భారత్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు 2025లో క్రెడిట్ రేటింగ్‌కు సవాళ్లను విసిరే అవకాశం ఉందని మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే అమెరికా–చైనా సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు భారత్ ఎకానమీకి కలిసి వచ్చే వీలుందని కూడా నివేదిక వివరించింది. ఆసియా పసిఫిక్ సావరిన్స్‌పై రేటింగ్స్ దిగ్గజం నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే..
వృద్ధి – ద్రవ్యోల్బణం మధ్య సమతౌల్యం ఏర్పడుతోంది. ప్రపంచ, ప్రాంతీయ ఆర్థిక పరిస్థితుల్లో కొంత సరళతర పరిణామాలు నెలకొన్నాయి. భారత్ దేశీయ డిమాండ్‌కు ఆయా అంశాలు బలాన్ని చేకూర్చుతున్నాయి.
అమెరికా ప్రతిపాదిత వాణిజ్య రక్షణాత్మక చర్యలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఎకానమీ ఉత్పత్తి విస్తృత స్థాయిలో బలహీనపరవచ్చు.
భారత్‌లో ద్రవ్యలోటు సవాళ్లు క్రమంగా తగ్గుముఖం పడతాయని మేము విశ్వసిస్తున్నాం.
మూడీస్ బీఏఏ– రేటింగ్‌లో ఉన్న తోటి దేశాలతో పోలి్చతే భారత్ రుణ పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో రెవెన్యూ పెరిగినప్పటికీ సవాళ్లు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: ఐపీవోకు ఆరు కంపెనీలు రెడీ
తైవాన్ జలసంధి లేదా కొరియన్ ద్వీపకల్పంలో సైనిక సంఘర్షణల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు ఆసియా పసిఫిక్ ప్రాంతంపై ప్రతికూలత చూపుతాయి.ఈ ఉద్రిక్తతలు వాణిజ్యం, పెట్టుబడిఅంశాలపైప్రభావ చూపిస్తాయి.
వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడులను అమెరికా కఠినతరం చేస్తే, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడవచ్చు. ఇది ప్రాంతీయ వృద్ధిని దెబ్బతీయవచ్చు. అయితే ఇది భారత్, కొన్ని ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
భౌగోళిక, ప్రాంతీయ రాజకీయ సవాళ్లు పలు దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలా లేక ద్రవ్య లోటు కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలా? అన్న అంశాలపై ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment