Base Year
-
ద్రవ్యోల్బణం ‘లెక్క’ మారుతోంది
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం బేస్ ఇయర్ మార్పు కసరత్తు ప్రారంభమైంది. 18 మంది సభ్యులతో కూడిన ఈ వర్కింగ్ గ్రూప్‌నకు నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ 2011–12ను 2022–23కు మార్పు సిఫారసులు చేయడం ఈ గ్రూప్ ఏర్పాటు ప్రధాన లక్ష్యం. దేశ ఆర్థిక వ్యవస్థలో ధరల స్థితిగతుల్లో మరింత పారదర్శకతల తీసుకురావడం లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రూప్ టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) ప్రకారం.. ఎకానమీలో వచి్చన మార్పులకు అనుగుణంగా డబ్ల్యూపీఐతోపాటు ఉత్పత్తిదారుల ధర సూచీ (పీపీఐ) ఏర్పాటుకు వర్కింగ్ గ్రూప్ సూచనలు చేస్తుంది. ఉత్పత్తిదారుల ధర సూచీ వైపు మార్పు! పీపీఐలో ఉత్పత్తులపై సిఫారసులతోపాటు, ధరల సేకరణ వ్యవస్థ సమీక్ష, మెరుగునకు సూచనలు, డబ్ల్యూపీఐ నుంచి పూర్తిగా పీపీఐకి మారడానికి రోడ్ మ్యాప్ రూపకల్పన కూడా వర్కింగ్ గ్రూప్ బాధ్యతల్లో కొన్ని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఆర్థిక వ్యవహారాల విభాగం, గణాంకాల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ విభాగం, విని యోగదారుల వ్యవహారాల విభాగం, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నుండి ఈ గ్రూప్‌లో ప్రతినిధులు ఉన్నారు. ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యు రా లు షామికా రవి, క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకిర్తి జోషి, కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ అసెట్ నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిలేష్ షా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ చీఫ్ ఎకనామి స్ట్ కో హెడ్ ఇంద్రనిల్ సేన్‌గుప్తా ప్రత్యేక ఆహా్వనిత సభ్యులుగా గ్రూప్‌లో బాధ్యతలు నిర్వహిస్తారు.ప్రస్తుత డబ్ల్యూపీఐలో 697 ఉత్పత్తులుప్రస్తుతం డబ్ల్యూపీఐలో 697 ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో ప్రైమరీ ఆరి్టకల్స్ సంఖ్య 117. ఫూయల్ అండ్ పవర్ విభాగంలో 16, తయారీ రంగంలో 564 ఉత్పత్తులు ఉన్నాయి. ధరల పెరుగుదల ధోరణులను గుర్తించడానికి ప్రస్తుతం ప్రధానంగా రెండు సూచీలు ఉన్నాయి. ఇందులో ఒకటి డబ్ల్యూపీఐకాగా, మరొకటి వినియోగ ధరల సూచీ (పీపీఐ). రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్షకు వినియోగ ధరల సూచీ ప్రధాన ప్రాతిపదికగా ఉంది. 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద సీపీఐ ఉండేలా చూడాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. 1942లో డబ్ల్యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో 1939 బేస్ ఇయర్‌గా ఉంది. అటు తర్వాత ఏడు సార్లు (1952–53, 1961–62, 1970–71, 1981–82, 1993–94, 2004–05, 2011–12) బేస్ ఇయర్లు మారాయి. ప్రస్తుత 2011–12 బేస్ ఇయర్ 2017 మేలో ప్రారంభమైంది. తాజా గణాంకాల ప్రకారం, నవంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 1.89 శాతంగా నమోదైంది. ఇక వృద్ధి లక్ష్యంగా రేటు తగ్గింపును (సరళతర వడ్డీరేట్ల విధానం) కోరుతున్న ప్రభుత్వం– రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కేంద్రం సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్ల జారీ ప్రతిపాదనను సైతం ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. ఈ విధానాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యతిరేకించడం గమనార్హం. -
మరోసారి బేస్ ఇయర్లో మార్పులు
న్యూఢిల్లీ: మోదీ సర్కారు మరోసారి కీలక గణాంకాలకు బేస్ ఇయర్‌ను మార్చే చర్యలను మొదలు పెట్టేసింది. జీడీపీ గణాంకాలకు బేస్ ఇయర్‌గా 2011–12 ఉండగా, దీన్ని 2017–18కి చేయాలన్నది ఆలోచన. అలాగే, రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్ ప్రస్తుతం 2012 కాగా, దీన్ని 2018 చేయాలనుకుంటోంది. ఈ మార్పులు 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ‘‘ఆర్థిక వ్యవస్థ, సమాజ ప్రగతిని మరింత కచ్చితంగా లెక్కించేందుకు వీలుగా సవరణలు తోడ్పడతాయి. తదుపరి దశ బేస్ ఇయర్ సవరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. జీడీపీకి బేస్ ఇయర్‌గా 2017–18ని చేయనున్నాం. వినియోగదారుల రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్‌గా 2018కి మార్చనున్నాం’’ అని కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖా మంత్రి సదానంద గౌడ మీడియాకు తెలిపారు. అధికారిక గణాంకాలను లెక్కించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రాథమిక సూత్రాలను 2016లో అమల్లోకి తీసుకున్నట్టు చెప్పారు. తన అవసరాల కోసమే ప్రభుత్వం జీడీపీ, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాల లెక్కింపు విధానాలను మారుస్తోందన్న వాదనను ఆయన కొట్టపడేశారు. బేస్ ఇయర్‌గా ఖరారు చేసిన సంవత్సరంలో ఉన్న గణాంకాలను ఆ తర్వాత సంవత్సరాల్లో వృద్ధికి ప్రామాణికంగా తీసుకుని విలువలను లెక్కిస్తుంటారు. -
2017–18కి మారనున్న జీడీపీ బేస్ ఇయర్!
