సాక్షి, చిత్తూరు: కోడిగుడ్డు ధర దూసుకెళుతోంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు గుడ్డు తినాలని వైద్యులు సూచించడంతో రెండేళ్లుగా వినియోగం పెరిగింది. డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడంతో కొంతమేర దిగుమతి తగ్గింది. దీంతో 30 గుడ్ల ట్రే రూ.120నుంచి రూ.180కి పెరిగింది. కోడిగుడ్ల ధర అమాంతం పెరిగిపోయింది. పదిరోజుల వ్యవధిలో గుడ్డుపై రూ.1.50 పెరిగింది.
30 గుడ్ల ట్రే పదిరోజుల క్రితం రూ.120 ఉండగా ప్రస్తుతం హోల్‌సేల్ దుకాణాల్లోనే రూ.160 నుంచి రూ.180వరకు విక్రయిస్తున్నారు. ఇక చిల్లర దుకాణాల్లో అయితే విడిగా రూ.7కు విక్రయిస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో రోజూ దాదాపుగా 3వేల బాక్సుల గుడ్లు అమ్ముడుపోతున్నాయి. చిత్తూరు ప్రాంతంలో గతంలో కంటే ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమలు తక్కువగా ఉండడంతో హైదరాబాద్, మహబూబ్‌నగర్, విజయవాడ ప్రాంతాల నుంచి గుడ్లు రవాణా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment