ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..! | Highest Inflation Countries In The World | Sakshi
Sakshi News home page

ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..!

Published Mon, Dec 11 2023 3:26 PM | Last Updated on Mon, Dec 11 2023 3:41 PM

Highest Inflation Countries In The World  - Sakshi

అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, భారత్‌.. ఇలా చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. పేద, ధనిక, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలనే తేడా లేదు. ఏ దేశంలో చూసినా అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. 

అన్ని రకాల వస్తువులతో పాటు తినుబండారాలు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగి సగటు మనిషికి బతుకు భారమవుతోంది. స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ద్రవ్యోల్బణ సమస్య అంటే ధరలు అదుపు లేకుండా పెరిగిపోవడమే. 

ప్రపంచ దేశాలు ఈ ద్రవ్యోల్బణానికి బలవుతున్నాయి. ప్రపంచంలోనే అధికంగా వెనుజులాలో 318 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్లు కొన్నిసర్వేల ద్వారా తెలుస్తోంది. లెబనాన్‌లో 215 శాతం, అర్జెంటీనాలో 143 శాతం, సిరియాలో 79.1 శాతం, పాకిస్థాన్‌లో 29.2 శాతం, ఇండియాలో 4.87 శాతం ద్రవ్యోల్బణం నమోదైనట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement