
Stock Market Updates: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. విస్తృత సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ భారత బెంచ్ మార్క్ సూచీలు అత్యంత స్వల్ప స్థాయిలో కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 74,834 వద్ద గరిష్ట స్థాయి నుండి 74,521 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరికి 10 పాయింట్ల లాభంతో 74,612 వద్ద ఫ్లాట్ నోట్ వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 100 పాయింట్ల స్వల్ప శ్రేణిలో కదలాడింది. 22,613 వద్ద గరిష్ట స్థాయి నుండి ఇండెక్స్ 22,508 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరికి దాదాపుగా 22,545 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ చెరో 2 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జొమాటో, యాక్సిస్ బ్యాంక్ 1 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు వైర్లు, కేబుల్స్ వ్యాపారంలోకి ప్రవేశించే ప్రణాళికను ప్రకటించిన తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 5 శాతం పడిపోయింది. అదేసమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.
విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పడిపోయాయి. బంధన్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఏయూ బ్యాంక్, క్రెడిట్యాక్సెస్ గ్రామీణ్, టీటీకే హెల్త్‌కేర్, చోళమండలం హోల్డింగ్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 5-8 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు ఆర్ఆర్ కబెల్, కేఈఐ ఇండస్ట్రీస్, విజయ డయాగ్నస్టిక్స్, ప్రజ్ ఇండస్ట్రీస్, అజంతా ఫార్మా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎంఎఫ్ఐ రుణాలు, ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలపై రిస్క్ వెయిట్‌ను తగ్గించిన తరువాత క్రెడిట్యాక్సెస్ గ్రామీణ్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC), మైక్రో ఫైనాన్స్ షేర్లకు గురువారం డిమాండ్ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment