egg price
-
ఈ గుడ్డు చాలా కాస్ట్లీ.. ధర రూ.700 మాత్రమే!
కోడిగుడ్డు రూ.400 నుంచి రూ.700 ధర పలుకుతోంది. ఏంటీ కోడిగుడ్డుకు ఇంత ధరా. ఏమిటీ దీని స్పెషాలిటీ అనుకుంటున్నారా? ఇవి అలాంటి.. ఇలాంటి గుడ్లు కాదండోయ్. ఈ గుడ్లు వెరీ స్పెషల్. సంక్రాంతి సంబరాల్లో పౌరుషాన్ని చాటి.. పందేలరాయుళ్లకు కాసుల వర్షాన్ని కురిపించే పందెం కోళ్ల జాతికి సంబంధించిన గుడ్లకు భారీ ధర పలుకుతోంది. కోస్తా జిల్లాల నుంచి వీటిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లా (Prakasam District) తీరంలోని కొత్తపట్నం, సింగరాయకొండ (Singarayakonda) మండలాల్లో పెంచుతున్నారు. వీటి గుడ్లను జాతి పెట్టలతో పొదిగించి.. పుంజులను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. –సాక్షి ప్రతినిధి, ఒంగోలుగుడ్డు రకాన్ని బట్టి ధరపందెం కోడి కోళ్లలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా తూర్పు కోడి, పెర్విన్ కోడి, భీమవరం కోడి, ఎర్ర మైల, అబ్రాసు మైల, కాకి నెమలి, తెల్ల నెమలి, నల్లపడ కోడి, కాకి డేగ, ఎర్ర కక్కెర, తెల్లకోడి, కాకి నెమలి, పెట్టమారు వంటి పుంజులు ఈ జాబితాలో ఉన్నాయి. రకాన్ని బట్టి గుడ్డు ధరలు పలుకుతున్నాయి. ఒక్కో గుడ్డు (Egg) రూ.400 నుంచి రూ.700 వరకూ విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి వీటి ధరలు కూడా పెరిగిపోతుంటాయి. తూర్పు కోడి, భీమవరం కోడి, ఎర్ర కక్కెర, తెల్లకోడి పెట్టిన ఒక్కో గుడ్డు ధర సుమారు రూ.400 వరకు ఉంటుంది.క్రాస్ బ్రీడ్లైన అబ్రాసు మైల, తెల్ల కక్కెర, ఎర్ర మైల తదితర రకాల జాతులకు చెందిన గుడ్డు ఒక్కొక్కటీ రూ.500 నుంచి రూ.700 వరకు ఉంటుంది. పందెం కోడి రకం గుడ్ల కోసం ప్రత్యేకంగా పెంచిన నల్ల పెట్ట, డేగ పెట్ట, తెల్ల పెట్ట, బూడిదరంగు పెట్ట, అబ్రాసు పెట్ట, కక్కెర పెట్టలను ఉపయోగిస్తారు. పందెం కోళ్లతో ఈ పెట్టలు కలవటం ద్వారా గుడ్లు పెడతాయి. ఈ కోళ్లు గుడ్లు పెట్టడమే కానీ.. వాటిని పొదగవు. ఈ కోళ్లు మూడు నెలల్లో 10 నుంచి 15 వరకు గుడ్లను పెడతాయి. ఈ గుడ్లను ప్రత్యేక నాటుకోళ్లతో పొదిగిస్తారు. వీటికి బహిరంగ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది.ప్రత్యేక ఆహారంపందెం కోళ్ల పెంపకంలో ప్రత్యేక ఆహారం పెడతారు. కోడి గుడ్డు పెట్టిన తరువాత మూడు వారాలకు పిల్ల అవుతుంది. అప్పటి నుంచి రెండేళ్లపాటు వాటికి ప్రత్యేక ఆహారం పెడతారు. సుమారు ఏడాదిన్నర పాటు రాగులు, సజ్జలు పెడతారు. తరువాత 6 నెలలు బాదం, ఖర్జూరం, అంజూర్, యాలుక, రసగుల్లా, రంగుల ద్రాక్ష, కిస్మిస్, నాటుకోడి గుడ్డు వంటి బలవర్ధకమైన ఆహారాన్ని పెడతారు. కొన్నింటికి పోతు మాంసం కూడా పెడతారు. దీనిని తినడం ద్వారా పుంజు బలంగా ఉండటమే కాక బరిలో అవతలి పుంజును సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పెంపకందారులు చెబుతున్నారుకుటీర పరిశ్రమగా పందెం కోళ్ల పెంపకంపందెం కోళ్లను కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో కుటీర పరిశ్రమగా పెంచుతున్నారు. కొంతమంది కోడిగుడ్లను అమ్ము కుంటూ ఆదాయం పొందుతుండగా.. మరికొందరు గుడ్లను పొదిగించి వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఇంకొందరు వాటిని బరిలో దిగేలా పెంచి అధిక ధరలకు అమ్ముతున్నారు. కోడి పుంజుల పెంపకం లాభసాటిగా ఉందని.. దూరప్రాంతాల నుంచి వచ్చి పుంజులను కొనుగోలు చేస్తుంటారని పెంపకందారులు వివరించారు. -
కోడిగుడ్డుకు రెక్కలొచ్చాయి!
సాక్షి, హైదరాబాద్: నిజంగానే కొడిగుడ్డుకు రెక్కలొచ్చాయి. ఒక్క గుడ్డు చిల్లర ధర ఏకంగా రూ.7 దాటింది. కార్తీకమాసం ముగిసిన వెంటనే గుడ్డు ధర అమాంతం పెరిగింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ(ఎన్ఈసీసీ) ఒక గుడ్డు ధరను రూ.6.20గా నిర్ణయించింది. 30 గుడ్ల ట్రే ధర రూ.186. వెన్‌కాబ్ వంటి కొన్ని చికెన్ విక్రయ సంస్థలు 12 గుడ్లను రూ.85కు విక్రయిస్తున్నాయి. అంటే ఒక్క గుడ్డు ధర రూ.7.08. హైపర్ మార్కెట్లు, ఆన్లైన్ మార్కెట్లలో ప్రొటీన్ గుడ్లు, నౌరిష్ గుడ్లు, విటమిన్ –డి, విట్రిచ్, హై ప్రొటీన్, బ్రౌన్ ఎగ్స్‌గా ప్యాక్ చేసి విక్రయించే ఒక్కో గుడ్డు ధర రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. హెర్బల్ గుడ్ల పేరిట ఓ కంపెనీ ఆన్లైన్ ప్లాట్‌ఫాంపై 6 గుడ్లను ఏకంగా రూ.112కు విక్రయిస్తోంది. సామాన్యులు ఇళ్ల దగ్గరి దుకాణాల్లో రిటైల్‌గా కొనుగోలు చేసే గుడ్లను మాత్రం రూ.7.. అంతకంటే కొంచెం పెంచి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌తోనే గుడ్డు ధర భారీగా పెరిగిందని తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కోళ్లకు ప్రధాన దానా అయిన మొక్కజొన్న ధర పెరగటం కూడా గుడ్డు ధర పెరగటానికి కారణమని చెబుతున్నారు.తెలంగాణ, ఏపీల్లోనే అధిక ఉత్పత్తిదేశంలో పౌల్ట్రీ పరిశ్రమ దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడులోనే ప్రధానంగా కేంద్రీకృతమైంది. దేశంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతిరోజు 32 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అయితే, ఈ మూడు రాష్ట్రాల్లోనే 15 కోట్ల వరకు ఉత్పత్తి అవుతాయి. రోజూ 5 కోట్లకు పైగా గుడ్ల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. పౌల్ట్రీ పరిశ్రమకు చలికాలం మాత్రమే మంచిరోజులని, డిమాండ్ పెరిగి పౌల్ట్రీ వ్యాపా రులకు లాభాలు వస్తాయని ఈ పరిశ్రమకు చెందిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. చలికాలంలో కోడిగుడ్ల వినియోగం ఎక్కువ గానే ఉంటుందని వెంకటేశ్వర హ్యాచరీస్ జనరల్ మేనేజర్ కె.జి. ఆనంద్ చెప్పారు. -
భారీగా పెరిగిన కోడి గుడ్డు ధర
-
పాకిస్తాన్లో దయనీయ పరిస్థితులు.. గుడ్డు ధర ఎంతో తెలుసా?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక, పౌష్టికాహరం కోసం ఒక్క గుడ్డును కొనాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా ఒక్క గుడ్డు ధర రూ.32కు చేరుకుంది. దీంతో, గుడ్డు కొనాలంటే పాకిస్తానీలు భయపడిపోతున్నారు. వివరాల ప్రకారం.. పాకిస్తాన్లో ధరల పెరుగుదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్లో గుడ్దు ధరలు పెరిగాయి. అధికారికంగా డజన్ గుడ్ల ధర ఏకంగా రూ.360కి చేరుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ మీడియా కూడా గుడ్ల ధరలు పెరిగినట్టు నివేదికల్లో పేర్కొన్నాయి. ఇక, 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజను గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, రిటైల్ వ్యాపారులు రూ.389కి అమ్ముతున్నారు. ఒక్కో గడ్డు ధర రూ.32కి చేరుకుంది. ధర పెరగడానికి కారణం.. సోయాబీన్స్ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, ఇంకా నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. మరోవైపు.. ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్ పాకిస్థాన్ బిజినెస్ ఫోరం తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నది. ముఖ్యంగా, పౌల్ట్రీ ఫీడ్‌లో కీలకమైన అంశంగా గుడ్డు ఉత్పత్తికి సోయాబీన్స్ కీలకం. మరోవైపు.. ధరల పెరగుదలపై ఏపీబీఫ్(ఆల్ పాకిస్తాన్ బిజినెస్ ఫోరమ్) ప్రెసిడెంట్ సయ్యద్ మాజ్ మహమూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. యుఎస్ డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి (పీకేఆర్) విలువ క్షీణించడం, ఇంధన ఖర్చులు పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా, అంతకుముందు కూడా పాకిస్తాన్లో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గోధమ పిండి, పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ఒకనొక సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు రూ.300 మార్క్ దాటేశాయి. -
కోడిగుడ్డు.. కొత్త రికార్డు
