rise
-
దేశంలో పెరిగిన ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టం
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) శుభవార్త చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశంలోని ప్రధాన జలాశయాల నీటిమట్టం తొలిసారిగా పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. అయితే స్వల్పంగానే నీటిమట్టం పెరగడంతో జలమండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది.భారతదేశంలోని 150 రిజర్వాయర్లను పర్యవేక్షించే సీడబ్ల్యూసీ తాజా సమాచారాన్ని మీడియాకు వెల్లడించింది. 150 రిజర్వాయర్లలో 20 జలవిద్యుత్ ప్రాజెక్టులకు ఉపయుక్తమవుతున్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 35.30 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం. గత సంవత్సరం ఇదే కాలంలో అందుబాటులో ఉన్న నిల్వ 44.06 బీసీఎం. సాధారణ నిల్వ స్థాయి 50.422 బీసీఎం. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో మొత్తం 19.663 బీసీఎం నిల్వ సామర్థ్యంతో 10 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవి సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఉన్నాయి.అసోం, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, బీహార్‌లతో సహా తూర్పు ప్రాంతంలో 23 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 20.430 బీసీఎం. ప్రస్తుత నిల్వ 3.979 బీసీఎం (19 శాతం). ఇది గత సంవత్సరం కంటే 20 శాతం తక్కువ. గుజరాత్, మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో 49 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 37.130 బీసీఎం. ప్రస్తుతం నిల్వ 7.949 బీసీఎం (21 శాతం). గత సంవత్సరం ఇది 27 శాతం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా మధ్య ప్రాంతంలో 26 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో 48.227 బీసీఎం నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుత నిల్వ 12.26 బీసీఎం(25 శాతం). గత సంవత్సరం ఇది 35 శాతం.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో సహా దక్షిణ ప్రాంతంలో 42 రిజర్వాయర్లు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం 53.334 బీసీఎం. నిల్వ ఇప్పుడు 10.152 బీసీఎం (19.03 శాతం) వద్ద ఉంది. గత సంవత్సరం 19.43 శాతం. తాద్రీ నుంచి కన్యాకుమారి వరకు బ్రహ్మపుత్ర, సబర్మతి, పశ్చిమాన ప్రవహించే నదులలో సాధారణ నీటి నిల్వ కంటే మెరుగ్గా ఉన్నాయి. సింధు, సువర్ణరేఖ, మహి తదితర నదుల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయికి చేరువలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహానది, కావేరి, బ్రాహ్మణి, వైతరణి నదులో తక్కువ నీటి నిల్వలు నమోదయ్యాయి. -
నిత్యావసరాల ధరల మంట
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెలలోనూ ఎగువబాటనే కొనసాగింది. ఏడు నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర స్థాయిలో 0.73 శాతంగా (2022 డిసెంబర్‌తో పోల్చి) నమోదయ్యింది. 2023 మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 1.41 శాతం ఎగసింది. అటు తర్వాత ఈ స్థాయిలో పెరుగుదల ఇదే తొలిసారి. ఆహార, కూరగాయల ధరలు సహా పలు విభాగాల్లో ధరల తీవ్రత తాజా టోకు ద్రవ్యోల్బణం తీవ్రతకు ప్రధాన కారణం. 2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ద్రవ్యోల్బణం మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో కొనసాగింది. నవంబర్‌లో ‘యూటర్న్’ తీసుకుని 0.26 శాతంగా నమోదయ్యింది. తాజా సమీక్షా నెల డిసెంబర్లో మరింత పెరిగి 0.73 శాతానికి ఎగసింది. ఒక్క ఆహార ద్రవ్యోల్బణాన్ని చూస్తే, నవంబర్‌లో ఈ రేటు 8.18 శాతం ఉంటే, డిసెంబర్లో 9.38 శాతానికి ఎగసింది. కూరగాయల విషయంలో ద్రవ్యోల్బణం భారీగా 26.30 శాతం పెరగ్గా, పప్పు ధాన్యాల ధరలు 19.60 శాతం పెరిగాయి. 2023 ఆగస్టు నుంచి ఈ నిత్యావసర వస్తువల ధర రెండంకెలపైన కొనసాగుతోంది. -
సామాన్యులపై మరో పిడుగు: ముడిచమురుపై భారీగా టాక్స్ పెంపు
Windfall Tax on Crude oil భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులకు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ టాక్స్‌ను భారీగా పెంచింది. టన్నుకు రూ.6,700 నుంచి రూ.10,000కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. సవరించిన ధరలు నేటి (సెప్టెంబర్ 16)నుంచే అమల్లో ఉంటాయి. తాజా నిర్ణయంతో ఇప్పటికే పెట్రో భారంతో అతలాకుతమవుతున్న సామాన్యులపై మరింత భారం పెరగనుంది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF)పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) లీటర్‌కు 4 రూపాయల నుండి 3.50 రూపాయలకు ప్రభుత్వం తగ్గించింది. అలాగే డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటరుకు రూ.6 నుంచి రూ.5.5కు తగ్గిస్తున్నట్లుకేంద్రం ప్రకటించింది. పెట్రోల్ ఎగుమతిపై SAED సున్నాగా కొనసాగుతుంది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి పన్ను రేట్లు సమీక్ష ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న జరిగిన పక్షంవారీ సమీక్షలో ప్రభుత్వం ముడి పెట్రోలియంపై టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించింది. భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ పన్నును గత ఏడాది జూలైలో మొదటిసారిగా విధించారు. అలాగే సెప్టెంబర్ 1న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించిన సంగతి తెలిసిందే.మరోవైపు చమురు ధరలు 10 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. -
కేరళలో మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్.. ఆరుకి చేరిన నిఫా కేసులు
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరోకేసు వెలుగులోకి వచ్చింది. 39 ఏళ్ల మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో నిఫా వైరస్ బారిన పడినవారి సంఖ్య ఆరుకు చేరింది. వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా.. వైరస్ వ్యాప్తితో శుక్రవారం ప్రార్థనలు బంద్ చేశారు. వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండటంతో కాంటాక్ట్ లిస్ట్ కూడా క్రమంగా హెచ్చవుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 950 మంది కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండగా.. 213 మంది అధిక ముప్పు ఉన్న జాబితాలో ఉన్నారు. కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారిలో 287 మంది హెల్త్ వర్కర్లే కావడం గమనార్హం. అధిక ముప్పులో ఉన్న 15 మంది షాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. కంటెయిన్మెంట్ జోన్లో ఏడు గ్రామాలు.. నిఫా వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు బంద్.. నిఫా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. కంటెయిన్మెంట్ జోన్లో ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామశాఖ ఆఫీస్‌లు తక్కువ స్టాఫ్‌తో నడపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసివేయాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చెప్పారు. అప్రమత్తమైన కేంద్రం.. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలను కేరళకు పంపించింది. కోజికోడ్ మెడికల్ కాలేజీలో సంచార ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పందులు, గద్దల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేయనున్నారు. బంగ్లాదేశ్ వేరియంట్.. ఇప్పటివరకు రాష్ట్రంలో నిఫా వైరస్ పట్ల భయపడాల్సిన పనిలేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్‌గా పేర్కొన్న ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో అలర్ట్.. కేరళలో నిఫా వైరస్ పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. సరిహద్దు జిల్లాల్లో ఫీవర్ సర్వెలెన్స్ వంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అనుమానిత కేసులకు ఆస్పత్రుల్లో పడకలు సిద్ధం చేయడం సహా వైద్యులకు శిక్షణ తరహా చర్యలు చేపడుతోంది. ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడగలను: సింథియా -
90 డాలర్ల ఎగువకు చేరిన బ్యారెల్ చమురు ధర
-
వంట నూనెల ధరలు తగ్గాయి.. దిగుమతులు భారీగా పెరిగాయి!
న్యూఢిల్లీ: వెజిటబుల్ నూనెల దిగుమతులు జూలై నెలలో భారీగా పెరిగిపోయాయి. 17.71 లక్షల టన్నుల మేర దిగుమతులు నమోదైనట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. 2022 జూలై నెలలో నమోదైన 12.14 లక్షల టన్నుల దిగుమతులతో పోలిస్తే 46 శాతం పెరిగినట్టు తెలిపింది. 2022–23లో తొలి తొమ్మిది నెలల సీజన్లో (నవంబర్–అక్టోబర్) దిగుమతులు 23 శాతం పెరిగి 122.54 లక్షల టన్నులుగా ఉన్నట్టు పేర్కొంది. వెజిటబుల్ నూనెల్లో వంటకు వినియోగించేవే కాకుండా, వంటకు వినియోగించనివి (ఆహార పదార్థాల్లో వినియోగానికి) కూడా ఉంటాయి. ఇక ఈ ఏడాది జూలైలో వంట నూనెల దిగుమతుల వరకే చూస్తే 46 శాతం పెరిగి 17.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 12.05 లక్షల టన్నుల మేర దిగుమతి అయ్యాయి. ఇతర నూనెల దిగుమతులు 9,069 టన్నుల నుంచి 15,999 టన్నులకు పెరిగాయి. దేశీయంగా వంట నూనెల ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్ తిరిగి పెరిగినట్టు ఎస్ఈఏ తెలిపింది. దేశంలో 45 రోజుల వినియోగానికి సరిపడా వంట నూనెల నిల్వలు ఉన్నాయని, పండుగల రోజుల్లో నూనెల సరఫరా మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. పామాయిల్‌ను ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుండగా, అర్జెంటీనా నుంచి సోయాబీన్ ఆయిల్ దిగుమతి అవుతోంది. సన్‌ఫ్లవర్ నూనె ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తోంది. -
స్టేషన్ల అభివృద్ధి పేరిట.. రైల్వే ఛార్జీలు పెంచనున్నారా..?
