న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెలలోనూ ఎగువబాటనే కొనసాగింది. ఏడు నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర స్థాయిలో 0.73 శాతంగా (2022 డిసెంబర్‌తో పోల్చి) నమోదయ్యింది. 2023 మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 1.41 శాతం ఎగసింది. అటు తర్వాత ఈ స్థాయిలో పెరుగుదల ఇదే తొలిసారి. ఆహార, కూరగాయల ధరలు సహా పలు విభాగాల్లో ధరల తీవ్రత తాజా టోకు ద్రవ్యోల్బణం తీవ్రతకు ప్రధాన కారణం.
2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ద్రవ్యోల్బణం మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో కొనసాగింది. నవంబర్‌లో ‘యూటర్న్’ తీసుకుని 0.26 శాతంగా నమోదయ్యింది. తాజా సమీక్షా నెల డిసెంబర్‌లో మరింత పెరిగి 0.73 శాతానికి ఎగసింది. ఒక్క ఆహార ద్రవ్యోల్బణాన్ని చూస్తే, నవంబర్‌లో ఈ రేటు 8.18 శాతం ఉంటే, డిసెంబర్‌లో 9.38 శాతానికి ఎగసింది. కూరగాయల విషయంలో ద్రవ్యోల్బణం భారీగా 26.30 శాతం పెరగ్గా, పప్పు ధాన్యాల ధరలు 19.60 శాతం పెరిగాయి. 2023 ఆగస్టు నుంచి ఈ నిత్యావసర వస్తువల ధర రెండంకెలపైన కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment