ముంబై : మండుతున్న నిత్యావసరాల ధరలు, చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలతో మే నెలలో వినియోగదారుల సూచీ, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణాలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. ఈ నేపథ్యంలో 2016 జూన్ కు సంబంధించి 'గృహ వినియోగదారుల ద్రవ్యోల్బణ అంచనా సర్వే' ను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బుధవారం ప్రవేశపెట్టింది. అహ్మదాబాద్, చంఢీఘర్, పట్నా, తిరువనంతపురంతో పాటు మొత్తం 18 సిటీల్లో ఈ సర్వేను చేపట్టనుంది. ఈ సర్వేల్లో వెల్లడైన అంశాలను బట్టి వచ్చే మానిటరీ పాలసీ నిర్ణయం ఉంటుందని, ఈ సర్వే ఫలితాలు మానిటరీ పాలసీకి చాలా ఉపయోక్తంగా ఉంటాయని ఆర్ బీఐ చెప్పింది. ఈ సర్వే ద్వారా ఎంపిక చేసిన గృహవినియోగదారుల అభిప్రాయాల వ్యక్తీకరణలతో పాటు ఏజెన్సీని ఆశ్రయించే వారినుంచి అభిప్రాయాలను సేకరించవచ్చన్నారు.
ద్రవ్యోల్బణం అంచనాలకు సంబంధించి గృహ వినియోగదారుల ప్రతి అభిప్రాయాన్ని తెలుసుకుంటామని పేర్కొంది. క్రమేపీ ద్రవ్యోల్బణ అంచనాలకు సంబంధించి ఆర్ బీఐ సర్వేలు చేపడుతుంటోంది. ఈ సారి ఆర్ బీఐ తరఫున ముంబైకు చెందిన హన్సా రీసెర్చ్ గ్రూప్ ఈ సర్వేను చేపట్టనుంది. ఆరు మెట్రోపాలిటన్ సిటీల్లో మొత్తం 5,400 మంది నుంచి ద్రవ్యోల్బణం అంచనాలను సేకరించనుంది. వచ్చే మూడు నెలల్లో ధరల మార్పుల గురించి క్వాలిటేటివ్ రెస్పాన్స్ లను(సాధారణ ధరలతో పాటు ప్రత్యేక ఉత్పత్తి గ్రూపుల ధరలు) సర్వేలో పాల్గొనే వారినుంచి సేకరించనుంది. అదేవిధంగా వచ్చే ఏడాదిలో ఈ ధరలు ఏ విధంగా మారబోతున్నాయో కూడా ఆర్ బీఐ తెలుసుకోనుంది.
రంగంలోకి దిగిన ఆర్బీఐ
Published Wed, Jun 15 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM
Advertisement