RBI MPC
-
ఈఎంఐలు తగ్గుతాయా? రేపటి నుంచే ఆర్బీఐ మీటింగ్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం (ఫిబ్రవరి 6) జరగబోతోంది. మధ్యంతర బడ్జెట్ ముగిసిన వెంటనే ఈ మీటింగ్ జరగుతోంది. ఇందులో ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది.. ప్రతి నెలా తాము చెల్లిస్తున్న లోన్ ఈఎంఐ (EMI)లు ఏమైనా తగ్గుతాయా అని దేశవ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు ఈ మీటింగ్ జరుగుతుంది. ఇందులో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. మళ్లీ యథాతథమే! ఆర్బీఐ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, గత రేటు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. రెపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. గత డిసెంబర్లో జరిగిన సమావేశంలో ఆర్బీఐ పాలసీ రెపో రేటును 6.5 శాతం యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. తగ్గింపు అప్పుడే.. రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్లో ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును మార్చి వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగినా రెపో రేట్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. -
RBI: వడ్డీరేట్లపై ఆర్బీఐ ప్రకటన
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి సర్దుబాటు నిర్ణయం వైపే మొగ్గు చూపింది. వరుసగా 9వసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించింది ఆర్బీఐ. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రెపోరేట్, రివర్స్ రెపోరేట్లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి పరిమితం చేసినట్లు వెల్లడించారాయన. అలాగే ఎంఎస్ఎఫ్(మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ), బ్యాంక్ రేట్లను 4.25 శాతానికే పరిమితం చేసినట్లు తెలిపారు. పెట్రోల్ మరియు డీజిల్పై ఇటీవలి ఎక్సైజ్ సుంకం & రాష్ట్ర వ్యాట్ తగ్గింపులు.. కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా వినియోగ డిమాండ్కు మద్దతు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం డిమాండ్కు మద్దతునిస్తూ ఆగస్టు నుంచి ప్రభుత్వ వినియోగం కూడా పుంజుకుంది. ► 2021-22లో వాస్తవ GDP వృద్ధి అంచనా 9.5% వద్ద ఉంచబడింది, Q3లో 6.6% & Q4లో 6% ఉంటుంది. వాస్తవ GDP వృద్ధి 2022-23 Q1కి 17.2% మరియు 2022-23 Q2కి 7.8%గా అంచనా వేయబడింది. ► జూన్ 2020 నుండి ఆహారం & ఇంధనం మినహా CPI ద్రవ్యోల్బణం కొనసాగడం అనేది ఇన్పుట్ కాస్ట్ ఒత్తిళ్ల దృష్ట్యా విధానపరమైన ఆందోళన కలిగించే అంశం. ఇది డిమాండ్ బలపడుతున్నప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణానికి వేగంగా ప్రసారం చేయబడుతుంది ► ధరల ఒత్తిడి తక్షణ కాలంలో కొనసాగవచ్చు. రబీ పంటలకు ప్రకాశవంతమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కూరగాయల ధరలు శీతాకాలపు రాకతో కాలానుగుణ దిద్దుబాటును చూడగలవని అంచనా. ► 2021-22లో CPI ద్రవ్యోల్బణం 5.3%గా అంచనా వేయబడింది. ఇది క్యూ3లో 5.1%, మరియు క్యూ4లో 5.7% రిస్క్ విస్తృతంగా సమతుల్యతతో ఉంటుంది ► జూన్ 2020 నుండి ఆహారం & ఇంధనం మినహా CPI ద్రవ్యోల్బణం కొనసాగడం అనేది ఇన్పుట్ కాస్ట్ ఒత్తిళ్ల దృష్ట్యా విధానపరమైన ఆందోళన కలిగించే అంశం. చదవండి: మార్కెట్ నుంచి మాయమవుతున్న రూ.2000 నోట్లు ! కారణాలు ఇవే -
పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై అనిశ్చితి
ఆర్బీఐ ఎంపీసీ అభిప్రాయం ముంబై: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ద్రవ్యోల్బణ లక్ష్యంపై దృష్టి కారణంగానే కీలక రేట్లను యధాతథంగా కొనసాగించడానికే ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ మొగ్గు చూపారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు వుండొచ్చనే అంశంపై అనిశ్చితి నెలకొందని పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 6–7 మధ్య జరిగిన ఆర్బీఐ మోనేటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశ వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ వివరాల ప్రకా రం... ఈ కమిటీలోని ఆరుగురు సభ్యులు రెపో రేటు ను 6.25 శాతంగా ఉంచడానికే మొగ్గు చూపారు. ⇔ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం రేంజ్లోనే నియంత్రించాలనే విషయంపైనే దృష్టి కేంద్రీకరించాలని పటేల్ సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ⇔ నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ, స్వల్ప కాలిక ప్రభా వం ఉంటుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ కూడా అభిప్రాయపడ్డారు. అయితే మధ్య కాలానికి వృద్ధి అవకాశాలపై చెప్పుకోదగ్గ ప్రతికూల ప్రభావాలు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. చమురు ధరలు, భౌగోళిక–రాజకీయ స్థితిగతుల ప్రభావం ఉంటుందని వివరించారు. ⇔ పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థకు ఊహించని షాక్ అని మరో సభ్యుడు రవీంద్ర హెచ్ డోలాకియా అభిప్రాయపడ్డారు. ఫలితంగా జీడీపీ అంచనాల ను తగ్గించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రభావం తాత్కాలికమేనని వివరించారు. ⇔ పెద్ద నోట్ల రద్దు ప్రభావాలను తట్టుకునే స్థాయిలోనే మన ఆర్థిక వ్యవస్థ ఉందని మరో ఎంపీసీ సభ్యురాలు పామి దువా అభిప్రాయపడ్డారు. ఆర్థిక కార్యకలాపాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని ఆమె పేర్కొన్నారు. ⇔ డిమాండ్ తగ్గుతుండడం, దేశీయంగా సరఫరా సంబంధిత సమస్యలు తాత్కాలికమేనని మరో ఎంపీసీ సభ్యుడు దేబబ్రత పాత్ర అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించినరిస్క్లు, ఎక్కువ కాలం ప్రభావం చూపుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.