సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధర మంటలు వినియోగదారులను వణికిస్తున్నాయి. వరుసగా ఏడో రోజు కూడా ధరలను ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో సోమవారం (ఫిబ్రవరి 15) దేశ వ్యాప్తంగా వరుసగా ఏడవ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర 23-26 పైసలు, డీజిల్‌పై 28 నుంచి 30 పైసల మేర ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88.73కు పెరగ్గా డీజిల్ లీటరుకు రూ .79.35 (29 పైసల పెరుగుదల)కు చేరుకుంది. గత ఏడు రోజుల్లో, పెట్రోల్ ధర లీటరుకు 2.06 రూపాయలు పెరగగా, డీజిల్ రేటు లీటరుకు 2.56 రూపాయలు పెరిగింది.
పలు నగరాల్లో పెట్రోలు ,డీజిల్ ధరలు లీటరుకు
ముంబై పెట్రోల్ రూ .95.46, డీజిల్ రూ .86.34
కోల్‌కతాలో పెట్రోల్ రూ. 90.25, డీజిల్ రూ .82.94
చెన్నైలో పెట్రోల్ రూ. 91.19, డీజిల్ రూ .84.44
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 92.53, డీజిల్ రూ.86.55
అమరావతిలో పెట్రోల్ రూ. 95.13, డీజిల్ రూ. 88.63
Comments
Please login to add a commentAdd a comment