Inflation rate
-
ఆర్థిక అసమానతలకు కారణం ఏమిటంటే..
దేశంలో పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ప్రజల్లో ఆర్థిక అసమానతలను సృష్టిస్తుందని ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్‌బసు అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజలు తమ ఆదాయంలో దాదాపు 50 శాతం కంటే ఎక్కువ ఆహార అవసరాలకే ఖర్చు చేస్తున్నారని చెప్పారు. దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.‘సామాన్య ప్రజల ఆదాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. నెలవారీ ఆదాయంలో గరిష్ఠంగా ఆహార అవసరాలకే ఖర్చు చేస్తున్నారు. భారత్‌లో ద్ర్యవ్యోల్బణం 5.1 శాతంగా ఉంది. దీన్నిబట్టి ఆహార ద్రవ్యోల్బణం 30 శాతంగా ఉంటుంది. నెలవారీ ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఆహారానికే ఖర్చు చేసే కుటుంబాలు మరింత పేదరికంలోకి నెట్టవేయబడుతున్నాయి. దానివల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. భారత్‌లో కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయాలి. ఏఐలో ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సంప్రదాయ కార్మిక రంగంపై దీని ప్రభావం పడుతోంది. విద్య ఒక్కటే పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలకు పరిష్కారం కాదు. ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా నైపుణ్యాలు పెంచుకోవాలి. భారత్‌లో పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పీఎం గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టింది. అయినా మరిన్ని సంస్కరణలు రావాలి’ అని బసు సూచించారు.ఇదీ చదవండి: ‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’ -
ధరల దాడి
సాక్షి, అమరావతి: నిత్యావసరాలు వంటింటిని హడలెత్తిస్తున్నాయి. పొయ్యి వెలిగించకుండానే భగభగమంటున్నాయి. కందిపప్పు పట్టుకుంటే చేతులు కాలుతున్నాయి. ఉప్పు, పప్పు, చింతపండు, ఎండుమిర్చితో పాటు కూరగాయల వరకు రేట్లు మండిపోతున్నాయి. నిత్యావసరాల ధరల్లో జాతీయ సగటుతో పాటు దక్షిణాది సగటుతో పోలి్చనా ఆంధ్రప్రదేశ్‌లోనే ధరలు అధికంగా ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితంతో పోలిస్తే నిత్యావసరాల రేట్లు బాగా పెరిగాయి. బియ్యం (కామన్ రకం) 12 శాతం, పెసరపప్పు 54 శాతం, ఆటా 67%, కందిపప్పు 61 శాతం, పంచదార 15 శాతం, బంగాళదుంప 21 శాతం, ఉల్లిపాయాలు 87 శాతం, టమాటాలు 50 శాతం, పాలు 6 శాతం, ఉప్పు ధరలు 30 శాతానికిపైగా పెరగడంతో జనం జేబులు గుల్లవుతున్నాయి. ప్రతి నెలా బడ్జెట్ గాడి తప్పుతోంది.నాడు ఫోరి్టఫైడ్ గోధుమపిండిగోధుమ పిండి సగటున కిలో రూ.48 నుంచి రూ.70కిపైగా పలుకుతోంది. దేశ వ్యాప్తంగా తమిళనాడు తర్వాత ఏపీలోనే గోధుమ పిండి రేటు ఎక్కువగా ఉంది. గత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫోరి్టఫైడ్ గోధుమ పిండిని కిలో ప్యాకెట్ల రూపంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూ.11కే అందించింది. బియ్యం బాబోయ్! గత కొన్నేళ్లుగా బియ్యం ధరలు వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. 2019లో సాధారణ బియ్యం కిలో రూ.36 చొప్పున ఉండగా ఇప్పుడు కిలో రూ.55కిపైగా పలుకుతోంది. సూపర్ ఫైన్ బియ్యం రూ.65 – రూ.70కిపైగా ఎగబాకింది. బాస్మతి, దావత్ బియ్యం ఏకంగా కిలో రూ.230కిపైగా ఉంది. తాజాగా బియ్యం రేట్లు తొమ్మిది రాష్ట్రాల్లో కిలో రూ.50 దాటింది. అత్యధిక బియ్యం రేట్లలో ఏపీ 5వ స్థానంలో ఉంది. బియ్యం నిల్వలను నల్ల బజారుకు తరలించడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఈ ఖరీఫ్‌లో నాట్లు వేసిన తర్వాత కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో బియ్యాన్ని బ్లాక్ చేసి రేట్లు పెంచే ఆలోచనలో వ్యాపారులున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా బియ్యం నిల్వలపై పరిమితులు విధించకుండా అక్రమార్కులకు కొమ్ముకాస్తూ నామమాత్రంగా రూ.1, రూ.2 తగ్గించి వినియోగదారులుకు ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటోంది. వరి అధికంగా పండే పంజాబ్‌లో కిలో బియ్యం రూ.39.58 మాత్రమే ఉండగా అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి.ఉడకని కందిపప్పు! రాష్ట్రంలో గత ఫిబ్రవరిలో కిలో రూ.163 చొప్పున ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180కిపైగా చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా పీడీఎస్‌లో కందిపప్పు ఇవ్వకపోవడంతో బయట మార్కెట్లో వ్యాపారులు ధరలు పెంచేశారు. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే కందిపప్పు రేటు అధికంగా ఉంది. ధరల పెరుగుదలను నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.తాజాగా రిటైల్ దుకాణాలు, రైతు బజార్లలో రూ.150కే ఇస్తామంటున్నా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. ‘‘కిలో రూ.160 ఉన్నప్పుడు కొన్న కందిపప్పును రెండు సార్లు కుక్కర్లో ఉడికించి మిక్సీలో తిప్పినా మెత్తగా కావడం లేదు. చేసేది లేక ప్యాకెట్ కందిపప్పు రూ.224 పెట్టి కొనుక్కెళ్లా. ఉడకని పప్పులు తక్కువ రేటుకు ఇచ్చినా ఏం చేసుకోవాలి? ఇది వినియోగదారులకు నష్టం కాదా?’’ అంటూ విజయవాడలోని ఓ సూపర్ మార్కెట్లో వినియోగదారుడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయల కల్లోలం..రాష్ట్రంలో రెండు నెలల క్రితం అధిక వేడి కారణంగా కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో వాటి ధరలు 40 నుంచి 60 శాతం పెరిగాయి. రైతు బజార్లలో అన్నీ కిలో రూ.50 నుంచి రూ.80కి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అధిక వర్షాలు, వరదల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో నిత్యావసరాలకు తోడు కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. మార్కెట్లో కాకరకాయల ధర కిలో ఏకంగా రూ.70, క్యారెట్ ధర రూ.90 వరకు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల కారణంగా టమాటా, ఉల్లి, పచి్చమిర్చి, కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికం, అల్లం ధరలు పెరుగుతున్నాయి.ఏపీలోనే ద్రవ్యోల్బణం ఎక్కువ.. ధరల పెరుగుదల కొంతవరకు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకున్నా ఏపీలో ద్రవ్యోల్బణం అమాంతం పెరుగుతోంది. జాతీయ సగటు 5.08 శాతంతో పోలిస్తే ఏపీలో ధరల పెరుగుదల సూచీ 5.87 శాతంతో భయపెడుతోంది. ధరల పెరుగుదల సూచీ ఒడిశాలో అత్యధికంగా 7.22 శాతం, దాద్రానగర్ హవేలీలో 6.49 శాతం, బిహార్‌లో 6.37 శాతం, కర్నాటకలో 5.98 శాతం తర్వాత ఏపీ ఐదో స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో 5.49 శాతం, తమిళనాడులో 4.75 శాతం. కేరళలో 5.83 శాతం ద్రవ్యోల్బణం రేటు ఉంది. నిన్నటి రేట్లు ఇవాళ ఉండట్లేదు.. నిత్యావసరాల ధరలు చూస్తుంటే భయం వేస్తోంది. ఒకరోజు ఉన్న రేటు మరుసటి రోజు ఉండటం లేదు. ఊహించని విధంగా మారిపోతున్నాయి. కందిపప్పు కొనలేని పరిస్థితి. పోనీ కూరగాయలైనా వండుకుందామంటే ఏది చూసినా కిలో రూ.50, రూ.100 పలుకుతున్నాయి. ఆదాయానికి, ఖర్చులకు సంబంధం లేకుండా పోయింది. చివరకు చింతపండు రసం చేసుకోవాలన్నా రేట్లు చూస్తే కొనేలా లేవు. – అద్దంకి మౌనిక, పెదరావూరు, తెనాలి మండలంనలుగురికి సంతోషంగా వడ్డించలేం.. పప్పులు, ఉప్పుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వంటగదిలో కూర్చుని నలుగురికి ఆనందంగా వండిపెట్టే రోజులు ఇప్పట్లో రావేమో. ఏది కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి. సంపాదించే కొద్ది మొత్తంలో నిత్యావసరాలకే సగం ఖర్చయితే సామాన్యులు ఎలా బతకాలి? బియ్యం రేట్లు కూడా విపరీతంగా పెరుగుతుంటే ఇంకేం తినాలి? – యాదల అన్నపూర్ణ, తెనాలి -
పాకిస్తాన్లో దయనీయ పరిస్థితులు.. గుడ్డు ధర ఎంతో తెలుసా?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక, పౌష్టికాహరం కోసం ఒక్క గుడ్డును కొనాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా ఒక్క గుడ్డు ధర రూ.32కు చేరుకుంది. దీంతో, గుడ్డు కొనాలంటే పాకిస్తానీలు భయపడిపోతున్నారు. వివరాల ప్రకారం.. పాకిస్తాన్లో ధరల పెరుగుదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్లో గుడ్దు ధరలు పెరిగాయి. అధికారికంగా డజన్ గుడ్ల ధర ఏకంగా రూ.360కి చేరుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ మీడియా కూడా గుడ్ల ధరలు పెరిగినట్టు నివేదికల్లో పేర్కొన్నాయి. ఇక, 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజను గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, రిటైల్ వ్యాపారులు రూ.389కి అమ్ముతున్నారు. ఒక్కో గడ్డు ధర రూ.32కి చేరుకుంది. ధర పెరగడానికి కారణం.. సోయాబీన్స్ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, ఇంకా నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. మరోవైపు.. ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్ పాకిస్థాన్ బిజినెస్ ఫోరం తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నది. ముఖ్యంగా, పౌల్ట్రీ ఫీడ్‌లో కీలకమైన అంశంగా గుడ్డు ఉత్పత్తికి సోయాబీన్స్ కీలకం. మరోవైపు.. ధరల పెరగుదలపై ఏపీబీఫ్(ఆల్ పాకిస్తాన్ బిజినెస్ ఫోరమ్) ప్రెసిడెంట్ సయ్యద్ మాజ్ మహమూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. యుఎస్ డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి (పీకేఆర్) విలువ క్షీణించడం, ఇంధన ఖర్చులు పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా, అంతకుముందు కూడా పాకిస్తాన్లో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గోధమ పిండి, పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ఒకనొక సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు రూ.300 మార్క్ దాటేశాయి. -
ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..!
అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్.. ఇలా చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. పేద, ధనిక, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలనే తేడా లేదు. ఏ దేశంలో చూసినా అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. అన్ని రకాల వస్తువులతో పాటు తినుబండారాలు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సగటు మనిషికి బతుకు భారమవుతోంది. స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ద్రవ్యోల్బణ సమస్య అంటే ధరలు అదుపు లేకుండా పెరిగిపోవడమే. ప్రపంచ దేశాలు ఈ ద్రవ్యోల్బణానికి బలవుతున్నాయి. ప్రపంచంలోనే అధికంగా వెనుజులాలో 318 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్లు కొన్నిసర్వేల ద్వారా తెలుస్తోంది. లెబనాన్‌లో 215 శాతం, అర్జెంటీనాలో 143 శాతం, సిరియాలో 79.1 శాతం, పాకిస్థాన్‌లో 29.2 శాతం, ఇండియాలో 4.87 శాతం ద్రవ్యోల్బణం నమోదైనట్లు తెలుస్తోంది. Inflation rate: 🇻🇪 Venezuela: 318% 🇱🇧 Lebanon: 215% 🇦🇷 Argentina: 143% 🇸🇾 Syria: 79.1% 🇹🇷 Türkiye: 61.98% 🇮🇷 Iran: 39.2% 🇪🇬 Egypt: 35.8% 🇵🇰 Pakistan: 29.2% 🇳🇬 Nigeria: 27.33% 🇰🇿 Kazakhstan: 10.3% 🇧🇩 Bangladesh: 9.93% 🇨🇿 Czechia: 8.5% 🇷🇴 Romania: 8.07% 🇭🇺 Hungary: 7.9% 🇳🇪 Niger:… — World of Statistics (@stats_feed) December 8, 2023 -
మూడు నెలల కనిష్టమే.. అయినా రెండంకెల పైనే!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 15.18 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూన్‌తో పోల్చితే ఈ బాస్కెట్ ధర 15.18 శాతం పెరిగిందన్నమాట. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. మే నెలతో పోల్చితే ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రెండంకెలపైనే ఈ రేటు కొనసాగడం ఇది వరుసగా 15వ నెల. ఆహార ధరలు మాత్రం తీవ్రంగా కొనసాగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక విభాగాలను పరిశీలిస్తే.. ► ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం జూన్‌లో 14.39 శాతం. మేతో ఈ రేటు 12.34 శాతంగా ఉంది. కూరగాయలు (56.75%), ఆలూ (39.38%), పండ్ల (20.33%) ధరలు భారీగా పెరిగాయి. ► ఖనిజాల ధరలు మాత్రం 8.55% తగ్గాయి. ► క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు ధరలు 77.29 శాతం ఎగశాయి. ► కాగా, జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01%గా నమోదైంది. -
ఎంత పనిచేశావ్ పుతిన్.. భారత్‌కు గట్టి షాక్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తోంది. తిండి గింజల కొరత, నిత్యావసరాలు, చమురు ధరల పెరుగుదల... ఇలా అన్ని దేశాలకూ ఏదో రకంగా సెగ తగులుతోంది. మన దేశంపై కూడా యుద్ధ ప్రభావం గట్టిగానే పడుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ గత మూడు నెలల్లో నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ పైకి ఎగబాకుతుండటంతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా వెనక్కు తీసుకుంటుండటం వంటి పరిణామాలతో ఆర్థిక రంగం కూడా నానా కుదుపులకు లోనవుతోంది. చమురు భగభగలు.. యుద్ధం పుణ్యమా అని అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు రూపాయి పతనం కూడా తోడవటంతో మరింతగా మోతెక్కిపోతున్నాయి. ఈ ఏడాది మొదట్లో 80 డాలర్లున్న బ్యారెల్ చమురు ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడికి దిగాక ఈ మూడు నెలల్లో 128 డాలర్లకు పెరిగింది. వంటింట్లో మంటలు.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం భారతీయుల వంట గదిలోనూ సెగలు రేపుతోంది. ఏడాది క్రితంతో పోలిస్తే వంట నూనెల ధరలు నాలుగో వంతు దాకా పెరిగిపోయాయి. 2021 మే 31తో పోలిస్తే గోధుమలు 14 శాతం, చక్కెర 4 శాతం, ఉత్తరాదిన విరివిగా వాడే ఆవ నూనె 5 శాతం చొప్పున పెరుగుదల నమోదు చేశాయి. పెట్టుబడులు వాపస్.. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత మార్కెట్ల నుంచి గత మూడు నెలల్లో ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా వెనక్కు తీసుకున్నారు. అంతకుముందు 9 నెలల ఉపసంహరణ కంటే కూడా ఇది 50 వేల కోట్ల రూపాయలు ఎక్కువ! యుద్ధం దెబ్బకు ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దీంతో అంతర్జాతీయంగా తలెత్తిన ఒడిదొడుకులను తట్టుకునే చర్యల్లో భాగంగా భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు ఇలా పెట్టుబడులను భారీగా వెనక్కు తీసుకుంటున్నారు. రూపాయి నేలచూపులు.. యుద్ధం దెబ్బకు డాలర్‌తో రూపాయి పతనం గత మూడు నెలల్లో వేగం పుంజుకుంది. ఫిబ్రవరి 24న డాలర్‌తో 75.3 వద్ద కదలాడిన రూపాయి మే 31 నాటికి 77.7కు పడిపోయింది. ఇది దిగుమతులపై, ముఖ్యంగా చమురు దిగుమతులపై బాగా ప్రభావం చూపింది. ఎఫ్‌పీఐల ఉపసంహరణ కూడా రూపాయి పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. దీనికి తోడు భారత్‌లో ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్ నాటికే ఏకంగా 7.8 శాతానికి పెరిగింది! 2014 మే తర్వాత ద్రవ్యోల్బణం ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. -నేషనల్ డెస్క్, సాక్షి. -
పెరిగిన వ్యవసాయ కార్మికుల ద్రవ్యోల్బణం..!
న్యూఢిల్లీ: వ్యవసాయ, గ్రామీణ కార్మికులకు సంబంధించి ద్రవ్యోల్బణం మే నెల్లో స్వల్పంగా పెరిగింది. కార్మిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... వ్యవసాయ కార్మికుల వినియోగ ధరల సూచీ (సీపీఐ–ఏఎల్) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 మేలో 2.94 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) ఉంది. ఏప్రిల్‌లో ఈ రేటు 2.66 శాతం. ఇక గ్రామీణ కార్మికుల వినియోగ ధరల సూచీ (సీపీఐ–ఆర్ఎల్) ఆధారిత ద్రవ్యోల్బణం తాజా సమీక్షా నెల్లో 3.12 శాతం. ఏప్రిల్‌లో ఈ ధరల వేగం 2.94 శాతం. మేలో ఒక్క ఫుడ్ ఇన్ఫ్లెషన్ తీసుకుంటే, సీపీఐ–ఏఎల్ 1.54 శాతంగా ఉంటే, పీపీఐ–ఆర్ఎల్ విషయంలో ఈ రేటు 1.73 శాతం. చదవండి: stockmarket: ఫెడ్ ఎఫెక్ట్, కరెక్షన్ -
భారత్‌లో తీవ్రంగా ధరల పెరుగుదల: మూడీస్
న్యూఢిల్లీ: భారత్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ అనుబంధ విభాగం- మూడీస్ ఎనలిటిక్స్ విశ్లేషించింది. ఆసియా దేశాల ఎకానమీలతో పోల్చితే భారత్‌లోనే ధరల స్పీడ్ ఎక్కువగా ఉందని పేర్కొంది. వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై ఇంధన ధరల ప్రభావం మున్ముందూ కొనసాగే అవకాశం ఉందని అంచనావేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు-రెపో (ప్రస్తుతం 4 శాతం) మరింత తగ్గకపోవచ్చని ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ కంపెనీ అభిప్రాయపడింది. జనవరిలో 4.1 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. కోర్ ఇన్ఫ్లెషన్ (ఫుడ్, ఫ్యూయెల్, విద్యుత్ మినహా) ఇదే కాలంలో 5.3 శాతం నుంచి 5.6 శాతానికి ఎగసింది. ఆర్బీఐ రెపో నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం గమనార్హం. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు(100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన(2020 ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2021 నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో ‘ద్రవ్యోల్బణం భయాలతో’ యథాతథ రేటును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంటుందని అంచనావేస్తున్న ఆర్బీఐ, భవిష్యత్తులో రేటు తగ్గింపునకే అవకాశం ఉందని సూచిస్తూ, వృద్ధికి దోహదపడే సరళతర ఆర్థిక విధానాలకే మొగ్గుచూపుతున్నట్లు ప్రకటిస్తూ వస్తోంది. కేంద్రం ఆర్బీఐకి ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం శ్రేణిలో ఉండాలి. ఏప్రిల్ 7న ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో మూడీస్ ఎనలిటిక్స్ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... పలు ఆసియా దేశాల్లో ద్రవ్యోల్బణం తగిన స్థాయిలోనే ఉంది. చమురు ధరల పెరుగుదల, దేశాల ఎకానమీలు తిరిగి ఊపందుకోవడం వంటి కారణాల వల్ల 2021లో కొంత పెరిగే అవకాశం ఉంది. భారత్‌తో పాటు ఫిలిప్పైన్స్‌లో కూడా ద్రవ్యోల్బణం తగిన స్థాయికన్నా ఎక్కువగా ఉంది. విధాన నిర్ణేతలకు ఇది ఒక పెద్ద సవాలే. 2020లో పలు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తగిన ‘‘6 శాతం’’ స్థాయికన్నా ఎక్కువగా ఉంది. దీనివల్ల దేశంలో రెపో రేటు మరింత తగ్గించలేని పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ పరపతి విధాన కమిటీకి ప్రస్తుతం కేంద్రం నిర్దేశిస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణ శ్రేణి (2-6 శాతం) మార్చి 31వ తేదీ తర్వాతా కొనసాగించే అవకాశం ఉంది. ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఎఫ్టీఐ (ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లెషన్ టార్గెట్) ఫ్రేమ్‌వర్క్ ఈ మేరకు మార్గదర్శకాలు చేస్తోంది. 2016 నుంచీ అమల్లో ఉన్న ఈ మార్గదర్శకాల గడువు 2021 మార్చి 31వ తేదీతో తీరిపోనున్న సంగతి తెలిసిందే. చదవండి: ఏప్రిల్‌లో ఎన్నిరోజులు బ్యాంక్‌లకు సెలవులంటే..! పాన్-ఆధార్ లింకు స్టేటస్ చెక్ చేసుకోండిలా! -
దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది: ఆర్బీఐ
ముంబై, సాక్షి: అంచనాలకంటే వేగంగా దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు ఆర్బీఐ తాజాగా అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) మూడో క్వార్టర్(అక్టోబర్-డిసెంబర్)లో దేశ జీడీపీ ప్రతికూల బాటలను వీడి స్వల్ప వృద్ధిని చూపవచ్చని అంచనా వేసింది. అయితే వృద్ధి అవకాశాలను దెబ్బతీయకుండా ధరల(ద్రవ్యోల్బణం)కు ముకుతాడు వేయవలసి ఉన్నట్లు పేర్కొంది. కోవిడ్-19 వల్ల ఎదురైన సవాళ్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ బయటపడుతున్నట్లు జాతీయ గణాంకాల నివేదిక(ఎన్ఎస్వో) వెల్లడించింది. ఈ అంశంలో పలు అంచనాలను మించి పురోగతి సాధిస్తున్నట్లు తెలియజేసింది. అయితే కొన్ని సమస్యలున్నట్లు ప్రస్తావించింది. ఇందుకు పలు అంశాలలలో పటిష్ట కార్యాచరణ అవసరమని తెలియజేసింది. (కోవాక్స్ వ్యాక్సిన్ తయారీకి అరబిందో ఓకే) 14 శాతం వృద్ధి ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో కరోనా వైరస్ కల్లోలంతో ఆర్థిక వ్యవస్థకు షాక్ తగిలినట్లు ఎన్ఎస్వో పేర్కొంది. అయితే రెండో త్రైమాసికానికల్లా ఈ ప్రభావం తగ్గుముఖం పట్టిందని తెలియజేసింది. ఈ బాటలో క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో జీడీపీ 0.1 శాతం వృద్ధిని సాధించే వీలున్నదని అంచనా వేసింది. వెరసి అంచనాలకు మించి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నదని అభిప్రాయపడింది. ఎన్ఎస్వో వివరాల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22) తొలి అర్ధభాగంలో దేశ ఆర్థిక వ్యవస్థ 14.2 శాతం పురోగమించే వీలుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో నమోదుకానున్న0.4 శాతం నుంచి చూస్తే వేగవంత వృద్ధికి అవకాశముంది. కోవిడ్-19 కాలంలో ఆర్థికపరంగా కుటుంబాలు, కార్పొరేషన్స్ పొదుపు మంత్రం పాటించాయి. ఆర్థిక పరిస్థితులు బలపడుతుండటంతో బ్యాంకుల రుణాలకు నెమ్మదిగా డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ప్రైవేట్ పెట్టుబడులు జోరందుకోవలసి ఉంది. ఆర్థిక రికవరీ కొనసాగేందుకు ప్రయివేట్ రంగంలో విస్తరణ, సామర్థ్య వినియోగం, పెట్టుబడి వ్యయాలపై కంపెనీలు దృష్టి సారించవలసి ఉన్నట్లు ఎన్ఎస్వో నివేదిక వివరించింది. -
దేశంలో జరుగుతుంది అభివృద్ధా?, వినాశానమా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలో జరుగుతుంది అభివృద్ధా?.. వినాశానమా? అని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం పెరగడం తప్ప దేశంలో ఎక్కడా అభివృద్ధి కనిపించట్లేదని రాహుల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో ప్రజలు క్రమశిక్షణ కోల్పోతున్నారని.. రోజు రోజుకీ సామాజిక పరిస్థితులు దిగజారిపోతున్నాయని ట్విటర్లో పేర్కొన్నారు. జీడీపీ కుంటుపడటంతో పాటు దేశ బ్యాంకింక్ వ్యవస్థ సమస్యల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుందన్నారు. కేంద్రం నిర్ణయాలతో దేశంలో ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుందని రాహుల్ ఆరోపించారు. -
రిటైల్‌కు రెక్కలొచ్చాయ్!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వస్తు, సేవల రిటైల్ ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడిని ధరాఘాతం తాకుతోంది. జీవనవ్యయం పెరిగి జేబుపై ఆర్థికభారం పడుతోంది. అక్టోబర్ నెలలో దేశంలో ద్రవ్యోల్బణం 7.61 శాతానికి చేరుకోగా, తెలంగాణ రాష్ట్రంలో అది ఏకంగా 10.37 శాతానికి ఎగబాకింది. దీంతో ద్రవ్యోల్బణం రేటులో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉంది. గత ఏడాది ఒకనెలతో పోల్చితే (ఉదాహరణకు అక్టోబర్ 2019– అక్టోబర్ 2020 మధ్య తేడా), ఈ ఏడాది అదేనెలలో వినియోగదారుల ధరల సూచీలో పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరిగినపుడు... ప్రజల జీవన వ్యయం పెరిగిపోతుంది. రూపాయి కొనుగోలు శక్తి తగ్గుతుంది. కేంద్ర గణాంక, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌పీఐ) అక్టోబర్ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణం గణాంకాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం 2020 అక్టోబర్‌లో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 10.37 శాతానికి చేరింది. పశ్చిమబెంగాల్ 10.89 శాతం ద్రవ్యోల్బణంతో దేశంలో అగ్రస్థానంలో నిలవగా, 10.14 శాతంతో ఒడిశా, 10.03 శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రెండో స్థానంలో ఉండటాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో రిటైల్ ధరలు రాకెట్ వేగంతో పెరిగిపోయాయని స్పష్టమవుతోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం గత కొంతకాలంగా దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేస్తూ వస్తోంది. గత మార్చి నెలలో దేశంలో ద్రవ్యోల్బణం 5.91 శాతం నమోదు కాగా, 8.12 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. పల్లెల్లో బతుకుభారం గత అక్టోబర్‌లో గ్రామీణ తెలంగాణలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. 11.98 శాతం ద్రవ్యోల్బణం రేటుతో గ్రామీణ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ పట్టణ ప్రాంతాలు 9.05 శాతం ద్రవ్యోల్బణంతో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచాయి. మరో విధంగా చెప్పాలంటే తెలంగాణ పల్లెల్లో రిటైల్ ధరలు దాదాపు 12 శాతం, పట్టణాల్లో 9.05 శాతం పెరిగాయి. ద్రవ్బోల్బణం పెరిగితే రూపాయి విలువ క్షీణించి ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తుంది. కూరగాయలు, ఉల్లి ధరలే ప్రధానకారణం ప్రధానంగా కూరగాయలు, ఉల్లి, ఇతర ఆహారపదార్థాల ధరలు అసాధారణంగా పెరగడంతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. వినియోగదారుల ధరల సూచిక (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ప్రకారం గతేడాదితో పోల్చితే ప్రస్తుతం జాతీయ స్థాయిలో కూరగాయల ధరలు 22.51 శాతం, పప్పు ధాన్యాల ధరలు 18.34 శాతం, మాంసం, చేపల ధరలు 18.70 శాతం, గుడ్ల ధరలు 21.81 శాతం, నూనెల ధరలు 15.17 శాతం వరకు పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి నియంత్రణకు లాక్డౌన్ విధించిన నాటి నుంచి కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. చాలా కూరగాయలు కిలో సగటున రూ.60 నుంచి 100 వరకు ఎగబాకాయి. ఇక ఉల్లి ధరలకు రెక్కలు వచ్చి ఒకదశలో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది. భారీ వర్షాలతో ఉల్లి, కూరగాయల పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలు పెరుగుదలకు దారితీసిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో వరిసాగు పెరడమే కారణం తెలంగాణ రాష్ట్రం కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా ఉన్న డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో రాష్ట్రంలో వీటి ధరలు దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా అధికంగా ఉంటున్నాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2011–12లో రాష్ట్రంలో రూ.9,317.47 కోట్ల విలువ చేసే పండ్లు, కూరగాయల ఉత్పత్తి జరగగా, 2017–18 వచ్చేసరికి ఈ ఉత్పత్తుల విలువ రూ.5,737.41 కోట్లకు తగ్గిపోయిందని కేంద్ర గణాంక, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో గత దశాబ్దకాలంగా పండ్లు, కూరగాయల ఉత్పత్తి దాదాపు సగానికి తగ్గిపోయిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో వరిసాగు ఏటేటా గణనీయంగా పెరిగిపోతోంది. వివిధ సాగునీటి ప్రాజెక్టుల కింద దశాబ్దాలుగా బీడువారిన లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ఏడాది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని సరఫరా చేసి స్థిరీకరించారు. గతంలో కూరగాయలు, పప్పుదినుసులు, ఇతర పంటలు పండించిన రైతులు సాగునీరు వచ్చేసరికి వరి సాగువైపు మళ్లారు. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో కూరగాయల సాగు మరింతగా తగ్గిపోవడంతో... సరఫరా తగ్గి వీటి ధరలు గణనీయంగా పెరిగిపోయాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన నియంత్రిత పంటల సాగు విజయవంతమై... స్థానిక అవసరాలకు తగ్గట్టు ఇక్కడే కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు పెరిగితే ధరలు దిగి వచ్చే అవకాశముంది. డిమాండ్‌కు తగ్గట్టు సప్లై లేదు ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి, లాక్డౌన్, నిరుద్యోగం కారణంగా ప్రజల జేబుల్లో డబ్బులు లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు లేక డిమాండ్ పతనమై ధరలు తగ్గాల్సింది పోయి... పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టు ఆహారపదార్థాల సరఫరా లేకపోవడం ధరలు పెరగడానికి దోహదపడింది. దేశానికే ధాన్య భండాగారంగా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, కూరగాయలు, పండ్లు, ఉల్లి, పప్పులు, మసాల దినుసులు, ఇతర ఆహారపదార్థాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతోంది. ఇతర రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన ధరలు కొద్దిగా పెరిగినా తెలంగాణలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. ప్రధానంగా పేద, బలహీనవర్గాల ప్రజల జీవనం దుర్భరంగా మారిందని ద్రవ్యోల్బణం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణకు అవసరమైన పండ్లు, కూరగాయలు, పప్పులు వంటి వాటి ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కూరగాయలు, ఉల్లిని పేదలకు సబ్సిడీపై సరఫరా చేయాలి. లేకుంటే పేద ప్రజలకు రెండు పూటల కడుపు నిండా తిండి కూడా లభించదు. – పీఎస్ఎం రావు, ఆర్థికవేత్త -
ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ ఒక్కటే కట్టడి చేయలేదు: రంగరాజన్
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) సమస్యను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక్కటే కట్టడి చేయలేదని మాజీ గవర్నర్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ కట్టడిలో కీలకమైన సరఫరాలో సమస్యలను అధిగమించడంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. ‘నూతన ద్రవ్య విధాన ఫ్రేమ్‌వర్క్ – దాని అర్థం’’ అన్న చర్చాపత్రంపై ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్బీఐ ద్రవ్య విధాన పరిమితుల గురించి మాట్లాడారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యో ల్బణం ఒక్కసారిగా 7.5 శాతాన్ని జనవరి (7.59 శాతం) దాటింది. ద్రవ్యోల్బణం కట్టడితోపాటు, వృద్ధి, ఫైనాన్షియల్ రంగం సుస్థిరత వంటి ఎన్నో బాధ్యతలను ఆర్బీఐ నెరవేర్చాల్సి ఉంటుందని రంగరాజన్ అభిప్రాయపడ్డం గమనార్హం. -
ఆర్బిఐ ద్రవ్యపరపతి విధానసమీక్ష ప్రారంభం
-
ఆర్బీఐ వైపు అందరి చూపు..!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 6వ తేదీ వరకూ ఈ సమావేశం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–2020) చివరి, ఆరవ ద్వైమాసిక ఆర్బీఐ పాలసీ సమావేశం ఇది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగమనం, ద్రవ్యోల్బణం కట్టుతప్పడం వంటి ప్రతికూలతల నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. ధరలూ సామాన్యునిపై భారాన్ని మోపుతున్నాయి. మొత్తంగా గణాంకాలు దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తుండగా, నిత్యావసరాల ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. కట్టుతప్పిన ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయిని దాటేసి.. ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. ఇది అయిదున్నరేళ్ల గరిష్ట స్థాయి. 2018 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.11 శాతంగా ఉండగా, 2019 నవంబర్‌లో 5.54 శాతంగాను, డిసెంబర్లో 7.35 శాతంగాను నమోదైంది. చివరిసారిగా 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్లో తాకడం ఇదే ప్రథమం. ఆర్బీఐ పాలసీ విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. ఇక దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ, డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం 2.59 శాతంగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఏమిటన్నది వేచిచూడాల్సి ఉంది. ఆరు సార్లలో ఐదు సార్లు తగ్గింపు... ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని డిసెంబర్ 5 మధ్య జరిగిన ఆరు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి సమావేశంలో ఈ దిశలో నిర్ణయం తీసుకోలేకపోయింది. -
మీ ద్రవ్యోల్బణం రేటు ఎంత?