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్దరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పనుల కోసం రైల్వే ఛార్జీల ధరలు పెంచుతారనే ఊహాగానాలు పట్టాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల నీవకరణకు కావాల్సిన నిధుల కోసం టికెట్టు ధరలు పెంచుతారనే అనుమానాలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రైల్వే ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు కావాల్సిన రూ.25 వేల కోట్లను బడ్జెట్ నుంచే కాటాయించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రాజెక్టు పేరుతో ఛార్జీలను పెంచడం జరగదని వెల్లడించారు. రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచస్థాయి స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. స్టేషన్ల అభివృద్ధిలో ఏ రాష్ట్రంలో వివక్ష చూపలేదని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు ఫలితాలను ప్రజలు చూడబోతున్నారని చెప్పారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
పెరిగిన ఇళ్ల ధరలు.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయి..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6–10 శాతం పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 10 శాతం పెరిగి చదరపు అడుగు రూ.4,980గా ఉంది. ఏడు పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు 36 శాతం అధికంగా 1,15,100 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 84,940 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘ఈ ఏడాది ఆరంభంలో గృహ రుణాల రేట్ల పెంపు ప్రభావం, అంతర్జాతీయ ఆర్థిక సమస్యల ప్రభావం ఇంకా హౌసింగ్ మార్కెట్‌పై పడలేదు. 2023 ద్వితీయ ఆరు నెలల కాలంలోనూ అమ్మకాల డిమాండ్ బలంగానే ఉంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి వెల్లడించారు. హైదరాబాద్‌లో అమ్మకాలు 13,570 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 11,190 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరిగాయి. జూన్ త్రైమాసికంలో పుణె పట్టణంలో ఇళ్ల అమ్మకాలు 65 శాతం పెరిగి 20,680 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 12,500 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో అమ్మకాలు కేవలం 7 శాతం పెరిగాయి. ఒకే అంకె అమ్మకాల వృద్ధిని చూసిన పట్టణం ఇదొక్కటే. ఇక్కడ 16,450 యూనిట్లు విక్రయమయ్యాయి. కోల్‌కతా మార్కెట్లో 20 శాతం వృద్ధితో అమ్మకాలు 5,780 యూనిట్లుగా ఉన్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 48 శాతం అధికంగా 38,090 యూనిట్లు అమ్ముడయ్యాయి. బెంగళూరులో 15,050 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 31 శాతం వృద్ధి నమోదైంది. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 44 శాతం పెరిగాయి. 5,490 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడు పట్టణాల్లో నూతన ఇళ్ల నిర్మాణం వార్షికంగా 25 శాతం పెరిగి 1,02,620 యూనిట్లుగా ఉంది. అమ్మకాలు బలంగా ఉండడంతో ఏడు పట్టణాల్లో ఇళ్ల నిల్వలు 2 శాతం తగ్గి 6.14 లక్షల యూనిట్లుగా జూన్ చివరికి ఉన్నాయి. -
అదానీ పోర్ట్స్ లాభం ఫ్లాట్.. 30 శాతం పెరిగిన మొత్తం ఆదాయం
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీసెజ్) గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 1,141 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,112 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం మరింత అధికంగా 30 శాతం వృద్ధితో రూ. 6,179 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 4,739 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,497 కోట్ల నుంచి రూ. 3,994 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదికి సైతం మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఏపీసెజ్ దాదాపు 9 శాతం అధికంగా రూ. 5,393 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2021–22లో రూ. 4,953 కోట్ల లాభం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 734 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్మిషన్ లాభం జూమ్ అదానీ ట్రాన్స్మిషన్ చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 85 శాతం దూసుకెళ్లి రూ. 440 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 237 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 3,165 కోట్ల నుంచి రూ. 3,495 కోట్లకు ఎగసింది. నికర లాభాల్లో ట్రాన్స్మిషన్ విభాగం నుంచి 11 శాతం వృద్ధితో రూ. 221 కోట్లు లభించగా.. పంపిణీ విభాగం వాటా 478 శాతం జంప్‌చేసి రూ. 218 కోట్లకు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అదానీ ట్రాన్స్మిషన్ నికర లాభం రూ. 1,281 కోట్లకు స్వల్పంగా బలపడింది. 2021–22లో రూ. 1,236 కోట్ల లాభం ప్రకటించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 11,861 కోట్ల నుంచి రూ. 13,840 కోట్లకు జంప్ చేసింది. ఫలితాల నేపథ్యంలో అదానీ ట్రాన్స్మిషన్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం పతనమై రూ. 810 వద్ద ముగిసింది. -
4 రోజుల్లో 1,200 పాయింట్లు ప్లస్
ముంబై: ఆటుపోట్ల మధ్య వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 123 పాయింట్ల వృద్ధితో 62,969కు చేరింది. నిఫ్టీ 35 పాయింట్లు బలపడి 18,634 వద్ద ముగిసింది. అమెరికా రుణ పరిమితి పెంపు డీల్ ఓకే కావడంతో ఇన్వెస్టర్లకు జోష్ వచ్చినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,195 పాయింట్లు జమ చేసుకోగా.. నిఫ్టీ 348 పాయింట్లు పురోగమించింది. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్ 63,036 వద్ద గరిష్టాన్ని, 62,737 వద్ద కనిష్టాన్ని తాకింది. దీంతో వరుసగా రెండో రోజు 63,000 స్థాయిని అధిగమించింది. ఇక నిఫ్టీ 18,622– 18,576 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఎన్ఎస్ఈలో మీడియా, ఎఫ్ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.6 శాతం చొప్పున పుంజుకోగా.. ప్రధానంగా మెటల్ ఇండెక్స్ 1 శాతం క్షీణించింది. బ్యాంక్ నిఫ్టీ ఏడాది గరిష్టానికి చేరింది. -
ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్.. ఎంతకు చేరాయంటే..
ముంబై: భారత్ ఫారెక్స్ నిల్వలు ఏప్రిల్ 14వ తేదీతో ముగిసిన వారంలో 1.657 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీనితో ఈ నిల్వల పరిమాణం మొత్తం 586.412 బిలియన్ డాలర్లకు చేరింది. అంతక్రితం వారమూ (ఏప్రిల్ 7తో ముగిసిన) విదేశీ మారక నిల్వలు భారీగా 6.306 బిలియన్ డాలర్లు ఎగశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఊరట.. ఆ విషయాల్లో ఉపశమనం కల్పించిన ఆర్బీఐ 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా చూసే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ భారీగా డాలర్లు వ్యయం చేయడంతో గరిష్ట స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లుకుపైగా పడిపోయాయి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
కరోనా తరువాత లాభాల్లోకి విమానాశ్రయాలు
-
ఈవీల జోరు.. అమ్మకాల హుషారు!
సాక్షి, అమరావతి: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) జోరందుకుంటుండగా.. అమ్మకాలు సైతం హుషారెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలో ఉండటం, ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ వ్యయం తక్కువ అవుతుండటంతో యువత ఈవీల వైపు చూస్తున్నారు. ఫలితంగా.. ఆరు నెలలుగా వీటి అమ్మకాల జోరు పెరుగుతోంది. దేశంలో తొలిసారిగా ఒక ఆర్థిక ఏడాదిలో 10 లక్షలకు పైగా వాహనాల అమ్మకాలతో ఎలక్ట్రిక్ వాహన రంగం సరికొత్త రికార్డును సృష్టించింది. (కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ.. అమల్లోకి కొత్త ధరలు) 2022–23లో దేశవ్యాప్తంగా 11,71,944 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్టు వాహన్ డేటా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021–22లో అమ్ముడైన 4,58,746 యూనిట్లతో పోలిస్తే అమ్మకాల్లో 155 శాతం వృద్ధి నమోదైంది. గడచిన ఆరు నెలలుగా ప్రతినెలా లక్షకు పైగా వాహనాలు అమ్ముడవుతున్నాయంటే డిమాండ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తు్తతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 22,67,042కు చేరింది. రాష్ట్రంలో ఈవీల సంఖ్య 54,918కు చేరింది. టూ.. త్రీ వీలర్స్‌కే డిమాండ్ అధికం ప్రస్తుతం అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటానే అత్యధికంగా ఉంటోంది. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ద్విచక్ర వాహన అమ్మకాలు 61.5 శాతం ఉంటే, త్రిచక్ర వాహనాల వాటా 34 శాతంగా ఉంది. ద్విచక్ర వాహన రంగంలోకి ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశంతో ఒక్కసారిగా అమ్మకాలు భారీగా పెరిగాయి. 2021–22తో పోలిస్తే 185 శాతం వృద్ధితో 7,20,733 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. (ఫండ్స్ లాభాలపై పన్ను ఉంటుందా.. ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలా?) ఇందులో ఒక్క ఓలా ఎలక్ట్రిక్ 1,54,344 వాహనాలు అమ్మడం ద్వారా 21 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఓకినావా ఆటో టెక్ 94,133, హీరో ఎలక్ట్రిక్ 89,165 నిలిచాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలకు వస్తే 2022–23లో మొత్తం 3,99,540 యూనిట్లు సేల్ అయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 39,544 ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జరిగితే.. అందులో 31,203 కేవలం టాటా మోటర్స్ నుంచే జరగ్గా, 4,412 యూనిట్లు ఎంజీ మోటార్స్ నుంచి జరిగాయి. రాష్ట్రంలోని కియా మోటర్స్ 311 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. (ICICI Pru Gold: అదనపు రాబడికి బంగారం లాంటి పథకం..) -
రూ. 2.85 లక్షల కోట్లకు మైక్రోఫైనాన్స్ రుణాలు
ముంబై: దశాబ్దం క్రితం రూ. 16 వేల కోట్లుగా ఉన్న సూక్ష్మ రుణాల వ్యాపార పరిమాణం గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 2.85 లక్షల కోట్లకు చేరింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్-ఎంఎఫ్ఐలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, బ్యాంకులు మొదలైన దాదాపు 100 సంస్థలు ఈ రుణాలు ఇస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈ మార్కెట్ పరిమాణం రూ. 17 లక్షల కోట్లకు చేరగలదని పరిశ్రమ వర్గాలు రూపొందించిన నివేదికలో వెల్లడైంది. మైక్రోఫైనాన్స్ సంస్థల నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) సీఈవో అలోక్ మిశ్రా ఈ విషయాలు తెలిపారు. సగటు రుణ పరిమాణం, కాల వ్యవధులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం నాలుగింట మూడొంతుల రుణాల కాల వ్యవధి 18 నెలలకు పైగా ఉంటోందన్నారు. ఈ రంగం దాదాపు 1.6 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తోందని మిశ్రా వివరించారు. ఎక్కువగా రుణ కార్యకలాపాలు టాప్ 300 జిల్లాలకు మాత్రమే పరిమితమవుతున్నాయని, వీటిని మరింతగా విస్తరించాల్సి ఉందని చెప్పారు. మరోవైపు, రెండేళ్ల కోవిడ్ దెబ్బతో మైక్రోఫైనాన్స్ సంస్థలు 5–10 శాతం వరకూ నష్ట పోయాయని పేర్కొన్నారు. అయితే, కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో మొండిబాకీల రికవరీ క్రమంగా మెరుగుపడుతోందని మిశ్రా చెప్పారు. 30 రోజులకు పైబడిన బకాయిలు .. సెకండ్ వేవ్ కారణంగా గతేడాది మధ్యలో 22 శాతానికి ఎగియగా ఈ ఏడాది జూలైలో 10-11 శాతానికి దిగివచ్చాయని వివరించారు. -
డిపాజిట్ రేట్లకు త్వరలో రెక్కలు
ముంబై: రుణాలకు పెరుగుతున్న డిమాండ్, వడ్డీ రేట్ల పెరుగుదల క్రమం నేపథ్యంలో రానున్న నెలల్లో బ్యాంకులు డిపాజిట్లపై రేట్లను పెంచక తప్పదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. డిపాజిట్ రేట్ల పెరుగుదలకు సంకేతంగా, బ్యాంకులు అధికంగా నిధులు సమీకరించే మార్గమైన సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీలు) రేట్లు క్రమంగా పెరుగుతుండడం, ఇప్పటికే కొన్నేళ్ల గరిష్టానికి చేరుకోవడాన్ని ఇక్రా గుర్తు చేసింది. బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో సీడీలు 2022 జూలై 1 నాటికి 1.5 శాతంగా ఉన్నాయి. అయితే, 2011 జూన్ నాటి గరిష్ట స్థాయి 8.3 శాతాన్ని చేరుకోవాల్సి ఉందని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. రుణాలకు డిమాండ్ పెరుగుతుండడంతో బ్యాంకులు తాజా నిధుల కోసం సీడీలపై ఆధారపడడం పెరుగుతున్నట్టు వివరించింది. ఆర్బీఐ ఇప్పటికే రెండు విడతల్లో 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో రుణాలపై, డిపాజిట్లపై తిరిగి రేట్ల పెరుగుదల ఆరంభమైంది. -
రియల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకే ఎక్కువ పెట్టుబడులు
ముంబై: దేశీయంగా గత నెలలో పీఈ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు 2021 మే నెలతో చూస్తే 42 శాతం ఎగసి 5.3 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 7.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే 29 శాతం క్షీణించాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం డీల్ పరిమాణం భారీగా పెరిగింది. గతేడాది మేలో నమోదైన 66 నుంచి 109కు డీల్స్ సంఖ్య ఎగసింది. ఈ ఏప్రిల్‌లో మాత్రం ఇంతకంటే అధికంగా 117 లావాదేవీలు జరిగాయి. 2022 మే నెలలో ప్రధానంగా రియల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు అధిక పెట్టుబడులను సాధించాయి. 1.7 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్స్ నమోదయ్యాయి. ఇక 10 కోట్ల డాలర్ల విలువైన 14 భారీ డీల్స్ సైతం మే నెలలో జరిగాయి. వీటి మొత్తం విలువ 3.9 బిలియన్ డాలర్లుకాగా.. అపోలో గ్లోబల్ నుంచి అదానీ గ్రూప్ నిర్వహణలోని ముంబై ఎయిర్పోర్ట్ సమీకరించిన 75 కోట్ల డాలర్లు వీటిలో కలసి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. -
నానాటికీ పెరిగిపోతున్న ‘ట్రాఫిక్ కేసులు’.. కనిపించకుండానే చలాన్ పడిపోద్ది!
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ ఉల్లంఘనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు లక్షల్లో, మృతులు వేల సంఖ్యలో ఉండటానికీ ఇవే ప్రధాన కారణం. ఈ ఉల్లంఘనల్ని తగ్గించడానికి ప్రయత్నించాల్సిన యంత్రాంగాలు ఏటా పెరిగిపోతున్నా పట్టించుకోవట్లేదు. పైగా అదేదో ఘనతగా ఆర్భాటంగా ప్రకటిస్తున్నాయి. 2018లో 1.02 కోట్లుగా ఉన్న ట్రాఫిక్ వయెలేషన్స్ గత ఏడాది నాటికి 2.33 కోట్లకు చేరింది. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా ఇక్కడా వీటిని ఆదాయ వనరుగా చూడటంతోనే ఈ పరిస్థితి దాపురించిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలియకుండా తడిసిమోపెడు... ►ట్రాఫిక్ విభాగం అధికారులు నమోదు చేస్తున్న ఉల్లంఘనల కేసుల్లో అత్యధికం హెల్మెట్ కేసులే ఉంటున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు కేవలం వాహన చోదకుడు హెల్మెట్ ధరించకపోతేనే ఈ– చలాన్ జారీ చేసే వారు. ఇటీవల కాలంలో వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) హెల్మెట్ ధరించకపోయినా చలాన్ జారీ చేస్తున్నారు. మరోపక్క వాహనచోదకులు హాఫ్ హెల్మెట్ ధరించినా జరిమానా తప్పట్లేదు. ఒకటి రెండుసార్లు అనుభవంలోకి వస్తే తప్ప ఈ విషయం వాహనచోదకులకు అర్థం కావట్లేదు. ఇలాంటి సున్నితాంశాలపై అవగాహన కల్పించాల్సిన పోలీసులు ఆ విషయం మర్చిపోతున్నారు. అదేమని ప్రశ్నిస్తే మోటారు వాహనాల చట్టంలో (ఎంవీ యాక్ట్) ఉన్న నిబంధనల్నే తాము అమలు చేస్తున్నామని తప్పించుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల లెక్కలో డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తీ ఎంవీ యాక్ట్‌లో నిష్ణాతుడి కిందికే వస్తుండటం గమనార్హం. కనిపించకుండా బాదేస్తున్నారు.. ►ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు కేవలం కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించే వారు. దీని ప్రకారం రోడ్డు మీద ఉల్లంఘనుడిని ఆపి చలాన్లు జారీ చేసేవారు. ఇటీవల కాలంలో 95 శాతం నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతోంది. రహదారులపై సంచరిస్తున్న ట్రాఫిక్ ఉల్లంఘనుల ఫొటోలను వివిధ మార్గాల్లో సేకరిస్తున్న పోలీసులు ఈ– చలాన్లు జారీ చేస్తున్నారు. దాదాపు ఎక్కడా కనిపించకుండా జరిమానా విధించేస్తున్నారు. ►వాహన చోదకుల్లో అనేక మంది పోలీసులు కనిపించినప్పుడు మాత్రమే నిబంధనలు పాటిస్తుంటారు. నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో వాళ్లు కనిపించే అవకాశం లేకపోవడంతో అడ్డంగా బుక్కవుతున్నారు. నగరంలో సంచరించే ద్విచక్ర వాహన చోదకుల్లో దాదాపు 90 శాతం మంది వద్ద హెల్మెట్లు ఉంటాయి. వీళ్లలో చాలా మంది వాటిని వాహనానికో, పెట్రోల్ ట్యాంక్ మీదో ఉంచుతారు. చౌరస్తాలకు సమీపంలోనో, ట్రాఫిక్ పోలీసులు ఉన్న చోటో మాత్రమే తీసి తలకు పెట్టుకుంటారు. ఇలాంటి నిర్లక్ష్యాలకు పాల్పడే వాళ్లూ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో బుక్కైపోతున్నారు. ►రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించడమనే విదేశాల్లోనూ ఉంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఈ ఆదాయమే పోలీసులకు జీతంగా వస్తుంటుంది. ఆయా చోట్ల పోలీసు విభాగాలు ప్రభుత్వంలో భాగంగా కాకుండా, మున్సిపల్ కార్పొరేషన్లలో అంతర్భాగంగా పని చేస్తాయి. మేయర్ ఆధీనంలో ఉండే వీరికి జీతాలను ఆయా కార్పొరేషన్లే చెల్లిస్తుంటాయి. ఈ కారణంగానే ఆయా పోలీసు విభాగాలు ప్రతి నెలా కనీసం తమ జీతాలకు సరిపడా అయినా జరిమానాల రూపంలో వసూలు చేసి మున్సిపల్ కార్పొరేషన్ల ఖజానాకు చేర్చాల్సి ఉంటుంది. నగరంలో పరిస్థితులు అలా ఉండవు. పోలీసులు ప్రభుత్వంలో భాగంగా పని చేస్తుంటారు. వీరికి జీతాలు సర్కారు ఖజానా నుంచి వస్తాయి. అయినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం జరిమానాలు విధించడానికి ఆసక్తి చూపుతుంటారు. తగ్గితేనే విజయం సాధించినట్లు ప్రతి ఏటా తాము గతేడాది కంటే ఇన్ని వేల, లక్షల చలాన్లు ఎక్కువగా విధించామంటూ పోలీసులే ప్రకటిస్తుంటారు. ప్రాక్టికల్‌గా చూస్తే ఏటా ఉల్లంఘనుల సంఖ్య తగ్గించడం ద్వారా ప్రమాదాలు నిరోధిస్తేనే పోలీసులు విజయం సాధించినట్లు. ఈ అంశంలో నిర్దిష్టమైన ప్రణాళిక కొరవడింది. అవగాహన పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ ఆర్భాటాలకు, ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. ఒకటో తరగతి నుంచీ ట్రాఫిక్ పాఠాలు నేర్పాలనే ప్రతిపాదన ఏళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయింది. ఇలాంటి చర్యల వల్లే ప్రతి ఒక్కరిలో అవగాహన పెరిగి, ఉల్లంఘనులు తగ్గుతారు. – శ్రీనివాస్, మాజీ పోలీసు అధికారి -
వాహనదారులకు షాకింగ్ న్యూస్...!
న్యూఢిల్లీ: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామన్యుడికి చుక్కలు కన్పిస్తున్నాయి. గత పన్నెండు రోజుల నుంచి ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వాహనదారులకు మరోసారి ఇక్కట్లు మొదలుకానున్నాయి. పెట్రోల్, డిజీల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల ఇంధన రిటైల్ విక్రయ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. చదవండి: మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్ భారీగా పెరిగిన బారెల్ ధరలు...! అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుత పెట్రోల్ , డీజిల్ ధరలు ఆగస్టు సగటు ధరలతో పోలిస్తే బ్యారెల్‌కు సుమారు 4-6 డాలర్లు ఎక్కువగా ఉన్నాయి. కాగా, రిటైల్ ధరల పెరుగుదలపై ఇప్పటివరకు చమురు కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు ఇదే స్థాయిలో ఉంటే..ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్‌సీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చివరగా ఈ ఏడాది జూలై 15, 17 తేదిల్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్, డిజీల్ ధరలు వరుసగా రూ.101.19, రూ. 88.62 గా ఉన్నాయి. గత నెలతో పోలిస్తే సగటు అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఆగస్టులో బ్యారెల్‌కు మూడు డాలర్లకంటే తక్కువగా నమోదయ్యాయి. యుఎస్, చైనా మిశ్రమ ఆర్థిక డేటా, వేగంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్ కారణంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. దీని ప్రకారం, జూలై 18 నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత మార్కెట్లో పెట్రోల్ , డీజిల్ రిటైల్ ధరలను వరుసగా లీటరుకు రూ. 0.65,రూ. 1.25 కు తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్లోని తాజా పరిణామాలతో ముడి చమురు ధరలు ఆగస్టు చివరి వారం నుంచి స్థిరంగా పెరుగుతున్నాయి. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. చదవండి: సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి -
ఐటీసీ ఫలితాలు భేష్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 30 శాతంపైగా ఎగసి రూ. 3,343 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,567 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 36 శాతం జంప్‌చేసి రూ. 14,241 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు సైతం 28 శాతంపైగా పెరిగి రూ. 10,220 కోట్లను తాకాయి. కోవిడ్–19 సెకండ్ వేవ్‌లోనూ వివిధ విభాగాలు పటిష్ట పనితీరు చూపినట్లు కంపెనీ పేర్కొంది. విభాగాల వారీగా ఐటీసీ ఎఫ్ఎంసీజీ బిజినెస్ 24 శాతం వృద్ధితో రూ. 9,534 కోట్లను అధిగమించింది. సిగరెట్ల విభాగం 34 శాతం పుంజుకుని రూ. 5,803 కోట్లకు చేరింది. కాగా.. ఎఫ్ఎసీజీ ఇతర విభాగంలో బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్నాక్స్, డైరీ, పానీయాలు, స్టేషనరీ తదితరాల టర్నోవర్ 10 శాతంపైగా బలపడి రూ. 3,731 కోట్లను తాకింది. హోటళ్ల ఆదాయం ఐదు రెట్లు ఎగసి రూ. 134 కోట్లకు చేరింది. -
గృహమస్తు! ఊపందుకున్న క్రయవిక్రయాలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఇళ్ల క్రయ విక్రయాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు నెలవుగా మారిన మహానగర పరిధిలో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు వేతన జీవులు, మధ్యతరగతి వర్గంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన సగటు జీవులు సైతం ముందుంటున్నారు. ఈ పరిణామంతో నగర శివార్లలో స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రముఖ స్థిరాస్తి అంచనా సంస్థ ప్రాప్ టైగర్ తాజా అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో నగరంలో ఇళ్లు ,ఫ్లాట్ల అమ్మకాల్లో వృద్ధి 38 శాతం మేర నమోదైనట్లు ఈ అధ్యయనంలో తేలింది. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో అమ్మకాలు 5 శాతం క్షీణించగా.. ఆయా సిటీలతో పోలిస్తే గ్రేటర్లో పరిస్థితి ఆశాజనకంగా ఉన్నట్లు స్పష్టమైంది. కల.. నెరవేరుతోందిలా.. ♦ ప్రధానంగా మహేశ్వరం, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో ఇళ్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఔటర్‌రింగ్ రోడ్డు లోపలున్న 190 గ్రామాలు, 10కిపైగా ఉన్న నగరపాలక సంస్థల పరిధిలో స్వతంత్ర గృహాలు, విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ♦ జనవరి-మార్చి మధ్యకాలంలో ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లను పరిశీలిస్తే.. సుమారు 7,721 గృహాల కొనుగోళ్లు జరిగినట్లు ప్రాప్ టైగర్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది జనవరి– మార్చి మధ్యకాలంలో కేవలం 5,554 అమ్మకాలే జరిగినట్లు ఈ నివేదిక తెలిపింది. కొనుగోళ్లు తగ్గలేదు: ప్రస్తుతం సిమెంటు, స్టీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ తదితర నిర్మాణరంగ మెటీరియల్ ధరలు 30 శాతం పెరిగాయి. దీంతో ఇళ్ల ధరలు సైతం అనివార్యంగా 15-20 శాతం పెరిగాయి. అయినా ఇళ్ల నిర్మాణాలు, కొనుగోళ్లు తగ్గడంలేదు.- రాంరెడ్డి, క్రెడాయ్ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు మధ్యతరగతికి అందుబాటులో: మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో నిర్మిస్తున్న స్వతంత్ర గృహాలకు ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరిగింది. ధరలు మధ్యతరగతికి అందుబాటులో ఉన్నాయి. – వి.ప్రవీణ్‌రెడ్డి, మైత్రీ కన్స్ట్రక్షన్స్ ఎండీ -
ఏడో రోజూ పెట్రో మంట
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధర మంటలు వినియోగదారులను వణికిస్తున్నాయి. వరుసగా ఏడో రోజు కూడా ధరలను ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో సోమవారం (ఫిబ్రవరి 15) దేశ వ్యాప్తంగా వరుసగా ఏడవ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర 23-26 పైసలు, డీజిల్‌పై 28 నుంచి 30 పైసల మేర ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88.73కు పెరగ్గా డీజిల్ లీటరుకు రూ .79.35 (29 పైసల పెరుగుదల)కు చేరుకుంది. గత ఏడు రోజుల్లో, పెట్రోల్ ధర లీటరుకు 2.06 రూపాయలు పెరగగా, డీజిల్ రేటు లీటరుకు 2.56 రూపాయలు పెరిగింది. పలు నగరాల్లో పెట్రోలు ,డీజిల్ ధరలు లీటరుకు ముంబై పెట్రోల్ రూ .95.46, డీజిల్ రూ .86.34 కోల్‌కతాలో పెట్రోల్ రూ. 90.25, డీజిల్ రూ .82.94 చెన్నైలో పెట్రోల్ రూ. 91.19, డీజిల్ రూ .84.44 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 92.53, డీజిల్ రూ.86.55 అమరావతిలో పెట్రోల్ రూ. 95.13, డీజిల్ రూ. 88.63 -
రెండో రోజూ పెట్రో సెగ
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమనడంతో వరుసగా రెండో రోజుకూడా దేశీయంగా పెట్రోధరలు పెరిగాయి. శనివారం ఇంధన ధరలను మరో 25 పైసలు పెంచాయి. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసల చొప్పున వడ్డించిన సంగతి తెలిసిందే. తాజా పెంపుతో ఢిల్లీతోపాటు, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.90 కి చేరువ కావడం, అమరావతిలో 92 స్తాయిని టచ్ చేయడంంగమనార్హం. (పెట్రో ధరలు భగ్గు) దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.70కు, డీజిల్ ధర రూ.75.88 ముంబైలో పెట్రోల్ రూ. 92.28, డీజిల్ రూ.82.66 చెన్నైలో పెట్రోల్ లీటరుకు రూ.88.38, డీజిల్ రూ.82.23 కోల్‌కతాలో పెట్రోల్ రూ.87.11, డీజిల్ రూ.79.48 హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.15 డీజిల్ ధర రూ. 82.80 అమరావతిలో పెట్రోల్ రూ. 91.94 డీజిల్ రూ.85.10 -
సన్‌ఫార్మా : అంచనాలు మిస్
సాక్షి, ముంబై: ఫార్మా దిగ్గజం సన్ ఫార్యాస్యూటికల్స్ నిరాశాజనక క్యూ3 ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్ క్వార్టర్లో నికరలాభం 26 శాతం తగ్గి 913.52 కోట్ల డాలర్లకు చేరుకుంది. గత క్యూ3లో రూ.1,242 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.914 కోట్లకు తగ్గిందని సన్ ఫార్మా తెలిపింది. వ్యయాలు రూ.6,203 కోట్ల నుంచి రూ.6,923 కోట్లకు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని సన్ ఫార్మా ఎండీ దిలిప్ సంఘ్వి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.7,657 కోట్ల నుంచి రూ.8,039 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. భారత్‌లో బ్రాండెడ్ వ్యాపారం బాగా ఉందని, క్యూ 3 తో పాటు తొమ్మిది నెలల కాలానికి రెండంకెల వృద్ధిని సాధించిందని సంఘ్వి తెలిపారు. ఆంకాలజీ ఉత్పత్తులకు చైనాలోని ఆస్ట్రాజెనెకాతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా కొత్త మార్కెట్లలో తమ పోర్ట్‌ఫోలియోను పెంచుకోనున్నామన్నారు. ఏఐఓసీడీ అవాక్స్ డిసెంబర్, 2019 నివేదిక ప్రకారం భారత ఫార్మా మార్కెట్లో అగ్రస్థానం తమ కంపెనీదేనని, రూ1.4 లక్షల కోట్ల మార్కెట్లో 8.2 శాతం మార్కెట్ వాటా తమ చేతిలోనే ఉందని పేర్కొన్నారు. -
వాటాల విక్రయం : ‘జీ’ షేర్లు జంప్
సాక్షి, ముంబై: ప్రమోటర్ల వాటా విక్రయ వార్తలతో దేశీయ అతిపెద్ద లిస్టెడ్ మీడియా కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజె భారీగా లాభపడుతోంది.గురువారం ఉదయం ట్రేడింగ్ సెషన్ ఆరంభంలోనే ఏకంగా 15 శాతం ర్యాలీ చేసింది. హై స్థాయిలో ట్రేడర్ల లాభాల స్వీకరణ కనిపించినప్పటికీ మిడ్ సెషన్ తరువాత తిరిగి పుంజుకుంది. గత రెండు రోజుల్లో 16.89 శాతం పెరిగింది. ప్రమోటర్ సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ 16.5 శాతం వరకు వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించనున్నారు. జీల్ లోని 16.5 శాతం వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించాలని ఎస్సెల్ గ్రూప్ యోచిస్తోందని మీడియా సంస్థ బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు అందించిన సమాచారంలోతెలిపింది. ఒప్పంద పత్రం ప్రకారం మూడు ప్రమోటర్లు ఈఎంవీఎల్ 77 మిలియన్ షేర్లను, క్వైతర్ గ్రూప్ 61 మిలియన్ షేర్లను, ఎస్సెల్ గ్రూప్ 11 మిలియన్ల ఈక్విటీ షేర్లను మొత్తం 15.72 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో ఈక్విటీ ధరను బుధవారం నాటి ముగింపు ధర(రూ.307)తో పోలిస్తే 10శాతం డిస్కౌంట్‌తో రూ.277 గా నిర్ణయించారు. ఈ మొత్తం ఒప్పందం విలువ దాదాపు రూ.4,132 కోట్లుగా ఉండవచ్చు. సిటీ గ్రూప్ సంస్థ డీల్స్‌కు బుక్ రన్నర్‌గా వ్యవహరించారు. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను సంస్థ రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది. ఈ 16.50శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్సీ గ్లోబల్ చైనా ఫండ్‌కు 2..3శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిడెలో 8.7శాతం వాటాను కలిగి ఉంది. సెప్టెంబర్ 30 నాటికి, జీ ప్రమోటర్లు 22.37 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. షేర్‌హోల్డింగ్ డాటా ప్రకారం 96 శాతానికి సమానమైన వాటాను రుణదాతల వద్ద తనఖా పెట్టింది. ఈ లావాదేవీ తరువాత, సంస్థలో ఎస్సెల్ హోల్డింగ్ ఐదు శాతానికి పడిపోతుంది, వీటిలో ఎన్కంబర్డ్ హోల్డింగ్ 1.1 శాతంగా ఉంటుంది. సుభాష్ చంద్ర తన కుటుంబంతో కలిసి మ్యూచువల్ ఫండ్లతో సహా దేశీయ రుణదాతలకు, రష్యన్ రుణదాత విటిబితో సహా రూ 7,000 కోట్ల బాకీ పడిన సంగతి తెలిసిందే. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, ముంబై : దేశీ ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. మంగళవారం (మే 21) పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 9-10 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పైకి ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.43 శాతం పెరుగుదలతో 72.28 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం పెరుగుదలతో 63.50 డాలర్లకు ఎగసింది. దేశీయంగా పెట్రోలు ధరలను ప్రభావితం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.71.17కు చేరింది. డీజిల్ ధర 9 పైసలు పెరుగుదలతో రూ.66.20కు ఎగసింది. వివిధ నగరాల్లో ఇంధన ధరలు లీటరుకు ముంబై: పెట్రోల్ రూ.76.78, డీజిల్ రూ.69.36 కోలకతా : పెట్రోల్ రూ.73.24, డీజిల్ రూ.67.96 చెన్నై : పెట్రోల్ రూ.73.87 డీజిల్ రూ.69.97 హైదరాబాద్ : పెట్రోల్ రూ.75.48, డీజిల్ రూ.71.99 అమరావతి: పెట్రోలు రూ.75.24 , డీజిల్ రూ.71.36 విజయవాడ : పెట్రోల్ రూ.74.89 డీజిల్ రూ.71.03 -
విమాన ప్రయాణీకులకు శుభవార్త
సాక్షి,న్యూఢిల్లీ: విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వైమానిక ప్రమాదాలు, కాన్సిలేషన్ చార్జీపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదనల ప్రకారం ఇకపై విమానాల్లో లగేజీ పోయినా, విమానాలు ఆలస్యం అయినా లేదా రద్దయినా విమానయాన సంస్థలు సదరు ప్రయాణికులకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు టికెట్ రద్దు చేసుకున్నసందర్భంలో ఎయిర్‌లైన్స్ బాదుడుకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టనుంది. తద్వారా విమాన ప్రయాణీకులకు భారీ ఉపశమనం కల్గించనుంది. పాసెంజర్ చార్టర్లో మార్పులపై విమానయాన సంస్థలు, ఇతర పరిశ్రమ వర్గాలతో రెండు దఫాలుగా ప్రాథమిక చర్చలు జరిపామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా బుధవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రూపొందించిన తొలి డ్రాఫ్ట్‌ను రాబోయే పదిహేను రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టనున్నామని బుధవారం ట్వీట్ చేశారు.విమానాలు ఆలస్యమైన లేదా రద్దయిన సమయంలో ప్రయాణికులకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని విమానయాన శాఖ ప్రతిపాదించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో పాటు విమానాల్లో పోయిన లగేజీకి కూడా ఎయిర్లైన్లు ప్రయాణికులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాలని ప్రతిపాదించిందన్నారు. ప్రస్తుతం దేశీయ విమానాల్లో లగేజీ పోయినా లేదా దెబ్బతిన్నా గరిష్ఠంగా రూ. 20వేల వరకు చెల్లిస్తున్నారు. అంతర్జాతీయ విమానాల్లో అయితే రూ. లక్ష వరకు పరిహారం కింద ఇస్తున్నారు. తాజాగా దీన్ని మరింత పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది. తాజా ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ఈ పరిహారం భారీగా పెరగనుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో పోయిన లగేజీకి కేజీకి రూ. 3000 వరకు చెల్లించేలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీంతోపాటు ప్రస్తుతం కొన్ని నిర్దేశిత కారణాల వల్ల విమానాలు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికులకు ఆ ఎయిర్లైన్లు పరిహారం చెల్లిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కూడా పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది. కాగా మంత్రిత్వశాఖ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను ఇచ్చినట్లు ఎయిర్ఏషియా ఇండియా తెలిపింది. మరోఎయిర్‌లైన్స్ విస్తారా వ్యాఖ్యానించడానికితిరస్కరించగా ఇతర విమానయాన సంస్థలు ఇంకా స్పందించాల్సి ఉంది. Held discussions with aviation stakeholders to review a draft of the Passenger Charter. Public consultations on draft charter expected to begin in next fortnight. @MoCA_GoI @sureshpprabhu pic.twitter.com/jhjHmNsHCQ — Jayant Sinha (@jayantsinha) April 4, 2018 -
భవిష్యత్తులో మొబైల్ బిల్లు తగ్గుతుందా?
సాక్షి, ముంబై: టెలికాం మార్కెట్లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత మొబైల్ ఫోన్ బిల్లుల బాదుడు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా గత ఆరునెలల్లో సగటు నెలవారీ మొబైల్ బిల్లుల్లో 30నుంచి 40శాతం తగ్గిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి ఉంటుందే అనే దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా మొబైల్ వినియోగదారులు ఆశించిన ధరల క్షీణతను పొందలేరని మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి. టెలికాం కంపెనీల ఆదాయ, మార్జిన్ల అధిక ఒత్తిళ్ల భారం వినియోగదారుడిపై పడనుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోదీంతో కస్టమర్లు డేటా, ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీలపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఎనలిస్టులు భావిస్తున్నారు. అంతేకాదు సంవత్సరానికి సుమారు 40శాతం వరకు పెరుగనుందట. భవిష్యత్‌లో ఫోన్ బిల్లులు మరింత తగ్గే అవకాశాలు కన్పించడం లేదని కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసర్చ్ తెలిపింది. అయితే వివిధ ప్యాకేజీల మధ్య వ్యత్యాసం రూ. 100లకు బదులుగా 50రూపాయల కంటే తక్కువుంటే కస్టమర్లపై భారం ఫ్లాట్‌గానే అంచనా వేయవచ్చని కౌంటర పాయింట్ రీసెర్చ్ సత్యజిత్ సిన్హా వ్యాఖ్యానించారు. మరోవైపు సంవత్సరానికి సుమారు 40శాతం వరకు పెరుగుతాయని మరో అంచనా. అలాగే గత 9-10 నెలల్లో మొత్తం చందాదారులందరిలో నాలుగుశాతం ఎక్కువ ఆఫర్లను ప్యాకేజీలవైపు మళ్లారని , రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ నిష్పత్తి 50 శాతానికి పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక వెల్లడించింది. కాగా జియో ప్రవేశం తర్వాత ఎయిర్టెల్, ఐడియా సహా పలు టెలికాం సంస్థలు టారిఫ్‌లను తగ్గించడం సహా ఇతర ఆఫర్ల వల్ల టెలికాం సంస్థల ఆదాయానికి భారీగా గండిపడినట్లు తెలుస్తోంది. 2016 జూన్ నుంచి 2017 డిసెంబరు మధ్య టెలికాం కంపెనీలు దాదాపు 9.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయాయని ఇటీవల ఓ నివేదికలో తేలింది. ఈ కారణాల వల్ల భవిష్యత్‌లో టారిఫ్‌లను తగ్గించకూడదని టెలికాం సంస్థలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్ల సౌలభ్యం కోసం ఉన్న టారిఫ్‌లలోనే ఎక్కువ డేటా, మరిన్ని ఉచిత సదుపాయాలను అందించే అవకాశాలున్నాయని సమాచారం. -
గృహ, వాహన రుణాలు ఇక భారమే!
సాక్షి, ముంబై: హోంలోన్లు, వెహికల్ లోన్లు మరింత ప్రియం కానున్నాయి. దీనికి రుణగ్రహీతలు సిద్ధంగా ఉండాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు తమ కీలక లెండింగ్ రేట్లను పెంచేసిన నేపథ్యంలో ఇతర బ్యాంకులు కూడా ఇదే బాటను అనుసరించనున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో గృహ, కార్లకోసం రుణాలు మరింత భారం కానున్నాయని భావిస్తున్నారు. ముఖ్య ప్రయివేటు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర, ఇందస్ ఇండ్, ఎస్ బ్యాంకు తమ బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించాయి. ఈ పెంపు జనవరినుంచి అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేశాయి. 2016, ఏప్రిల్ లో కొత్త ఎంసీఎల్ ఆర్ విధానంలోకి ప్రవేశించిన తరువాత ఇదే మొదటి పెంపు అని బ్యాంకులు వివరించాయి. ముఖ్యంగా డిపాజిట్లపై ఎక్కువ వడ్డీరేట్లు చెల్లిస్తున్న ఈ నేపథ్యంలో ఈ పెంపు తప్పలేదని పేర్కొన్నాయి. ఆర్బీఐ సంకేతాల మేరకు ఎంసీఎల్ఆర్ రేటు ఇంతకంటే కిందిగి దిగివచ్చే అవకాశం లేదని కోటక్ మహీంద్ర జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా వెల్లడించారు. కాగా యాక్సిస్బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటును 5శాతం పెంచగా, కోటక్‌మహీంద్ర 5-10శాతం, ఎస్‌బ్యాంక్, ఇందస్ బ్యాంకు 10శాతం పెంచాయి. -
ఎగుమతులు రయ్..
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఊతంతో డిసెంబర్లో ఎగుమతులు 12.36 శాతం మేర వృద్ధి చెందాయి. విలువపరంగా 27.03 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ముడిచమురు, పసిడి దిగుమతులు భారీగా పెరగడంతో ఇంపోర్ట్ బిల్లు సైతం 21.12 శాతం ఎగిసి రూ. 41.91 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన చూస్తే డిసెంబర్లో 41 శాతం ఎగిసి 14.88 బిలియన్ డాలర్లకు చేరింది. ‘గతేడాది అక్టోబర్‌లో 1.1 శాతం తగ్గుదల మినహా.. 2016 ఆగస్టు నుంచి 2017 డిసెంబర్ దాకా ఎగుమతుల ధోరణి సానుకూలంగానే నమోదవుతూ వస్తోంది‘ అని కేంద్రం పేర్కొంది. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీటర్లో పేర్కొన్నారు. ఎగుమతులు.. గతేడాది నవంబర్‌లో 26.19 బిలియన్ డాలర్లు కాగా, 2016 డిసెంబర్లో 24.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 300 బిలియన్ డాలర్ల మైలురాయి దాటతాం: ఎఫ్ఐఈవో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల వ్యవధిలోనే 224 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేశ్‌కుమార్ గుప్తా తెలిపారు. 2018లో అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి మెరుగ్గా ఉండనున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం 300 బిలియన్ డాలర్ల మైలురాయిని సులభంగా దాటేయగలమని ధీమా వ్యక్తం చేశారు. 2015–16లో మొత్తం ఎగుమతులు 262 బిలియన్ డాలర్లు కాగా, 2016–17లో 275 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో.. దిగుమతులు దేశీయంగా ఉత్పత్తికి తోడ్పడేవేనా లేక సవాలుగా మారే అవకాశముందా అన్న అంశాన్ని పరిశీలించాలని గుప్తా పేర్కొన్నారు. మరోవైపు, పన్ను విభాగం అధికారుల మొండివైఖరి, అవగాహన లేమి కారణంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్ పొందటంలో ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక వివిధ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల తీరుతెన్నులు ఇలా ఉన్నాయి. ♦ మొత్తం 30 ప్రధాన ఉత్పత్తుల్లో 21 ఉత్పత్తుల ఎగుమతులు వృద్ధి నమోదు చేశాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, సేంద్రియ.. నిరింద్రియ రసాయనాలు, వజ్రాభరణాలు, ఔషధాలు వీటిలో ఉన్నాయి. ♦ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి 25 శాతం. ♦రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 8 శాతం క్షీణించి 1.33 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. ♦పసిడి దిగుమతులు 71.5 శాతం ఎగిసి 3.39 బిలియన్ డాలర్లుగా నమోదు. 2016 డిసెంబర్లో ఈ పరిమాణం 1.97 బిలియన్ డాలర్లే. ♦పెట్రోలియం ఉత్పత్తులు, ముడిచమురు దిగుమతులు 35% పెరిగి 7.66 బిలియన్ డాలర్ల నుంచి 10.34 బిలియన్ డాలర్లకు చేరాయి. ♦ఏప్రిల్–డిసెంబర్ మధ్య తొమ్మిది నెలలకాలంలో ఎగుమతులు 12 శాతం వృద్ధి చెంది 223.51 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సుమారు 22 శాతం పెరిగి 338.37 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 114.85 బిలియన్ డాలర్లకు చేరింది. -
మురిపిస్తున్న రూపాయి
సాక్షి, ముంబై: డాలర్‌మారకంలో దేశీయకరెన్సీ రూపాయి దూకుడు కొనసాగుతోంది. ముఖ్యంగా కొత్త ఏడాదిలో పటిష్టంగా ట్రేడ్ అవుతున్న రూపాయి సోమవారం 11 పైసల లాభంతో 63.26 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం 63.37 వద్ద 32 నెలల గరిష్టాన్ని నమోదు చేసిన రూపాయి తాజాగా మరింత జోష్‌గా ట్రేడ్ అవుతుండడటం విశేషం. కరెన్సీ డీలర్ల కొనుగోళ్లు, విదేశీ నిధుల పెట్టుబడులు, విదేశీ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనపడటంతో రూపాయికి మద్దతు లభించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా లాభాలతో కొత్త గరిష్టాల వద్ద పటిష్టంగా మొదలయ్యాయి. అటు పసిడి ధరలు స్వల్పంగా నష్టపోతున్నప్నటికీ స్థిరంగా ఉన్నాయి. -
మార్కెట్లలో కొనుగోళ్ల వర్షం
సాక్షి, ముంబై: ఆసియా మార్కెట్ల బలంతో ఆరంభంలోనే పాజిటివ్‌గా ఉన్న మార్కెట్లు ప్రస్తుతం మరింత పుంజుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరకొరియా ఉద్రికత్తగా కొద్దిగా చల్లారుతున్న సంకేతాలతో కొనుగోళ్ల ధోరణి భారీగా నెలకొంది. దీంతో సెన్సెక్స్ 261 పాయింట్లు జంప్‌చేసి 31,650ను తాకింది. నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 9,8856 వద్ద కొనసాగుతోంది.. తద్వారా నిఫ్టీ 9850ను అధిగమించడంతోపాటు మరోసారి 9,900 కీలక స్థాయివైపు చూస్తోంది. మంగళవారం భారగా అమ్మకాలు చేపట్టిన ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలకు దిగడంతో, మార్కెట్లకు బలమొచ్చిందని, రిలీఫ్ ర్యాలీ అని నిపుణులు చెబుతున్నారు. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నప్పటికీ మెటల్ 2 శాతం లాభపడి టాప్ విన్నర్‌గా ఉంది. దీనికి ఫార్మా ,బ్యాంకింగ్ సెక్టార్, రియల్టీ, ఆటో లాభాలు మద్దతినిస్తున్నాయి. ఐఓసీ, హిందాల్కో మార్కెట్ ను లీడ్ చేస్తుండగా వేదాంత, అంబుజా సిమెంట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటితో పాటు యస్‌బ్యాంక్, బీపీసీఎల్, అరబిందో, ఆర్ఐఎల్, హీరోమోటో, హెచ్డీఎఫ్సీ లాభపడుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ స్వల్పంగా నష్టపోతున్నాయి. -
సాగర తీరంలో స్వైన్ ఫ్లూ సైరన్..!
