inflation expectations survey
-
ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..!
అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్.. ఇలా చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. పేద, ధనిక, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలనే తేడా లేదు. ఏ దేశంలో చూసినా అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. అన్ని రకాల వస్తువులతో పాటు తినుబండారాలు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సగటు మనిషికి బతుకు భారమవుతోంది. స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ద్రవ్యోల్బణ సమస్య అంటే ధరలు అదుపు లేకుండా పెరిగిపోవడమే. ప్రపంచ దేశాలు ఈ ద్రవ్యోల్బణానికి బలవుతున్నాయి. ప్రపంచంలోనే అధికంగా వెనుజులాలో 318 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్లు కొన్నిసర్వేల ద్వారా తెలుస్తోంది. లెబనాన్‌లో 215 శాతం, అర్జెంటీనాలో 143 శాతం, సిరియాలో 79.1 శాతం, పాకిస్థాన్‌లో 29.2 శాతం, ఇండియాలో 4.87 శాతం ద్రవ్యోల్బణం నమోదైనట్లు తెలుస్తోంది. Inflation rate: 🇻🇪 Venezuela: 318% 🇱🇧 Lebanon: 215% 🇦🇷 Argentina: 143% 🇸🇾 Syria: 79.1% 🇹🇷 Türkiye: 61.98% 🇮🇷 Iran: 39.2% 🇪🇬 Egypt: 35.8% 🇵🇰 Pakistan: 29.2% 🇳🇬 Nigeria: 27.33% 🇰🇿 Kazakhstan: 10.3% 🇧🇩 Bangladesh: 9.93% 🇨🇿 Czechia: 8.5% 🇷🇴 Romania: 8.07% 🇭🇺 Hungary: 7.9% 🇳🇪 Niger:… — World of Statistics (@stats_feed) December 8, 2023 -
మూడు నెలల కనిష్ఠానికి చేరనున్న సీపీఐ ద్రవ్యోల్బణం!
భారత గణాంకాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌కు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ డేటాను, ఆగస్టులోని పారిశ్రామిక ఉత్పత్తి డేటాను అక్టోబరు 12న విడుదల చేయనుంది. అందుకు నిపుణులు కారణాలను విశ్లేసిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతంగా ఉంది. కానీ సెప్టెంబరు నెలకు అది 5.4 శాతానికి తగ్గుతుందని అంచనా. పారిశ్రామికోత్పత్తి సూచీ జులైలో 5.7తో పోలిస్తే ఆగస్టులో 9.1కు పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ఇది గడిచిన 14 నెలల్లో అత్యధికం. సెప్టెంబర్‌లో టమాటా ధరలు సాధారణ స్థితికి రావడంతో నెలవారీగా ఖర్చుల శాతం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు ఇండియన్ మార్కెట్లు జీవితకాలపు గరిష్ఠాల్లో ట్రేడయ్యాయి. అయితే అదే సమయంలో ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు 12 శాతం పెరిగాయి. తృణధాన్యాలు, పప్పుల ధరలు పెరిగాయి. సెప్టెంబరులో అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 8.8శాతం పెరిగినప్పటికీ చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ధరలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కొంత ఊరట కలిగించినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. అన్ని కారణాల వల్ల ద్రవ్యోల్బణం దాదాపు ఒకటిన్నర శాతం తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
రంగంలోకి దిగిన ఆర్బీఐ
ముంబై : మండుతున్న నిత్యావసరాల ధరలు, చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలతో మే నెలలో వినియోగదారుల సూచీ, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణాలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. ఈ నేపథ్యంలో 2016 జూన్ కు సంబంధించి 'గృహ వినియోగదారుల ద్రవ్యోల్బణ అంచనా సర్వే' ను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బుధవారం ప్రవేశపెట్టింది. అహ్మదాబాద్, చంఢీఘర్, పట్నా, తిరువనంతపురంతో పాటు మొత్తం 18 సిటీల్లో ఈ సర్వేను చేపట్టనుంది. ఈ సర్వేల్లో వెల్లడైన అంశాలను బట్టి వచ్చే మానిటరీ పాలసీ నిర్ణయం ఉంటుందని, ఈ సర్వే ఫలితాలు మానిటరీ పాలసీకి చాలా ఉపయోక్తంగా ఉంటాయని ఆర్ బీఐ చెప్పింది. ఈ సర్వే ద్వారా ఎంపిక చేసిన గృహవినియోగదారుల అభిప్రాయాల వ్యక్తీకరణలతో పాటు ఏజెన్సీని ఆశ్రయించే వారినుంచి అభిప్రాయాలను సేకరించవచ్చన్నారు. ద్రవ్యోల్బణం అంచనాలకు సంబంధించి గృహ వినియోగదారుల ప్రతి అభిప్రాయాన్ని తెలుసుకుంటామని పేర్కొంది. క్రమేపీ ద్రవ్యోల్బణ అంచనాలకు సంబంధించి ఆర్ బీఐ సర్వేలు చేపడుతుంటోంది. ఈ సారి ఆర్ బీఐ తరఫున ముంబైకు చెందిన హన్సా రీసెర్చ్ గ్రూప్ ఈ సర్వేను చేపట్టనుంది. ఆరు మెట్రోపాలిటన్ సిటీల్లో మొత్తం 5,400 మంది నుంచి ద్రవ్యోల్బణం అంచనాలను సేకరించనుంది. వచ్చే మూడు నెలల్లో ధరల మార్పుల గురించి క్వాలిటేటివ్ రెస్పాన్స్ లను(సాధారణ ధరలతో పాటు ప్రత్యేక ఉత్పత్తి గ్రూపుల ధరలు) సర్వేలో పాల్గొనే వారినుంచి సేకరించనుంది. అదేవిధంగా వచ్చే ఏడాదిలో ఈ ధరలు ఏ విధంగా మారబోతున్నాయో కూడా ఆర్ బీఐ తెలుసుకోనుంది.