Wholesale Price Index (WPI)
-
ఫిబ్రవరిలో 0.2 శాతం టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి, 0.2 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్లో ఈ రేటు 0.27 శాతంగా ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ధరల సూచీ మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో ఉంది. నవంబర్‌లో ప్లస్‌లోకి మారి 0.26 శాతంగా నమోదయ్యింది. అయితే ఆహార ధరలు మాత్రం ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగాయి. జనవరిలో 6.85 శాతంగా ఉన్న ఆహార టోకు ధరల స్పీడ్, ఫిబ్రవరిలో 6.95 శాతానికి ఎగసింది. ఇదే సమయంలో కూరగాయల ధరలు 19.71 శాతం (జనవరి) నుంచి 19.78 శాతానికి ఎగశాయి. పప్పు దినుసుల ధరలు 16.06 శాతం నుంచి 18.48 శాతానికి చేరాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగానికి వస్తే, రేటు 0.51 శాతం నుంచి 1.59 శాతానికి ఎగసింది. సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ధరలు జనవరిలో 1.13 శాతం తగ్గితే, ఈ తగ్గుదల ఫిబ్రవరిలో 1.27 శాతంగా ఉంది. -
నిత్యావసరాల ధరల మంట
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెలలోనూ ఎగువబాటనే కొనసాగింది. ఏడు నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర స్థాయిలో 0.73 శాతంగా (2022 డిసెంబర్‌తో పోల్చి) నమోదయ్యింది. 2023 మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 1.41 శాతం ఎగసింది. అటు తర్వాత ఈ స్థాయిలో పెరుగుదల ఇదే తొలిసారి. ఆహార, కూరగాయల ధరలు సహా పలు విభాగాల్లో ధరల తీవ్రత తాజా టోకు ద్రవ్యోల్బణం తీవ్రతకు ప్రధాన కారణం. 2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ద్రవ్యోల్బణం మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో కొనసాగింది. నవంబర్‌లో ‘యూటర్న్’ తీసుకుని 0.26 శాతంగా నమోదయ్యింది. తాజా సమీక్షా నెల డిసెంబర్లో మరింత పెరిగి 0.73 శాతానికి ఎగసింది. ఒక్క ఆహార ద్రవ్యోల్బణాన్ని చూస్తే, నవంబర్‌లో ఈ రేటు 8.18 శాతం ఉంటే, డిసెంబర్లో 9.38 శాతానికి ఎగసింది. కూరగాయల విషయంలో ద్రవ్యోల్బణం భారీగా 26.30 శాతం పెరగ్గా, పప్పు ధాన్యాల ధరలు 19.60 శాతం పెరిగాయి. 2023 ఆగస్టు నుంచి ఈ నిత్యావసర వస్తువల ధర రెండంకెలపైన కొనసాగుతోంది. -
మైనస్‌లోనే టోకు ధరలు..
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 సెప్టెంబర్‌లో అసలు పెరక్కపోగా (2022 ఇదే నెలతో పోల్చి) మైనస్ (–) 0.26 శాతంగా నమోదయ్యింది. టోకు ధరల సూచీ మైనస్‌లోనే కొనసాగడం ఇది వరుసగా ఆరవ నెల. ఏప్రిల్ నుంచీ నెలకొన్న ఈ తరహా ధోరణిని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే..: ప్రతి ద్రవ్యోల్బణానికి రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, మినరల్ ఆయిల్స్, టెక్స్టైల్స్, బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ ధరలు తాజా సమీక్షా నెల్లో (2022 సెప్టెంబర్ ధరలతో పోలి్చతే) తగ్గడమే కారణమని వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. విభాగాల వారీగా చూస్తే... ఫుడ్ ఆరి్టకల్స్: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 3.35 శాతానికి తగ్గింది. అంతక్రితం రెండు నెలలూ ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగింది. ఆగస్టులో 10.60 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల్లో కూరగాయల ధరలు 15 శాతం తగ్గాయి. ఆగస్టులో వీటి పెరుగుదల రేటు 48.39 శాతంగా ఉంది. ఆలూ ధరలు 25.24 శాతం తగ్గాయి. అయితే పప్పులు (17.69%), ఉల్లి (55.05%) ధరలు సెప్టెంబర్‌లో పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.02 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ రంగంలో ప్రతి ద్రవ్యోల్బణం 3.35 శాతంగా ఉంది. తయారీ: మొత్తం సూచీలో మెజారిటీ వాటా గత ఈ రంగంలో ధరల తగ్గుదల 1.35%గా నమోదైంది. ఇక పెరిగే అవకాశం.. సెప్టెంబర్ వరకూ టోకు ధరల సూచీలో తగ్గుదల నమోదయినప్పటికీ, ఇకపై పెరిగే అవకాశమే ఉందన్నది నిపుణుల వాదన. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలు, వర్షాభావం ఖరీఫ్ పంటపై అనిశ్చితి ధోరణి ఇందుకు కారణం కావచ్చని కేర్ఎడ్జ్ చీఫ్ ఎకనమిస్ట్ రజనీ సిన్హా పేర్కొన్నారు. -
టోకు ద్రవ్యోల్బణం అయిదో నెలా ‘మైనస్’లోనే..
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం వరుసగా అయిదో నెల కూడా మైనస్‌లోనే కొనసాగింది. ఆగస్టులో మైనస్ 0.52%గా నమోదయ్యింది. సూచీలో పెరుగుదల లేకపోవడాన్ని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. టోకు బాస్కెట్ ధర పెరక్కపోగా.. మైనస్‌లో ఉన్పప్పటికీ, ఇందులో ఒక భాగంగా ఉన్న ఆహార బాస్కెట్ ధర మాత్రం తీవ్రంగా ఉంది. ఫుడ్ బాస్కెట్ తీరిది... ఫుడ్ బాస్కెట్ ధరల పెరుగుదల ఆగస్టులో 10.6 శాతంగా (2022 ఆగస్టుతో పోల్చి) ఉంది. జూలైతో (14.25 శాతం) పోలి్చతే ధరల స్పీడ్ కొంత తగ్గడం ఊరటనిచ్చే అంశం. ఒక్క కూరగాయల ధరలు చూస్తే, 48.69 శాతం పెరుగుదల నమోదయ్యింది. జూలైలో ఈ పెరుగుదల రేటు ఏకంగా 62.12 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరల స్పీడ్ 10.45 శాతంకాగా, ఉల్లి ధరల విషయంలో ఈ రేటు 31.42 శాతంగా ఉంది. ధరల స్పీడ్ జూలైతో పోలి్చతే తగ్గినప్పటికీ వార్షికంగా చూస్తే, ఇది చాలా ఎక్కువ పెరుగదలేనని నిపుణులు పేర్కొంటున్నారు. తయారీ: సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగంలో జూలైలో ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 2.51 శాతం ఉంటే, ఆగస్టులో మైనస్ 2.37 శాతంగా నమోదయ్యింది. ఇంధనం–విద్యుత్: ఈ రంగంలో జూలైలో ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 12.79 శాతం ఉంటే, ఆగస్టులో మైనస్ 6.03 శాతంగా ఉంది. -