-
బాలీవుడ్‌పై మేనక సంచలన వ్యాఖ్యలు: దుమారం
ముంబై: కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ కు బాలీవుడ్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. దీంతో దుమారం రేగింది. శుక్రవారం గోవా ఫెస్ట్‌కు హాజరైన ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై నేరాల పెరుగుదలకు సినిమాలే కారణమన్నారు. దాదాపు ప్రతి సినిమాలోనూ ప్రేమ ఈవ్ టీజింగ్ తో మొదలుతుందని పేర్కొన్నారు. బాలీవుడ్ అయినా, ప్రాంతీయ భాషా చిత్రంలోనైనా దీనికి అతీతం కాదన్నారు. అమ్మాయి చుట్టూ కొంతమంది చేరి గుమిగూడి, అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం, వేధించడం ఆ తర్వాత ప్రేమలో పడుతూ ఉండటం చూపిస్తున్నారని విమర్శించారు. తద్వారా మహిళలపై హింసకు, వేధింపులకు పాల్పడవచ్చనే భావన పురుషుల్లోపెరుగుతోందన్నారు. అలా కాకుండా మహిళల ప్రాత చిత్రణ గౌరవప్రదంగా ఉండేలా చూడాలని బాలీవుడ్‌ని కోరారు. చేతకానిపురుషులే మహిళలపై హింసకి దారితీస్తుందనీ, పనిలో వైఫ్యల్యంతో పురుషులు మహిళలపై అసహనం ప్రదర్శిస్తారని,అరుస్తారని పేర్కొన్నారు. దీంతో బాలీవుడ్ తీవ్రంగా స్పందిస్తోంది. సినిమా పరిశ్రమ శక్తిని తక్కువగా చిత్రనిర్మాత అశోక్ పండిట్ చూడొద్దని కోరారు సినీ పరిశ్రమపై విమర్శలకు దిగడం ఫ్యాషన్‌గా మారిపోయిందని విమర్శించారు. శ్యాంబెనగల్ నుంచిమొందలు మాధుర భండార్కర్ దాకా చాలా అగ్రదర్శకులు విమెన్ ఓరియెంటెడ్ సినిమాలను తీశారని గుర్తుచేశారు. -
బ్యాంకు రుణాలు పెరిగిపోయాయ్
ఇటు బ్యాంకు డిపాజిట్లు, అటు బ్యాంకు రుణాలు గతేడాది కంటే బాగానే పెరిగాయట. జనవరి 6 వరకున్న రెండు వారాల కాలవ్యవధిలో బ్యాంకు రుణాలు గతేడాది కంటే 5.1 శాతం పెరిగినట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. అదేవిధంగా డిపాజిట్లు సైతం 14.7 శాతం ఎగిసినట్టు సెంట్రల్ బ్యాంకు వీక్లి స్టాటిస్టికల్ సప్లిమెంట్లో శుక్రవారం పేర్కొంది. అవుట్ స్టాండింగ్ రుణాలు సైతం రెండు వారాల కాలంలో రూ.65,360 కోట్ల నుంచి రూ.74.13 లక్షల కోట్లకు పెరిగినట్టు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకు డిపాజిట్లు కూడా రూ.67,930 కోట్ల నుంచి రూ.105.84 కోట్లకు పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది. -
కళకళలాడుతున్న పసిడి
ముంబై: డాలర్ దెబ్బతో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో అమెరికన్ డాలరు బలహీనపడటంతో బంగారం ధరలకు ప్రోత్సాహం లభించింది. ముఖ్యంగా యూరో తొలుత 2 శాతం జంప్‌చేయడంతో డాలర్ విలువ క్షీణించింది. దీంతో వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పాజిటివ్ గా ఉన్నాయి. అటు విదేశీ మార్కెట్లో బంగారం మెరుస్తుండటంతో దేశీయంగానూ ధరలు పురోగమించాయి. 22 కారెట్ల పది గ్రా. బంగారం ధరలు రూ. 26910 వద్ద, 24 కారెట్స్ పదిగ్రా. బంగారం రూ.28780 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 0.3 శాతం పుంజుకుని 1161 డాలర్లను అధిగమించింది. ఇక వెండి కూడా ఔన్స్ 0.35 శాతం ఎగసి 16.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వరుసగా ఏడో వారం పసిడి పతనం కొనసాగడంతో తక్కవ స్తాయిలో అందుబాటులోకి రావడంతో ట్రేడర్లు మరోసారి కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు భారీగా ధరలు పడిపోనున్నాయనే ముందస్తు అంచనాలతో మదుపర్లు ఇప్పటికే కొనుగోళ్ళకు పాల్పడ్డారు. ఫలితంగా సుమారు26వేల స్థాయికి దిగిరావడంతో షార్ట్ కవరింగ్ కారణంగా పసిడి ధరలు 1130 డాలర్ల స్థాయి నుంచి పుంజుకున్నాయి. అటు ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల పసిడి ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 262 జంప్‌చేసి రూ. 27,562 వద్ద స్థిరపడింది. శుక్రవారం కూడా మరో రూ. 66 ఎగిసి రూ. 27,562 వద్ద ఉంది. వెండి కేజీ మార్చి ఫ్యూచర్ రూ. 130 పెరిగి రూ.39751 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా ఈ ఏడాది బులియన్ ధరలో దాదాపు మూడేళ్ల తరువాత 8 శాతం పుంజుకోగా, ఒక్క నవంబరు లోనే 8 శాతం పతనమయ్యాయి. అమెరికా ఫెడ్ రేట్లు పెరిగితే బంగారంలో పెట్టుబడులకు తక్కువ అవకాశం ఉంటుందని లండన్ ఆధారిత సన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సీఈవో మిహిర్ కపాడియా తెలిపారు. అయితే ప్రస్తుతం బులియన్ మార్కెట్లో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని మరికొంతమంది ఎనలిస్టులు సూచిస్తున్నారు. అటు కాగా డాలర్ పో పోలిస్తే రూపాయి కూడా ఈ రోజు బాగా బలపడింది. 14 పైసలు పుంజుకుని రూ.67.96 వద్ద ఉంది. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
రేపల్లె: మండలంలోని పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎన్.కిషోర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అడిషనల్ డీఎస్పీ శోభామంజరి ఆదేశాల మేరకు తమ సిబ్బందితో నిఘా ఉంచి పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రేపల్లె వైపునుంచి కృష్ణాజిల్లావైపు వెళ్తున్న ఏపీ28డబ్లు్య 6437 నంబరుగల పాల లారీ డ్రై వర్ తనిఖీలను గమనించి లారీని పక్కనే ఉన్న మట్టిరోడ్డుకు తరలించి అక్కడే వదిలి పారిపోయాడన్నారు. లారీలో గోతాలు మార్చి నింపిన 83 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నాయని, రికార్డులను పరిశీలించగా ఇవి కర్లపాలెంకు చెందిన మహ్మద్ అబీబ్‌బేగ్‌దిగా గుర్తించామన్నారు. మహ్మద్ అబీబ్‌బేగ్‌పై ఈ సంవత్సరం అక్రమంగా బియ్యం తరలింపుపై ఇప్పటికే ఐదు సార్లు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రేపల్లె పోలీసులకు సమాచారం అందించి, లారీని రేపల్లె ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దార్ టి.శ్రీనివాసరావు, కానిస్టేబుల్ మహేష్, ఆర్ఐ పి.సుధీర్ తదితరులున్నారు. -
కళకళలాడుతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ షేర్లు
ముంబై: రానున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా మార్కెట్ లో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలకు చెందిన షేర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మదుపర్ల కొనుగోళ్లతో ఈ పలు కంపెనీల షేర్లు ధగధగ లాడుతున్నాయి. పండుగ ఉత్సాహంతో నెలకొన్న బైయింగ్ సపోర్ట్ తో దాదాపు అన్ని జెమ్స్ అండ్ జ్యుయలరీ స్టాక్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. ముఖ్యంగా గోల్డియం ఇంటర్నేషన్ లిమిటెడ్ 15శాతం, తారా జ్యుయలరీ 9శాతం, గీతాంజలి జెమ్స్ 11 శాతం, పీసీ జ్యుయలరీ 6 శాతం, త్రిభువన్ దాస్ భీమ్ జీ జవేరీ లిమిటెడ్ 5 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే టైటాన్ కో లిమిటెడ్ , రాజేష్ లిమిటెడ్ కూడా లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో స్పెక్యులేటర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారని ఎనలిస్టుల అంచనా. అటు బులియన్ మార్కెట్లో గత కొన్ని సెషన్లు గా నీరసంగా ఉన్న పసిడి ధరలు కూడా పుంజుకున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో ఉదయం నుంచీ జోరుమీదున్న పుత్తడి200 రూపాయల లాభంతో 29,780 వద్ద ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రా. బంగారం ధరలు Gold 193రూపాయలు ఎగిసి రూ. 29,850 వద్ద ఉంది. ఇది ఇలా ఉండగా స్టాక్ మార్కెట్లు స్వల్పలాభనష్టాల మధ్య ఊగిసలాడుతో స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. -
బ్యాంకింగ్ జోరు..ఈక్విటీ మార్కెట్ల హుషారు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, షార్ట్ కవరింగ్ తో దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈవారంలో రెండురోజులు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 28,151వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 8, 676వద్ద ముగిసింది. నిప్టీ బ్యాంక్ ఇండెక్స్ భారీగా లాభపడడంతో సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా క్లోజయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, హెల్త్ కేర్ రంగాల్లో నెలకొన్న కొనుగోళ్ల ఒత్తిడి స్టాక్ మార్కెట్లను లాభాలవైపు నడిపించింది. ప్రధాన బ్యాంక్ షేర్లన్నీ లాభాలను ఆర్జించాయి. సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఎన్టీపీసీ, భారతి ఎయిర్ టెల్ అదాని పోర్ట్స్, కోటక్ మహీంద్రా, గ్రాసిం, లాభపడగా, కోల్ ఇండియా, ఎల్ అండ్ టి, టాటా స్టీల్, మహీంద్ర,హిందాల్కో నష్టపోయాయి. లోయర్ లెవల్స్ వాల్యూ బైయింగ్ కనిపించింది. అలాగే పెరుగుతున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులు భారతీయ మార్కెట్లకు భారీ మద్దతునిచ్చాయి. ఫెడ్ ప్రకటన పెట్టుబడిదారుల మనోభావాలను ప్రభావితం చేసిందని ఎనలిస్టులు విశ్లేషించారు. -
తగ్గుతూ.. పెరుగుతూ..
గోదావరి నీటిమట్టం 33 అడుగులు భద్రాచలం : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి నీటిమట్టం పెరుగుతోంది. వారం రోజులుగా గోదావరి తగ్గుతూ.. పెరుగుతూ దోబూచులాడుతోంది. భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 33 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఆదివారం నాటికి 36 అడుగులకు పైగా చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భద్రాచలం వద్ద 43 అడుగులకు నీటిమట్టం చేరితేనే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కానీ.. ఆ స్థాయిలో ప్రస్తుతం వరద రాదని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. కాగా.. ఎగువ ప్రాంతంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాజేడు వద్ద కొంగాలవాగు నీరు రోడ్డెక్కటంతో అటువైపు ఉన్న గ్రామాలతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి పరీవాహకంలో ఉన్న మండలాల అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉంటూ.. తగిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీఓ, ఇన్చార్జి సబ్ కలెక్టర్ రాజీవ్ ఆదేశించారు. -
29 అడుగులు దాటిన లక్నవరం నీటిమట్టం
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సు నీటిమట్టం 29 అడుగులు దాటింది. ఆదివారం మధ్యాహ్నం సరస్సులో 29 అడుగుల 3 అంగుళాల నీరుంది. ఈ మేరకు సరస్సు ప్రధాన కాల్వల్లోని నర్సింహుల, రంగాపురం కాల్వల కోసం నీటిని సద్దిమడుగులోకి వదిలారు. తర్వాత అక్కడి నుంచి కాల్వలకు నీటిని వదిలారు. ఇదిలా ఉండగా, సరస్సు తూముల వద్ద 24 అడుగుల ఎత్తులో రాళ్ల మధ్య నుంచి నీరు ఎక్కువగా లీకవుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, నీటిని విడుదల చేయాల్సిన సమయంలో కూడా నీటిపారుదల శాఖ అధికారులు రాకుండా స్థానిక గ్యాంగ్మెన్లతోనే పనులు చేయించడం గమనార్హం. పదివేల ఎకరాలకు సాగునీరందిస్తూ, పర్యాటక ప్రాంతంగా ప్రభు త్వానికి ఆదాయం సమకూరుస్తున్న సరస్సుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. -
భారతీయ ఐటీ కంపెనీలకు మరో షాక్!
వాషింగ్టన్: భారతీయ ఐటీ కంపెనీలకు యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ కొత్త షాక్ ను ఇచ్చింది. ఐటీ కంపెనీలో పని చేయడానికి అమెరికాకు వెళ్లే ప్రతి ఉద్యోగికి అవసరమైన హెచ్-1బీ వీసాకు అదనంగా 4 వేల డాలర్లు (2,68,181 రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదే ఎల్-1 బీ వీసా కోసమైతే 4.5వేల డాలర్లు (3,01704 రూపాయలు) చెల్లించాలని వివరించింది. వీసాలకు ఈ ఫీజులు 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని చెప్పింది. దీంతో భారతీయ ఐటీ కంపెనీలపై 400 మిలియన్ డాలర్ల పెనుభారం పడనుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నదని కంపెనీలు విమర్శించాయి. మరో వైపు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై అమెరికా పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఇందుకు సంబంధించిన వివరాలను తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. 50 మంది కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే ఏ భారతీయ కంపెనీ అయినా హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు ఈ నిబంధనలను వర్తిస్తాయని పోస్టులో వివరించింది. -
బ్యాంకులకు మొండి బకాయిల బెడద తప్పదా?
న్యూఢిల్లీ : భవిష్యత్తులో కూడా బ్యాంకులకు మొండి బకాయిల బెడద తప్పేటట్లు కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న వివిధ ఒత్తిడుల నేపథ్యంలో ఈ బకాయిలు 2017 మార్చి కల్లా 6.9శాతం పెరుగుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. 2015 సెప్టెంబర్ చివర వరకు 5.14శాతంగా ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు రుణాలు, 2016 సెప్టెంబర్ నాటికి 5.4శాతానికి పెరుగుతాయని రిజర్వు బ్యాంకు తన రిపోర్టులో నివేదించింది. బ్యాంకుల మూలధన సంపూర్ణత వివరాలు తెలిపే క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో(సీఆర్ఏఆర్) కూడా 2017 మార్చి కల్లా 10.4శాతానికి తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదించింది. 2015 సెప్టెంబర్ లో ఇది 12.7 శాతంగా ఉన్నాయి. స్థూల ఆర్థిక అంశాలు స్థూల మొండిబకాయిల పెరగడానికి దోహదంచేస్తున్నాయని, దీనివల్ల ఈ బకాయిలు 6.9శాతానికి పెరిగే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. గత కొద్దికాలంగా దేశీయ వృద్ధి నిదానంగా ఉండటం, అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థికమాద్యం నుంచి ఆర్థికవ్యవస్థలు మెల్లగా కోలుకోవడం, ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకుల్లో నడవడం, టెక్స్ టైల్, ఇంజనీరింగ్ గూడ్స్, లెదర్, జెమ్స్ ఉత్పత్తుల ఎగుమతులు మందగించడం వంటివి బ్యాంకులకు మొండి బకాయిలు పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాక, మైనింగ్ ప్రాజెక్టులు నిషేధం, పవర్,స్టీల్ రంగాల్లో ప్రాజెక్టుల క్లియరెన్స్ కు ఆలస్యం కావడం, ముడిసరుకు ధరల్లో ఒడిదుడుకులు, విద్యుత్ ఉత్పత్తి తగ్గి మౌలిక రంగంపై ప్రభావం చూపడం కూడా బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని రిపోర్టు పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తీసుకున్న ఎక్కువ రుణాలు మౌలిక రంగానికి సంబంధించినవై ఉన్నాయని తెలిపింది. బ్యాంకుల్లో నెలకొన్న మొండిబకాయిల సమస్య ఉద్దేశించి తయారుచేసిన రిపోర్టులో, ఆ రుణాలను వసూలు చేసుకోవడం కోసం బ్యాంకులకు ప్రత్యేక చర్యలను ప్రతిపాదించింది. రుణాలను రికవరీ చేసుకునే సౌలభ్యం కోసం ఆరు కొత్త రుణాల రికవరీ ట్రైబ్యూనల్స్ ను ఏర్పాటుచేస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. -
వందేళ్ల లో ఫస్ట్ టైమ్
కాలిఫోర్నియా: ప్రపంచ వ్యాప్తంగా గడిచిన వందేళ్ల లో మొదటిసారిగా పులుల సంఖ్య పెరిగినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తన్నాయి. పులుల అక్రమ రవాణాను అడ్డుకుని, సంరక్షణ చర్యలు చేపడుతున్నందు వల్లే పులుల సంఖ్యలో ఈపెరుగుదల నమోదైనట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య 3,890 ఉన్నట్టు ప్రకటించింది. 2010లో 3,200గా ఉన్న పులుల సంఖ్య నమోదైంది. అంటే దాదాపు 700 పులుల సంఖ్య పెరిగినట్టు ఐయూసీఎన్ తెలిపింది. ఆసియా మొత్తంలో ఉన్న పులులను వీరు లెక్కించారు. భారతదేశంలో 2,226, రష్యా, సైబీరియా-433, 371, ఇండోనేషియా-371, మలేషియా-250, నేపాల్-198, థాయిలాండ్-189, బంగ్లాదేశ్-106, భూటాన్-103, చైనా-7, వియత్నాం-5, లావోస్-2, కంబోడియా-1, మయన్మార్ లో పులుల సంఖ్య శూన్యం. వరల్డ్ వైడ్ ఫండ్ (డబ్యూడబ్యూఎఫ్) మేసేజర్ డారెన్ గ్రోవర్ 20వ శతాబ్దంలో పులుల సంఖ్య పెరగడం ఇదే మొదటి సారని సంతోషం వ్యక్తం చేశారు. పులుల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2022 నాటికి పులుల సంఖ్య 6400 కు చేరుకుంటుందని గ్రోవర్ తెలిపారు. పులి పాధాన్యత ఏంటి? పులి ప్రపంచ వ్యాప్తంగా అధిక గుర్తింపు కలిగిన జంతువు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పులికి విపరీతమైన ప్రాధాన్యత ఉంది. అడవిలో ఉండే జంతువుల ఆహార చైన్ సిస్టంలో పులి అగ్రస్థానంలో ఉంటుంది. అంటే అడవిలో పులి ఉంటే అక్కడ అన్ని జంతువులు సమృద్ధిగా ఉంటాయి. అందుకోసం పులుల సంరక్షణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. -
పాడుబడ్డ బావిలో పైపైకి గంగమ్మ!
బొంరాస్‌పేట : భూగర్భజలం అడుగంటిపోతూ ఆందోళన కలిగిస్తుంటే ఓ పాడుబడ్డ బావిలో నీరు ఊరుతూ ఆశ్చర్యం కలిగిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం చిల్మల్‌మైలారంలో ఓ రైతు పొలంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో రెండువారాలుగా నీరు ఊరుతుంది. వివరాలు.. గ్రామానికి చెందినబర్ల వెంకటయ్య, రాములు, అంజిలప్ప అన్నదమ్ములు 25ఏళ్ల క్రితం సామూహిక బోర్వెల్ పథకం కింద వ్యవసాయ బోరు తవ్వారు. నీరు పుష్కలంగా రావడంతో ఐదేళ్లపాటు వ్యవసాయం చేశారు. కొన్నాళ్లకు నీరు పూర్తిగా ఇంకిపోవడంతో బాడుబడింది. నెల రోజుల క్రితం ఇదే బావిలో నీటిచెమ్మ మొదలై ప్రస్తుతం రోజుకు 6 ఇంచుల నీరు ఊరుతూ బావి నిండుకొస్తోం -
సాధారణం కన్నా పెరిగిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో చలి తీవ్రత తగ్గింది. వాస్తవానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు చలి తీవ్రత కొనసాగాల్సి ఉంది. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గత 24గంటల్లో హన్మకొండలో సాధారణం కంటే 5డిగ్రీలు అధికంగా 37డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రామగుండంలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల తేడా ఉంది. నిజామాబాద్‌లో 5డిగ్రీలు అధికంగా 22 డిగ్రీలు, రామగుండంలో 5 డిగ్రీల తేడాతో 23 డిగ్రీలకు చేరుకుంది. ఎల్‌నినో కారణంగా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. -
హడలెత్తిస్తున్న ఆన్లైన్ రేప్‌లు
లండన్: లండన్‌లో ఆన్లైన్ రేప్‌లు హడలెత్తిస్తున్నాయి. గత ఏడాదికన్నా ఈ ఏడాది వాటి సంఖ్య అమాంతం పెరిగినట్లు లండన్‌కు చెందిన నేషనల్ క్రైం ఎజెన్సీ (ఎన్సీఏ) తెలిపింది. వారు తెలిపిన ప్రకారం ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ల ద్వారా, యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులను కలిసేందుకు వెళ్లిన తర్వాత వారిపై లైంగిక దాడులు జరిగిన ఘటనలు ఎక్కువయ్యాయి. సాధరణంగా డేటింగ్ యాప్ ల ద్వారా అంతకుముందు ఒకరికొకరు తెలియని వారు కూడా పరిచయం అవుతారు. అలా పరిచయమైనవారిని కలిసేందుకు వెళుతుంటారు. ఇలా వెళ్లినప్పుడు వారిపై బలవంతంగా లైంగిక దాడులు ఎక్కువయ్యాయట. 2009లో ఇలాంటి ఘటనలు 33 జరుగగా 2014లో వీటి సంఖ్య 184కు అమాంతం పెరిగింది. ఇలాంటి ఘటనలకు బాధ్యులైనవారిలో 85శాతం మంది మహిళలు ఉండగా వారిలో 42శాతం మంది 20 నుంచి 29 ఏళ్ల లోపువారు, 24శాతంమంది 40 నుంచి 49ఏళ్లలోపువారు ఉన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని తగిన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి చేయిదాటిపోతుందని ఎన్సీఏ ఆందోళన వ్యక్తం చేసింది. -
అంతరిక్ష వ్యర్థాలతో దేశాల మధ్య యుద్ధం!
మాస్కో: అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలు(స్పేస్ జంక్)తో కొత్త ప్రమాదాలు ముంచుకొస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలకు సైతం దారితీయొచ్చని మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలి కాలంలో అమెరికా, రష్యా స్పేస్ ఏజెన్సీలు గుర్తించినటువంటి అంతరిక్ష వ్యర్థాలలో 10 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్నటువంటి శిథిలాలను సైతం వేల సంఖ్యలో గమనించారు. వివిధ దేశాలు పంపినటువంటి శాటిలైట్లను ఇవి ఢీ కొన్నప్పుడు వాటికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఒకవేళ ఏదైనా దేశం పంపిన ముఖ్యమైన మిలిటరీ శాటిలైట్ ఈ అంతరిక్ష వ్యర్థాల ద్వారా ధ్వంసమైతే.. ప్రత్యర్థి దేశాల వారు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భావించే అవకాశం ఉందని, ఇది దేశాల మధ్య యుద్ధాలకు సైతం కారణం కాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గతంలో.. చైనా తమ దేశానికి చెందిన కాలం చెల్లిన ఓ వాతావరణ శాటిలైట్‌ను 2007లో ధ్వంసం చేసింది. దీని ద్వారా మూడు వేలకు పైగా శిథిలాలు అంతరిక్షంలో మిగిలిపోయాయి. 2013లో రష్యాకు చెందిన బ్లిట్స్ శాటిలైట్ అంతరిక్ష వ్యర్థాలు ఢీ కొనడం ద్వారా ధ్వంసమైంది. అయితే చైనా శాటిలైట్ ధ్వంసంలో ఏర్పడిన శిథిలాలే తమ శాటిలైట్ ధ్వంసానికి కారణమని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలోని భూ కక్ష్యలో పెరిగిపోతున్న శిథిలాలు దేశాల మధ్య చిచ్చురేపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. -
రేప్ కేసులకు నిలయంగా రాజధాని!
ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారతదేశ రాజధాని ఢిల్లీ... ఇప్పుడు హింసా కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైంది. అత్యాచారాలకు, మానభంగాలకు మారుపేరుగా నిలిచి మహిళకు రక్షణే కరువయ్యింది. దేశంలోని నాలుగు ప్రధాన నగరాలతో పోలిస్తే ఢిల్లీలో గత మూడేళ్ళుగా అత్యాచారాలు, లైంగిక హింసల కేసుల నమోదు ఎక్కువైనట్లు తాజా లెక్కలు చెప్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 25 శాతం రేప్ కేసులు పెరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అదే విధంగా వీధి నేరాలు, దొంగతనాలు, వేధింపుల కేసులు కూడా పెరగడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మహిళలపై నేరాల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నట్లు ఏకంగా పోలీసు వర్గాలే చెప్తున్నాయి. అంతేకాక సుమారు ప్రతి వెయ్యి నిమిషాలకు ఓ మహిళ అత్యాచారానికి గురౌతున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో తాజా సర్వేలో తేలింది. ఢిల్లీ శివారు ప్రాంతాలు మినహా జరిపిన సర్వేలో ఈ పచ్చి నిజాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఉచిత ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట్రేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడ ఈ పెరుగుదల కనిపిస్తోందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి. ఎస్. బాసీ చెప్తున్నారు. 2014 నవంబర్ వరకూ నమోదైన 1,39,799 కేసులతో పోలిస్తే... 2015 నవంబర్ 30 నాటికి 1,74,423 కేసులు దాఖలైనట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా దేశ రాజధానిలో మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసులు 25 శాతం అధికంగా నమోదయ్యాయి. 2014 లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వేధింపులపై సుమారు 4000 ఫిర్యాదులు అందగా... ఆ సంఖ్య 2015 నాటికి 5.027 కు పెరిగింది. అలాగే 2014లో రాజధానిలో అత్యాచార కేసులు సుమారు 1,997 నమోదవ్వగా అది 2015 నాటికి 2,005 కు చేరింది. నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగిన 2012 నాటికి ఢిల్లీలో అత్యాచార కేసులు 706 కాగా.. నేడు అవి వేలల్లోకి చేరాయి. రాజధాని ఢిల్లీలో వీధి నేరాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ల వంటివి కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 2014 తో పోలిస్తే ఢిల్లీ రోడ్లు అభద్రతకు నిలయాలుగా మారినట్లు తాజా నివేదికలు తేల్చి చెప్తున్నాయి. దీనికి తోడు రాబరీలు ఇరవై శాతం, చైన్ స్నాచింగ్ లు 30 శాతం పెరిగాయి. అయితే ఒకప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నా... ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులూ లేవని, ఫ్రీ రిజిస్టేషన్ అమల్లో ఉందని ఢిల్లీ కమిషనర్ బి ఎస్ బాసీ చెప్తున్నారు. అంతేకాక వాహన చోరీల వంటి కేసులను ఆన్ లైన్ ద్వారా కూడ రిజిస్టర్ చేసే అవకాశం కల్పించినట్లు జాయింట్ కమిషనర్ ర్యాంక్ అధికారి చెప్తున్నారు. అయితే ఢిల్లీ ప్రజల రక్షణ కోసం ఎన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసినా క్రైం రేటు పెరుగుతుండటం ఢిల్లీ పోలీసులకు సవాల్ గా మారుతోంది. 2014 లో 5,873 గా ఉన్న చైన్ స్నాచింగ్, వాహన చోరీల కేసులు 2015 లో 6,969 కి పెరిగాయి. దోపిడీలు, దొంగతనాలు, వేధింపుల కేసులు 2014 నుంచి 2015 నాటికి 15 నుంచి 30 శాతం పెరిగిపోయాయి. రాబోయే రోజుల్లో పెండింగ్ కేసుల వ్యవహారం కూడా పెద్ద సమస్యగా మారనుందని పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఘాటెక్కిన ఉల్లి ధరలు
గుమ్మఘట్ట (అనంతపురం) : వంటింటి నిత్యవసర సరుకైన ఉల్లి ధర అమాంతం పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే కిలోకి రూ.10 పెరగడంతో ప్రస్తుతం మారెట్లో కిలో ఉల్లి ధర రూ. 35 నుంచి రూ.40 పలుకుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఉల్లి ధరల ఘాటు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కిలో కొనాలనుకున్నవారు అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. జూన్ చివరిదాక రూ.16 పలికిన ఉల్లి ధర, జూలై మొదట్లో రూ. 20కి పెరిగింది. నెల ఆఖరిలోపు ఏకంగా మూడు సార్లు పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో ఎర్ర ఉల్లి కిలో రూ. 35 నుండి రూ. 40 , తెల్లగా ఉన్న ఉల్లి గడ్డలు రూ. 25 నుండి రూ. 30 వరకు ధరలు పలుకుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి పంటలో ఆశించిన స్థాయిలో దిగుబడులు చేతికందక పోవడంతోనే ధరలు భగ్గుమంటున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుండి ఉల్లి దిగుమతులు కూడా పూర్తిగా తగ్గిపోవడంతో ఆశించిన స్థాయిలో మార్కెట్‌కు రవాణా కావడం లేదని ఉల్లి వ్యాపారులు చెపుతున్నారు. హోటళ్ల యజమానులు ఉల్లి కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక దాబాల్లో కూడా ఉల్లికి బదులు ఎక్కువగా కీర దోసతోనే సరిపెడుతున్నారు. ఉల్లి లేని కూరలు తినడానికి పెద్దగా రుచి ఉండకపోవడంతో సామాన్యులు కొనలేక తిప్పలు పడుతున్నారు. -
నిత్యావసరం.. నిత్య సమరం!
-
నదిగళ్ ననైవదిల్లైకు ప్రశంసలు
నదిగళ్ ననైవదిల్లై చిత్రం సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. నాంజిల్ పీసీ అన్భళగన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ప్రణవ్, మోనిక, రిషే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. కాగా చిత్రాన్ని సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. సీనియర్ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్, గాయకుడు ఏసుదాస్ తదితర ప్రముఖులు నదిగళ్ ననైవదిల్లై చిత్రం చాలా బాగుందంటూ ప్రశంశల వర్షం కురిపించారు. చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, పాటలు, సంగీతం అభినందించతగ్గవిగా ఉన్నాయని ఏసుదాస్ వ్యాఖ్యానించారు. ఎస్పీ ముత్తురామన్ మాట్లాడుతూ నదిగళ్ ననైవదిళ్లై మంచి కథా బలం వున్న చిత్రం అని ప్రశంసించారు. ఈ తరం యువత ప్రేమను చక్కగా చెప్పారన్నారు. చిత్రంలో మదురై ముత్తు హాస్యం పండిందన్నారు. పలువురు ప్రముఖులు మంచి చిత్రం అంటూ నదిగళ్ ననైవదిళ్లై చిత్ర యూనిట్‌ను అభినందించారు. -
తూళ్లూరులో అన్నీ సింగపూర్ రేట్లే!
-
మీ ఐడియా నచ్చితే రూ.ఆరుకోట్లు మీకే..
వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. మహీంద్రా సంస్థ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. యువతలో దాగి ఉన్న అద్భుతమైన ఆలోచనల్ని వెలికి తీసేందుకు ‘రైజ్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద సాంకేతిక పోటీని నిర్వహిస్తోంది. అక్షరాలా ఆరు కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ ఇస్తోంది. మరి అందుకోవడానికి మీరు సిద్ధమా..! ముఖ్య ఉద్దేశం: అమెరికాలో ఏటా వందల కొద్దీ ఇంజినీరింగ్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అందులో 33 శాతం సంస్థల్లో సహ వ్యవస్థాపకులు భారతీయులే. ఆ ఎన్నారైలంతా మన దేశంలోనే పనిచేస్తే అతి తక్కువ కాలంలోనే భారత్ అగ్రదేశంగా మారుతుందనేది నిపుణుల మాట. ‘మేడిన్ ఇండియా’ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకూ ‘రైజ్’ పోటీని నిర్వహిస్తోంది మహీంద్రా సంస్థ. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి, సృజనాత్మకతను జోడించి సమస్యలకు పరిష్కారం చూపించడమే దీని ముఖ్య ఉద్దేశం. దరఖాస్తుల స్వీకరణ మొదలైంది అభివృద్ధితో పాటు కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. మన దేశంలో విద్యుత్తు, ట్రాఫిక్ సమస్యలూ అలాంటివే. అందుకే ఈ రెండు రంగాలనే ఈ ఏడాది పోటీకీ ప్రధాన అంశాలుగా ఎంచుకున్నారు. దేశంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ‘డ్రైవర్ లెస్ కార్లు’ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనేందుకూ, వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు సోలార్ విద్యుత్తును చేరువ చేసేందుకు అనువైన పద్ధతులను కనిపెట్టేందుకు యువతకు స్వాగతం పలికారు. అప్లికేషన్ల స్వీకరణ ఇలా.. మీ దగ్గర దేశ భవిష్యత్తును మార్చేయగల ఆలోచనలున్నాయా..! అయితే http://www.sparktherise.com/లోకి ప్రవేశించి మీ దరఖాస్తును వెంటనే పంపించండి. ఎంపికైన వారికి ప్రతి దశలోనూ సాయం అందుతుంది. ప్రాజెక్ట్ ఒక్కో దశనూ దాటే కొద్దీ ప్రతి జట్టుకూ అవసరమైన గ్రాంటు అందుతుంది. ఆల్ ది బెస్ట్ -
భారీగా పెరిగిన సిమెంట్ ధరలు
-
కూరగాయలు కొనలేం!