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించిన బేస్ ఇయర్ ప్రస్తుత 2011–12 నుంచి త్వరలో 2017–18కి మారనుంది. ‘‘ప్రస్తుతం గృహ వినియోగ వ్యయంపై సర్వే జరుగుతోంది. అలాగే దేశంలో కార్మిక శక్తికి సంబంధించి గణాంకాల సేకరణ జరుగుతోంది. ఈ కార్యక్రమాలు 2018తో పూర్తవుతాయి. అటు తర్వాత జీడీపీకి సంబంధించి బేస్ ఇయర్ మారుతుంది’’ అని గణాంకాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ ఇక్కడ విలేకరులకు తెలిపారు. మూడేళ్ల ప్రభుత్వ పనితీరును వివరించడానికి ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జీడీపీ బేస్ ఇయర్‌ను మార్చడానికి తన మంత్రిత్వశాఖ తగిన మదింపు జరుపుతోందని తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ మాట్లాడుతూ, వర్షపాతం, తగిన పాలసీ చర్యల వల్ల ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో చక్కటి ఆర్థిక వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గణాంకాల మంత్రిత్వశాఖ నేతృత్వంలోని కేంద్ర గణాంకాల కార్యాలయం 2015 మొదట్లోనే జీడీపీ బేస్ ఇయర్‌ను 2004–05 నుంచి 2011–12కు మార్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల బేస్ ఇయర్‌ను గత నెల్లోనే 2004–05 నుంచి 2011–12కు మార్చారు. -
జీడీపీకి బేస్ ఇయర్ మార్పు సాధారణమే
కేంద్ర గణాంకాల శాఖ న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లెక్కింపునకు బేస్ ఇయర్‌ను మారుస్తుండటం సర్వసాధారణమైన విషయమేనని, అంతర్జాతీయంగా కూడా ఈ విధానం అమలవుతోందని కేంద్ర గణాంకాల శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. మారుతున్న ఎకానమీ తీరుతెన్నుల ప్రకారం ఆర్థిక సమాచారమంతా సమగ్రంగా ఉండేలా ఈ విధానం పాటించడం జరుగుతుందని వివరించారు. జీడీపీ లెక్కింపునకు బేస్ ఇయర్ మార్పునకు కారణాలపై లోక్‌సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నపై స్పందిస్తూ ఆయన ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. శాఖలో భాగమైన కేంద్రీయ గణాంకాల కార్యాలయం .. బేస్ ఇయర్‌ను 2004–05 నుంచి 2011–12కి మార్చిన సంగతి తెలిసిందే. 2015 జనవరిలో ఇది అమల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు.. పాత సిరీస్ ప్రాతిపదికన కట్టే లెక్కల్లో సరిగ్గా ప్రతిఫలించవు కాబట్టే బేస్ ఇయర్ మార్చినట్లు గౌడ పేర్కొన్నారు. -
మారిన లెక్క.. పెరిగిన జీడీపీ
* గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంపు * 2004-05 నుంచి 2011-12కు బేస్ ఇయర్ మారిన ఫలితం న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చడంతో గత సంవత్సరాల జీడీపీ వృద్ధి రేట్లను పెంచుతూ సవరించారు. ఈ మార్పుతో 2013-14 జీడీపీ వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 6.9 శాతానికి ఎగసింది. 12-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5.1 శాతానికి చేరింది. వరుసగా ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో స్థిర ధరల ప్రకారం విలువ రూపంలో ఈ పరిమాణాలు రూ.92.8 లక్షల కోట్లు, రూ.99.2 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కొత్త బేస్ ఇయర్ ప్రకారం ప్రస్తుత ధరలపై జీడీపీ పరిమాణం ఈ రెండు సంవత్సరాల్లో రూ. 99.88 లక్షల కోట్లు, రూ. 113.45 లక్షల కోట్లుగా వుంది. 2011-12 మార్కెట్ ధరల ప్రాతిపదికన తాజా బేస్ ఇయర్ అమల్లోకి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ గురించి మరింత స్పష్టమైన చిత్రం రావడానికి గణాంకాల మంత్రిత్వశాఖ బేస్ ఇయర్‌ను మార్చింది. చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను తెలియజేశారు. జీడీపీ డేటా కోసం ఇప్పటి వరకూ బేస్ ఇయర్ 2004-2005 కాగా, తాజాగా 2011-2012కు మార్చారు. అంటే జాతీయ గణాంకాలు 2004-2005 స్థిర ధరలు కాకుండా 2011-2012 ఆర్థిక సంవత్సరంలోని స్థిర ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. బేస్ ఇయర్ అంటే... వివిధ రంగాలకు సంబంధించిన గణాంకాలకు ఒక నిర్దిష్ట ఏడాదిని మూలంగా తీసుకుని అప్పటి ధర/విలువ ప్రాతిపదికన తదుపరి ప్రతి ఏడాదీ పెరిగే ధర/విలువ వృద్ధి తీరును పరిశీలించడం జరుగుతుంది. పెరుగుదలను శాతాల్లో చూపుతారు. ఈ లెక్కింపునకు ప్రాతిపదికగా తీసుకున్న సంవత్సరాన్నే ‘బేస్ ఇయర్’ అంటారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జాతీయ అకౌంట్ల గణాంకాలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చాలని జాతీయ గణాంకాల కమిషన్(ఎన్ఎస్సీ) సిఫారసు చేసింది. ఇప్పటి వరకూ 10 ఏళ్లకు ఒకసారి ఈ మార్పు ఉండేది. గతంలో బేస్ ఇయర్‌ను 2010 జనవరిలో కేంద్ర ప్రభుత్వం మార్చింది. ద్రవ్యలోటుపై ఎఫెక్ట్... బేస్ రేటు మార్పు నేపథ్యంలో భారీగా పెరగనున్న ఆర్థిక పరిమాణం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు(ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయాలకు మధ్య నున్న వ్యత్యాసం) ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా 4.1 శాతం వద్ద కట్టడి చేయడం సాధ్యమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, స్థిర ధరల ప్రకారం ఆర్థిక పరిమాణం పెరిగినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద ఆర్థిక వృద్ధి పరిమాణం తగ్గడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటుపై బేస్ రేటు మార్పు ప్రభావం ఉండకపోవచ్చని చీఫ్ స్టాటిస్టీషియన్ ఏసీఏ అనంత్ పేర్కొన్నారు. తలసరి ఆదాయం నెలకు రూ.80 వేలు బేస్ ఇయర్ మార్పు ప్రాతిపదికన కరెంట్ ప్రైసెస్ వద్ద చూస్తే, వార్షికంగా మూడు సంవత్సరాలకు సంబంధించి ఈ మొత్తం 2011-12, 2012-13, 2013-14లలో వరుసగా, రూ.64,316, రూ.71,593, రూ.80,388గా ఉంది. 12 ఏళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ: కేంద్రం భారత్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయమని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా శుక్రవారం తెలిపారు. 10-12 సంవత్సరాల శ్రేణిలో దేశ ఆర్థిక పరిమాణం 4 నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కూడా ఆయన అంచనావేశారు. భారత ప్రైవేటు వెంచర్ కేపిటల్ అసోసియేషన్ ఇక్కడ జరిపిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోకి భారీగా పెద్ద ఎత్తున కేపిటల్ పెట్టుబడులు(ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ) వస్తున్న నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్టంగా ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. రానున్న బడ్జెట్లో పన్ను సంబంధ సమస్యలను తగిన విధంగా ఎదుర్కొనేలా చర్యలు ఉంటాయని విదేశీ ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ముంబైని సింగపూర్, లండన్ తరహాలో దిగ్గజ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. అది మా క్రెడిట్... చిదంబరం: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందని జీడీపీ సవరణ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.