టోకు ధరలు దిగివచ్చాయ్..!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మే నెల్లో పెరుగుదల లేకపోగా 3.48 శాతం (క్షీణత) తగ్గింది. గడచిన ఏడు సంవత్సరాల్లో (2015 నవంబర్‌లో మైనస్ 3.7 శాతం) ఈ స్థాయిలో టోకు ధరలు నమోదుకావడం ఇదే తొలిసారి. హైబేస్ ఎఫెక్ట్‌తోపాటు (గత ఏడాది మే నెల్లో భారీ టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం) సూచీలో మూడు ప్రధాన విభాగాలైన– ఆహార, తయారీ, ఇంధన ధరలు పూర్తిగా అదుపులోనికి వచ్చాయి. 2022లో మే నెలలో 16.63 శాతం టోకు ద్రవ్యోల్బణం (హై బేస్) నమోదుకావడం ఇక్కడ గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేనెల్లో 25 నెలల కనిష్టం 4.25 శాతంగా నమోదయిన సానుకూల ఫలితం నేపథ్యంలోనే టోకు ధరలకు సంబంధించి కూడా ఎకానమీకి ఊరటనిచ్చే తాజా ఫలితం వెలువడింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలిస్తే... ► ఏప్రిల్‌లో ఫుడ్ ఆర్టికల్స్ ధరల 3.54 శాతం తగ్గితే (వార్షికంగా పోల్చి) తాజా సమీక్షా నెల్లో తగ్గుదల 1.51 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 20.12 శాతం తగ్గాయి. ఆలూ ధరలు 18.71%, ఉల్లిధరలు 7.25% తగ్గాయి. అయితే పప్పు దినుసుల ధరలు మాత్రం 5.76 % ఎగశాయి. గోధుమలకు సంబంధించి ద్రవ్యోల్బణం కూడా 6.15%గా ఉంది. ► ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం మేలో 9.17 శాతం (మైనస్) తగ్గింది. ఏప్రిల్ నెలలో 0.93 శాతంగా ఉంది. ► తయారీ ఉత్పత్తుల ధరలు ఏప్రిల్‌లో మైనస్ 2.42 శాతంగా ఉంటే, మేలో మైనస్ 2.97 శాతంగా నమోదయ్యింది. ప్రతి ద్రవ్యోల్బణం... వరుసగా రెండో నెల ద్రవ్యోల్బణం మైనస్ లోకి వెళ్లడాన్ని... సాంకేతికంగా ప్రతి ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. ఈ ప్రాతిపదికన ప్రతి ద్రవ్యోల్బణం నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 1.51%గా నమోదయ్యింది. రానున్న నెలల్లో కూడా ఇదే ధోరణి కొనసాగితే, బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో 2023లో యథాతథంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. 2022 మే తర్వాత 2.50% పెరుగుదలతో 6.5 శాతానికి చేరిన రెపో రేటును గత రెండు ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడమే దీనికి కారణం. -
మైనస్‌లోకి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కమోడిటీ ధరల క్షీణతతో ఆహారం, ఇంధనం, ఇతరత్రా ముడి సరుకుల రేట్లు తగ్గిన నేపథ్యంలో టోకు ధరలు దాదాపు మూడేళ్లలో తొలిసారిగా మైనస్‌లోకి జారిపోయాయి. ఏప్రిల్‌లో 34 నెలల కనిష్టానికి దిగివచ్చాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 0.92 శాతంగా నమోదైంది. చివరిసారిగా 2020 జూన్‌లో డబ్ల్యూపీఐ .. మైనస్ 1.81 శాతంగా నమోదైంది. ఇది గత 11 నెలలుగా తగ్గుదల బాటలోనే కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్‌లో బేస్ అధికంగా 15.38 శాతం స్థాయిలో ఉండటం కూడా ఏప్రిల్‌లో తాజా పరిస్థితికి కారణమని అధికారవర్గాలు తెలిపాయి. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఈ మార్చ్‌లో 1.34 శాతంగా ఉంది. టోకు ధరలు ఏటా క్షీణిస్తుండటాన్ని సాంకేతికంగా ప్రతిద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. ‘2023 ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం రేటు మందగించడానికి ప్రధానంగా ఆహారోత్పత్తులు, ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారేతర ఉత్పత్తులు, రసాయనాలు.. రసాయన ఉత్పత్తులు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, పేపర్.. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గడం కారణం’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లోనూ ఇలాగే.. కమోడిటీల ధరలు తగ్గే కొద్దీ రాబోయే రోజుల్లోనూ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మరింత తగ్గడం కొనసాగవచ్చని బార్క్లేస్ ఒక నివేదికలో తెలిపింది. టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ తగ్గుతున్నందున తదుపరి పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్.. వడ్డీ రేట్ల పెంపునకు మరికాస్త విరామం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రతిద్రవ్యోల్బణ ధోరణి వచ్చే 2–3 నెలలు కొనసాగవచ్చని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి డబ్ల్యూపీఐ 1–2 శాతం శ్రేణిలో ఉండొచ్చని కేర్ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ రజని సిన్హా తెలిపారు. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టమైన 4.70 శాతానికి తగ్గింది. గత నెల పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల్లోని మరిన్ని విశేషాలు.. ► ఆహార, ఆహారయేతర, ఇంధన.. విద్యుత్, తయారీ ఉత్పత్తులు మొదలైన వాటన్నింటి ధరలు తగ్గాయి. ► మార్చితో పోలిస్తే ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.48 శాతం నుంచి 3.54 శాతానికి దిగి వచ్చింది. పండ్లు, పాలు .. గుడ్లు, మాంసం, చేపల ధరలు తగ్గాయి. కూరగాయల ద్రవ్యోల్బణం మైనస్ 1.50 శాతంగా నమోదైంది. బంగాళాదుంపల ధరల పెరుగుదల మైనస్ 18.66 శాతం, ఉల్లి మైనస్ 18.41 శాతం, గోధుమలు 7.27 శాతంగాను ఉంది. ► ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.96 శాతం నుంచి 0.93 శాతానికి తగ్గింది. ► తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మార్చిలో 0.77% కాగా ఏప్రిల్‌లో మైనస్ 2.42%గా ఉంది. -
టోకు ద్రవ్యోల్బణం @ 29 నెలల కనిష్టం
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. ఇంధనాలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గగా, ఆహార ఉత్పత్తుల భారం మాత్రం పెరిగింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.85 శాతంగాను, గతేడాది మార్చిలో 14.63 శాతంగాను నమోదైంది. ఇది తగ్గడం వరుసగా పదో నెల. చివరిసారిగా 2020 అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ ఆధారిత ధరల పెరుగుదల 1.31 శాతంగా నమోదైంది. ‘2023 మార్చిలో ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్ .. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం తెలిపింది. తాజాగా ఫుడ్ బాస్కెట్లో గోధుమలు వంటి ధాన్యాల ధరలు నెమ్మదించగా.. కూరగాయలు, పండ్లు, పాలు, పప్పులు మొదలైన వాటి రేట్లు పెరిగాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ ఒక నోట్లో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు కూడా వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం స్థిరపడేలా చూడటంపైనా, వినియోగ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరింత తగ్గేలా చూడటంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని టీఐడబ్ల్యూ క్యాపిటల్ సీఈవో మోహిత్ రాల్హన్ అభిప్రాయపడ్డారు. ► ఆహార ఉత్పత్తుల రేట్ల పెరుగుదల ఫిబ్రవరిలో 3.81 శాతంగా ఉండగా, మార్చిలో 5.48 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు ఫిబ్రవరిలో 21.53 శాతం తగ్గగా (2022 ఫిబ్రవరి ధరతో పోల్చి), మార్చిలో ఈ తగ్గుదల రేటు 2.22 శాతంగానే ఉంది. ఉల్లి విషయంలో ఫిబ్రవరిలో 40.14 శాతం ధరలు తగ్గగా, మార్చిలో తగ్గుదల రేటు 36.83 శాతంగానే నమోదైంది. ► గోధుమల ధరలు 9.16 శాతం, పప్పుల రేట్లు 3.03 శాతం పెరిగాయి. -
