దేశంలో పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ప్రజల్లో ఆర్థిక అసమానతలను సృష్టిస్తుందని ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్‌బసు అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజలు తమ ఆదాయంలో దాదాపు 50 శాతం కంటే ఎక్కువ ఆహార అవసరాలకే ఖర్చు చేస్తున్నారని చెప్పారు. దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘సామాన్య ప్రజల ఆదాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. నెలవారీ ఆదాయంలో గరిష్ఠంగా ఆహార అవసరాలకే ఖర్చు చేస్తున్నారు. భారత్‌లో ద్ర్యవ్యోల్బణం 5.1 శాతంగా ఉంది. దీన్నిబట్టి ఆహార ద్రవ్యోల్బణం 30 శాతంగా ఉంటుంది. నెలవారీ ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఆహారానికే ఖర్చు చేసే కుటుంబాలు మరింత పేదరికంలోకి నెట్టవేయబడుతున్నాయి. దానివల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. భారత్‌లో కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయాలి. ఏఐలో ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సంప్రదాయ కార్మిక రంగంపై దీని ప్రభావం పడుతోంది. విద్య ఒక్కటే పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలకు పరిష్కారం కాదు. ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా నైపుణ్యాలు పెంచుకోవాలి. భారత్‌లో పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పీఎం గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టింది. అయినా మరిన్ని సంస్కరణలు రావాలి’ అని బసు సూచించారు.
ఇదీ చదవండి: ‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’
Comments
Please login to add a commentAdd a comment