతకాలం వరకు కొత్తగా బర్డ్స్ వేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గింది. రాష్ట్రంలో రోజుకు సగటున 3.65 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 2.80 కోట్లకు తగ్గింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న గుడ్లలోనూ సగం పొరుగు రాష్ట్రలకు ఎగుమతి అవుతుండటంతో రాష్ట్రంలో నిత్యం 1.4 కోట్ల కోడిగుడ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు కోడిగుడ్లను తినాలన్న వైద్యుల సూచనతో గుడ్ల వినియోగం రోజుకు 1.3 కోట్ల నుంచి 2 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేక ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఆహారానికి సంబంధించిన ముడిసరుకు, రవాణా చార్జీలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చిన్నారులకు బంద్... కోడిగుడ్డు ధర ఒక్కసారిగా పెరగడంతో ఆ ప్రభావం అంగన్వాడీ కేంద్రాలపై పడింది. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ ఒక గుడ్డును ఇస్తుంటారు. ఇందుకోసం ఏటా టెండర్ల పద్ధతిలో డీలర్లను ఎంపిక చేసి రోజుకు సగటున 8 లక్షల కోడిగుడ్లు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో తమకు గిట్టుబాటు కావట్లేదనే సాకుతో డీలర్లు 10 రోజులుగా పంపిణీని నిలిపివేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు గుడ్లను అందించలేకపోతున్నారు. -
గుడ్లు తేలేయాల్సిందే!
సాక్షి,సిటీబ్యూరో: కోడిగుడ్ల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. కొన్ని రోజులుగా నగరంలో గుడ్ల వినియోగం విపరీతంగా పెరగడం.. చలితో దిగుబడి తగ్గడంతో ధరలు మండుతున్నాయి. సాధారణ రోజుల్లో జంట నగరాల్లో రోజుకు సుమారు 45 లక్షల గుడ్ల అమ్మకాలు జరుగుతుండగా.. గతవారం నుంచి రోజుకు 60 లక్షలకు పైగా అమ్ముడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో «గుడ్డు ధర కూడా రికార్డు స్థాయిలో పెరిగిందంటున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.5.50 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.6గా ఉంది. ఇక నగర శివారు ప్రాంతాల్లో అదే గుడ్డు రూ.6.50 పైసల నుంచి రూ.7 వరకు కిరాణా షాపుల్లో విక్రయిస్తున్నారు. వినియోగంలో మనదే పైచేయి.. దేశంలో అత్యధికంగా గుడ్ల ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తర్వాత తెలంగాణ మూడోస్థానంలో ఉన్నాయి. అయితే, తలసరి వినియోగంలో మాత్రం తెలంగాణనే ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో రోజుకు 3.25 కోట్ల గుడ్ల ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 60 శాతం ఇక్కడే వినియోగిస్తున్నారు. మిగితా 40 శాతం గుడ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఉత్పత్తిలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న ఆంధ్ర, తమిళనాడుల్లో మాత్రం స్థానికంగా 50 శాతం కంటే తక్కువగా వినియోగిస్తున్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ సూచన ప్రకారం ఒక వ్యక్తి ఏడాదికి 180 గుడ్లు తినాలి. అయితే, దేశంలో తెలంగాణలో మాత్రమే అత్యధికంగా సగటున ఒక్కో వ్యక్తి 174 గుడ్లు తింటున్నట్టు నివేదిలో పేర్కొంది. గ్రేటర్లో 60 లక్షల వినియోగం గ్రేటర్ శివారు ప్రాంతాల్లో వెలిసిన కోళ్ల ఫారాల్లో అత్యధికంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి ఎక్కువ గుడ్లు నగరానికి దిగుమతి అవుతున్నాయి. అలా ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు 60 లక్షల గుడ్లు వినియోగిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. చలికాలంలో గుడ్ల వినియోగం పెరగడం సహజం. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న గుడ్లు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు ఎగుమతి అవుతున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు ఓ కారణంగా హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో గుడ్ల ధర పెరుగుతుంది. అయితే, అనుకున్న స్థాయిలో ఉత్పత్తి మాత్రం లేదని ‘నెక్’ బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావర్ తెలిపారు. కోళ్ల దాణా ధరలు సైతం విపరితంగా పెరిగాయని, ఆ ప్రభావం కూడా గుడ్ల ధరపై పడిందంటున్నారు. -
ఎగ్బాకింది.. చికెన్ చీపైంది..
పోషకాహారంలో అగ్రభాగాన నిలిచే కోడిగుడ్డు సామాన్యులకు అందకుండా పోతోంది. దానికి భిన్నంగా చికెన్ ధర నేలచూపులు చూస్తోంది. ఇప్పటికే కూరగాయల ధరలు మండిపోతుండగా, ఇప్పుడు కోడిగుడ్డు ధర కూడా పెరగడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. మొన్నటి దాక రూ.4 పలికిన గుడ్డు ధర ఇప్పుడు అమాంతం రూ.6కి పెరిగింది. దీంతో కోడిగుడ్డు ధర వింటేనే సామాన్యులు అమ్మో అంటున్నారు. అలాగే వారంలో కిలో చికెన్ ధర రూ.40 తగ్గింది. దీంతో మాంసప్రియులకు ఇది శుభవార్తే అయ్యింది. మార్కెట్లో గుడ్ల ఉత్పత్తి తగ్గడం, కోళ్ల పెంపకం పెరగడంతోనే ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. మోర్తాడ్(బాల్కొండ): కోడిగుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. అంటూ నిత్యం పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు చూస్తూనే ఉంటాం. అలాంటి పోషకాహారమైన గుడ్డు ధర ప్రస్తుతం రూ.6 పలుకుతోంది. ఇంట్లో కూరగాయలు లేకపోతే ఉడికించిన గుడ్డుతోనో, లేదా ఆమ్లెట్తోనో ఆ పూటకు సరిపెట్టుకునే వారు న్నారు. తక్కువ ధరకే దొరికే బలవర్ధక ఆహారం కావడంతో చిన్నపిల్లల ఆహారంలోనూ గుడ్డుకు ప్రాధాన్యత ఉంది. సాధారణంగా మూడు, నాలు గు రూపాయల ధర ఉండే గుడ్డు ఇప్పుడు రూ.6కి చేరింది. మారుమూల గ్రామాల్లో అయితే రూ.7కు కూడా అమ్ముతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, వినియోగం పెరగడంతో ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఏటా డిసెంబర్లో గుడ్ల ధరలు పెరుగుతుంటాయి. కానీ, ఈ ఏడాది నవంబరులోనే ధర గరిష్ట స్థాయికి చేరింది. ఇప్పటికే కూరగాయల ధరలు మండిపోతుండగా ప్రస్తుతం గుడ్డు ధర కూడా సామాన్యులు కొనలేని స్థాయికి చేరింది. తగ్గిన చికెన్ ధర.. కోళ్ల పెంపకం పెరగడంతో చికెన్ రేట్లు తగ్గినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రేట్లు తగ్గడంతో మాంసప్రియులు చికెన్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కోడి లైవ్ కిలోకు హోల్‌సెల్ ధర రూ.50 నుంచి రూ.60గా ఉండగా, గతంలో రూ.90 నుంచి రూ.100 ఉంది. అలాగే చికెన్ స్కిన్‌తో కిలోకు రూ.130 నుంచి రూ.140 వరకు ధర ఉండగా, ఇప్పుడు రూ.90 నుంచి రూ.100కు తగ్గింది. స్కిన్లెస్ చికెన్ కిలోకు రూ.160 నుంచి రూ.170 వరకు ఉన్న ధర, ఇప్పుడు కిలోకు రూ.130 నుంచి రూ.140కి తగ్గింది. చికెన్ ధరలు మార్కెట్లో పతనం కాగా కోడి గుడ్డు ధర మాత్రం అమాంతం పెరిగింది. మార్కెట్లో కోడిగుడ్లకు కొరత.. పౌల్ట్రీ పరిశ్రమలో కోడిగుడ్లకు సంబంధించిన షెడ్లు వేరుగా, బాయిలర్ చికెన్ ఉత్పత్తి కోసం కోళ్లు పెంచడానికి షెడ్లు వేరుగా ఉంటాయి. అంతేకాక కొంతమంది పౌల్ట్రీ వ్యాపారులు కేవలం గుడ్ల ఉత్పత్తికి మొగ్గు చూపుతుండగా, మరికొందరు కోళ్లను పెంచడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. రెండు, మూడు సంవత్సరాల నుంచి కోడిగుడ్లకు సంబంధించిన పరిశ్రమ నష్టాలను చవిచూసింది. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో మార్కెట్లో కోడిగుడ్లకు కొరత ఏర్పడింది. అందువల్లనే గుడ్ల ధరలు అమాంతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కాగా బాయిలర్ కోళ్ల ఉత్పత్తి గతంలో కంటే ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో చికెన్ సరఫరా బాగానే ఉంది. దీంతో చికెన్ ధరలు తగ్గిపోయాయని వ్యాపారులు తెలిపారు. కోడి, గుడ్డు ధరల్లో భిన్నమైన మార్పులు చోటు చేసుకోవడం విశేషం. -
భారీగా పెరిగిన గుడ్ల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చుంటే.. నేనమ్మా తక్కువా అంటూ కోడి గుడ్డు ధరలు గుండె గుబేలుమనిపిస్తున్నాయి. ఏకంగా కోడి గుడ్డు ధరలు 40 శాతం మేర పెరిగాయి. నిన్న మొన్నటి దాకా రూ.4 ఉన్న కోడి గుడ్డు ధరలు, నేడు ఏకంగా రూ.7 నుంచి రూ.7.50గా పలుకుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం సరఫరా తగ్గిపోవడమేనని, మరోవైపు జీఎస్టీ రేట్లు పెరగడంతో ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రమేష్ కాత్రి చెప్పారు. వచ్చే నెలల్లో కూడా కోడి గుడ్డు ధరలు మరింత పెరగనున్నట్టు పేర్కొన్నారు. గుడ్ల ఉత్పత్తి ఈ ఏడాదిలో 25-30 శాతం తగ్గిపోనుందని చెప్పారు. గతేడాది సరియైన రేట్లు లభించకపోవడంతో చాలా ఫౌల్ట్రీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించాయని, దీంతో ఈ ఏడాది రేట్లు ఎగిశాయని తెలిపారు. 2016-17లో హోల్‌సేల్‌గా గుడ్డు ధరలు రూ.4 కంటే తక్కువగానే ఉండేవి. గతేడాది రేట్లు తగ్గిపోవడంతో వచ్చిన నష్టాల మేరకు ఫౌల్ట్రీ సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించాయని కాత్రి వివరించారు. మరోవైపు కోడి గుడ్ల ధర పెరగడంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు వాపోతున్నారు. అంతేకాక ఇటు పెరిగిన గుడ్ల ధరలకు వినియోగదారులు కూడా తట్టుకోలేకపోతున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి కాలంలో ఉత్తర భారతంలో వినియోగం పెరిగి రేట్లు పెరుగుతాయని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరాజు తెలిపారు. దేశ రాజధాని రిటైల్ మార్కెట్లలో కోడి గుడ్ల ధరలు ఒక్కోటి రూ.7 నుంచి రూ.7.50 మధ్యలో పలుకుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. -
గుట్టెక్కిన గుడ్డు!
స్టేషన్ మహబూబ్‌నగర్: నలుగురు డిగ్రీ విద్యార్థులు ఎక్కడి నుంచో వచ్చి జిల్లా కేంద్రంలో గది అద్దెకు తీసుకుని చదువుకుంటున్నారు, ఉదయం లేచి కళాశాలకు వెళ్లి, రావడంతోనే సమయం సరిపోతుండగా వంట విషయానికొచ్చే సరికి కోడిగుడ్లు గుర్తుకొస్తాయి.. ఓ ఇంటికి అనుకోని అతిథులు వచ్చారు, ఇంటి యజమానికి ఆఫీస్‌కు వెళ్లడంతో గృహిణి మాత్రమే ఉంది, వచ్చిన అతిథులకు వంట చేయాలనగానే పక్క షాపు, అందులోని కోడిగుడ్లే మదిలోకి వస్తాయి.. ఇలా ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండి ఆపదలో ఆదుకునే కోడిగుడ్ల ధరలకు ఇప్పుడు రెక్కలొచ్చాయి! ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా గుడ్ల ధరలు అమాంతం పెరుగుతుండడంతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు కూరగాయలు, మటన్, చికెన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కోడిగుడ్లతోనైనా సరిపెట్టుకుందామన్న పేద ప్రజల ఆశలపై పెరిగిన ధరలు నీళ్లు చల్లుతున్నాయి. చలితీవ్రత ఎక్కువగా ఉండడం, డిమాండ్ సరిపడా ఉత్పత్తి తక్కువగా ఉండడంతో గుడ్ల ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. బంధం కోల్పోయిన డిమాండ్ సప్లయ్‌మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కలిపి దాదాపు 180 పౌల్ట్రీ ఫాంలు ఉన్నాయి. అన్ని ఫాంల్లో కలిపి రోజుకు నాలుగు జిల్లాల పరిధిలో 1.20 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఇందులో కోటి గుడ్లను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కోల్‌కత్తాకు ఎగుమతి చేస్తారు. మిగిలిన గుడ్లతోనే జిల్లా ప్రజలు సరిపెట్టుకోవాలి. కానీ జిల్లా అవసరాలకు 30లక్షల గుడ్లు అవసరమైతే 20 లక్షలే ఉంటున్నాయి. ఇలా డిమాండ్‌కు తగినట్లు సప్లయి లేకపోవడంతో ధర పెరుగుతూ వస్తోంది. ఇక 2012 నుంచి పౌల్ట్రీ రైతులు నష్టాలు వస్తున్నాయన్న ఆవేదనతో కోడిపిల్లల పెంపకాన్ని తగ్గించడం కూడా గుడ్లు అందుబాటులో లేకపోవడానికి, ధర పెరగడానికి ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు. అదిగాక కూరగాయల ధరలు విపరీతం గా పెరుగుతుండడంతో ప్రజలు గుడ్ల కొనుగోలుకు ప్రా«ధాన్యత ఇస్తుండడం కూడా ధర పెరుగుదలకు మరో కారణమనితెలుస్తోంది. జూలై నుంచి.. ఈ ఏడాది జూలై నుంచి గుడ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. జూలై నెలలో సరాసరి ఒక గుడ్డు ధర రూ.3.35 ఉండగా ఈనెలలో 14వ తేదీ మంగళవారం నాటికి ఒక గుడ్డు ధర హోల్‌సేల్‌లో రూ.4.93గా నమోదైంది. రోజురోజు 2 నుంచి 5 పైసల వరకు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సెల్ వ్యాపారులు మార్కెట్ ధర ప్రకారం గుడ్లు సరఫరా చేస్తున్నా రిటైల్ వ్యాపారులు ఒక గుడ్డును రూ.5.30 నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నారు. మారుమూల గ్రామాలు, రవాణా సౌకర్యం అంతగా లేని గ్రామాల్లోనైతే ఒక గుడ్డు రూ.7 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత ఎన్నడూ చూడలేదు... గుడ్డు ధర ఇంత పెరగడం ఎప్పుడు చూడలేదు. చలితీవ్రత ఎక్కువగా ఉండడం, డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. నెల రోజులుగా వ్యాపారం అంతంతే ఉంది. గుడ్లు దించేటప్పుడు, ఎక్కించేటప్పుడు జాగ్రత్త పడాలి. ఒక్కో గుడ్డును పగిలిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్పత్తి పెరిగితే గుడ్ల ధరలు తగ్గే అవకాశం ఉంద. – సయ్యద్ అయాజ్ షర్ఫీ, ఎస్ఆర్ ఎగ్‌సెంటర్ మరో ఆరు నెలల ఇంతే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. మరో ఆరు నెలల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. గత నాలుగేళ్ల నుంచి పౌల్ట్రీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది రైతులు పెట్టుబడి పెట్టలేక కోళ్ల పెంపకాన్ని తగ్గించడంతో గుడ్ల ఉత్పత్తి కూడా పడిపోయింది. గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో 2000 మంది పౌల్ట్రీ రైతులు ఉంటే వారి సంఖ్య ఇప్పుడు 200 కు పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్‌కు తగినట్లు గుడ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. – జూపల్లి భాస్కర్‌రావు,తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి -
గరిష్టస్థాయికి గుడ్డు ధర..
-
‘గుడ్లు’ తేలేయాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు పెరుగుతున్న కూరగాయల ధరలు.. మరోవైపు ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో గతంలో ఎన్నడూ లేనంతగా కోడి గుడ్డు ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రతికూల పరిస్థితులు, వ్యాపార ఒడిదుడుకులు, రెట్టింపైన వినియోగం కూడా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ లో గుడ్డు ధర రూ.4.66 కాగా.. రిటైల్‌లో రూ.5.25.. చిల్లరగా మాత్రం గుడ్డు ఒక్కొక్కటీ రూ.6 పలుకుతోంది. దీంతో గుడ్డుతో పూట గడుస్తుందని భావించే సామాన్యులపై గుదిబండ పడినట్లయింది. సగానికి తగ్గిన ఉత్పత్తి.. రాష్ట్రంలో కోడి గుడ్ల ఉత్పత్తి సగానికి పడిపోయింది. రాష్ట్రం మొత్తం మీద ప్రతిరోజూ సగటున నాలుగు కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతాయి. మూడు కోట్ల వరకూ వినియోగం ఉంటుంది. ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు సగటున 1.20 కోట్ల గుడ్ల వరకు డిమాండ్ ఉంటుంది. శివారు ప్రాంతాల్లోని పౌల్ట్రీల నుంచి అత్యధికంగా గుడ్లు నగరానికి సరఫరా అవుతాయి. అయితే మూడేళ్లుగా పౌల్ట్రీ వ్యాపారం బాగా దెబ్బతింది. కోళ్లకు రోగాలు రావడం, నిర్వహణ ఖర్చులు ఎక్కువ కావడంతో వ్యాపారులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద నోట్ల రద్దు పౌల్ట్రీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రజల వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా గుడ్ల వినియోగం తగ్గింది. గుడ్డు ధర కూడా పడిపోయింది. చిన్న వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోయి ఉత్పత్తికి దూరమయ్యారు. దీంతో ఉత్పత్తి సగం మేర నిలిచిపోయింది. ఇదిలా ఉండగా మార్కెట్లో మాత్రం గుడ్డు వినియోగం పెరిగింది. గతంలో అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి మూడుసార్లు గుడ్లు అందిస్తే.. ఇప్పుడు ప్రతిరోజు అందిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంలో గుడ్డు తప్పనిసరి చేశారు. దీంతో వీటి వినియోగం అధికమైంది. కానీ మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో గుడ్డు ధర ఆకాశాన్నంటింది. గరిష్టస్థాయికి గుడ్డు ధర.. ఆరు నెలలుగా కోడి గుడ్ల ధర ఎగబాకుతూ వస్తోంది. గత నెల వరకూ గుడ్డు హోల్‌సేల్ ధర రూ.3.60 ఉండగా.. నవంబర్ 1వ తేదీకి అది రూ.4.27కు చేరింది. మరో పది రోజుల్లోనే గరిష్టంగా రూ.4.66కు పెరిగింది. ఇక రిటైల్ ధర రూ.5.25 ఉన్నప్పటికీ మార్కెట్లో గుడ్డు ధర రూ.6 పలుకుతోంది. చలికాలం కావటంతో ఏటా ఈ సీజన్లో గుడ్డు ధర పెరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సీజన్ ప్రారంభంలోనే ఇలా ఉంటే వచ్చే మూడు నెలల్లో ధర ఎంత పెరగవచ్చోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కూరగాయలు, ఆకుకూరల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో వినియోగదారులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కార్తీక మాసం కూడా ముగుస్తుండటం, వచ్చే వారం నుంచి శుభకార్యాలు జరిగే అవకాశం ఉండటంతో గుడ్డు వినియోగం ఎక్కువ అవుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. -
గుడ్లురుముతోంది
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: కూరగాయల ధరలు మండిపోతున్నా.. కూర త్వరగా రెడీ కావాలన్నా.. అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది గుడ్డు. ఇక బ్యాచిలర్ల ఫుడ్డుకైతే కొండంత ‘అండా’.. అలాంటి గుడ్డు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సామాన్య ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే కోడిగుడ్డు ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. కార్తీకమాసం ప్రారంభానికి ముందుకు కొండెక్కిన ధర అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకానొక దశలో చికెన్ ధరలు అమాంతం పడిపోయినప్పటికీ గుడ్డు ధర మాత్రం పైసా తగ్గలేదు. వారం రోజుల్నుంచి మరింత పెరిగింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో ఒక గుడ్డు రూ.4.50 పలుకుతుండగా, రిటైల్‌లో రూ.5కు విక్రయిస్తున్నారు. మునుపెన్నడూ లేనంతగా ధర పెరిగిపోవడంతో సామాన్యులు గుడ్డు కొనాలంటేనే జంకుతున్నారు. దాణా ఖర్చులే కారణం... గుడ్డు ధర ప్రియం కావడానికి పెరిగిన కోళ్ల దాణా ఖర్చులే ప్రధాన కారణం అని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. సోయా, నూకలు, మొక్కజొన్నపొడి తదితర దాణా కిలోకు రూ.50కి తక్కువ లేకపోవడంతో ధరను పెంచాల్సి వస్తోందని అంటున్నారు. దీనికితోడు మన దగ్గర ఉత్పత్తి అయిన గుడ్డు బయటి ప్రాంతాలకు ఎగుమతి అవుతుండడంతో ఇక్కడ కొరత ఏర్పడి ధరల పెరుగుదలకు మరో కారణమయ్యాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో చికెన్‌తో పాటు గుడ్డు ధరలు కూడా తగ్గుముఖం పడుతాయి. దీనికి విరుద్ధంగా డిసెంబర్లో గరిష్టంగా రూ.5కు చేరింది. అయినప్పటికీ ఈ ధర తమకు గిట్టుబాటు కావడం లేదని.. రిటైల్ వ్యాపారులకే లాభం చేకూరుతోందని పౌల్ట్రీ వ్యాపారులు వాపోతున్నారు.