భారత్ ఎకానమీపై భరోసా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7 శాతంగా నమోదవుతుందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) జనవరిలో 25 నెలల కనిష్ట స్థాయి తరహాలోనే రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతా తగ్గుతుందని అంచనావేసింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు కట్టడిలో ఉండడం ఈ అంచనాలకు కారణమని తెలిపింది. ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6% దిగువ కు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనావేస్తున్నాట్లు పేర్కొంది. ఈ మేరకు విడుదలైన నెల వారీ ఆర్థిక సమీక్షలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► అధిక సేవల ఎగుమతుల నుంచి పొందుతున్న లాభాలు, చమురు ధరలు అదుపులో ఉండడం, దిగుమతి ఆధారిత వినియోగ డిమాండ్‌లో ఇటీవలి తగ్గుదల కారణంగా దేశ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరంలో తగ్గుతుందని భావించడం జరుగుతోంది. ఈ పరిస్థితి రూపాయి అనిశ్చితి పరిస్థితి కట్టడికి దోహదపడుతుంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యాడ్ కట్టడిలో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అవకాశం. ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియల్ రంగానికి సంబంధించి అంతర్జాతీయ పరిణామాలు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపబోవు. ► భారత్ సేవల రంగం ఎగుమతుల విషయంలో పురోగతి దేశానికి ఉన్న మరో బలం. కరోనా సవాళ్లు తొలగిన నేపథ్యంలో ఐటీ, నాన్–ఐటీ సేవల విషయంలో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా పెరుగుతోంది. అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల నేపథ్యంలో దిగుమతుల బిల్లు కూడా దేశానికి కలిసి వస్తోంది. ► తైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో ఎకానమీ స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేయడం జరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి హై–ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా యి. 2023లో వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ తరహా భారీ వసూళ్లు వరుసగా 12వ నెల. ► భారతదేశ కార్పొరేట్ రంగం రుణ–జీడీపీ నిష్ప త్తి చారిత్రక రేటు కంటే తక్కువగా ఉంది. ఇది కార్పొరేట్ రంగానికి మరింత రుణం తీసుకోవడానికి తగిన వెసులుబాటును కల్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగించడంలో కార్పొరేట్ల రుణ ప్రొఫైల్ కీలక పాత్ర పోషిస్తుంది. -
టోకు ధరల ఊరట!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 జనవరిలో 4.73 శాతంగా (2022 ఇదే నెలతో ధరతో పోల్చి) నమోదయ్యింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి టోకు ధరల స్పీడ్ నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ, ఇంధనం, విద్యుత్ ధరలు తగ్గినా, ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్ మాత్రం పెరిగింది. టోకు ధరల సూచీ వరుసగా ఎనిమది నెలల నుంచి తగ్గుతూనే వస్తుండడం సానుకూల అంశమైనా, ఆహార ధరల తీవ్రతపై జాగరూకత వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరించారు. 10 నెలల అప్‌ట్రెండ్ తర్వాత నవంబర్, డిసెంబర్లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో మళ్లీ 6.52 శాతం పైబడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ సూచీలో ఒక్క ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ 5.94 శాతంగా ఉంది. రెపోపై ఆర్బీఐ నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఈ నెల మొదట్లో మరో పావు శాతం పెరిగి, 6.50 శాతానికి చేరింది. తయారీ: తయారీ ఉత్పత్తులకు సంబంధించి ధరల స్పీడ్ జనవరిలో 2.99 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్ 2022లో ఈ రేటు 3.37 శాతం. ఇంధనం, విద్యుత్ నెలల వారీగా ఈ రేటు 18.09 శాతం నుంచి 15.15 శాతానికి తగ్గింది. ఫుడ్ బాస్కెట్: ఈ విభాగంలో రేటు జనవరిలో 2.38 శాతంగా ఉంది. 2022 డిసెంబర్లో ఈ రేటు 1.25 శాతం క్షీణత (మైనస్)లో ఉంది. పప్పు దినుసుల ధర స్పీడ్ 2.41 శాతంగా ఉంటే, కూరగాయల ధరలు మాత్రం 26.48 శాతం తగ్గాయి. -
సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం కూల్
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 18 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. 10.7 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే టోకు బాస్కెట్లోకి వస్తువుల ధర 10.7 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నప్పటికీ, 18 నెలల నుంచి రెండంకెల పైన కొనసాగుతోంది. సమీక్షా నెల్లో తయారీ, ఆహారం, ఇంధన ధరలు కొంత దిగివ చ్చాయి. డబ్లు్యపీఐ నెలవారీ తగ్గుదలకు ప్రధానంగా కమోడిటీ ధరలలో నియంత్రణ అని నిపుణులు పేర్కొంటున్నారు. కమోడిటీ ధరలు తగ్గుతాయన్న ధోరణి కూడా వ్యవస్థలో ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు రికవరీ ఊపందుకోవడం కూడా సానుకూల అంశమని వారు విశ్లేషిస్తున్నారు. గణాంకాల్లో కీలక విభాగాలు ఇలా... ► ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 11.03 శాతంగా ఉంది. ఆగస్టులో ఇది 12.37 శాతం. అయితే కూరగాయల ధరలు మాత్రం 39.66 శాతం పెరిగాయి. ఆగస్టులో ఈ స్పీడ్ 22.29 శాతం. ఆయిల్ సీడ్స్ ద్రవ్యోల్బణం 16.55% తగ్గింది. ► ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 32.61 శాతం ఉంటే, ఆగస్టులో ఈ రేటు 33.67 శాతంగా ఉంది. ► ఇక సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 6.34 శాతంగా ఉంది. -
మూడు నెలల కనిష్టమే.. అయినా రెండంకెల పైనే!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 15.18 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూన్‌తో పోల్చితే ఈ బాస్కెట్ ధర 15.18 శాతం పెరిగిందన్నమాట. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. మే నెలతో పోల్చితే ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రెండంకెలపైనే ఈ రేటు కొనసాగడం ఇది వరుసగా 15వ నెల. ఆహార ధరలు మాత్రం తీవ్రంగా కొనసాగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక విభాగాలను పరిశీలిస్తే.. ► ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం జూన్‌లో 14.39 శాతం. మేతో ఈ రేటు 12.34 శాతంగా ఉంది. కూరగాయలు (56.75%), ఆలూ (39.38%), పండ్ల (20.33%) ధరలు భారీగా పెరిగాయి. ► ఖనిజాల ధరలు మాత్రం 8.55% తగ్గాయి. ► క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు ధరలు 77.29 శాతం ఎగశాయి. ► కాగా, జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01%గా నమోదైంది. -
అసలే భారంగా ధరలు..ఇప్పుడు మరింత పైపైకి..!