ఆర్థిక ప్రణాళికలకు ధరల స్పీడ్ గుర్తించాలి... భవిష్యత్తు లక్ష్యాలు, ఆర్థిక ప్రణాళికల విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ద్రవ్యోల్బణం. చాలా మంది ఈ ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పట్టించుకోరు. వాస్తవంగా మీరు ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం రేటు కంటే మీ అంచనాలు కనీసం 1–2 శాతం తక్కువ ఉన్నా కానీ, లక్ష్యాలకు విఘాతం ఏర్పడినట్టే. అందుకే ఆర్థిక ప్రణాళికల్లో ద్రవ్యోల్బణం విషయంలో అంచనాలు కచ్చితంగా ఉండడం ఎంతో అవసరం అవుతుంది. నివసించే ప్రాంతం కూడా... మీరు పట్టణాల్లో ఉంటున్నారా లేక గ్రామీణ ప్రాంతాల్లోనా అన్నది కూడా మీ వ్యక్తిగత ద్రవ్యోల్బణ రేటు, అధికారిక ద్రవ్యోల్బణ రేటు మధ్య వ్యత్యాసానికి కారణమవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది ఏప్రిల్ వరకు చూసుకుంటే, పట్టణాల్లో నివసించే వారు 4.2 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని చవిచూడగా, ఇదే కాలంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొన్న రేటు 1.8 శాతంగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం 1–2 శాతం మధ్య నమోదు కాగా, కేరళలో ఇది 5 శాతం స్థాయిలో ఉంది. అందుకనే పట్టణాల్లో ఉండేవారు, దక్షిణాది రాష్ట్రాల్లో నివాసం ఉండే వారు తమ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల రచనకు అధికారిక ద్రవ్యోల్బణ రేటు కంటే అదనంగా మరో 2 శాతాన్ని కలిపి పరిగణనలోకి తీసుకోవాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇక మీ వ్యక్తిగత ద్రవ్యోల్బణం ఎంతన్నది కచ్చితంగా తెలుసుకునేందుకు, మీ నెలవారీ ఇంటి ఖర్చులను జాగ్రత్తగా పరిశీలించుకోవడం మరో మార్గం. దాంతో మీ పరిస్థితులకు తగ్గ ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఈ విషయంలో మీరు పెద్దగా శ్రమ పడాల్సిన పని లేకుండా ఆ పనిచేసి పెట్టే మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి. సంబంధిత యాప్స్ పెరిగే ఖర్చులతోపాటు, మీ జీవనశైలి మార్పులను ట్రాక్ చేస్తాయి. లక్ష్యాలకు అనుగుణంగా అంచనాలు రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికలకు సంబంధించి పెట్టుబడులకు పైన చెప్పుకున్న విధానాలు అక్కరకు వస్తాయి. అయితే, మీ పిల్లల విద్య లేదా ఇంటి కొనుగోలు లేదా మీ ఆరోగ్య సంరక్షణ వంటి ప్రత్యేక లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకోదలిచిన వారు, ఆయా విభాగాల్లో పెరిగే రేట్లకు అనుగుణంగా ద్రవ్యోల్బణ అంచనాలు వేసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మీ పిల్లల ఉన్నత విద్యనే తీసుకోండి. చాలా వరకు ఫైనాన్షియల్ కాలిక్యులేటర్లు విద్యా ద్రవ్యోల్బణ రేటును 7–8 శాతం మధ్య అంచనాగా చూపిస్తుంటాయి. అయితే, ప్రతిష్టాత్మక, పేరున్న విద్యా సంస్థల్లో చదివించాలన్న లక్ష్యంతో ఉన్న వారు, ఈ రేటుకు అదనంగానే పరిగణనలోకి తీసుకోవాలి. 2012లో ఐఐటీల్లో సాధారణ కేటగిరీలో ఇంజనీరింగ్ విద్య కోసం ఏడాదికి రూ.50వేలు వెచ్చించాల్సి రాగా, ఈ రోజు అదే కేటగిరీ ఫీజు రూ.2 లక్షలకు చేరింది. అంటే అక్షరాలా 22 శాతం ద్రవ్యోల్బణ రేటు. బిట్స్ పిలానీ అయితే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజులను ఏటా 15 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఐఐఎం అహ్మదాబాద్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఫీజు ఐదేళ్ల క్రితం రూ.16.5 లక్షలు ఉంటే, అదిప్పుడు రూ.23 లక్షలకు పెరిగింది. ఇక ఇతర ఇంజనీరింగ్ లేదా మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూషన్లలో ఫీజుల పెరుగుదల వీటి కంటే కాస్త తక్కువగా ఉంది. అందుకని విద్యా ద్రవ్యోల్బణం అనేది పిల్లలను ఏ కోర్సుల వైపు పంపిద్దామనుకుంటున్నారనే దానిపైనా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే, ఒకవేళ మీ పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకుంటే, కచ్చితంగా డాలర్‌తో రూపాయి తరుగుదల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కోర్సు ఫీజుల పెరుగుదల ప్రభావానికి తోడు, రూపాయి క్షీణతను 4–5 శాతం మధ్య పరిగణనలోకి తీసుకోవచ్చని నిపుణుల సూచన. ఇల్లు విషయంలో... ఇక ఇల్లు కొనుగోలు చేయాలన్నది మీ లక్ష్యం అయితే, సాధారణ ద్రవ్యోల్బణ రేటు కాకుండా, ప్రాపర్టీ మార్కెట్లో ధరల పెరుగుదల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పట్టణంలో అయితే మీరు ఎంచుకున్న ప్రాంతం డిమాండ్ ఉన్నదా లేక శివారులోనా లేక మరో చోటా అనే దాని ఆధారంగా ద్రవ్యోల్బణ ప్రభావంలో మార్పు వస్తుంది. ప్రాపర్టీ ధరలను తెలియజేసే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రెసిడెక్స్ గణాంకాలను పరిశీలిస్తే... ఢిల్లీ, గురుగ్రామ్‌లో 2013–2018 మధ్య ప్రాపర్టీ ధరలు ఫ్లాట్‌గా ఉండగా, హైదరాబాద్ మార్కెట్లో 6.9 శాతం, వైజాగ్, కోచిలో 7 శాతం, బెంగళూరులో 7.4 శాతం, చెన్నైలో 5.3 శాతం చొప్పున ఏటేటా పెరిగినట్టు తెలుస్తోంది. ఇక ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం ఏర్పాటు చేసుకునే నిధికి 6–7 శాతం ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకుంటే అవసరమైన సందర్భంలో నిధులకు కటకట ఎదురవకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాల్లో వైద్య చికిత్సల వ్యయాలు రెండంకెల స్థాయిలో పెరిగిపోవడం గమనార్హం. ఊహించని వైద్య అవసరాల కోసం ఓ నిధిని ఏర్పాటు చేసుకునేట్టు అయితే, 10 శాతం ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ నెలా వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. దీన్నే దేశంలో ఎక్కువ మంది అనుసరిస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన గణాంకాల ఆధారంగా గత ఆరేళ్లలో సగటు ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ, మీ ఆర్థిక ప్రణాళికలకు ఈ రేటును పరిగణనలోకి తీసుకుంటే అది తప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎందుకంటే, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే సీపీఐ ద్రవ్యోల్బణం, మీరు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం కంటే తక్కువే ఉంటుంది. సీపీఐ అన్నది దేశంలో సాధారణ ఆదాయం కలిగిన గృహస్థులపై ఉండే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. భిన్న వస్తు, సేవల ఆధారంగా తక్కువ ఆదాయం కలిగిన ఇంటి ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తుంది. ఉదాహరణకు ఆహారం, పానీయాలకు ఈ సూచీలో 46 శాతం వెయిటేజీ ఉంది. అదే సమయంలో ఇంటి కోసం చేసే అద్దె ఖర్చులకు 10 శాతం, రవాణా, హెల్త్, విద్య, వినోదం అన్నింటికీ కలిపి 25 శాతమే వెయిటేజీ ఉంది. కానీ, మధ్యస్త ఆదాయం నుంచి అధిక ఆదాయ వర్గాలు ఆహారం, పానీయాలకు కాస్త తక్కువగా, అదే సమయంలో ఇల్లు, సేవలపై ఎక్కువగా వెచ్చిస్తుంటారు. మరి ఆహార ధరలు తగ్గుతుంటే, సేవలు ఖరీదవుతున్నాయి. కనుక సగటు ఇంటిపై ద్రవ్యోల్బణం విషయంలో సీపీఐ రేటు వాస్తవికంగా ఉండదని గమనించాలి. సీపీఐ రేటు ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల గత ఆరేళ్లలో 4 శాతంగానే అని చూపిస్తున్నప్పటికీ... సగటు గృహస్థులు ఎదుర్కొన్న రేటు 7 శాతంగా ఉంది. అదే విద్యా సంబంధిత ద్రవ్యోల్బణం 6.3 శాతం, ఆరోగ్య సంరక్షణ వ్యయాలపై 5.8 శాతం ద్రవ్యోల్బణ ప్రభావం ఉంది. అందుకే సీపీఐ ద్రవ్యోల్బణంలో ఆహారోత్పత్తుల రేటు కంటే కూడా సేవల రంగ రేటును పరిగణనలోకి తీసుకోవడం సమంజసమన్నది నిపుణుల అభిప్రాయం. -
టోకు ధరలు.. అదుపులోనే!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ ఆగస్టులో యథాతథంగా జూలై తరహాలోనే 1.08 శాతంగా కొనసాగింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత 4% దిగువన కొనసాగుతుండడంతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరో దఫా రెపో రేటు కోతకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.4 శాతం) గడచిన నాలుగు ద్వైమాసికాల్లో ఆర్బీఐ 1.1 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఆరి్థక వృద్ధి మందగమనం, పారిశ్రామిక రంగం నత్తనడక వంటి అంశాల నేపథ్యంలో మరో దఫా రేటు కోత తప్పదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా ఆగస్టు గణాంకాలను చూస్తే, ఆహార ఉత్పత్తుల ధరలు కొంత పెరిగినా, తయారీ రంగంలో ఉత్పత్తుల ధరలు మాత్రం అసలు (జీరో) పెరగలేదు. ఫుడ్ ఆరి్టకల్స్ ధరలు జూలైలో 6.15 శాతం ఉంటే, ఆగస్టులో 7.67 శాతానికి ఎగశాయి. కూరగాయల ధరలు 10.67 శాతం నుంచి 13.07 శాతానికి ఎగశాయి. కాగా ఇంధనం, ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ ధర 4 శాతం పెరిగింది. -
కుదిరితే మరిన్ని కోతలు
ధరలు తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలకు రుణాల వృద్ధి కోసమే రేట్లను పావుశాతం మేర తగ్గించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఎంపీసీ విధాన ప్రకటన తర్వాత మీడియాతో పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అంచనాల పరిధిలోనే తక్కువగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ చట్ట నిబంధనల పరిధిని మించి ఎంపీసీ ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ‘‘వచ్చే 12 నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.9 శాతం పరిధిలో... గరిష్టంగా 4 శాతం లేదా అంతకులోపు ఉంటే రేట్ల తగ్గింపును పరిశీలించే అవకాశం ఉంటుంది’’అని దాస్ పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రతిపాదనల వల్ల ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త ద్రవ్యోల్బణం అంచనాలకు వచ్చినట్టు చెప్పారు. లిక్విడిటీ సమస్య లేదు వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కీలకమైన ఏ రంగానికీ నిధుల లభ్యత (లిక్విడిటీ) సమస్య లేదని శక్తికాంతదాస్ తెలిపారు. అవసరమైనప్పుడు తగినన్ని నిధులను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా వ్యవస్థలోకి రూ.2.36 లక్షల కోట్లను తీసుకొచ్చామని, ఫిబ్రవరి నెలలో రూ.37,500 కోట్లను తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని విరాళ్ ఆచార్య గుర్తు చేశారు. ఎన్పీఏ నిబంధనల్లో మార్పుల్లేవు రుణ చెల్లింపుల్లో ఒక్కరోజు విఫలమైనా ఎన్పీఏలుగా గుర్తించాలన్న 2018 ఫిబ్రవరి 12 నాటి ఉత్తర్వుల్లో ఎటువంటి మార్పులను చేయడం లేదని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనా లేదన్నారు. నాటి ఉత్తర్వుల మేరకు బ్యాంకులు నిర్ణీత గడువులోపు రుణ చెల్లింపులు చేయని ఖాతాల విషయంలో నిర్ణీత వ్యవధిలోపు పరిష్కారం చూడడం, విఫలమైతే ఐబీసీ చట్టం కింద ఎన్సీఎల్టీకి నివేదించడం చేయాల్సి ఉంటుంది. మధ్యంతర డివిడెండ్... న్యాయబద్ధమే ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ను కోరడం చట్టబద్ధమేనని, ఈ నిధులను దేనికి వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమేనని దాస్ చెప్పారు. ఆర్బీఐ నుంచి మరిన్ని నిధులను బదిలీ చేయాలన్న ప్రభుత్వ డిమాండ్లతోనే ఉర్జిత్ పటేల్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘‘మిగులు నిధులు లేదా మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించడం అన్నది ఆర్బీఐ చట్టం పరిధిలోనిదే. ఈ చట్టపరమైన నిబంధనలను దాటి మేమేమీ చేయడం లేదు’’ అని దాస్ స్పష్టం చేశారు. చందాకొచర్‌పై నిర్ణయం దర్యాప్తు సంస్థలదే... ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్ వ్యవహారంలో దాస్ తొలిసారి స్పందించారు. ఈ కేసులో చర్యలు తీసుకోవడం దర్యాప్తు సంస్థల పరిధిలోనే ఉందన్నారు. నిబంధనలను వ్యక్తులు లేదా గ్రూపు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే విషయంలో ఆర్బీఐ పాత్ర పరిమితమేనన్నారు. ఒకవేళ ఏదైనా అంశాల్లో దర్యాప్తు అవసరం అయితే తదుపరి చర్యల అధికారం వారి పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. సాగు రంగానికి వెసులుబాటు హామీల్లేకుండా వ్యవసాయానికి ఇచ్చే రుణాల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగానికి రుణాల పరిస్థితిని సమీక్షించి ఆచరణాత్మక విధానాన్ని సూచించేందుకు ఓ అంతర్గత వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయనుంది. గత కొన్నేళ్లలో వ్యవసాయ రంగానికి రుణాల పంపిణీ వృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ... ఈ రుణాల పంపిణీ విషయంలో ప్రాంతాల మధ్య అంతరాలు, కవరేజీ విస్తృతి వంటి సమస్యలు ఉన్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఈ అంశాలను ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు పరిగణనలోకి తీసుకోనుంది. డిపాజిట్లకు నిర్వచనంలో మార్పు బ్యాంకులకు డిపాజిట్ల సమీకరణ విషయంలో ఆర్బీఐ కొంత స్వేచ్ఛ కల్పించింది. ప్రస్తుతం రూ.కోటి ఆపై మొత్తాలను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటే, దీన్ని రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువకు మార్చింది. బ్యాంకులు చిన్న డిపాజిట్ల కంటే బల్క్ డిపాజిట్లపై కొంత మేర అదనపు వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. బ్యాంకులు తమ అవసరాలు, ఆస్తులు, అప్పుల నిర్వహణ సమతుల్యత కోసం బల్క్ డిపాజిట్లపై భిన్నమైన రేటును ఆఫర్ చేసే స్వేచ్ఛ వాటికి ఉంటుంది. అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఏర్పాటుకు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. దివాలా ప్రక్రియలో పాల్గొనే బిడ్డర్లకు ఈసీబీ సదుపాయం దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) పరిధిలోని కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)లో పాల్గొనే కంపెనీలు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ) మార్గంలో నిధుల సమీకరణకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ కరెన్సీ లేదా రూపాయి మారకంలో ఈసీబీ ద్వారా సమీకరించే నిధులను తిరిగి చెల్లింపులు లేదా రూపాయి మారకంలోని రుణాలను తీర్చివేసేందుకు అనుమతి లేదు. మరో రేటు కోత అంచనా! తాజా రేటు తగ్గింపు వృద్ధికి దోహదపడే అంశమని పలు వర్గాలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనితోపాటు త్వరలో మరో దఫా రేటు కోత తథ్యమని మెజారిటీ విశ్వసిస్తోంది. తాజా పాలసీపై పలువురి అభిప్రాయాలు ఇలా... తటస్థ వైఖరి... సానుకూలం పాలసీపై ‘తటస్థం’ దిశగా ఆర్బీఐ అడుగులు వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి తగిన సానుకూలతను సృష్టిస్తోంది. ధరలు పెరక్కపోతే మరో కోతకు చాన్సుంది. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు కీలక నిర్ణయాలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో రైతులకు మరింత రుణం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల రైతుల రుణ సమస్యలు కొంత తీరుతాయి. ఇక వ్యవస్థలో మొత్తంగా రుణ డిమాండ్ పెరుగుతుంది. – దినేష్ ఖేరా, ఎస్బీఐ ఎండీ వేచి చూడాల్సి ఉంది వృద్ధికి తాజా పాలసీ కొంత అవకాశం కల్పించింది. అయితే పూర్తి ఫలితానికి వేచి చూడాల్సి ఉంటుంది. ద్రవ్యలోటుసహా పలు అంశాలపై వృద్ధి జోరు ఆధారపడి ఉంటుంది. – ప్రజుల్ భండారీ, హెచ్ఎస్బీసీ (ఇండియా) చీఫ్ ఎకనమిస్ట్ మరింత తగ్గింపు ఉండవచ్చు ఆర్బీఐ నిర్ణయం హర్షణీయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న ప్రస్తుత తరుణంలో రేటు తగ్గింపు మరో విడత ఉండవచ్చని భావిస్తున్నాం. పెట్టుబడులు, వినియోగం పెరుగుదలకు ఇది అవసరం. – సందీప్ సోమానీ, ఫిక్కీ ప్రెసిడెంట్ ఏప్రిల్‌లో మరో కోత ఏప్రిల్‌లో మరో దఫా రేటు కోత ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, పారిశ్రామిక వృద్ధి మందగమనం దీనికి కారణం. ఆర్బీఐ నిర్ణయాలు వ్యవస్థలో లిక్విడిటీని పెంచుతున్నాయి. – రాధికారావు, డీబీఎస్ ఎకనమిస్ట్ బ్యాంకింగ్ రంగానికి సానుకూలం శక్తికాంతదాస్ మొదటి పాలసీ బ్యాంకింగ్‌పై పెద్ద స్థాయిలో సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యవస్థలో రుణ వృద్ధికి అలాగే మొత్తంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడే నిర్ణయం ఇది. – సునిల్ మెహతా, ఐబీఏ చైర్మన్ -
ఆర్బీఐ పాలసీ సమావేశం ప్రారంభం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. గురువారంనాడు కీలక నిర్ణయాలను వెలువరించనుంది. 2018–19 ఆరవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఇది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో మొట్టమొదటిసారి సమావేశమవుతున్న ఆరుగురు సభ్యుల పరపతి విధాన మండలి ఈ దఫా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) మార్చకపోవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో ఉన్నందున, పాలసీకి సంబంధించి తన పూర్వ ‘జాగరూకతతో కూడిన కఠిన’ వైఖరిని ‘తటస్థం’ దిశగా సడలించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గత డిసెంబర్ పరపతి విధాన సమీక్ష సందర్భంగా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బందులు తొలిగితే, రేటు తగ్గింపు చర్యలు ఉంటాయని సూచించింది. దేశ పారిశ్రామిక రంగం మందగమన స్థితిలో ఉండడం వల్ల రేటు విషయంలో ఆర్బీఐ కొంత సరళతర వైఖరి ప్రదర్శించవచ్చన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండుసార్లు ఆర్బీఐ రేట్లు పెరిగాయి. రేటు తగ్గింపు వెసులుబాటు... ఆర్బీఐకి రేటు కోతకు వెసులుబాటు ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ అభిప్రాయపడింది. తగ్గిన క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణానికి సానుకూలత అంశాలు తన విశ్లేషణకు కారణమని తాజా నివేదికలో పేర్కొంది. ఆర్బీఐ నుంచి రూ.69,000 కోట్లు ఆర్బీఐ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.69,000 కోట్లు డివిడెండ్‌గా రావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూ.40,000 కోట్లను డివిడెండ్‌గా పంపిణీ చేసింది. -
వడ్డీరేట్లు అక్కడే..!
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుదల నేపథ్యంలో ఈ వారంలో జరిగే ద్వైమాసిక సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ .. పాలసీ రేట్లను క్రమానుగతంగా కఠినతరం చేసే విధానం నుంచి తటస్థ విధానానికి మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు రేట్ల పెరుగుదల, ద్రవ్యలోటుపరమైన సవాళ్ల కారణంగా కీలక పాలసీ రేట్లను తగ్గించకపోవచ్చని చెబుతున్నారు. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ అంచనా వేసిన 3.8 శాతం కన్నా తక్కువగా 2.6 శాతంగానే నమోదైన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడం, అటు అంతర్జాతీయంగా మందగమన ఆందోళనల నేపథ్యంలో 2018–19లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ సమీర్ నారంగ్ చెప్పారు. పరపతి విధానాన్ని మార్చుకోవడానికి ఆర్బీఐ దీనివల్ల కాస్త వెసులుబాటు లభిస్తుందని, అయితే విద్య, వైద్యం, గృహావసరాల వ్యయాలు అధికంగానే ఉండటం వల్ల రేట్ల తగ్గింపునకు అవకాశాలు పరిమితంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇటు పెరుగుతున్న ముడి చమురు ధరలు, అటు ద్రవ్యపరమైన సవాళ్ల కారణంగా ఈ ఏడాది ఆర్బీఐ పాలసీపరంగా సంక్లిష్టమైన నిర్ణయాలే తీసుకోవాల్సి రావొచ్చని కన్సల్టెన్సీ సంస్థ డీబీఎస్ ఎకనామిక్స్ పేర్కొంది. ఉర్జిత్ పటేల్ నిష్క్రమణ అనంతరం కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ సారథ్యంలో ఫిబ్రవరి 5 నుంచి 7 దాకా మూడు రోజులపాటు ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. 7వ తేదీ(గురువారం) మధ్యాహ్నం పాల సీ నిర్ణయం వెలువడుతుంది. ఈ ఆర్థిక సంవత్స రం రెండు సార్లు రేట్లను పెంచిన ఆర్బీఐ క్రమానుగతంగా కఠినతర విధానాన్ని పాటిస్తోంది. డిసెంబర్లో రేట్లను మార్చకపోయినప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగే రిస్కులు లేకపోతే తగ్గించే సంకేతాలే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విశ్లేషకుల అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 9న ఆర్బీఐ బోర్డుతో ఆర్థిక మంత్రి భేటీ.. సాంప్రదాయం ప్రకారం బడ్జెట్ అనంతరం ఫిబ్రవరి 9న ఆర్బీఐ బోర్డు సభ్యులతో ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ సమావేశం కానున్నారు. మధ్యంతర బడ్జెట్లో కీలక అంశాల గురించి వివరించనున్నారు. ఆర్బీఐ ఆరో ద్వైమా సిక పాలసీ విధాన సమీక్ష అనంతరం రెండు రోజులకు ఈ భేటీ జరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర డివిడెండ్ చెల్లించాలన్న కేంద్రం సూచన కూడా ఇందు లో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం రూ. 28,000 కోట్ల దాకా మధ్యంతర డివిడెండ్ రావొచ్చని అంచనా వేస్తోంది. -
5 నెలల గరిష్టానికి వినియోగదారుల ద్రవ్యోల్బణం
సాక్షి, ముంబై : వినియోగదారుల ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి ఎగిసింది. ఆగస్టు నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.36 శాతంగా నమోదైంది. ఆహారం, ఇంధన ధరలు ఎక్కువగా పెరుగడంతో ఈ ద్రవ్యోల్బణం పెరిగిందని మంగళవారం ప్రభుత్వం వెలువరించిన డేటాలో వెల్లడైంది. జూలై నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.36 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో పారిశ్రామికోత్పత్తి రికవరీ అయింది. జూలై నెలలో దీని వృద్ధి 1.2 శాతంగా నమోదైనట్టు తెలిసింది. జూన్ నెలలో ఈ ఉత్పత్తి కేవలం 0.2 శాతంగానే ఉంది. రాయిటర్స్ డేటా అంచనాల ప్రకారం ఆగస్టు నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.20 శాతంగానే ఉంటుందనని తెలిసింది. ఇటీవల కాలంలో వచ్చిన వర్షాల వల్ల పంటలు భారీగా దెబ్బతినడంతో, ఆహార ఉత్పత్తుల ధరలు పైకి ఎగిశాయి. వరుసగా మూడు నెలల పాటు కిందకి దిగజారిన రిటైల్ ద్రవ్యోల్బణం, జూలై నుంచి పెరుగడం ప్రారంభమైంది. అయినప్పటికీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4 శాతం కంటే తక్కువగానే ఉంది. హోల్‌సేల్ ధరలు కూడా 3 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి. -
సరఫరాల సమస్యలతో ధరలకు రెక్కలు!
• జూలై టోకు ధరల పెరుగుదల 3.55% • 23 నెలల గరిష్ట స్థాయి - నిత్యావసరాల ధరల తీవ్రత • 12 శాతం పైకి... కూరగాయల ధర 28 శాతం రయ్ ! న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు జూలైలో భారీగా పెరిగింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చిచూస్తే.. ఈ బాస్కెట్లో వస్తువుల మొత్తం ధర 3.55 శాతం ఎగసింది. ఇది 23 నెలల గరిష్ట స్థాయి. అంటే 2014 ఆగస్టు (3.74 శాతం) తరువాత మళ్లీ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. టోకు ధరల సూచీలో ఒక భాగమైన నిత్యావసర ధరలు భారీగా పెరగడం మొత్తం సూచీ పెరుగుదలకు ఒక కారణం. సరఫరాల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. జూన్‌లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ట స్థాయిలో 6.07 శాతంగా నమోదయిన నేపథ్యంలోనే తాజా గణాంకాలు వెలువడ్డాయి. కాగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం జూన్‌లో 1.62 శాతం నమోదవగా, గత ఏడాది జూలైలో అసలు పెరుగుదల లేకపోగా -4% క్షీణతలో ఉంది. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కీలక విభాగాలను పరిశీలిస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఆహార, ఆహారేతర వస్తువుల బాస్కెట్ మొత్తంగా ద్రవ్యోల్బణం రేటు 9.38 శాతంగా ఉంది. గత ఏడాది జూలైలో ఈ రేటు -3.98 శాతంగా ఉంది. ఇక ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు -1.2 శాతం క్షీణత నుంచి 12 శాతానికి పెరిగింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్ రేటు -1 శాతం నుంచి 9.5 శాతానికి చేరింది. ఇంధనం, విద్యుత్: -12 శాతం క్షీణత -1 శాతం క్షీణతకు చేరింది. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో రేటు -1.54 శాతం క్షీణత నుంచి 1.82 పైకి మళ్లింది. కొన్ని నిత్యావసరాలను చూస్తే... వార్షికంగా టోకున పప్పుల ధరలు 37% పెరిగాయి. బంగాళాదుంపలు ఏకంగా 59% పెరిగాయి. కూరగాయలు 28 శాతం ఎగశాయి. టోకునే ధరల పెరుగుదల ఈ తీరున ఉంటే.. ఇక రిటైల్ స్థాయికి చేరే సరికి ఏ స్థాయిలో పెరుగుదల ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విమర్శ. -
రిటైల్ ధరల ఊరట..!
సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6.46% న్యూఢిల్లీ: రిటైల్ ధరలు 2014 సెప్టెంబర్‌లో సామాన్యునికి కొంత ఊరట కలిగించాయి. రిటైల్ ధరల పెరుగుదల రేటు కేవలం 6.46 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ధరలు కేవలం 6.46 శాతం పెరిగాయన్నమాట. ఆగస్టులో ఈ రేటు 7.43 శాతంగా ఉంది. దీపావళి పండుగ ముందు నెలలో ధరల తీవ్రత తగ్గడం- జేబులో కొంత మిగుల్చుకునే ధోరణి నెలకొనడం సామాన్యునికి కొంత ఊరటనిచ్చే అంశమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కింపును 2012 జనవరిలో ప్రారంభించారు. అటు తర్వాత ధరల స్పీడ్ ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. పళ్లు, కూరగాయల ధరలు తగడం మొత్తం సూచీపై సానుకూల ప్రభావం చూపింది. జూలై నుంచీ సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు... * సూచీని వేర్వేరుగా చూస్తే కీలక విభాగాల్లో ఒకటైన ఆహార ఉత్పత్తుల విభాగంలో ధరల పెరుగుదల రేటు 2014 సెప్టెంబర్‌లో 7.67 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు 9.35%. 2013 సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు ఏకంగా 11.75%. ఒక్క కూరగాయల విభాగం ధరల స్పీడ్ 2014 సెప్టెంబర్‌లో 8.59%గా ఉంది. ఇది ఆగస్టులో 15.15%. పండ్లకు సంబంధించి ద్రవ్యోల్బణం రేటు ఈ 2 నెలల్లో చూస్తే 24.27% నుంచి 22.4%కి తగ్గింది. గుడ్లు, మాంసం, చేపల ధరల పెరుగుదల సైతం ఆగస్టుతో పోల్చితే సెప్టెంబర్‌లో తగ్గింది. * కాగా 2014 సెప్టెంబర్ నెలకు సంబంధించి సీపీఐ ద్రవ్యోల్బణం పట్టణ ప్రాంతాల్లో 6.34 శాతంగా ఉంది. ఇది ఆగస్టులో 7.04 శాతంగా నమోదయ్యింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు ఇదే నెలల్లో 8.27 శాతం నుంచి 6.68 శాతంగా ఉంది. * రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ద్వైమాసిక పరపతి సమీక్షకు సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొంత వరకూ ప్రామాణికంగా తీసుకుంటోంది. 2015 మార్చి నాటికి ఈ రేటు 8 శాతానికి, 2016 మార్చి నాటికి 6 శాతానికి దిగిరావాలన్నది ఆర్బీఐ విధానంగా ఉంది. ఇప్పట్లో రేట్ కట్ లేనట్లే: నిపుణులు సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, ఆర్బీఐ ఇప్పట్లో కీలక పాలసీ రేటును తగ్గించకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరమే (2015-16) ఆర్బీఐ ‘తగ్గింపు’ నిర్ణయం తీసుకోవచ్చని వారు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం సానుకూల రీతిలో ఉన్నప్పటికీ, ఈ ధోరణి కొనసాగుతుందా? లేదా అన్నది సందేహంగా ఉందని డెలాయిట్ ఇండియా సీనియర్ డెరైక్టర్ అనిష్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ అంశమే ఇప్పుడు కీలకమని సూచించారు. 2015 తొలి ఆరు నెలల కాలంలో రెపో రేటు అరశాతం వరకూ తగ్గే అవకాశం ఉందని బార్క్లేస్ రీసెర్చ్ పేర్కొంది.