Masked Aadhaar
-
మాస్క్డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా?: ఇది చాలా సేఫ్..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొంతమంది.. ఇతరుల ఆధార్ కార్డు నెంబర్‌ను కొన్ని అనధికార కార్యకలాపాలకు వినియోగిస్తారు. అసలు ఆ వ్యక్తికే తెలియకుండా ఈ చర్య జరిగిపోతుంది. కాబట్టి మన ఆధార్ కార్డు నెంబర్ సురక్షితంగా ఉండాలంటే.. మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? దీనిని ఎక్కడ, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఆధార్ కార్డు దుర్వినియోగానికి చరమగీతం పాడటానికి కేంద్రం ఈ మాస్క్డ్ ఆధార్ కార్డును తీసుకువచ్చింది. ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేని.. లేదా ఈకేవైసీ మాత్రమే ఇవ్వాల్సిన చోట మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ తరహా ఆధార్ కార్డులో కేవలం చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. మాస్క్డ్ ఆధార్ కార్డుసాధారణ ఆధార్ కార్డులో 12 అంకెలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ మాస్క్డ్ ఆధార్ కార్డులో కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ముందు ఉన్న ఎనిమిది అంకెలకు మాస్క్ ఉంటుంది. అంటే.. ఆ ఎనిమిది నెంబర్లు కనిపించవన్నమాట. దీనిని ఉపయోగించడం వల్ల ఇతరులు మీ ఆధార్ నెంబర్‌ను దుర్వినియోగం చేయడానికి అవకాశం లేదు.మాస్క్డ్ ఆధార్‌ని డౌన్లోడ్ చేయడం ఎలా?•మాస్క్డ్ ఆధార్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా అధికారిక UIDAI వెబ్సైట్ ఓపెన్ చేయాలి.•వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి.•తరువాత 12 ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, దాని కింద ప్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.•ఆలా చేసిన తరువాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి అక్కడ మాస్క్డ్ ఆధార్ కావాలా? అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.•ఆలా చేసిన తరువాత మీకు మాస్క్డ్ ఆధార్ కార్డు పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. దీనిని పాస్వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరికపాస్వర్డ్ ఏమిటంటే•మాస్క్డ్ ఆధార్ డౌన్లోడ్ అయిన తరువాత పాస్వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేసుకోవాలి.•పాస్వర్డ్ ఏమిటంటే.. ఉదాహరణకు మీ పేరు RAGHURAMARAJU అనుకుందాం. మీరు పుట్టిన సంవత్సరం 1994 అనుకుంటే..•మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన సంవత్సరం కలిపితే అదే పాస్వర్డ్ (RAGH1994) అవుతుంది. దీనిని ఉపయోగించి మాస్క్డ్ ఓపెన్ చేసుకోవచ్చు. -
Masked Aadhaar Card: ఆధార్ కార్డు వాడకంపై కేంద్రం కీలక సూచన
దేశంలో ప్రతీ పనికి ఆధార్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డు నుంచి బ్యాంక్ ఖాతాల వరకు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ఈ నేపథ్యంలో ఆధార్ వాడకంపై కేంద్రం.. దేశ పౌరులకు కీలక సూచన చేసింది. ప్రతీ విషయంలోనూ ఆధార్‌ను వాడుతున్న నేపథ్యంలో.. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్డ్ కాపీ’లను మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఇలా చేయాలని కేంద్రం కోరింది. ముందు జాగ్రత్త కోసమే ఇలా సూచన చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అందుకే ఎవరికైనా ఫొటోకాపీకి బదులుగా మాస్క్డ్ కాపీలను మాత్రమే చూపించాలని స్పష్టం చేసింది. మాస్క్డ్ ఆధార్ కాపీ అంటే.. భారత పౌరుల సౌకర్యార్థం యుఐడిఏఐ(UIDAI) ఆన్లైన్లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, లింగం ఇటువంటి మార్పులు చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనినే మాస్క్ ఆధార్ కార్డ్ అని చెబుతున్నారు. ఈ కార్డుపై 12 అంకెల ఆధార్ నంబర్ పూర్తిగా కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆధార్‌లో మొదటి ఎనిమిది అంకెలు ****-**** గా కనిపిస్తాయి. దీంతో, మాస్క్డ్ ఆధార్ కార్డు.. ఒరిజినల్ కార్డును సురక్షితంగా ఉంచుతుంది. మాస్క్డ్ ఆధార్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. 1. https://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి, 'డౌన్లోడ్ ఆధార్' ఎంపికపై క్లిక్ చేయండి. 2. మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. 3. మాస్క్డ్ ఆధార్ కావాలి.. అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 4. ధృవీకరణ కోసం అందించబడే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. 5. ‘Send OTP’పై క్లిక్ చేయండి. 6. ఇ-ఆధార్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత PDF కాపీని డౌన్లోడ్ చేసుకోండి. 7. ఆధార్ PDF పాస్వర్డ్ 8 అక్షరాలలో ఉంటుంది.(మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (ఆధార్‌లో ఉన్నట్లు) క్యాపిటల్ అక్షరాలు, YYYY ఆకృతిలో పుట్టిన సంవత్సరంతో ఎంటర్ చేయాలి.) In order to prevent misuse, the central government has asked citizens to share only masked versions of their #Aadhaar cards. Unlicensed private entities are like hotels etc are not allowed to collect or keep copies of Aadhaar card, as par the Ministry of Electronics & IT. pic.twitter.com/QQIvI4y3wi — NIRUPAM ACHARJEE 🇮🇳 (@NirupamAcharjee) May 29, 2022