మండపేట: గుడ్డు ధర అంతకంతకూ పెరుగుతోంది. పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. గుడ్డు రైతు దగ్గర ధర రూ.5.54కు చేరింది. నాలుగేళ్లలో ఇదే అత్యధిక ధర. మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ. 7కు చేరడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చేపల లభ్యత తక్కువగా ఉండటంతో గుడ్ల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ఎగుమతులు పుంజుకొని రైతులకు అత్యధిక ధర లభిస్తుంది. 2017వ సంవత్సరం సీజన్లో రైతు దగ్గర ధర అత్యధికంగా రూ.5.45 లభించింది. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో నాలుగేళ్లుగా పౌల్ట్రీ రంగం గడ్డు కాలం ఎదుర్కొంటోంది. సీజన్లో రైతు ధర రూ.5 దాటడం గగనమైంది. ఈ సీజన్లో శీతలం ఎక్కువగా ఉండటంతో జిల్లాలోని గుడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగి, ధర పెరిగింది. ఈ ధర అశాజనకమే అయినప్పటికీ, మేత ధర ఇబ్బడిముబ్బడిగా పెరడంతో ప్రయోజనం అంతంత మాత్రమేనని కోళ్ల రైతులు అంటున్నారు. కోళ్లకు వేసే వ్యాక్సిన్లు, మందుల ధరలు, కార్మికుల జీతాలు పెరిగిపోవడం పౌల్ట్రీల నిర్వహణ వ్యయాన్ని పెంచేసిందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది సగటు ధర రైతు దగ్గర రూ.5 ఉంటేనే కానీ గిట్టుబాటు కాదని, గత ఏడాది సగటు ధర రూ. 4.39 మాత్రమే ఉండటంతో నష్టాలు వచ్చాయని చెబుతున్నారు. కోడి మేతకు వినియోగించే మొక్కజొన్న, సోయా, నూకలు తదితర వాటిని పౌల్ట్రీలకు రాయితీపై సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ధరలు తగ్గితేనే ఊరట గతంతో పోలిస్తే ఈ సీజన్లో గుడ్డు అత్యధిక రైతు ధరను నమోదు చేసుకుంది. ప్రస్తుత ధర ఆశాజనకంగా ఉన్నా కోడి మేత ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మేత రేట్లు అందుబాటులోకి వస్తేనే పరిశ్రమకు ఊరట. కోడి మేతను సబ్సిడీపై పౌల్ట్రీలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ -
Egg Prices: కొండెక్కిన కోడిగుడ్డు.. సామాన్యుల బెంబేలు
సాక్షి, తూర్పుగోదావరి(మండపేట): కోడి గుడ్డు ధర కొండెక్కింది. రైతు ధర రూ.5.44 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.ఏడుకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకున్నాయి. మరోపక్క కార్తిక మాసం ముగియడంతో స్థానిక వినియోగం పెరగడంతో గుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. కాగా సీజన్లో రైతు ధర నిలకడగా ఉంటేనే నష్టాలు కొంత భర్తీ అవుతాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీలు ఉండగా వాటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్లు వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం గుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో శీతాకాలంలో చేపల లభ్యత తక్కువగా ఉండటం వల్ల గుడ్ల వినియోగం పెరిగి ఎగుమతులకు డిమాండ్ ఉంటుంది. శీతల ప్రభావం అధికంగా ఉండే అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీకి సీజన్‌గా భావిస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో రైతు ధర పౌల్ట్రీకి ఆశాజనకంగా ఉంటుంది. పౌల్ట్రీ వర్గాల ఆందోళన మంగళవారం నాటికి రైతు ధర రూ. 5.44కు చేరింది. కాగా రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 పలుకుతుండటంతో సామాన్య వర్గాల వారు వాటిని కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అమ్మకాలు చేయడం పరిపాటి. అందుకు భిన్నంగా రూపాయి నుంచి రెండు రూపాయల వరకు పెంచి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉన్న మండపేట, అనపర్తి, పెద్దాపురం, రాజానగరం పరిసర ప్రాంతాల్లో రూ 6.50కు అమ్మకాలు చేస్తుండగా రామచంద్రపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర చోట్ల ఏడు రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.7.50కు అమ్మకాలు జరుగుతున్నట్టు వ్యాపారులు అంటున్నారు. చదవండి: (వైఎస్సార్సీపీ నేత హత్యపై సీఎం జగన్ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు) రెండు వారాల క్రితం రూ.5 ఉన్న గుడ్డు ధరను ఏడు రూపాయలు వరకు పెంచేశారని వినియోగదారులు అంటున్నారు. డ్యామేజీ అయిన గుడ్ల నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ధర పెంచకతప్పడం లేదని వ్యాపారులు అంటున్నారు. కాగా రిటైల్ మార్కెట్లో ధర బాగా పెరిగిపోవడం పౌల్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అధిక ధరతో వినియోగం తగ్గితే ఆ ప్రభావం పరిశ్రమపై పడుతుందంటున్నారు. పెరిగిన మేతలు, మందుల ధరలు, నిర్వహణ భారంతో గుడ్డు ఏడాది సగటు రైతు ధర ఐదు రూపాయలు ఉంటేనే గిట్టుబాటు కాదని కోళ్ల రైతులు అంటున్నారు. ఈ ఏడాది సగటు ధర నాలుగు రూపాయలు మాత్రమే ఉండటంతో ఆ మేరకు నష్టపోవాల్సి వస్తోందంటున్నారు. సీజన్లో రైతు ధర రూ. 5.50 దాటి నిలకడగా ఉంటేనే పాత నష్టాలను భర్తీ చేసుకునేందుకు వీలుంటుందన్నారు. రైతు ధర నిలకడగా ఉండాలి మేత ధరలు విపరీతంగా పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవ్వక కోళ్ల పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. ఏడాది సగటు రైతు ధర రూ. ఐదు ఉంటేనే కాని గిట్టుబాటు కాదు. ప్రస్తుత రైతు ధర సీజన్లో నిలకడగా ఉంటే పాత నష్టాలు కొంతమేర భర్తీ అవుతాయి. ఎంతోమందికి జీవనాధారంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమను నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వపరంగా సాయం కోరుతున్నాం. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
తెలుగు రాష్ట్రాల నుంచి 50 శాతం పడిపోయిన గుడ్ల ఎగుమతులు
-
Egg Prices: దూసుకెళ్తున్న కోడిగుడ్డు
సాక్షి, చిత్తూరు: కోడిగుడ్డు ధర దూసుకెళుతోంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు గుడ్డు తినాలని వైద్యులు సూచించడంతో రెండేళ్లుగా వినియోగం పెరిగింది. డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడంతో కొంతమేర దిగుమతి తగ్గింది. దీంతో 30 గుడ్ల ట్రే రూ.120నుంచి రూ.180కి పెరిగింది. కోడిగుడ్ల ధర అమాంతం పెరిగిపోయింది. పదిరోజుల వ్యవధిలో గుడ్డుపై రూ.1.50 పెరిగింది. 30 గుడ్ల ట్రే పదిరోజుల క్రితం రూ.120 ఉండగా ప్రస్తుతం హోల్‌సేల్ దుకాణాల్లోనే రూ.160 నుంచి రూ.180వరకు విక్రయిస్తున్నారు. ఇక చిల్లర దుకాణాల్లో అయితే విడిగా రూ.7కు విక్రయిస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో రోజూ దాదాపుగా 3వేల బాక్సుల గుడ్లు అమ్ముడుపోతున్నాయి. చిత్తూరు ప్రాంతంలో గతంలో కంటే ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమలు తక్కువగా ఉండడంతో హైదరాబాద్, మహబూబ్‌నగర్, విజయవాడ ప్రాంతాల నుంచి గుడ్లు రవాణా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చదవండి: (ఐహెచ్ఐపీతో అంటువ్యాధులకు చెక్!) -
పడిపోతున్న 'గుడ్డు'
సాక్షి, అమరావతి బ్యూరో: కోడి గుడ్ల ధరలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. నెల రోజుల్లోనే వంద కోడిగుడ్ల ధర దాదాపు రూ.50 మేర పడిపోయింది. రాష్ట్రంలో రోజుకు సగటున ఐదు కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. పొరుగున ఉన్న తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల నుంచి మరో కోటి గుడ్లు ఏపీకి దిగుమతి అవుతాయి. వీటిలో 2.50 కోట్ల గుడ్లను ఏపీ నుంచి ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో స్థానికంగా 3.50 కోట్ల గుడ్లను వినియోగిస్తుంటారు. సాధారణంగా వాతావరణ ప్రభావంతో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కోడిగుడ్ల వినియోగం పెరుగుతుంటుంది. దీంతో గుడ్ల ధర కూడా పైకి ఎగబాకుతుంది. కానీ ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా గుడ్ల ధర క్షీణిస్తుండడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో సెప్టెంబర్ 25న వంద గుడ్ల ధర రూ.441గా ఉండగా 30వ తేదీ నాటికి రూ.456కి చేరింది. అప్పటి నుంచి ధర క్రమంగా కిందకి పడిపోవడం మొదలైంది. ఈనెల 5వ తేదీ నాటికి రూ.431కి పడిపోయిన ధర.. 25వ తేదీకల్లా రూ.392కి క్షీణించింది. ఒడిశా, బెంగాల్ ఎఫెక్ట్.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆశ్వయుజ పౌర్ణమి నుంచి మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం బాగా తగ్గిపోయింది. అదే సమయంలో అక్కడ గుడ్ల ఉత్పత్తి మాత్రం పెరిగిపోయింది. ఫలితంగా ఆయా రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు గుడ్లను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి చేసే గుడ్లకు పోటీ ఏర్పడి.. ధర భారీగా పడిపోయింది. గత ఏడాది ధర వెరీ గుడ్.. గతేడాది ఇదే సమయానికి వంద గుడ్ల ధర రూ.500కి పైగా ఉంది. ప్రస్తుత సీజన్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాదితో పోలిస్తే వంద గుడ్ల ధర రూ.100కు పైగానే దిగజారిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. వంద గుడ్ల ధర రూ.470కి పైగా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ(నెక్) జోనల్ చైర్మన్ కుటుంబరావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. -
కోవిడ్‌తో కోలుకున్న గుడ్డు!
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ మహమ్మారి అన్ని రంగాలను కుదేలు చేస్తుండగా కోడి గుడ్డును మాత్రం కోలుకునేలా చేసింది. పోషక విలువలు అధికంగా ఉడే కోడి గుడ్ల వినియోగం కరోనా సమయంలో గణనీయంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే రోజురోజుకూ గుడ్డు ధరలు ఎగబాకుతున్నాయి. ఇది పౌల్ట్రీ రైతులకు కొంతమేర ఊరటనిస్తోంది. కోడి గుడ్లు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో వినియోగం పెరగడంతో గిరాకీ ఎక్కువైంది. రోజూ అదనంగా 50 లక్షల గుడ్లు రాష్ట్రంలో రోజుకు 4.50 కోట్ల కోడి గుడ్ల ఉత్పత్తి జరుగుతుండగా తమిళనాడు, కర్ణాటక నుంచి మరో కోటి గుడ్లు దిగుమతి అవుతున్నాయి. రెండు కోట్ల కోడిగుడ్లు అసోం, బిహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సగటున మూడు కోట్ల గుడ్ల వినియోగం ఉండగా ప్రస్తుతం మూడున్నర కోట్లకు పెరిగింది. రోజుకు 50 లక్షలకు పైగా గుడ్లను అదనంగా వినియోగిస్తున్నారు. అసోం, బెంగాల్, బిహార్, ఒడిశాలోనూ గుడ్ల వినియోగం 20 శాతం వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదల ఇలా.. కోడిగుడ్ల ధరల పెరుగుదల కొద్ది రోజులుగా జోరందుకుంది. ఈనెల 5వ తేదీన విజయవాడలో వంద గుడ్ల ధర హోల్‌సేల్‌లో రూ. 370 ఉండగా ప్రస్తుతం రూ.476కి పెరిగింది. విశాఖపట్నంలో రూ.360 నుంచి 500కి చేరుకుంది. పది రోజుల్లోనే విజయవాడలో రూ. 106, విశాఖలో రూ.140 చొప్పున ధరలు పెరిగాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.6 వరకు «విక్రయిస్తున్నారు. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, నాగపూర్, పుణే తదితర నగరాల్లో కొద్దిరోజులుగా వంద గుడ్ల ధర రూ.500కి పైనే పలుకుతోంది. ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో వంద కోడి గుడ్ల ధర రూ.526 పలికి ఆల్‌టైం హైకి చేరింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి గుడ్ల ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మేత ధరలూ పైపైకి.. కోళ్ల మేత ధరలు కూడా గతం కంటే పెరిగాయి. డిసెంబర్లో కిలో రూ.35–40 వరకు ఉన్న మేత ధర ప్రస్తుతం రూ.70కి చేరిందని పెంపకందార్లు చెబుతున్నారు. మేత రేటు పెరగడంతో గిట్టుబాటు కావడం లేదని ఆందోళన చెందుతున్న తరుణంలో గుడ్లకు గిరాకీ ఏర్పడటం పౌల్ట్రీ రైతులకు కొంత ఊరటనిస్తోంది. రైతులకు వెసులుబాటు.. ‘‘ప్రస్తుత కోడిగుడ్డు ధర పౌల్ట్రీ రైతుకు కాస్త వెసులు బాటునిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు వంద గుడ్ల ధర రూ.400 లోపే పలికింది. మేత ధర మాత్రం రెట్టింపైంది. దీంతో రైతుకు గిట్టుబాటు కాక నష్టపోవాల్సి వస్తోంది. కోవిడ్ నేపథ్యంలో గుడ్ల వినియోగం బాగా పెరగడం మంచి పరిణామం. కొద్దిరోజుల పాటు వీటి ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది’’ –టి.కుటుంబరావు, జోనల్ చైర్మన్,నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ (నెక్), విజయవాడ -
Poultry Farmers: 'గుడ్డు'కు గడ్డుకాలం
కోడిగుడ్డు ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ పౌల్ట్రీ రైతులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. పెరిగిన మేత ఖర్చులు, వేసవిలో కోళ్ల సంరక్షణకు అధికంగా ఖర్చు పెట్టాల్సి రావడం వారికి భారంగా మారింది. దీనికి తోడు గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు 100కు పైగా లారీల్లో గుడ్లు ఎగుమతి కాగా, ప్రస్తుతం 60కి పడిపోయింది. ఇరగవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, ఇతర రాష్ట్రాలకు 80 లక్షల మేర ఎగుమతి చేస్తున్నారు. స్థానికంగా 20 నుంచి 30 లక్షల వరకు వినియోగిస్తున్నారు. జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా సుమారు పదివేల మంది ఉపాధి పొందుతున్నారు. అన్ స్కిల్డ్ లేబర్‌ను తీసుకుని వారికి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తోంది. లేయర్ కోడిపిల్లను ప్రస్తుతం పౌల్ట్రీ రైతులు రూ.41లకు కొనుగోలు చేస్తున్నారు. 23 వారాలకు గుడ్లు పెట్టే దశకు చేరుకునేసరికి మొత్తం రూ.250 ఖర్చు అవుతుంది. ఈ దశ నుంచి ఒక కోడి సరాసరి రోజుకొకటి చొప్పున ఏడాదికి 320 గుడ్లు పెడుతుంది. గుడ్లను పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు గతంలో 100 నుంచి 120 లారీల్లో ఎగుమతి చేయగా, ప్రస్తుతం రోజుకు 60 నుంచి 70 లారీలు మాత్రమే ఎగుమతి అవుతుండటం గమనార్హం. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం లేదు జిల్లాలో ఉత్పత్తి అయిన గుడ్డును స్థానికంగా నిల్వ చేసే అవకాశం లేదు. గుడ్డు నిల్వ చేసి ఎగుమతి చేసే అవకాశం ఉంటే పౌల్ట్రీ రైతులకు వరమేనని చెప్పవచ్చు. అయితే కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ చేయడం కష్టసాధ్యం. దీనిలో నిల్వ చేసిన గుడ్డును వెంటనే వినియోగించుకోవాలి. లేదంటే పాడైపోతుంది. దీంతో ఉత్పత్తికే పరిమితమయ్యారు. అయితే సేల్ పాయింట్ల వద్ద కోల్డ్ స్టోరేజ్‌లు పెట్టుకుని వేరే రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాలలో ఎక్కువ లాభాలు అర్జిస్తుండగా, పౌల్ట్రీ రైతులకు నిరాశే మిగులుతోంది. పెరిగిన మేత రేట్లు గతంతో పోలిస్తే మేత ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే రోజుల్లో సోయ కేజి రూ.36 ఉండగా, ప్రస్తుతం రూ.58కి చేరింది. అలాగే ఎండు చేప, స్టోన్, నూకలు ఇలా ప్రతీది ధరలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా గుడ్డు ధర పెరిగినప్పటికీ పౌల్ట్రీ రైతులకు లాభాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. గతంలో ఒడిశా నుంచి కుటుంబాలతో సహా వచ్చి కోళ్లఫారాలలో మకాం ఉండి పనిచేసేవారు ఉండగా, ప్రస్తుతం కరోనా ప్రభావంతో కొత్తవారు పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఉన్నవారు వెళ్లిపోతుండటంతో ఈ పరిశ్రమ లేబర్ సమస్యను ఎదుర్కొంటోంది. వేసవిలో జాగ్రత్తలతో అదనపు ఖర్చు సాధారణ రోజుల్లో వేసవిలో పౌల్ట్రీ పరిశ్రమ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కోళ్ల షెడ్లపైన స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలి. దీనికి తోడు గోనుపట్టాలు, ఎండు గడ్డి, దబ్బగడ్డి వేసి కోళ్లకు రక్షణ కల్పించాలి. చల్లటి నీరు కోళ్లకు పెడుతుండాలి. ఇలా చేయడం వల్ల గతంలో కంటే కోడికి రూ.15 నుంచి 20 వరకు అదనంగా ఖర్చు అవుతోంది. అయినప్పటికీ సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే 10 నుంచి 20 శాతం కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది. విద్యుత్‌పై రాయితీ ఇవ్వాలి గతంలో బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదు. లేబర్ సమస్యల వల్ల యంత్రాలను ఎక్కువ వినియోగిస్తుండటంతో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. ఆక్వా పరిశ్రమకు ఇచ్చినట్లే పౌల్ట్రీ పరిశ్రమకు కూడా విద్యుత్ రాయితీ ఇవ్వాలి. పౌల్ట్రీ నిర్వహణలో గతంలో కంటే సమస్యలు పెరిగాయి. కోళ్లలో వైరస్ల నివారణకు ఒక్కో కోడికి రూ.15 నుంచి రూ.20 వరకు ఖర్చవుతోంది. – పెన్మెత్స సుబ్బరాజు, పౌల్ట్రీ రైతు, డీసీఎమ్ఎస్డైరెక్టర్, కావలిపురం మేత ధరలు తగ్గించాలి వేసవిలో కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. ఎండ తీవ్రతను బట్టి సుమారు 8 లక్షల వరకు మృత్యువాత పడుతుంటాయి. కోళ్లను సంరక్షించడానికి అదనంగా ఖర్చు అవుతుంది. వీటితో పాటు కోళ్లు మేతకు వాడే ముడి సరుకు ధరలు విపరీతంగా పెరిగాయి. ముడి సరుకులపై ప్రభుత్వం రాయితీ కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – జి.గంగాధరరావు, నెక్ గోదావరి జోనల్ కమిటీ చైర్మన్ -
కొండెక్కిన కోడిగుడ్డు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కోడిగుడ్డు ధర కొండెక్కింది. మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర ఏకంగా రూ. 6కు ఎగబాకి ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తోంది. కరోనా లాక్డౌన్ ముందు వరకు రూ. 4 నుంచి రూ. 4:50 వరకు పలికిన ధర గత కొన్ని రోజు లుగా రూ. 5 పలుకుతోంది. తాజాగా రూ. 6కు పెరిగింది. 2017 సెప్టెం బర్లో అత్యధికంగా రూ. 5.35 ధర పల కగా ఇప్పుడు దాన్ని మించి ధర నమోదు కావడం గమనార్హం. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక విక్రయాల్లో ముందు వరుసలో ఉన్నది కోడిగుడ్డే. రోగ నిరోధకశక్తిని పెంచు కొనే క్రమంలో రోజుకొక కోడిగుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుండటంతో గుడ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడంతో ఉత్పత్తి తగ్గింది. దీంతో కోడిగుడ్డు ధర పెరిగిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. డిమాండ్ పెరిగి... ఉత్పత్తి తగ్గి... దక్షిణాధి రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లు, లైవ్ బర్డ్స్‌లో సగం ఇతర రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంటాయి. అయితే కరోనా లాక్డౌన్, ఆ తర్వాతి పరిస్థితుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులు కొంతకాలం వరకు కొత్తగా బర్డ్స్ వేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గింది. రాష్ట్రంలో రోజుకు సగటున 3.65 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 2.80 కోట్లకు తగ్గింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న గుడ్లలోనూ సగం పొరుగు రాష్ట్రలకు ఎగుమతి అవుతుండటంతో రాష్ట్రంలో నిత్యం 1.4 కోట్ల కోడిగుడ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు కోడిగుడ్లను తినాలన్న వైద్యుల సూచనతో గుడ్ల వినియోగం రోజుకు 1.3 కోట్ల నుంచి 2 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేక ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఆహారానికి సంబంధించిన ముడిసరుకు, రవాణా చార్జీలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చిన్నారులకు బంద్... కోడిగుడ్డు ధర ఒక్కసారిగా పెరగడంతో ఆ ప్రభావం అంగన్వాడీ కేంద్రాలపై పడింది. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ ఒక గుడ్డును ఇస్తుంటారు. ఇందుకోసం ఏటా టెండర్ల పద్ధతిలో డీలర్లను ఎంపిక చేసి రోజుకు సగటున 8 లక్షల కోడిగుడ్లు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో తమకు గిట్టుబాటు కావట్లేదనే సాకుతో డీలర్లు 10 రోజులుగా పంపిణీని నిలిపివేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు గుడ్లను అందించలేకపోతున్నారు. -
కొండెక్కిన కోడిగుడ్డు ధరలు..
నల్లగొండ : కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఉల్లి ఘాటెక్కిస్తుండగా.. గుడ్డు కొండెక్కి కూర్చుంది. ఈ రెండింటి ధరలు లాక్డౌన్ కాలంతో పోలిస్తే.. ప్రస్తుతం రెట్టింపయ్యాయి. కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుడ్డు, ఉల్లి తప్పని సరిగా తినాల్సిన పరిస్థితి. దీంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దానికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రెట్టింపు అయిన ధరలతో పేదలు కొనలేకపోతున్నారు. (‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్ మాయం) లాక్డౌన్ కాలంలో అందుబాటులో ధరలు లాక్డౌన్ సందర్భంలో ఉల్లి, గుడ్డు ధరలు భారీగా పడిపోయాయి. ఆ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడంతో.. అప్పట్లో ఉల్లి కేజీ ధర రూ.పది నుంచి రూ.12 ఉంది. ఆ సమయంలో గుడ్డు పేపర్ ధర రూ.2.50 మాత్రమే ఉండగా.. బయట రూ.3.50 పలికింది. పౌల్ట్రీ రైతులు నష్టాలు భరించి తక్కువ ధరకు అమ్మారు. కొత్తగా కోడిపిల్లల పెంపకాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఉన్న కోళ్లతోనే గుడ్లు తీస్తుండడంతో ఉత్పత్తి తగ్గింది. వర్షాలతో దెబ్బతిన్న ఉల్లిపంట.. మన ప్రాంతానికి ఎక్కువగా మహారాష్ట్ర నుంచే ఉల్లి దిగుమతి అవుతుంది. పైన పడిన వర్షాలతో ఉల్లి పంట చాలా వరకు దెబ్బతిన్నది. దీంతో దిగుబడి తగ్గింది. మార్కెట్లో ప్రస్తుతం తెల్ల ఉల్లి రూ.45 పలుకుతుండగా ఎర్ర ఉల్లి రూ.40 పలుకుతోంది. గుడ్డుకు పెరిగిన డిమాండ్... కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలన్నా.. కరోనా సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా.. రోజూ గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలామంది రోజూ తప్పనిసరిగా గుడ్డు తింటున్నారు. ఈ నేపథ్యంలో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. అందుకు తగిన ఉత్పత్తి లేకపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో ఒక్కో గుడ్డు ధర రూ.6 వరకు పెరిగింది. -
చికెన్ గుడ్లకు పెరిగిన గిరాకీ
-
కోడి కొనలేం.. గుడ్డు తినలేం
సాక్షి, అమరావతి బ్యూరో: గత కొన్ని రోజులుగా కొండెక్కిన కోడి ధర కిందికి దిగిరానంటోంది. ఆదివారం అలవాటుగా నాన్ వెజ్ తిందామనుకునే మాంసాహార ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. కిలో చికెన్ రేటు రూ. 200లు దాటిపోవడంతో కొనేందుకు దుకాణాలకు వెళ్లిన మాంసాహార ప్రియులు అమ్మో! అంత రేటా.. అని నోరెళ్లబెడుతున్నారు. చికెన్‌కు పోటీగా గుడ్డు కూడా కొనుగోలుదారుల జేబుకు చిల్లుపెడుతోంది. రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ. 6లుగా ఉంది. కూరగాయల రేట్లు దిగివస్తున్నా.. వీటి ధరలకు మాత్రం రెక్కలొచ్చాయి. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం వల్లే.. సాధారణంగా శీతాకాలంలో మాంసం, కోడిగుడ్లను ఎక్కువగా తింటారు. ఆ డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధర పెరుగుతూ ఉంది. నెలన్నర రోజులుగా స్కిన్లెస్ చికెన్ ధర కిలో రూ.190 నుంచి కిందికి దిగిరాలేదు. ఇప్పుడది రూ.200కి చేరింది. వారం రోజుల క్రితం బ్రాయిలర్ చికెన్ ధర కిలో రూ.214కి చేరి కంగారెత్తించింది. ఈ సీజనులో ఇదే అత్యధిక ధర. గత ఏడాది కూడా చికెన్ కిలో ధర రూ.200 చేరి తర్వాత దిగొచ్చింది. ఇప్పుడు మాత్రం రేటు పైపైకే తప్ప సామాన్యుడికి అందుబాటులోకి రావడం లేదు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో రోజుకు సగటున 2 లక్షల కిలోల చికెన్‌ను వినియోగిస్తారు. ఆదివారం 3 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. అయితే ఆ స్థాయిలో కోళ్ల లభ్యత లేకపోవడం వల్ల ధరలు స్వల్పంగా పెరిగాయని కోళ్ల ఫారాల రైతులు చెబుతున్నారు. ‘గుడ్లు’ తేలేసేలా ధర మరోవైపు కోడిగుడ్డు ధర వింటే గుడ్లు తేలేసేలా ఉంది. గుడ్డు ధర మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం వంద గుడ్లకు రైతుకు చెల్లించే ధర రూ.473గా ఉండగా.. రిటైల్ మార్కెట్లో డజన్ గుడ్ల ధర రూ.66 వరకు ఉంది. రైతు బజార్లో విడిగా ఒక్కొక్కటి రూ.6కు అమ్ముతున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ (నెక్) విజయవాడ జోన్ పరిధిలో కృష్ణా, విజయవాడ, గుంటూరు జిల్లాలుండగా.. ఒక్క కృష్ణా జిల్లాలోనే రోజుకు 80 లక్షల గుడ్ల వరకు ఉత్పత్తవుతున్నాయి. వీటిలో 50 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మిగతా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, అస్సాం తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చలికాలం కావడం వల్ల స్థానికంగా, ఈశాన్య రాష్ట్రాల్లో కోడిగుడ్ల వినియోగం పెరిగింది. మరోవైపు గిట్టుబాటు కాక కొంతమంది కోళ్ల ఫారాల రైతులు బ్యాచ్‌లు తగ్గించారు. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గి కోడిగుడ్ల ధరలు పెరిగాయని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దిగొస్తున్న కూరగాయలు కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు కిలో రూ.30 నుంచి రూ.50 వరకూ పలికిన కూరగాయల ధరలు తగ్గాయి. రైతు» బజార్లలో కిలో టమోటా రూ.13, వంగ రూ.14, బెండ రూ.20, కాకర, గోరుచిక్కుడు రూ.18, కాలీఫ్లవర్ రూ.15, చిక్కుడుకాయలు రూ.24, బంగాళాదుంపలు రూ.25కు దొరుకుతున్నాయి. బయట మార్కెట్లో రూ.5 నుంచి 10లు పెంచి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రైతుబజార్లు, మార్కెట్ యార్డుల్లో కిలో రూ.15కే ఉల్లిపాయలను అందుబాటులో ఉంచింది. బయట కిలో రూ.100–150 వరకు పలికిన ఉల్లిపాయలు ఇప్పడు రూ.60కు లభ్యమవుతున్నాయి. గుడ్ల రేటు పెరగడంతో రైతుకు ఉపశమనం కోళ్ల మేత ధరలు బాగా పెరిగాయి. కిలో రూ.14 ఉండే మొక్కజొన్న రూ.26 వరకు పెరిగింది. సోయా కూడా పెరగడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ తరుణంలో గుడ్ల ధరల పెరుగుదల రైతుకు కాస్త ఊరటనిస్తోంది. అయితే ఈ గిట్టుబాటు ధరలు మరో రెండు నెలల వరకే కొనసాగుతాయి. ఆ తర్వాత ఎండలు మొదలైతే తగ్గుముఖం పడతాయి. –కుటుంబరావు, నెక్ విజయవాడ జోన్ చైర్మన్ ఈ ధరలు కొన్నాళ్లే.. కోళ్ల దాణా ధరలు, నిర్వహణ వ్యయం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత చికెన్ ధర పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటుగానే ఉంది. ఇవి కొన్నాళ్ల పాటే కొనసాగుతాయి. – వెంకటేశ్వరరావు, అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు -
గుడ్డు కట్.. కడుపు నిండట్లే
సాక్షి, నల్లగొండ : మధ్యాహ్న భోజనం సగంతోని సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం 150 గ్రాములు మాత్రమే ఇస్తుంది. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అది సరిపోని పరిస్థితి. దానికి తోడు ఉదయమే పాఠశాలకు వస్తుండడం వల్ల టిఫిన్ తినలేని పిల్లలు మధ్యాహ్నం ఆకలితో తిందామన్నా అది సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. వారానికి మూడు గుడ్లు పెట్టాల్సి ఉన్నా కొన్ని చోట్ల చిన్న అరటిపండుతోనే సరిపెడుతుండగా మరికొన్ని చోట్ల వారానికి ఒక్క గుడ్డే పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. బియ్యం కొన్ని చోట్ల మంచిగా ఉంటుండగా మరికొన్ని చోట్ల రావడం లేదు. వండిన అన్నం ముద్ద అవుతుంది. చారు నీళ్లను తలపిస్తే, కూరలు చారును తలపిస్తున్నాయి. రుచిపచిలేని వాటితో విద్యార్థులు తినలేకపోతున్నారు. జిల్లాలో మొత్తం 1,462 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలోనే భోజనం పెడుతున్నారు. మొత్తం 1,05,020 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ఇందులో ఇందులో 1 నుంచి 5వ తరగతి వరకు 54,286, 6 నుంచి 8వ తరగతి వరకు 28,944, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులు 21,790 మంది ఉన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రతి విద్యార్థికీ 150 గ్రాముల భోజనాన్ని అందిస్తున్నారు. వారానికి మూడు కోడిగుడ్లు అందించాలి. అయితే బియ్యం ప్రభుత్వమే ఇస్తుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఒక్కంటికి రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కంటికి రూ.6.51 ప్రభుత్వం మధ్యాహ్నం వంట నిర్వహకులకు చెల్లిస్తుంది. గుడ్డుకు అదనంగా రూ.4 చెల్లిస్తారు. ఈ డబ్బులతో కూర, చారు, గుడ్డు పెట్టాల్సి ఉంటుంది. అయితే గౌరవ వేతనం కింద వారికి ప్రతి నెలా రూ.వెయ్యి ఇస్తారు. ప్రతి పాఠశాలకు ఒక వంట మనిషి, అసిస్టెంట్ ఉంటారు. ప్రధాన సమస్యలు ఇవీ.. ► వంటగదులు లేవు. ► ఉప్పునీటితోనే బియ్యం కడుగుతున్నారు. దీంతో అన్నం పచ్చగా అవుతోంది. ► తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇంటివద్దనుంచి బాటిళ్లలో తెచ్చుకుంటున్నారు. ► నీళ్లచారు, అన్నంలో పురుగులు ► కూరగాయలు సరిగా ఉడకడం లేదు. వారం మెనూ ► సోమవారం కూరగాయలు, గుడ్డు, చారు మంగళవారం పప్పు, ఆకుకూరలు, చారు ► బుధవారం గుడ్డు, కూరగాయలు, చారు ► గురువారం సాంబారు, కూరగాయలు ► శుక్రవారం గుడ్డు, పప్పుతో కూరగాయలు ► శనివారం వెజిటేబుల్ బిర్యాని ప్రతి విద్యార్థికి అందజేయాల్సిన మెనూ ఇలా.. ఆహార పదార్థాలు 1–5తరగతి 6–10తరగతి వరకు బియ్యం 10గ్రాములు 150గ్రాములు ఆయిల్ 5గ్రాములు 7.5గ్రాములు పప్పు 20గ్రాములు 30గ్రాములు కూరగాయలు 50గ్రాములు 75గ్రాములు -
శ్రావణ మాసం ఎఫెక్ట్ .. కొక్కో‘రూకో’!