న్యూఢిల్లీ: టోకు ధరలు ఆందోళనకరంగా తయారయ్యాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో ఏకంగా 14.55 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే టోకు బాస్కెట్‌లోని వస్తువుల ధర 14.55 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. క్రూడ్, ఇతర కమోడిటీల ధరల తీవ్రత తాజా గణాంకాలపై ప్రతిబింబిస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో సరఫరాల చైన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనితో అసలే భారంగా ఉన్న టోకు ధరల తీవ్రత మరింత పెరిగింది. 2021 మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 7.80 శాతంగా ఉంది. 2021 ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం మొత్తం 12 నెలల్లో టోకు ధరలు రెండంకెలపైన కొనసాగడం గమనార్హం. కొన్ని ముఖ్యాంశాలు... ► ఫిబ్రవరిలో ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 8.19 శాతం ఉంటే, మార్చిలో 8.06 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల స్పీడ్ కూడా నెలల వారీగా 26.93 శాతం నుంచి 19.88 శాతానికి దిగివచ్చింది. అయితే ఈ స్థాయి ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తాయి. ► మొత్తం సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ రంగంలో టోకు ద్రవ్యోల్బణం 9.84% నుం చి (ఫిబ్రవరి) నుంచి 10.71 శాతానికి ఎగసింది. ► 20 శాతం వాటా ఉన్న ఫ్యూయల్ అండ్ పవర్ బాస్కెట్లో ద్రవ్యోల్బణం నెల వారీగా 31.50 శాతం నుంచి 34.52 శాతానికి ఎగసింది. ఒక్క క్రూడ్ పెట్రోలియంలో ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 55.17 శాతం ఉంటే మార్చిలో 83.56 శాతంగా నమోదయ్యింది. రేటు పెంపు అవకాశం... ద్రవ్యోల్బణం తీవ్రత కొనసాగితే, జూన్‌లో జరిగే ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను పావుశాతం పెంచే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థిక విశ్లేషణా సంస్థ ఎకోర్యాప్, రేటింగ్ సంస్థ ఇక్రా అంచనావేస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ, వృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2–6 శాతం శ్రేణిలో ద్రవ్యోల్బణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. -
సామాన్యుడికి కన్నీళ్లు ? దిగులు పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: అటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో సామాన్యుడికి కన్నీళ్లు తెప్పించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ధరల బాస్కెట్ 6.07 శాతం పెరిగిందన్నమాట. 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తోంది. వరుసగా రెండవ నెలలోనూ (జనవరిలో 6.01 శాతం) ఈ స్థాయి దాటి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక టోకు ద్రవ్యోల్బణం ఏకంగా రెండంకెలపైన 13.11 శాతంగా ఉంది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... రిటైల్ ద్రవ్యోల్బణం... ఎనిమిది నెలల గరిష్టం 2021 జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.26 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్టానికి చేరడానికి ఆహార ధరలు ప్రధాన కారణమని గణాంకాలు వెల్లడించాయి. ఆహార ధరల బాస్కెట్ సమీక్షా నెల్లో 5.89 శాతంగా నమోదయ్యింది. జనవరిలో ఈ రేటు 5.43 శాతం. ఈ బాస్కెట్లో తృణధాన్యాల ధరలు 3.95 శాతం పెరిగాయి. మాంసం, చేపల ధరలు 7.45 శాతం ఎగశాయి. కాగా, గుడ్ల ధరల స్పీడ్ 4.15 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 6.13 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 6.09 శాతం ఎగశాయి. పండ్ల ధరలు మాత్రం జనవరితో పోల్చితే స్థిరంగా 2.26 శాతంగా ఉన్నాయి. ఇక ‘ఫ్యూయెల్ అండ్ లైట్’ విభాగంలో ధరా భారం తీవ్రంగా 8.73 శాతంగా ఉంది. అయితే జనవరి 9.32 శాతంతో పోల్చితే ఇది కొంచెం తగ్గడం ఊరట. క్రూడ్ ధరల తీవ్రత నేపథ్యంలో రానున్న నెలల్లో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుతుందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఆర్బీఐపై దృష్టి... ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం గమనార్హం. ద్రవ్యోల్బణం 6 శాతం పైబడిందంటే.. అది పాలసీ రేటు నిర్ణయం ప్రభావం చూపుతోంది. వరుసగా రెండవ నెలా రిటైల్ ద్రవ్యోల్బణం కట్టుతప్పడంతో రానున్న ఏప్రిల్ ఆర్బీఐ పాలసీ సమావేశాల నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో సగటున 5.7 శాతంగా ఉంటుందని, ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఫిబ్రవరి మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది. అయితే రెపో రేటు ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగించడానికి మాత్రం ఆరుగురు సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటు యథాతథంగా కొనసాగుతోంది. టోకు ద్రవ్యోల్బణానికి క్రూడ్ సెగ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 13.11 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) ఉంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణంకాగా, నాన్–ఫుడ్ ఐటమ్స్ ధరలు కూడా తీవ్రంగా ఎగశాయి. టోకు ద్రవ్యోల్బణం రెండంకెల పైన కొనసాగుతుండడం ఆందోళనకరమైన అంశం. గడచిన పదకొండు నెలల నుంచీ అంటే 2021 ఏప్రిల్ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతోంది. 2021 ఫిబ్రవరిలో ఈ రేటు 4.83 శాతం. అప్పటిలో అతి తక్కువ బేస్, తాజా ధరలు తీవ్ర స్థాయిలో కనబడ్డానికి ఒక కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ► ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ రెండూ కలిపి ధరాభారం 31.50 శాతంగా ఉంది. అయితే ఒక్క క్రూడ్ పెట్రోలియం ధరల స్పీడ్ ఫిబ్రవరిలో ఏకంగా 55.17 శాతంగా ఉంది. జనవరిలో ఈ పెరుగుదల 39.41 శాతం. ► ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 8.19 శాతంగా ఉంది. కూరగాయల ధరల స్పీడ్ 26.93 శాతం. గుడ్లు, మాంసం, చేపల ధరలు 8.14 శాతం పెరిగాయి. ఉల్లి ధర 26.37 శాతం తగ్గింది. అయితే ఆలూ ధరలు మాత్రం 14.78 శాతం పెరిగాయి. జనవరిలో ధర పెరక్కపోగా 14.45 శాతం తగ్గింది. ► సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 9.84 శాతంగా ఉంది. జనవరిలో ఈ రేటు 9.42 శాతం. -
కొత్త ఏడాది..కొత్త బాదుడు.. 2022లో సామాన్యుడికి చుక్కలే..!
