ముంబై: ఆటుపోట్ల మధ్య వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 123 పాయింట్ల వృద్ధితో 62,969కు చేరింది. నిఫ్టీ 35 పాయింట్లు బలపడి 18,634 వద్ద ముగిసింది. అమెరికా రుణ పరిమితి పెంపు డీల్ ఓకే కావడంతో ఇన్వెస్టర్లకు జోష్ వచ్చినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,195 పాయింట్లు జమ చేసుకోగా.. నిఫ్టీ 348 పాయింట్లు పురోగమించింది.
అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్ 63,036 వద్ద గరిష్టాన్ని, 62,737 వద్ద కనిష్టాన్ని తాకింది. దీంతో వరుసగా రెండో రోజు 63,000 స్థాయిని అధిగమించింది. ఇక నిఫ్టీ 18,622– 18,576 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఎన్‌ఎస్‌ఈలో మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.6 శాతం చొప్పున పుంజుకోగా.. ప్రధానంగా మెటల్ ఇండెక్స్ 1 శాతం క్షీణించింది. బ్యాంక్ నిఫ్టీ ఏడాది గరిష్టానికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment