
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక, పౌష్టికాహరం కోసం ఒక్క గుడ్డును కొనాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా ఒక్క గుడ్డు ధర రూ.32కు చేరుకుంది. దీంతో, గుడ్డు కొనాలంటే పాకిస్తానీలు భయపడిపోతున్నారు.
వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లో ధరల పెరుగుదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్‌లో గుడ్దు ధరలు పెరిగాయి. అధికారికంగా డజన్ గుడ్ల ధర ఏకంగా రూ.360కి చేరుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ మీడియా కూడా గుడ్ల ధరలు పెరిగినట్టు నివేదికల్లో పేర్కొన్నాయి. ఇక, 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజను గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, రిటైల్ వ్యాపారులు రూ.389కి అమ్ముతున్నారు. ఒక్కో గడ్డు ధర రూ.32కి చేరుకుంది.
ధర పెరగడానికి కారణం..
సోయాబీన్స్ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, ఇంకా నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. మరోవైపు.. ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్ పాకిస్థాన్ బిజినెస్ ఫోరం తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నది. ముఖ్యంగా, పౌల్ట్రీ ఫీడ్‌లో కీలకమైన అంశంగా గుడ్డు ఉత్పత్తికి సోయాబీన్స్ కీలకం.
మరోవైపు.. ధరల పెరగుదలపై ఏపీబీఫ్(ఆల్ పాకిస్తాన్ బిజినెస్ ఫోరమ్) ప్రెసిడెంట్ సయ్యద్ మాజ్ మహమూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. యుఎస్ డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి (పీకేఆర్) విలువ క్షీణించడం, ఇంధన ఖర్చులు పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా, అంతకుముందు కూడా పాకిస్తాన్‌లో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గోధమ పిండి, పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ఒకనొక సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు రూ.300 మార్క్ దాటేశాయి.
Comments
Please login to add a commentAdd a comment