వందేళ్ల లో ఫస్ట్ టైమ్
కాలిఫోర్నియా: ప్రపంచ వ్యాప్తంగా గడిచిన వందేళ్ల లో మొదటిసారిగా పులుల సంఖ్య పెరిగినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తన్నాయి. పులుల అక్రమ రవాణాను అడ్డుకుని, సంరక్షణ చర్యలు చేపడుతున్నందు వల్లే పులుల సంఖ్యలో ఈపెరుగుదల నమోదైనట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య 3,890 ఉన్నట్టు ప్రకటించింది.
2010లో 3,200గా ఉన్న పులుల సంఖ్య నమోదైంది. అంటే దాదాపు 700 పులుల సంఖ్య పెరిగినట్టు ఐయూసీఎన్ తెలిపింది. ఆసియా మొత్తంలో ఉన్న పులులను వీరు లెక్కించారు. భారతదేశంలో 2,226, రష్యా, సైబీరియా-433, 371, ఇండోనేషియా-371, మలేషియా-250, నేపాల్-198, థాయిలాండ్-189, బంగ్లాదేశ్-106, భూటాన్-103, చైనా-7, వియత్నాం-5, లావోస్-2, కంబోడియా-1, మయన్మార్ లో పులుల సంఖ్య శూన్యం. వరల్డ్ వైడ్ ఫండ్ (డబ్యూడబ్యూఎఫ్) మేసేజర్ డారెన్ గ్రోవర్ 20వ శతాబ్దంలో పులుల సంఖ్య పెరగడం ఇదే మొదటి సారని సంతోషం వ్యక్తం చేశారు. పులుల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2022 నాటికి పులుల సంఖ్య 6400 కు చేరుకుంటుందని గ్రోవర్ తెలిపారు.
పులి పాధాన్యత ఏంటి?
పులి ప్రపంచ వ్యాప్తంగా అధిక గుర్తింపు కలిగిన జంతువు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పులికి విపరీతమైన ప్రాధాన్యత ఉంది. అడవిలో ఉండే జంతువుల ఆహార చైన్ సిస్టంలో పులి అగ్రస్థానంలో ఉంటుంది. అంటే అడవిలో పులి ఉంటే అక్కడ అన్ని జంతువులు సమృద్ధిగా ఉంటాయి. అందుకోసం పులుల సంరక్షణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి.