
సాక్షి, ముంబై : పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా తొమ్మిదవ రోజు ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 17) కూడా ఇంధన ధరలు పరుగందుకున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు మరో 25 పైసల మేర ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతూ వాహనదారుల గుండెల్లో బాంబులు పేల్చుతున్నాయి . దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు
హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.93.10 డీజిల్ ధర రూ.87.20
అమరావతి పెట్రోలు ధర రూ. 95.69 డీజిల్ ధర రూ. 98.52
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 89.54, డీజిల్ ధర రూ. 79.95
కొలకత్తాలో పెట్రోల్ ధర రూ. 90.78, డీజిల్ ధర రూ.83.54
ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.00, డీజిల్ ధర రూ. 86.98
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 91.68, డీజిల్ ధర రూ.85.01
బెంగుళూరులో పెట్రోల్ ధర రూ. 92.54, డీజిల్ ధర రూ. 84.75
Comments
Please login to add a commentAdd a comment