శ్రావణ మాసం ఎఫెక్ట్ గుడ్డు ధరలపైనా పడింది. సాధారణ రోజుల్లోగుడ్డు ధర రూ.5 ఉండగా..ప్రస్తుతం రూ.4.25కి తగ్గింది.హోల్‌సేల్‌లో డజన్గుడ్ల ధర రూ.45 ఉండగారిటైల్లో రూ.52గా ఉంది. సాక్షి,సిటీబ్యూరో: గత నెలలో పరుగులు పెట్టిన చికెన్ ధరలు వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో కిలో చికెన్ రూ.280 వరకు వెళ్లిన ధర ఇప్పుడు రూ.160కి(స్కిన్లెస్) దిగివచ్చింది. గతంలో భారీగా ధరలు పెరిగాన సరే మాంసాహార ప్రియులు దుకాణాల ముందు క్యూ కడితే.. ప్రస్తుతం ధరలు సగానికి తగ్గినా కొనేవారు పెద్దగా కనిపించడం లేదు. శ్రావణ మాసం కావడంతో మాంసాహారానికి అత్యధిక మంది నగరవాసులు దూరంగా ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే చికెన్ ప్రియులకు కోడి కూర లేకుంటే ముద్ద దిగనివారు సైతం ఈ ఏడాది శ్రావణ మాసంలో మాత్రం అందుకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క గ్రేటర్లో కోడిమాంసం డిమాండ్ కంటే సప్లయ్ అధికం కావడం వల్ల కూడా చికెన్ ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. అదివారం మాత్రం అది 70 లక్షల కిలోకు పెరుగుతుంది. కానీ శ్రావణ మాసంలో విక్రయాలు గత నెలలో జరిగి వ్యాపారంలో సగం కూడా ఉండడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇంకా తగ్గే అవకాశం శ్రావణ మాసం నేపథ్యంలో ఈ నెల మొదటివారం నుంచే చికెన్ వినియోగం గణనీయంగా తగ్గింది. నగరంలో లక్ష కిలోలకు అటు, ఇటుగా విక్రయాలు జరుగుతాయి. ఇతర రోజులతో పోల్చితే శ్రావణంలో వినియోగం సగానికి సగం తగ్గింది. సాధారణ రోజుల్లో 80 కిలోల వ్యాపారం జరిగితే ఈ నెలలో మాత్రం 30 కిలోలు కూడా విక్రయించడం కష్టంగా ఉందని ఓ రిటైల్ వ్యాపారి పేర్కొన్నాడు. ఆదివారం రోజు కనీసం 150 కిలోలకు తగ్గకుండా విక్రయిస్తానని, గత ఆదివారం మాత్రం వ్యాపారం 60 కిలోలే జరినిట్టు నాంపల్లికి చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నాడు. -
గుడ్డు.. వెరీ బ్యాడ్
సాక్షి, పెరవలి(పశ్చిమగోదావరి) : కోడిగుడ్డు ధరలు గతేడాది ఊహించని రీతిలో పెరిగితే.. నెలరోజులుగా ధరల తగ్గటంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలో ప్రతిరోజూ రెండు కోట్లు గుడ్లు ఉత్పత్తి అవుతుంటే రైతులకు రోజుకి రూ.1.80 కోట్లు నష్టం వాటిల్లితుందని గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం గుడ్డు ధర రూ.3.10 పైసలు పలకడంతో లాభాల మాట ఎలా ఉన్నా కనీసం మేత ఖర్చులకు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 18న రికార్డు స్థాయిలో గుడ్డు ధర రూ.5.32 పైసలు పలకగా ప్రస్తుతం రూ.3.10 పైసలు పలకటంతో లక్షలాది రూపాయిలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తరాదిన చలి తీవ్రత ఎక్కువగా ఉంటే గుడ్డు ధరలు పెరుగుతూ వచ్చేవి కానీ అక్కడ కూడా ఎండలు మండటంతో వీటి వినియోగం తగ్గిందని చెబుతున్నారు. గుడ్డు ధరలు తగ్గినా పిల్ల, మేత ధరల మాత్రం తగ్గకపోగా పైపైకి వెళుతున్నాయని దీంతో ఖర్చు అలాగే ఉందని వాపోతున్నారు. ప్రస్తుతం అమ్మకాలు అనూహ్యంగా తగ్గటంతో ఎగుమతులు నిలిచి నిల్వలు పెరిగిపోయాయి. దీంతో ధరలు పతనం కావటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో లాభాలు చూపించిన గుడ్లు ఇప్పడు రైతులు గుడ్లు తేలవేసేలా లక్షల్లో నష్టాలు వస్తున్నాయని వాపోతున్నారు. కూలీల ధరలు గతంలో ఒక్కొక్కరికి రూ.250 కూలీ ఇస్తే ప్రస్తుతం రూ.350 ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యుత్ చార్జీలు కూడా పెరిగాయని వాపోతున్నారు. జిల్లాలో 486 మంది కోళ్ల రైతులు జిల్లాలో కోళ్లరైతులు 486 మంది ఉండగా ఫారాలు సుమారు 25 వేల వరకు ఉన్నాయి. వెయ్యి కోళ్ల నుంచి 5 లక్షల కోళ్ల వరకు సామర్థ్యం గల ఫారాలు జిల్లాలో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే మేత ధరలు ఇటీవల బాగా పెరిగాయి. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గుడ్డు ధర రూ.4కు పైగా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. ఫారాలను నడపేందుకు లక్షలాది రూపాయలు పెట్టుబడులు అవుతున్నాయని, వ్యయప్రయాసలకోర్చి నడిపినా కనీసం గిట్టుబాటు కూడా కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. తీవ్ర నష్టాలు గుడ్డు ధరలు తగ్గాయి, పిల్ల ధరలు పెరిగాయి. దీని వలన రైతులకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి. గత నవంబర్‌లో పిల్ల ధర రూ.33 ఉంటే ఇప్పుడు రూ.37 అయ్యింది. దీంతో ఒక పిల్లకి రూ.4 అదనపు భారమవుతోంది. గుడ్డు ధర నవంబర్‌లో రూ.5.32 పైసలు ఉంటే ఇప్పడు రూ.3.10 పైసలు ఉంది. దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. – భూపతిరాజు వరహా నర్సింహరాజు, ఖండవల్లి లక్షల్లో నష్టపోతున్నాం 15 ఏళ్లుగా కోళ్లఫారం నిర్వహిస్తున్నా. ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదు. గతేడాది నవంబర్‌లో గుడ్డు ధర రూ.5.32కు చేరి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. కొద్దిరోజులుగా ధరల పతనం మొదలైంది. అయితే నిర్వహణ ఖర్చులు ఏమాత్రం తగ్గలేదు. దీంతో లక్షల్లో నష్టపోతున్నాం. 15 రోజులుగా రూ.3 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చింది. – మండా తాతారెడ్డి, కోళ్ల రైతు, పిట్టలవేమవరం -
గడ్డు కాలం!
కోళ్ల పరిశ్రమకు గడ్డుకాలం వచ్చింది. భానుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో ఎండ వేడిమికి పరిశ్రమ కుదేలవుతోంది. గుడ్డు ధరలు నిరాశపరుస్తున్నాయి. ప్రస్తుతం గుడ్డు ధర తక్కువగా ఉంటే పెరిగిన దాణా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితి రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రోజుకు గుడ్డుపై రూ.1.5 నష్టపోతున్నామని కోళ్ల రైతులు చెబుతున్నారు. సాక్షి, మచిలీపట్నం: జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే.. చల్లపల్లి, లక్ష్మీపురం, కూచిపూడి, వక్కలగడ్డ, చిన్నకళ్లేపల్లి, చిట్టూర్పు, పెదపూడి, నిమ్మగడ్డ, నూజివీడు, ఉయ్యూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో కోళ్ల ఫారాలున్నాయి. ప్రతి రోజూ దాదాపు 1.2 కోట్ల మేర గుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి రోజు వాటికి అందించే ఆహారంలో అత్యధికంగా మొక్కజొన్న. అధిక పోషకాలుండటంతో దానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం మొక్కజొన్న ధర క్వింటా రూ.2,500 చేరింది. గతంలో రూ.1300 నుంచి రూ.1500 మధ్య ఉండేది. ఒకే సారి దాదాపుగా రెట్టింపయింది. కోళ్లకు దాణాగా వినియోగించే ఇతర ఆహార పదార్థాలకు కూడా రెక్కలు వచ్చాయి. గతంలో రూ.1200 నుంచి రూ.2100కు, నూనె తీసిన తవుడు క్వింటాలు గతంలో రూ.900 పలికితే, ప్రస్తుతం రూ.1500లకు చేరాయి. మొక్కజొన్న ధర భారీగా పెరిగిన ప్రతిసారీ రైతులు జొన్నలు వగైరా వాటిని ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారు. ప్రస్తుతం జొన్నల ధర కూడా పెరిగి రైతులను కలవరపెడుతోంది. దాణా ధరలు భారీగా పెరిగాయి కనుక గుడ్డు ధర పెరుగుతుందా అంటే అది ప్రస్తుతం రూ.3.05 పలుకుతోంది. ఇది ఏ మాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంచుతున్న కత్తెర పురుగు.. కోళ్ల పరిశ్రమపై కత్తెర పురుగు ప్రభావం చూపుతోంది. మొక్కజొన్న పంటను నాశనం చేస్తుండటం, దిగుబడి తక్కువగా అందుతుండటంతో ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కత్తెర పురుగు ఉద్ధృతి కారణంగా రైతులు ఈ ఏడా ది మొక్కజొన్న స్థానంలో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లారు. దీంతో రాష్ట్రంలో మొక్కజొన్న నామమాత్రంగానే సాగు చేశారు. దీనికి తోడు ఇథనాల్ తయారీ, గ్లూకోజ్ తయారీ వంటి వాణిజ్య పరమైన పరిశ్రమల్లో కూడా మొక్కజొన్నకు ఈ ఏడాది విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో భారీగా ధర పెరిగింది. కొత్తపంట నవంబరులో వచ్చే వరకు ధరలు ఇలాగే ఉంటాయన్న అంశం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎండ వేడిమికి.. భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం 10 గంటలు అయితే చాలు ఎండవేడిమి విపరీతంగా పెరుగుతోంది. ఈ వేడిగాలుల తీవ్రతను తట్టుకోలేక కోళ్లు విలవిల్లాడుతున్నాయి. సాధారణంగా శరీరంలోని వేడి చమట రూపంలో బయటకు వస్తోంది. కోడికి చమల గ్రంథులు లేకపోవడంతో శరీరంలో వేడి బయటకు రాక మృత్యువాత పడుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి కోళ్ల ఫారాల్లో వీటి మరణాల సంఖ్య పెరిగింది. ఎండ వేడిమి నుంచి వాటిని రక్షించుకునేందుకు కోళ్ల ఫారాల యజమానులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. షెడ్డు పైభాగాన స్పింక్లర్లతో నీటిని తడపడం, లోపల ఫాటర్లు (మంచులా నీరు పడే పద్ధతి)తో ఉష్ణోగ్రతలు తగ్గేలా కోళ్ల రైతులు ప్రయత్నిస్తున్నారు. అయినా కోళ్ల మరణాలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం 40 డిగ్రీలున్న ఉష్ణోగ్రత మేలో ఇంకా అధికంగా నమోదవుతాయనే అంచనాలతో కోళ్ల రైతులు తలలుపట్టుకుంటున్నారు. ఆశాజనకంగా మాంసం ధర.. ఎండ వేడిమికి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం ధరలు ఆశాజనకంగా ఉంటున్నాయి. ఈ అంశం కాస్త కోళ్ల రైతులకు ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ రూ.184, స్కిన్లెస్ రూ.210 పలుకుతోంది. -
‘ఎగ్’ బాకుతోంది!
