కసరత్తు షురూ.. ∙18 మందితో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం బేస్ ఇయర్ మార్పు కసరత్తు ప్రారంభమైంది. 18 మంది సభ్యులతో కూడిన ఈ వర్కింగ్ గ్రూప్‌నకు నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ 2011–12ను 2022–23కు మార్పు సిఫారసులు చేయడం ఈ గ్రూప్ ఏర్పాటు ప్రధాన లక్ష్యం. దేశ ఆర్థిక వ్యవస్థలో ధరల స్థితిగతుల్లో మరింత పారదర్శకతల తీసుకురావడం లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రూప్ టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) ప్రకారం.. ఎకానమీలో వచి్చన మార్పులకు అనుగుణంగా డబ్ల్యూపీఐతోపాటు ఉత్పత్తిదారుల ధర సూచీ (పీపీఐ) ఏర్పాటుకు వర్కింగ్ గ్రూప్ సూచనలు
చేస్తుంది.
ఉత్పత్తిదారుల ధర సూచీ వైపు మార్పు!
పీపీఐలో ఉత్పత్తులపై సిఫారసులతోపాటు, ధరల సేకరణ వ్యవస్థ సమీక్ష, మెరుగునకు సూచనలు, డబ్ల్యూపీఐ నుంచి పూర్తిగా పీపీఐకి మారడానికి రోడ్ మ్యాప్ రూపకల్పన కూడా వర్కింగ్ గ్రూప్ బాధ్యతల్లో కొన్ని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఆర్థిక వ్యవహారాల విభాగం, గణాంకాల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ విభాగం, విని యోగదారుల వ్యవహారాల విభాగం, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నుండి ఈ గ్రూప్‌లో ప్రతినిధులు ఉన్నారు. ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యు రా లు షామికా రవి, క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకిర్తి జోషి, కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ అసెట్ నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిలేష్ షా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ చీఫ్ ఎకనామి స్ట్ కో హెడ్ ఇంద్రనిల్ సేన్‌గుప్తా ప్రత్యేక ఆహా్వనిత సభ్యులుగా గ్రూప్‌లో బాధ్యతలు నిర్వహిస్తారు.
ప్రస్తుత డబ్ల్యూపీఐలో 697 ఉత్పత్తులు
ప్రస్తుతం డబ్ల్యూపీఐలో 697 ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో ప్రైమరీ ఆరి్టకల్స్ సంఖ్య 117. ఫూయల్ అండ్ పవర్ విభాగంలో 16, తయారీ రంగంలో 564 ఉత్పత్తులు ఉన్నాయి. ధరల పెరుగుదల ధోరణులను గుర్తించడానికి ప్రస్తుతం ప్రధానంగా రెండు సూచీలు ఉన్నాయి. ఇందులో ఒకటి డబ్ల్యూపీఐకాగా, మరొకటి వినియోగ ధరల సూచీ (పీపీఐ). రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్షకు వినియోగ ధరల సూచీ ప్రధాన ప్రాతిపదికగా ఉంది. 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద సీపీఐ ఉండేలా చూడాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. 1942లో డబ్ల్యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టారు.
అప్పట్లో 1939 బేస్ ఇయర్‌గా ఉంది. అటు తర్వాత ఏడు సార్లు (1952–53, 1961–62, 1970–71, 1981–82, 1993–94, 2004–05, 2011–12) బేస్ ఇయర్‌లు మారాయి. ప్రస్తుత 2011–12 బేస్ ఇయర్ 2017 మేలో ప్రారంభమైంది. తాజా గణాంకాల ప్రకారం, నవంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 1.89 శాతంగా నమోదైంది. ఇక వృద్ధి లక్ష్యంగా రేటు తగ్గింపును (సరళతర వడ్డీరేట్ల విధానం) కోరుతున్న ప్రభుత్వం– రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కేంద్రం సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్ల జారీ ప్రతిపాదనను సైతం ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. ఈ విధానాన్ని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యతిరేకించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment