టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొంతమంది.. ఇతరుల ఆధార్ కార్డు నెంబర్‌ను కొన్ని అనధికార కార్యకలాపాలకు వినియోగిస్తారు. అసలు ఆ వ్యక్తికే తెలియకుండా ఈ చర్య జరిగిపోతుంది. కాబట్టి మన ఆధార్ కార్డు నెంబర్ సురక్షితంగా ఉండాలంటే.. మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? దీనిని ఎక్కడ, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆధార్ కార్డు దుర్వినియోగానికి చరమగీతం పాడటానికి కేంద్రం ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డును తీసుకువచ్చింది. ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేని.. లేదా ఈకేవైసీ మాత్రమే ఇవ్వాల్సిన చోట మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ తరహా ఆధార్ కార్డులో కేవలం చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి.
మాస్క్‌డ్ ఆధార్ కార్డు
సాధారణ ఆధార్ కార్డులో 12 అంకెలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ మాస్క్‌డ్ ఆధార్ కార్డులో కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ముందు ఉన్న ఎనిమిది అంకెలకు మాస్క్ ఉంటుంది. అంటే.. ఆ ఎనిమిది నెంబర్లు కనిపించవన్నమాట. దీనిని ఉపయోగించడం వల్ల ఇతరులు మీ ఆధార్ నెంబర్‌ను దుర్వినియోగం చేయడానికి అవకాశం లేదు.
మాస్క్‌డ్ ఆధార్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
•మాస్క్‌డ్ ఆధార్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా అధికారిక UIDAI వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
•వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి.
•తరువాత 12 ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, దాని కింద ప్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
•ఆలా చేసిన తరువాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి అక్కడ మాస్క్‌డ్ ఆధార్ కావాలా? అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
•ఆలా చేసిన తరువాత మీకు మాస్క్‌డ్ ఆధార్ కార్డు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. దీనిని పాస్‌వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరిక
పాస్‌వర్డ్ ఏమిటంటే
•మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ అయిన తరువాత పాస్‌వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేసుకోవాలి.
•పాస్‌వర్డ్ ఏమిటంటే.. ఉదాహరణకు మీ పేరు RAGHURAMARAJU అనుకుందాం. మీరు పుట్టిన సంవత్సరం 1994 అనుకుంటే..
•మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన సంవత్సరం కలిపితే అదే పాస్‌వర్డ్ (RAGH1994) అవుతుంది. దీనిని ఉపయోగించి మాస్క్‌డ్ ఓపెన్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment