
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 సెప్టెంబర్‌లో అసలు పెరక్కపోగా (2022 ఇదే నెలతో పోల్చి) మైనస్ (–) 0.26 శాతంగా నమోదయ్యింది. టోకు ధరల సూచీ మైనస్‌లోనే కొనసాగడం ఇది వరుసగా ఆరవ నెల. ఏప్రిల్ నుంచీ నెలకొన్న ఈ తరహా ధోరణిని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు.
ఎందుకంటే..: ప్రతి ద్రవ్యోల్బణానికి రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, మినరల్ ఆయిల్స్, టెక్స్‌టైల్స్, బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ ధరలు తాజా సమీక్షా నెల్లో (2022 సెప్టెంబర్ ధరలతో పోలి్చతే) తగ్గడమే కారణమని వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
విభాగాల వారీగా చూస్తే...
ఫుడ్ ఆరి్టకల్స్: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 3.35 శాతానికి తగ్గింది. అంతక్రితం రెండు నెలలూ ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగింది. ఆగస్టులో 10.60 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల్లో కూరగాయల ధరలు 15 శాతం తగ్గాయి. ఆగస్టులో వీటి పెరుగుదల రేటు 48.39 శాతంగా ఉంది. ఆలూ ధరలు 25.24 శాతం తగ్గాయి. అయితే పప్పులు (17.69%), ఉల్లి (55.05%) ధరలు సెప్టెంబర్‌లో పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.02 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.
ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ రంగంలో ప్రతి ద్రవ్యోల్బణం 3.35 శాతంగా ఉంది.
తయారీ: మొత్తం సూచీలో మెజారిటీ వాటా గత ఈ రంగంలో ధరల తగ్గుదల 1.35%గా నమోదైంది.
ఇక పెరిగే అవకాశం..
సెప్టెంబర్ వరకూ టోకు ధరల సూచీలో తగ్గుదల నమోదయినప్పటికీ, ఇకపై పెరిగే అవకాశమే
ఉందన్నది నిపుణుల వాదన. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలు, వర్షాభావం ఖరీఫ్ పంటపై అనిశ్చితి ధోరణి ఇందుకు కారణం కావచ్చని కేర్‌ఎడ్జ్ చీఫ్ ఎకనమిస్ట్ రజనీ సిన్హా పేర్కొన్నారు.