కృష్ణా జిల్లా: ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్, ఏపీ వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య. ఈ సందర్భంగా మాట్లాడిన రమేష్ చంద్.. వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందిందన్నారు. రైతుల కోసం ఆర్‌బీకేలు ఏర్పాటు చేయటం చాలా గొప్ప విషయమని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
ఆర్‌బీకేల ఏర్పాటు, వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై మాట్లాడారు. ‘ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆర్‌బీకేలు దేశానికే ఆదర్శం. వాటి ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఆర్‌బీకేలు అమలు చేయాలని కేంద్రానికి సూచిస్తాం.’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘చంద్రబాబు ప్రచారం కోసం పాకులాడతారు’
Comments
Please login to add a commentAdd a comment