కర్నూలు (వైఎస్సార్ సర్కిల్): ఆమ్లెట్.. బాయిల్డ్ ఎగ్.. ఎగ్‌కర్రీ..ఎగ్ బురుజు..ఎగ్ బిర్యానీ..ఎగ్ రోస్టు, ఎగ్ దోస.. చదువుతుంటే నోరూరుతుందా?..ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తోందా?..అయితే కాస్త ఆగండి! గుడ్డు ధర రోజురోజుకీ పెరిగిపోతోంది. వారానికి నాలుగు సార్లు తినేవారు సైతం మెనూ మార్చుకుంటున్నారు. జిల్లాలో 200 మంది పౌల్ట్రీ రైతులకు 1,500 కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల వరకు కోళ్లను పెంచుతున్నారు. ప్రస్తుతం వీటి నుంచి 13 లక్షల గుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లా జనాభా 43 లక్షలు మంది ఉన్నారు...వీరికి 23 లక్షల వరకు గుడ్లు అవసరమవుతాయి. ఉత్పత్తి అయిన గుడ్లు సరిపోకపోవడంతో వ్యాపారులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాళ్, బిహార్, ఒడిశా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో గుడ్ల వినియోగం పెరిగింది. దీంతో జిల్లాకు సరఫరా చేసే వాటిని అక్కడికి పంపిస్తున్నారు. దీంతో ధర అన్యూహంగా పెరుగుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. సాధారణంగా కార్తీకమాసంలో గుడ్డు ధర దిగజారుతుంది. అయితే ఈ సారి మాత్రం స్థిరంగా కొసాగింది. కార్తీక మాసం వెళ్లిన తరువాత పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం గుడ్డు ధర రిటైల్‌గా రూ.4.33 పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో రూ.5 ప్రకారం విక్రయిస్తున్నారు. కార్తీక మాసంలోనూ డిమాండ్ పెరగడంతో ధర స్థిరంగా కొనసాగి..ప్రస్తుం పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. కొండెక్కిన కోడి ధర.. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో గుడ్లతో పాటు చికెన్ ధరలు కూడా కొండెక్కాయి. వారం క్రితం లైవ్ కోడి కిలో 90 రూపాయలు ఉండగా ప్రస్తుతం రూ.120 పెరిగింది. అదే విధంగా డ్రెస్ చేసిన కిలో చికెన్ వారం క్రితం రూ.160 ఉండగా ప్రస్తుతం రూ.180 నుంచి రూ.190 వరకు పెరిగింది. అదే విధంగా స్కిన్ లెస్ చికెన్ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.200కు పెరిగింది. ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి కోళ్లకు సరఫరా చేసే దాణాను సబ్సిడీ రూపంలో అందజేసి ప్రోత్సహిస్తే రైతులు నష్టాల నుంచి బయటపడుతారు. కోళ్ల షెడ్లకు, కరెంటు ఇలాంటి వాటిలో రాయితీలు ఇస్తే పెంపకం పెరుగుతోంది. దీంతో ధరలు తగ్గే అవకాశం ఉంది.– రాజారెడ్డి, ఫౌల్డ్రీ రైతు -
ఎగ్ @ రూ.4.25
సాక్షి సిటీబ్యూరో: వాస్తవానికి గుడ్ల ధర చలికాలంలో పెరిగి, వేసవిలో తగ్గుతుంటుంది. అయితే ఈసారి చలికాలం ప్రారంభంలో ధరలు కాస్త పెరిగినా... వారం రోజుల నుంచి పడిపోయాయి. ప్రస్తుతం ఒక గుడ్డు ధర రిటైల్ మార్కెట్లో రూ.4.25 ఉండగా... గతేడాది నవంబర్‌లో రూ.5 దాటిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓవైపు కార్తీకమాసం, మరోవైపు గుడ్ల ఉత్పత్తి పెరగడం ధరలు తగ్గడానికి కారణమని హోల్‌సేల్ వ్యాపారులుచెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఫామ్‌లో గుడ్డ ధర రూ.3.65 ఉండగా... హోల్‌సేల్‌లో రూ.4.10, రిటైల్‌లో రూ.4.25 పలుకుతోంది. గతేడాది ఈ సమయంలో ఫామ్ రేట్నే రూ.4.60 వరకు ఉందంటున్నారు. తగ్గిన ఎగుమతులు.. తెలంగాణ నుంచి గుడ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో లేయర్ ఫామ్స్ పెరగడంతో ఈ ఏడాది ఎగుమతులు తగ్గాయి. మరోవైపు చలికాలంలో ధర ఉంటుందని ఫామ్ యజమానులు ఎక్కువగా లేయర్స్‌ను వేశారు. స్థానికంగా ఉత్పత్తి పెరిగింది. దీంతో ధరలు చాలా వరకు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫామ్ యజమానులు ఆందోళన చెందుతున్నా రు. ఒక్కో లేయర్ కోడిపై దాదాపు రూ.250 ఖర్చవుతుందని, ఈ నేపథ్యంలో ఒక్కో దానిపై రూ.75 వరకు నష్టం రావొచ్చని అంటున్నారు. ‘ప్రతిఏటా నవంబర్ నుంచి గుడ్ల ధరలు పెరుగుతాయి. ఈ ఏడాది చలికాలంలో ప్రారంభంలో పెరిగినా... నవంబర్ మూడో వారం నుంచి ధరలు విపరీతంగా తగ్గాయి. కార్తీకమాసంలో ప్రతిఏటా ధరలు తగ్గుతాయి. కానీ ఈ స్థాయిలో తగ్గుతాయని అనుకోలేద’ని నెక్ బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావర్ తెలిపారు. -
గుడ్డుకు శ్రావణ క్షోభ
తూర్పు గోదావరి ,మండపేట: వేసవి ఇక్కట్ల నుంచి గట్టెక్కుతున్నామన్న కోళ్ల రైతుల ఆనందాన్ని శ్రావణమాసం ఆవిరి చేస్తోంది. శ్రావణ శుక్రవారాలు, ఇతర పర్వదినాల కారణంగా చాలామంది మహిళలు గుడ్డు వినియోగించరు. ఈ కారణంగా గుడ్డు ధర నిరాశాజనకంగా తయారైంది. ప్రస్తుత ధరను బట్టి రోజుకు పరిశ్రమకు సుమారు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. త్వరలో గణపతి నవరాత్రులు రానుండటంతో మున్ముందు పరిశ్రమకు గడ్డు కాలమేనని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎండల తీవ్రతతో ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం మేర పడిపోయిన గుడ్ల ఉత్పత్తి తొలకరి జల్లులతో సాధారణ స్థితికి చేరింది. ప్రస్తుతం రోజుకు 1.1 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 60 శాతం ఎగుమతి అవుతుండగా, మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. జిల్లా నుంచి ప్రధానంగా ఎగుమతులు జరిగే పశ్చిమబెంగాల్, బిహార్ తదితర రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం పెరిగింది. ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కోళ్ల మరణాలు, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం, నిర్వహణ భారం తదితర రూపాల్లో పరిశ్రమకు దాదాపు రూ.50 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. వేసవి ప్రభావంతో ఏప్రిల్‌లో రూ.3కు పతనమైన గుడ్డు రైతు ధర జూలైలో ఎగుమతులు పుంజుకుని పెరుగుతూ వచ్చింది. జూలై 27వ తేదీ నాటికి రైతు ధర రూ.4.11కు చేరుకుంది. శ్రావణమాసం రాకతో ఉత్పత్తికి తగిన డిమాండ్ లేక ధర పతనమవుతోంది. జిల్లా నుంచి ఎగుమతులు జరిగే ఉత్తరాది రాష్ట్రాల్లో మనకంటే దాదాపు 15 రోజులు ముందుగానే శ్రావణమాసం మొదలవుతుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు జిల్లాలో వినియోగం తగ్గడంతో ఈ నెల 11వ తేదీ నాటికి రైతు ధర రూ.3.30కు పతనమైంది. ప్రస్తుతం నెక్ ప్రకటిత ధర రూ.3.41కు చేరినా అది రైతులకు అందడం లేదంటున్నారు. పెరిగిన నిర్వహణ భారంతో గుడ్డు రైతు ధర రూ.3.75 ఉంటేనేకాని గిట్టుబాటు కాదని కోళ్ల రైతులు అంటున్నారు. ఆ మేరకు జిల్లా పరిశ్రమకు రోజుకు సుమారు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్లు తేలేస్తున్న వినియోగదారులు తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా వ్యాపారులు రిటైల్ అమ్మకాలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. రైతు ధర రూ.3.41 పైసలు ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.ఐదు వరకు అమ్మకాలు చేస్తున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉన్న అనపర్తి, మండపేట, పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లోను ఇదే రకంగా అమ్మకాలు జరుగుతున్నాయి. పెరిగిన ధరతో వీటిని కొనుగోలు చేసేందుకు సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. ఊరటనిస్తున్న చికెన్ ధరలు రిటైల్ మార్కెట్లో చికెన్ ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఎండల తీవ్రతతో గత రెండు నెలల్లో చికెన్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. బ్రాయిలర్ లైవ్ కిలో రూ.120కు చేరగా, మాంసం కిలో రూ.220కు, స్కిన్లెస్ రూ.240కు చేరి వినియోగదారుల్ని బెంబేలెత్తించాయి. కొత్త బ్యాచ్‌లు రావడం, శ్రావణమాసంతో వినియోగం సరిగా లేక ధర తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం బ్రాయిలర్ లైవ్ కిలో రూ.82 ఉండగా, మాంసం రూ.160, స్కిన్లెస్ రూ.180కు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధర మరింత తగ్గే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు. గత నెలలో రూ.80గా ఉన్న లైవ్ కిలో లేయర్ కోడి ధర ప్రస్తుతం రూ.60కు తగ్గిపోయింది. ఆ మేరకు నష్టపోవాల్సి వస్తోందని కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.5 ఉంటేనే నష్టాల భర్తీ వేసవిలో కోట్లాది రూపాయల మేర పరిశ్రమకు నష్టం వాటిల్లింది. ఆ నష్టాల నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో ధర పతనం కావడం పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేస్తోంది. మార్కెట్లో అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. పౌల్ట్రీల నిర్వహణ భారం పెరిగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో గుడ్డుకు రైతు ధర రూ.5 ఉంటే కాని కోళ్ల రైతులు పాత నష్టాలను భర్తీ చేసుకోలేరు. – పడాల సుబ్బారెడ్డి, నెక్ జాతీయ కమిటీ సభ్యుడు, పౌల్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
గుడ్డు వెక్కిరిస్తోంది..!
* రిటైల్ కోడి గుడ్డు ధర రూ.5 * హోల్‌సేల్‌గా వంద గుడ్ల ధర రూ.400 సాక్షి, హైదరాబాద్: గుడ్డు వచ్చి కోడిని వెక్కిరించిందంటే ఇదేనేమో..! బుధవారం హోల్‌సేల్‌గా 100 కోడిగుడ్లు రూ.396 పలికాయి. రవాణా చార్జీగా రూ.4 వసూలు చేస్తుండటంతో 100 గుడ్ల ధర రూ.400కు చేరింది. అంటే.. హోల్‌సేల్‌గానే ఒక్కో గుడ్డు రూ.4. చికెన్‌షాపుల వద్దకు వచ్చేసరికి రూ.4.50కి విక్రయిస్తున్నారు. వీరి వద్ద కొనుగోలు చేసే చిల్లర వ్యాపారులు ఒక్కో గుడ్డుకు రూ.5 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం రిటైల్‌గా డజను కోడిగుడ్లు కొనాలంటే రూ.60 వెచ్చించాల్సి వస్తోంది. నిత్యం మెనూలో గుడ్డును వడ్డించే హోటళ్లు, మెస్‌లు, హాస్టళ్లు, ఆస్పత్రులకు ఇప్పుడు గుడ్డు భారంగా మారింది. ఇప్పటికిప్పుడు రేట్లు పెంచితే కస్టమర్లు, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనతో తటపటాయిస్తున్నారు. దీంతో ప్రభు త్వ హాస్టళ్లు, ఆస్పత్రులు వంటివాటి మెనూలో మార్పులు చేయాలని యోచిస్తున్నారు. ధర పెరగడం వల్ల కోడి గుడ్ల విక్రయాలు బాగా తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు. దాణా ధరల ప్రభావం.. కోళ్ల దాణా(ఫీడ్) ధర అనూహ్యంగా పెరగడం వ ల్లే కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. కోడిగుడ్లకు రాష్ట్రం ఉత్పత్తి కేంద్రంగా విలసిల్లుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతుల ఆర్డర్ల వల్ల కూడా కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. -
ఎగ్సిపడుతూ..
మండపేట : గుడ్డు ధర కోళ్ల రైతులను కలవరపరుస్తుండగా, రిటైల్ మార్కెట్లో వినియోగదారులనూ బెంబేలెత్తిస్తోంది. రూ.ఐదుకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. జిల్లాలో సుమారు 1.4 కోట్ల కోళ్లు ఉండగా, రోజుకు సుమారు 1.19 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. వీటిలో 65 శాతం గుడ్లు బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా, మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఫౌల్ట్రీ పరిశ్రమకు సీజన్‌గా భావిస్తారు. శీతల ప్రభావంతో ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకుని గుడ్డు ధర పెరగడం పరిపాటి. ఇదేక్రమంలో నెల రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులకు డిమాండ్ పెరిగి, గుడ్డు ధర పెరుగుతూ వచ్చింది. కొద్ది రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీ జిల్లా పరిశ్రమకు ప్రతికూల వాతావరణాన్ని కల్పిస్తోందని కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 27న రూ.3.80కు చేరుకున్న ధర అక్కడే నిలిచిపోయింది. డిమాండ్ లేక నాలుగు రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ధర తగ్గే అవకాశం ఉందని ఫౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గుడ్లు తేలేస్తున్న వినియోగదారులు : సాధారణంగా రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అమ్మకాలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం రైతు ధర రూ.3.80 ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.ఐదు వరకు అమ్మకాలు చేస్తుండడంతో సామాన్య వర్గాల వారు వాటిని కొనుగోలు చేసేందుకు గుడ్లు తేలేస్తున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉన్న అనపర్తి, మండపేట, పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లోనూ ఇదే రకంగా అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో రూ. 5.50 వరకు కూడా విక్రయిస్తున్నట్టు సమాచారం. కాగా రిటైల్ మార్కెట్లో రూ. ఐదు పలుకుతుండడం ఫౌల్ట్రీ పరిశ్రమ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో ఇప్పటికే స్థానిక ఎగుమతులకు డిమాండ్ పడిపోగా ధరాభారంతో స్థానిక వినియోగం తగ్గే అవకాశముందంటున్నారు. -
ఈ కోడిపెట్ట వెల రూ.22 వేలు..!
ఈ కోడిపెట్ట ధర రూ. 22 వేలు. ఇది పెట్టే గుడ్డు ధర రూ. 500 పైమాటే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రుకు చెందిన కాగితాల ధనరాజు దీని యజమాని. దీని ప్రత్యేకత ఏమిటంటే.. డింకీ పందాల్లో (కోడి కాళ్లకు కత్తులు కట్టకుండా వేసే పందాలు) ఉపయోగించే కోడి పుంజులు.. ఈ పచ్చకాకి జాతి కోడి పెట్టలు పెట్టే గుడ్ల నుంచే ఉత్పత్తి అవుతారుు. - తణుకు