2021లో అన్ని ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. ఇంధన ధరల పెంపుతో ఆహార పదార్థాల, ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెంపు సామాన్యుల నెత్తి మీద పడ్డాయి. ఈ ఏడాది అధిక ద్రవ్యోల్భణం సామాన్యులకు ఊపిరి ఆడకుండా చేసింది. 2021లో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్భణం ప్రతినెల పెరుగుతూనే వచ్చింది. గత నెలలో డబ్ల్యూపీఐ ఏకంగా 14.23 శాతంగా నమోదయ్యింది. గడచిన దశాబ్దకాలంలో ఈ స్థాయి ద్రవ్యోల్భణం ఇదే తొలిసారి. ఇక కొత్త ఏడాది రాబోతుంది. వచ్చే ఏడాదిలో కూడా ఆయా ధరలు మరోసారి ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. ► ఇప్పటికే ఆయా ఆటోమొబైల్ దిగ్గజం కంపెనీలు 2022 వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.అధిక ఇన్పుట్, లాజిస్టిక్స్ ఖర్చులు అలాగే సరఫరా అంతరాయాలు మార్జిన్లను దెబ్బతీస్తున్నందున, భారత్‌లోని దిగ్గజ తయారీ కంపెనీలు, కన్స్యూమర్ కంపెనీలు రాబోయే ఏడాదిలో మరోసారి ధరల పెంపును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ► ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ( ఎఫ్ఎంసిజి ) కంపెనీలు వచ్చే మూడు నెలల్లో ఆయా వస్తువుల ధరలను సుమారు 4-10 శాతం మేర పెంచే అవకాశం ఉంది. గత రెండు త్రైమాసికాల్లో హిందూస్ధాన్ యూనీలివర్, డాబర్, బ్రిటానియా, మారికో ఇతర ఎఫ్ఎమ్సీజీ కంపెనీలు సుమారు 5-12 శాతం మేర ధరలను పెంచాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం తగ్గకపోతే, నాల్గవ త్రైమాసికంలో మరో రౌండ్ ధరల పెరుగుదల అనివార్యమని డాబర్ సీఈవో మోహిత్ మల్హోత్రా అన్నారు. ► భారత్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ నెలలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు , ఎయిర్ కండీషనర్లపై ఇప్పటికే 3-5 శాతం మేర ధరలను పెంచాయి. అయితే వచ్చే ఏడాది నుంచి మరో సారి ధరలను పెంచే అవకాశం ఉంది. సుమారు 6-10 శాతం మేర హోమ్ అప్లియెన్స్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2020 నుంచి వైట్ గూడ్స్ ధరల పెరుగుదల ఇది నాల్గోసారి. అధిక ఇన్‌పుడ్ కాస్ట్, చిప్స్ కొరత, సప్లై చైయిన్ రంగాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ధరలు పెరగనున్నాయి. ► గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్ ప్రొడక్ట్‌లపై 5శాతం నుంచి 12శాతం వరకు జీఎస్స్టీను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్తగా వసూలు చేయనున్న జీఎస్టీ జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. దీంతో బట్టలు, చెప్పులు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. ► దేశంలోని వాహన తయారీదారులు 2022 నుంచి వాహనాల ధరల పెంపును తెలపగా, అవి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల భావిస్తున్నారు. మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, వోక్స్వ్యాగన్, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం), హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ వాహన కంపెనీలు ముడి సరుకుల ధరలు పెరగడంతో ఏడాది పొడవునా అనేక సార్లు ధరలను పెంచాయి. ఈ నెల ప్రారంభంలో మారుతీ సుజుకీ కొత్త సంవత్సరంలో వాహనాల ధరలను మళ్లీ పెంచనున్నట్లు తెలిపింది . ఇది గత సంవత్సరంలో కంపెనీ ధరలను పెంచడం నాల్గవది, 18 నెలల్లో ఆరవది. ► ఉత్పాదకతను మెరుగుపరచడానికి కంపెనీలు అంతర్గత చర్యలు తీసుకునప్పటికీ, స్టీల్, రాగి, ప్లాస్టిక్, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధరలలో అపూర్వమైన పెరుగుదల ఉంది. దీంతో వాహనాల పెంపు అనివార్యమైంది. 2022లో సామాన్యులకు మరోసారి గట్టి షాకే తగ్గలనుంది. ఎఫ్ఎమ్సీజీ, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనకొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..! -
క్రూడ్ మంటలు.. మెటల్ మెరుపులు!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం నవంబర్‌లో 14.23 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 నవంబర్ ధరలతో పోల్చితే, టోకు ధరల బాస్కెట్ ధర తాజా సమీక్షా నెల్లో 14.23 శాతం పెరిగిందన్నమాట. గడచిన దశాబ్ద కాలంలో ఈ స్థాయి ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సహజవాయువు, క్రూడ్ పెట్రోలియం, మెటల్స్, మినరల్ ఆయిల్స్, రసాయనాలు, ఫుడ్ ప్రాడెక్ట్స్ ధరల్లో భారీ పెరుగుదల దీనికి ప్రధాన కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. గత ఏడాది నవంబర్‌లో ఉన్న లో బేస్ ఎఫెక్ట్ కూడా దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకూ గడచిన ఎనిమిది నెలల్లోనూ ద్రవ్యోల్బణం రెండంకెల పైనే కొనసాగుతోంది. దీనికి 2021 ఇదే నెలల్లో లో బేస్ ప్రధాన కారణంగా కనబడుతోంది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 నవంబర్‌ను తీసుకుంటే టోకు ద్రవ్యోల్బణం 2.29 శాతం మాత్రమే. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మొత్తం సూచీలో దాదాపు 22 శాతం వాటా ఉన్న ఇంధనం, విద్యుత్ రంగాల్లో ద్రవ్యోల్బణం 39.81 శాతంగా నమోదయ్యింది. అక్టోబర్‌లో ఈ రేటు 37.18 శాతం. ఒక్క క్రూడ్ పెట్రోలియం ద్రవ్యోల్బణం పరిశీలిస్తే, ఈ రేటు అక్టోబర్‌లో 80.57 శాతం ఉంటే, నవంబర్‌లో 91.74 శాతానికి పెరిగింది. ► సూచీలో దాదాపు 24 శాతం వెయిటేజ్ ఉన్న ఫుడ్ ఇండెక్స్ అక్టోబర్‌లో 3.06 శాతం పెరిగితే, నవంబర్‌లో 6.70 శాతం ఎగసింది. ► డబ్ల్యూపీఐలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 11.92 శాతం. అక్టోబర్‌లో ఈ రేటు 12.04 శాతం. ► భారత్‌లోనే కాకుండా, అమెరికా, ఇటలీ, జర్మనీ, సింగపూర్ వంటి దేశాల్లో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 20 శాతంగా కొనసాగడం గమనార్హం. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 4.48 శాతం ఉంటే, నవంబర్‌లో 4.91 శాతానికి ఎగసింది. రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంటుందన్న భరోసాతో వృద్ధే లక్ష్యంగా ఆర్బీఐ వరుసగా తొమ్మిది ద్వైమాసిక సమావేశంలోనూ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4%) యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా కొనసాగుతుందని, మూడు, నాలుగు త్రైమాసికాల్లో 5.1%, 5.7%గా ఉంటుందని అంచనావేసింది. 2022–23 క్యూ1, క్యూ2లలో 5%గా ఉంటుందని ఆర్బీఐ విశ్లేషిస్తోంది. -
ఐదు నెలల గరిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 12.54 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే 2021 అక్టోబర్‌లో టోకు బాస్కెట్ ఉత్పత్తుల ధర 12.54 శాతం ఎగసిందన్నమాట. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో ధరల తీవ్రత ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల భారీ పెరుగుదల, సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరల తీవ్రత వంటి అంశాలు దీనికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ధరలన్నీ పైపైకి... ► మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు, కెమికల్స్, రసాయన ఉత్పత్తుల వంటివి గతేడాది అక్టోబర్‌తో పోల్చితే తాజా సమీక్షా నెలల్లో భారీగా పెరిగాయి. ► తయారీ రంగంలో సమీక్షా నెల్లో ద్రవ్యోల్బణం 12.04 శాతంకాగా, సెప్టెంబర్‌లో 11.41 శాతం. ► ఫ్యూయెల్ అండ్ పవర్ రంగాల్లో 2021 అక్టోబర్ ద్రవ్యోల్బణం 37.18 శాతం. సెప్టెంబర్‌లో 24.81 శాతం. ఒక్క క్రూడ్ పెట్రోలియం ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 71.86% ఉంటే, అక్టోబర్‌లో ఏకంగా 80.57 శాతానికి ఎగసింది. ► ఆహార ధరల విభాగానికి వస్తే, సెప్టెంబర్‌లో 4.69 శాతం తగ్గాయి (2020 ఇదే నెలతో పోల్చి). అయితే అక్టోబర్‌లో ఈ తగ్గుదల కేవలం 1.69 శాతంగానే ఉంది. కూరగాయల ధరల తగ్గుదల 18.49 శాతం ఉంటే, ఉల్లి విషయంలో తగ్గిన శాతం 25.01 శాతం అని గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్ నుంచీ రెండంకెల్లోనే... టోకు ధరల ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగడం ఏప్రిల్ నుంచీ ఇది వరుసగా ఏడవనెల.అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్– 2022 మార్చి) ఇప్పటి వరకూ ఒక అంకెలో టోకు ద్రవ్యోల్బణం లేదన్నమాట. టోకు ద్రవ్యోల్బణం స్పీడ్ ఏప్రిల్ (10.74%), మే (13.11%) జూన్ (12.07%), జూలై (11.16%), ఆగస్టు (11.39%) నెలల్లో రెండంకెల పైనే కొనసాగింది. సెప్టెంబర్‌లో 10.66%గా నమోదుకాగా, తాజాగా అక్టోబర్‌లో 12.54%గా ఉంది. అయితే ప్రస్తుతం ఈ స్థాయి ద్రవ్యోల్బణం కొనసాగడానికి 2020 ఇదే నెలల్లో ద్రవ్యోల్బణ పరిస్థితిపై లో బేస్ ఎఫెక్ట్ ఉండడమూ కారణమన్న అంచనాలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఉదాహరణకు 2020 అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం కేవలం 1.31 శాతం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల దిగువ బాట నుంచి ‘యూ టర్న్’ తీసుకుని అక్టోబర్‌లో 4.48 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. -
చుక్కలు చూపిస్తున్న హోల్ సేల్ ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ ఆగస్టులో 11.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే ఈ బాస్కెట్ ఉత్పత్తుల ధర 11.39 శాతం పెరిగిందన్నమాట. సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ధరలుసహా అన్ని విభాగాల్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఒక్క ఆహార ఉత్పత్తుల విభాగం మాత్రం ఊరటనిస్తోంది. వరుసగా ఐదు నెలల నుంచీ టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగుతోంది. ముఖ్య విభాగాలు ఇలా... ♦ఆహార ఉత్పత్తుల ధరలు వరుసగా నాల్గవ నెలా తగ్గాయి. ఆగస్టులో అసలు పెరక్కపోగా 1.29 శాతం దిగివచ్చాయి. అయితే ఉల్లి (62.78 శాతం), పప్పు దినుసుల (9.41 శాతం) ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కూరగాయల ధరలు 13.30 శాతం తగ్గాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీ రేటు రెపోకు (ప్రస్తుతం 4 శాతం) ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో పూర్తి అదుపులోకి (5.3 శాతం) వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం ఈ శ్రేణి 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. ♦క్రూడ్, పెట్రోలియం, సహజవాయువుల ధరలు 40.03 శాతం ఎగశాయి. ఫ్యూయల్, పవర్ విషయంలో ద్రవ్యోల్బణం 26.1 శాతంగా ఉంది. ఎల్పీజీ (48.1 శాతం), పెట్రోల్ (61.5 శాతం), డీజిల్ (50.7 శాతం) ధరలు భారీగా ఎగశాయి. ♦తయారీ ఉత్పత్తుల ధరలు 11.39% పెరిగాయి. జూలైలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 11.20%గా ఉంది. వరుసగా నాలుగు నెలల నుంచీ తయారీలో ధరల స్పీడ్ రెండు అంకెలపైన కొనసాగుతోంది. -
టోకు ధరల స్పీడ్ 11.16 శాతం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో 11.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే తాజా సమీక్షా నెల్లో టోకు ఉత్పత్తుల బాస్కెట్ ధర 11.16 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలలుగా టోకు ధరల స్పీడ్ రెండంకెలపైనే కొనసాగుతోంది. అయితే జూన్‌తో పోల్చితే టోకు ద్రవ్యోల్బణం తగ్గడమే కొంతలో కొంత ఊరట. ఏప్రిల్ (10.74 శాతం), మే (13.11 శాతం) జూన్ (12.07 శాతం)లలో కూడా టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగింది. అయితే ప్రస్తుతం ఈ స్థాయి ద్రవ్యోల్బణం కొనసాగడానికి 2020 ఇదే నెలల్లో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితి (లో బేస్ ఎఫెక్ట్) ఉండడమూ కారణమన్న అంచనాలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 జూలైని తీసుకుంటే టోకు ద్రవ్యోల్బణం మైనస్ 0.25 శాతం. అక్టోబర్ వరకూ టోకు ధరల తీవ్రతపై లో బేస్ ఎఫెక్ట్ ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫుడ్ ఆర్టికల్స్ టోకు ద్రవ్యోల్బణం తగ్గు తూ వస్తోంది. జూలైలో అసలు ఈ విభాగంలో ద్రవ్యోల్బణం యథాతథంగా కొనసాగింది. జూన్‌లో ఇది 3.09%. ఉల్లి ధరలు మాత్రం జూలైలో 72.01% పెరిగాయి. ► క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు జూన్‌లో 36.34% ఉంటే, జూలైలో 40.28 శాతంగా ఉంది. ► సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ రంగం టోకు ధరల పెరుగుదల జూలైలో 11.20 శాతం. జూన్‌లో ఇది 10.88%. -
మూడోనెలా... రెండంకెలపైనే టోకు ధరలు!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో వరుసగా మూడవనెలా రెండంకెలపైనే కొనసాగింది. జూన్‌లో 12.07 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 జూన్‌తో పోల్చితే 2021 జూన్‌లో టోకు ధరల బాస్కెట్‌లోని ఉత్ప త్తుల ధరలు 12.07% పెరిగాయన్నమాట. కాగా, ఇదే ఏడాది మే నెలతో పోల్చితే, జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం కొంచెం తగ్గడం (మేలో 12.94%) కొంతలో కొంత ఊరట. మేతో పోల్చితే, జూన్‌లో టోకు బాస్కెట్‌లోని ఆహారం, క్రూడ్ ధరలు తగ్గడం దీనికి కారణం. ‘తీవ్రత’కు బేస్ కూడా కారణం కాగా టోకు ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల కూడా రెండంకెల పైన కనబడ్డానికి గత ఏడాది లో బేస్ ఎఫెక్ట్ కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 జూన్ నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్ పడిపోయి ఏకంగా 1.81 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఇది తాజా సమీక్షా నెల టోకు ధరలు తీవ్రంగా కనబడ్డానికి దారితీసింది. ఇలాంటి ధోరణే 2021 అక్టోబర్ వరకూ కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2020 జూన్‌తో పోల్చితే తాజా సమీక్షా నెల్లో పెట్రోల్, డీజిల్, నాఫ్తా, ఏవియేషన్ ఫ్యూయెల్, ఫర్నీస్ ఆయిల్ వంటి మినరల్ ఆయిల్స్, వీటితోపాటు బేసిక్ మెటల్ , ఫుడ్ ప్రొడక్ట్స్, కెమికల్ ప్రొడక్ట్స్ ధరలు పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది. ► కాగా జూన్‌లో ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ 32.83 శాతం పెరిగింది. మేలో ఇది ఏకంగా 37.61 శాతంగా ఉంది. ► ఫుడ్ ఆర్టికల్స్ విషయంలో రేట్లు 4.31% (2021 మే నెల) నుంచి 3.09%కి తగ్గింది. ► మొత్తం సూచీలో మెజారిటీగా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరల స్పీడ్ జూన్‌లో 10.88 శాతం. మే నెల్లో ఇది 10.83 శాతం. ► కాగా ఆర్బీఐ తన రెపో రేటు విధానానికి (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం 4%) ప్రాతిపదికగా తీసుకునే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 6.26%గా ఉంది. కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్న స్థాయి (2–6) కన్నా అధికంగా కొనసాగడం ఇది వరుసగా రెండవనెల. -
India WPI Inflation: టోకు ధరలు... గుభేల్!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 ఏప్రిల్‌లో భారీగా 10.49 శాతం పెరిగింది. అంటే సూచీలోని ఉత్పత్తుల ధరలు 2020 ఏప్రిల్‌తో పోల్చితే తాజా సమీక్షా నెలలో 10.49 శాతం పెరిగాయన్నమాట. సూచీలోని ప్రధాన విభాగాలైన ఆహారం, ముడి చమురు, తయారీ రంగాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం మొత్తం సూచీపై ప్రభావం చూపింది. ఇదే పెరుగుదల తీరు మున్ముందూ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణాల్లో లోబేస్ ఎఫెక్ట్ ఒకటి. గత ఏడాది ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా 1.57 శాతం క్షీణించిన విషయం ఇక్కడ గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడం బేస్ ఎఫెక్ట్‌గా పేర్కొంటారు. ఇక్కడ 2020 ఏప్రిల్‌లో అసలు వృద్ధి నమెదుకాకపోగా భారీగా 1.57 శాతం క్షీణత నమోదుకావడం (లో బేస్) ఇక్కడ గమనార్హం. వరుసగా నాలుగు నెలల నుంచీ టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. 2021 మార్చిలో ఈ రేటు 7.39 శాతంగా ఉంది. వాణిజ్య పరిశ్రమల శాఖ తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు... ► ఫుడ్ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్ 4.92 శాతం పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపల వంటి ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ధరలు 10.88 శాతం పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 10.74 శాతం ఎగశాయి. పండ్ల ధరలు 27.43 శాతం ఎగశాయి. కాగా కూరగాయల ధరలు మాత్రం 9.03 శాతం తగ్గాయి. ► ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 20.94 శాతంగా ఉంది. ► తయారీ ఉత్పత్తులు: సమీక్షా నెలలో 9.01 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ► కాగా, ఆర్బీఐ రెపో నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.29 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. సరఫరాల సమస్య కనబడుతోంది ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల 4.9 శాతంగా నమోదుకావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారి. హోల్‌సేల్ స్థాయిలో సరఫరాల సమస్య తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. రానున్న నెలల్లో టోకు ద్రవ్యోల్బణం 13 నుంచి 13.5 శాతం శ్రేణికి పెరుగుతుందన్నది మా అంచనా. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను మరింత తగ్గిందన్న మా అభిప్రాయానికి కూడా గణాంకాలు బలాన్ని ఇస్తున్నాయి. అయితే బలహీన ఎకానమీ నేపథ్యంలో యథాతథ సరళతర ద్రవ్య పరపతి విధానాలనే ఆర్బీఐ కొనసాగిస్తుందని భావిస్తున్నాం. – అదితీ నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అంతర్జాతీయంగా పెరిగిన ధరల ప్రభావం కేవలం కొన్ని సీజనల్ కారణాల వల్లే టోకు ద్రవ్యోల్బణం పెరగలేదు. అంతర్జాతీయంగా ధరల పెరుగుదలా టోకు ద్రవ్యోల్బణం అప్‌ట్రెండ్‌కు కారణం. ఖనిజాలు, వంట నూనెలు, ముడి చమురు, బొగ్గు, ఎరువులు, ప్లాస్టిక్, బేసిక్ మెటల్స్‌న, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఆటో తత్సంబంధ విడిభాగాల వెయిటేజ్ మొత్తం సూచీలో 44%. అంతర్జాతీయంగా ఆయా కమోడిటీల ధరలు పెరగడం దేశీయంగా కూడా ప్రభావం చూపింది. ప్రపంచ మార్కెట్లో కమోడిటీల ధరలు మరింత పెరుగుతుండడం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం. ద్రవ్యోల్బణం మరింత పెరక్కుండా ప్రభుత్వం సరఫరాల వ్యవస్థ పటిష్టతపై దృషి సారించాలి. – సునీల్ కుమార్ సిన్హా, ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఆర్థికవేత్త -
టోకు ధరలు తీవ్ర రూపం!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో తీవ్ర రూపం దాల్చింది. 7.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 మార్చితో పోల్చితే 2021 మార్చిలో టోకు బాస్కెట్లోకి ఉత్పత్తుల ధరలు 7.39 శాతం పెరిగాయన్నమాట. గడచిన ఎనిమిది సంవత్సరాల్లో (అక్టోబర్ 2012లో 7.4 శాతం) ఈ స్థాయి ద్రవ్యోల్బణం రేటు ఇదే తొలిసారి. క్రూడ్ ఆయిల్, మెటల్ ధరలు భారీగా పెరగడం మొత్తం బాస్కెట్‌పై ప్రభావం చూపింది. అలాగే గత ఏడాది అతి తక్కువ ధరలు (బేస్ ఎఫెక్ట్) కూడా ‘భారీ పెరుగుదల రేటు’కు కారణంగా ఉంది. 2020 మార్చిలో టోకు ద్రవ్యోల్బనం 0.42 శాతం కావడం గమనార్హం. 2021 ఫిబ్రవరిలో ఈ రేటు 4.17 శాతంగా ఉంది. గడచిన మూడు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. ► ఫుడ్ ఆర్టికల్స్‌లో 3.24% టోకు ద్రవ్యోల్బణం నమోదయ్యింది. పప్పు దినుసుల ధరలు 13.14%, పండ్లు, ధాన్యం విషయంలో ధరాభారం వరుసగా 16.33%, 1.38%గా ఉన్నా యి. కూరగాయల ధరలు 5.19% తగ్గాయి. ► ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ టోకు ధరలు 10.25 శాతం పెరిగాయి. ► మొత్తం సూచీలో దాదాపు 55 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 7.34 శాతంగా నమోదైంది. -
టోకు ద్రవ్యోల్బణం... 9 నెలల గరిష్టం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో 1.55 శాతంగా నమోదయ్యింది. అంటే టోకు బాస్కెట్‌లోని ఉత్పత్తుల ధర 2019 నవంబర్‌తో పోల్చితే, 2020 నవంబర్‌లో 1.55 శాతం పెరిగిందన్నమాట. ఫిబ్రవరిలో 2.26 శాతం నమోదు తర్వాత, గడచిన తొమ్మిది నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 60 శాతంగా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. 2020 అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం స్పీడ్ 1.48 శాతం అయితే, గత ఏడాది నవంబర్‌లో ఇది 0.58 శాతంగా ఉంది. ► నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 3.94 శాతంగా ఉంది. అక్టోబర్ (6.37 శాతం)లో నమోదుకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. ఒక్క కూరగాయల ధరలను చూస్తే, 12.24 శాతం పెరిగాయి. ఆలూ విషయంలో ధరల పెరుగుదల తీవ్రంగా 115.12 శాతంగా ఉంది. ► నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విషయానికి వస్తే, ధరల పెరుగుదల 8.43%. ► ఫ్యూయెల్, పవర్ బాస్కెట్లో ధర లు పెరక్కపోగా 9.87% తగ్గాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 6.93 శాతం మరోవైపు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నవంబర్‌లో ఇది 6.93 శాతంగా నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష, కీలక రేట్ల నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదికగా ఉంటుంది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 – 2 శాతం మధ్య ఉండాలి. దీని ప్రకారం నవంబర్ సూచీ అధికంగానే ఉన్నప్పటికీ, అక్టోబర్ 7.61 శాతం కన్నా తగ్గడం గమనార్హం. -
టోకు ధరలూ పెరిగాయ్!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 1.48 శాతం ఎగసింది. అంటే 2019 అక్టోబర్‌తో పోల్చితే 2020 అక్టోబర్‌లో టోకు వస్తువుల బాస్కెట్ ధర 1.48 శాతం పెరిగిందన్నమాట. ఎనిమిది నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. ఆర్థిక మందగమనం, వ్యవస్థలో డిమాండ్ లేకపోవడం, కరోనా ప్రతికూలతలు వంటి అంశాల నేపథ్యంలో టోకు ధరల సూచీ ‘జీరో’ లేదా ప్రతిద్రవ్యోల్బణం స్థాయిలో నమోదవుతోంది. సూచీలోని ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలు మాత్రమే పెరుగుదలను సూచిస్తున్నాయి. అయితే వ్యవస్థలో కొంత డిమాండ్ నెలకొనడంతోపాటు, బేస్ ఎఫెక్ట్ (2019 అక్టోబర్‌లో ‘జీరో’ ద్రవ్యోల్బణం) కూడా తాజాగా సూచీ పెరుగుదలకు ఒక కారణమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆవిష్కరించిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మొత్తం సూచీలో దాదాపు 12% వెయిటేజ్ ఉన్న ఆహార ఉత్పత్తుల ధరలు టోకును 6.37% పెరిగాయి. ఒక్క కూరగాయల ధరలు 25.23 శాతం పెరిగితే, ఆలూ ధరలు ఏకంగా 107.70% ఎగశాయి (2019 అక్టోబర్ ధరలతో పోల్చితే). ► సూచీలో 12% వెయిటేజ్ ఉన్న నాన్–ఫుడ్ ఆర్టికల్స్, మినరల్స్ ధరలు 2.85 శాతం, 9.11 శాతం చొప్పున ఎగశాయి. ► మొత్తం సూచీలో దాదాపు 62 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ధరలు 2.12 శాతం ఎగశాయి. ► 14% వెయిటేజ్ ఉన్న ఫ్యూయల్ అండ్ పవర్ ఇండెక్స్‌లో అసలు పెరుగుదల లేకపోగా 10.95% క్షీణించాయి. ఆర్బీఐ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చు... ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రక్రియకు ఇక తెరపడినట్లేనని నిపుణులు అంచనావేస్తున్నారు. వచ్చే నెల్లో జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో యథాతథ రేటును కొనసాగించే వీలుందన్నది వారి విశ్లేషణ. టోకు ధరలే తీవ్రంగా ఉంటే, ఇక రిటైల్ ధరలు మరింత పెరుగుతాయని వారు విశ్లేషిస్తున్నారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. -
కూరగాయల ధరలు 37% అప్!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 1.32 శాతంగా నమోదయ్యింది. ఏడు నెలల గరిష్టస్థాయి ఇది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాకాల ప్రకారం– సూచీలో దాదాపు 14 శాతం వెయిటేజ్ ఉన్న ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధర భారీగా పెరిగింది. కూరగాయల ధరలు 37 శాతం పెరిగితే (2019 సెప్టెంబర్ ధరలతో పోల్చి), ఆలూ విషయంలో ద్రవ్యోల్బణం ఏకంగా 108 శాతంగా ఉంది. సూచీలోని 3 ప్రధాన విభాగాలూ ఇలా... ► మొత్తం సూచీలో 20.12%గా ఉన్న ప్రైమరీ ఆర్టికల్స్ (ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌సహా)లో ద్రవ్యోల్బణం 5.10 శాతంగా నమోదయ్యింది. ఇందులో 14.34 శాతం వెయిటేజ్ ఉన్న ఫుడ్ ఆర్టికల్స్‌లో ధరాభారం 8.17 శాతంగా ఉంది. అయితే 4.26 శాతం వెయిటేజ్ ఉన్న నాన్ ఫుడ్ బాస్కెట్ ధర మాత్రం 0.08 శాతం తగ్గింది. ► ఇక 14.91 శాతం వెయిటేజ్ ఉన్న ఫ్యూయెల్ అండ్ పవర్ విభాగంలో ద్రవ్యోల్బణం కూడా 9.54 శాతం తగ్గింది. ► 64.97 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ ఉత్పత్తుల్లో ధరలు 1.61 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు చూస్తే... ఫుడ్ ఆర్టికల్స్‌లో ధరాభారం ఎనిమిది నెలల గరిష్ట స్థాయిలో 8.17 శాతం పెరిగితే, కూరగాయలు, ఆలూ ధరలు సామాన్యునికి భారంగా మారిన పరిస్థితి నెలకొంది. పప్పుదినుసుల ధరలు 12.53 శాతం ఎగశాయి. కాగా, ఉల్లిపాయలు (31.64%), పండ్లు (3.89%), తృణ ధాన్యాల (3.91%) ధరలు తగ్గాయి. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.34%గా నమోదయ్యింది. గత 8 నెలల్లో ఇంత అధిక స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. -
టోకు ధరలు.. మైనస్ నుంచి ప్లస్
న్యూఢిల్లీ: ప్రభుత్వం సోమవారం నాడు ఆగస్టుకు సంబంధించి అటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను, ఇటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. టోకు ద్రవ్యోల్బణం 0.16 శాతం నమోదయితే, రిటైల్ ద్రవ్యోల్బణం 6.69 శాతంగా నమోదయ్యింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన టోకు ధరల గణాంకాల్లో కీలక అంశాలను పరిశీలిస్తే... టోకు డిమాండ్ మెరుగుపడుతుందనుకోలేం! టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల తర్వాత మొట్టమొదటిసారి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల నుంచి బయటపడింది. ఆగస్టులో ద్రవ్యోల్బణం 0.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2019 ఆగస్టుతో పోల్చితే 2020 ఆగస్టులో టోకు బాస్కెట్‌లోని మొత్తం ఉత్పత్తుల ధర 0.16 శాతం పెరిగిందన్నమాట. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన తర్వాత వరుసగా ఏప్రిల్ (– 1.57%), మే (–3.37%), జూన్ (–1.81%), జూలై (–0.58%) నెలల్లో ప్రతికూల టోకు ద్రవ్యోల్బణం రేట్లు నమోదయ్యాయి. వ్యవస్థలో డిమాండ్ లేమి పరిస్థితులను ప్రతి ద్రవ్యోల్బణం సూచిస్తుంది. అయితే తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో మళ్లీ డిమాండ్ కనిపిస్తోందనడానికి సూచన కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఆగస్టులో ద్రవ్యోల్బణం పెరగడానికి బేస్ ఎఫెక్టే కారణమన్నది వారి అంచనా. అంటే 2019 ఆగస్టులో నమోదయిన టోకు ద్రవ్యోల్బణం అతి తక్కువగా ఉండడం (కేవలం 1.17%), ఆర్థిక మందగమనం వల్ల అటు తర్వాత నెలల్లోనూ వ్యవస్థలో పూర్తి ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులే నెలకొనడం వంటి అంశాలతో తాజా సమీక్షా నెల 2020 ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం కొంచెం పెరిగినట్లు ‘గణాంకాల్లో’ కనిపిస్తోందన్నది వారి అభిప్రాయం. దీనినే బేస్ ఎఫెక్ట్ మాయగా నిపుణులు పేర్కొంటారు. కాగా మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.42%. మూడు ప్రధాన విభాగాలను చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ విభాగాలతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం ఆగస్టులో 1.60 శాతానికి తగ్గింది. 2019 ఆగస్టులో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.51 శాతం. ఇక ఈ విభాగంలో కేవలం ఫుడ్ ఆర్టికల్స్‌ను తీసుకుంటే, ద్రవ్యోల్బణం 7.80 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గింది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో మాత్రం ప్రతి ద్రవ్యోల్బణం (–1.46 శాతం) కొనసాగుతోంది. 2019 ఇదే నెలలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.68 శాతం. ► ఇంధనం, విద్యుత్: ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 3.53 శాతం నుంచి మరింతగా మైనస్ 9.68 శాతానికి పెరిగింది. ► తయారీ: తయారీ రంగంలో 1.27 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. 2019 ఆగస్టులో ఇది స్థిరంగా ఉంది. టోకున ‘నిత్యావసరాల’ మంట డబ్ల్యూపీఐ... ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం వార్షికంగా చూస్తే 7.80% నుంచి 3.84%కి తగ్గినా, నిత్యావసరాల ధరలు మాత్రం ఇంకా సామాన్యునికి భారంగానే ఉండడం గమనార్హం. కూరగాయల ధరలు 7.03% పెరిగాయి (2019 ఆగస్టుతో పోల్చి). పప్పు దినుసుల ధరలు 9.86% ఎగశాయి. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 6.23% పెరిగాయి. ఆలూ ధరలు భారీగా 82.93 శాతం ఎగశాయి. అయితే ఉల్లిపాయల ధరలు మాత్రం 34.48% తగ్గాయి.