దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు కీలక వడ్డీ రేటు ప్రకటనలు చేయనున్న నేపథ్యంలో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్, నిఫ్టీ50 జాగ్రత్తగా కదులుతున్నాయి.
సెషన్ ప్రారంభ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 87.80 పాయింట్లు లేదా 0.11 శాతం పెరిగి 78,145.96 వద్ద ఉంది. అలాగే నిఫ్టీ 50 (Nifty) 35.05 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 23,638.40 వద్ద ఉంది.
రెండు రోజుల చర్చల తర్వాత, ఆర్థిక వ్యవస్థ స్థితి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలపై వ్యాఖ్యానాలతో పాటు, వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన మొదటి ఎంపీసీ నిర్ణయాన్ని ఈరోజు ప్రకటిస్తున్నారు.
మరోవైపు యూస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరో కనిష్ట స్థాయిని తాకింది. కేంద్ర బ్యాంకు వడ్డీ రేటు నిర్ణయం వెలువడే ముందు గురువారం భారత ప్రభుత్వ బాండ్ దిగుబడి కూడా స్వల్పంగా తగ్గింది. అంతేకాకుండా, ఎంపీసీ నిర్ణయం తర్వాత బాండ్ల ద్వారా దాదాపు రూ. 14,000 కోట్లు సేకరించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రధాన సంస్థలు దేశీయ రుణ మూలధన మార్కెట్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment