టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI) డిసెంబర్‌లో 2.37 శాతానికి చేరింది. ఆహార ఉత్పత్తుల ధరలు నెమ్మదించినప్పటికీ ఆహారేతర ఉత్పత్తులు, ఇంధనం, విద్యుత్ మొదలైన వాటి రేట్ల పెరుగుదల ఇందుకు కారణం. 2024 నవంబర్‌లో డబ్ల్యూపీఐ 1.89 శాతంగా ఉండగా.. 2023 డిసెంబర్‌లో 0.86 శాతంగా నమోదైంది. డేటా ప్రకారం ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం(Food Inflation) నవంబర్‌లో 8.63 శాతంగా ఉండగా డిసెంబర్‌లో 8.47 శాతానికి దిగి వచ్చింది. క్రూడాయిల్, కమోడిటీల ధరలు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి పరిణామాల వల్ల జనవరిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. గతేడాది జనవరిలో ఇది 0.3%. తాజా ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో పాలసీ రేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: మార్చి తర్వాత వడ్డీరేటు తగ్గింపు!
స్విగ్గీ స్పోర్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్
ఆహార, నిత్యావసరాల డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన స్విగ్గీ స్పోర్ట్స్(Swiggy Sports) ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ సంస్థ క్రీడలు, అమ్యూజ్‌మెంట్, రిక్రియేషన్ కార్యకలాపాలు సాగిస్తుందని స్విగ్గీ తెలిపింది. అలాగే, స్పోర్ట్స్ ఈవెంట్ల నిర్వహణ, కెరియర్ పరమైన సర్వీసులు అందించడం, ప్రసార హక్కులు కొనుగోలు చేయడం మొదలైనవి కూడా చేపడుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment