దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) బుధవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్ (Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 (Nifty) అస్థిరమైన సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. వీఎస్‌ఈ సెన్సెక్స్ 312.53 పాయింట్లు లేదా 0.40 శాతం తగ్గి 78,271.28 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 78,735.41 - 78,226.26 పరిధిలో ట్రేడైంది.
సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 42.95 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టపోయి 23,696.30 వద్ద ముగిసింది. ఈ సూచీ ఈరోజు గరిష్ట స్థాయి 23,807.30ని నమోదు చేయగా, కనిష్ట స్థాయి 23,680.45గా ఉంది.
నిఫ్టీ 50 లోని 25 షేర్లు నష్టాల్లో ముగిశాయి. వీటిలో ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. వీటి నష్టాలు 3.40 శాతం వరకు నమోదయ్యాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్‌గా 2.90 శాతం వరకు లాభాలను అందుకున్నాయి.
ఇక విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. స్మాల్-క్యాప్ షేర్లు ముందంజలో ఉన్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్100 ఇండెక్స్ 1.85 శాతం లాభపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్100 ఇండెక్స్ 0.68 శాతం లాభాలతో స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో రంగాల సూచీల్లో నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్‌లు 1.75 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఓఎంసీలు, మీడియా ఇండెక్స్‌లు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి.
అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(ఫిబ్రవరి7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. చాన్నాళ్ల తర్వాత ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితం కానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment