Ramesh Chand
-
ద్రవ్యోల్బణం ‘లెక్క’ మారుతోంది
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం బేస్ ఇయర్ మార్పు కసరత్తు ప్రారంభమైంది. 18 మంది సభ్యులతో కూడిన ఈ వర్కింగ్ గ్రూప్‌నకు నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ 2011–12ను 2022–23కు మార్పు సిఫారసులు చేయడం ఈ గ్రూప్ ఏర్పాటు ప్రధాన లక్ష్యం. దేశ ఆర్థిక వ్యవస్థలో ధరల స్థితిగతుల్లో మరింత పారదర్శకతల తీసుకురావడం లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రూప్ టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) ప్రకారం.. ఎకానమీలో వచి్చన మార్పులకు అనుగుణంగా డబ్ల్యూపీఐతోపాటు ఉత్పత్తిదారుల ధర సూచీ (పీపీఐ) ఏర్పాటుకు వర్కింగ్ గ్రూప్ సూచనలు చేస్తుంది. ఉత్పత్తిదారుల ధర సూచీ వైపు మార్పు! పీపీఐలో ఉత్పత్తులపై సిఫారసులతోపాటు, ధరల సేకరణ వ్యవస్థ సమీక్ష, మెరుగునకు సూచనలు, డబ్ల్యూపీఐ నుంచి పూర్తిగా పీపీఐకి మారడానికి రోడ్ మ్యాప్ రూపకల్పన కూడా వర్కింగ్ గ్రూప్ బాధ్యతల్లో కొన్ని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఆర్థిక వ్యవహారాల విభాగం, గణాంకాల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ విభాగం, విని యోగదారుల వ్యవహారాల విభాగం, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నుండి ఈ గ్రూప్‌లో ప్రతినిధులు ఉన్నారు. ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యు రా లు షామికా రవి, క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకిర్తి జోషి, కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ అసెట్ నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిలేష్ షా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ చీఫ్ ఎకనామి స్ట్ కో హెడ్ ఇంద్రనిల్ సేన్‌గుప్తా ప్రత్యేక ఆహా్వనిత సభ్యులుగా గ్రూప్‌లో బాధ్యతలు నిర్వహిస్తారు.ప్రస్తుత డబ్ల్యూపీఐలో 697 ఉత్పత్తులుప్రస్తుతం డబ్ల్యూపీఐలో 697 ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో ప్రైమరీ ఆరి్టకల్స్ సంఖ్య 117. ఫూయల్ అండ్ పవర్ విభాగంలో 16, తయారీ రంగంలో 564 ఉత్పత్తులు ఉన్నాయి. ధరల పెరుగుదల ధోరణులను గుర్తించడానికి ప్రస్తుతం ప్రధానంగా రెండు సూచీలు ఉన్నాయి. ఇందులో ఒకటి డబ్ల్యూపీఐకాగా, మరొకటి వినియోగ ధరల సూచీ (పీపీఐ). రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్షకు వినియోగ ధరల సూచీ ప్రధాన ప్రాతిపదికగా ఉంది. 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద సీపీఐ ఉండేలా చూడాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. 1942లో డబ్ల్యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో 1939 బేస్ ఇయర్‌గా ఉంది. అటు తర్వాత ఏడు సార్లు (1952–53, 1961–62, 1970–71, 1981–82, 1993–94, 2004–05, 2011–12) బేస్ ఇయర్లు మారాయి. ప్రస్తుత 2011–12 బేస్ ఇయర్ 2017 మేలో ప్రారంభమైంది. తాజా గణాంకాల ప్రకారం, నవంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 1.89 శాతంగా నమోదైంది. ఇక వృద్ధి లక్ష్యంగా రేటు తగ్గింపును (సరళతర వడ్డీరేట్ల విధానం) కోరుతున్న ప్రభుత్వం– రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కేంద్రం సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్ల జారీ ప్రతిపాదనను సైతం ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. ఈ విధానాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యతిరేకించడం గమనార్హం. -
ఆర్బీకేలతో రైతుకు ఎంతో మేలు: నీతి ఆయోగ్
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో రైతులకు సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఆదర్శనీయమని, వాటిని అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ రమేష్ చంద్ చెప్పారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ స్థాయిలో వ్యవసాయ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. నీతి ఆయోగ్ ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి హాజరైన ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, దాని ఆవశ్యకత, అందిస్తున్న సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పౌర సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారని, వాటికి అనుబంధంగా గ్రామస్థాయిలో రైతుల కోసం ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చామని పూనం మాలకొండయ్య వివరించారు. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి ఇన్‌పుట్స్‌ను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని నాలెడ్జ్ హబ్‌లుగా, వన్‌స్టాప్ సెంటర్లుగా కూడా తీర్చిదిద్దామని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులతోపాటు ఆక్వా, పాడి రైతులకు కూడా ఆర్బీకేలు సేవలందిస్తున్నాయని తెలిపారు. పొలం బడులు, తోట, పట్టు, పశువిజ్ఞాన, మత్స్య సాగుబడుల ద్వారా రైతులకు శిక్షణ ఇస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నట్లు చెప్పారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ ద్వారా వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా అందిస్తున్నామన్నారు. స్పెషల్ సీఎస్ చెప్పిన ప్రతి విషయాన్ని ఆసక్తిగా విన్న వివిధ రాష్ట్రాల అధికారులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఆర్బీకే విధానం తమ రాష్ట్రాల్లో అమలుకు కృషి చేస్తామని ప్రకటించారు. త్వరలోనే ఏపీలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. అనంతరం రమేష్ చంద్ మాట్లాడుతూ.. తాను స్వయంగా ఆర్బీకేలను పరిశీలించానని, వాటి సేవలు బాగున్నాయని తెలిపారు. వీటిని తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ సేవలు అద్భుతమని కొనియాడారు. కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రమోద్, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. ఇదీ చదవండి: బాబు ‘అప్పు’డే లెక్క తప్పారు -
సీఎం జగన్‌తో భేటీలో నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ ప్రశంసలు
-
Ramesh Chand: దేశ సగటు కంటే ఏపీ వృద్ధి భేష్
సాక్షి, అమరావతి: తలసరి ఆదాయం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశు సంపద తదితర విషయాల్లో దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధి చాలా బాగుందని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉందని, ప్రతి రంగంలో లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బృందం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపట్టిన.. ప్రధానంగా జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. పండ్లు, మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందని రమేష్ చంద్ తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు ద్వారా వంట నూనెల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయంసమృద్ధి సాధించిందని చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సమగ్ర వ్యవస్థ అందుబాటులో ఉందని, క్షేత్ర స్థాయిలో ఆర్బీకేలు అత్యుత్తమ వ్యవస్థ అని కితాబు ఇచ్చారు. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ దేశం సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ సగటు అధికంగా ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ, విద్య, వైద్య, గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ బృందానికి వివరించారు. వ్యవసాయం, వైద్య, విద్య, గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. ఈ రంగాల్లో చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులు, బడి పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా సంపూర్ణ పోషణ, గోరుముద్ద లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత కోసం బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను పెట్టామని, గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి.. వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా డెలివరీ మెకానిజాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నామని తెలిపారు. డీబీటీ విధానంలో ఏపీది అగ్రస్థానమని స్పష్టం చేశారు. పిల్లలను బడికి పంపించేలా తల్లులను చైతన్య పరచడానికి అమ్మ ఒడిని అమలు చేస్తున్నామని, దీనివల్ల జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) పెరుగుతోందని చెప్పారు. విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకునేలా పిల్లలను తయారు చేస్తున్నామని వివరించారు. ఇంగ్లిష్ మీడియం, నాణ్యమైన విద్య దిశగా అడుగులు వేస్తున్నామని, నాడు –నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామని, తరగతి గదులను డిజిటల్ ఉపకరణాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సబ్జెక్టుల వారీగా బోధనకు టీచర్లను నియమిస్తున్నామని, ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, వసతి దీవెన కింద కూడా ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నామని, దీనివల్ల జీఈఆర్ గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులు ప్రభుత్వాస్పత్రుల్లో, బోధనాస్పత్రుల్లో నాడు –నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నామని సీఎం తెలిపారు. ప్రతి గ్రామంలో, వార్డుల్లో విలేజ్, వార్డు క్లినిక్స్ పెడుతున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీకి రిఫరల్ పాయింట్‌గా, వ్యాధుల నివారణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని, పీహెచ్‌సీలతో.. అక్కడున్న డాక్టర్లతో అనుసంధానమవుతాయని వివరించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను కూడా అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. 3 వేలకు పైగా చికిత్సలకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నామని, ప్రతిపార్లమెంటు నియోజకవర్గంలో తప్పనిసరిగా మెడికల్ కాలేజీ ఉండేలా కొత్తగా 16 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్బీకేల వ్యవస్థ, సీఎం యాప్ పనితీరు.. తదితర అంశాలు, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కొత్తగా చేపడుతున్న 26 యూనిట్ల గురించి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఆర్బీకే చానల్, ఆర్బీకే, అగ్రి ల్యాబ్ సందర్శన సాక్షి, అమరావతి/ఉయ్యూరు/కంకిపాడు: నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) ప్రొఫెసర్ రమేష్‌చంద్.. నీతి ఆయోగ్ సలహాదారు సి.పార్థసారథిరెడ్డితో కలిసి శుక్రవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శించారు. కాల్ సెంటర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే చానల్ ద్వారా ప్రసారమవుతున్న వ్యవసాయ ప్రాయోజిత కార్యక్రమాల వీడియోలను తిలకించారు. అనంతరం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట–2 ఆర్బీకేను సందర్శించి, అక్కడ కియోస్క్‌లో ఎరువులు బుక్ చేసుకుంటున్న విధానాన్ని, డిజిటల్ లైబ్రరీలోని మ్యాగజైన్స్, పంటల వారీగా ఉన్న బుక్‌లెట్స్‌ను, మినీ టెస్టింగ్ కిట్లు, సాయిల్, మాయిశ్చూర్ మిషన్ల ద్వారా చేస్తోన్న పరీక్షలను పరిశీలించారు. పొలంబడి ప్లాట్‌ను పరిశీలించిన సందర్భంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ ఇవ్వబోతున్నామని, భవిష్యత్‌లో సేంద్రియ ధ్రువీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకే ఆవరణలో ఉన్న వైఎస్సార్ పశు సంచార వైద్య సేవా రథం, రైతు చైతన్య రథాలను పరిశీలించి వాటి ద్వారా అందిస్తోన్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గండిగుంటలో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ‘తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఇన్నాళ్లుకు రైతు ముంగిటకు సేవలు వచ్చాయి. మా ఊళ్లో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నారు. పంటలనూ కొనుగోలు చేస్తున్నారు. నిజంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేం’ అంటూ నందం జోగేశ్వరరావు, గెత్తం విజయ్‌కుమార్ అనే రైతులు వివరించారు. ఆ తర్వాత కంకిపాడు అగ్రి ల్యాబ్‌ను సందర్శించి, అక్కడ ఇన్‌పుట్స్‌ను పరీక్షిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ‘రైతుల ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, గ్రామ స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలు చాలా వినూత్నంగా ఉన్నాయి’ అని విజిటర్స్ బుక్‌లో పేర్కొన్నారు. -
ఏపీ గ్రోత్ స్టోరీ దేశానికే స్ఫూర్తి.. నేరుగా చూడటానికి రాష్ట్రానికి వచ్చా
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాలు అనుసరించాలని తాను సూచిస్తానని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త, ప్రొఫెసర్ రమేష్ చంద్ చెప్పారు. రైతు గుమ్మం ముందు సేవలు అందిస్తున్న ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు వ్యవసాయ ముఖ చిత్రాన్ని మారుస్తాయని విశ్వసిస్తున్నానని అన్నారు. సాగులో అనుసరిస్తున్న ఈ విధానాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, ఈ విధానాలు ‘యూనిక్’గా ఉన్నాయని అభివర్ణించారు. రెండున్నర దశాబ్దాలుగా వ్యవసాయ విధానాల రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న ఆయన 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. నీతి ఆయోగ్‌లో చేరక ముందు ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనమిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్’ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆస్ట్రేలియా, జపాన్‌లో ప్రముఖ యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా వ్యవసాయ రంగాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన.. ఏపీలో అమలువుతున్న వ్యవసాయ విధానాలు, ఆర్బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవలను స్వయంగా చూడటానికి రాష్ట్రానికి వచ్చారు. కంకిపాడు మార్కెట్ యార్డ్‌లోని అగ్రి ల్యాబ్‌లో ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ వినియోగం ►ఏపీలో ఆర్బీకేలు అందిస్తున్న సేవల గురించి విన్నాను. క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించడానికి వచ్చాను. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని(ఐటీ) వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల్లో వినియోగిస్తున్న విధానాన్ని చూశాను. డిజిటల్ టెక్నాలజీ వినియోగానికి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ మంచి ఉదాహరణ. రైతులు సలహాలు, సూచనలు అడుగుతున్న తీరు, అనుమానాలను నివృత్తి చేసుకుంటున్న విధానాన్ని కాల్ సెంటర్లో పరిశీలించాను. ►రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)ను సందర్శించాను. సాగుకు సంబంధించిన ‘ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ఎట్ వన్ ప్లేస్’గా ఇది రైతులకు తోడ్పాటు అందిస్తోంది. రైతులకు సలహాలు, సూచనలే కాదు.. వారికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను అందించే కేంద్రంగా ఉపయోగపడుతోంది. వ్యవసాయ కేంద్రాలంటే కేవలం పంటలకే పరిమితం కావడం నేను చాలా చోట్ల చూశాను. కానీ ఆర్బీకే అలా లేదు. పశువులు, జీవాలు, ఫిషరీస్‌కు సంబంధించిన కార్యకలాపాలు కలగలిసే ఉన్నాయి. నా అభిప్రాయం మార్చుకుంటున్నా.. ►వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం (అడ్వాన్స్ టెక్నాలజీ) వినియోగించుకోవడంలో పంజాబ్ రాష్ట్రమే దేశంలో ముందుందని అనుకున్నా. ఇక్కడ గ్రామ స్థాయిలో కల్పించిన సౌకర్యాలు, అమలు చేస్తోన్న కార్యక్రమాలు చూసిన తర్వాతæ నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నా. ఇక్కడి వ్యవసాయ వి«ధానాలు, కార్యక్రమాలు చాలా వినూత్నంగా ఉన్నాయి. ►ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, అగ్రి ల్యాబ్స్ అద్భుతం. మిగతా రాష్ట్రాలకు అనుసరణీయం. వ్యవసాయ రంగం దేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలంటే దేశ వ్యాప్తంగా ఇలాంటి సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా. జాతీయ స్థాయిలో అమలు చేయాలని సిఫారసు చేస్తా. సాగు చేసి నష్టపోవడమనే సమస్యే తలెత్తదు.. ►దేశంలో చాలా కాల్ సెంటర్స్‌ను చూసాను. కానీ ఇంత పక్కాగా, ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తున్న కాల్ సెంటర్ ఇదే. శాస్త్రవేత్తలు, అధికారులను రైతులతో అనుసంధానించడం గొప్ప ఆలోచన. శాస్త్రీయ అంశాలను నేరుగా రైతులకు చేర్చడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దేశమంతా ఈ విధానం అనుసరించాలి. ►కియోస్క్‌లో రైతులు ఎరువులు బుక్ చేసుకుంటున్న విధానాన్ని స్వయంగా చూశా. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ►108, 104 అంబులెన్స్ తరహాలో మారుమూల పల్లెల్లో పశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న అంబులేటరీ సేవలు రైతులకు చాలా ఉపయోగం. ►వ్యవసాయ రంగంలో నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు పెద్ద సమస్య. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్బీకేలు ఉపయోపగపడుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీల నుంచి రైతులకు అందించడం వల్ల నాణ్యమైన ఇన్పుట్స్ చౌకగా రైతులకు లభిస్తున్నాయి. ►వాటి నాణ్యతను పరీక్షించడానికి ల్యాబ్‌లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, నాణ్యత లేని వాటిని తిరస్కరించడం ద్వారా.. నాణ్యత లేని మెటీరియల్ ఏదీ రైతులకు చేరదు. ఫలితంగా సాగు చేసి నష్టపోవడమనే సమస్యే తలెత్తదు. ►ఇక్కడ అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖతో కలిసి సంయుక్తంగా అధ్యయన పత్రం రూపొందించి, నీతి ఆయోగ్ ద్వారా ప్రచురిస్తాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ విధానాల సమాచారం ఇతర రాష్ట్రాలకు అందుబాటులో ఉంటుంది. చాలా సమస్యలకు పరిష్కారం ►రైతు వ్యాపారస్తుడిగా(ట్రేడర్‌గా) మారి తన పంట తాను అమ్ముకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం మంచి పరిణామం. తద్వారా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. రైతులకు గిట్టుబాట ధర లభించడానికి, మార్కెటింగ్‌లో ఉన్న సమస్యలు అధిగమించడానికి ఈ విధానం దోహదం చేస్తుంది. ►కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడంలో నా పాత్ర ఉంది. రైతు ట్రేడర్‌గా మారాలనేది నా కల. కనీసం చట్టంలో అయినా రైతులు ట్రేడర్లుగా మారాలని నా కోరిక. దురదృష్టవశాత్తు ఆ చట్టాలు వెలుగు చూడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవడం సంతోషం. ►ఏపీ వ్యవసాయ రంగం ‘గ్రోత్ స్టోరీ’ దేశానికి స్ఫూర్తినిస్తుంది. కేవలం పంటలే కాకుండా పశుపోషణ, ఆక్వా, ఇతర అనుబంధ రంగాల్లోనూ వృద్ధి రేటు బాగుంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 1 శాతం వృద్ధి నమోదైతే, దారిద్య్రం కనీసం 4 శాతం తగ్గుతుంది. వ్యవసాయ ఆధారిత సమాజం మనది. ఈ రంగంలో వృద్ధి అత్యవసరం. -
ఏపీలో వృద్ధి చాలా బాగుంది.. నీతి ఆయోగ్ బృందం ప్రశంసలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్, బృందం భేటీ అయ్యారు. తలసరి ఆదాయం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశుసంపద తదితర రంగాల్లో దేశసగటు కన్నా.. ఏపీలో వృద్ధి చాలా బాగుందని రమేష్ చంద్ ప్రశంసించారు. దీనికి సంబంధించిన గణాంకాలను సీఎంకు రమేష్ చంద్ వివరించారు. దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా మెరుగ్గా ఉందన్నారు. ప్రతీ రంగంలో లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్న తీరును రమేష్‌చంద్ ప్రశంసించారు. చదవండి: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు జీరోబేస్డ్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయం తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. పండ్లు, మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్ ఒన్ అన్న రమేష్ చంద్.. ఆయిల్‌పామ్ సాగుద్వారా వంటనూనెలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందని ప్రశంసించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సమగ్ర వ్యవస్థ అందుబాటులో ఉందని క్షేత్రస్థాయిలో అత్యుత్తమ వ్యవస్థ అని నీతి ఆయోగ్ సభ్యుడు కొనియాడారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో గ్రాస్ ఎన్రోల్మెంట్ దేశం సగటు కన్నా ఏపీ సగటు అధికమని రమేష్ చంద్ అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సీఎం వివరించారు. వ్యవసాయం, వైద్య, విద్య, గృహనిర్మాణ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చామని సీఎం తెలిపారు. ‘‘ఈ రంగాల్లో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. గర్భవతులు, బాలింతలు, చిన్నారులు, బడిపిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా సంపూర్ణపోషణ, గోరుముద్ద లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మహిళా సాధికారిత కోసం బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి యాభైఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెట్టామని, గ్రామ–వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వివక్షకు, అవినీతికి ఆస్కారం లేకుండా డెలివరీ మెకానిజంను సమర్థవంతంగా నడిపిస్తున్నామని’’ సీఎం పేర్కొన్నారు. డీబీటీ విధానంలో ఏపీది అగ్రస్థానమన్న సీఎం.. పిల్లలను బడికి పంపించేలా తల్లులను చైతన్యపరచడానికి అమ్మ ఒడిని అమలు చేస్తున్నామన్నారు. దీనివల్ల జీఈఆర్ పెరుగుతుందని సీఎం అన్నారు. విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామన్న సీఎం.. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా పిల్లలను తయారుచేస్తున్నామని పేర్కొన్నారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే.. ఇంగ్లిషు, నాణ్యమైన విద్య చాలా అవసరం. నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం. తరగతి గదులను డిజిటల్ ఉపకరణాలతో తీర్చిదిద్దుతున్నాం. సబ్జెక్టుల వారీగా బోధనకు టీచర్లను నియమిస్తున్నామని, ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. పూర్తి స్థాయి రీయింబర్స్ మెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అన్న సీఎం.. అలాగే వసతి దీవెన కింద కూడా ఏడాదికి రూ.20వేలు ఇస్తున్నామన్నారు. దీనివల్ల జీఈఆర్ గణనీయంగా పెరుగుతుందని సీఎం తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో , బోధనాసుపత్రుల్లో నాడు-నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నాం. ప్రతి గ్రామంలో, వార్డుల్లో కూడా విలేజ్, వార్డు క్లినిక్స్‌పెడుతున్నాం. ఆరోగ్యశ్రీకి రిఫరల్‌పాయింట్‌గా, వ్యాధుల నివారణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పీహెచ్‌సీలతో, అక్కడున్న డాక్టర్లతో అనుసంధానమవుతాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను కూడా అమల్లోకి తీసుకువస్తున్నాం. 3 వేలకు పైగా చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నాం. ప్రతిపార్లమెంటు నియోజకవర్గంలో తప్పనిసరిగా మెడికల్ కాలేజీ ఉండేలా కొత్తగా 16 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఆర్బీకేల వ్యవస్థ, సీఎం యాప్ పనితీరు తదితర అంశాలు, ఫుడ్ ప్రాససింగ్ కోసం కొత్తగా చేపడుతున్న 26 యూనిట్ల గురించి వివరించిన సీఎం.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర కార్యక్రమాలు గురించి కూడా నీతి ఆయోగ్ బృందానికి సీఎం తెలిపారు. -
ఏపీ ప్రభుత్వంపై నీతి ఆయోగ్ ప్రశంసలు
-
ఏపీపై నీతి ఆయోగ్ ప్రశంసలు
కృష్ణా జిల్లా: ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్, ఏపీ వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య. ఈ సందర్భంగా మాట్లాడిన రమేష్ చంద్.. వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందిందన్నారు. రైతుల కోసం ఆర్బీకేలు ఏర్పాటు చేయటం చాలా గొప్ప విషయమని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఆర్బీకేల ఏర్పాటు, వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై మాట్లాడారు. ‘ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆర్బీకేలు దేశానికే ఆదర్శం. వాటి ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఆర్బీకేలు అమలు చేయాలని కేంద్రానికి సూచిస్తాం.’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘చంద్రబాబు ప్రచారం కోసం పాకులాడతారు’ -
అలా చేస్తేనే రైతుల ఆదాయం రెట్టింపు
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంస్కరణలు ఎంతో అవసరమని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ అభిప్రాయపడ్డారు. మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అన్నది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి ఎదురుదెబ్బగా పేర్కొన్నారు. సాగు చట్టాల వల్ల రైతులకు అధిక ధర లభించేదని.. వారి ఆదాయం రెట్టింపు చేయాలన్నది సాకారం అయ్యేదని పేర్కొన్నారు. వ్యవసాయ సంస్కరణలపై రాష్ట్రాలతో సంప్రదింపులను తిరిగి ప్రారంభించాలని సూచించారు. సంస్కరణలు కోరుతూ కొందరు నీతి ఆయోగ్‌ను సంప్రదించినట్టు చెప్పారు. అయితే ఏ రూపంలో సాగు సంస్కరణలు ఉంటాయన్నది తెలుసుకునేందుకు కొంత సమయం వేచి చూడాలన్నారు. ‘‘సాగు రంగానికి సంస్కరణలు ఎంతో ముఖ్యం. కొందరు రైతులు సాగు చట్టాలను వ్యతిరేకించారు. రాష్ట్రాలతో తాజా సంప్రదింపులు మొదలు పెట్టడమే దీనికి పరిష్కారం’’అని రమేష్ చంద్ పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్నది మోదీ సర్కారు లక్ష్యం. దీనిపై ఎదురైన ప్రశ్నకు రమేష్ చంద్ స్పందిస్తూ.. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించాలంటే సంస్కరణలు శరణమ్యమని చెప్పారు. చదవండి: ఎకానమీకి ‘యుద్ధం’ సెగ! -
లాక్‌డౌన్‌తో రైతులకు నష్టం వాటిల్లదు: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలంలో ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల వల్ల ఎటువంటి దుష్పరిణామాలకు గురికాకుండా రైతాంగాన్ని కాపాడగలిగామని నీతిఆయోగ్ సభ్యులు రమేష్ చంద్ అన్నారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయరంగంలో మూడుశాతం అభివృద్ధిని సాధించగలిగామని ఆయన వెల్లడించారు. ఈ లాక్డౌన్ కాలంలో రైతుల మార్కెట్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా మార్కెట్లు సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. రైతుల వ్యవసాయపనులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదనీ, కేంద్ర మార్గదర్శకాలను పాటించిన రాష్ట్రాల్లో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర భారతంలో మరోవారంలో రబీ సీజన్లో ప్రధాన పంట అయిన గోధుమ దిగుబడి చేతికి వస్తుందనీ, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ ప్రభుత్వం చేపట్టినట్టు ఆయన తెలిపారు. భారత దేశంలోని రేషన్ కార్డుకలిగిన 80 కోట్లమంది పేద ప్రజలు ప్రతినెలా ఐదుకేజీల గోధుమ లేదా బియ్యం, ఒక కేజీ పప్పులు 3 నెలల పాటు పొందుతారని ఆయన అన్నారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలున్న 20.4 కోట్ల మహిళలకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలల్లో రూ. 1,500 జమవుతాయని ఆయన అన్నారు. -
విమానంలో బయటకు చెప్పలేని విధంగా..
న్యూఢిల్లీ: తన వయసును కూడా మరిచిపోయి ఓ 56 ఏళ్ల వ్యక్తి అసభ్యతకు దిగాడు. ఇండిగో విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో శనివారం చోటు చేసుకుంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరే ఇండిగో విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఆమెను తాకేందుకు ప్రయత్నించడంతోపాటు బయటకు చెప్పలేని విధంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే ఎయిర్హోస్టేస్ను పిలిచి తన సీటును మార్పించుకుంది. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే సిబ్బందికి ఫిర్యాదుచేయగా అతడిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని రోహిణీ ప్రాంత నివాసి అయిన రమేశ్ చంద్గా గుర్తించారు.