ముంబై: భారత్ ఫారెక్స్ నిల్వలు ఏప్రిల్ 14వ తేదీతో ముగిసిన వారంలో 1.657 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీనితో ఈ నిల్వల పరిమాణం మొత్తం 586.412 బిలియన్ డాలర్లకు చేరింది. అంతక్రితం వారమూ (ఏప్రిల్ 7తో ముగిసిన) విదేశీ మారక నిల్వలు భారీగా 6.306 బిలియన్ డాలర్లు ఎగశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనానికి ఊరట.. ఆ విషయాల్లో ఉపశమనం కల్పించిన ఆర్‌బీఐ
2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా చూసే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ భారీగా డాలర్లు వ్యయం చేయడంతో గరిష్ట స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లుకుపైగా పడిపోయాయి.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
Comments
Please login to add a commentAdd a comment