విమానంలో బయటకు చెప్పలేని విధంగా..
న్యూఢిల్లీ: తన వయసును కూడా మరిచిపోయి ఓ 56 ఏళ్ల వ్యక్తి అసభ్యతకు దిగాడు. ఇండిగో విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో శనివారం చోటు చేసుకుంది.
పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరే ఇండిగో విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఆమెను తాకేందుకు ప్రయత్నించడంతోపాటు బయటకు చెప్పలేని విధంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే ఎయిర్‌హోస్టేస్‌ను పిలిచి తన సీటును మార్పించుకుంది. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే సిబ్బందికి ఫిర్యాదుచేయగా అతడిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని రోహిణీ ప్రాంత నివాసి అయిన రమేశ్ చంద్‌గా గుర్తించారు.